పూరి జగన్నాథ్ పై డిస్ట్రిబ్యూటర్ల ఫైర్ | Puri Jagannadh's alleged attack by distributors, true or false? | Sakshi
Sakshi News home page

పూరి జగన్నాథ్ పై డిస్ట్రిబ్యూటర్ల ఫైర్

Published Mon, Apr 18 2016 12:07 PM | Last Updated on Sun, Sep 3 2017 10:11 PM

పూరి జగన్నాథ్ పై డిస్ట్రిబ్యూటర్ల ఫైర్

పూరి జగన్నాథ్ పై డిస్ట్రిబ్యూటర్ల ఫైర్

హైదరాబాద్: దర్శకుడు పూరి జగన్నాథ్ పై తాము దాడి చేయలేదని తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్లు స్పష్టం చేశారు. తమపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. తెలుగు సినిమా డిస్ట్రిబ్యూషన్ ప్రతినిధులు సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పూరి జగన్నాథ్ పై తాము ఎటువంటి వేధింపులకు పాల్పడలేదని అన్నారు. 'లోఫర్' సినిమా ఫ్లాప్ కావడంతో తమ డబ్బులు తిరిగివ్వాలని నిర్మాత చిల్లర కల్యాణ్ ను అడిగామని తెలిపారు. పూరి జగన్నాథ్ ఇంటికి వెళ్లలేదు, ఆయనతో మాట్లాడలేదని స్పష్టం చేశారు.

తమపై ఆరు సెక్షన్ల కింద ఏకపక్షంగా కేసులు నమోదు చేయడాన్ని వారు బట్టారు. పూరి జగన్నాథ్ పై దాడి చేశారని చెబుతున్న డిస్ట్రిబ్యూటర్లు అభిషేక్, సుధీర్, ముత్యాల రాందాస్ ఆ రోజున హైదరాబాద్ లోనే లేరని వెల్లడించారు. ఇంత ఏకపక్షంగా కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. నిజానిజాలు దర్యాప్తులో వెల్లడవుతాయన్నారు.

సినిమా విజయవంతమయితే లాభాల్లో 20 శాతమే తమకు ఇస్తారని చెప్పారు. సినిమా ఫ్లాప్ అయినప్పుడు కనీసం 20 శాతం డబ్బులు వెనక్కు ఇవ్వాలని వేడుకుంటున్నామన్నారు. రజనీకాంత్, సూర్య, మహేశ్ బాబు తమ సినిమాలు ఫ్లాప్ అయినప్పడు డబ్బులు వెనక్కు తిరిగిచ్చేసిన విషయాలను వారు గుర్తు చేశారు.

'అఖిల్' విడుదలైన రెండో రోజే దర్శకుడు వివి వినాయక్ తమకు ఫోన్ చేసి 'మీ వెనుక నేనున్నాను' అంటూ భరోసా యిచ్చారని వెల్లడించారు. తాము కూడా సినిమా పరిశ్రమలో భాగమేనని, తమను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. అభిషేక్, సుధీర్, ముత్యాల రాందాస్ లతో పాటు సుధాకర్ రెడ్డి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement