winning
-
జాతీయ అవార్డ్.. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి సన్మానం (ఫొటోలు)
-
ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం.. మను బాకర్‌కు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, గుంటూరు: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన మను బాకర్‌కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ‘‘ఒలింపిక్స్‌లో షూటింగ్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. యావత్ భారతదేశాన్ని గర్వపడేలా చేశారు’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మనుబాకర్ కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఈ పోటీలో మనూ 221.7 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలువగా.. సౌత్ కొరియాకు చెందిన ఓ (243.2), కిమ్ (241.3) మొదటి రెండు స్థానాల్లో నిలిచి స్వర్ణ, రజత పతకాలు సొంతం చేసుకున్నారు. భారత్ తరఫున షూటింగ్లో పతకం సాధించిన తొలి మహిళగా మనూ చరిత్ర సృష్టించింది. 22 ఏళ్ల మనూ హర్యానాకు చెందిన యువతి. మనూ తండ్రి మెరైన్ ఇంజనీర్ కాగా.. తల్లి ప్రిన్సిపల్. మనూ.. 2018 కామన్వెల్త్ క్రీడల్లో 16 ఏళ్ల వయసులోనే స్వర్ణ పతకం సాధించింది. మనూ అర్జున అవార్డు గ్రహీత. My best wishes and congratulations to @realmanubhaker on creating history as the first Indian woman to win a medal in shooting at the Olympics. You have made me and all of India very proud!#Olympics2024Paris pic.twitter.com/tu8YK1Afpd— YS Jagan Mohan Reddy (@ysjagan) July 28, 2024 -
పవన్ కళ్యాణ్ గెలుపుపై ముద్రగడ రియాక్షన్
-
T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)
-
ఇండియా కూటమి 272 సీట్లలో గెలిచేసింది: జైరామ్‌రమేశ్
న్యూఢిల్లీ: ఆరో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కాంగ్రెస్ కీలక ప్రకటన చేసింది. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి టార్గెట్ 350 సీట్లలో ఇప్పటికే 272 సీట్ల మార్క్ దాటామని ఆ పార్టీ అధికార ప్రతినిధి జైరామ్ రమేశ్ అన్నారు. ఈ మేరకు శనివారం(మే25) ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ పరిస్థితి సౌత్ మే సాఫ్, నార్త్ మే హాఫ్ అన్నట్లుగా తయారైందన్నారు. దక్షిణాదిలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో పాటు ఉత్తరాదిలో బీజేపీ సీట్లు గతంతో పోలిస్తే సగానికి తగ్గనున్నాయన్నారు. హర్యానా, పంజాబ్‌లలో అయితే బీజేపీ లీడర్లను ప్రచారానికి రాకుండా ప్రజలు తరిమి కొడుతున్నారని చెప్పారు. బీజేపీ ప్రచారం గడువు కంటే ముందే ముగిసినందున ప్రధాని మోదీ తన రిటైర్మెంట్ను ప్లాన్ చేసుకునేందుకు కావల్సిన సమయం దొరుకుతుందని సెటైర్ వేశారు. -
ప్రీతిస్మిత ప్రపంచ రికార్డు..!
లిమా (పెరూ): ప్రపంచ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి ప్రీతిస్మిత భోయ్ మూడు స్వర్ణ పతకాలు సాధించింది. ఈ క్రమంలో క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.మహిళల 40 కేజీల విభాగంలో బరిలోకి దిగిన ఒడిశాకు చెందిన 15 ఏళ్ల ప్రీతిస్మిత మొత్తం 133 కేజీలు (క్లీన్ అండ్ జెర్క్‌లో 76 కేజీలు+స్నాచ్‌లో 57 కేజీలు) బరువెత్తి విజేతగా నిలిచింది. మూడు విభాగాల్లో (క్లీన్ అండ్ జెర్క్+స్నాచ్+టోటల్) వేర్వేరుగా పతకాలు అందించగా... ఈ మూడింటిలోనూ ప్రీతిస్మిత అగ్రస్థానంలో నిలిచి మూడు పసిడి పతకాలను సొంతం చేసుకుంది.40 కేజీల విభాగంలోనే పోటీపడ్డ భారత లిఫ్టర్ జోష్నా సబర్ రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించింది. 45 కేజీల విభాగంలో పాయల్ ఒక రజతం, రెండు కాంస్యాలు గెలిచింది. పురుషుల 49 కేజీల విభాగంలో బాబూలాల్ రెండు కాంస్య పతకాలు దక్కించుకున్నాడు.ఇవి చదవండి: జ్యోతి సురేఖకు నిరాశ.. క్వార్టర్ ఫైనల్లో ఓటమి -
లోక్‌సభకు ఎక్కువసార్లు నెగ్గింది ఎవరంటే..
2024 లోక్‌సభ ఎన్నికల్లో పలువురు సీనియర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొందరు ఐదోసారి, మరికొందరు ఏడోసారి ఎంపీల రేసులో ఉన్నారు. 1952లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 17 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం 18వ లోక్‌సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే లోక్‌సభకు ఎక్కువసార్లు ఎవరు గెలిచారనే విషయానికొస్తే..ఇంద్రజీత్ గుప్తా(11 సార్లు): లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సార్లు గెలిచిన వ్యక్తిగా కమ్యూనిస్టు నేత ఇందర్జిత్ గుప్తా రికార్డు సృష్టించారు. 1960లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 1999లో చివరిసారిగా ఎంపీ అయ్యారు. ఇంద్రజిత్ గుప్తా తన జీవితకాలంలో 11 సార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు.సోమనాథ్ ఛటర్జీ(10 సార్లు):1929 జూలై 25న అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించిన సోమనాథ్ ఛటర్జీ లోక్‌సభ ఎన్నికల్లో 10 సార్లు గెలిచారు. ఛటర్జీకి 1996లో 'అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డు' లభించింది.పీఎం సయీద్ (10 సార్లు):పీఎం సయీద్ 1967 నుండి 1999 వరకు వరుసగా 10 సార్లు ఎంపీ అయ్యారు. ఆయన తొలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు.అటల్ బిహారీ వాజ్‌పేయి(9 సార్లు)మూడుసార్లు దేశ ప్రధానిగా పనిచేసిన అటల్ బిహారీ వాజ్‌పేయి తొమ్మిది సార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. అటల్ జీకి నాలుగు దశాబ్దాలకు పైగా పార్లమెంటరీ అనుభవం ఉంది. మరికొందరు నేతలు కూడా తొమ్మిది సార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారుకమల్ నాథ్: లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిది సార్లు గెలిచిన నేతల్లో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఒకరు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా లోక్‌సభ స్థానం ఆయనకు బలమైన కోటగా పరిగణిస్తారు. కమల్‌నాథ్ 1980లో తొలిసారిగా ఇక్కడి నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేశారు.మాధవ్ రావ్ సింధియా: దివంగత నేత మాధవరావు సింధియా 1971లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. తొమ్మిది సార్లు ఎంపీగా ఉన్నారు. గ్వాలియర్ లోక్‌సభ స్థానం నుంచి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని కూడా ఆయన ఓడించారు.ఖగపతి ప్రదాని: ఒడిశాలోని నబరంగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా తొమ్మిది సార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ దివంగత నేత ఖగపతి ప్రదాని రికార్డు సృష్టించారు. 1999లో రాజకీయాల నుంచి తప్పుకున్నారు.గిరిధర్ గోమాంగ్: కాంగ్రెస్ నేత, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గోమాంగ్ లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిది సార్లు విజయం సాధించారు. కోరాపుట్ నియోజకవర్గం నుంచి అన్ని ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు.రామ్‌విలాస్ పాశ్వాన్: తొమ్మిదిసార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన నేతల్లో రామ్‌విలాస్ పాశ్వాన్ పేరుంది. రామ్ విలాస్ బీహార్‌లోని హాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి ఎనిమిది సార్లు, రోస్రా లోక్‌సభ స్థానం నుంచి ఒకసారి గెలుపొందారు.జార్జ్ ఫెర్నాండెజ్: లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిది సార్లు గెలిచిన నేతల్లో జార్జ్ ఫెర్నాండెజ్ కూడా ఒకరు. 1967లో తొలిసారిగా ముంబై సౌత్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల్లో గెలుపొందారు. అతను బీహార్‌లోని ముజఫర్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి ఐదుసార్లు, నలంద నుంచి మూడుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు.బాసుదేబ్ ఆచార్య: పశ్చిమ బెంగాల్‌లోని బంకురా లోక్‌సభ స్థానం నుంచి సీపీఐ(ఎం) నేత వాసుదేబ్ ఆచార్య తొమ్మిది సార్లు ఎంపీగా గెలుపొందారు. వాసుదేబ్ ఆచార్య 1980లో తొలిసారిగా బంకురా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.మాణిక్‌రావ్ హోడల్యా గవిత్: మహారాష్ట్రకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత మాణిక్‌రావ్ హోడల్యా గవిత్ లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా తొమ్మిదిసార్లు విజయం సాధించారు. 1981లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు.వీరంతా ఎనిమిది సార్లు: బీజేపీ నేత సంతోష్ గంగ్వార్ లోక్‌సభ ఎన్నికల్లో బరేలీ స్థానం నుంచి ఎనిమిది సార్లు గెలిచారు. సుల్తాన్పూర్ నుంచి బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటివరకు ఎనిమిదిసార్లు విజయం సాధించారు. సుమిత్రా మహాజన్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ స్థానం నుంచి ఎనిమిది సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. -
WC 2011: ఆ రోజు ధోని సిక్సర్ కొట్టగానే.. హిస్టారిక్ మూమెంట్స్! (ఫొటోలు)
-
ఎంపీ ఎన్నికలే బీజేపీకి బూస్ట్..!
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఇంతటి ఘన విజయం సాధించిన తర్వాత కూడా బీజేపీ ట్రాక్ రికార్డ్ ఇప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లోనే టాప్ అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇటీవలి రాజస్థాన్,మధ్యప్రదేశ్,ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 332 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. ఈ మూడు రాష్ట్రాల్లో 2014,2019 లోక్‌సభ ఎన్నికల్లో 444, 450 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ లీడ్ సాధించిందని లెక్కలు చెబుతున్నాయి. అయితే, రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి మెరుగు పడడానికి లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన విజయాలు కీలక పాత్ర పోషించాయని తెలుస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాతే రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ బెటర్ పర్ఫామెన్స్ చూపిస్తోందని ఓట్లు, సీట్ల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ దేశంలోని 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇదీచదవండి..రెడ్ అలర్ట్..మరిన్ని రోజులు భారీ వర్షాలు -
చీకటి వెలుగులు
విశాల విశ్వంలో సృష్టి సమస్తం ద్వంద్వాలమయం. ఈ ప్రపంచం ద్వంద్వాలమయం. లోకంలో వెలుగు చీకట్లుంటాయి. నిప్పూ నీరూ ఉంటాయి. తీపి చేదులుంటాయి. రేయింబగళ్లు ఉంటాయి. ఎండా వానా ఉంటాయి. శీతోష్ణాలుంటాయి. శిశిర వసంతాలుంటాయి. జీవితంలో సుఖదుఃఖాలు ఉంటాయి. ఆశ నిరాశలు ఉంటాయి. శాంతి అశాంతులు ఉంటాయి. గెలుపు ఓటములు ఉంటాయి. ఉత్థాన పతనాలు ఉంటాయి. మన వేదాంతం ఎంతగా అద్వైత సిద్ధాంత బోధ చేస్తున్నా, మానవమాత్రులైన వారెవరూ ద్వంద్వాతీతులు కారు, కాలేరు. మనుషులకు మాత్రమే కాదు, ఈ భూమ్మీద పుట్టిన ప్రతి జీవిలోనూ ఆడా మగా ఉంటాయి. ప్రతి జీవికీ చావుపుట్టుకలు ఉంటాయి. ప్రతి జీవితానికీ ఆద్యంతాలుంటాయి. ద్వంద్వబంధురమైన సృష్టి ప్రకృతి సహజం. సృష్టిలో ఇన్ని ద్వంద్వాలే లేకుంటే, ప్రకృతికి ఇంతటి సౌందర్యమెక్కడిది? జీవితానికి ఇంతటి వైవిధ్యమెక్కడిది? అద్వైతం అందమైన భావన. ఆధ్యాత్మిక ప్రవచనాల్లో ‘బ్రహ్మ సత్యం... జగన్మిథ్య’ అనే అద్వైత బోధను ఆలకించేటప్పుడు తన్మయత్వంతో కాసేపు ఓలలాడవచ్చేమో గాని, అది క్షణికమే! ఆ తర్వాత మిథ్యా మైకం నుంచి బయటపడ్డాక మనమింకా ద్వంద్వాల వలయంలోనే ఉన్నామన్న సంగతి ఎరుకపడటానికి ఎంతోసేపు పట్టదు. ‘మనకు రెండు కళ్లు, రెండు కాళ్లున్నట్లే ద్వంద్వాలన్నీ మన జీవితంలో భాగమే!’ అన్నాడు కార్లోస్ సాంటానా. అలాగని అతడేమీ తత్త్వవేత్త కాదు, వేదాంతి కాదు, కనీసం ప్రవచనకర్తయినా కాదు గాని, వారెవరికీ లేని ఎరుక అతడికి ఉంది. కార్లోస్ సాంటానా అమెరికన్ గిటారిస్ట్. అయినా, సృష్టిలోని ద్వంద్వాలను అర్థం చేసుకోవడానికి తత్త్వవేత్తలో, వేదాంతులో, ప్రవచనకర్తలో కానక్కర్లేదు... ఇసుమంత ఇంగితమున్న మనుషులైతే చాలు! ద్వంద్వాలు మన వెలుపలే కాదు, మన లోపల కూడా ఉన్నాయి. ద్వంద్వాల నడుమ నిత్యసంఘర్షణే ప్రకృతి ధర్మం. ‘మానవ జీవితమే మహాభారతం/ అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం’ అన్న ఆరుద్ర మాటలు ఇందుకు చిన్న ఉదాహరణ. మన జీవితాలను నిర్దేశించేవి జ్ఞానా జ్ఞానాలు, ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు, ఉచితానుచితాలు, రాగద్వేషాలు, నీతి అవినీతి వంటి ద్వంద్వాలే! విశ్వానికి మూలం తొలుత ఏకపదార్థమేనని, కాలక్రమంలో అది ద్వంద్వాలుగా విడిపోయిందని పాశ్చాత్య తత్త్వవేత్తల్లో కొందరి భావన. సృష్ట్యాదిలో ప్రపంచమంతా జలమయమై ఉండేదని మన పురాణాల కథనం. గ్రీకు తత్త్వవేత్త థేలీస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. థేలీస్ అభిప్రాయాన్ని అతడి శిష్యుడు అనగ్జిమాండర్ ఖండించాడు. ‘ఏదో ఒక అనిశ్చిత, అనిర్దిష్ట, అజ్ఞాత పదార్థం సమస్త స్థలాన్నీ ఆవరించి ఉండేది. అది అనంతం, అనశ్వరం’ అని అనగ్జిమాండర్ అన్నాడు. సృష్టికి మూలమైన పదార్థం ద్వంద్వాతీతమైనదో కాదో ఇప్పటికీ ఎవరికీ తెలీదు గాని, మన చుట్టూ ఉన్న ద్వంద్వాలు, మన లోపలున్న ద్వంద్వాలు అందరికీ అనుభవపూర్వకమే! జీవితంలో అడుగడుగునా తారసపడే ద్వంద్వాలే మన జీవన గమనాన్ని నిర్దేశిస్తాయి. ఎంతటి వారైనా జీవితంలో ఎదురయ్యే ద్వంద్వాలను అతిక్రమించలేరు. వాటి ఉనికిని గుర్తించకుండా ఉండలేదు. వాటికి అతీతంగా బతకలేరు. కాబట్టి మనం ద్వంద్వాలను నిర్ద్వంద్వంగా అంగీకరించక తప్పదు. లోకంలో కొందరు మనుషులు మంచివాళ్లుగా, మహానుభావులుగా చలామణీ అవుతారు. కొందరు దుర్మార్గులుగా, చెడ్డవాళ్లుగా పేరుమోస్తారు. నిజానికి ఎవరూ పూర్తిగా మంచివాళ్లుగా గాని, పూర్తిగా చెడ్డవాళ్లుగా గాని ఉండరు. జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, వాటికి స్పందించే తీరుతెన్నులే మనుషుల మంచిచెడులను బయటపెడతాయి. అందుకే ‘మనుషులందరూ మంచి చెడుల సమ్మేళనాలే’ అన్నాడు స్కాటిష్ రచయిత రాబర్ట్ లూయీ స్టీవెన్సన్. ‘కృతా కృతేచ ద్వంద్వాని కదా శాంతాని కస్యవా/ ఏవం జ్ఞాత్వేహ నిర్వేదాత్ భవ త్యాగపరో వ్రతీ’ అని అష్టావక్రుడు జనక మహారాజుకు చెప్పాడు. కృతాకృత కర్మకలాపాలు, సుఖదుఃఖాది ద్వంద్వాలు శాంతించినప్పుడు భక్తుడు సంశయరహితుడై జ్ఞాని అవుతాడని, అప్పుడు వైరాగ్య వ్రతం చేయకున్నా త్యాగపరాయణుడవుతాడని ఈ శ్లోకానికి అర్థం. జనకుడికి అష్టావక్రుడు చేసిన ఈ వేదాంత బోధ ‘అష్టావక్రగీత’గా ప్రసిద్ధి పొందింది. అష్టావక్రుడు తన గీతబోధలో ద్వంద్వాల ఉనికిని నిరాకరించలేదు. కాకుంటే, అవి శాంతించాలన్నాడు. ద్వంద్వాల మధ్య సమతుల్యతను సాధించినప్పుడే అవి శాంతిస్తాయి. సుఖదుఃఖాలు, రాగద్వేషాల వంటి సహజాతి సహజమైన ద్వంద్వాలకు కొంత మోతాదుకు మించి స్పందించడం మానవ స్వభావం. ద్వంద్వాల ప్రభావాన్ని సమానంగా స్వీకరించి, ఆత్మావలోకనం చేసుకోగల సామర్థ్యమే స్థితప్రజ్ఞ! కాకపోతే, మనుషుల్లో స్థితప్రజ్ఞులు అరుదు. ముఖ్యంగా ప్రజల మధ్య గడిపే రాజకీయ నేతల్లో, సినీతారల్లో మరీ అరుదు. ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికల్లో జయాపజయాలు సర్వసాధారణాలు. ప్రజామోదం పొందిన వారు ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తారు. ప్రజాదరణ కొరవడిన వారు పరాజితులవుతారు. గెలుపొందిన వారు ‘అంతా తమ ప్రయోజకత్వం/ తామే భువి కధినాథులమనుకొని ’ విర్రవీగితే మాత్రం తర్వాతి ఎన్నికల్లో పర్యవసానాన్ని చవిచూడక తప్పదు. పరాజితులు ఇంతే తమ కర్మమ నుకుని కుంగిపోయినా, తమను ఆదరించని ప్రజలను నిందించినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. ఘనవిజయాలు సాధించినప్పుడు బాధ్యతలను గుర్తెరిగి అప్రమత్తంగా ప్రవర్తించాలి. అపజయాలు ఎదురైనప్పుడు ఆత్మవిమర్శ చేసుకుని, లోపాలను సవరించుకోవడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. ఎన్నికల క్రతువులో ఘనవిజయాలూ శాశ్వతం కావు, అపజయాలూ శాశ్వతం కావు. శాశ్వతం కానివని తెలిసి తెలిసి ఫలితాలను తలకెక్కించుకుంటేనే ప్రమాదం. -
Mahindra Thar Gifted To Nikhat Zareen: వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కు మహీంద్రా ‘థార్’ గిఫ్టు (ఫొటోలు)
-
గెలుపే లక్ష్యంగా దూసుకెళ్లండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రానున్న అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు బండి సంజయ్ కుమార్‌కు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు మరింత దూకుడుగా వ్యవహరించాలని చెప్పారు. సోమవారం ఢిల్లీలో తనను కలిసిన బండి సంజయ్‌తో సుమారు 30 నిమిషాలపాటు రాష్ట్ర రాజకీయ వ్యవహారాలపై అమిత్ షా చర్చించారు. ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అప్పగించిన తర్వాత మొదటిసారి బండి సంజయ్ అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా పారీ్టకి సంబంధించిన వ్యవహారాలు, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం, ప్రధాని సహా కేంద్రమంత్రుల పర్యటనలు తదితర అంశాలపై అమిత్ షా పలు సూచనలు చేశారు. అంతేగాక ఇటీవల కిషన్‌రెడ్డి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల స్వీకరణ రోజు బండి సంజయ్ సహా పలువురు నాయకులు చేసిన వ్యాఖ్యల గురించి అమిత్ షా అడిగి తెలుసుకున్నారని సమాచారం. పార్టీ అంతర్గత విషయాలను బహిరంగ వేదికలపై, మీడియాతో మాట్లాడరాదని అమిత్ షా సూచించారని తెలిసింది. బండితో భేటీకి సంబంధించిన సమాచారాన్ని అమిత్ షా స్వయంగా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలను బండితో చర్చించినట్లు చెప్పారు. అనంతరం షాతో భేటీకి సంబంధించి బండి సైతం ట్వీట్ చేశారు. రాజకీయ చాణక్యుడు అమిత్ షాను కలవడం సంతోషంగా ఉందని, ఆయన మార్గదర్శనంలో పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానని బండి వెల్లడించారు. -
మహి అన్న కోసం ఏదైనా చేస్తా టచ్ చేస్తున్న జడేజా మాటలు..!
-
CSK అభిమానులకు జడేజా భార్య ట్రీట్ ..!
-
గెలిచిన CSK.. పండగ చేసుకుంటున్న పాకిస్థాన్ ఫాన్స్ ..!
-
ధోనికి జడేజాకు మధ్య విబేధాలు ఇంకా ప్రూఫ్స్ కావాలా ....!
-
ట్విట్టర్‌ను ఊపేస్తున్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సైన్యం..
సాక్షి, అమరావతి: గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించి నాలుగేళ్లయిన సందర్భంగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ‘వైఎస్సార్సీపీ ఎగైన్ 2024’ హ్యాష్‌టాగ్‌తో ట్విట్టర్లో ట్రెండింగ్ ప్రారంభించారు. దీంతో, పది నిమిషాల్లోనే ఈ ట్రెండింగ్ జాతీయస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. తన నాలుగేళ్ల పాలనలో వైఎస్ జగన్ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు ఆయన రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన సమాచారంతో కూడిన ట్వీట్లను వైఎస్సార్సీపీ కార్యకర్తలు ట్వీట్ చేశారు. వీటికి దేశవ్యాప్తంగా భారీగా వ్యూస్ వచ్చాయి. ఇటీవలి కాలంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం ట్విట్టర్ ట్రెండింగ్స్‌లో యమా దూకుడుగా వ్యవహరిస్తోంది. గతేడాది సీఎం వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా జరిగిన ట్రెండింగ్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. 2024 Jagananna Once More #YSRCPAgain2024 pic.twitter.com/iEsKITKHCx — Rise Of YSJagan (@RiseofYSJagan) May 22, 2023 ఇది కూడా చదవండి: చారిత్రక విజయానికి నాలుగేళ్లు.. -
ఆర్సిబీ వరుస ఓటములు...విరాట్ షాకింగ్ ట్వీట్
-
ప్రతిభ..: జయం మనదే!
అమెరికాలో స్పెల్లింగ్ బీ పోటీలకు పెద్ద చరిత్ర, ఘనత ఉన్నాయి. ఆ చరిత్రను భారత సంతతికి చెందిన పిల్లలు తమ ఘనతతో తిరగరాస్తున్నారు. గెలుపు జెండా ఎగరేస్తున్నారు... తాజాగా పద్నాలుగు సంవత్సరాల హరిణి లోగాన్ ‘2022 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’ పోటీ విజేతగా నిలిచింది... ఒక పదం స్పెల్లింగ్ పలకడమే కాదు, దాని అర్థం కూడా చెప్పాలని ఈసారి కొత్త నిబంధన చేర్చారు. ఈ ప్రభావంతో చాలామంది ఫైనల్ వరకు చేరుకోలేకపోయారు. విక్రమ్‌రాజు, సహన శ్రీకాంత్, అభిలాష పటేల్, శివకుమార్... మొదలైన వారితోపాటు ఫైనల్లో పోటీ పడింది హరిణి. ఒక పదానికి హరిణి ఇచ్చిన నిర్వచనం తప్పేమీ కాదని న్యాయనిర్ణేతలు ప్రకటించడం ద్వారా ‘ఎలిమినేట్’ ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. 90 సెకండ్ల లైటినింగ్ రౌండ్ గతంలో లేనిది. ఈ రౌండ్లో 90 సెకన్లలో హరిణి 26 పదాలకు 21 పదాల స్పెల్లింగ్ కరెక్ట్‌గా చెప్పింది. తొలిసారిగా ప్రవేశపెట్టిన టై బ్రేకర్‌లో విజయం సాధించింది. విక్టరీ ట్రోఫీని అందుకొని 50 వేల డాలర్ల ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంది. ‘కల నిజం అయినందుకు ఆనందంగా ఉంది. ఈ గెలుపు ఉత్సాహాన్ని ఇవ్వడమే కాదు ముందుకు వెళ్లడానికి శక్తిని ఇచ్చింది’ అంటుంది టెక్సాస్‌లోని సాన్ ఆంటోనియోకు చెందిన హరిణి. అయితే ఆమె సంతోషం వెనుక ఎంతో కష్టం ఉంది. ‘స్పెల్లింగ్ బీ’ బరిలోకి దిగే క్రమంలో రోజుకు ఆరు నుంచి ఎనిమిదిగంటల పాటు కష్టపడేది. ‘పోటీ సంగతి ఎలా ఉన్నా, ప్రిపేర్ అవుతున్న క్రమంలో రకరకాల కొత్త పదాలు, వాటిద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోగలిగాను’ అంటుంది హరిణి. గత విజేతల విజయాలు హరిణిలో స్ఫూర్తి నింపాయి. ‘ఈసారి విన్నర్ ట్రోఫీని నేను అందుకోవాల్సిందే’ అనే పట్టుదల పెంచాయి. పోటీదారుల ఒత్తిడి ఎలా ఉన్నా, ప్రేక్షకులు మాత్రం ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను చూసినంత ఉత్కంఠగా స్పెల్లింగ్ బీ పోటీని చూశారు. కోవిడ్ పుణ్యమా అని గత రెండు సంవత్సరాలు ఈ ఉత్సాహం మిస్ అయింది. ‘తాను ఎంతో కష్టపడింది అని ఆమె విజయం చెప్పకనే చెప్పింది’ అంటూ హరిణిని ప్రశంసిస్తున్నారు ‘వర్డ్ బై వర్డ్: ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ డిక్షనరీస్’ రచయిత కొరి స్టాంపర్. హరిణికి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. హైస్కూల్లో చదువుతున్నప్పుడే పుస్తకం రాసే ప్రయత్నం చేసింది. విజయం కోసం తాను పడిన కష్టాన్నే అక్షరీకరిస్తే ఎంతోమందికి అది స్ఫూర్తి ఇచ్చే పుస్తకం అవుతుంది కదా! -
అక్కడ గెలుపే టార్గెట్.. బీజేపీ మాస్టర్ ప్లాన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 2024లోనూ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ కార్యాచరణ మొదలు పెట్టింది. బలహీనంగా ఉన్న లోక్‌సభ స్థానాల్లో విజయవకాశాలను మెరుగుపరుచుకునేందుకు జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, ఉపాధ్యక్షులు బైజయంత్ పాండా, దిలీప్ ఘోష్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు లాల్‌సింగ్ ఆర్యలతో టాస్క్‌ఫోర్స్‌ను నియమించింది. దేశవ్యాప్తంగా 74 వేల పోలింగ్ బూత్‌లలో పార్టీ బలహీనంగా ఉందని 2014, 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను బట్టి పార్టీ అంచనాకు వచ్చింది. ఇంతవరకూ గెలవని 100 లోక్‌సభ స్థానాలనూ గుర్తించింది. వీటిల్లో పాగా వేసే వ్యూహాలను టాస్క్‌ఫోర్స్ బృందం సిద్ధం చేయనుంది. మూడు నెలలు విస్తృతంగా పర్యటనలు చేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో భేటీ అవుతుంది. పార్టీ పటిష్టానికి చేపట్టాల్సిన చర్యలపై అభిప్రాయాలు సేకరిస్తుంది. వచ్చే వారం నుంచి పర్యటనలు మొదలవుతాయని సమాచారం. రెండు మూడు రోజుల్లో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ బృందం సమావేశం కానుంది. బలహీనంగా ఉన్న బూత్‌లలో ఎక్కువగా దక్షిణాదిలోనే ఉన్నాయి. కనుక అక్కణ్నుంచే కార్యాచరణ ఆరంభిస్తామని కమిటీ సభ్యుడొకరు చెప్పారు. ఇది కూడా చదవండి: అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ -
రికార్డులు బద్దలు.. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఎన్నిక
France election.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వరుసగా రెండోసారి ఎన్నికల్లో మాక్రాన్ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ఎన్నికల్లో మాక్రాన్‌కు 58 శాతం ఓట్లు రాగా, ప్రత్యర్థి మరీన్ లీపెన్‌కు 42 శాతం ఓట్లు పడ్డాయి. దీంతో, అధికారిక ఫలితాలు వెలువడక ముందే లీపెన్ తన ఓటమిని అంగీకరించారు. ఈ క్రమంలో మాక్రాన్ విజయం సాధించడంతో ఆయన మద్దతుదారులు ఈఫిల్ టవర్ ముందు జాతీయ గీతాన్ని పాడుతూ ఫ్రాన్స్, యూరోపియన్ జెండాలను ఊపారు. కాగా, ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో మరీన్ లీపెన్‌పై గెలిచి 39 ఏళ్ల మాక్రాన్ ఫ్రాన్స్ లో అతిపిన్న వయసు గల అధ్యక్షుడిగా రికార్డులకెక్కిన విషయం తెలిసిందే. ఇక, గడిచిన 20 ఏళ్లలో వరుసగా రెండు సార్లు ఫ్రాన్స్ అధ్యక్షుడైన వ్యక్తిగా మాక్రాన్ రికార్డు సృష్టించారు. ఇక, ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న వేళ మాక్రాన్ రెండోసారి ఎన్నికవడం ఫ్రాన్స్ సహా యూరోపియన్ యూనియన్‌లో నాయకత్వ స్థిరత్వానికి హామీ ఇచ్చినట్టు అయిందని పలువురు రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. మాక్రాన్ మరోసారి విజయం సాధించడంతో ప్రపంచవ్యాప్తంగా నాయకుల నుండి అభినందనలు అందుతున్నాయి. మాక్రాన్‌తో కలిసి ఫ్రాన్స్, ఐరోపాలను మరింత అభివృద్ధి చేస్తామని ఈయూ చీఫ్ ఉర్సులా వాన్‌డర్ లేయెన్ ట్వీట్ చేశారు. ఈయూ, నాటోలో విస్తృతమైన సహకారాన్ని కొనసాగించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ.. "ఫ్రాన్స్ మా అత్యంత సన్నిహిత, ముఖ్యమైన మిత్రదేశాలలో ఒకటి. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మాక్రాన్ మళ్లీ ఎన్నికైనందుకు అభినందనలు" అని అన్నారు. ఇది కూడా చదవండి: ఉక్రెయిన్ ఆయుధాగారాలపై రష్యా ముమ్మర దాడులు -
Elections: ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం
గుహవటి: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. అసోంలోని గువాహటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, మిత్రపక్షం ఏజీపీ కూటమి ఘన విజయం సాధించింది. ఎన్నికల ఫలితాల అనంతరం అసోం సీఎం హిమంత్ బిస్వాస్ శర్మ.. ప్రజలకు శిరసువంచి అభివాదం చేస్తున్నానని ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, గువాహటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 60 వార్డులకు ఎన్నికలుగా జరుగగా 58 వార్డులను బీజేపీ కూటమి కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థులు 52 వార్డుల్లో గెలుపొందగా, 7 వార్డులలో పోటీ చేసిన ఏజేపీ 6 వార్డులు దక్కించుకుంది. అసోంలో తొలిసారిగా బరిలో నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఒక్క స్థానంలో విజయం సాధించింది. ఇక, కాంగ్రెస్ పార్టీకి మరోసారి చేదు అనుభవమే ఎదురైంది. ఒక్క వార్డు కూడా గెలుచుకోకపోవడంతో హస్తం నేతలు ఖంగుతిన్నారు. ఇదిలా ఉండగా.. మున్సిపల్ ఎన్నికలు చివరిసారిగా 2013లో జరిగాయి. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక, ఈ విజయంపై అసోం సీఎం హిమంత్ బిస్వాస్ శర్మ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. భారీ విజయాన్ని అందించిన ప్రజలకు తన శిరసువంచి అభివాదం చేస్తున్నానని అన్నారు. బీజేపీ విజయంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. ఘన విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. I bow my head to the people of Guwahati for giving @BJP4Assam & its allies a historic win in #GMCElections. With this massive mandate, people have reaffirmed their faith on our development journey under the guidance of Adarniya PM Shri @narendramodi ji.@JPNadda @BJP4India pic.twitter.com/AWZ5mqIhc3 — Himanta Biswa Sarma (@himantabiswa) April 24, 2022 -
‘అదృష్టాన్ని’ పర్సులోనే దాచింది.. 290 కోట్ల లాటరీ!
బెర్లిన్: లాటరీ టికెట్ కొంటే లక్కీ డ్రా తేదీ కోసం కళ్లు కాయలుకాసేలా ఎదురు చూస్తుంటారు చాలామంది. అలాంటిది ఒకావిడ తాను లాటరీ టికెట్ కొన్న సంగతే మర్చిపోయింది. కొన్న టికెట్ తన పర్సులోనే ఉన్నా దానిని వారాల పాటు ఆమె పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎలాగోలా లాటరీ ఫలితాల విషయం తెల్సి తన టికెట్ నంబర్‌ను చెక్ చేసుకుంది. తను కొన్న టికెట్‌కే 39 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.290.53 కోట్ల) బంపర్ డ్రా తగిలిందనే విషయం తెలిసి సంభ్రమాశ్చర్యానికి గురైంది. ఈ ఘటన జర్మనీలో ఇటీవలే జరిగింది. జూన్ తొమ్మిదిన లాటరీ ఫలితాలు ప్రకటించారు. 1.20 యూరోలు (దాదాపు రూ.105) పెట్టి టికెట్‌ను కొని ఇన్నాళ్లూ ఆ సంగతే మర్చిపోయిన ఆమె.. ఇటీవలే తన లాటరీ టికెట్‌లోని ఏడు నంబర్లను సరిచూసుకుని ఆనందసాగరంలో మునిగిపోయారు. -
మే 2న ఎన్నికల కౌంటింగ్‌పై ఈసీ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: మే 2న విడుదలయ్యే అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సమయంలో గెలిచిన అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీలపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో ఫలితాలు వచ్చేటప్పుడు గానీ.. ఆ తర్వాత గానీ.. విజేతలైన అభ్యర్థులు సంబరాలు చేసుకోడానికి వీల్లేదని స్పష్టం చేసింది. విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, పార్టీ సంబరాలేవీ నిర్వహించకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఫలితాల అనంతరం గెలిచినవారు ఈసీ నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకునే సమయంలోనూ అభ్యర్థి వెంట ఇద్దరు మించి ఉండకూడదని ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అన్ని రాజకీయ పార్టీలు, నేతలు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. కాగా ఇటీవల తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంతోపాలు పుదుచ్చేరిలో ఎనిమిది దశల్లో శాసనసభ ఎన్నికల షెడ్యూల్ జరుగుతుండగా.. ఏప్రిల్ 29 ఈ ఎన్నికలు ముగుస్తాయి. వీటి కౌంటింగ్ 2న చేపట్టనున్నారు. మరోవైపు దేశంలో కొన్ని రోజులుగా నిత్యం 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. 2 వేలకు మించి కరోనా రోగులు మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియాలో కోవిడ్ కేసులు పెరిగి పోవడానికి ఎన్నికల కమిషన్‌యే కారణమని మద్రాస్ హైకోర్టు సోమవారం ఈసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం అధికారులపై హత్యా నేరం కింద కేసులు పెట్టాలని మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజిబ్ బెనర్జీ వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాల రోజు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఈ నెల 30 లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. లేదంటే కౌంటింగ్‌ను నిలిపివేస్తామని హెచ్చరించింది. మద్రాస్ హైకోర్టు హెచ్చరించిన మరుసటి రోజే ఈసీ ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అదే విధంగా గత వారమే పశ్చిమ బెంగాల్లో అన్ని రోడ్‌షోలు, పాదయాత్రలు, ర్యాలీలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిషేధిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది. చదవండి: ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు -
మే 2 తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిషేదం: ఈసీ