
సరికొత్త హెల్త్ పారామీటర్‌ను తెరపైకి తెచ్చిన పరిశోధకులు
మరింత కచ్చితత్వంతో గుండెజబ్బులను అంచనా వేయొచ్చని వెల్లడి
ఫిట్‌నెస్ బ్యాండ్లు లేదా స్మార్ట్ వాచీలు మన హృదయ స్పందనల్లో తేడాలను గుర్తించి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుండటం తెలిసిందే. అయితే ఓ చిన్న ‘లెక్క’సాయంతో అంతకన్నా మరింత కచ్చితత్వంతో గుండె ఆరోగ్యాన్ని గుర్తించే విధానాన్ని పరిశోధకులు తాజాగా గుర్తించారు. ఇటీవల జరిగిన అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ (ఏసీసీ–2025) సమావేశంలో ఆ సరికొత్త ‘పారామీటర్’ను ప్రకటించారు. – సాక్షి, స్పెషల్ డెస్క్
ఏమిటా పారామీటర్?
ఒక రోజులో ఒక వ్యక్తి వేసిన అడుగుల సంఖ్యను ఆ రోజు అతడి హృదయ స్పందనల సగటు రేటుతో భాగించడమే ఆ పారామీటర్ (చిన్న లెక్క). అలా వచ్చిన ఆ విలువను ‘డైలీ హార్ట్ రేట్ పర్ స్టెప్ (డీహెచ్‌ఆర్‌పీఎస్)గా పేర్కొంటున్నారు. ఒక వ్యక్తి గుండె ఆరోగ్య స్థితిని కచ్చితంగా అంచనా వేసేందుకు ఈ పారామీటర్ దోహదపడుతుందంటున్నారు పరిశోధకులు. ఒకవేళ ఈ విలువ ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తిలో గుండె జబ్బులు వచ్చే ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుందంటున్నారు. డీహెచ్‌ఆర్‌పీఎస్ ఉండాల్సిన దానికంటే గుండె స్పందనలు ఎక్కువగా ఉన్నా లేదా మరీ తక్కువగా ఉన్నా కూడా గుండె ఆరోగ్యం బాగోలేదనడానికి సూచిక అని చెబుతున్నారు.
సుమారు 7 వేల మందికి సంబంధించిన 58 లక్షల పర్సన్–డేస్, వారు నడిచిన 5,100 కోట్ల అడుగులను విశ్లేషించి ఈ విషయాన్ని వారు చెప్పారు. అయితే ఇవి కేవలం మొదట చేసిన ఓ అధ్యయన ఫలితాలతో వెల్లడైన అంశాలేనని.. వాటిని పూర్తి రోగ నిర్ధారణగా చెప్పడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని పరిశోధకులు పేర్కొంటున్నారు. అయితే వాటన్నింటిలోనూ ఇదే విషయం నిర్ధారణ అయితే భవిష్యత్తులో గుండె పరీక్షలకు దీన్నే ఓ ప్రామాణిక పారామీటర్‌గా తీసుకొనే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
డీహెచ్‌ఆర్‌పీఎస్ ఎక్కువగా ఉంటే రాబోయే అనారోగ్య సమస్యలు ఇలా..
⇒ టైప్–2 డయాబెటిస్ ముప్పు 2 రెట్లు ఎక్కువ
⇒ గుండె వైఫల్యం ముప్పు 1.7 రెట్లు ఎక్కువ
⇒ అధిక రక్తపోటు ముప్పు 1.6 రెట్లు ఎక్కువ ళీ కరొనరీ ఆర్టరీ డీసీజ్ ముప్పు 1.4 రెట్లు ఎక్కువ