confident
-
ఆ కాన్ఫిడెంట్ ఏంటి ?..హ్యాట్సాఫ్ జగన్
-
Madhya Pradesh: ‘24 గంటలు ఆగండి.. పూర్తి మెజార్టీ మాదే’
గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లో బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా విశ్వాసం వ్యక్తం చేశారు. రేపు (డిసెంబర్ 3) ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో సింధియా శనివారం గ్వాలియర్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘రేపటి కౌంటింగ్లోమాకు పూర్తి విశ్వాసం ఉంది. పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. 24 గంటలు ఆగండి.. ఫలితాలు మన ముందే ఉంటాయి’ అన్నారు. ఇంతకుముందు మాట్లాడిన ముఖ్యమంత్రి, బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా భారీ మెజారిటీతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలోని అన్ని వర్గాల నుంచి మద్దతు లభించిందని, అత్యధిక మెజారిటీతో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని సీఎం చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 17న ఎన్నికలు నిర్వహించగా 77.15 శాతం ఓటింగ్ నమోదైంది. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటికే అత్యధిక ఎగ్జిట్ పోల్స్ జీజేపీ వైపే మొగ్గు చూపాయి. -
‘అది 440 వోల్ట్ల కరెంట్.. కాంగ్రెస్‌కే షాకిస్తుంది’
జైపూర్: రాజస్థాన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 135 సీట్లు గెలుచుకుంటుందని, రాష్ట్రంలో ఇది అతిపెద్ద విజయాలలో ఒకటిగా ఉంటుందని బీజేపీ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు రాజేంద్ర సింగ్ రాథోడ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా "అండర్ కరెంట్" (లోలోపల అనుకూలత) ఉందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలపై రాజేంద్ర సింగ్ రాథోడ్ వ్యంగ్యంగా స్పందించారు. "అండర్ కరెంట్ ఉందని గెహ్లాట్ సాబ్ చెప్పింది నిజమే. అది 440 వోల్ట్లు. ఆయన చెబుతున్న అండర్ కరెంట్ కాంగ్రెస్‌కే షాక్ ఇస్తుంది" అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రజలను ఆకట్టుకోలేదని, రాష్ట్రంలో ఆ పార్టీని గద్దె దించేందుకే ప్రజలు ఓట్లు వేశారని అన్నారు. ‘కాంగ్రెస్ అవమానకరమైన పరాజయం దిశగా అడుగులు వేస్తోంది. గ్రౌండ్ రిపోర్ట్‌ల ప్రకారం.. ఈ ఎన్నికల్లో బీజేపీ 135 సీట్లకు పైగా సాధిస్తుంది. ఇది అతిపెద్ద ఎన్నికల విజయాలలో ఒకటి’ అని రాథోడ్ పేర్కొన్నారు. నవంబర్ 25న రాజస్థాన్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 74 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని 200 స్థానాలకు గాను 199 స్థానాల్లో పోలింగ్ జరిగింది. మరో నాలుగు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్ ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. -
బద్వేల్ ఉప ఎన్నికలో భారీ మేజార్టీతో గెలుస్తాం
-
కోవిడ్-19 పై విజయం సాధిస్తాం: గడ్కరీ
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19 వ్యాక్సిన్‌ను భారత్ సాధ్యమైనంత త్వరలో పొందుతుందన్న విశ్వాసాన్ని కేంద్రం రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యక్తం చేశారు. ఆర్థిక యుద్ధంలో విజయం సాధించే దిశలో కరోనా మహమ్మారిని జయిస్తామన్న భరోసానిచ్చారు. లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమల శాఖ (ఎంఎస్ఎంఈ) మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న గడ్కరీ డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ నిర్వహించిన ఒక వెర్చువల్ సమావేశంలో చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే... (చదవండి: కరోనా : మోడర్నా మరో గుడ్ న్యూస్ చెప్పింది) ఇప్పుడు మెజారీటీ దేశాలు చైనాతో వ్యాపార సంబంధాలు కొనసాగించాలని కోరుకోవడంలేదు. ఆయా దేశాలు ప్రత్యామ్నాయంగా భారత్‌వైపు చూస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి భారత్‌కు ప్రత్యేకించి తయారీ రంగానికి సానుకూలాంశం. భారత్ ఎగుమతుల అభివృద్ధికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఒకపక్క చైనా నుంచి భారత్ దిగుమతులను తగ్గించుకుంది. అదే సమయంలో మన దేశ ఎగుమతులూ పెరిగాయి. ఎగుమతులు-దిగుమతుల విభాగంలో సానుకూల ధోరణులు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి ఎంఎస్ఎంఈ రంగం మహ్మమ్మారి సవాళ్లును అధిగమిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, రోబోటిక్స్, పర్యావరణం, పునరుత్పాదకత, స్మార్ట్ విలేజెస్ అభివృద్ధి, ఈ-మొబిలిటీవంటి అంశాల్లో భారత్ పురోగమిస్తోంది. ఆయా రంగాల్లో ఎంఎస్ఎంఈలు కూడా పనిచేసే వీలుంది. ఐఐటీ, ఎన్ఐఐటీ వంటి విద్యా, పరిశోధనా సంస్థల భాగస్వామ్యంతో పెద్ద సంఖ్యలో ఎక్స్‌లెన్స్ సెంటర్లను ఏర్పాటుపై ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ దృష్టి సారిస్తోంది. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ప్రస్తుత వార్షిక టర్నోవర్ విలువ రూ.80,000 కోట్లు. వచ్చే రెండేళ్లలో ఈ విలువను రూ.5 లక్షల కోట్లకు పెంచాలన్న లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ప్రజల్లో విశ్వాసాన్ని నింపాలి... కాగా, హొరాసిస్ ఆసియా సదస్సు 2020ను ఉద్ధేశించి చేసిన ఒక ప్రసంగంలో గడ్కరీ మాట్లాడుతూ, ఇప్పుడు ప్రజల్లో సానుకూలత, విశ్వాసం నింపడం ముఖ్యమన్నారు. ప్రతికూలత, అనుమానాస్పద వాతావరణం వల్ల పరిస్థితి మరింత క్లిష్టతరంగా మారుతుందని పేర్కొన్నారు. గణాంకాల ప్రాతిపదకన చూస్తే, ‘‘మనం త్వరలో సాధారణ పరిస్థితికి చేరుతున్న విషయం అర్థం అవుతుంది’’ అని గడ్కరీ పేర్కొన్నారు. -
గెలుపుపై టీఆర్ఎస్ ధీమా..
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్ష విజయంతో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తామని టీఆర్ఎస్ పార్టీ ధీమాతో ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం ఖయమని పార్టీ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో సంబరాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా ఇప్పటికే కేటీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు.ఫలితాల ట్రెండింగ్ ప్రారంభం కాగానే సంబరాలు నిర్వహించనున్నారు.అనంతరం పార్టీ నేతలతో మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమవనున్నారు. ఎక్స్ అఫిషియో ఓట్లపై కూడా కేటీఆర్ చర్చించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌కు చేరుకున్న రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు,ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి,సుధాకర్ రెడ్డి,నవీన్‌లు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. కాగా మేయర్, చైర్మన్ అభ్యర్థులపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం రేపు తీసుకోనున్నారు. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ మేయర్, చైర్మన్ లిస్ట్ సీల్డ్ కవర్లో పెట్టి ఎమ్మెల్యేలకు అందజేయనున్నారు. (మున్సిపల్ ఎన్నికలు : కౌంటింగ్ అప్డేట్స్) అవసరమైన చోట క్యాంపులు... మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవుల కోసం పార్టీలో అంతర్గత పోటీ ఉన్న చోట పార్టీ తరఫున గెలుపొందిన వారిలో చీలిక రాకుండా నివారించడంతో పాటు, విపక్ష పార్టీలు ఎక్కువ స్థానాలు సాధించే మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ కౌన్సిలర్లు చేజారకుండా అప్రమత్తంగా ఉండాలని పార్టీ ఆదేశించింది. రెబెల్స్ బరిలో ఉన్నచోట మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని వారి మద్దతు కూడా టీఆర్ఎస్ మేయర్, చైర్మన్ అభ్యర్థులకే లభించేలా చర్యలు చేపట్టనుంది. ఈ నెల 27న మేయర్, చైర్మన్ల ఎన్నిక నేపథ్యంలో రెండు రోజుల పాటు పార్టీ తరఫున గెలుపొందిన వారిని అవసరమైన క్యాంపులకు తరలించాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. -
డప్పు కొట్టి చెబుతా!
ఆడపిల్ల ఇది చేయకూడదు. అది చేయకూడదు. ఇలా ఉండకూడదు.. అలా ఉండకూడదు అనే హద్దులు ఈ నవీన సమాజంలోనూ ఇంకా సమసిపోలేదు. అలాంటిది ఓ ఇరవై ఏళ్ల క్రితం పరిస్థితులు ఎలా ఉండేవో చెప్పనవసరం లేదు. సవాలక్ష కట్టుబాట్లు, అనేకమైన ఆంక్షలు, అయినవాళ్లెవరూ ఆదుకోని పరిస్థితుల్లో కుటుంబాన్ని బతికించుకోవడం కోసం బుర్రకథ కళాకారిణిగా మారిందో అబల. పదకొండేళ్ల వయసులోనే బుర్రకథ ప్రవచనకర్తగా బతుకు పోరాటం మొదలుపెట్టి డప్పు వాయించడం తప్పనిసరి కావడంతో దానినీ నేర్చుకుని నాలుగొందల ప్రదర్శనలిచ్చిన ఆమె తనలాంటి ఎంతోమంది యువతులకు ఆదర్శం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఆడవాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకూడదని డప్పు వాయించి మరీ చెబుతా అంటున్న ఈ గౌరి కథ ఆమె మాటల్లోనే... నా పేరు కొట్యాడ గౌరి.. మాది లక్కవరపుకోట మండలం కొట్యాడ తలారి గ్రామం. నాకు 8 ఏళ్ళ వయస్సున్నప్పుడే అనారోగ్య కారణంగా నాన్న చనిపోయారు. అమ్మ, మేము ఇద్దరు అక్కచెల్లెళ్లం, ఒక తమ్ముడు ఉన్నాం. నేను రెండోదాన్ని. అమ్మకు వ్యవసాయపనులు ఏమీ రావు. దాంతో ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉండేది. అక్క కూలీపనికి వెళ్లితెచ్చిన డబ్బులతోనే అందరం బతకాలి. అక్క పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన తర్వాత కుటుంబ బాధ్యతలు నా భుజానికి ఎత్తుకోవాల్సి వచ్చింది. ఏడవ తరగతితో చదువు ఆపేసి చిన్న చిన్న పనులు చేస్తూ వచ్చిన డబ్బులతో కాలం గడిపేవాళ్లం. ఆ సమయంలో ఓ పెద్దాయన బుర్రకథ చెప్పమని నన్ను ప్రోత్సహించాడు. ఇంటి పరిస్థితుల కారణంగా అమ్మ కూడా అదే మంచిదనుకుంది. అలా బుర్రకథ బృందంలో ప్రవేశించాను. జట్టేడివలస గ్రామానికి చెందిన కెళ్ల సింహాచలం అనే బుర్రకథ మాష్టారి వద్ద శిష్యరికం చేసి 1998లో వచనకర్తగా మారాను. గ్రామదేవతల పండుగలకు బుర్రకథ చెప్పడానికి వెళ్తుంటాను. అందులో రామాయణం వంటి కథలు చేశాను. డప్పు వాయిస్తూ బుర్రకథ చెబుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన పరుస్తూ జీవనాన్ని సాగిస్తున్నాను. బుర్రకథ దళాన్ని తయారు చేసుకుని బాల్యవివాహాలు, పావలావడ్డీ రుణాలు, ఇందిరమ్మ ఇళ్ళు వంటి వాటిపై ప్రదర్శనలు ఇచ్చాము. వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారి హయాంలో కూడా నేను ఈ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన పర్చాను. బుర్రకథ చెబుతున్నప్పుడు డప్పుకూడా వాయించాల్సి వచ్చేది.దీంతో డప్పు వాయిస్తూ, స్వయంగా పాటలు పాడటం నేర్చుకున్నాను. ఇరవై ఏళ్లుగా మహారాష్ట్ర, తెలంగాణ, మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చాను. మహిళా కళాకారులంటే అప్పట్లో చాలామందికి చిన్నచూపు ఉండేది. పొట్టకూటి కోసం ప్రవచనం చెప్పుకుంటున్న నన్ను చాలామంది హేళన చేసేవారు. వేధించేవారు. బంధువులైతే సూటిపోటీ మాటలతో శూలాల్లా గుచ్చేవారు. అయితే ‘ఎంత కష్టం వచ్చినా దొంగతనం చేయకు, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎవరినీ మోసం చేయకు’ అని అమ్మ నాకు చెప్పి ప్రదర్శనలకు పంపిస్తుండేది. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఎప్పుడైనా నాకు బాధ కలిగి బలహీన పడినప్పుడు అమ్మ చెప్పిన మాటలు, బంధువుల ఎత్తిపొడుపులు గుర్తుకు వచ్చేవి. అందుకే రోజు రోజుకూ నాలో కసి పెరిగింది. మంచిమార్గంలోనే ఉన్నతస్థాయికి ఎదగాలనుకున్నాను. భర్త ప్రోత్సాహం కూడా నాకు తోడయ్యింది. ఇప్పుడు నాకంటూ ప్రత్యేకంగా ఓ దళం ఉంది. నేను బతుకుతూ నాతోపాటు పదిమందిని బతికిస్తున్నాననే తృప్తి ఉంది. నిజానికి ఇప్పటికీ నా కష్టం పూర్తిగా తీరిపోలేదు. పండుగలు, జాతరలు లేనప్పుడు బుర్రకథ ప్రదర్శనలు ఉండవు. ఉన్నా దానివల్ల వచ్చే ఆదాయం కూడా ఇప్పుడున్న ఖర్చులకు సరిపోదు. అందుకే టిఫిన్ సెంటర్ లాంటిదొకటి పెట్టుకుందామని చూస్తున్నాను. రుణం కూడా మంజూరైంది. కానీ ఎందుకో ఆ సొమ్ము నా చేతికి ఇవ్వడానికి బ్యాంకువాళ్లకి మనసు రావడం లేదు. ఎప్పటికైనా వారి మనసు కరిగితే బుర్రకథ కళాకారిణిగా ఉంటూనే స్వయం ఉపాధి ఏర్పరచుకోవాలని ఉంది. దొంగతనం చేయకు, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎవరినీ మోసం చేయకు’ అని అమ్మ నాకు చెప్పి ప్రదర్శనలకు పంపిస్తుండేది. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఎప్పుడైనా నాకు బాధ కలిగి బలహీన పడినప్పుడు అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చేవి. – కొట్యాడ గౌరి – బోణం గణేష్, సాక్షి, విజయనగరం -
రికార్డ్ స్థాయికి ఆర్ఐఎల్
సాక్షి, ముంబై: అటు ఫలితాల జోష్, ఇటు ఎనలిస్టుల అంచనాల నేపథ్యంలో సోమవారం నాటి బుల్ మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు కూడా రికార్డు స్థాయిని నమోదు చేసింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆర్ఐఎల్ కౌంటర్లో కొనుగోళ్ల వైపు మొగ్గు చూపారు. దీంతో ఇంట్రాడేలో రెండున్నర శాతం లాభపడి ఆల్‌టైమ్ గరిష్టానికి చేరింది. రూ. 1157వద్ద సరికొత్త రికార్డు ఆర్ఐఎల్ క్రియేట్ చేసింది. 1991, జనవరి తరువాత ఇదే అదిపెద్ద లాభమని విశ్లేషకులు తెలిపారు. మరోవైపు గోల్డ్‌మన్ సాచే, మోర్గాన్ స్టాన్లీ, మోతీలాల్, నోమురా, ఎడిల్వీస్ తదితర బ్రోకరేజ్ సంస్థ లన్నీ బై రేటింగ్‌ను ఇచ్చాయి. ఆర్ఐఎల్ షేరు ప్రైస్ టార్గెట్‌ను 1200నుంచి 1400వరకు జంప్ చేయవచ్చని అంచనా వేశాయి. కాగా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ ఎనలిస్టుల అంచనాలను అధిగమిస్తూ 8శాతం స్టాండలోన్ నికరలాభాన్ని నమోదు చేసింది. ఆర్ఐఎల్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో క్యూ-1లో రూ.6.12 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించిన సంగతి తెలిసిందే. -
అడిగితే చాలదా!
ఇంటిని ఆఫీస్‌కి తెచ్చేయడంపై మగవాళ్లకేవో అభ్యంతరాలు ఉంటాయి. ఆఫీస్ గాంభీర్యం తగ్గుతుందని, ఆడపిల్లల సన్నటి గొంతులు విని కుర్చీలు, బల్లలు మాట వినకుండా నెత్తికెక్కి కూర్చుంటాయని! ఇది కరెక్ట్ కాదు. ఆడవాళ్లు అంతటా ఉండాలి. ప్రతి అనుకూలతలో, ప్రతి ప్రతికూలతలో... మగవాళ్లు ఉన్నట్లే ఆడవాళ్లూ ఉండాలి. ఉత్సాహంగా మేం చేస్తాం అని ముందుకు వచ్చినప్పుడు ‘మీరా! ఇక్కడా!!’ అంటూ నిరుత్సాహపరచడంలో బైటపడేది మహిళల బలహీనతకాదు, ఆధిక్య భావనలలోని దౌర్బల్యం. ఉమన్ రిపోర్టర్ల ప్రెస్ కాన్ఫరెన్సులు అమెరికా అధ్యక్ష భవనానికి కొత్త! ‘‘ఇక్కడ ఇంతవరకు ఇలాంటివి జరగలేదు మిసెస్ రూజ్వెల్ట్’’ అన్నారు వైట్‌హౌస్ ప్రతినిధులు. ‘‘కానీ నాకు వాళ్లతో తరచు మాట్లాడవలసిన అవసరం ఉంటుంది’’ అన్నాను. న్యూయార్క్ వార్తాపత్రికల్లో పనిచేస్తున్న ఉమన్ రిపోర్టర్లకు ఆహ్వానాలు వెళ్లాయి. ప్రెస్ కాన్ఫరెన్స్ మొదలైంది. ఎంత కాంతి ఈ అమ్మాయిల కళ్లలో! ఎంత కాన్ఫిడెన్స్! ఎన్ని ఆలోచనలు! చెప్పింది రాసుకోవడంలో వాళ్లకెలాంటి ఆసక్తీ లేదు. ఉన్నచోట ఉండిపోవడంలో వాళ్లకెలాంటి సంతృప్తీ లేదు. ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు. వైట్‌హౌస్ అంతా కలియతిరుగుతున్నారు. స్త్రీల సంరక్షణ బాధ్యతల్లో ఒక అగ్రరాజ్యం ప్రపంచ దేశాలకు ఎలా ఆదర్శప్రాయంగా ఉండాలనే విషయమై వారందరికీ స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. ‘‘వైట్ హౌస్‌లో మా ఫస్ట్ కాన్ఫరెన్స్ ఇంత హోమ్లీగా ఉంటుందనుకోలేదు’’ అందొక అమ్మాయి. ‘‘మేమ్, నాకైతే వెళ్లాలని లేదు. కానీ మా న్యూయార్క్ ఆఫీస్‌లో మీ ప్రెస్ కాన్ఫరెన్స్ విశేషాలను వెంటనే రిపోర్ట్ చెయ్యాలి. వైట్ హౌస్ పైన ఉన్న గదుల్ని చూడాలని ఉంది నాకు’’ అంది. నవ్వొచ్చింది నాకు. ‘‘రేపు మీరంతా ఇక్కడికి లంచ్‌కి వస్తున్నారు. తక్కిన న్యూస్‌పేపర్ గాళ్స్‌ని కూడా మీ వెంట తీసుకురండి. అందరం కలిసే పైన ఉన్న గదులన్నీ చూద్దాం’’ అన్నాను. ‘‘కానీ మిసెస్ రూజ్వెల్ట్... అక్కడికెవ్వరినీ అధ్యక్ష భవనం అనుమతించదు’’ అన్నారు మల్వీనా «థామ్సన్. ఆవిడ నా కార్యదర్శి. ‘‘ఇది నా ఇల్లు కాదు మల్వీనా. ప్రజాభవనం. వారి భవనాన్ని వారు సందర్శించాలనుకుంటున్నారు. వారికా హక్కు ఉంది’’ అన్నాను. అసలు హక్కుల వరకూ ఎందుకు? ఆడపిల్లలు నోరు తెరిచి అడిగినప్పుడు ఏ అనుమతి విధానాల ఉల్లంఘనైనా చట్టబద్ధం కాకుండా పోతుందా?! (అమెరికా 32వ అధ్యక్షుడు రూజ్వెల్ట్ సతీమణి ఎలినార్ రూజ్వెల్ట్ çస్వగతాలలోంచి చిన్న భాగం) -
అప్పుడైనా ఇప్పుడైనా... పిల్లలు పిల్లలే!
తిరుక్కురళ్... ఎప్పటి గ్రంథం? తమిళ కవి తిరవళ్లువార్ ఐదు వేల ఏళ్ల కిందట రాసిన పుస్తకం. అది మానవుని ప్రవర్తన గురించిన విషయాలున్న పురాతన కాలం నాటి శాస్త్రం. ఇందులో తిరువళ్లువార్ చెప్పిన విషయాలు... ఇన్నేళ్ల తర్వాత కూడా ఆధునిక విద్యావిధానం కూడా అంగీకరించి తీరాల్సిన అంశాలు. ►మీ పిల్లలు మీతో ఎప్పుడూ అబద్ధాలు చెబుతుంటే ఏమనుకుంటారు? పిల్లలు అబద్ధాల కోరులయ్యారని ఆందోళనపడి వారిని దారిలో పెట్టడానికి కఠినంగా వ్యవహరించాలనుకుంటారు. నిజానికి మీ కఠినమైన ప్రవర్తన కారణంగానే వాళ్లు మీతో నిజం చెప్పడానికి భయపడుతూ ఉండి ఉంటారు. వాళ్లు పొరపాటు చేసినప్పుడు మీ రియాక్షన్ తీవ్రంగా ఉంటుంటే, మీతో నిజం చెప్పడానికి భయపడుతూ అబద్ధం చెప్పి అయినా, గండం గట్టెక్కాలనుకుంటారు పిల్లలు. ►పిల్లలు తమ తప్పుల్ని మీ దగ్గర ఒప్పుకోలేకపోతున్నారా? మీరు పిల్లల పట్ల అంతటి విశ్వాసాన్ని చూరగొనలేకపోయారంటే, మీకు– వారికి దూరం ఉన్నట్లు. ఇలాంటి పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో మీతో వారికి దూరం మరింతగా పెరగవచ్చు. ►మీ పిల్లల్లో ఆత్మవిశ్వాసం కొరవడితే కారణం ఏమై ఉంటుంది? మీరు పిల్లలను ప్రోత్సహించడానికి బదులు ప్రతి విషయంలోనూ గైడ్ చేస్తూ ఉండి ఉంటారు. అన్నింటికీ గైడ్ చేయడం మాని కొన్ని నిర్ణయాలను వాళ్లకే వదిలేస్తే సొంతంగా ఆలోచించడం, తమ కాళ్ల మీద తాము నిలబడడం అలవాటవుతుంది. ►పిల్లలు మీ ముందు నిలబడడానికి కూడా భయపడుతున్నారా? నలుగురిలో మీకు ఎదుట పడకుండా తప్పించుకుంటున్నారా? అందుకు కారణం... పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడం కోసం పదిమందిలో కూడా వారిని అనుక్షణం గుడ్లురుముతూ ఉండడమే అయి ఉంటుంది. దాంతో బయటి వ్యక్తుల ముందు మీకు కనిపించకుండా ఉండడానికే ప్రయత్నిస్తారు. అనవసరంగా ఎదురుపడడం ఎందుకు అన్నట్లు మిమ్మల్ని అవాయిడ్ చేస్తారు. ►పిల్లలు తమవి కాని వస్తువులను తస్కరించడానికి వెనుకాడడం లేదా? ఈ లక్షణానికి దొంగతనం కారణం కాకపోవచ్చు. మీరు వాళ్ల కోసం ఏమైనా వస్తువులు కొనేటప్పుడు వారి ఇష్టాలను కూడా పరిగణనలోకి తీసుకోండి. పెద్దరికం అనే హోదాతో మీకు నచ్చిన బొమ్మ కొనేసి దాంతోనే ఆడుకోండి– అని ఆదేశిస్తే... ఇష్టం లేని బొమ్మతో ఆడుకోవడానికి అలవాటు పడతారేమో కానీ, ఇష్టమైన బొమ్మ కనిపించినప్పుడు దానికి దూరంగా ఉండడం వారికి చేతకాదు. ►పిల్లలు పిరికివాళ్లయిపోయారా? పిరికితనం ఉన్నది వాళ్ల ఒంట్లో కాదు. మీ పెంపకంలో. వాళ్లకు ఏ అవసరం వచ్చినా ఆ పనిని వాళ్లు ఎంతవరకు సొంతంగా చేసుకోగలరో చేసుకోనిచ్చి, వాళ్లకు సాధ్యం కాని దశను మీ భుజాలకెత్తుకోవాలి. అంతే కానీ, వాళ్లకు అలా అవసరం ఏర్పడిందో లేదో మీరే ఆ పనులన్నీ చేసి పెడుతుంటే... ఎన్నాళ్లయినా, ఎన్నేళ్లయినా సొంతంగా చేసుకోలేరు. తొందరలోనే వాళ్లు చీకట్లో వీథి గేటు వేయడానికి కూడా భయపడేటంత పిరికి వాళ్లయిపోవడం సహజమే. ►మీ పిల్లలు... ఇతరుల మనోభావాలను గౌరవించడం లేదు... అంటే, మీరు వాళ్ల అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడం, మాటలకు అడ్డుపడడం, ప్రతి దానికీ ఆదేశించినట్లు చెప్పడం, నియంత్రించడం వంటివి చేస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. ►త్వరగా కోపం తెచ్చుకుంటున్నారంటే ... మీరు వాళ్లని మరీ ఎక్కువగా పట్టించుకుంటూ (అతి శ్రద్ధ) ఉండి ఉండాలి. పిల్లల కదలికల మీద అతిగా దృష్టి పెట్టకుండా కొంత పట్టు విడుపు ధోరణిలో ఉండాలి. ►పిల్లల్లో అసూయ కనిపిస్తుంటే... మీరు వాళ్లు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత మాత్రమే అభినందిస్తున్నారని అర్థం. అలా కాకుండా, పనిలో కొంతమేరకు మాత్రమే ఫలితం సాధించినప్పుడు, విజయవంతం కానప్పుడు కూడా వారి పట్ల సానుకూలంగా స్పందించాలి. ►పిల్లలు ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటే... మీరు వాళ్లతో సన్నిహితంగా ఉండడం లేదని, వాళ్లతో సమయాన్ని గడపడం, దగ్గరకు తీసుకోవడం వంటివి చేయడం లేదని అర్థం. పిల్లలతో క్వాలిటీ టైమ్‌ను గడపడం అలవాటు చేసుకోవాలి. ►మీ పిల్లలు మీ మాటను ధిక్కరిస్తున్నారంటే... మీరు వాళ్లను బహిరంగంగా బెదిరిస్తూ ఉండి ఉండాలి. ఈ అలవాటును తక్షణం మానెయ్యాలి. పిల్లల్ని బెదిరించడం దేనికీ సమాధానం కాదు. బెదిరించి దారిలో పెట్టడం సాధ్యం కానేకాదు. ►మీ దగ్గర సొంత విషయాలు చెప్పుకోకుండా రహస్యాలు పాటిస్తున్నారా? అయితే మీరు వాళ్ల విశ్వాసాన్ని చూరగొనడంలో విఫలమయ్యారని అర్థం. తమ ఇబ్బందులు కానీ సంతోషాలు కానీ మరెవరితోనూ చెప్పుకోవడానికి ఇష్టపడని విషయాలను మీతో చెప్పుకున్నప్పుడు మీరు వాటిని అంతే గోప్యంగా ఉంచాలి. మీకు చెప్పిన విషయాన్ని మీరు అందరికీ బహిర్గతం చేస్తారనే సందేహం కలిగిందంటే ఇక మీ దగ్గర ఏ విషయాన్నీ పంచుకోరు పిల్లలు. ►ముందొక మాట వెనుక ఒక మాట చెప్తున్నారంటే... మీరు ఇతరుల విషయంలో అలా ప్రవర్తిస్తూ ఉండి ఉండాలి. దానిని పిల్లలు గమనించి ఉంటారు. పైగా అదే సరైన పద్ధతి అని కూడా అనుకుంటూ ఉండవచ్చు. ముందు మీ ధోరణిని మార్చుకుంటే పిల్లలు మిమ్మల్ని అనుసరిస్తారు. ►మీ పిల్లలు మీ మాటను పెడచెవిన పెడుతూ, ఇతరులు చెప్పిన మాటను శ్రద్ధగా వింటున్నారా? ఇందుకు కారణం... మీతో ఏదైనా విషయం చెప్పీ చెప్పగానే ఫలితం కోసం తొందరపెడుతుండడం కావచ్చు. ►మీ పిల్లల్లో తిరుగుబాటు ధోరణి కనిపిస్తోందా? మీరు అవసరమైన దానికంటే ఎక్కువ జాగ్రత్తలు చెబుతూ ఉండి ఉండవచ్చు. ఇతరులకు కూడా మీరు అతిగా జాగ్రత్తలు తీసుకుంటారనే అభిప్రాయం ఉండవచ్చు. దానిని సహించడం పిల్లలకు కొంచెం కష్టమే. -
హిల్లరీ గెలుపుపై డెమోక్రటిక్ పార్టీ ధీమా
-
సింధు గెలవాలని ప్రత్యేక పూజలు
-
ఎవరి ధీమా వారిదే
-
ఎవరి ధీమా వారిదే
వరంగల్ లోక్‌సభ స్థానంలో గెలుపుపై పార్టీల అంచనాలు సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికల పోలింగ్ ముగియగానే ఓటింగ్ సరళిపై రాజకీ య పార్టీలు అంచనాల్లో పడ్డాయి. గెలుపుపై ఎలాంటి అనుమానాల్లేవని, కేవలం మెజారిటీ కోసమే వరంగల్‌లో పనిచేశామంటూ టీఆర్ఎస్ ధీమాగా ఉంది. ఇక పోలింగ్ శాతం తగ్గడం, హామీలను అమలు చేయనందుకు ప్రభుత్వంపై వ్యతిరేకతకుతోడు తెలంగాణ ఇచ్చిన పార్టీగా తాము బాగా పుంజుకున్నామని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసుకుంటోంది. కేంద్రంలో అధికారంలో ఉండడం, వరంగల్ పట్టణ అభివృద్ధి కోసం వివిధ పథకాలు, టీడీపీతో పొత్తు వంటి వాటితో గెలుపు అవకాశాలున్నాయని బీజేపీ చెబుతోంది. టీఆర్ఎస్కు అనుకూలమంటున్న 'ఎగ్జిట్' సాధారణ ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి కడియంకు 3.95 లక్షల మెజారిటీ వచ్చింది. ఉప ఎన్నికలోనూ ఆ పార్టీయే గెలిచే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్‌పోల్స్, సర్వేలు చెబుతున్నాయి. లక్ష నుంచి లక్షన్నర దాకా మెజారిటీ రావొచ్చని పేర్కొంటున్నాయి. అయితే ఓటింగ్‌శాతం తగ్గడంతో టీఆర్ఎస్ విజ యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉపఎన్నికల్లో సాధారణంగానే పోలింగ్ శాతం తగ్గుతుందని టీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. ‘ఎన్నికల్లో ఒక్క ఓటుతో గెలిచినా గెలుపే. టీఆర్ఎస్పై వ్యతిరేకత పెరిగిందనే ప్రచారం కోసం కొందరు మెజారిటీ అంటూ వాదనను తెరపైకి తెస్తున్నారు. ఉప ఎన్నికల వల్ల ప్రభుత్వ మనుగడపై ప్రభావమేమీ ఉండదనే కారణంతో ఓటర్లు నిరాసక్తత చూపుతారు.’’ అని ఒక మంత్రి పేర్కొన్నారు. తడబడి.. నిలదొక్కుకున్న కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నివాసంలో దుర్ఘటనతో కాంగ్రెస్‌పార్టీ షాక్‌కు గురైంది. ఆ వెంటనే సర్వే సత్యనారాయణను అభ్యర్థిగా తెరపైకి తెచ్చి తేరుకుంది. తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న మీరాకుమార్, కేంద్ర హోంమంత్రిగా ఉన్న సుశీల్‌కుమార్ షిండేతోపాటు ఆజాద్, దిగ్విజయ్ వంటి జాతీయ నేతలు ఇక్కడ ప్రచారం చేశారు. ప్రధాని మోదీపై దేశవ్యాప్తంగా ఉన్న సానుకూలత, తెలంగాణ బిల్లుకోసం మద్దతిచ్చిన పార్టీగా, వరంగల్‌కు పలు పథకాలను ప్రకటించడం వంటివి ఈ ఉప ఎన్నికలో ఉపయోగపడతాయని బీజేపీ ఆశిస్తోంది. -
ఏదో పెద్దలు మాట్లాడతారు.. తప్పేముంది
ముంబై: బిహార్ ఎన్నికల్లో కచ్చితంగా తమ పార్టీ ఘన విజయం సాధించి తీరుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడం ద్వారా రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందనే నమ్మకాన్ని బిహార్ ప్రజలు కలిగి ఉన్నారన్నారు. బిహార్‌లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దేశీయ ఇన్వెస్టర్లు ఫలితాలపై దృష్టిపెట్టారన్న విషయంలో ఓ బిజినెస్ ఛానల్‌తో మాట్లాడిన మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ బిహార్ ఎన్నికల్లో ప్రతికూలి ఫలితాలొస్తే అది భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందా అని మీడియా ప్రశ్నించినపుడు ఆయన సమాధానాన్ని దాటవేశారు. ఇంకా ఎన్నికలు నడుస్తున్న నేపథ్యంలో దీనిపై ఏమీ వ్యాఖ్యానించలేనన్నారు. దేశం ఆర్థికంగా బలపడినపుడే ప్రజల అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. బిహార్‌లో సాధించిన విజయం ద్వారా రాజ్యసభలో తమ పార్టీ మరింత బలం పుంజుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేశంలో అసహనం పెరుగుతోందన్న వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. దేశ పెద్దలు, మేధావులు సాధారణంగా ప్రజలకు ఇలాంటి సలహాలు, సూచనలు ఇస్తుంటారని, అందులో తప్పేమీ లేదని వెంకయ్య అన్నారు. అంతేకానీ వారు ఏ పార్టీని ఉద్దేశించి కామెంట్ చేయలేదన్నారు. దేశంలో కొన్ని అవాంఛిత పరిణామాలు చోటుచేసుకున్నాయని, వాటితో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. అసలు దేశంలో ఎలాంటి సంక్షోభ వాతావరణం లేదన్నారు. అవార్డులను వెనక్కి ఇవ్వడంపై స్పందించిన వెంకయ్యనాయుడు ఈ విషయంలో తనకేమీ అభ్యంతరం లేదన్నారు. దురదృష్టవశాత్తు, గతంలో హింస చెలరేగినపుడు వారు మౌనంగా ఉండి, ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. జరుగుతున్న విషయంతో ప్రధాని మోదీకి లింకు పెట్టాలని చూస్తున్నారని, ఇది సరైంది కాదని మండిపడ్డారు. పరిస్థితులు తొందరలోనే చక్కబడతాయని, దీనికోసం తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. ఈ విషయంలో ప్రధాని మోదీపై తమకు నమ్మకముందని తెలిపారు. -
ఆత్మవిశ్వాసానికి... దారి ఇది!
ఆత్మవిశ్వాసం తోడుంటే అపజయాన్ని ఎదుర్కొనే బలమైన ఆయుధం మన చేతిలో ఉన్నట్లే. అన్నీ ఉన్నా... ఆత్మవిశ్వాసం లేకపోతే విజయం సిద్ధించదు. ఆత్మవిశ్వాసాన్ని మీలో ప్రోది చేసుకోవడానికి అవసరమైన కొన్ని విషయాలు... ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. మన ఆలోచన మీదే మన అడుగు ఆధారపడి ఉంటుంది. ప్రతి విషయాన్నీ ప్రతికూలంగా ఆలోచిస్తే, పడే అడుగు సరియైన మార్గంలో పడదు. మీకు మీరుగా సొంత నియమాలు రూపొందించుకోండి. వాటిని పాటించండి. అంతే తప్ప, ఆ నియమాలను బ్రేక్ చేసే ప్రయత్నం చేయకండి. చదువుకు సంబంధించి ప్రణాళికలకు ప్రాధాన్యం ఇవ్వండి. కాలాన్ని వృథా చేయకండి. ఉత్తేజపరిచే జీవితచరిత్రలను చదవండి. మిమ్మల్ని ఆకట్టుకున్న వాక్యాలను పేపర్‌పై పెద్ద అక్షరాలలో రాసి గోడకు అంటించండి. వాటిని చదివినప్పుడల్లా ఒక కొత్త శక్తి వస్తుంది. ఎప్పుడూ నిరాశగా ఉండే వాళ్లతో, నిరాశగా మాట్లాడే వాళ్లతో కాకుండా చురుగ్గా ఉండేవాళ్లు, నాలుగు విషయాలు తెలిసినవాళ్లతో స్నేహం చేయండి. గెలుపే అంతిమం కాదు... దాని తరువాత ఓటమి రావచ్చు. ఓటమే అంతిమం కాదు... దాని తరువాత గెలుపు కూడా వస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఓటమికి భయపడాల్సిన అవసరం లేదు. మీలో ఉన్న బలాలనూ, బలహీనతలనూ గుర్తించండి. బలాల్ని మరింత మెరుగుపరుచుకోండి. బలహీనతలను సరిదిద్దుకోండి. ఔట్‌డోర్ గేమ్స్ ఆడండి. దీని ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయి. మిమ్మల్ని మీరు విజయం దిశగా ప్రేరేపించుకోండి. ఉత్తేజాన్నీ, ప్రేరణనూ నింపే ఉపన్యాసాలను వినండి. -
అంతులేని ఆత్మవిశ్వాసం
అన్ని సౌకర్యాలు ఉన్నా... చిన్న చిన్న ఆటుపోట్లు ఎదురైతేనే మనలో చాలా మంది నిరాశా నిస్పృహలకు లోనవుతాం. అంగవైకల్యంతో పుట్టినవారు, దురదృష్టవశాత్తు వికలాంగులుగా మారిన వారు ఎలాంటి క్షోభకు గురవుతారో అంచనా వేయలేం. వికలాంగుడిగా జన్మించినంత మాత్రాన చింతించాల్సిన పనిలేదని... పట్టుదల, తపన, ఉక్కులాంటి దృఢసంకల్పం, ఆత్మవిశ్వాసం ఉంటే... సమాజమే తమను ఆరాధించేలా ప్రత్యేక గుర్తింపు లభించేలా తయారుకావచ్చని ఆ యువకుడు నిరూపించాడు. అతనే అమెరికాలోని జార్జియా రాష్ట్రానికి చెందిన 28 ఏళ్ల కైల్ మెనార్డ్. అంతులేని ఆత్మవిశ్వాసంతో ఎలాంటి అవరోధాలనైనా అధిగమించవచ్చని కైల్ నిరూపిస్తున్నాడు. - కరణం నారాయణ కేవలం రెండు అడుగుల ఎత్తు ఉన్న కైల్ తన విన్యాసాలతో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయాడు. ఎందరినో ప్రభావితం చేస్తున్నాడు. మరెందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. వికలాంగులు కూడా సాధారణ వ్యక్తులకు ఏమాత్రం తీసిపోరని నిరూపిస్తున్నాడు. పుట్టుకతోనే అవయవ లోపాలతో జన్మించిన కైల్ ఏనాడూ నిరాశ, అసాధ్యం అనే మాటలకు తన జీవిత నిఘంటువులో స్థానం కల్పించలేదు. అకుంఠిత దీక్షతో సాధన చేస్తూ ఎన్నో అద్భుతాలు చేస్తూ అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నాడు. కైల్ ఆల్‌రౌండర్. తనకు చేతకాని పనిలేదు. క్రీడాకారుడిగా, మోటివేషనల్ స్పీకర్‌గా, రచయితగా అమెరికాలో చాలా ఖ్యాతి సంపాదించాడు. ఆప్యాయత, ఆదరణ... కైల్ మెనార్డ్ పుట్టుకతోనే మోకాళ్లు, మోచేతులు లేకుండా జన్మించాడు. వైద్య పరిభాషలో దీనిని కంజెన్షియల్ అంప్యూటేషన్ (అవయవ లోపాలతో పుట్టడం) అంటారు. కైల్ అవయవ లోపాలతో పుట్టినప్పటికీ అతని తల్లిదండ్రులు స్కాట్ మెనార్డ్, అనిటా మెనార్డ్, కుటుంబ సభ్యులు అతణ్ని ఒక వికలాంగుడిగా భావించలేదు. గర్భంలో ఉన్నపుడే పుట్టబోయే సంతానం అవయవ లోపాలతో జన్మిస్తాడని, గర్భస్రావం చేయించుకోవాలని తల్లిదండ్రులకు వైద్యులు సూచించారు. అయితే తమకు ఆ ఆలోచనే లేదని తాము సంతానానికి జన్మనిస్తామని వారు స్పష్టం చేశారు. ‘చిన్నతనం నుంచే కైల్ శక్తి సామర్థ్యాలపై దృష్టి పెట్టాం. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాం. చిన్నప్పటి నుంచే ఎలా తినాలో నేర్పించకపోతే జీవితాంతం అతను ఆహారం కోసమే కాకుండా ప్రతి పనికి ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. కైల్కు కష్టాలు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో బాల్యం నుంచే ప్రత్యేక శ్రద్ధతో పెంచడంతో నేడతడు వికలాంగుడైనా సాధారణ వ్యక్తులకు ఏమాత్రం తీసిపోడు’ అని కైల్ తల్లిదండ్రులు చెబుతున్నారు. పట్టుదలతో పోరాటం... కైల్ మెనార్డ్ ఆరంభంలో కృత్రిమ చేతులు, కాళ్లు అమర్చుకున్నాడు. కొంతకాలానికి అవే అతనికి అడ్డంకిగా మారడంతో వాటిని ఉపయోగించడం మానేశాడు. స్కూల్ ఫుట్‌బాల్ జట్టులో ఎంపికయ్యాక తరచూ గాయాలకు గురికావడంతో ఈ ఆటను మానేసి రెజ్లింగ్‌వైపు దృష్టి సారించాడు. రెజ్లింగ్‌లో వరుసగా 35 పరాజయాలు ఎదురైనా పట్టువిడవలేదు. కోచ్ క్లిఫ్ రామోస్, తండ్రి స్కాట్ ప్రత్యేకంగా కైల్ కోసం కొత్త టెక్నిక్లను రూపొందించారు. తీవ్ర సాధన చేసి ఈ టెక్నిక్‌లపై పట్టు సంపాదించిన కైల్ విజయాలబాట పట్టాడు. జార్జియా రాష్ట్ర చాంపియన్‌గా ఎదిగాడు. ‘రెజ్లింగ్ లేకపోతే నేనెక్కడ ఉండేవాడినో నాకే తెలియదు. పోటీపడాలంటే నాకెంతో ఇష్టం. ఎల్లప్పుడూ గెలవాలని ఆరాటపడతాను’ అని కైల్ అంటాడు. నో ఎక్స్క్యూజెస్ క్రాస్‌ఫిట్ పేరుతో సొంత జిమ్‌ను ఏర్పాటు చేసుకున్న కైల్ ‘నో ఎక్స్క్యూజెస్’ పేరుతో తన జీవితచరిత్రను రాశాడు. ఈ పుస్తకం న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్స్ జాబితాలో చోటు సంపాదించింది. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, రచయితగా, యజమానిగా, క్రీడాకారుడిగా ప్రతి రంగంలో విజయం సాధిస్తున్న కైల్ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. అవయవ లోపాలతో పుట్టినా అపార ఆత్మవిశ్వాసంతో... జీవితంలో ఏదో సాధించాలన్న పట్టుదల, క్రీడలపై అభిమానం కైల్‌ను ఉన్నతస్థాయికి తీసుకెళ్లాయి. ‘నేను వ్యక్తులను ప్రభావితం చేయాలనుకుంటున్నాను. కొన్ని సందర్భాల్లో మనకు ఏ దారీ కనిపించదు. అయితే దారి కోసం మనం పోరాటాన్ని కొనసాగించాలి. సానుకూల దృక్పథం, నిరంతర శ్రమ, పట్టుదల, సవాళ్లకు భయపడని తత్వంతోనే నాకు విజయాలు లభించాయి. ప్రయత్నించకుండానే ఈ పని నేను చేయలేను అని అనుకోకూడదు. ముందు ప్రయత్నిస్తే మన సామర్థ్యం ఏంటో తెలుస్తుంది’ - కైల్ మెనార్డ్ ఏయే ఆటల్లో ప్రవేశం... రెజ్లింగ్, జూడో, వెయిట్ లిఫ్టింగ్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, స్విమ్మింగ్, బేస్‌బాల్, స్ట్రీట్ మాకీ, ఫుట్‌బాల్, పవర్ లిఫ్టింగ్, పర్వతారోహణ. ప్రత్యేకంగా తయారుచేసిన బెంచ్ ప్రెస్‌లో కైల్ 360 పౌండ్లు బరువెత్తి ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పాడు. జార్జియా రాష్ట్ర రెజ్లింగ్ చాంపియన్‌గా నిలిచాడు. ఆఫ్రికాలోని ఎత్తయిన పర్వతం కిలిమంజారోను (19, 341 అడుగులు) పది రోజుల్లోనే అధిరోహించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అన్నీ చేస్తాడు... ఎవరి సహాయం లేకుండా ఆహారం తీసుకుంటాడు. కారు డ్రైవ్ చేస్తాడు, సెల్ఫోన్లో మాట్లాడతాడు డ్యాన్స్ చేస్తాడు, వీడి యోగేమ్స్ ఆడతాడు. కంప్యూటర్‌పై నిమిషానికి 50 పదాలు టైప్ చేస్తాడు. -
పొడుగ్గా కనిపించాలా!
మీ ఎత్తు 5 అడుగులు... అంతకన్నా తక్కువగా ఉందా! అయితే డ్రెస్ డిజైనర్స్ చెబుతున్న ఈ సూచనలు మీకోసమే! ధరించే దుస్తులు మీ శరీరాన్ని కప్పేసేలా ఉండకూడదు. దీని వల్ల మరింత పొట్టిగా కనిపిస్తారు. ఎప్పుడూ ఫిట్‌గా ఉండే కాస్త కురచ దుస్తులను ఎంచుకోవాలి. టాప్, బాటమ్.. ఒకే రంగు గల డ్రెస్సు ధరిస్తే మరింత చిన్నగా కనిపించడం ఖాయం. అందుకే డ్రెస్సింగ్‌లో విభిన్నతను చూపించండి. ఎప్పుడూ ముదురు రంగులను ఎంచుకోవడమే ఉత్తమం. లేత రంగులు, బరువైన ఫ్యాబ్రిక్ ఎంచుకుంటే చూడ డానికి గాడీగా ఉంటుంది. ఎత్తు తక్కువగా కనిపిస్తారు. పెద్ద పెద్ద పువ్వుల ప్రింట్లు, గాడీ డిజైన్లు కాకుండా చిన్న చిన్న ప్రింట్లు ఉన్న డ్రెస్సులను ఎంచుకోండి. చెక్స్ ఉన్న దుస్తులు తీసుకునేవారు నిలువు చారల దుస్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి. కూర్చునేటప్పుడు, నిల్చునేటప్పుడు చాలామంది అనుకోకుండా నడుము, భుజాలు వంచుతుంటారు. నిల్చున్నా, కూర్చున్నా వీపుభాగం నిటారుగా, భుజాలు విశాలంగా ఉంటే మీలో ఆత్మవిశ్వాసం ఎదుటివారికి ఎత్తుగా ఉండేలా కనిపిస్తుంది. వంగిపోయి ఉంటే మీలోని ఆత్మన్యూనత మరింత పొట్టిగా చూపిస్తుంది. మీ అభద్రతతో సహా!