
ఈ మధ్య కొంతమంది ప్రేమ జంటలు రెచ్చిపోతున్నారు. పబ్లిక్‌గానే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. చుట్టూ ఎవరున్నారనేది కూడా గమనించకుండా.. న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అదేదో ఫ్యాషన్, ట్రెండ్ అన్నట్లుగా అసభ్యకర చేష్టలతో వార్తల్లోకెక్కుతున్నారు. ఇటీవల కాలంలోఇలాంటి ఘటనలు జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, చత్తీస్‌గఢ్ వంటి చోట్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
తాజాగా అలాంటి ఘటనే రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. అజ్మీర్‌లో నడిరోడ్డుపై ఓ ప్రేమ జంట బైక్ మీద విచ్చలవిడి చేష్టలతో కనిపించారు. రీజనల్ కాలేజ్ క్రాస్ రోడ్స్ – నౌసర్ వ్యాలీ రహదారిపై స్పీడ్‌గా వెళ్తున్న బైక్ మీద ఇద్దరు ప్రేమికులు రొమాన్స్ చేస్తూ కెమెరాకు చిక్కారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకోగా.. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు దీన్ని వీడియో తీశారు.
ఇందులో ఓ యువకుడు ఫ్యూయల్ ట్యాంక్‌పై అమ్మాయిని ఎదురుగా కూర్చోబెట్టుకుని బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. అంతా చూస్తుండగానే యువతి యువకుడిని కౌగిలించుకుకోవడం, ముద్దు పెట్టడం కనిపిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. సదరు జంటపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ పోలీసులను ట్యాగ్ చేశారు.
దీనిపై స్పందించిన అజ్మీర్ పోలీసులు.. వీడియో ఆధారంగా బైక్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రైడర్ ఫై సాగర్ రోడ్‌కు చెందిన సాహిల్‌గా గుర్తించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన్నట్లు పేర్కొన్నారు.
చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్‌జెండర్ జంట.. బేబీ ఫొటో వైరల్..
Comments
Please login to add a commentAdd a comment