కరీంనగర్: కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కొత్త ఉత్సాహంతో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఈసారి సానుకూల పవనాలు వీస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఇటీవల బీఆర్‌ఎస్ ప్రకటించిన దరిమిలా.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం మొదలైంది. దీంతో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా బరిలో నిలిచే అభ్యర్థుల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది.
పాత కరీంనగర్ జిల్లాలో ఈసారి ఎలాగైనా కనీసం ఆరు స్థానాలు సాధించాలన్న వ్యూహంతో మెరికల్లాంటి అభ్యర్థులను రంగంలోకి దింపే పనిలో ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత, సీని యర్లపై సానుభూతి, కొత్తగా పార్టీలోకి చేరుతున్న నాయకగణం తదితర కారణాలు ఈసారి జిల్లాలో తమకు గౌరవప్రదమైన సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలి పిస్తాయని అధిష్టానం బలంగా నమ్ముతోంది. ఉమ్మ డి జిల్లాలో మొత్తం 13 అసెంబ్లీ స్థానాల్లో తమకు ఎంతలేదన్నా.. కనీసం ఆరేడుకు తగ్గకుండా గెలిచి తీరుతామన్న ధీమాతో కాంగ్రెస్ ముందుకెళ్తోంది.
ఈ స్థానాలు కీలకం..!
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు, థర్డ్ పార్టీ సర్వేల అనంతరం పెద్దపల్లి(విజయరమణారావు), మంథని(దుద్దిళ్ల శ్రీధర్‌బాబు), రామగుండం(రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్), ధర్మపురి(అడ్లూరి లక్ష్మణ్), వేములవాడ(ఆది శ్రీనివాస్), హుస్నాబాద్(పొన్నం ప్రభాకర్),జగిత్యాల(జీవన్‌రెడ్డి) స్థానాల్లో తమ అభ్యర్థులు బలంగా ఉన్నారని, అధికార బీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇ స్తారని కాంగ్రెస్ ధీమాగా ఉంది.
చొప్పదండి(మేడిపల్లి సత్యం), మానకొండూరు(కవ్వ ంపల్లి సత్యనారా యణ), సిరిసిల్ల (కేకే మహేందర్‌రెడ్డి), కోరుట్ల(జువ్వాడి న ర్సింగరావు) కూడా ఈ సారి తమ కు స్థానికంగా సానుకూల పరిస్థితులు ఉన్నాయని నమ్ముతున్నా రు. హుజూరాబాద్ నుంచి మరోసారి బల్మూరి వెంకట్ బరిలోకి దిగనున్నారన్న ప్రచారం నడుస్తోంది. అన్నింటికంటే చివరిగా కరీంనగర్ స్థానంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఈ స్థానానికి పార్టీలో తీవ్రపోటీ నెలకొంది. మాజీ మంత్రి ఎమ్మెస్సార్ మనవడు మేనేని రోహిత్, పొ న్నం ప్రభాకర్ మధ్య పోటీ ఉన్నా.. పొన్నం హుస్నాబాద్‌కు వలస వెళ్లడంతో రోహిత్‌కు దాదాపుగా రూట్ క్లియర్ అయింది. అదేసమయంలో మైత్రీ గ్రూప్స్ అధినేత కొత్త జయపాల్‌రెడ్డి పార్టీలో చేరడంతో మరో ఆశావహుడు పెరిగినట్లయింది. దరఖాస్తుల పరంగా చూసినా.. కరీంనగర్‌కు ఆశావహుల జాబితా చాంతాడంత ఉంది, తర్వాత స్థానంలో కోరుట్లకు పోటీ ఉంది.
కాంగ్రెస్ గూటికి మాజీ ఎంపీ వివేక్!?
పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యుడు గడ్డం వివేక్ వెంకటస్వామి మరోసారి పార్టీ మారనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఈనెల 30వ తేదీ తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. కేంద్ర మాజీమంత్రి జి.వెంకటస్వామి రాజకీయ వారసుడిగా 2009లో పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. 2014లో కాంగ్రెస్ నుంచి ఓడాక బీఆర్‌ఎస్‌లో చేరి ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు.
2018 ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఓటమి కోసం ప్రయత్నించారన్న విమర్శలతో పార్టీ ఆయనను పక్కనబెట్టింది. అప్పటినుంచి ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు. ఐదేళ్లుగా జాతీయ పార్టీలో పనిచేసినా సరైన ప్రాధాన్యం దక్కలేదన్న ఆవేదనతో తిరిగి మాతృపార్టీ కాంగ్రెస్‌కు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పార్టీలో హస్తం పార్టీ నుంచి ఆయనకు గ్రీన్‌సిగ్నల్ వచ్చిందని, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి సీటు ఇస్తామన్న హామీతో ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నారని తెలిసింది. అంగబలం, అర్థబలం దండిగా ఉన్న వివేక్ పార్టీలో చేరితే.. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని అన్నిస్థానాల అభ్యర్థులకు అండగా నిలుస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment