సమష్టి కృషితోనే గెలుపు సాధ్యం
పట్నంబజారు: సమష్టి కృషితోనే కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు సాధ్యమని తూర్పు నియోజవకర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. టీడీపీ దుర్మార్గాలకు ఎదురొడ్డి వైఎస్సార్ సీపీ జెండాను భుజాన వేసుకున్న వారికే ప్రాధాన్యముంటుందని స్పష్టం చేశారు. అరండల్‌పేటలోని జిల్లా పార్టీ కార్యాయలంలో సోమవారం నగర ముఖ్య నేతలు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అధికార పార్టీ నేతల ఎత్తులను చిత్తు చిత్తు చేయాలన్నారు. బూత్ కమిటీ నుంచి డివిజన్ వరకు అన్ని విభాగాలు పూర్తి చేయాలని సూచించారు. కార్పొరేషన్‌పై వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడేందుకు కృషిచేయాలని కోరారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాలుపురం రాము), లక్కాకుల థామస్‌నాయుడు, ఎండీ నసీర్‌అహ్మద్, ఈచంపాటి వెంకటMýృష్ణ (ఆచారి), పార్టీ నేత కిలారి రోశయ్య మాట్లాడుతూ ఎన్నికలంటే భయంపుట్టే ఓట్లు తొలగిస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు పోలూరి వెంకటరెడ్డి, అత్తోట జోసఫ్, అంగడి శ్రీనివాసరావు, మామిడి రాము, శిఖా బెనర్జీ, మాలె దేవరాజు, దేవానంద్, మండేపూడి పురుషోత్తం, మేడా సాంబశివరావు, కొరిటిపాటి ప్రేమ్‌కుమార్, గనిక ఝాన్సీరాణి, నిమ్మరాజు శారదాలక్ష్మి, ఆరుబండ్ల కొండారెడ్డి, జగన్‌కోటి, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మేరువ నర్సిరెడ్డి, దాసరి కిరణ్, పల్లపు శివ, షేక్ జానీ, సుంకర రామాంజనేయులు, సోమికమల్, తోట మణికంఠ, దుగ్గెంపూడి యోగేశ్వరరెడ్డి, నరాలశెట్టి అర్జున్, అన్ని డివిజన్‌ల అధ్యక్షులు, పార్టీ ముఖ్యనేతలు పాల్గోన్నారు.