
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఇంతటి ఘన విజయం సాధించిన తర్వాత కూడా బీజేపీ ట్రాక్ రికార్డ్ ఇప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లోనే టాప్ అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
ఇటీవలి రాజస్థాన్,మధ్యప్రదేశ్,ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 332 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. ఈ మూడు రాష్ట్రాల్లో 2014,2019 లోక్‌సభ ఎన్నికల్లో 444, 450 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ లీడ్ సాధించిందని లెక్కలు చెబుతున్నాయి.
అయితే, రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి మెరుగు పడడానికి లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన విజయాలు కీలక పాత్ర పోషించాయని తెలుస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాతే రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ బెటర్ పర్ఫామెన్స్ చూపిస్తోందని ఓట్లు, సీట్ల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ దేశంలోని 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment