బీజేడీ, బీజేపీ హోరాహోరీ
6 స్థానాలకు శనివారం పోలింగ్
బీజేపీ, అధికార బీజేడీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీ పోరు సాగుతున్న ఒడిశాలో ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుతోంది. 15 లోక్‌సభ, వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ఇప్పటికే ముగిసింది. చివరి దశలో భాగంగా మిగతా 6 లోక్‌సభ స్థానాలు, వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. వీటిలో 4 బీజేడీ, 2 బీజేపీ సిట్టింగ్ స్థానాలు. వాటిపై ఫోకస్...
జగత్‌సింగ్‌పూర్
ఇక్కడ రెండు దశాబ్దాలుగా బీజేడీ చక్రం తిప్పుతోంది. బీజేపీ ఖాతా తెరవలేదు. 2019లో భారీ మెజారిటీతో నెగ్గిన రాజశ్రీ మల్లిక్ బీజేడీ నుంచి, ఆయన చేతిలో ఓడిన బిబూ ప్రసాద్ తరాయ్ బీజేపీ నుంచి మళ్లీ బరిలో ఉన్నారు. తరాయ్ 2009లో ïసీపీఐ నుంచి, 2014లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశారు. ఆయన ఓటు బ్యాంకును చూసి బీజేపీ మరోసారి చాన్సిచి్చనట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి రవీంద్ర కుమార్ సేథీ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు బీజేడీలోకి చేరడం ఆ పారీ్టకి అనుకూలించే అంశం.
కేంద్రపర
ఇదీ బీజేడీ కంచుకోటే. ఈసారి మాత్రం బీజేపీ అనుకూల పవనాలు వీస్తున్నాయి. 2009, 2014ల్లో బీజేడీ నుంచి గెలిచిన బైజయంత్ పాండా గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగి బీజేడీ నేత, సినీ నటుడు అనుభవ్ మహంతి చేతిలో ఓటమి చవిచూశారు. ఒకప్పుడు సీఎం నవీన్ పట్నాయక్‌కు అత్యంత సన్నిహితుడైన బైజయంత్ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుని హోదాలో మరోసారి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ అనుభవ్ మహంతి కూడా బీజేపీలో చేరడంతో బీజేడీ సంకట స్థితిలో పడింది. అన్షుమన్ మహంతిని పోటీకి దింపింది.
మయూర్‌భంజ్
సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు స్థానంలో ఎమ్మెల్యే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సన్నిహితుడు నాబా చరణ్ మఝికి ఈసారి బీజేపీ టికెటిచ్చింది. ద్రౌపది ముర్ము 2009లో ఈ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఐదుసార్లు ఎమ్మెల్యే అయిన విద్యా శాఖ మంత్రి సుదమ్ మరాండీని బీజేడీ బరిలో దింపింది. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సోదరి అంజని సోరెన్ జేఎంఎం తరఫున పోటీలో ఉండటంతో త్రిముఖ పోటీ నెలకొంది.
భద్రక్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమల్ భద్రక్ లోక్‌సభ స్థానం పరిధిలోని చాంద్‌బలి అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్నారు. దాంతో భద్రక్‌లో గెలుపు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. బీజేపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి అరుణ్ చరణ్ సేథీ కుమారుడు అవిమన్యు సేథీ పోటీ చేస్తున్నారు. బీజేడీ నుంచి సిట్టింగ్ ఎంపీ మంజులతా మండల్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ అనంత ప్రసాద్ సేథీ బరిలో ఉన్నారు.
జజ్‌పూర్
బీజేడీ నుంచి సిట్టింగ్ ఎంపీ శరి్మష్ఠ సేథీ మళ్లీ బరిలో ఉన్నారు. రవీంద్ర నారాయణ బెహరాకు బీజేపీ టికెటిచి్చంది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ ఆంచల్ దాస్ పోటీ చేస్తున్నారు. ఆయన 1996లో ఇక్కడ జనతాదళ్ నుంచి గెలిచారు. గత ఐదేళ్లలో బీజేపీ ఓటు బ్యాంక్ బాగా పెరిగిందన్న ధీమా ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. అయితే పార్టీ అభ్యర్థి బెహరా స్థానికులకు పరిచయస్తుడే అయినా రాజకీయాలకు కొత్త.
బాలాసోర్
బీజేపీ సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి మళ్లీ బరిలో ఉన్నారు. బీజేడీ నుంచి మాజీ బీజేపీ నేత లేఖశ్రీ సమంత సింగార్ పోటీ చేస్తున్నారు. పార్టీని అస్తమానం విమర్శించే లేఖశ్రీకి టికెటివ్వడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. నిజానికి కందమాల్ నుంచి బీజేపీ తరఫున పోటీకి లేఖశ్రీ ఆసక్తి చూపారు. నీలగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని అధిష్టానం సూచించడంతో బీజేడీలో చేరారు. కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి శ్రీకాంత్ కుమార్ జెనా పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి మూడుసార్లు గెలిచిన కరబేల స్వైన్ స్వతంత్ర అభ్యర్థిగా రెండు పారీ్టలకూ సవాలు విసురుతున్నారు.
బరిలో కోటీశ్వరులు
ఒడిశాలో తుది విడత బరిలో ఉన్న 66 మంది అభ్యర్థుల్లో 20 మంది కోటీశ్వరులే. కేంద్రపర బీజేపీ అభ్యర్థి బైజయంత్ పాండాకు అత్యధికంగా రూ.148 కోట్లున్నాయి. తర్వాత స్వతంత్ర అభ్యర్థి శ్రీరామ్ పాండే రూ.18.23 కోట్లు, భద్రక్ బీజేపీ ఎంపీ మంజులత మండల్‌కు రూ.14.86 కోట్ల ఆస్తులున్నాయి. 15 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 10 మంది తీవ్ర కేసుల్లో నిందితులని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment