T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు) | T20 World Cup 2007 Winning Cricketer Joginder Sharma Now Police Officer: See Photos | Sakshi
Sakshi News home page

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

Published Fri, May 31 2024 9:07 PM | Last Updated on

T20 World Cup 2007 Winning Cricketer Joginder Sharma Now Police Officer: See Photos1
1/13

ఏరికోరి కెరీర్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నామని భావిస్తున్న తరుణంలో.. ఒక్కోసారి ఊహించని రీతిలో జీవితం మలుపు తిరుగుతుంది. (PC: Instagram)

T20 World Cup 2007 Winning Cricketer Joginder Sharma Now Police Officer: See Photos2
2/13

నీ గమ్యం ఇది కాదు.. ఇంకేదో ఉందనే సంకేతాలు ఇస్తుంది. (PC: Instagram)

T20 World Cup 2007 Winning Cricketer Joginder Sharma Now Police Officer: See Photos3
3/13

టీ20 ప్రపంచకప్‌-2007 టీమిండియా ‘హీరో’ జోగీందర్‌ శర్మ జీవితంలో ఇలాగే జరిగింది. (PC: Instagram)

T20 World Cup 2007 Winning Cricketer Joginder Sharma Now Police Officer: See Photos4
4/13

2007లో ప్రవేశపెట్టిన టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో ధోని సేన ఫైనల్‌కు చేరుకుంది. (PC: Instagram)

T20 World Cup 2007 Winning Cricketer Joginder Sharma Now Police Officer: See Photos5
5/13

చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఫైనల్లో తలపడింది. సౌతాఫ్రికాలోని జొహన్నస్‌బర్గ్‌లో ఉన్న ది వాండరర్స్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ను మట్టికరిపించింది. (PC: Instagram)

T20 World Cup 2007 Winning Cricketer Joginder Sharma Now Police Officer: See Photos6
6/13

ఆఖరి నిమిషం వరకు తీవ్ర ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ధోని సేన 5 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి మొట్టమొదటి టీ20 ప్రపకంచప్‌ను తమ సొంతం చేసుకుంది. (PC: Instagram)

T20 World Cup 2007 Winning Cricketer Joginder Sharma Now Police Officer: See Photos7
7/13

కీలకమైన ఈ మ్యాచ్‌లో ఏమాత్రం అనుభవం లేని జోగీందర్‌ శర్మకు ఆఖరి ఓవర్లో ధోని బంతినివ్వడం అందరినీ విస్మయపరిచింది. పాక్‌ గెలవాలంటే నాలుగు బంతుల్లో 6 పరుగులు అవసరమైన వేళ జోగీందర్‌ తడబడకుండా తెలివిగా బౌలింగ్‌ చేశాడు. (PC: Instagram)

T20 World Cup 2007 Winning Cricketer Joginder Sharma Now Police Officer: See Photos8
8/13

అతడి బౌలింగ్‌లో పాక్‌ క్రికెటర్‌ మిస్బా ఉల్‌ హక్‌ స్కూప్‌ షాట్‌ ఆడగా.. శ్రీశాంత్‌ అద్భుత రీతిలో క్యాచ్‌ అందుకున్నాడు. ఫలితంగా భారత్‌కు చిరస్మరణీయ విజయం దక్కింది. ఈ మ్యాచ్‌లో అతడు మొత్తంగా 3.3 ఓవర్లు బౌలింగ్‌ చేసి 20 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. . (PC: Instagram)

T20 World Cup 2007 Winning Cricketer Joginder Sharma Now Police Officer: See Photos9
9/13

హర్యానాలో 1983, అక్టోబరు 23న జన్మించిన బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ జోగీందర్‌ శర్మ.. ప్రస్తుతం పోలీస్‌ అధికారిగా పనిచేస్తున్నారు. టీమిండియా ‍టీ20 ప్రపంచకప్‌ హీరోగా నిలిచిన జోగీందర్‌ను హర్యానా ప్రభుత్వం ఈ మేరకు సముచిత గౌరవంతో సత్కరించింది. (PC: Instagram)

T20 World Cup 2007 Winning Cricketer Joginder Sharma Now Police Officer: See Photos10
10/13

టీమిండియా తరఫున మొత్తంగా జోగీందర్‌ 4 వన్డేలు, 4 టీ20లు ఆడారు. (PC: Instagram)

T20 World Cup 2007 Winning Cricketer Joginder Sharma Now Police Officer: See Photos11
11/13

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 289 వికెట్లు తీయడంతో పాటు 2689 పరుగులు చేశారు. (PC: Instagram)

T20 World Cup 2007 Winning Cricketer Joginder Sharma Now Police Officer: See Photos12
12/13

అంతర్జాతీయ కెరీర్‌లో వన్డేల్లో ఒకటి, టీ20లలో నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. (PC: Instagram)

T20 World Cup 2007 Winning Cricketer Joginder Sharma Now Police Officer: See Photos13
13/13

రైట్‌ఆర్మ్‌ పేసర్‌ అయిన జోగీందర్‌ 2007లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌.. 2011లో ఆఖరి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడారు. (PC: Instagram)

Advertisement
 
Advertisement
Advertisement