Joginder Sharma
-
ఎన్నేళ్లయిందో.. నిన్ను కలవడం సంతోషంగా ఉంది మహీ (ఫొటోలు)
-
T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)
-
టీమిండియా టీ20 వరల్డ్‌కప్-2007 హీరోపై కేసు! కారణమిదే..
టీమిండియా మాజీ క్రికెటర్, 2007 ప్రపంచకప్ హీరో జోగీందర్ శర్మ చిక్కుల్లో పడ్డారు. హరియాణా పోలీస్ శాఖలో ప్రస్తుతం డిప్యూటీ సూపరింటెండెంట్(డీఎస్పీ)గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన ఓ వ్యక్తి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జోగీందర్ శర్మపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా హిసార్‌కు చెందిన పవన్ అనే వ్యక్తి జనవరి 1న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడి తల్లి.. ఆస్తి తగాదాల వల్ల తలెత్తిన సమస్య కారణంగానే తన కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందుకే ఆయన పేరు కూడా చేర్చారు! ఇందులో భాగంగా జోగిందర్ శర్మ సహా ఆరుగురి పేర్లను తన ఫిర్యాదులో ఆమె ప్రస్తావించింది. ప్రస్తుతం న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న తమ ఆస్తి కేసు విషయంలో ఐదుగురు వ్యక్తులు తమపై ఒత్తిడి తీసుకువస్తున్నారని చెప్పినా.. డీఎస్పీగా ఉన్న జోగీందర్ శర్మ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తన ఫిర్యాదులో జోగీందర్ శర్మ పేరును కూడా చేర్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పవన్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలతో నిందితులతో పాటు జోగీందర్ శర్మపై కూడా హరియాణా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశాం కాగా పవన్ బలవన్మరణం నేపథ్యంలో తమకు జరిగిన అన్యాయానికి బదులుగా ప్రభుత్వం పరిహారం చెల్లించాలని అతడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఆర్థిక సాయం అందించడంతో పాటు ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఈ కేసు పక్కదారి పట్టకుండా లోతుగా విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. అతనెవరో నాకు తెలియదు ఈ నేపథ్యంలో బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అయితే, ఈ విషయంపై స్పందించిన జోగీందర్ శర్మ.. ‘‘నాకు అసలు ఈ కేసు గురించి తెలియదు. పవన్ అనే వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. అతడిని ఒక్కసారి కూడా కలవలేదు’’ అని పేర్కొన్నారు. ఈ మేరకు ఇండియా టుడే కథనం ప్రచురించింది. ధోని నమ్మకం నిలబెట్టి.. ప్రపంచకప్‌ను ముద్దాడి టీ20 ఫార్మాట్లో 2007లో తొలిసారి ప్రవేశపెట్టిన ప్రపంచకప్ ట్రోఫీని టీమిండియా గెలవడంలో జోగీందర్ శర్మది కీలక పాత్ర. సౌతాఫ్రికా వేదికగా దాయాది పాకిస్తాన్‌తో నువ్వా- నేనా అన్నట్లు పోటాపోటీగా సాగిన ఫైనల్లో.. నాటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆఖరి ఓవర్లో బంతిని జోగీందర్‌కు ఇచ్చాడు. అప్పటికి పాక్ గెలవాలంటే నాలుగు బంతుల్లో ఆరు పరుగులు కావాలి. అలాంటి సమయంలో జోగీందర్ తెలివిగా బౌలింగ్ చేశాడు. అతడు సంధించిన బంతిని పాక్ క్రికెటర్ మిస్బా ఉల్ హక్ స్కూప్ షాట్ ఆడగా.. శ్రీశాంత్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో పాక్ ఓడింది.. టీమిండియా ప్రపంచకప్‌ను ముద్దాడింది. సీఎస్కేకు ఆడిన జోగీందర్ శర్మ ఇక నాటి మ్యాచ్‌లో జోగీందర్ శర్మ మొత్తంగా 3.3 ఓవర్ల బౌలింగ్‌లో 20 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఐపీఎల్లో 2010, 2011 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించి రెండు సందర్భాల్లోనూ విజేతగా నిలిచిన జట్టులో భాగమయ్యాడు. 2011 తర్వాత ఆటకు దూరమైన జోగీందర్ శర్మ క్రికెట్‌కు అందించిన సేవల నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం పోలీస్ ఉద్యోగం ఇచ్చింది. ప్రస్తుతం ఆయన డీఎస్పీగా ఉన్నట్లు సమాచారం. ఇక టీమిండియా తరఫున 4 వన్డే, 4 టీ20లు ఆడిన రైటార్మ్ పేసర్ జోగీందర్ శర్మ ఆయా ఫార్మాట్లలో ఒకటి, నాలుగు వికెట్లు తీశారు. NOTE: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ►ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 ►మెయిల్: roshnihelp@gmail.com. చదవండి: తరానికొక్క ఆటగాడు.. ముంబై అలా చేయకపోతే టీమిండియాకు నష్టం -
ధోని నమ్మకం నిలబెట్టిన ప్రపంచకప్ విజేత, 2 సార్లు ఐపీఎల్ ‘విన్నర్’.. ఇప్పుడు పోలీస్
మనం అనుకున్న కెరీర్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నామని భావిస్తున్న తరుణంలో.. ఒక్కోసారి అనూహ్య రీతిలో జీవితం మలుపు తిరుగుతుంది. నీ మజిలీ ఇది కాదు.. ఇంకేదో ఉందనే సంకేతాలు ఇస్తుంది. అందుకు తగ్గట్లుగానే మనం కూడా మారాల్సి ఉంటుంది. టీ20 ప్రపంచకప్-2007 టీమిండియా ‘హీరో’ జోగీందర్ శర్మ జీవితంలో ఇలాగే జరిగింది. మొట్టమొదటి విజేతగా భారత్ 2007లో పొట్టి ఫార్మాట్లో ప్రవేశపెట్టిన వరల్డ్‌కప్ టోర్నీలో ధోని సేన ఫైనల్‌కు చేరుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తుదిపోరులో తలపడింది. సౌతాఫ్రికాలోని జొహన్నస్‌బర్గ్‌లో ఉన్న ది వాండరర్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో దాయాదిని మట్టికరిపించింది. ఆఖరి నిమిషం వరకు తీవ్ర ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ధోని సేన 5 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి తొట్టతొలి టీ20 ప్రపకంచప్ విజేతగా నిలిచింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా ఈ మేరకు సరికొత్త చరిత్ర సృష్టించి రికార్డుల్లోకెక్కింది. ధోని నమ్మకం నిలబెట్టాడు ఇక ఈ మ్యాచ్‌లో ఏమాత్రం అనుభవం లేని జోగీందర్ శర్మకు ఆఖరి ఓవర్లో ధోని బంతినివ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, అతడు ఏమాత్రం తడబడలేదు. పాక్ గెలవాలంటే నాలుగు బంతుల్లో 6 పరుగులు అవసరమైన వేళ తెలివిగా బౌలింగ్ చేశాడు. అతడి బౌలింగ్‌లో పాక్ క్రికెటర్ మిస్బా ఉల్ హక్ స్కూప్ షాట్ ఆడగా.. శ్రీశాంత్ అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్నాడు. దీంతో భారత్‌కు చిరస్మరణీయ విజయం దక్కింది. ఈ క్రమంలో ధోని జట్టులో భాగమై విన్నింగ్ వికెట్ తీసిన జోగీందర్ శర్మకు మంచి పేరు వచ్చింది. ఈ మ్యాచ్‌లో అతడు మొత్తంగా 3.3 ఓవర్లు బౌలింగ్ చేసి 20 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. రెండుసార్లు ఐపీఎల్ విన్నర్ ఇక ఆ మరుసటి ఏడాది.. ఐపీఎల్లో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు జోగీందర్. 2008- 2012 వరకు అదే ఫ్రాంఛైజీతో కొనసాగాడు. 2010, 2011లో సీఎస్కే ట్రోఫీ గెలిచిన సందర్భాల్లో భాగమయ్యాడు. పోలీస్ ఉన్నతాధికారిగా 1983, అక్టోబరు 23న హర్యానాలో జన్మించిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ జోగీందర్ శర్మ ప్రస్తుతం పోలీస్ అధికారిగా పనిచేస్తున్నారు. టీమిండియా టీ20 ప్రపంచకప్ హీరోగా నిలిచిన జోగీందర్‌ను హర్యానా ప్రభుత్వం ఈ మేరకు సముచిత గౌరవంతో సత్కరించింది. ప్రస్తుతం ఆయన డిప్యూటీ సూపరింటెండెంట్ హోదాలో ఉన్నట్లు సమాచారం. కాగా కోవిడ్ విజృంభణ సమయంలో జోగీందర్ ఫ్రంట్‌లైన్ వర్కర్‌గా హిసార్‌లో సేవలు అందించారు కూడా! కాగా జోగీందర్ 2007లో ఆడిన ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్ మ్యాచే జోగీందర్ ఆడిన చివరి అంతర్జాతీయ టీ20 కూడా!! ఎన్ని మ్యాచ్‌లు అంటే ఇక టీమిండియా తరఫున మొత్తంగా 4 వన్డేలు, 4 టీ20లు ఆడిన జోగీందర్.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 289 వికెట్లు తీయడంతో పాటు 2689 పరుగులు చేశారు. అంతర్జాతీయ కెరీర్లో వన్డేల్లో ఒకటి, టీ20లలో నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. రైట్ఆర్మ్ పేసర్ అయిన జోగీందర్ 2007లో చివరి అంతర్జాతీయ మ్యాచ్.. 2011లో ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ ఆడారు. చదవండి: ధోని నమ్మకం నిలబెట్టిన ప్రపంచకప్ విజేత, 2 సార్లు ఐపీఎల్ ‘విన్నర్’.. ఇప్పుడు పోలీస్ -
రిటైర్మెంట్ ప్రకటించిన 2007 టి20 ప్రపంచకప్ హీరో
2007 టి20 ప్రపంచకప్ హీరో, టీమిండియా వెటరన్ క్రికెటర్ జోగిందర్ శర్మ శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్ సహా అన్ని రకాల ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. ఈ విషయాన్ని జోగిందర్ శర్మ తన ట్విటర్లో ప్రత్యేక లేఖ ద్వారా పంచుకున్నాడు. ''అంతర్జాతీయం సహా అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. 2002 నుంచి 2017 వరకు సాగిన నా క్రికెట్ జర్నీలో ఎన్నో ఏడాదులు అద్బుతంగా గడిచాయి. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం నేను సాధించిన గొప్ప గౌరవం. ఈ అవకాశం కల్పించిన బీసీసీకి కృతజ్ఞతలు. ఐసీసీ తొలిసారి నిర్వహించిన టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడిగా ఉండడం నా అదృష్టం. ఆరోజు ధోని నన్ను నమ్మి బంతిని చేతిలో పెట్టడం.. ఒత్తిడిలో బౌలింగ్ చేసి టీమిండియాను గెలిపించడం ఎప్పటికి మరిచిపోను. ఇక దేశవాలీ క్రికెట్లో నాకు సహకరించిన హర్యానా క్రికెట్ అసోసియేషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. రిటైర్మెంట్ తర్వాత ఇష్టపడ్డ క్రికెట్లోనే కొనసాగాలనుకుంటున్నా. భిన్నమైన వాతావరణంలో నన్ను నేను సవాలు చేసుకుంటూ ముందుకు కొనసాగుతా. క్రికెటర్‌గా నా ప్రయాణంలో ఇది తదుపరి దశ అనుకుంటున్నా.. నా జీవితంలో కొత్త అధ్యాయం కోసం ఎదురుచూస్తున్నా'' అంటూ పేర్కొన్నాడు. Announced retirement from cricket Thanks to each and everyone for your love and support 🙏❤️👍👍 pic.twitter.com/A2G9JJd515 — Joginder Sharma 🇮🇳 (@MJoginderSharma) February 3, 2023 హర్యానాలోని రోహ్తక్ నుంచి వచ్చిన జోగిందర్ శర్మ 2004లో బంగ్లాదేశ్‌తో వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో నాలుగు వన్డేలు, నాలుగు టి20లు ఆడిన జోగిందర్ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2007 టి20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జోగిందర్ శర్మకు చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావడం గమనార్హం. . ఒక్క ఓవర్‌తో హీరో అయ్యాడు.. జోగిందర్ శర్మ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది 2007 టి20 ప్రపంచకప్. సౌతాఫ్రికా వేదికగా ఐసీసీ నిర్వహించిన తొలి ఎడిషన్ ప్రపంచకప్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా ఛాంపియన్‌గా అవతరించింది. ధోని నేతృత్వంలోని యువ రక్తంతో కూడిన జట్టు అంచనాలకు మించి రాణించి విజేతగా నిలిచింది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఫైనల్ మ్యాచ్ జరగడం హైలైట్ అనుకుంటే.. నరాలు తెగే ఉత్కంఠతో మ్యాచ్ సాగడం మరో హైలైట్. ఇక చివరి ఓవర్లో పాక్ విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. అప్పటికే పాక్ బ్యాటర్ మిస్బా ఉల్ హక్ క్రీజులో పాతుకుపోయాడు. ఎవరు ఊహించని విధంగా ధోని బంతిని జోగిందర్ శర్మ చేతికి ఇచ్చాడు. ఏమాత్రం అనుభవం లేని బౌలర్‌కు ఆఖరి ఓవర్‌ను ఇవ్వడం ఏంటని అంతా ఆశ్చర్యపోయారు. కానీ ధోని జోగిందర్‌ను నమ్మాడు. తనపై ఉంచిన నమ్మకాన్ని జోగిందర్ నిలబెట్టుకున్నాడు. నాలుగు బంతుల్లో ఆరు పరుగులు కావాల్సిన దశలో జోగిందర్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. ఆ ఒత్తిడిలోనే జోగిందర్ బంతి వేయగా.. మిస్బా స్కూప్ షాట్ ఆడడం.. ఫైన్‌లెగ్‌లో శ్రీశాంత్ స్టన్నింగ్ క్యాచ్ అందుకోవడంతో పాక్ కథ ముగిసింది. అలా టీమిండియా 2007లో నిర్వహించిన తొలి టి20 ప్రపంచకప్‌లో విజేతగా అవతరించింది. చదవండి: Ian Botham: 'భారత్‌లో టెస్టు క్రికెట్ చచ్చిపోయే దశలో ఉంది' నాలుగురన్నరేళ్లు దాటింది.. టెస్టుల్లో రీ ఎంట్రీపై హార్దిక్ కీలక వ్యాఖ్యలు -
'ఆట కంటే డ్యూటీనే కష్టంగా ఉంది'
హిసార్ : 'క్రికట్ కంటే నాకు ఈ పోలీస్ డ్యూటీనే కష్టంగా ఉందంటూ' 2007 టీ20 ప్రపంచకప్ హీరో జోగిందర్ శర్మ పేర్కొన్నాడు. జోగిందర్ శర్మ క్రికెట్‌కు దూరమైన తర్వాత హర్యానాలోని హిసార్ జిల్లా డీఎప్పీగా విధుల నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించి అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. జోగిందర్ కూడా అందరి పోలీసుల్లాగే డీఎస్పీగా కరోనా విధులు నిర్వహిస్తున్నాడు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు తాను 24 గంటల పాటు విధులు నిర్వహిస్తున్నానని జోగి చెప్పుకొచ్చాడు. ఆటతో పోలిస్తే ఈ డ్యూటీ కొంచెం కష్టంగానే అనిపిస్తున్నప్పటికి తాను దేశం కోసమే సేవ చేస్తుండడంతో బాధ అనేది లేదని పేర్కొన్నాడు. (ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ అవసరమా?) 'పొద్దున ఉదయం 6గంటలకు లేవడంతో నా డ్యూటీ మొదలవుతుంది. రోజూ ఉదయం 9గంటలకు డ్యూటీ నిమ్మిత్తం వెళ్లి రాత్రి 8గంటల తర్వాత కూడా ఎమర్జెన్సీ కాల్స్ ఉండడంతో 24 గంటల పాటే విధులు నిర్వహిస్తున్నా. నా పరిధిలో హిసార్ జిల్లా రూరల్ భాగం ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రతీరోజు చెక్‌పోస్ట్ వద్ద నిలబడి బస్ డ్రైవర్లకు, ప్రైవేటు వాహనాలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నాం. ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా ఉండండి.. అవసరం ఉంటేనే బయటికి రండి అని సూచిస్తున్నాం. ఇంకా కొన్ని సందర్భాల్లో దేశంలో లాక్డౌన్ ఉండడంతో యూపీ, బీహార్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కాలి నడకన వారి సొంతూళ్లకు చేరుకుంటున్నారు. నేను నా టీంతో కలిసి వారిని ఆపి కరోనాపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లకు తరలిస్తున్నాం. ఇదంతా కష్టంగా అనిపిస్తున్నా దేశంకోసమే చేస్తున్నాననుకొని సరిపెట్టుకుంటున్నా. నా కుటుంబంతో కలిసి రోహ్తక్లో నివసిస్తున్న నాకు హిసార్ ప్రాంతం 110 కిలోమీటర్లు ఉంటుంది. ఇంటికి వెళ్లే అవకాశం ఉన్నా.. డ్యూటీ నేపథ్యంలో రోజుకు ఎంతోమందిని కలవడంతో ఇంటికి వెళ్లకూడదని నిశ్చయించుకున్నా' అంటూ చెప్పుకొచ్చాడు.(నెట్వర్క్ కోసం చెట్లు ఎక్కుతూ అంపైర్ పాట్లు!) 2007 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో ఆఖరి ఓవర్ వేసిన జోగిందర్ అద్భుతమైన బౌలింగ్‌తో భారత్‌ను గెలిపించాడు. దీంతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన జోగిందర్ 2018లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్లో అందించిన సేవలకుగానూ హర్యానా ప్రభుత్వం అతన్ని డీఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా నియమించిన విషయం తెలిసిందే. జోగిందర్ శర్మ టీమిండియా తరపున 4 వన్డేలు, 4 టీ20లు ఆడాడు. ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 6వేలకు పైగా చేరుకోగా, మృతుల సంఖ్య 206కు చేరింది. -
ఈ భారత క్రికెటర్ రియల్ హీరో: ఐసీసీ
భారత మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ.. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాప్తి కట్టడికి నడుం బిగించాడు. ఆయన సొంత రాష్ట్రమైన హర్యాణాలో ఖాకీ దుస్తులు ధరించి వీధుల్లో డ్యూటీ చేస్తున్న అతని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) స్పందిస్తూ అతడిని రియల్ హీరోగా అభివర్ణించింది. ప్రపంచమంతా కరోనా సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో తనవంతు కృషి చేస్తున్నాడని కొనియాడింది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించడాన్ని నెటిజన్లు కీర్తిస్తూ ఆకాశానికెత్తుతున్నారు. కరోనా నుంచి జనాలను కాపాడేందుకు వీధుల్లో చెమటోడ్చుతున్నాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. 2007 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో ఆఖరి ఓవర్ వేసిన జోగిందర్ అద్భుతమైన బౌలింగ్‌తో భారత్‌ను గెలిపించాడు. దీంతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన జోగిందర్ 2018లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్లో అందించిన సేవలకుగానూ హర్యానా ప్రభుత్వం అతన్ని డీఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా నియమించిన విషయం తెలిసిందే. 2007: #T20WorldCup hero 🏆 2020: Real world hero 💪 In his post-cricket career as a policeman, India's Joginder Sharma is among those doing their bit amid a global health crisis. [📷 Joginder Sharma] pic.twitter.com/2IAAyjX3Se — ICC (@ICC) March 28, 2020 -
'ఓటమి బాధ్యత ధోని తీసుకున్నాడు'
న్యూఢిల్లీ: ఒక్క మ్యాచ్.. లక్ష ఉద్వేగాల సంగమం. అసలైన టీ20 మజా ఎలా ఉంటుందో రుచి చూపించిన మ్యాచ్. తీవ్రమైన ఉత్కంఠ.. బంతి బంతికి మారుతున్న సమీకరణలు. హోరాహోరీగా గెలుపుకోసం ఇరుజట్ల ప్రయత్నం. మ్యాచ్‌ను చూస్తున్న ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టింది. అది 2007, సెప్టెంబర్ 24వ తేదీన భారత-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన వరల్డ్ ట్వంటీ 20 ఫైనల్ మ్యాచ్ . ఆ మ్యాచ్ జరిగి సరిగ్గా నేటికి పదేళ్లు పూర్తయింది. ఆ మ్యాచ్ లో భారత జట్టు ఐదు పరుగుల తేడాతో గెలిచి వరల్డ్ ట్వంటీ 20 కప్ ను అందుకుంది. ఆ క్రమంలోనే వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరు కూడా మార్మోగిపోయింది. అయితే ఆనాటి ఫైనల్ ఓవర్ ను వేసిన జోగిందర్ శర్మ అప్పటి ఉద్వేగక్షణాల్ని మరొకసారి గుర్తు చేసుకున్నాడు.'ధోని నా వద్దకు వచ్చి బంతిని అప్పగించాడు. మేము గెలవాలంటే వికెట్ తీస్తే చాలు. పాకిస్తాన్ గెలవాలంటే 13 పరుగులు కావాలి. ఇదే విషయాన్ని నాకు బంతిని అప్పగించే క్రమంలో ధోని చెప్పాడు. నన్ను ఎటువంటి ఒత్తిడి లోనుకాకుండా బౌలింగ్ చేయమన్నాడు. ఒకవేళ ఓడిపోతే ఆ బాధ్యతను నేను తీసుకుంటానని ధోని అన్నాడు. దాంతో నాపై ఉన్న భారం దిగినట్లు అనిపించింది. ఇక ఎటువంటి ఆందోళన లేకుండా బౌలింగ్ చేయడానికి సిద్ద పడ్డా'అని అప్పటి జ్ఞాపకాల్ని జోగిందర్ శర్మ నెమరువేసుకున్నాడు. పాకిస్తాన్‌తో ఫైనల్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు గంభీర్ (75) ప్రదర్శనతో 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. పాకిస్తాన్ మాత్రం 19.3 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌట్ కావడంతో 5 పరుగులతో విజయం సాధించిన ధోని సేన కప్‌ను ముద్దాడింది. మిస్బావుల్ హక్ చివరి వరకు ప్రమాదకరంగా కనిపించినా... అతని ఒక్క షాట్‌తో పాక్ తలరాత మారిపోయింది. ఆఖరి ఓవర్లో పాక్ విజయానికి 13 పరుగులు అవసరం. సీనియర్ హర్భజన్ సింగ్‌ను కాదని పేసర్ జోగీందర్ శర్మపై కెప్టెన్ ధోని నమ్మకముంచాడు. ‘ఎవరూ నీ మ్యాచ్‌లు చూడని సమయంలో దేశవాళీ క్రికెట్లో అంకితభావంతో ఎన్నో ఓవర్లు వేసి ఉంటావు. భయపడకు, క్రికెట్ ఈసారి నిన్ను నిరాశపర్చదు’... ఇవీ జోగీందర్‌కు ఆ సమయంలో ధోని చెప్పిన మాటలు. అయితే మిస్బా సిక్సర్ బాదడంతో తొలి 2 బంతుల్లో 7 పరుగులు వచ్చాయి. మరో 4 బంతుల్లో 6 పరుగులు చేస్తే చాలు. అయితే మూడో బంతిని స్కూప్ షాట్ ఆడే ప్రయత్నంలో మిస్బా గాల్లోకి లేపడం... షార్ట్ ఫైన్ లెగ్‌లో శ్రీశాంత్ క్యాచ్ పట్టుకోవడం అంతా కలలా జరిగిపోయింది. అంతే... భారత్ సంబరాలకు అంతు లేకుండా పోయింది. -
భారత క్రికెటర్ తండ్రిపై కత్తితో దాడి!
రోహ్తక్: క్రికెటర్ జోగిందర్ శర్మ తండ్రి ఓం ప్రకాశ్‌శర్మపై రోహ్తక్లో దాడి జరిగింది. ఇద్దరు దుండుగులు ఆయనను కత్తితో పొడిచి.. దోపిడీకి పాల్పడ్డారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం రాత్రి68 ఏళ్ల ఓం ప్రకాశ్ రోహతక్ కాథ్‌మండి సమీపంలో తన కిరాణ దుకాణాన్ని మూసేస్తూ ఉండగా ఇద్దరు యువకులు దుకాణానికి వచ్చారు. కూల్‌డ్రింక్స్, సిగరెట్లు తీసుకొని వెళ్లిపోయినట్టే వెళ్లిపోయి.. తిరిగి వచ్చి ఓంప్రకాశ్‌పై దాడి చేశారు. 'వాళ్లు మొదట నా జేబులో నుంచి డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించారు. నేను వారిని అడ్డుకోవడంతో కత్తితో కడుపులో పొడిచారు. వారు దుకాణంలోని డబ్బునంతా తీసుకొని వెళ్లారు. రూ. 7వేల వరకు పట్టుకొని పోయారు' అని ఓంప్రకాశ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. దుండగులు గాయపడిన శర్మను దుకాణంలోనే ఉంచి.. బయటనుంచి మూసేసి వెళ్లిపోయారు. అనంతరం స్థానికులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా చివరి ఓవర్ వేసి.. భారత్ జట్టుకు బౌలర్ జోగిందర్ శర్మ విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. -
ద న్యూ జోగిందర్ శర్మ ఈజ్..
సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని మరిపించే రీతిలో అత్యంత ఉత్కంఠభరితంగా ఉద్వేగ భరితంగా సాగిన బెంగళూరు టీ20 మ్యాచ్ గురించే ఇప్పుడు సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఆఖరి ఓవర్లో అనూహ్యమైన మలుపులతో సాగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను భారత్ కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడించింది. చివరి ఓవర్లో బంగ్లా విజయానికి 11 పరుగులు కావాల్సి ఉండగా.. ఎంఎస్ ధోనీ యువ బౌలర్ హర్థిక్ పాండ్యాకు బంతి ఇచ్చాడు. యువకుడు. పెద్దగా అనుభవం లేదు. అయినా నవ్వుతూ బంతిని చేతిలోకి తీసుకున్న పాండ్యా కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మిస్టర్ కూల్ కెప్టెన్ ధోనీ చెప్పిన సూచలను అక్షరాల పాటించి.. టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. తీవ్రస్థాయి ఉత్కంఠ, ఒత్తిడి నడుమ ఈ యంగ్‌స్టర్ ప్రశాంతంగా ఆడాడు. ఎక్కడా ఆందోళనకు గురికాలేదు. చివరి ఓవర్ లో అతడు వేసిన తొలి మూడు బంతులకు ఒక సింగిల్, రెండు ఫోర్లతో తొమ్మిది పరుగులు వచ్చాయి. ఇంకా రెండు పరుగులు చేస్తే బంగ్లా విజయం. అయినా మొక్కవోని ధైర్యంతో, కెప్టెన్ సూచనలతో పాండ్యా చివరి మూడు బంతుల్లో మ్యాజిక్ చేశాడు. ఒక్క పరుగు ఇవ్వకుండానే మూడు వికెట్లు పడ్డాయి. భారత్ గెలిచింది. ఆ మ్యాజిక్ బౌలింగ్ చాలామందికి జోగిందర్ శర్మని గుర్తుకుతెచ్చింది. 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. భారత్ మొదట బ్యాటింగ్ చేసి 157 పరుగులు చేసింది. 19 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ 9వికెట్లకు 145 పరుగులు చేసింది. చివరి ఓవర్లలో 13 పరుగులు చేయాలి. సరిగ్గా ఇప్పటిలాంటి పరిస్థితే. కెప్టెన్ ధోనీ కొత్త బౌలర్ జోగిందర్ శర్మపై నమ్మకముంచి బంతిని ఇచ్చాడు. మిస్బావుల్ హక్ అప్పటికే క్రీజులో దూకుడు మీద ఉన్నాడు. పాక్ విజయం ఖాయం అనుకుంటున్న తరుణం. జోగిందర్ వేసిన మొదటి బాల్ వైడ్. రెండో బాల్ డాట్. మూడో బంతి జోగిందర్ ఫుల్‌టాస్ వేయడంతో మిస్బా సిక్స్ బాదాడు. దీంతో పాక్ విజయానికి 4 బంతుల్లో ఆరు పరుగులు కావాలి. జోగిందర్ నాలుగో బంతికి మ్యాజిక్ చేశాడు. అతను విసిరిన బంతిని షార్ట్ ఫైన్‌లెగ్‌లో స్కూప్‌షాట్ ఆడబోయాడు మిస్బా. పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీశాంత్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. పాక్ ఆలౌట్. భారత్ అలా తొలి టీ20 వరల్డ్‌కప్ ను అందుకొని మధురమైన చరిత్రను లిఖించింది. అదే సీన్ మళ్లీ ఇప్పుడు రిపీట్ అయిందని నెటిజన్స్ ట్విట్టర్లో పాండ్యాను ప్రశంసిస్తున్నారు. ట్విట్టర్లో చివరి ఓవర్‌పై అనేక కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. చివరి ఓవర్లో తడబాటుకు గురికాకుండా బౌలింగ్ చేసిన పాండ్యాను ఆత్మవిశ్వాసాన్ని నెటిజన్లు వేనోళ్ల కొనియాడుతున్నారు. Pandya may not be the best bowler, but he is a confident one. He was smiling even after being hit for two consecutive boundaries. #BANvsIND — neobluepanther (@neobluepanther) March 23, 2016 Years back it was Joginder Sharma. Today it's Pandya. What remains consistent is fine captaincy of @msdhoni #IndvsBan — Ravinder Singh (@_RavinderSingh_) March 23, 2016 And take a bow Hardik Pandya! Young man who bowled last over with a smile!