సాక్షి, హైదరాబాద్: చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గురువారం కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. ఎన్నికల ముందు హైదరాబాద్‌లో నమోదైన హవాలా, ఫెమా కేసుకు సంబంధించి ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో పెద్ద ఎత్తున నిధుల డిపాజిట్ల పై కేసు నమోదైన విషయం తెలిసిందే.
విశాఖ ఇండస్ట్రీ నుంచి ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో రూ.8 కోట్ల పైచిలుకు నిధుల లవాదేవీలపై ఎన్నికల ముందు హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ ఇండస్ట్రీస్, ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ మధ్య జరిగిన రూ.100 కోట్ల లావాదేవీల వ్యవహారంలో మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. అలాగే డిపాజిట్లకు సంబంధించి ఈడీ ఆరా తీస్తోంది. దీనిపై ఇవాళ వివేక్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
కాగా గత ఏడాది నవంబర్‌లో విశాక సంస్థల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ బోగస్ సంస్థ అని గుర్తించి, రూ.కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment