కరీంనగర్: రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల హామీలు ప్రకటించి సంక్షేమ పథకాలను అమలుచేయడంలో ఘోరంగా విఫలమైందని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్‌రావు విమర్శించారు. బీజేపీ రాష్ట్రశాఖ పిలుపుతో అర్హులకు సంక్షేమ పథకాలు, డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరుచేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ప్రవీణ్‌రావు హాజరై మాట్లాడారు.
రెండు పర్యాయాలు బీఆర్‌ఎస్ ప్రకటించిన పథకాలను నేటికీ సక్రమంగా అమలు చేయలేని స్థితిలో కేసీఆర్ సర్కార్ ఉందని దుయ్యబట్టారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, డబుల్ బెడ్రూం ఇళ్లు, వివిధ రకాల పింఛన్లు, రేషన్‌కార్డులు, దళితబంధు, నిరుద్యోగ భృతి, బీసీబంధు, మైనార్టీ బంధు, గృహలక్ష్మీ పథకాలను అందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేసీఆర్ చేసిన ప్రకటనలు ప్రజలు నమ్మేస్థితిలో లేరని, రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి భంగపాటు తప్పదన్నారు.
తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా..
మండలంలోని తహసీల్దార్ కా ర్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం గేట్లుమూసి ఆందోళన చేపట్టారు. సీఎం కేసీఆర్ ఎన్నికల హామీల అమలులో విఫలమయ్యారని బీజేపీ నాయకులు ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి పలు పథకాలను ప్రకటిస్తు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాస సత్యనారాయణరావు, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, దుబాల శ్రీనివాస్, మాడిశెట్టి సంతోష్‌కుమార్, పాశం తిరుపతి, గాండ్ల గోపాల్, రమణారెడ్డి, కుమార్, కమలాకర్‌రెడ్డి, అజయ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment