Vivek VenkataSwamy
-
ఈడీ ఎదుట హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్
సాక్షి, హైదరాబాద్: చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గురువారం కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. ఎన్నికల ముందు హైదరాబాద్‌లో నమోదైన హవాలా, ఫెమా కేసుకు సంబంధించి ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో పెద్ద ఎత్తున నిధుల డిపాజిట్ల పై కేసు నమోదైన విషయం తెలిసిందే. విశాఖ ఇండస్ట్రీ నుంచి ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో రూ.8 కోట్ల పైచిలుకు నిధుల లవాదేవీలపై ఎన్నికల ముందు హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ ఇండస్ట్రీస్, ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ మధ్య జరిగిన రూ.100 కోట్ల లావాదేవీల వ్యవహారంలో మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. అలాగే డిపాజిట్లకు సంబంధించి ఈడీ ఆరా తీస్తోంది. దీనిపై ఇవాళ వివేక్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాగా గత ఏడాది నవంబర్‌లో విశాక సంస్థల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ బోగస్ సంస్థ అని గుర్తించి, రూ.కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. -
తిరుమలలో ఎమ్మెల్యే వివేక్.. సింగరేణిపై కీలక వ్యాఖ్యలు
సాక్షి, తిరుమల: చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తిరుమల పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా శనివారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని వివేక్ దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని వివేక్ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం, వివేక్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో నియంతృత్వ పాలన అంతమైంది. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజా ప్రభుత్వం వచ్చింది. సింగరేణిలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. మిషన్ భగీరథ ఫెయిల్ అయింది, ఎక్కడా మంచి నీరు రావడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపు బాధితులకు న్యాయం చేస్తాం. పది సంవత్సరాలలో ప్రజాధనం దుర్వినియోగంపై శ్వేతపత్రం తీసుకురావాల్సి ఉంది. అవినీతి సొమ్ముతో ఇతర రాష్ట్రాలలో రాజకీయాలకు దుర్వినియోగం చేశారు. ధరణి పోర్టల్‌తో కల్వకుంట్ల కుటుంబం భూ దందాకు పాల్పడింది.రాష్ట్రంలో దోపిడిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించడం జరిగింది అని కామెంట్స్ చేశారు. -
ఐటీ దాడులు దడ పుట్టించాయా?.. విజయానికి బాటలు వేశాయా?
ఎన్నికల సమయాన ఐటీ, ఈడీ దాడులు మామూలే. ఇటువంటివన్నీ రాజకీయ ప్రేరేపిత దాడులే అన్నది ప్రతిపక్షాల మాట. ఈ దాడులన్నీ ప్రతిపక్షాల నేతలపైనే జరుగుతున్నాయని వారి వాదన. మరి చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిపై జరిగిన ఐటీ దాడి ఆయనకు దడ పుట్టించిందా? లేదంటే దాడి రివర్సైందా? అభ్యర్థికి దడ పుట్టించాల్సిన ఐటీ దాడులు ఆయన విజయానికి బాటలు వేశాయా? కేంద్ర సంస్థల దాడులు వివేక్ మీద సానుభూతి పెంచాయా? ప్రజల్లో పలుచన చేశాయా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరులో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పోటీ చేస్తున్నారు. ఎన్నికల బరిలో ఉన్న ఆయన ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. వివేక్‌కు హైదారాబాద్ లోని ఇల్లు, మంచిర్యాలలో ఆయన ఇంటిపై ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం నాడు తెల్లవారుఝాము నుంచి రోజంతా ఐటీ అధికారుల సోదాలు జరిగాయి. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి వివేక్ అనుచరులు నగదు పంచుతున్నారని... ఆయన ఇళ్లలో భారీ ఎత్తున నగదు నిల్వలు ఉన్నాయనే అనుమానంతో పదిహేను మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. వివేక్ వెంకటస్వామికి వివిధ కంపెనీల నుండి నగదు వచ్చిందన్న సమాచారంతో వచ్చిన అధికారులు ఆ లావాదేవీలపై సోదాలు జరిపారు. ఐటీ దాడుల వెనుక కుట్ర ఉందని కాంగ్రెస్ నాయకుడు వివేక్ వెంకటస్వామి ఆరోపిస్తున్నారు. తాను చెన్నూర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ప్రజల్లో రోజు రోజుకూ ఆదరణ పెరుగుతుండటంతో తట్టుకోలేక ఈ దాడులు జరిగాయని ఆయన అంటున్నారు. తనపై బీఆర్ఎస్ తరపున బరిలో ఉన్న బాల్క సుమన్ కుట్రతోనే కేంద్ర సంస్థలతో దాడులు చేయించారని వివేక్ ఆరోపించారు. తనను ప్రజల్లో పలుచన చేయాలనే కుట్రతోనే, తనను ఇబ్బంది పెట్టడానికే ఇదంతా చేస్తున్నారని అన్నారు. మేము తప్పుడు మార్గాలలో ధనాన్ని తరలించలేదన్నారు. సుమన్ తప్పుడు ఫిర్యాదుతోనే ఇదంతా జరిగిందన్నారు. ఈ దాడుల వెనుక బిజెపి బిఅర్ఎస్ పార్టీల హస్తం ఉందన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై కేంద్రానికి ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని..ఐటీ దాడులతో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని మరోసారి రుజువు చేసుకున్నారని కామెంట్ చేశారు వివేక్. ఆదాయప్ను ఆధికారులు దాడులు నిర్వహిస్తున్న ఇంటి దగ్గర..చెన్నూరులోనూ కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. గులాబీ పార్టీ అభ్యర్థి బాల్క సుమన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఐటీ దాడులు వివేక్ వెంకటస్వామిపై ప్రజల్లో సానుభూతి పెంచిందనే చర్చ చెన్నూరు నియోజకవర్గంలో సాగుతోంది. ప్రజల్లో వివేక్‌పై ఏర్పడ్డ సానుభూతి, పెరిగిన ఆదరణ ఆయనకు ఓట్ల వర్షాన్ని పెంచుతుందని కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. ఇక ఆయన విజయానికి ఢోకా లేదని భావిస్తున్నారు. అయితే వివేక్ ఇంటిపై ఐటీ దాడులు జరగడంలో సుమన్ హస్తం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిచింది. తమ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నవారికి ప్రజలే బుద్ధి చెబుతారని అంటున్నారు. ఎన్నికల్లో ఎవరి వ్యూహాలు వారికుంటాయి. కొన్నిసార్లు కొన్ని వ్యూహాలు బెడిసికొడుతుంటాయి. కొన్ని విజయవంతమవుతాయి. మరి కాంగ్రెస్ చెన్నూరు అభ్యర్థి వివేక్ ఇంటిపై జరిగిన ఐటీ దాడుల్లో అసలు నిజాలు ఎలా ఉన్నా... వీటి వల్ల కాంగ్రెస్ అభ్యర్థికి మేలు జరుగుతుందా? ఇబ్బంది కలుగుతుందా అనేది ఫలితాల రోజే తెలుస్తుంది. -
నా పై ఐటీ దాడులు వారి కుట్రే : వివేక్
సాక్షి, మంచిర్యాల : ఎన్నికల్లో గెలవలేకే తనపై ఐటీ దాడులు చేయిస్తున్నారని మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. బీఆర్ఎస్ చెన్నూరు అభ్యర్థి బాల్క సుమన్ ఫిర్యాదు చేయడం వల్లే ఐటీ దాడులు జరిగాయని తెలిపారు. మంచిర్యాలలోని వివేక్ ఇంట్లో మంగళవారం ఉదయం ప్రారంభమైన ఐటీ సోదాలు పదిగంటలకుపైగా జరిగి సాయంత్రం ముగిశాయి. అనంతరం బయటకు వచ్చి కార్యకర్తలకు అభివాదం చేసిన వివేక్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసిన కేసీఆర్‌పై ఐటీ దాడులు జరిపే దమ్ము లేదు కానీ తనపై మాత్రం చేశారని ఫైరయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తన మీద కుట్ర చేశాయని, తనపై ఎన్ని దాడులు చేసినా ఏం కాదన్నారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80 సీట్లు గెలవబోతోందని, చెన్నూరు నుంచి తాను గెలవబోతున్నానని వివేక్ తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి తన ఇంట్లో ఐటీ దాడులు చేశారని ఆరోపించారు. ఇటీవలే విశాఖ ఇండస్ట్రీస్ కంపెనీ ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో జమైన నగదు గురించి ఐటీ అధికారులు ఈ సోదాల్లో వివేక్‌ను ఆరా తీసినట్లు సమాచారం. కాగా, సోమాజీగూడలోని వివేక్ నివాసంలో ఐటీ సోదాలు ఉదయమే ముగిశాయి. నాలుగున్నర గంటలపాటు తనిఖీలు నిర్వహించారు. ఇటీవలే వివేక్ వెంకటస్వామి బీజేపీని వీడి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత వెంటనే ఆయనకు చెన్నూరు నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వీడిన కొద్ది రోజులకే ఆయనపై ఐటీ దాడులు జరగడం ఆయన అనుచరులను కలవరానికి గురి చేస్తోంది. తెలంగాణలో పవర్లో ఉన్న బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేయకుండా కాంగ్రెస్ నేతలపైనే ఐటీ దాడులు జరుగుతుండడాన్ని కాంగ్రెస్ నేతలు రాజకీయంగా అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఐటీ సోదాలు ముగిసిన వెంటనే వివేక్ కూడా ఇదే రకమైన స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం. బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి కుట్ర చేసి తనపై ఐటీ దాడులు చేయించాయని ఆరోపించారు. ఇదీచదవండి.. కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇంట్లో ఐటీ సోదాలు -
కన్ఫ్యూజ్ చేస్తున్న వివేక్..విజయం కలేనా..?
సాక్షి,మంచిర్యాల: నాయకులు పార్టీ మారడం సాధారణంగా జరిగేదే. ఓ నేత పార్టీలు మారుతూ జనాన్ని కన్ఫ్యూజ్లోకి నెట్టేస్తుంటారు. అందుకే ఆయన తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో విజయాన్ని చూడలేదు. తాజాగా మరోసారి పార్టీ మారారు. ఈసారి తనకొడుకును బరిలో దించేందుకు సిద్ధమవుతున్నారని టాక్. గతంలో తండ్రిని ఓడించిన అధికార పార్టీ నాయకుడు ఈసారి ఆయన తనయుడిని కూడా ఓడిస్తానంటున్నారు. ఇంతకీ అధికార, ప్రతిపక్షాలకు చెందిన ఆ నాయకులెవరో చూద్దాం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నుంచి గులాబీ పార్టీలో పేరు తెచ్చుకున్న బాల్క సుమన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు నుంచి అసెంబ్లీ బరిలో దిగుతున్నారు. విద్యార్థి నేతగా ఉద్యమంలో చురుగ్గా ఉన్నకాలంలోనే రాష్ట్రం ఏర్పాటైనపుడు 2014లో పెద్దపల్లి నుంచి గులాబీ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో చెన్నూరు నుంచీ అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు కూడా చెన్నూరు నుంచే పోటీ చేస్తున్నారు సుమన్. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ గడ్డం వివేక్ కుమారుడు వంశీకృష్ణకు ఈసారి చెన్నూరు అసెంబ్లీ టిక్కెట్ ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది. నిన్నటి వరకు బీజేపీలో ఉన్న వివేక్ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరారు. ఈసారి అసెంబ్లీ బరిలో వివేక్ నిలబడకుండా ఆయన తనయుడు వంశీతో రాజకీయం అరంగేట్రం చేయిస్తారని తెలుస్తోంది. వ్యాపారరంగంలో ఎన్నో విజయాలు సాధిస్తున్న గడ్డం వివేక్..రాజకీయాల్లో తత్తరపాటు నిర్ణయాలతో ఓటమిపాలవుతున్నారనే టాక్ నడుస్తోంది. తండ్రి కాలం నుంచి కాంగ్రెస్‌తోనే ఉన్న వివేక్ 2009లో ఎంపీగా ఒకసారి విజయం సాధించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు పోరాటం జరుపుతున్నా తెలంగాణ ఇవ్వడంలేదని కాంగ్రెస్ మీద కోపం వచ్చి ఆనాడు గులాబీ పార్టీలో చేరారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రకటించాక కృతజ్ఞతతో మళ్ళీ కాంగ్రెస్‌లో చేరారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ తరపున ఎంపీ సీటుకు పోటీ చేసి బాల్క సుమన్ మీద ఓడిపోయారు. కేసీఆర్ సీఎం అయ్యాక 2016లో మరోసారి గులాబీ కండువా కప్పుకున్నారు. సీఎం కేసీఆర్ ఆయనకు ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. కాని.. గత ఎన్నికల్లో కేసీఆర్ సీటు ఇవ్వనందుకు కోపం వచ్చి బీజేపీలో చేరారు. ఇప్పుడు ఎన్నికల టైమ్‌లో బీజేపీకి రాజీనామా చేసి మరోసారి సొంతగూటికి చేరుకున్నారు గడ్డం వివేక్. లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి పెద్దపల్లి నుంచే బరిలోకి దిగాలనుకుంటున్న గడ్డం వివేక్...అసెంబ్లీ ఎన్నికల్లో తనయుడు వంశీకృష్ణకు టిక్కెట్ ఇప్పించుకునేందుకు కాంగ్రెస్‌లో చేరినట్లు తెలుస్తోంది. గతంలో ఎంపీ ఎన్నికల్లో తనను ఓడించిన బాల్క సుమన్ మీద చెన్నూరులో పోటీ చేయడానికి తనయుడిని సిద్ధం చేస్తున్నారట వివేక్. తండ్రిని ఓడించిన సుమన్‌ను ఓడించి అసెంబ్లీలో ప్రవేశించడానికి వివేక్ తనయుడు వంశీకృష్ణ రెడీ అవుతున్నారని టాక్. అయతే గతంలో ఒకసారి తండ్రిని ఓడించి ఎంపీగా గెలిచాను...ఈసారి కొడుకును ఓడించి రెండోసారి ఎమ్మెల్యే అవుతానంటున్నారు గులాబీ పార్టీ అభ్యర్థి బాల్క సుమన్. తండ్రీ, తనయులను ఓడించి చరిత్ర కెక్కుతానంటున్నారు బాల్కసుమన్. ఎన్నికల వేళ రాజకీయాల్లో కోలాహలం మామూలే. రాత్రి ఒక పార్టీ.. ఉదయం మరోపార్టీ మారే నాయకులు మనకు అనేకమంది కనిపిస్తారు. ఒక రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలూ మారే నేతల్ని మనం చూస్తున్నాం. గడ్డం వివేక్ ఈసారైనా ఆయన తీసుకున్న నిర్ణయం సరైందే అని భావిస్తున్నారా? వివేక్ నిర్ణయం కరెక్టా? కాదా అన్నది చెన్నూరు ప్రజలే తేలుస్తారు. -
కాంగ్రెస్‌లోకి వివేక్... బీజేపీకి గుడ్ బై
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీకి బరు వైన హృదయంతో రాజీనామా చేస్తున్నట్టు, పార్టీలో ఉన్నప్పుడు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డికి రాజీనామా లేఖ పంపించారు. బుధవారం నోవాటెల్ హోటల్లో వివేక్, ఆయన కుమారుడు వంశీకృష్ణకు కండువా కప్పి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు ఉదయం తన కుటుంబసభ్యులతో హోటల్‌కు చేరుకున్న వివేక్.. రాహుల్‌గాం«దీతో సమావేశమయ్యారు. ఆ తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఆయన వెంట ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నారు. కాంగ్రెస్‌లో చేరాలంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆహ్వానించడంతో అందుకు అంగీకారం తెలిపినట్లు వివేక్ చెప్పారు. కాగా పలు దఫాలుగా వివేక్‌తో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి. సీఎల్పినేత భట్టి విక్రమార్క చర్చలు జరిపిన దరిమిలా ఈ కీలక పరిణామం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. వివేక్‌కు, ఆయన కుమారుడు వంశీకృష్టకు కాంగ్రెస్ పార్టీ ఒక అసెంబ్లీ టికెట్, ఒక లోక్‌సభ సీటు కేటాయించను న్నట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి వివేక్ నిలబడే అవకాశముందని, పెద్దపల్లి లోక్‌సభ స్థానాన్ని ఆయన కుమారుడికి కేటాయించే విషయంపై అంగీకారం కుదిరిందని కాంగ్రెస్ వర్గాల సమాచారం. కేసీఆర్ కుటుంబపాలన అంతం చేయాలనే లక్ష్యంతోనే చేరా: వివేక్ వెంకటస్వామి తెలంగాణలో కేసీఆర్ కుటుంబపాలన, బీఆర్ఎస్ రాక్షస పాలన అంతం చేయాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వివేక్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో చేరాక ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కేసీఆర్‌ను తప్పక గద్దె దించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. తెలంగాణ సాధనలో అప్పటి ఎంపీల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు.ఎన్నికల్లో పోటీ, టికెట్ కేటాయింపు వంటివి అంత ముఖ్యమైనవి కాదన్నారు. తన రాజకీయ భవిష్యత్, చేపట్టే కార్యాచరణను కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయిస్తుందని వివేక్ చెప్పారు. వివేక్ చేరిక బలాన్నిస్తుంది: రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కావాలి.. కాంగ్రెస్ రావాలి అనే ప్రజల ఆకాంక్షకు వివేక్ చేరిక బలాన్నిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు తెలంగాణ కోసం పోరాడిన ఎంపీల బృందం తిరిగి కాంగ్రెస్‌లో చేరడం శుభసూచకమన్నారు. తెలంగాణలో అధికారమార్పిడి జరగబోతోందని చెప్పారు. శంషాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ను గద్దె దింపే శక్తి కాంగ్రెస్‌కు ఉందని వివేక్ విశ్వసిస్తున్నారని తెలిపారు. ‘గాంధీ కుటుంబంతో వివేక్ కు ఎంతో అనుబంధం ఉంది. వివేక్ తో రాహుల్ గాంధీ ఫోన్ లో మాట్లాడి కాంగ్రెస్ లో చేరాలని కోరారు. వివేక్ తిరిగి కాంగ్రెస్ లో చేరడమంటే ఆయన సొంత కుటుంబంలో చేరినట్లే. ఆయన్ను కాంగ్రెస్‌లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నా. వారి చేరిక కాంగ్రెస్‌కు వెయ్యేనుగుల బలాన్ని చేకూర్చింది’అని వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్ లోకి మాజీ ఎంపీ వివేక్
-
బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి.. క్లారిటీ ఇచ్చిన వివేక్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అసంతృప్త నేతలు పలువురు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో వారిలో కొందరి స్పందన తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రయత్నించింది. తాను బీఆర్ఎస్లో చేరబోతున్నట్టు కొన్ని రోజులు ప్రచారం చేశారని, ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరుతున్నట్టుగా చెబుతున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు డా.జి.వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యానించారు. తాను పార్టీ మారబోవడం లేదని చెప్పారు. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కలిశానని, మంగళవారం నిజామాబాద్ సభ అప్పుడు మాత్రం.. తమ అంబేడ్కర్ కాలేజీ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ముఖ్యఅతిథి ఖరారు కోసం ఢిల్లీలో ఉన్నానని తెలిపారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా చెప్పారు. బీజేపీ నేతలను చేర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నామంటూ ప్రచారం చేసుకోవడం ద్వారా తమ బలహీనతలను కాంగ్రెస్ నేతలు బయట పెట్టుకుంటున్నారని విమర్శించారు. మరికొంతమంది ఈ జాబితాలో మాజీ ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డితో సహా దాదాపు 20 మంది నాయకులున్నారని చెబుతున్నాయి. జిట్టా బాలకృష్ణారెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి లాంటి కొందరు నేతలు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరగా, బీజేపీ కుంభస్థలాన్ని కొట్టామనే భావన కలిగించే స్థాయి నేతలను సైతం పార్టీలోకి రప్పించేందుకు కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. విజయశాంతి, ఏనుగు రవీందర్‌రెడ్డిలను ఫోన్లో సంప్రదించేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా వారు స్పందించలేదు. తర్జనభర్జన! కాంగ్రెస్ వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఆ పార్టీలోకి వెళ్లాలా? లేక బీజేపీలోనే ఉండాలా? అన్నదానిపై అసంతృప్త నేతలు తర్జనభర్జన పడుతుండటమే వారి స్పష్టమైన వైఖరి తీసుకోకపోవడానికి కారణంగా తెలుస్తోంది. -
కమలంలో కలకలం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. మరో రెండు వారాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడొవచ్చనే అంచనాల నేపథ్యంలో...పార్టీలో ఏర్పడుతున్న పరిస్థితులు కమలనాథుల్లో కలవరం పుట్టిస్తున్నాయి. ఇటీవల జాతీయ కార్యవర్గసభ్యుడు, మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి నివాసంలో పలువురు అసంతృప్త నేతలు భేటీ అయ్యారు. ఇతర జాతీయ కార్యవర్గసభ్యులు విజయశాంతి, గరికపాటి మోహన్‌రావుతో పాటు మాజీ ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చాడ సురేష్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జి.విజయరామారావు, ఎం.రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి పాల్గొన్న ఈ సమావేశం పార్టీలో కలకలం సృష్టించింది. పార్టీలో తమకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని భావిస్తున్న ఈ నేతలంతా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి గుడ్‌బై చెప్పే అవకాశం ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ఉన్న సీనియర్ నేత, నగర పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ బి.వెంకటరెడ్డి, ఆయన భార్య బాగ్‌అంబర్‌పేట కార్పొరేటర్ పద్మలు.. తాము పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసినా, తగిన గుర్తింపు లేదని పేర్కొంటూ బీజేపీకి రాజీనామా చేశారు. సుదీర్ఘకాలంగా పార్టీలో ఉన్నందున తమకు అంబర్‌పేట అసెంబ్లీ టికెట్ కేటాయించాలని కోరితే నాయకత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వెంకటరెడ్డి ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల భేటీ అయిన నేతల అసంతృప్తికి కారణాలు తెలుసుకుని వారిని బుజ్జగించే బాధ్యతను రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్‌కు నాయకత్వం అప్పగించినట్టు పార్టీవర్గాల సమాచారం. మాకేదీ గుర్తింపు..? రాష్ట్ర పార్టీలో ముఖ్య నేతలుగా, జాతీయ కార్యవర్గ సభ్యులు, సీనియర్లుగా ఉన్నా తమకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత లభించడం లేదనేది అసంతృప్త నేతల ప్రధాన ఫిర్యాదుగా ఉన్నట్టు సమాచారం. అలాగే పార్టీ తీరు, నాయకత్వం వ్యవహారశైలి పైనా వారు ఆగ్రహంతో ఉన్నారని, అధిష్టానం వైఖరి, ముఖ్యంగా పార్టీ అగ్రనేత అమిత్ షా అనుసరిస్తున్న తీరు సైతం సమావేశంలో చర్చకు వచ్చినట్టు చెబుతున్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా.. కేవలం రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్లతోనే అమిత్ షా సమావేశం కావడం, తమను దూరం పెట్టడంపై వీరంతా కినుక వహించినట్టు తెలుస్తోంది. మోదీ, అమిత్‌షా, నడ్డాలు రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు సైతం ఆయనకే గుర్తింపునివ్వడం, వేదికపైనా తమ పక్కన అవకాశం కలి్పంచడం వంటి వాటిపై కొందరు నేతలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఈటల తీరుపై అసహనం! గతంలో పార్టీ చేరికల కమిటీ చైర్మన్‌గా, ఇప్పుడు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల వ్యవహరిస్తున్న తీరుపై పలువురు నేతలు అసహనంతో ఉన్నట్టు చెబుతున్నారు. తమకు తెలియకుండా, కనీసం సంప్రదించకుండా తమ ప్రాబల్య ప్రాంతాలు, నియోజకవర్గాల్లో చేరికలను ఈటల ప్రోత్సహించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల తమను సంప్రదించకుండా సంగారెడ్డి, ములుగు జిల్లాల్లో కొందరిని చేర్చుకోవడంపై వారు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. వారు నిత్య అసంతృప్త వాదులే..! మరోవైపు అసంతృప్త నేతల తీరుపై ఇతర నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వీరు నిత్య అసంతృప్తులంటూ మండిపడుతున్నారు. తాము అనుకున్న స్థాయిలో సమన్వయంతో పని చేయడం లేదని, ఇలాగైతే తామే ఢిల్లీ నుంచి ఎన్నికల కార్యాచరణను అమలు చేయాల్సి ఉంటుందంటూ క్లాస్ తీసుకునేందుకే.. కిషన్‌రెడ్డి, సంజయ్, ఈటలతో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయ్యారని వారు వివరిస్తున్నారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను కూడా అమిత్‌షా పిలవలేదంటూ వారు గుర్తు చేస్తున్నారు. అధినేతల తీరుతో తప్పుడు సంకేతాలు! కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భారీ అవినీతి జరిగిందని, ఇది కేసీఆర్ సర్కార్‌కు, బీఆర్ఎస్కు ఏటీఎంగా మారిందంటూ విమర్శలు గుప్పించిన అమిత్ షా, నడ్డాలు.. ఇదిగో విచారణ, అదిగో విచారణ అంటూ తాత్సారం చేయడమే తప్ప ఎలాంటి చర్య తీసుకోకపోవడం, ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇంకా అరెస్టు చేయకపోవడం వంటివి ప్రజల్లో తప్పుడు సంకేతాలకు కారణమౌతున్నాయని అసంతృప్త నేతలు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. కీలక ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని జరుగుతున్న ప్రచారాన్ని ఈ కారణంగా గట్టిగా తిప్పికొట్టలేకపోతున్నామని వారు పేర్కొంటున్నట్లు సమాచారం. -
TS Election 2023: ఉమ్మడి జిల్లాలో సత్తా చాటేందుకు కాంగ్రెస్ వ్యూహం!
కరీంనగర్: కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కొత్త ఉత్సాహంతో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఈసారి సానుకూల పవనాలు వీస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఇటీవల బీఆర్ఎస్ ప్రకటించిన దరిమిలా.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం మొదలైంది. దీంతో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా బరిలో నిలిచే అభ్యర్థుల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. పాత కరీంనగర్ జిల్లాలో ఈసారి ఎలాగైనా కనీసం ఆరు స్థానాలు సాధించాలన్న వ్యూహంతో మెరికల్లాంటి అభ్యర్థులను రంగంలోకి దింపే పనిలో ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత, సీని యర్లపై సానుభూతి, కొత్తగా పార్టీలోకి చేరుతున్న నాయకగణం తదితర కారణాలు ఈసారి జిల్లాలో తమకు గౌరవప్రదమైన సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలి పిస్తాయని అధిష్టానం బలంగా నమ్ముతోంది. ఉమ్మ డి జిల్లాలో మొత్తం 13 అసెంబ్లీ స్థానాల్లో తమకు ఎంతలేదన్నా.. కనీసం ఆరేడుకు తగ్గకుండా గెలిచి తీరుతామన్న ధీమాతో కాంగ్రెస్ ముందుకెళ్తోంది. ఈ స్థానాలు కీలకం..! ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు, థర్డ్ పార్టీ సర్వేల అనంతరం పెద్దపల్లి(విజయరమణారావు), మంథని(దుద్దిళ్ల శ్రీధర్‌బాబు), రామగుండం(రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్), ధర్మపురి(అడ్లూరి లక్ష్మణ్), వేములవాడ(ఆది శ్రీనివాస్), హుస్నాబాద్(పొన్నం ప్రభాకర్),జగిత్యాల(జీవన్‌రెడ్డి) స్థానాల్లో తమ అభ్యర్థులు బలంగా ఉన్నారని, అధికార బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇ స్తారని కాంగ్రెస్ ధీమాగా ఉంది. చొప్పదండి(మేడిపల్లి సత్యం), మానకొండూరు(కవ్వ ంపల్లి సత్యనారా యణ), సిరిసిల్ల (కేకే మహేందర్‌రెడ్డి), కోరుట్ల(జువ్వాడి న ర్సింగరావు) కూడా ఈ సారి తమ కు స్థానికంగా సానుకూల పరిస్థితులు ఉన్నాయని నమ్ముతున్నా రు. హుజూరాబాద్ నుంచి మరోసారి బల్మూరి వెంకట్ బరిలోకి దిగనున్నారన్న ప్రచారం నడుస్తోంది. అన్నింటికంటే చివరిగా కరీంనగర్ స్థానంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానానికి పార్టీలో తీవ్రపోటీ నెలకొంది. మాజీ మంత్రి ఎమ్మెస్సార్ మనవడు మేనేని రోహిత్, పొ న్నం ప్రభాకర్ మధ్య పోటీ ఉన్నా.. పొన్నం హుస్నాబాద్‌కు వలస వెళ్లడంతో రోహిత్‌కు దాదాపుగా రూట్ క్లియర్ అయింది. అదేసమయంలో మైత్రీ గ్రూప్స్ అధినేత కొత్త జయపాల్‌రెడ్డి పార్టీలో చేరడంతో మరో ఆశావహుడు పెరిగినట్లయింది. దరఖాస్తుల పరంగా చూసినా.. కరీంనగర్‌కు ఆశావహుల జాబితా చాంతాడంత ఉంది, తర్వాత స్థానంలో కోరుట్లకు పోటీ ఉంది. కాంగ్రెస్ గూటికి మాజీ ఎంపీ వివేక్!? పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యుడు గడ్డం వివేక్ వెంకటస్వామి మరోసారి పార్టీ మారనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఈనెల 30వ తేదీ తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. కేంద్ర మాజీమంత్రి జి.వెంకటస్వామి రాజకీయ వారసుడిగా 2009లో పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. 2014లో కాంగ్రెస్ నుంచి ఓడాక బీఆర్ఎస్లో చేరి ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఓటమి కోసం ప్రయత్నించారన్న విమర్శలతో పార్టీ ఆయనను పక్కనబెట్టింది. అప్పటినుంచి ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు. ఐదేళ్లుగా జాతీయ పార్టీలో పనిచేసినా సరైన ప్రాధాన్యం దక్కలేదన్న ఆవేదనతో తిరిగి మాతృపార్టీ కాంగ్రెస్‌కు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో హస్తం పార్టీ నుంచి ఆయనకు గ్రీన్‌సిగ్నల్ వచ్చిందని, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి సీటు ఇస్తామన్న హామీతో ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నారని తెలిసింది. అంగబలం, అర్థబలం దండిగా ఉన్న వివేక్ పార్టీలో చేరితే.. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని అన్నిస్థానాల అభ్యర్థులకు అండగా నిలుస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. -
తెలంగాణకు పెద్దపీట
సాక్షి , హైదరాబాద్/ న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ కార్యవర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణకు పార్టీ నాయకత్వం పెద్ద పీట వేసింది. రాష్ట్రం నుంచి నలుగురు సభ్యులకు అవకాశం కల్పించింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్‌రావులకు జాతీయ కార్యవర్గంలో స్థానం లభించింది. ఈటల రాజేందర్, విజయశాంతిలకు ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కన్నా లక్ష్మీ నారాయణకు చోటు కల్పించారు. కొత్త మంత్రులకు చోటు రాబోయే ఎన్నికలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించిన బీజేపీ అందుకనుగుణంగా పార్టీ కొత్త జాతీయ కార్య నిర్వాహక కమిటీని గురువారం ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా నియమించిన కమిటీలో ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్, గడ్కరీ, గోయల్, అద్వానీ, మురళీ మనోహర్ జోషి సహా 80 మంది సభ్యులు ఉన్నారు. మంత్రివర్గంలో కొత్తగా చేరిన అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయ, జ్యోతిరాదిత్య సింథియా, మీనాక్షి లేఖిలను కమిటీలోకి తీసుకున్నారు. మేనక, వరుణ్‌లకు దక్కని స్థానం లఖీమ్‌పూర్ ఘటనలో రైతులకు న్యాయం జరగాలని, కారకులకు శిక్ష పడాలంటూ సంబంధిత వీడియోను ట్వీట్‌చేసిన పార్టీ ఎంపీ వరుణ్ గాంధీకి కొత్త కమిటీలో చోటు దక్కలేదు. మోదీ సర్కార్ విధానాలపై విమర్శలు చేసిన మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్‌లతో పాటు వ్యవసాయ చట్టాల్లో రైతు అనుకూల వ్యాఖ్యలు చేసిన ఎంపీ మేనకాగాంధీలను కమిటీ నుంచి తప్పించారు. కమిటీలో 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు, 35 మంది పార్టీ పదాధికారులు, 179 మంది శాశ్వత ఆహ్వానితులకూ చోటు కల్పించారు. శాశ్వత ఆహ్వానితుల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, జాతీయ మోర్చాల అధ్యక్షులు, రాష్ట్ర విభాగాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు. -
హుజురాబాద్‌లో టీఆర్ఎస్ ఓటమని సర్వేల్లో తేలింది: మాజీ ఎంపీ వివేక్
హుజూరాబాద్: రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు ఉంటే అక్కడ సీఎం కేసీఆర్ తప్పుడు హామీలు ఇచ్చి, గెలిచిన తర్వాత మర్చిపోతున్నారని, దేశంలోనే అవినీతిలో కేసీఆర్ నంబర్‌వన్ అని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. సోమవారం పట్టణంలోని మధువని గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మూడునాలుగు రోజులుగా హుజూరాబాద్‌లో ఈటల గెలిస్తే ఏం లాభమని టీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని.. ఈటల రాజీనామా చేస్తేనే ఎన్నో లాభాలు జరిగాయి.. గెలిస్తే జరగవా అని అన్నారు. కేవలం హుజూరాబాద్‌లో ఓట్ల కోసమే ఇష్టం వచ్చిన స్కీంలు పెడుతున్నారని, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత సీఎం ఫాం హౌస్ నుంచి బయటకు వచ్చారన్నారు. చదవండి: తెలంగాణ సిగలో మరో అందం.. వెలుగులోకి కొత్త జలపాతం అన్ని సర్వేల్లో టీఆర్ఎస్ ఓటమే ప్రజలను సీఎం కేసీఆర్ కలవాలంటే హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను గెలిపించాలని వివేక్ కోరారు. ఎన్నడూ జై భీమ్ అనని కేసీఆర్ ఇప్పుడు ఆ మాట అంటున్నారంటే ఎందుకో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. గతంలో ఎస్సీ ఉప ప్రణాళిక కింద ఉన్న పథకంలోనూ కార్లు, ట్రాక్టర్లు తీసుకునే వీలుండగా, దళిత బంధు కింద అవి ఎందుకని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద దోచుకున్న అవినీతి సొమ్ము ఇంటికి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికలో అవినీతి సొమ్ముతో గెలవాలని చూస్తున్న కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలన్నారు. సర్వేలన్నీ టీఆర్ఎస్ ఓడిపోతుందని చెబుతున్నాయని తెలిపారు. కాళేశ్వరం కోసం ఎంత కరెంటు వాడారో, ఎన్ని కోట్లు ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. చదవండి: మంత్రి పదవి కోసం నేను పెదవులు మూసుకోలేదు: ఈటల