Assembly electiions
-
నేను పిలిస్తే.. ఆయన పారిపోయారు : ఆధిత్య ఠాక్రేపై దేవ్రా సెటైర్లు
ముంబై: నేను పిలిస్తే ఆయన ఎందుకు పారిపోతున్నారో నాకు అర్ధం కావడం లేదంటూ శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రేపై ఎంపీ మిలింద్ దేవ్రా సెటైర్లు వేశారు.వచ్చే వారంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయా పార్టీల అభ్యర్థులు వారి ప్రత్యర్థుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేలా సవాళ్లు ,విమర్శలు, ప్రతి విమర్శలతో కాకరేపుతున్నారు.ఈ తరుణంలో శివసేన (యూబీటీ) వర్లీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిత్య ఠాక్రేపై పోటీ చేస్తున్న సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్లీ అభ్యర్థి మిలింద్ దేవ్రా సెటైర్లు వేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మిలింద్ దేవ్రా.. కొన్ని రోజుల క్రితం, వర్లీ భవిష్యత్తు, ముంబై భవిష్యత్తు, మహారాష్ట్ర భవిష్యత్తుపై చర్చకు రావాలని ఆదిత్య ఠాక్రేని ఆహ్వానించాను. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆధిత్య ఠాక్రే ప్రజాస్వామ్యాన్ని నమ్ముతానని, దానిని బలోపేతం చేస్తున్నానని ప్రచారం చేశారు. ఇప్పుడే అదే విషయంపై చర్చకు రమ్మనమని పిలిచా. కానీ, తాను ప్రజాస్వామ్యానికి అనుకూలమని ఆదిత్య ఠాక్రే పారిపోతున్నారు. అలా ఎందుకు పారిపోతున్నారో? అని విమర్శలు గుప్పించారు. ఓట్లకు శివసేన (యూబీటీ) డబ్బు పంచుతోందని దేవ్రా ఆరోపించారు. నిన్న, అతని ఆదిత్య ఠాక్రే పార్టీ డబ్బు పంపిణీ చేస్తుందని, ఇందుకోసం పెద్ద మొత్తంలో సీసీటీవీ పుటేజీలను అమర్చిందన్నారు. ఇదే విషయం ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే నాయకుడు ఆధిత్య ఠాక్రే’ అని దేవరా విమర్శలు గుప్పించారు. -
‘MVA’లో కొలిక్కి వచ్చిన సీట్ల పంచాయితీ .. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే!
ముంబై : మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిలో సీట్ల పంచాయితీ కొలిక్కి వచ్చింది. కూటమిలోని ఒక్కో పార్టీ 85 సీట్లలో పోటీ చేస్తున్నట్లు కుటమి నేతలు బుధవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు.మహరాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 20న జరగనున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన (ఉద్దవ్ ఠాక్రే వర్గం),నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌పవార్ వర్గం)లోని మహా వికాస్ అఘాడీ కూటమి పోటీ చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎంవీఏలోని ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంపై స్పష్టత లేదు. సీట్ల పంపకాల విషయంలో కూటమి పార్టీల నేతల మధ్య ఫలు దఫాలుగా జరిగిన చర్చాలు జరిగాయి. తాజాగా బుధవారం జరిగిన చర్చల అనంతరం మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో మహా వికాస్ అఘాడీ కూటమి 255 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు కూటమి నేతలు వెల్లడించారు. మిగిలిన 33 స్థానాలపై తర్వలో స్పష్టత ఇవ్వనున్నారు. బీజేపీ తొలి జాబితా విడుదల మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు గాను 99 మందితో బీజేపీ మొదటి జాబితా విడుదల చేసింది. వీరిలో 71 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించింది. ఇందులో ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన అశోక్ చవాన్ కుమార్తె శ్రీజయ చవాన్‌కు చోటు దక్కింది. ఇంకా డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులె, అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్, మంత్రులు గిరీశ్ మహాజన్, సుధీర్ ముంగంటివార్, చంద్రకాంత్ పాటిల్ వంటి ప్రముఖులు ఉన్నారు. జాబితాలో మొత్తం 13 మహిళల పేర్లున్నాయి. చించ్వాడ్, కల్యాణ్ ఈస్ట్, శ్రీగొండ స్థానాల్లో మాత్రం సిట్టింగ్‌లకు బదులు కొత్త వారికి అవకాశమిచ్చింది. ముంబైలోని పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేల్లో 14 మందిని మళ్లీ నామినేట్ చేసింది. సుమారు 150 సీట్లలో పోటీ చేసేందుకు మిత్రపక్షాలతో బీజేపీ మంతనాలు సాగిస్తోంది. -
నేను ఎందుకు అరెస్ట్ అయ్యానో మీకు తెలుసా?: కేజ్రీవాల్
ఢిల్లీ : మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. మేం అందిస్తున్న ప్రజా సంక్షేమాన్ని అడ్డుకునేందుకే తనని అరెస్ట్ చేయించిందని మండిపడ్డారు.వచ్చేడాది ప్రారంభంలో ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 'జన్ సంపర్క్' పేరిట కేజ్రీవాల్ తన ఎన్నికల ప్రచారాన్ని బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో తమ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమాన్ని అడ్డుకునేందుకు బీజేపీ పన్నిన రాజకీయ కుట్రలో భాగంగా తన అరెస్ట్ జరిగిందన్నారు. పనిలో పనిగా తన అరెస్ట్,ఐదునెలల జైలు జీవితంపై గురించి ప్రజల్లోకి వెళ్లేలా ఓ లేఖను సిద్ధం చేసినట్లు చెప్పారు. ‘నేను ఒక లేఖను సిద్ధం చేశాను. మా కార్యకర్తలు ఆ లేఖతో ఢిల్లీలో ప్రతి ఇంటికీ వెళతారు. నన్ను ఎందుకు అరెస్టు చేశారనేది ఈ లేఖ చెబుతుంది. కొందరు చెప్పినట్లు అవినీతి వల్ల కాదు, ఢిల్లీ ప్రజల కోసం మేము చేస్తున్న పనిని ఆపడానికి’ బీజేపీ చేసిన ప్రయత్నమేనని అన్నారు.ఆప్ కార్యకర్తలు ఈ లేఖతో ఢిల్లీ అంతటా ఇంటింటా ప్రచారం చేస్తారు. తన ఐదు నెలల జైలు జీవితం వెనుక అసలైన కారణాల్ని వివరించి వారికి లేఖను అందిస్తాం. మరోసారి ఆప్ కొనసాగేలా ఓటర్లను కోరనున్నట్లు తెలిపారు. ఈ ప్రచారం అక్టోబర్ 29 వరకు కొనసాగుతుందని చెప్పారు. ఢిల్లీలో గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ని విజయపథంలో నడిపించిన తాను ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని పునరుద్ఘాటించారు. ‘కేజ్రీవాల్ అవినీతి చేయలేరని అందరికీ తెలుసు. ఢిల్లీవాసుల కోసం ఉచిత విద్యుత్, ఉచిత నీరు, మొహల్లా క్లినిక్‌లు, నాణ్యమైన ప్రభుత్వ పాఠశాలల కోసం మేం చేస్తున్న అభివృద్ధిని ఆపాలని కోరుకున్నారు కాబట్టే అరెస్ట్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే, వారు చేసే మొదటి పని ఏంటో తెలుసా? మీకు అందించే ఉచిత విద్యుత్తును నిలిపివేయడం. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను నాశనం చేయడం, దీర్ఘకాలిక కరెంట్ కోతలతో మిమ్మల్ని ఇబ్బంది పెడతారు’ అంటూ ఢిల్లీ ప్రజలను ఉద్దేశిస్తూ కేజ్రీవాల్ ప్రసంగం చేశారు. -
ముఖ్యమంత్రిపై పోటీ.. 8 మంది రెబల్స్‌పై వేటు
న్యూఢిల్లీ: అక్టోబరు 5న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు హర్యానా బీజేపీ ఎనిమిది మంది రెబల్స్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీతో సహా ఇతర బీజేపీ నాయకులపై పోటీ చేసేందుకు రెబల్స్ ఇండిపెండెంట్లుగా నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో అధిష్టానం వారిని పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ జాబితాలో మాజీ మంత్రి రంజిత్ చౌతాలా సైతం ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి బంగపడ్డ చౌతాలా తన పదవికి రాజీనామా చేశారు. లాడ్వా నియోజక వర్గం నుంచి ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీపై పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేసిన సందీప్ గార్గ్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది.బహిష్కరణకు గురైన ఇతర ఆరుగురు నాయకులు అసంధ్ స్థానం నుండి పోటీ చేస్తున్న జిలే రామ్ శర్మ, సఫిడో నుండి మాజీ మంత్రి బచన్ సింగ్ ఆర్య, మెహమ్ నుండి రాధా అహ్లావత్, గుర్గావ్ నుండి నవీన్ గోయల్, హతిన్ నుండి కెహర్ సింగ్ రావత్, మాజీ ఎమ్మెల్యే దేవేంద్ర కద్యన్ ఉన్నారు.రంజిత్ చౌతాలా స్వతంత్ర ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన రానియా నుండి ఎన్నికల టిక్కెట్ నిరాకరించడంతో పార్టీ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని ఆశిస్తోంది. 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న ఎన్నికలు జరగనుండగా.. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు- మహారాష్ట్ర సీఎం
దాదర్: అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది నవంబరు మొదటి వారంలో జరిగే అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సారి ఎన్నికలు రెండు దశల్లో జరగొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. గణేశోత్సవాలు పురస్కరించుకుని శిందే అధికార నివాసమైన వర్షా బంగ్లాలో విలేకరులతో కొద్ది సేపు ముచ్చటించారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇదివరకే వెల్లడించాల్సి ఉంది. కానీ వరుసగా వస్తున్న ఉత్సవాలు, పర్వదినాల కారణంగా వాయిదా వేయాల్సి వస్తోందని అన్నారు. అయినప్పటికీ తుది నిర్ణయం ఎన్నికల సంఘమే తీసుకుంటుందని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమిలో ఎవరు ఎన్ని స్థానాలపై, ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంపై వారం, పది రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని సంకేతాలిచ్చారు. తమ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. ఈ పథకాలను రాష్ట్ర ప్రజలు ఆదరిస్తున్నారని శిందే ధీమా వ్యక్తం చేశారు. అయితే సీట్ల పంపకం విషయంలో విభేదాలు రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వచి్చన ఫలితాలను ప్రధాన అం«శంగా పరిగణించి మెరిట్, స్ట్రైక్ రేట్ బేసిక్‌పై సీట్ల పంపిణీ చేపడతామని శిందే స్పష్టం చేశారు. ప్రస్తుతం సీట్ల పంపకంపై ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయి. మిత్రపక్షాల్లో కొందరి ఎక్కువ సీట్లు, మరికొందరికి తుక్కువ సీట్లు లభించవచ్చని అన్నారు. ఏ పార్టీకి, ఎక్కడ గెలిచే సత్తా ఉందో ఆ పారీ్టకే అక్కడ స్థానాలు కేటాయిస్తామని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఫార్ములా వచ్చే వారం లేదా పది రోజుల్లో పూర్తవుతుందని ఆయన వెల్లడించారు. అభ్యర్థిత్వం ఇచ్చేముందు మూడు పారీ్టలకు ఎక్కడెక్కడ మంచి పట్టు ఉందో ఆయా పార్టీల అభ్యర్థులను ఎంపికచేసి బరిలోకి దింపుతామని పేర్కొన్నారు. అభ్యర్థిత్వం ఇచ్చే ముందు అధ్యయనం చేపడతామని తెలిపారు. తమది సామాన్య ప్రజల ప్రభుత్వం, మహిళల రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల తమ ప్రభుత్వానికి ప్రజల మద్దతు లభిస్తుందని తెలిపారు. కానీ ప్రతిపక్షాలు ఓర్వలేక అనవసరంగా మహాయుతి కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. (పని ఒత్తిడితో మహిళా ఉద్యోగి షాకింగ్ డెత్, స్పందించిన కేంద్రం)కాంగ్రెస్‌కు 1,633 దరఖాస్తులు! లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించడంతో మహావికాస్ అఘాడీ (ఎంవీఏ)లో చాలా ఉత్సాహకర వాతావరణం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆశావహులు క్యూలు కడుతున్నారు. కొందరైతే ఇప్పటి నుంచే పైరవీలు చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో టికెట్లు ఆశిస్తున్న వారి నుంచి నివేదికలు తెప్పించుకుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ వద్దకు 1,633 దరఖాస్తులు వచ్చాయి. అత్యధిక దరఖాస్తులు విదర్భ నుంచి (485), ఆ తర్వాత మరఠ్వాడా రీజియన్ నుంచి (325) నియోజక వర్గాల నుంచి రాగా అతి తక్కువ కొంకణ్ రీజియన్ నుంచి (123) దరఖాస్తులు వచ్చాయి. అదే 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 476 దరఖాస్తులు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. దీన్ని బట్టి 2019తో పోలిస్తే ఈ సారి జరిగే అసెంబీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల్లో ఆసక్తి పెరిగినట్లు స్పష్టమవుతోంది. అధికార మహా అఘాడీకి చెందిన కొందరు సభ్యులు కూడా కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. కానీ వారి పేర్లు ఇప్పుడే బయట పెట్టలేమని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనేక మంది ఆసక్తి కనబరుస్తున్నప్పటికీ వారి ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను బట్టి ఎంపిక చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేతలు చెబుతున్నారు. భారీ సంఖ్యలో వచి్చన దరఖాస్తుల్లో కొన్నింటినే ఎంపిక చేయాల్సి ఉంటుంది. తిరస్కరణకు గురైన దరఖాస్తుల్లో కొందరు తిరుగుబాటు చేసే ప్రమాదం కూడా ఉంది. దీంతో ఎంవీఏ నేతలు ఆచితూచి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి: సుశీల్‌కుమార్ శిందే మనవడు, జాన్వీ బాయ్‌ఫ్రెండ్ రాజకీయాల్లోకి! -
జమ్ములో మొదలైన ఎలక్షన్ హీట్
ఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తులు ముమ్మరం చేస్తోంది. ఆగస్టు 19న అమర్నాథ్ యాత్ర ముగిసిన వెంటనే ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ప్రారంభం కానుందని సమాచారం. అలాగే జమ్ముతో పాటు దేశంలో అసెంబ్లీ పదవీ కాలం ముగియనున్న మరో మూడు రాష్ట్రాలకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉంది.గురువారం బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా జమ్ములో పర్యటించారు. జమ్ము బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా, రాష్ట్రానికి చెందిన పార్టీ ఎంపీలు.. జితేంద్ర సింగ్, జుగల్ కిషోర్ శర్మ, ఇతర నేతలతో రెండు గంటలపాటు సమావేశం అయ్యారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా ఢిల్లీ పెద్దలు అక్కడి నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అంతేకాదు.. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు వాళ్లు. దీంతో జమ్ములోని మొత్తం 90 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని స్పష్టత వచ్చింది. ఎన్నికలకు హడావిడి మొదలవుతుండడంతో.. రాబోయే రోజుల్లో బీజేపీ అగ్రనేతలంతా జమ్ముకు క్యూ కట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి సీఎం అభ్యర్థి ఎవరనేది బీజేపీ ప్రకటించలేదు. కానీ, రవీందర్ రైనా నేతృత్వంలోని రాష్ట్ర బీజేపీ నాయకత్వం కొనసాగుతుందని సంకేతాలు మాత్రం ఇచ్చింది. జమ్ము కశ్మీర్ శాసనసభ నవంబర్ 2018లో రద్దు అయ్యింది. ఆగస్టు 2019లో రాష్ట్ర ప్రత్యేక హోదాను రద్దు చేసింది కేంద్రం. ఆపై రాష్ట్రం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా (జమ్మూ కశ్మీర్, లఢక్) విడిపోయింది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించి జమ్ముకు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని కేంద్రం చెబుతోంది. -
సిక్కింలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా ఘన విజయం
గ్యాంగ్‌టక్: సిక్కింలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్కేఎం) ఘన విజయం సాధించింది. ఇటిప్పటి వరకు విడుదలైన ఎన్నికల ఫలితాల్లో ఎస్కేఎం 29 స్థానాల్లో గెలిచింది. మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మేజిక్ ఫిగర్ 17 స్థానాలు.విపక్ష సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీకి కేవలం ఒకే స్థానంలో గెలిచి.. ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. రెండు పార్టీలు మొత్తం 32 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. ఇక బీజేపీ అక్కడ 31 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. కొన్ని పార్టీలతో పొత్తులో భాగంగా కాంగ్రెస్ 12 స్థానాల్లో పోటీ చేసింది. ఆ పార్టీ ఖాతా తెరవలేదు. -
Lok Sabha Election 2024: ఒడిశాలో రసవత్తర పోటీ
బీజేపీ, అధికార బీజేడీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీ పోరు సాగుతున్న ఒడిశాలో ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుతోంది. 15 లోక్‌సభ, వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ఇప్పటికే ముగిసింది. చివరి దశలో భాగంగా మిగతా 6 లోక్‌సభ స్థానాలు, వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. వీటిలో 4 బీజేడీ, 2 బీజేపీ సిట్టింగ్ స్థానాలు. వాటిపై ఫోకస్...జగత్సింగ్పూర్ ఇక్కడ రెండు దశాబ్దాలుగా బీజేడీ చక్రం తిప్పుతోంది. బీజేపీ ఖాతా తెరవలేదు. 2019లో భారీ మెజారిటీతో నెగ్గిన రాజశ్రీ మల్లిక్ బీజేడీ నుంచి, ఆయన చేతిలో ఓడిన బిబూ ప్రసాద్ తరాయ్ బీజేపీ నుంచి మళ్లీ బరిలో ఉన్నారు. తరాయ్ 2009లో ïసీపీఐ నుంచి, 2014లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశారు. ఆయన ఓటు బ్యాంకును చూసి బీజేపీ మరోసారి చాన్సిచి్చనట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి రవీంద్ర కుమార్ సేథీ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు బీజేడీలోకి చేరడం ఆ పారీ్టకి అనుకూలించే అంశం.కేంద్రపర ఇదీ బీజేడీ కంచుకోటే. ఈసారి మాత్రం బీజేపీ అనుకూల పవనాలు వీస్తున్నాయి. 2009, 2014ల్లో బీజేడీ నుంచి గెలిచిన బైజయంత్ పాండా గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగి బీజేడీ నేత, సినీ నటుడు అనుభవ్ మహంతి చేతిలో ఓటమి చవిచూశారు. ఒకప్పుడు సీఎం నవీన్ పట్నాయక్‌కు అత్యంత సన్నిహితుడైన బైజయంత్ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుని హోదాలో మరోసారి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ అనుభవ్ మహంతి కూడా బీజేపీలో చేరడంతో బీజేడీ సంకట స్థితిలో పడింది. అన్షుమన్ మహంతిని పోటీకి దింపింది. మయూర్భంజ్ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు స్థానంలో ఎమ్మెల్యే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సన్నిహితుడు నాబా చరణ్ మఝికి ఈసారి బీజేపీ టికెటిచ్చింది. ద్రౌపది ముర్ము 2009లో ఈ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఐదుసార్లు ఎమ్మెల్యే అయిన విద్యా శాఖ మంత్రి సుదమ్ మరాండీని బీజేడీ బరిలో దింపింది. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సోదరి అంజని సోరెన్ జేఎంఎం తరఫున పోటీలో ఉండటంతో త్రిముఖ పోటీ నెలకొంది.భద్రక్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమల్ భద్రక్ లోక్‌సభ స్థానం పరిధిలోని చాంద్‌బలి అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్నారు. దాంతో భద్రక్‌లో గెలుపు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. బీజేపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి అరుణ్ చరణ్ సేథీ కుమారుడు అవిమన్యు సేథీ పోటీ చేస్తున్నారు. బీజేడీ నుంచి సిట్టింగ్ ఎంపీ మంజులతా మండల్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ అనంత ప్రసాద్ సేథీ బరిలో ఉన్నారు.జజ్పూర్ బీజేడీ నుంచి సిట్టింగ్ ఎంపీ శరి్మష్ఠ సేథీ మళ్లీ బరిలో ఉన్నారు. రవీంద్ర నారాయణ బెహరాకు బీజేపీ టికెటిచి్చంది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ ఆంచల్ దాస్ పోటీ చేస్తున్నారు. ఆయన 1996లో ఇక్కడ జనతాదళ్ నుంచి గెలిచారు. గత ఐదేళ్లలో బీజేపీ ఓటు బ్యాంక్ బాగా పెరిగిందన్న ధీమా ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. అయితే పార్టీ అభ్యర్థి బెహరా స్థానికులకు పరిచయస్తుడే అయినా రాజకీయాలకు కొత్త.బాలాసోర్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి మళ్లీ బరిలో ఉన్నారు. బీజేడీ నుంచి మాజీ బీజేపీ నేత లేఖశ్రీ సమంత సింగార్ పోటీ చేస్తున్నారు. పార్టీని అస్తమానం విమర్శించే లేఖశ్రీకి టికెటివ్వడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. నిజానికి కందమాల్ నుంచి బీజేపీ తరఫున పోటీకి లేఖశ్రీ ఆసక్తి చూపారు. నీలగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని అధిష్టానం సూచించడంతో బీజేడీలో చేరారు. కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి శ్రీకాంత్ కుమార్ జెనా పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి మూడుసార్లు గెలిచిన కరబేల స్వైన్ స్వతంత్ర అభ్యర్థిగా రెండు పారీ్టలకూ సవాలు విసురుతున్నారు.బరిలో కోటీశ్వరులు ఒడిశాలో తుది విడత బరిలో ఉన్న 66 మంది అభ్యర్థుల్లో 20 మంది కోటీశ్వరులే. కేంద్రపర బీజేపీ అభ్యర్థి బైజయంత్ పాండాకు అత్యధికంగా రూ.148 కోట్లున్నాయి. తర్వాత స్వతంత్ర అభ్యర్థి శ్రీరామ్ పాండే రూ.18.23 కోట్లు, భద్రక్ బీజేపీ ఎంపీ మంజులత మండల్‌కు రూ.14.86 కోట్ల ఆస్తులున్నాయి. 15 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 10 మంది తీవ్ర కేసుల్లో నిందితులని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) పేర్కొంది. -
ఎంపీ ఎన్నికలే బీజేపీకి బూస్ట్..!
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఇంతటి ఘన విజయం సాధించిన తర్వాత కూడా బీజేపీ ట్రాక్ రికార్డ్ ఇప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లోనే టాప్ అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇటీవలి రాజస్థాన్,మధ్యప్రదేశ్,ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 332 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. ఈ మూడు రాష్ట్రాల్లో 2014,2019 లోక్‌సభ ఎన్నికల్లో 444, 450 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ లీడ్ సాధించిందని లెక్కలు చెబుతున్నాయి. అయితే, రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి మెరుగు పడడానికి లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన విజయాలు కీలక పాత్ర పోషించాయని తెలుస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాతే రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ బెటర్ పర్ఫామెన్స్ చూపిస్తోందని ఓట్లు, సీట్ల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ దేశంలోని 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇదీచదవండి..రెడ్ అలర్ట్..మరిన్ని రోజులు భారీ వర్షాలు -
Chhattisgarh Exit Poll 2023: ఛత్తీస్‌గఢ్ ఎగ్జిట్‌పోల్స్‌లో ఆ పార్టీదే హవా !
సాక్షి, ఢిల్లీ : వివిధ సర్వే సంస్థలు నిర్వహించిన ఛత్తీస్‌గఢ్ ఎగ్జిట్‌పోల్స్ రిలీజ్ అయ్యాయి. ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్‌దే మళ్లీ గెలుపని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయి. బీజేపీకి ఇక్కడ రెండోసారి నిరాశేనని తెలిపాయి. పీపుల్స్ పల్స్ మొత్తం స్థానాలు 90 బీజేపీ 29-39 కాంగ్రెస్ 54-64 ఇతరులు 2 ఇండియా టుడే బీజేపీ 36-46 కాంగ్రెస్ 40-50 ఇతరులు 0-5 సీఎన్ఎన్ న్యూస్ 18 బీజేపీ 41 కాంగ్రెస్ 46 స్వతంత్రులు 3 జన్ కీ బాత్ బీజేపీ 34-45 కాంగ్రెస్ 42-53 ఇతరులు 0 ఏబీపీ సీ ఓటర్ బీజేపీ 36-48 కాంగ్రెస్ 41-53 ఇతరులు 0 ఇండియా టీవీ సీఎన్ఎక్స్ బీజేపీ 30-40 కాంగ్రెస్ 46-56 ఇతరులు 0 దైనిక్ భాస్కర్ బీజేపీ 36-46 కాంగ్రెస్ 46-56 ఇతరులు 0 ఎగ్జిట్‌పోల్స్ పూర్తి పట్టిక కోసం.. -
చిట్టెం రామ్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన గ్రామస్థులు
-
"పనౌటీ" దుమారం! మోదీని 'దురదృష్టం'తో పోలుస్తూ వ్యాఖ్యలు!
క్రికెట్ ప్రంచకప్ ఫైనల్లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని అహ్మాదాబాద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ని ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా హాజరై ప్రత్యక్షంగా వీక్షించారు కూడా. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మోదీ రావడం వల్లే భారత్ మ్యాచ్ ఓడిపోయిందన్నట్లుగా మాట్లాడారు. ఈ మేరకు రాహుల్ గాంధీ మంగళవారం రాజస్తాన్‌లో జరిగిన ప్రచార ర్యాలీ మోదీని 'దురదృష్టం'తో పోలుస్తే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని అంటే "పనౌటీ మోదీ" అని అన్నారంటూ దూమారం రేగింది. అంతేగాదు ఆ బహిరంగ ర్యాలీలో మోదీని అదాని పారశ్రామికవేత్తగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పనౌటి అనే పదం సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్‌గా అవుతోంది. ఐతే ఈ పనైటి పదానిక అర్థం.. ఏవ్యక్తి మన వద్దకు వస్తే అవ్వాల్సిన పనులు ఆగిపోవడం లేదా జరగకపోవడం వంటివి జరిగినప్పుడూ ప్రయోగిస్తారు. అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తిపై "పనౌటి" అనే పదాన్ని ప్రయోగించడంతో రాహుల్‌పై తీవ్ర స్థాయిలో మండిపడింది బీజేపి. పైగా రాహుల్ ఆ ప్రచార ర్యాలీలో మోదీ ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి హిందూ-ముస్లీం అని జపిస్తుంటారు. ఆయన మిలినియర్ల రుణాలను మాఫీ చేసి మంచి ప్రయోజనాలు అందిస్తుంటారని విమర్శలు గుప్పించారు. पनौती 😉 pic.twitter.com/kVTgt0ZCTs — Congress (@INCIndia) November 21, 2023 దీంతో ఒక్కసారిగా రాహుల్‌పై బీజేపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తి చేసింది. ఈ మేరకు బీజేపీ లోక్‌సభ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ..రాహుల్‌గాంధీ ప్రధానిని ఉద్దేశించి ఇలాంటి పదాన్ని ఎలా ప్రయోగించగలిగారంటూ నిలదీశారు. తక్షణమే క్షమాపణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి మీనాకాశి లేఖి కూడా రియాక్ట్ అయ్యారు. ఒక ప్రధానిపై అలాంటి పదాన్ని ఉపయోగించగలిగారంటే.. రాహుల్ ఎలాంటి వ్యక్తి అనేది స్పష్టంగా తెలుస్తోందన్నారు. VIDEO | "If Rahul Gandhi has used a word like 'panauti', then it reflects what kind of person he is. Using such words for PM, who is working continuously for the country, is not acceptable and the entire country is watching this," says Union MoS @M_Lekhi on Rahul Gandhi's remark… pic.twitter.com/SfI8ASwtrt — Press Trust of India (@PTI_News) November 21, 2023 ఇలాంటి పదాలు ఎంత మాత్రం ఆమోదయోగ్యమైనవి కావు. యావత్తు దేశం మిమ్మల్ని చూస్తోంది. నిరంతరం దేశం కోసం పనిచేసే ఓ వ్యక్తిపై ఇలా నిందలు వేయడం సబబు కాదని హితవు పలికారు. అలాగే లోక్‌సభ ఎంపీ రవి శకంర్ ప్రసాద్ కూడా రాహుల్ మీకు ఏమైంది? ఆ రోజు క్రీడాకారులను కలిసి వారిలో స్థైర్యాన్ని పెంచే యత్నం చేసిన అలాంటి వ్యక్తిపై ఇలాంటి పదాన్ని ప్రయోగిస్తారా? అంటూ తిట్టిపోశారు. మీరు చరిత్ర నుంచి నేర్చుకోవాల్సి చాలా ఉందని రాహుల్‌కి చురకలంటించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. (చదవండి: ఆరోపణల స్ట్రాటజీ వర్సెస్ గ్యారంటీల గేమ్? రాష్ట్ర ఎన్నికల చరిత్ర చెబుతోంది ఇదే! -
Jamili Elections: ‘జమిలి’ సర్వరోగ నివారిణా?
జమిలి ఎన్నికలపై చర్చ సద్దుమణిగిందని అనుకున్నప్పుడల్లా అది మళ్లీ మళ్లీ రాజుకోవటం ఏడెనిమిదేళ్లుగా రివాజైంది. కానీ ఈసారి ఉన్నట్టుండి అందుకు సంబంధించి తొలి అడుగుపడింది. మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కమిటీ విధివిధానాలు, అందులో ఉండే నిపుణుల వివరాలు ఇంకా తెలియాల్సేవున్నా ఇండియా కూటమి సమావేశాల్లో తీరిక లేకుండా వున్న విపక్షాలకు ఇది ఊహించని పరిణామం. పార్లమెంటుకూ, అసెంబ్లీలకూ ఏకకాలంలో ఎన్నికలు జరగాలనీ, అందువల్ల ఎంతో ప్రజాధనం ఆదా అవుతుందనీ ఆ విధానాన్ని సమర్థిస్తున్నవారు చెబుతున్నారు. అంతేకాదు, తరచు ఎన్నికలవల్ల అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతున్నదని కూడా వారి వాదన. కానీ ఈ రకమైన వాదనలను కొట్టి పారేస్తున్నవారు కూడా గణనీయంగానే ఉన్నారు. అభివృద్ధి పనులకు ఎక్కడ ఆటంకం ఏర్పడిందో చూపాలని సవాలు చేస్తున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలోనో, మరే అత్యవసర సందర్భాల్లోనో ప్రభుత్వాలను ఎన్నికల సంఘం నిరోధించిన దాఖలాలు లేవు. కాకపోతే ఓటర్లను ప్రలోభపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందటానికి ఉద్దేశించే పథకాలను మాత్రం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ప్రకటించకుండా ఆపుతున్నారు. అందువల్ల జనం నష్టపోయారని చెప్పడానికి ఎటువంటి దాఖలాలూ లేవు. దేశంలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీల ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. మిగతా రాష్ట్రాలను కూడా ఈ చట్రంలోకి తీసుకు రావటమే కేంద్రం ఉద్దేశం. ‘ఒకే దేశం–ఒకే ఎన్నికలు’ అన్న నినాదం కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచీ వినిపిస్తోంది. అంతక్రితం 2003లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి ఈ విషయంలో కొంత ప్రయత్నం చేశారు. అప్పటి కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీతో ఆయన చర్చించారు. కానీ ఎందుకనో తదుపరి చర్యలేమీ లేవు. జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలోని లా కమిషన్ సమర్పించిన 170వ నివేదిక సైతం చట్టసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇంకా వెనక్కు వెళ్తే 1983లో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈమాటే చెప్పింది. అయితే రాజ్యాంగ సవరణ, ప్రజాప్రాతినిధ్య చట్టం సవరణ, చట్టసభల నియమనిబంధనల సవరణ వగైరాలు చేయకుండా జమిలి ఎన్నికలు సాధ్యంకాదని 2018లో జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని లా కమిషన్ తన ముసాయిదా నివేదికలో అభిప్రాయపడింది. ఒక ఏడాది వేర్వేరు నెలల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలన్నిటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం ఉత్తమమని సూచించింది. దేశంలో జమిలి ఎన్నికలు 1952 నుంచి 1967 వరకూ జరిగాయి. కానీ దానికి తూట్లు పొడిచింది కేంద్రంలోని పాలకులే. అప్పటి నెహ్రూ సర్కారు 1959 జూలైలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలోని తొలి కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాన్ని 356వ అధికరణ ప్రయోగించి బర్తరఫ్ చేసింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని చక్కదిద్దేవరకూ ఆ అధికరణ దశాబ్దాలపాటు దుర్వినియోగం చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహించే ధోరణి వెర్రితలలు వేసి ప్రభుత్వాలు కుప్పకూలాయి. అసెంబ్లీలు రద్దయ్యాయి. ఈ కారణాలన్నిటివల్లా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలది తలోదారీ అయింది. పాలక పార్టీలను చీల్చటం, చీలికవర్గంతో కొత్త ప్రభుత్వాలను ప్రతిష్టించటం రివాజైంది. తరచు ఎన్నికల వల్ల ఖజానాకు తడిసిమోపెడు ఖర్చు అవుతున్నదన్నది వాస్తవం. దీనికితోడు రాజమార్గాల్లో, దొంగదారుల్లో ఎన్నికల జాతరకు వచ్చిపడే వేల కోట్ల రూపాయలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నాయి. ఉదాహరణకు 2009 సార్వత్రిక ఎన్నికలకు ఖజానాకు రూ.1,115 కోట్లు ఖర్చ యితే, 2014 నాటికి ఇది రూ.3,870 కోట్లకు పడగలెత్తింది. ఇదంతా సర్కారుకయ్యే వ్యయం. పార్టీలూ, అభ్యర్థులూ చేసే ఖర్చు ఇందుకు ఎన్నో రెట్లు ఎక్కువుంటుంది. కానీ రోగం ఒకటైతే మందు మరొకటన్నట్టు ఈ సమస్యలకు జమిలి ఎన్నికలే పరిష్కారమని పాలకులు చేస్తున్న వాదన సరికాదు. ఎన్నికల్లో ధనప్రభావం అరికట్టడానికి ఎన్నికల సంస్కరణలు అవసరం. ఎన్నికల విశ్వసనీయత పెంచటానికి దొంగ ఓట్లను అరికట్టడం అవసరం. అలవిమాలిన వాగ్దానాలతో ప్రజలను ఆకర్షించి, అధికారంలోకొచ్చాక వంచించే పార్టీలపై చర్యలు తీసుకోవటం అవసరం. కానీ జరిగిందేమిటి? అసలే పార్టీలు వెచ్చించే కోట్లాది రూపాయల సొమ్ము ఎక్కడిదో తెలిసే అవకాశంలేని ప్రస్తుత పరిస్థితిని మరింత జటిలం చేసేలా ఎన్నికల బాండ్ల విధానానికి తెరలేపారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్ని కలు’ గొప్ప ఆదర్శంగా కనిపించవచ్చు. చూడదల్చుకున్నవారికి ఇందులో జాతీయతా భావన కూడా దర్శనమీయొచ్చు. కానీ ఎన్నికల ప్రక్షాళనకు ఇది దోహదపడేదెంత? ఇంతకూ జమిలి ఎన్నికల విధానం అమలు చేయటం మొదలెట్టాక రాష్ట్రాల్లో గడువుకు ముందే అసెంబ్లీలు రద్దు చేయాల్సివస్తే ఏం చేస్తారు? 90వ దశకంలో మాదిరే కేంద్రంలోనే అస్థిరత ఏర్పడి లోక్‌సభ రద్దు చేయాల్సివస్తే మార్గం ఏమిటి? ఇవన్నీ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఎటూ పరిశీలిస్తుంది. ఇక రెండు చట్టసభలకూ ముడివేయటంవల్ల ఫెడరలిజం దెబ్బతింటుందనేవారూ... జాతీయ అంశాల ప్రాముఖ్యత పెరిగి స్థానిక అవసరాలు, ఆకాంక్షలు మరుగునపడతాయనేవారూ ఉన్నారు. అయితే 2019లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీల ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు వెలువడిన ఫలితాలు గమనిస్తే ఇది అర్ధసత్యమే అనిపిస్తుంది. ఏదేమైనా జమిలి ఎన్నికల విధానంపై విస్తృతమైన చర్చకు చోటిచ్చి, అందులో వ్యక్తమయ్యే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి అడుగులు వేయాలి. తొందరపాటు పనికిరాదు. ఇది కూడా చదవండి: Arunachal Pradesh: మ్యాపులతో మడతపేచీ -
డిసెంబర్లో అధికారంలోకి కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: తన అంచనా ప్రకారం ఈ ఏడాది నవంబర్ 30న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉంటుందని, డిసెంబర్ మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించి దోపిడీ, అక్రమార్జనలపైనే దృష్టి పెట్టిందని, అందుకే ఈసారి తెలంగాణ ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని వ్యాఖ్యానించారు. హుజూర్నగర్ అసెంబ్లీ టికెట్‌కోసం శుక్రవారం గాందీభవన్‌లో దరఖాస్తు ఇచ్చిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈసారి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేయడం ఖాయమన్నారు. తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ అని బీఆర్ఎస్ నేతలు చెపుతున్నారని, వారు చెపుతున్నట్టుగానే తలసరి అప్పు, మద్యం వినియోగం, అవినీతిలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని 119 ముక్కలుగా విభజించి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు వాటిని తమ సామ్రాజ్యాలుగా భావించి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. దళితబంధు, డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయకముందే లంచాలు తీసుకుంటున్నారని, హుజూర్నగర్ నియోజకవర్గంలో దళితబంధుకు అర్హత పొందిన వారి వద్ద నుంచి 50 శాతం కమీషన్ తీసుకున్నారని, దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఉత్తమ్ చెప్పారు. -
TS Election 2023: 'బీఆర్ఎస్.. బీజేపీ.. బీఎస్పీ' ల మధ్యే అసలు పోటీ..!
కుమరం భీం: రాష్ట్రంలో ఉత్కంఠ రేపిన బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా వెల్లడికావడంతో సిర్పూర్ సెగ్మెంటులో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తొణకిసలాడుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్పకే మళ్లీ టికెట్ ఖరారు కావడంతో ఇప్పుడాయనకు పోటీగా విపక్ష పార్టీ అభ్యర్థులెవరనే ప్రశ్న చర్చనీయాంశమైంది. ఇప్పటికే వరుసగా రెండుసార్లు గెలిచిన కోనప్పకు ఈసారి బీజేపీ, బీఎస్పీల రూపంలో గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీల నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో నియోజకవర్గంలో రాజకీయ వేడి క్రమంగా రాజుకుంటుంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు మరింత ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా సిర్పూర్ సింహబలుడెవరన్నది తేలుతుందని వారు అంటున్నారు. పోటీ తీవ్రం.. సిర్పూర్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీల మధ్యే పోటీ ఉండనుంది. బీజేపీ నుంచి డాక్టర్ పాల్వాయి హరీశ్‌బాబు, డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్‌లో ఎవరో ఒకరు బరిలో నిలవనుండగా.. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్‌కుమార్ ఇక్కడి నుంచే పోటీ చేయనున్నారు. ఈ ముగ్గురు మధ్యే త్రిముఖ పోటీ ఉండనుంది. కమ్మ సామాజికవర్గానికి చెందిన కోనప్ప తొలిసారి 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. ఆ తరువాత 2009లో టీఆర్ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్య చేతిలో 7,414 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 2014లో బీఎస్పీ తరఫున పోటీ చేసిన కోనప్ప తమ సమీప టీఆర్ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్యపై 8,837 ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు. ఆ తరువాత ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కోనప్ప తమ సమీప కాంగ్రెస్ అభ్యర్థి పాల్వయి హరీశ్‌బాబుపై 24,036 ఓట్ల మెజా ర్టీతో భారీ విజయం సాధించారు. అనంతరం హరీశ్‌బాబు బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ పా ర్టీలో సగానికిపైగా శ్రేణులు ఆయన వెంటే నడిచాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఫలితంగా నియోజకవర్గంలో బీజేపీ, అధి కార పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా మారింది. 17 సార్లు ఎన్నికలు.. సిర్పూర్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 1957 లో ద్విసభ్య నియోజకవర్గంగా రూపాంతరం చెంది, తిరిగి 1962లో జనరల్ నియోజకవర్గంగా ఏర్పడింది. 2010లో జరిగిన ఉప ఎన్నికతో సహా ఇప్పటి వర కు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 1972, 1978 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కె.వి.శేషవులు దివంగత ప్రధాని పీవీ నరసింహరావుకి అత్యంత సన్నిహితులు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడ ఆరుసార్లు గె లువగా.. టీఆర్ఎస్, టీడీపీ మూడేసి సార్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి రెండుసార్లు, పీఎస్పీ, సోషలిస్ట్, బీఎస్పీ పార్టీలు ఒక్కోసారి గెలిచాయి. కాంగ్రెస్, బీఎ స్పీ, టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన కోనేరు కోనప్ప తాజాగా నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పాల్వాయి కుటుంబానికి పట్టు.. ఆది నుంచి నియోజకవర్గంలో డాక్టర్ పాల్వాయి హరీశ్‌బాబు కుటుంబానికి మంచి పట్టుంది. హరీశ్‌బాబు తండ్రి పాల్వాయి పురుషోత్తంరావు స్థానికుడు. 1989, 1994 ఎన్నికల్లో పురుషోత్తంరావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన భార్య పాల్వాయి రాజ్యలక్ష్మి సైతం 1999లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. వరుసగా ఆ కుటుంబసభ్యులు మూడుసార్లు గెలవడం నియోజకవర్గంలో వారికున్న పట్టుకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి పాల్వాయి హరీశ్‌బాబుకు టికెట్ దక్కితే హోరాహోరీ పోరు ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఆర్ఎస్పీ సైతం ఇక్కడి నుంచే.. మరోవైపు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్‌కుమార్ సిర్పూర్ నుంచే పోటీ చేస్తానని ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణులు చాపకింద నీరులా నియోజకవర్గంలో తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. నిన్నటి వరకు ఎమ్మెల్యే కోనప్పకు అండగా నిలిచిన పొరుగు రాష్ట్రానికి ఆనుకుని ఉన్న కౌటాల మండలం గుండాయిపేట, మొగడ్‌దగడ్, తుమ్మిడిహెట్టి, వీర్దండి, తాటిపల్లి గ్రామాల ఓటర్లు బీఎస్పీ వైపు మొగ్గు చూపుతునట్లు తెలుస్తోంది. పైగా ఇక్కడి ఓటర్లు మాటిస్తే వందశాతం ఓట్లు వేస్తారన్న నమ్మకం ఉంది. చింతలమానెపల్లి మండలం బూరెపల్లి గ్రామం ఎస్టీ వర్గానికి చెందిన సిడాం గణపతి(ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్)సైతం ఈ ఎన్నికల్లో బీఎస్పీకి మద్దతు ఇస్తున్నారు. బెజ్జూర్‌కు చెందిన మాజీ ప్రాథమిక వ్యవసాయ, సహకార సంఘం చైర్మన్ హర్షద్ ఉస్సేన్ బీఎస్పీలో కీలకంగా మారడంతో సిర్పూర్(టి), బెజ్జూర్, కాగజ్‌నగర్‌లో ఉన్న ముస్లిం ఓట్లు కొంత బీఎస్పీకి పడే అవకాశాన్ని కొట్టిపారేయలేమని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎవరో..? కాంగ్రెస్‌లో టికెట్ ఆశిస్తున్న రావి శ్రీనివాస్, కోరళ్ల కృష్ణారెడ్డి ఇద్దరూ క్షేత్రస్థాయిలో విభేదాలకు అతీతంగా పనిచేసుకుపోతున్నారు. ఈ ఇద్దరు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, విశ్వప్రసాద్‌కు సన్నిహితులుగానే గుర్తింపు పొందారు. ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేయాల న్న ఏకాభిప్రాయంతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు యూనుస్ హుస్సే న్ కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కోనప్పకు ఎదురుందా! సిర్పూర్ నియోజకవర్గంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా పేరొందిన కోనేరు కోనప్పకు ఈసారి జరగనున్న ఎన్నికలు ఆషామాషీగా ఉండవని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. నియోజకవర్గంలో దాదాపు 2.17 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో బీసీ, ఎంబీసీ, డీఎన్టీ కులాలకు చెందిన ఓటర్లు 60 శాతంపైగా ఉన్నారు. ఈ కులాల్లో అత్యధికంగా మహాత్మా జ్యోతిబా పూలే సామాజిక వర్గానికి చెందిన మాలి కులస్తులు 28 వేల ఓటర్లు ఉన్నారు. ఎస్సీలు 53 వేలు, ఎస్టీలు 27 వేల వరకు ఉన్నట్లు సమాచారం. అలాగే ఆరె సామాజికవర్గానికి చెందిన ఓటర్లు 40 వేలకు పైగా ఉన్నారు. ఇక ముస్లిం ఓటర్లు సైతం 35 వేలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరి ఓట్లు సిర్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయంలో కీలకపాత్ర పోషించనున్నాయి. కాగా, బీఆర్ఎస్కు సంస్థాగతంగా బూత్‌స్థాయి నుంచి మండలస్థాయి వరకు బలమైన క్యాడర్ ఉండడం కొంత కలిసొచ్చే అంశం. -
TS Election 2023: ఇప్పటికే ‘కారు’ అభ్యర్థులు ఖరారు..!
నిర్మల్: ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ సై అంటోంది. ఆ పార్టీ నుంచి బరిలో నిలిచేదెవరో ఇప్పటికీ ఖరారైపోయింది. ఇక వారితో తలపడేదెవరో తేలాల్సి ఉంది. గులాబీదళం నుంచి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి(నిర్మల్), గడ్డిగారి విఠల్‌రెడ్డి(ముధోల్), భూక్య జాన్సన్‌నాయక్(ఖానాపూర్) పోటీచేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రధాన ప్రత్యర్థులైన బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీలో ఉంటారనేది ఇంకా స్పష్టత లేదు. నిర్మల్‌లో అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లే ఉన్నా.. ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాలు చాలా క్రిటికల్‌గా ఉన్నాయి. రెండు పార్టీల్లో పోటాపోటీగా ఆశావహులు ఉండటంతో ఆ రెండు నియోజకవర్గాలే కీలకంగా మారాయి. కాంగ్రెస్ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా, బీజేపీ ఇప్పటికే కొన్ని పేర్లను ఫైనల్ చేసి పరిశీలిస్తోంది. ఈ రెండు పార్టీలూ ఇప్పటి వరకు ఇంకా అభ్యర్థుల పేర్లను మాత్రం బయటపెట్టలేదు. ఈ పార్టీలతోపాటు ఈసారి బీఎస్పీ బలమైన పోటీ ఇచ్చే అభ్యర్థుల కోసం ప్రయత్నిస్తోంది. -
TS Election 2023: ఉమ్మడి జిల్లాలో సత్తా చాటేందుకు కాంగ్రెస్ వ్యూహం!
కరీంనగర్: కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కొత్త ఉత్సాహంతో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఈసారి సానుకూల పవనాలు వీస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఇటీవల బీఆర్ఎస్ ప్రకటించిన దరిమిలా.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం మొదలైంది. దీంతో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా బరిలో నిలిచే అభ్యర్థుల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. పాత కరీంనగర్ జిల్లాలో ఈసారి ఎలాగైనా కనీసం ఆరు స్థానాలు సాధించాలన్న వ్యూహంతో మెరికల్లాంటి అభ్యర్థులను రంగంలోకి దింపే పనిలో ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత, సీని యర్లపై సానుభూతి, కొత్తగా పార్టీలోకి చేరుతున్న నాయకగణం తదితర కారణాలు ఈసారి జిల్లాలో తమకు గౌరవప్రదమైన సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలి పిస్తాయని అధిష్టానం బలంగా నమ్ముతోంది. ఉమ్మ డి జిల్లాలో మొత్తం 13 అసెంబ్లీ స్థానాల్లో తమకు ఎంతలేదన్నా.. కనీసం ఆరేడుకు తగ్గకుండా గెలిచి తీరుతామన్న ధీమాతో కాంగ్రెస్ ముందుకెళ్తోంది. ఈ స్థానాలు కీలకం..! ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు, థర్డ్ పార్టీ సర్వేల అనంతరం పెద్దపల్లి(విజయరమణారావు), మంథని(దుద్దిళ్ల శ్రీధర్‌బాబు), రామగుండం(రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్), ధర్మపురి(అడ్లూరి లక్ష్మణ్), వేములవాడ(ఆది శ్రీనివాస్), హుస్నాబాద్(పొన్నం ప్రభాకర్),జగిత్యాల(జీవన్‌రెడ్డి) స్థానాల్లో తమ అభ్యర్థులు బలంగా ఉన్నారని, అధికార బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇ స్తారని కాంగ్రెస్ ధీమాగా ఉంది. చొప్పదండి(మేడిపల్లి సత్యం), మానకొండూరు(కవ్వ ంపల్లి సత్యనారా యణ), సిరిసిల్ల (కేకే మహేందర్‌రెడ్డి), కోరుట్ల(జువ్వాడి న ర్సింగరావు) కూడా ఈ సారి తమ కు స్థానికంగా సానుకూల పరిస్థితులు ఉన్నాయని నమ్ముతున్నా రు. హుజూరాబాద్ నుంచి మరోసారి బల్మూరి వెంకట్ బరిలోకి దిగనున్నారన్న ప్రచారం నడుస్తోంది. అన్నింటికంటే చివరిగా కరీంనగర్ స్థానంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానానికి పార్టీలో తీవ్రపోటీ నెలకొంది. మాజీ మంత్రి ఎమ్మెస్సార్ మనవడు మేనేని రోహిత్, పొ న్నం ప్రభాకర్ మధ్య పోటీ ఉన్నా.. పొన్నం హుస్నాబాద్‌కు వలస వెళ్లడంతో రోహిత్‌కు దాదాపుగా రూట్ క్లియర్ అయింది. అదేసమయంలో మైత్రీ గ్రూప్స్ అధినేత కొత్త జయపాల్‌రెడ్డి పార్టీలో చేరడంతో మరో ఆశావహుడు పెరిగినట్లయింది. దరఖాస్తుల పరంగా చూసినా.. కరీంనగర్‌కు ఆశావహుల జాబితా చాంతాడంత ఉంది, తర్వాత స్థానంలో కోరుట్లకు పోటీ ఉంది. కాంగ్రెస్ గూటికి మాజీ ఎంపీ వివేక్!? పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యుడు గడ్డం వివేక్ వెంకటస్వామి మరోసారి పార్టీ మారనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఈనెల 30వ తేదీ తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. కేంద్ర మాజీమంత్రి జి.వెంకటస్వామి రాజకీయ వారసుడిగా 2009లో పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. 2014లో కాంగ్రెస్ నుంచి ఓడాక బీఆర్ఎస్లో చేరి ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఓటమి కోసం ప్రయత్నించారన్న విమర్శలతో పార్టీ ఆయనను పక్కనబెట్టింది. అప్పటినుంచి ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు. ఐదేళ్లుగా జాతీయ పార్టీలో పనిచేసినా సరైన ప్రాధాన్యం దక్కలేదన్న ఆవేదనతో తిరిగి మాతృపార్టీ కాంగ్రెస్‌కు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో హస్తం పార్టీ నుంచి ఆయనకు గ్రీన్‌సిగ్నల్ వచ్చిందని, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి సీటు ఇస్తామన్న హామీతో ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నారని తెలిసింది. అంగబలం, అర్థబలం దండిగా ఉన్న వివేక్ పార్టీలో చేరితే.. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని అన్నిస్థానాల అభ్యర్థులకు అండగా నిలుస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. -
TS Election 2023: 'లక్ష' సాయానికి అర్హుల జాబితాలో.. కార్పొరేటర్ భర్త పేరు!
పెద్దపల్లి: ఈ ఏడాది చివరన అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంటతో అన్ని వర్గాల ఓట్లను ఆకర్షించేందుకు అధికార పార్టీ కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా కుల, చేతివృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నింపి వారికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో శ్రీబీసీబంధుశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా వచ్చే రూ.లక్ష సాయంతో ఆయా కులవృత్తుల కుటుంబాల్లో ఆర్థిక స్వావలంబనకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం యోచించింది. అయితే క్షేత్రస్థాయిలో తొలివిడత సాయం పంపిణీలో నేతల అనుచరుల కమీషన్లతో ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడ్డాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అర్హుల జాబితాలో పేరు ఉన్నా.. కమీషన్ ఇవ్వనిదే చెక్కు ఇవ్వని పరిస్థితి నియోజకవర్గాల్లో నెలకొందని సాయం పొందినవారే ఆరోపిస్తున్నారు. మలివిడతలోనైనా కమీషన్లు, నేతల సిఫారసులు లేకుండా పూర్తి సాయం అందేలా చూడలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. రూ.10వేలు ఇవ్వాల్సిందే.. విశ్వబ్రాహ్మణ, నాయీబ్రాహ్మణ, రజక, శాలివాహన, కుమ్మరి, మేదరి తదితర 14 కులాలు, ఏంబీసీ కులాల వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు జూన్ 6నుంచి 20 వరకు దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తుదారులకు తెల్లరేషన్‌కార్డు, గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ పరిధిలో రూ.2లక్షలు ఉండాలనేది నిబంధన. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి నిబంధనలకు లోబడి ఉన్న వారిని గుర్తించాలి. ఇలా జిల్లాలో మొత్తం 10,759మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 9,765 మందిని క్షేత్రస్థాయిలో పరిశీలించి 8,683 మందిని అర్హులుగా తేల్చారు. అందులో తొలివిడుతలో భాగంగా పెద్దపల్లి, రామగుండంలో 300 మందికి, మంథనిలో 180, ధర్మారంలో 65 మందిని తొలివిడత ఎంపిక చేశారు. అయితే తొలివిడతలోనే తమ అనుచరులకు చోటుకల్పించాలనే ఆలోచనతో నేతలు, వారి అనుచరుల సిఫారసుకు అధికారులు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఇదే అదునుగా తమ బంధువులు, అనుచరులు, లేదా రూ.10నుంచి 15వేలు కమీషన్ ఇచ్చిన వారికే తొలివిడతలో చోటు కల్పించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్థికంగా లేనివారి పేర్ల స్థానంలో ఆర్థికంగా బాగున్న వారి పేర్లతో జాబితా ఉండటంపై దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై బీసీ సంక్షేమ శాఖ అధికారి రంగారెడ్డి వివరణ కోరగా నిబంధనల మేరకే.. మంత్రి ఆమోదంతోనే ఎంపికచేశామని తెలిపారు. దళారులకు డబ్బులు ఇవ్వద్దొని, అడిగితే ఫిర్యాదు చేయాలని సూచించారు. అభివృద్ది నేను చూసుకుంటా.. జిల్లాలోని ఓ ఎమ్మెల్యే చుట్టూ నిత్యం తిరిగే ఓ ఎంపీపీ భర్త ప్రభుత్వం బీసీల్లోని కులవృత్తులకు అందించే రూ.లక్ష సాయం ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి నుంచి రూ.10వేలు కమీషన్ తీసుకున్నట్లు సమాచారం. సాయానికి ఎంపికై న ఓ లబ్ధిదారుడు కమీషన్ ఇవ్వకపోవడంతో అతడి చెక్కు పంపిణీ కాకుండా అడ్డుకోవడంతో అతడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. చెక్కు ఇచ్చాడన్న ఆరోపణలు వస్తున్నాయి. రామగుండం కార్పొరేషన్ పరిధిలో రూ.లక్ష సాయానికి అర్హుల జాబితాలో ఏకంగా కార్పొరేటర్ భర్త పేరు ఉండటం చర్చనీయాంశంగా మారింది. గతంలో రామగుండం పరిధిలో కొంతమంది కార్పొరేటర్లు వారి బంధువులకే దళితబంధు ఇప్పించుకున్నారనే విమర్శలున్నాయి. తాజాగా ఈ లక్ష రూపాయల సాయంలోనూ బంధువులు, లేదా కమీషన్ ఇచ్చినవారికే ఇప్పిస్తామంటూ చెబుతున్నారు. -
‘కారు’ మిస్సయిన వారికి.. బీఆర్ఎస్ టికెట్ దక్కని అసంతృప్తులకు ప్రతిపక్షాల గాలం
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ ముందుగానే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం రాష్ట్రంలో కాక రేపుతోంది. మూడు ప్రధాన రాజకీయపార్టీల్లోనూ వేడి పుట్టిస్తోంది. బీఆర్ఎస్లో టికెట్ దక్కని ఆశావహులు అసమ్మతి రాగం ఎత్తుకోగా.. వారిని బుజ్జగించేందుకు బీఆర్ఎస్ కీలక నేతల యత్నాలు ఓవైపు.. ఇలాంటి వారికి గాలం వేసి, తమ తరఫున బరిలోకి దింపేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ ఇతర పార్టీల ప్రయత్నాలు మరోవైపు.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. బీఆర్ఎస్ టికెట్ దక్కని కొందరు నేతలు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు అంతర్గతంగా ఇతర పారీ్టలతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఏయే నేతలు ఏ పార్టీ వైపు వెళ్తారనేది చర్చనీయాంశంగా మారింది. ప్రత్యామ్నాయంపై అసంతృప్తుల లెక్కలు ఉద్యమకాలం నుంచి పార్టీలో పనిచేస్తూ టికెట్లు ఆశిస్తున్నవారు, వివిధ సందర్బాల్లో బీఆర్ఎస్ గూ టికి చేరినవారితో సుమారు 40కిపైగా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ బహుళ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. అలాంటి నేతల్లో ప్రస్తుతం టికె ట్ దక్కనివారు తమ రాజకీయ భవిష్యత్తు, ప్రత్యామ్నాయ అవకాశాలపై దృష్టి సారిస్తున్నారు. టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమ రాజ కీయ భవిష్యత్తుపై అనుచరులతో సమాలోచనలు చేస్తున్నారు. అవకాశం దక్కనిచోట ఎందుకు ఉండాలని, ఇతర పార్టీల్లోకి వెళదామని అనుచరులు నేతలపై ఒత్తిడి తెస్తున్నారు. దీనితో ఏ పారీ్టలో చేరితే ఏ మేర ప్రయోజనం ఉంటుందన్న దానిపై అసంతృప్తులు అంచనాలు వేసుకుంటున్నారు. ఇలాంటి నేతలతో కాంగ్రెస్, బీజేపీ కీలక నేతలు ఇప్పటికే మంతనాలు ప్రారంభించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో విభేదిస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులను కూడా పారీ్టలో చేరాలని ఆహ్వానిస్తున్నారు. ఎవరెవరు.. ఏ దిశగా? ►బీఆర్ఎస్ టికెట్ దక్కని ఏడుగురు సిట్టింగ్‌లలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కాంగ్రెస్ గూటికి చేరుకోవడం దాదాపు ఖాయమైంది. మిగతా సిట్టింగ్‌లలో బాపూరావు రాథోడ్, తాటికొండ రాజయ్య, ఆత్రం సక్కు, రాములు నాయక్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటనలు చేశారు. కానీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి ఒకరిద్దరు పునరాలోచనలో పడే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అనుచరులు కాంగ్రెస్‌లోకి వెళ్దామంటూ ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. ►వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ట్విట్టర్ వేదికగా అసంతృప్తి ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ నుంచి రమేశ్ బాబాయి, మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు కుమారుడు వికాస్‌రావు పోటీచేసే అవకాశం ఉండటంతో.. ఆయనకు రమేశ్ మద్దతు ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ► ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి కూడా తన రాజకీయ భవిష్యత్తుపై సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నారు. ►పాలేరులో టికెట్ దక్కని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అనుచరులు మంగళవారం ప్రత్యేకంగా సమావేశమై బీఆర్ఎస్ను వీడుదామంటూ విజ్ఞప్తి చేశారు. అయితే హైదరాబాద్‌లో ఉన్న తుమ్మలను మంత్రి హరీశ్‌రావు కలసి పారీ్టతో కలసి సాగాలని కోరినట్టు సమాచారం. ►కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుతో బీజేపీ నాయకులు టచ్‌లోకి వచ్చినట్టు సమాచారం. జనగామ టికెట్ కోసం పోరాడుతున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తనకు టికెట్ లభించని పక్షంలో తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. రెండు దఫాలుగా అక్కడ గెలిచిన ముత్తిరెడ్డి.. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకుంటే బీజేపీవైపు అడుగు వేసే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెప్తున్నారు. ►నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వీరేశం ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ►రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌పై అసమ్మతి వ్యక్తం చేస్తూ, టికెట్ ఆశించిన పాలకుర్తి జెడ్పీటీసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి తన రాజకీయ భవిష్యత్తుపై అనుచరులతో సమాలోచనలు చేస్తున్నారు. ►పెద్దపల్లి టికెట్ ఆశించిన నల్ల మనోహర్‌రెడ్డి బీఆర్ఎస్కు రాజీనామా ప్రకటించడంతోపాటు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించారు. ►వీరితోపాటు రామ్మోహన్‌గౌడ్ (ఎల్బీ నగర్), మన్నెం రంజిత్‌యాదవ్ (నాగార్జునసాగర్), బొమ్మెర రామ్మూర్తి (మధిర), మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, నల్లాల ఆనంద్ (మానకొండూరు), తీగల కృష్ణారెడ్డి (మహేశ్వరం), శశిధర్‌రెడ్డి (కోదాడ) తదితరులతో విపక్షాలు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ►జహీరాబాద్‌లో టికెట్ ఆశించిన ఢిల్లీ వసంత్ ‘యుద్ధం మిగిలే ఉంది..’ అని ప్రకటన చేయగా.. పటాన్చెరు స్థానం ఆశించిన నీలం మధు ఈ నెల 24న తన రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానని వెల్లడించారు. ►మాజీ మంత్రి, మాజీ ఎంపీ గెడ్డం నగేశ్ బోథ్ నుంచి టికెట్ ఆశించినా దక్కలేదు. ఆయన బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. దీనిపై తన అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. ► సూర్యాపేటకు చెందిన డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జంగయ్యయాదవ్ కూడా.. మంత్రితో విభేదాల నేపథ్యంలో పార్టీని వీడే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ‘ఆపరేషన్ అసంతృప్తులు’! బీఆర్ఎస్లో టికెట్ రాని అసమ్మతులపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. టికెట్రాని కీలక నేతలతోపాటు ఎమ్మెల్యేలను వ్యతిరేకిస్తున్న ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు ‘ఆపరేషన్ అసంతృప్తులు’ చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యరి్థత్వాలపై ఆ పార్టీ కేడర్లోనే వ్యతిరేకత ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఆయా నియోజకవర్గాల్లో జనంలో ఉన్న వారెవరు? ఓట్లు వేయించగలిగిన వారెవరు? చేరిక అనంతరం పార్టీ ఇమేజ్‌కు దోహదపడేవారెవరు? బీఆర్ఎస్ అభ్యర్థులను గట్టిగా దెబ్బకొట్టగలిగేవారెవరు? తమ నాయకులకు ఇతోధికంగా దోహదపడే సమీకరణాలకు ఎవరు సరిపోతారు? అనే కోణాల్లో బీఆర్ఎస్ అసంతృప్తులను జల్లెడ పట్టి వెతికే పనిలో పడింది. ఇప్పటికే చర్చలు మొదలు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి తదితరులు రంగంలోకి దిగారని.. బీఆర్ఎస్ అసంతృప్తులతో చర్చలు జరిపి పారీ్టలోకి తీసుకువచ్చే బాధ్యతను ఆయా నియోజకవర్గాల ఇన్చార్జులు, జిల్లాల ముఖ్య నేతలకు అప్పగించారని తెలిసింది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు, నల్లగొండ నుంచి వేముల వీరేశం, స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి రాజయ్య, ఖానాపూర్ నుంచి రేఖానాయక్లతో ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లు చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఇదే సమయంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులనూ ఆకర్షించేందుకు ప్రయతి్నస్తున్నట్టు సమాచారం. బీఆర్ఎస్లో అన్యాయం జరిగినందున రాజకీయంగా తాము న్యాయం చేస్తామని.. తప్పకుండా టికెట్ ఇస్తామని.. లేదంటే పార్టీలో తగిన గౌరవం కలి్పస్తామని హామీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో కాంగ్రెస్ అగ్రనేతలతో నిర్వహించే బహిరంగ సభల్లో ఈ చేరికలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో 26న చేవెళ్లలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే ఆధ్వర్యంలో జరగనున్న సభలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, ఆమె భర్త శ్యాంనాయక్, మరికొందరు నేతలను చేర్చుకునేలా ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిసింది. -
TS Election 2023: ఇక్కడ గెలిచే పార్టీదే.. అధికార పీఠం!
సిద్ధిపేట్: ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చటగా మూడోసారి గజ్వేల్ ‘బరి’లోకి దిగుతున్నారు. ‘సెంటిమెంట్’గా ఈ నియోజకవర్గాన్ని ఎంచుకొని రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇదే ఆనవాయితీని ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేసిన సందర్భంలో మొత్తం 1,99,062 ఓట్లు పోలవగా, ఇందులో కేసీఆర్ 86,372 ఓట్లను దక్కించుకున్నారు. టీడీపీకి చెందిన తన సమీప ప్రత్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డిపై 19,218 ఓట్ల మెజార్టీ సాధించారు. ప్రతాప్‌రెడ్డికి మొత్తం 67,154 ఓట్లు దక్కాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి కేవలం 33,998 ఓట్లకే పరిమితమయ్యారు. 2018 సాధారణ ఎన్నికల్లో కేసీఆర్‌కు మొత్తంగా 1,25,444 ఓట్లు వచ్చాయి. కేసీఆర్‌కు ప్రత్యర్థిగా ఉన్న వంటేరు ప్రతాప్‌రెడ్డి (కాంగ్రెస్) 2014 ఎన్నికల మాదిరిగానే 67,154 ఓట్లు రావడం గమనార్హం. ఈ లెక్కన ప్రతాప్‌రెడ్డిపై 58,290 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇక్కడ గెలిచే పార్టీదే అధికార పీఠం! 1952లో జరిగిన ఎన్నికల్లో మినహా ఇప్పటి వరకు జరగిన 14 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ ఎమ్మెల్యే గెలిచిన రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఆనవాయితీగా వస్తున్నది. 1957లో గజ్వేల్ ద్విసభ్య నియోజకవర్గంగా ఉండగా.. ఆ సమయంలో కాంగ్రెస్‌కు చెందిన ఆర్.నర్సింహారెడ్డి, జేబీ ముత్యాలరావులు గెలుపొందగా ఆ సమయంలో ఆ పార్టీకి చెందిన ప్రభుత్వం రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. అదేవిధంగా 1962 నుంచి 1978వరకు కాంగ్రెస్‌కు చెందిన గజ్వేల్ సైదయ్య గెలుపొందగా ఆ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 1983, 1985, 1994, 1999 సంవత్సరాల్లో ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు గెలుపొందగా.. ఆ పార్టీ అధికార పగ్గాలను చేపట్టింది. 1989, 2004, 2009లలో కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు గెలుపొందగా ఆ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అదే విధంగా 2014, 2018లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ గెలుపొందగా ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇదే సెంటిమెంట్‌తో కేసీఆర్ బరిలో దిగుతుండగా...గెలిచాక ఇక్కడే కొనసాగుతారా...? మారుతారా..? అనేది వేచి చూడాలి. అభివృద్ధికి నమునాగా గజ్వేల్ తన సొంత ‘ఇలాఖా గజ్వేల్‌ను కేసీఆర్ అభివృద్ధికి నమునాగా మార్చారు. వేలాది కోట్ల నిధులతో అభివృద్ధి చేపట్టారు. ఇందులో భాగంగానే కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ నిర్మాణం, మల్లన్నసాగర్ మిషన్ భగీరథ పథకం, ములుగులో హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్రీ యూనివర్శిటీ, గజ్వేల్–ప్రజ్ఞాపూర్‌లో రింగురోడ్డు, వంద పడకల జిల్లా ఆసుపత్రి, మరో వంద పడకలతో మాతా శిశురక్షణ ఆసుపత్రి, ఎడ్యుకేషన్ హబ్, డబుల్ బెడ్రూమ్ మోడల్ కాలనీ, మహతి ఆడిటోరియం, సీఎం మినీ క్యాంపు కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, ఆడిటోరియం, పాండవుల చెరువు సుందరీకరణ, అర్బన్‌పార్కు, ప్రతి మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్‌లు, గజ్వేల్‌లో స్పోర్ట్స్ విలేజ్ పనులకు అంకురార్పణ, వర్గల్లో ఫుడ్ పార్కు, తున్కిబొల్లారం, బండమైలారంలలో టీఎస్ఐఐసీ అధ్వర్యంలో పరిశ్రమల జోన్లు తదితర భారీ అభివృద్ధి పనులతో పాటు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, సబ్స్టేషన్ల సామర్థ్యం పెంపు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ వంటి అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున జరిగాయి. -
నారాయణపేట: డీకే అరుణ ప్రభావం పడనుందా?
నారాయణపేట నియోజకవర్గంలో ఈ సారి త్రిముఖపోటీ అనివార్యం కానుంది. 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్దిగా పోటీచేసిన రాజేందర్‌రెడ్డి గెలిచారు. తర్వాత ఆయన టీఆర్ఎస్లో చేరారు. 2018లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మరోసారి బీఆర్ఎస్ తరపున ఆయనే ఇక్కడి నుంచి పోటీచేసే అవకాశాలే ఉన్నాయి. అధికార పార్టీపై అసంతృప్తి.. అదే బీజేపీకి బలం కానుంది! అయితే అభివృద్ది విషయంలో తన వంతు కృషి చేశారు. నారాయణపేటను నూతన జిల్లాగా ఏర్పాటు చేయించారు. జిల్లా ఆస్పత్రి కూడ వచ్చింది. జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ పూర్తి చేయించారు. అయితే నారాయణపేటకు సాగునీటిని అందించాలనే ఉద్దేశ్యంతో ఇచ్చిన జీఓ 69ని అమలు చేయించటంలో ఆయన విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. జాయమ్మ చెరువు రిజర్వాయర్ చేస్తామన్న హమీ కూడ నెరవేరలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతానికి సాగునీటిని అందిస్తామన్న హమీకూడ నెరవేరకపోవటంతో ఇక్కడి జనం అసంతృప్తితో ఉన్నారు. అయితే నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండరనే ఆరోపణ ఉంది. పార్టీ కార్యకర్తలతో నేతలతో ముక్కుసూటిగా మాట్లాడుతుండటంతో క్యాడర్లో నైరాశ్యం ఉంది. ముఖ్యంగా బీజేపీ ఇక్కడ బలంగా ఉండటం కొంత మైనస్‌గా మారే అవకాశం ఉంది. తన వర్గీయులకే పెద్దపీఠ వేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్‌పార్టీ ఇక్కడ గడచిన రెండు ఎన్నికల్లో ఓటమి పాలై మూడో స్దానానికే పరిమితమయ్యింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి శివకుమార్‌రెడ్డి 2014లో పోటీ చేసి రెండవస్దానంలో నిలిచారు. 2018లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరిస్తే బీఎల్ఎఫ్ పార్టీ నుంచి పోటీ చేసి మళ్లీ రెండవస్దానంలో నిలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈసారి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఆయనపై ఇటీవల ఓ మహిళ వ్యక్తిగతమైన ఆరోపణలు చేయటం,కేసు నమోదు కావటం కొంత ఇబ్బందిగా మారింది. ఆయనను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి సైతం తప్పించారు. మాస్ ఫాలోయింగ్ ఉండటం ఈయనకు కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత సైతం ప్లస్ అవుతుందని అంటున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి పోటీ చేయాలని వ్యాపారవేత్త సుజేంద్ర శెట్టి ఆసక్తి కనబరుస్తున్నారు. డీకే అరుణ ప్రభావం బీజేపీకి కలిసోచ్చేనా? ఇక్కడ బీజేపీకి మొదటి నుంచి కొంత క్యాడర్ ఉంది. 2014లో రతంగ్ పాండు రెడ్డి పొత్తుల్లో భాగంగా టీడీపీకి సీటు కేటాయించటంతో ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచి 23 వేల ఓట్లు సాధించారు. 2018లో బీజేపీ నుంచి పోటీ చేసిన ఆయన 20 వేల ఓట్లు సాధించారు. అయితే వ్యక్తిగతంగా సౌమ్యుడిగా పేరున్న రతంగ్ పాండు రెడ్డిపై సానుభూతి కూడ ఉంది. ఇటీవల బండి సంజయ్ మార్క్ నిర్వహించిన ప్రజా సంగ్రామయాత్ర, బహిరంగ సభ విజయవంతం కావటంతో ఈసారి బీజేపీ గెలుస్తుందనే ధీమా ఆపార్టీ నేతల్లో కనిపిస్తుంది. బీసీలకు కేటాయించాలని ఆలోచిస్తే పార్టీ సీనియర్ నాయకుడు నాగూరావు నామాజీ, సత్యయాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ డీకే అరుణ ప్రభావం కూడ ఉండే అవకాశం ఉండటం కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. నియోజకవర్గం భౌగోళిక పరిస్థితులు: కర్ణాటక సరిహద్దులో ఉన్న నియోజకవర్గం నారాయణపేట 2019 లో నూతన జిల్లాగా ఏర్పడింది, నారాయణపేట నియోజకవర్గంలోని ధన్వాడ, మరికల్ మండలాల్లోని కొన్ని గ్రామాలు మక్తల్ నియోజకవర్గానికి వెళ్లాయి.నారాయణ చేనేత మరియు పట్టు చీరలకు ప్రసిద్ది,ఇక్కడి బంగారపు ఆభరణకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సాగునీరు లేకపోవటంతో వ్యవసాయభూముల బీళ్లుగా మారాయి.ఉపాధి లేక జనాలు ఇక్కడి నుంచి పెద్దమొత్తంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస పోతున్నారు. ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటి మున్సిపాలిటీ నారాయణపేటలో ఏర్పాటయ్యింది. -
తెలంగాణ పొలిటికల్ లీగ్
-
గెలిచే వరకు పోరాడత.. కర్ణాటక ఎన్నికల్లో ఆసక్తి రేపుతున్న స్వతంత్ర అభ్యర్థి
-
కాంగ్రెస్ గూటికి సునీల్ రెడ్డి, నర్సారెడ్డి
శాసనసభ ఎన్నికల కౌంట్‌డౌన్ నేపథ్యంలో రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలోనూ జోష్ రెట్టింపవుతోంది. ఇదిలా ఉండగా టిక్కెట్ల ఆశావహుల ప్రయత్నాలు సైతం ఊపందుకున్నాయి. నిజామాబాద్ నుంచి వయా హైదరాబాద్ మీదుగా ఢిల్లీ వరకు నాయకులు చక్కర్లు కొడుతున్నారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : వచ్చే నెల రెండోవారంలో రాష్ట్రంలో 50 నుంచి 55 వరకు అభ్యర్థులను మొదటి విడతగా ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో నిజామాబాద్ అర్బన్ నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్, బోధన్ నుంచి మాజీ మంత్రి ప్రొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి, కామారెడ్డి నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీ, జుక్కల్ నుంచి మాజీ ఎమ్మెల్యే గంగారాం పేర్లు ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోవైపు పార్టీలో చేరికలు షురూ అయ్యాయి. బాల్కొండ నియోజకవర్గానికి చెందిన ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే విషయం ఖరారైంది. సునీల్‌రెడ్డి ఈ నెల 26న ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో ఓ హోటల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే సునీల్‌రెడ్డి చేరిక ఖరారైంది. రేవంత్‌తో సమావేశం అనంతరం పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుతో సునీల్‌రెడ్డి సమావేశమయ్యారు. వారం రోజుల్లో సునీల్ పార్టీ కుండువా కప్పుకోనున్నారు. ఇందుకు ప్రొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వివిధ సర్వేల నేపథ్యంలో సునీల్‌రెడ్డికి టిక్కెట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు పీసీసీ వర్గాలు తెలిపాయి. గత ఎన్నికల్లో బీఎస్పీ తరుపున పోటీ చేసిన సునీల్‌రెడ్డికి 40 వేల పైగా ఓట్లు వచ్చాయి. అయితే బాల్కొండ నుంచి డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి సైతం టిక్కెట్టును ఆశిస్తుండడం గమనార్హం. ● మరోవైపు మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి పొంగులేటి బృందంతో కలిసి ఈ నెల 25న ఢిల్లీ వెళ్లారు. అక్కడే నర్సారెడ్డి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే నర్సారెడ్డికి మాత్రం టిక్కెట్టు విషయమై హామీ ఇవ్వకపోవడం గమనార్హం. గతంలో రేవంత్‌రెడ్డితో కలిసి నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే 2018లో నర్సారెడ్డి చివరి నిముషం వరకు ఎమ్మె ల్యే టిక్కెట్టు కోసం గట్టి ప్రయత్నాలు చేశారు. టిక్కెట్టు దక్కకపోవడంతో పార్టీ తరుపున ప్రచారానికి దూరంగా ఉన్నారు. శాసనసభ ఎన్నికలు అయ్యాక, పార్లమెంట్ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మళ్లీ ఇప్పుడు తాజాగా పొంగులేటి బృందంతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. కాగా కాంగ్రెస్‌లో చేరికకు ముందే గత మూడు నెలల నుంచే నర్సారెడ్డి నిజామాబాద్ రూరల్ టిక్కెట్టు కోసం రేవంత్‌రెడ్డిని అడుగుతున్నారు. ఈ క్రమంలో సునీల్ కనుగోలు బృందం సర్వేలో భూపతిరెడ్డి, కాట్పల్లి నగేష్‌రెడ్డి, తాహెర్‌బిన్ హందాన్లతో పాటు అరికెల నర్సారెడ్డి పేరును చేర్చా రు. అయితే విడతలవారీ సర్వేలో భూపతిరెడ్డికే అత్యధిక మంది మద్దతు ఉన్నట్లు తేలింది. నర్సారెడ్డి విషయంలో కేవలం మూడు శాతం మాత్రమే మొగ్గు ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ టిక్కెట్టును భూపతిరెడ్డికే కేటాయించనున్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఆర్మూర్, ఎల్లారెడ్డి, బాన్సువాడ టిక్కెట్ల విషయంలో పార్టీ నాయకత్వం ఒక స్పష్టతకు రాకపోవడంతో ఉత్కంఠ కలిగిస్తోంది. -
ఎమ్మెల్యేలకు టికెట్ టెన్షన్ !
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో గుబులు రేపుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ టికెట్ వస్తుందా? రాదా? అనే మీమాంసలో ఉన్నారు. తమకే టికెట్లు మళ్లీ వచ్చేలా ప్రజల్లో గ్రాఫ్ పెంచుకునే పనిలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ బీ ఫాం ఇస్తారా? లేక కొత్త వారిని ఎంపిక చేస్తారా? అనే చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. జిల్లాలో నాలుగు నియోజకవర్గాలైన మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ఖానాపూర్(జన్నారం) పరిధిలోని ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే. ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు రెండేసి, మూడేసి సార్లు గెలుపొందిన వారే. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ మాత్రమే తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు. ఈ క్రమంలో మళ్లీ ఈ నలుగురికే టికెట్లు ఇస్తారా? లేదా? అని ప్రతిపక్ష నాయకుల్లో చర్చ సాగుతోంది. వివాదాల్లో చిన్నయ్య.. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యక్తిగతంగా పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఎన్నికలకు ముందే ‘ఆరిజిన్ డెయిరీ’ వివాదం ఆయనను వెంటాడుతోంది. నియోజకవర్గంలో తన అనుచరుల భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, అభివృద్ధి పనుల్లో కమీషన్ల ఆరోపణలు వచ్చాయి. బెల్లంపల్లిలో జరిగిన ప్రగతి నివేదన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చిన్నయ్యపై ప్రశంసలు కురిపించారు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నారని కొనియాడారు. మళ్లీ గెలుపించుకోవాలని ఇక్కడి ప్రజలను కోరారు. ఈ మాటలతో మళ్లీ తనకే టికెట్ అని ఎమ్మెల్యే అనుచరులు నమ్ముతున్నారు. ఇక్కడ మార్పు ఉంటుందని, అనేక ఆరోపణల నేపథ్యంలో కొత్త వారికి అవకాశం ఉంటుందనే వాదనలు ఉన్నాయి. సుమన్‌కు కేసీఆర్ అండ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు సీఎం కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో మళ్లీ టికెట్ ఖాయమని అనుచరులు చెప్పుకుంటున్నారు. రూ.వందల కోట్ల నిధుల తెచ్చి చెన్నూరును తన అడ్డాగా మార్చుకుంటున్నారని, ఇక్కడి నుంచే పోటీ చేస్తారని, సీటు ఖాయమని అంటున్నారు. 2018ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలును కాదని ఎంపీగా ఉన్న సుమన్‌కు టికెట్ ఇచ్చారు. జిల్లాలో చెన్నూరు ఒక చోట మాత్రమే సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చారు. కింది స్థాయి నాయకుల్లో సుమన్‌పై వ్యక్తమవుతున్న అసంతృప్తి, టికెట్ కేటాయింపులో ప్రభావం చూపనుందా? అనేది తేలాల్సి ఉంది. ఇక ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌పై వ్యతిరేకత ఉండడంతో ఇక్కడ మార్పు ఉంటుందని బీఆర్ఎస్లోని ఓ వర్గం నాయకులే ప్రచారం చేస్తున్నారు. తమకే మళ్లీ అవకాశం వస్తుందని ఎమ్మెల్యే గట్టి నమ్మకంతో ఉన్నారు. జిల్లాలో ఒకరిద్దరి మార్పు? జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలపై ప్రజ ల్లో మద్దతు, వ్యతిరేకత, అవినీతి, అక్రమాల ఆరో పణలు, వ్యక్తిగత విమర్శలు టికెట్ల కేటాయింపులో ఎంతమేరకు ప్రభావం చూపుతాయన్నది కీలకంగా మారింది. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు జిల్లాలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి వరసగా రెండుసార్లు, అంతకుముందు కాంగ్రెస్ నుంచి గెలిచిన చరిత్ర ఉంది. ఆయనతోపాటు కొడుకు విజిత్‌రావు సైతం రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కింది స్థాయి నాయకులు కొందరు విజిత్‌రావును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నారు. విజిత్‌రావు గ్రామాల్లో పర్యటిస్తూ, పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల జరిగిన సీఎం సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే దివాకర్‌రావు గురించి ఎటువంటి ప్రస్తావన తీసుకు రాలేదు. సభ వేదికపై శాలువా కప్పేందుకు ప్రయత్నించగా వద్దని వారించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రత్యర్థులు పలు రకాలుగా ఈ వీడియోను ప్రచారం చేశారు. తాజా పరిస్థితుల్లో తండ్రి, కొడుకుల్లో ఎవరికి టికెట్? లేక మార్పు ఉంటుందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలపై నివేదికలు ఎమ్మెల్యేలకు ప్రజల్లో బలం, ఆర్థిక స్థితిగతులు, వీరిని కాదని కొత్త వారికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే కోణాల్లో సర్వేలు జరిగాయి. అదే సమయంలో మార్చే చోట పార్టీలో గెలిచే సత్తా ఉన్న నాయకులు ఉన్నారా? అని ఆరా తీసినట్లు సమాచారం. టికెట్లు ఇవ్వకపోతే ఎమ్మెల్యేలను ఎలా సంతృప్తి పరచాలి? ఎవరైనా పార్టీ మారేందుకు ప్రతిపక్షాలతో టచ్‌లో ఉంటున్నారా? అనే కోణాల్లో ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సిట్టింగ్ ఎమ్మెల్యేతోపాటు ఇంకో ముగ్గురు నాయకుల పేర్లతో సర్వేలు చేయించారు. ఇందులో ఇద్దరి పేర్లు మాత్రమే పాజిటివ్‌గా ఉన్నట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే మరోసారి నివేదికలు తెప్పించుకుని ఆయా నియోజకవర్గాల్లో ప్రతిపక్ష అభ్యర్థుల బలం, సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రాఫ్‌ను బట్టి టికెట్లు ఖరారు చేస్తారని సమాచారం. అప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ టెన్షన్ మాత్రం తప్పేలా లేదు.