క్రికెట్ ప్రంచకప్ ఫైనల్‌లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని అహ్మాదాబాద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ని ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా హాజరై ప్రత్యక్షంగా వీక్షించారు కూడా. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మోదీ రావడం వల్లే భారత్ మ్యాచ్ ఓడిపోయిందన్నట్లుగా మాట్లాడారు. ఈ మేరకు రాహుల్ గాంధీ మంగళవారం రాజస్తాన్‌లో జరిగిన ప్రచార ర్యాలీ మోదీని 'దురదృష్టం'తో పోలుస్తే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని అంటే "పనౌటీ మోదీ" అని అన్నారంటూ దూమారం రేగింది.
అంతేగాదు ఆ బహిరంగ ర్యాలీలో మోదీని అదాని పారశ్రామికవేత్తగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పనౌటి అనే పదం సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్‌గా అవుతోంది. ఐతే ఈ పనైటి పదానిక అర్థం.. ఏవ్యక్తి మన వద్దకు వస్తే అవ్వాల్సిన పనులు ఆగిపోవడం లేదా జరగకపోవడం వంటివి జరిగినప్పుడూ ప్రయోగిస్తారు. అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తిపై "పనౌటి" అనే పదాన్ని ప్రయోగించడంతో రాహుల్‌పై తీవ్ర స్థాయిలో మండిపడింది బీజేపి. పైగా రాహుల్ ఆ ప్రచార ర్యాలీలో మోదీ ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి హిందూ-ముస్లీం అని జపిస్తుంటారు. ఆయన మిలినియర్ల రుణాలను మాఫీ చేసి మంచి ప్రయోజనాలు అందిస్తుంటారని విమర్శలు గుప్పించారు.
पनौती 😉 pic.twitter.com/kVTgt0ZCTs
— Congress (@INCIndia) November 21, 2023
దీంతో ఒక్కసారిగా రాహుల్‌పై బీజేపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తి చేసింది. ఈ మేరకు బీజేపీ లోక్‌సభ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ..రాహుల్‌గాంధీ ప్రధానిని ఉద్దేశించి ఇలాంటి పదాన్ని ఎలా ప్రయోగించగలిగారంటూ నిలదీశారు. తక్షణమే క్షమాపణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి మీనాకాశి లేఖి కూడా రియాక్ట్ అయ్యారు. ఒక ప్రధానిపై అలాంటి పదాన్ని ఉపయోగించగలిగారంటే.. రాహుల్ ఎలాంటి వ్యక్తి అనేది స్పష్టంగా తెలుస్తోందన్నారు.
VIDEO | "If Rahul Gandhi has used a word like 'panauti', then it reflects what kind of person he is. Using such words for PM, who is working continuously for the country, is not acceptable and the entire country is watching this," says Union MoS @M_Lekhi on Rahul Gandhi's remark… pic.twitter.com/SfI8ASwtrt
— Press Trust of India (@PTI_News) November 21, 2023
ఇలాంటి పదాలు ఎంత మాత్రం ఆమోదయోగ్యమైనవి కావు. యావత్తు దేశం మిమ్మల్ని చూస్తోంది. నిరంతరం దేశం కోసం పనిచేసే ఓ వ్యక్తిపై ఇలా నిందలు వేయడం సబబు కాదని హితవు పలికారు. అలాగే లోక్‌సభ ఎంపీ రవి శకంర్ ప్రసాద్ కూడా రాహుల్ మీకు ఏమైంది? ఆ రోజు క్రీడాకారులను కలిసి వారిలో స్థైర్యాన్ని పెంచే యత్నం చేసిన అలాంటి వ్యక్తిపై ఇలాంటి పదాన్ని ప్రయోగిస్తారా? అంటూ తిట్టిపోశారు. మీరు చరిత్ర నుంచి నేర్చుకోవాల్సి చాలా ఉందని రాహుల్‌కి చురకలంటించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.
(చదవండి: ఆరోపణల స్ట్రాటజీ వర్సెస్ గ్యారంటీల గేమ్? రాష్ట్ర ఎన్నికల చరిత్ర చెబుతోంది ఇదే!
Comments
Please login to add a commentAdd a comment