మీ ఎత్తు 5 అడుగులు... అంతకన్నా తక్కువగా ఉందా! అయితే డ్రెస్ డిజైనర్స్ చెబుతున్న ఈ సూచనలు మీకోసమే!
ధరించే దుస్తులు మీ శరీరాన్ని కప్పేసేలా ఉండకూడదు. దీని వల్ల మరింత పొట్టిగా కనిపిస్తారు. ఎప్పుడూ ఫిట్‌గా ఉండే కాస్త కురచ దుస్తులను ఎంచుకోవాలి.
టాప్, బాటమ్.. ఒకే రంగు గల డ్రెస్సు ధరిస్తే మరింత చిన్నగా కనిపించడం ఖాయం. అందుకే డ్రెస్సింగ్‌లో విభిన్నతను చూపించండి.
ఎప్పుడూ ముదురు రంగులను ఎంచుకోవడమే ఉత్తమం. లేత రంగులు, బరువైన ఫ్యాబ్రిక్ ఎంచుకుంటే చూడ డానికి గాడీగా ఉంటుంది. ఎత్తు తక్కువగా కనిపిస్తారు.
పెద్ద పెద్ద పువ్వుల ప్రింట్లు, గాడీ డిజైన్లు కాకుండా చిన్న చిన్న ప్రింట్లు ఉన్న డ్రెస్సులను ఎంచుకోండి.
చెక్స్ ఉన్న దుస్తులు తీసుకునేవారు నిలువు చారల దుస్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి.
కూర్చునేటప్పుడు, నిల్చునేటప్పుడు చాలామంది అనుకోకుండా నడుము, భుజాలు వంచుతుంటారు. నిల్చున్నా, కూర్చున్నా వీపుభాగం నిటారుగా, భుజాలు విశాలంగా ఉంటే మీలో ఆత్మవిశ్వాసం ఎదుటివారికి ఎత్తుగా ఉండేలా కనిపిస్తుంది. వంగిపోయి ఉంటే మీలోని ఆత్మన్యూనత మరింత పొట్టిగా చూపిస్తుంది. మీ అభద్రతతో సహా!
పొడుగ్గా కనిపించాలా!
Published Wed, Feb 26 2014 10:42 PM | Last Updated on Sat, Sep 2 2017 4:07 AM
Advertisement
Advertisement