పోలింగ్ వేళ విశేషాలు! | Polling specials | Sakshi
Sakshi News home page

పోలింగ్ వేళ విశేషాలు!

Published Wed, Apr 30 2014 4:31 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

పోలింగ్ కేంద్రంలో గవర్నర్ నరసింహన్ దంపతులు - Sakshi

పోలింగ్ కేంద్రంలో గవర్నర్ నరసింహన్ దంపతులు

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఈ రోజు ఏడవ దశ  పోలింగ్ జరుగుతోంది. 7 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో  89 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో 17 లోక్సభ, 119 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా  మన రాష్ట్రంలో ఉదయం అనేక చోట్ల ఇవిఎంలు మోరాయించాయి. వాటిని దారిలో పెట్టడానికి ఎన్నిక సిబ్బంది నానా తంటాలు పడ్డారు.  కారణంగా చాలా చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.

ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు బారులుతీరిన వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.  భూపాలపల్లి, ములుగు, భద్రాచలంలలో మాత్రం సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. ఖానాపూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, మంథని, అచ్చంపేట, కొల్లాపూర్‌లో  సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్కు అనుమతిస్తారు.

* బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పోలింగ్ కేంద్రం ఎదుటే బీజేపీ ఎన్నికల గుర్తు  కమలాన్ని చూపుతూ మీడియా సమావేశంలో మాట్లాడారు. దాంతో నరేంద్ర మోడీ మీద ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 12 (1బి) సెక్షన్ కింద చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ సిఫార్సు చేసింది.

* ఖైరతాబాద్‌ ఎంఎస్‌ మక్తాలో  గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు  ఓటు హక్కు వినియోగించుకున్నారు.
* టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వేసి ఓటును చెల్లిని ఓటుగా పరిగణిస్తామని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్లాల్ చెప్పారు. ఓటు వేసిన తరువాత నిబంధనలకు విరుద్దంగా తాను బిజెకి ఓటు వేసినట్లు ఆయన చెప్పారు.
* జూబ్లీహిల్స్ క్లబ్ పోలింగ్ కేంద్రంలోకి వెళుతున్న కేంద్ర మంత్రి చిరంజీవికి లైన్లో నిలబడి ఓటు వేయమని చెప్పారు.
* జూబ్లీహిల్స్‌లో ఓటుహక్కు వినియోగించుకున్న జనసేన వ్యవస్థాపకుడు  పవన్‌కల్యాణ్‌
* సినీ ప్రముఖులు డి.రామానాయుడు, సురేష్‌బాబు, సి.నారాయణరెడ్డి ఫిల్మ్‌నగర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
* సినీ నటుడు బ్రహ్మానందం కుటుంబసభ్యుల ఓట్లు గల్లంతయ్యాయి. ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనాలని ఎన్నికల సంఘం తరపున బ్రహ్మానందం  ప్రచారం చేశారు.
* సూర్యాపేట సమీపంలో తగులబడిన కారులో రెండున్నర కోట్ల రూపాయల నగదు ఉంది. అందులో కొంత నగదు కూడా కాలిపోయింది.
* మెదక్‌ జిల్లా  గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌లో భారీగా ఓట్లను తొలగించారు.
*మహబూబ్‌నగర్‌ జిల్లా కేశంపేట మండలం దేవునిగుడి తండాలో పోలింగ్ అధికారి హుసలయ్యను పాముకాటు వేసింది.  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని పరిస్థితి విషమంగా ఉంది.
* కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల మండలం పెద్దూరూలో పోలీసుల లాఠీచార్జ్ - కమాన్ పూర్ మండలం బేగంపేటలో   పోలీసుల లాఠీచార్జ్
* నిజామాబాద్ జిల్లా  కామారెడ్డిలో  కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ
* హైదరాబాద్ చార్మినార్‌ వద్ద ఓ యువకుడు బురఖా వేసుకుని ఓటు వేసేందుకు యువకుడి యత్నించాడు.
* ఖమ్మం జిల్లా చర్ల మండలం ఉంజపల్లి పోలింగ్ కేంద్ర సమీపంలో మావోయిస్టులు భారీ మందుపాతర పేల్చారు.
*మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌లో టీఆర్ఎస్-టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
* మెదక్ జిల్లా పటాన్‌చెరువు మండలం చిత్కూల్‌లో సెలవు రోజున తెరిచిన జిటిఎన్  టెక్స్‌టైల్‌ కంపెనీని అధికారులు  సీజ్ చేశారు.

మొరాయించిన ఇవిఎంలు - పోలింగ్ ఆలస్యంగా ప్రారంభం
ఈ దిగువ తెలిపిన కేంద్రాలలో ఇవిఎంలు మొరాయించాయి.

* హైదరాబాద్ ఎల్బి నగర్  82/ఏ పోలింగ్ కేంద్రం - తుకారంగేటు 6వ బూత్‌- కూకట్‌పల్లిలో 46బూత్‌-ఖైరతాబాద్‌ ఆనంద్‌నగర్‌ 83 బూత్‌-హబ్సీగూడ పోలింగ్ బూత్‌ నెం 181  -కింగ్‌కోటి
* రంగారెడ్డి జిల్లా  ధారూర్‌ కుక్కింద - వికారాబాద్‌ ఆలంపల్లి -పెద్దేముల్‌ మండలం హనుమాపూర్‌-మంచాల మండలం ఆరుట్ల

*ఆదిలాబాద్ జిల్లా మందమర్రి రామకృష్ణాపూర్‌లోని 68, 69 పోలింగ్ కేంద్రాలు
* ఖమ్మం జిల్లా కొణిజర్ల పెద్దమునగాల -ఖమ్మం జిల్లా భద్రాచలం నన్నపనేని హైస్కూల్‌-పినపాక కరకగూడెం - అశ్వరావుపేట - దమ్మపేట-  ఏన్కూరు మండలం-
*మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌కర్నూల్‌లో 87, 88 పోలింగ్‌ కేంద్రాలు -వీపనగండ్లలో 148 బూత్ -పెద్దకొత్తపల్లి మండలం కల్వకొల్లులో 47బూత్‌ - పెబ్బేరు మండలం శ్రీరంగపూర్‌
* మెదక్‌ జిల్లా  మెదక్‌లోని 104 పోలింగ్‌ కేంద్రం - చినమండవ, మక్కేపల్లి -మంగల్‌పేటలోలోని 141బూత్‌-
* నల్లగొండ జిల్లా నాంపల్లి 247 పోలింగ్‌ బూత్ - నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీ - పెన్‌పహాడ్‌ మండలం చీవెళ్ల - మునగాల - చిలుకూరు - నకిరేకల్‌ బూత్‌నెం.1 -నకిరేకల్ మండలం చిత్తలూరు-
* వరంగల్‌ జిల్లా భూపాలపల్లి మండలం నాగారం- రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపురం-
* కరీంనగర్ జిల్లా  సిరిసిల్ల 123 పోలింగ్ కేంద్రం - మల్యాల  4 పోలింగ్ కేంద్రం - ముస్తాబాద్ 208 పోలింగ్ -

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement