సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్ష విజయంతో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తామని టీఆర్ఎస్ పార్టీ ధీమాతో ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం ఖయమని పార్టీ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో సంబరాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా ఇప్పటికే కేటీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు.ఫలితాల ట్రెండింగ్ ప్రారంభం కాగానే సంబరాలు నిర్వహించనున్నారు.అనంతరం పార్టీ నేతలతో మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమవనున్నారు. ఎక్స్ అఫిషియో ఓట్లపై కూడా కేటీఆర్ చర్చించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌కు చేరుకున్న రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు,ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి,సుధాకర్ రెడ్డి,నవీన్‌లు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. కాగా మేయర్, చైర్మన్ అభ్యర్థులపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం రేపు తీసుకోనున్నారు. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ మేయర్, చైర్మన్ లిస్ట్ సీల్డ్ కవర్‌లో పెట్టి ఎమ్మెల్యేలకు అందజేయనున్నారు.
(మున్సిపల్ ఎన్నికలు : కౌంటింగ్ అప్‌డేట్స్)
అవసరమైన చోట క్యాంపులు...
మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవుల కోసం పార్టీలో అంతర్గత పోటీ ఉన్న చోట పార్టీ తరఫున గెలుపొందిన వారిలో చీలిక రాకుండా నివారించడంతో పాటు, విపక్ష పార్టీలు ఎక్కువ స్థానాలు సాధించే మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు చేజారకుండా అప్రమత్తంగా ఉండాలని పార్టీ ఆదేశించింది. రెబెల్స్ బరిలో ఉన్నచోట మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని వారి మద్దతు కూడా టీఆర్‌ఎస్ మేయర్, చైర్మన్ అభ్యర్థులకే లభించేలా చర్యలు చేపట్టనుంది. ఈ నెల 27న మేయర్, చైర్మన్ల ఎన్నిక నేపథ్యంలో రెండు రోజుల పాటు పార్టీ తరఫున గెలుపొందిన వారిని అవసరమైన క్యాంపులకు తరలించాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment