మా స్వయంకృతాపరాధమే | we are responsible for this | Sakshi
Sakshi News home page

మా స్వయంకృతాపరాధమే

Published Mon, May 19 2014 2:47 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM

మా స్వయంకృతాపరాధమే - Sakshi

మా స్వయంకృతాపరాధమే

 దేవరకొండ, న్యూస్‌లైన్: ‘నిజాలను చెప్పలేకపోయాం.. అబద్దాలను ఆడలేకపోయాం.. ఆచరణ సాధ్యం కాని హామీలను ఇవ్వలేకపోయాం.. ప్రజలను మోసగించలేకపోయాం.. అందుకే ఓటమి పాలయ్యాం.. ఇది మా స్వయంకృతాపరాధమే..’ అని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం దేవరకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

నిరంతరం తెలంగాణ సాధన కోసం కష్టించి పని చేసిన సహచర పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రులను ప్రజలు న్యాయంగా గెలిపించాల్సి ఉందని అన్నారు. కానీ, ప్రజల తీర్పును గౌరవించాలని, తన గెలుపు సంతోషకరమే అయినా మిత్రుల ఓటమి బాధ కలిగిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, జాతీయ ఉపాధి హామీ, ఆహార భద్రత చట్టం, భూపంపిణీ, నిర్బంధ విద్యా చట్టం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు.
 
  తనను అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎప్పుడూ ప్రజలకు సేవకుడిగా ఉంటానన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు ఆలంపల్లి నర్సింహ్మ, ఆ పార్టీ నగర అధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, పార్టీ దేవరకొండ మండల అధ్యక్షుడు మేకల శ్రీను, చం దంపేట మండల అధ్యక్షుడు గోవిందు, పార్టీ నాయకులు గిరిశేఖర్, జావీద్, ఇద్రిస్, ఆప్కో సత్తయ్య, సైదులు, దేవేందర్, మంజ్యనాయక్, బిక్కునాయక్ తదితరులు  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement