దుస్తుల అలమరా... 5 సూచనలు
ఖరీదైన అలమరాలు కొనుగోలులో చూపించినంత శ్రద్ధ చాలామంది అందులో దుస్తులను సర్దుకోవడంలో చూపించరు. అందుకే చాలా సమయాలలో డ్రెస్‌కు తగిన మ్యాచింగ్ దుస్తులు అందుబాటులో ఉండక ఇబ్బందులు పడుతుంటారు. అలమరాను సర్దుకోవడానికి ఐదు సూచనలు.
1.అరలలో అన్నీ కుక్కేసినట్టుగా ఉన్న దుస్తులను బయటకు తీసి (అవసరం లేనివి-అవసరం ఉన్నవి) రెండు భాగాలు చేయండి.
2.ఆధునిక దుస్తులైన టీ షర్ట్‌లు, కుర్తీలు, గౌన్‌లు, జీన్స్, హారెమ్ ప్యాంట్స్ ... వంటివి ఒక అరలో సర్దండి.
3.సంప్రదాయ తరహా లంగా ఓణీ, చుడీదార్లు, చీరలు ఒక అరలో సెట్ చేయాలి. ఏ డ్రెస్ అయినా మ్యాచింగ్ అయ్యే దుస్తులు ఒకే చోట ఉండేలా జాగ్రత్తపడండి.
4.ఏ సమయంలో అయినా ధరించడానికి వీలుగా ఉండే క్యాజువల్ డ్రెస్సులు, లోదుస్తులు విడిగా అమర్చుకోండి.
5.దుస్తుల మీదకు నప్పే యాక్ససరీస్ (పూసలు, కలప, క్లాత్...ఆభరణాలు, చేతి గడియారాలు, కేశాలంకరణ వస్తువులు, హ్యాండ్ బ్యాగ్..) ఒక అరలో ఉంచాలి. దీని వల్ల సందర్భానుసారం ధరించే దుస్తుల మీదకు సరైన మ్యాచింగ్ సులువుగా తీసుకునే ఉంటుంది.
శుభ్రంగా దుస్తుల అలమరను అనుకూలంగా అమర్చుకుంటే కొనుగోలు ఎంపికలోనూ అవగాహన కలుగుతుంది. సందర్భానికి తగ్గట్టు త్వరగా ముస్తాబు అయ్యే అవకాశమూ ఉంటుంది.