‘పూరీపై దాడి చేసినవారిని అరెస్టు చేయాలి' | puri jagannadh fans association files complaint against attackers | Sakshi
Sakshi News home page

‘పూరీపై దాడి చేసినవారిని అరెస్టు చేయాలి'

Published Mon, Apr 18 2016 2:28 PM | Last Updated on Sun, Sep 3 2017 10:11 PM

puri jagannadh fans association files complaint against attackers

హైదరాబాద్: సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం తెలుగు రాష్ట్రాల పూరీ ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున కొందరు ఫిర్యాదు చేశారు. జగన్నాథ్‌ పై మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే తాము కూడా ప్రతీకార దాడులు చేయాల్సి వస్తుందంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్లలో టికెట్ కౌంటింగ్‌ను కంప్యూటరైజ్ చేయాలని అందులో కోరారు. కొన్ని సినిమా థియేటర్లలో మల్టీప్లెక్స్ టికెట్ల అమ్మకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని, ఇటువంటి వాటికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ త్వరలో సీఎం కేసీఆర్‌ను కలిసి కోరనున్నట్లు వెల్లడించారు.

కాగా దర్శకుడు పూరి జగన్నాథ్ పై తాము దాడి చేయలేదని తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్లు స్పష్టం చేశారు. తమపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. తెలుగు సినిమా డిస్ట్రిబ్యూషన్ ప్రతినిధులు సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement