choice
-
లోన్ పట్టు.. ఇల్లు కట్టు!
‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’అన్నారు పెద్దలు. జీవితంలో ఆ రెండు ఘట్టాలు దాటిన వారు సప్త సముద్రాలు దాటినట్టే లెక్క. అయితే ఈ తరంలో ఇల్లు యజమాని కావడం అంటే ఆషామాషీ కాదు. అయినా కూడా సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఎన్నో ప్రయాసలు పడుతున్నారు. కలల సౌధం నిర్మించుకుని.. ఓ ఇంటి వాడయ్యేందుకు ప్రతిక్షణం కష్టపడుతున్నారు. - సాక్షి, హైదరాబాద్నగరాల్లో ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకునే పరిస్థితి ఎప్పుడో పోయింది. కాస్తో కూస్తో.. కుదిరితే ఏ అపార్ట్‌మెంట్‌లోనో ఓ ఫ్లాట్ కొనుక్కుని బతుకు బండి లాగిద్దామనుకునే వారే ఎక్కువ మంది. దానికి కూడా కూడబెట్టుకున్న కాస్త డబ్బుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కొత్తింట్లో అడుగుపెడుతున్నారు. తాజాగా నైట్ ఫ్రాంక్ అనే సంస్థ విడుదల చేసిన ‘బ్యాంకింగ్ ఆన్ బ్రిక్స్’అనే సర్వేలో కూడా ఇదే విషయం వెల్లడైంది.ఇదీ చదవండి: అద్దె అర లక్ష! హైదరాబాద్‌లో హడలెత్తిస్తున్న హౌస్ రెంట్79% రుణాలపైనే భారం దేశవ్యాప్తంగా నగరాల్లో సొంతింటి కల నెరవేర్చుకున్నవారిపై లండన్‌కు చెందిన నైట్ ఫ్రాంక్ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. దాదాపు 1,629 మంది పాల్గొన్న ఈ సర్వేలో అనేక ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపు 79 శాతం మంది ఇల్లు కొనుక్కునేందుకు బ్యాంకు రుణాన్ని ఆప్షన్‌గా ఎంచుకున్నట్టు తెలిపారు. 52 శాతం మంది అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్స్వైపు మొగ్గు చూపగా, 19 శాతం మంది స్టూడియో (చిన్నపాటి) అపార్ట్మెంట్లు, 17 శాతం మంది మాత్రం ఇండిపెండెంట్ ఇళ్లు కోరుకున్నారు. 7 శాతం మంది గేటెడ్ కమ్యూనిటీల్లో ఇల్లు కొనేందుకు, 5 శాతం మంది మాత్రం ఖాళీ భూమి కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపారు.సొంతిళ్లే కావాలి సర్వేలో పాల్గొన్నవారిలో 80 శాతం మంది తమకు సొంతిల్లు అవసరమని చెప్పారు. 19 శాతం మంది మాత్రం సొంతిల్లు కన్నా అద్దెకు ఉండటమే బెటర్ అని భావిస్తున్నారు. 1 శాతం మంది ఎటూ తేల్చుకోలేకపోయారు. సొంతిల్లు విషయంలో ఒక్కో తరాన్ని బట్టి ఒక్కో విధంగా ఆలోచనలు ఉన్నాయి. బేబీ బూమర్స్ (1946–1964 మధ్య పుట్టిన వారు) 79 శాతం మంది సొంతిల్లు ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. జెన్ ఎక్స్ (1965–1980 మధ్య పుట్టిన వారు)లో 80 శాతం మంది, మిలీనియల్స్ (1981–1996 మధ్య పుట్టినవారు)లో 82 శాతం మంది సొంతిల్లు కావాలని కోరుకుంటున్నారు. అయితే వెరైటీగా జెన్–జీ (1997–2012) మధ్య జన్మించిన వారిలో 71 శాతం సొంతిల్లు ఉండాలని భావిస్తుండగా, ఏకంగా 27 శాతం మంది అద్దె ఇంట్లో ఉంటేనే బెటర్ అని భావిస్తుండటం గమనార్హం.సొంతిల్లు ఎందుకంటే? సొంతిల్లు కావాలని చాలా మంది కోరుకుంటున్నా.. అందుకు కారణాలపై మాత్రం ఒక్కో తరం వారిలో ఒక్కో ఆలోచన ఉంది. బేబీ బూమర్స్ జెనరేషన్‌కు చెందినవారు ఇల్లు కొనుక్కోవడం అనేది ఓ పెట్టుబడిగా ఆలోచిస్తున్నారు. అదే మిలీనియల్స్ జెనరేషన్ వాళ్లు మాత్రం వారి సంపదను మరింత పెంచుకోవడంలో భాగంగా ఇల్లు కట్టుకుంటున్నారని సర్వేలో తేలింది. బేబీ బూమర్స్‌లో 29 శాతం మంది ఇల్లు కొనడాన్ని పెట్టుబడిగా భావిస్తే.. 15 శాతం మంది మాత్రం రిటైర్మెంట్ ప్లాన్‌గా కొనుగోలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ప్రాపర్టీ కొంటున్నారా? అయితే మీ కోసమే ఈ జాగ్రత్తలుసర్వేలో పాల్గొన్న వారందరిలో 37 శాతం మంది ఉన్న ఇంటిని లగ్జరీ ఇళ్లుగా మార్చుకోవాలని భావిస్తున్నారు. ఒకప్పుడు ఈ ట్రెండ్ కొన్ని నగరాల్లోనే ఉండగా, ఇప్పుడు దేశంలోని ప్రథమ శ్రేణి నగరాలన్నింటిలో కనిపిస్తోంది. 32 శాతం మంది మాత్రం తొలిసారిగా ఇల్లు కొన్నామని, జీవితాంతం అదే గృహంలోనే ఉంటామని చెప్పారు. 25 శాతం మంది పెట్టుబడిగా కొనుక్కున్నామని, 7 శాతం మంది రిటైర్మెంట్, రెండో ఇల్లు ఉండాలని, వెకేషన్ కోసం అంటూ పలు కారణాల వల్ల ఇల్లు కొన్నామని వివరించారు.ప్రీమియం వైపు ఆలోచనలు..దేశంలో ఇల్లు కొనేవారి ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. తాజాగా మేం జరిపిన అధ్యయనంలో కూడా ఇదే విషయం తేలింది. దాదాపు 80 శాతం మంది సొంతిల్లు కట్టుకోవాలని ఆలోచిస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లో ప్రీమియం, లగ్జరీ ఇళ్లు కట్టుకోవాలనే ట్రెండ్ పెరుగుతోంది. కేవలం దేశ ఆర్థిక వృద్ధి, జీడీపీ, ఉద్యోగ కల్పనకు మాత్రమే దేశ స్థిరాస్తి రంగం ఉపయోగపడదు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే కాకుండా కొనేవారి ప్రాధాన్యాలను కూడా అంచనా వేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. – శిశిర్ బైజల్, నైట్ ఫ్రాంక్ ఇండియా, చైర్మన్, ఎండీఇదీ చదవండి: థీమ్..హోమ్! ఇళ్ల నిర్మాణంలో సరికొత్త ట్రెండ్ -
ప్రేమ పెళ్లిళ్లను పెద్దలు కాదనలేరు: ఢిల్లీ హైకోర్టు
ఇకపై మేజర్లయిన పిల్లల పెళ్లిళ్లను పెద్దలు అడ్డుకోలేరు. వివాహానికి తగిన వయసు కలిగిన యువతీయువకులు తమకు ఇష్టమైన భాగస్వామిని వివాహం చేసుకోవచ్చని, ఇటువంటి సందర్భంలో ఆ జంటల వివాహానికి తల్లిదండ్రులు లేదా వారి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పలేరని, రాజ్యాంగం ఆ జంటకు రక్షణ కల్పిస్తుందని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్న జంటలకు పోలీసులు రక్షణ కల్పిస్తారని, అవసరమైన పక్షంలో వారి కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు రక్షణ అందిస్తారని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. భార్యాభర్తల వివాహ హక్కును ఏ విధంగానూ తక్కువ చేయకూడదని, ఇలాంటి జంటలకు రక్షణ కల్పించాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత ఆ రాష్ట్రంపై ఉందని జస్టిస్ తుషార్ రావు గేదెల అభిప్రాయపడ్డారు. ఢిల్లీ హైకోర్టు ఒక కేసులో.. తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకున్న ఒక జంటకు పోలీసు రక్షణ కల్పిస్తూ, మేజర్లయిన యువతీయువకులు తమకు ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం రాజ్యాంగం కల్పించిందని కోర్టు పేర్కొంది. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఒక జంట న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వీరిలో భర్తపై నమోదైన తప్పుడు ఎఫ్ఐఆర్ను గత ఆగస్టులో కోఆర్డినేట్ బెంచ్ రద్దు చేసిందని జస్టిస్ గేదెలకు చెప్పారు. కాగా ఎఫ్ఐఆర్ పెండింగ్‌లో ఉన్న సమయంలోనే వారు వివాహం చేసుకుని, ఆనందంగా జీవిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ దంపతులకు హాని జరగకుండా చూసుకోవాలని ఢిల్లీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఇది కూడా చదవండి: ‘రెడ్ లైట్ ఆన్- వెహికిల్ ఆఫ్’ అంటే ఏమిటి? ఢిల్లీలో ఎందుకు అమలు చేస్తున్నారు? Right To Marry Person Of Choice Protected Under Constitution, Not Even Family Members Can Object: Delhi High Court @nupur_0111 https://t.co/JEDBQuyQI8 — Live Law (@LiveLawIndia) October 26, 2023 -
మొబైల్ నంబర్.. మీకు నచ్చినట్టు..
ఈరోజుల్లో ప్రతిఒక్కరికీ మొబైల్ ఫోన్ ఉంటుంది. ఫోన్ లేనివారు ఉండటం చాలా అరుదు. ఇప్పుడన్నీ డ్యుయల్ సిమ్ ఫోన్ కావడంతో చాలా మందికి రెండు ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి. ఇంకొంత మందికి అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఏదైనా టెలికామ్ సంస్థ నుంచి కొత్తగా సిమ్ తీసుకుంటున్నప్పుడు చాలామంది తమకు నచ్చిన కస్టమైజ్డ్ మొబైల్ నంబర్లను ఇష్టపడతారు. కొంతమందికి ప్రత్యేకమైన ఇష్టమైన నంబర్లు ఉంటే, మరికొందరు కొన్ని నంబర్లను అదృష్టంగా భావిస్తారు. ఇలా మంచి నంబర్ల కలయిక కోసం శోధిస్తారు. అయితే తమకు కావలసిన నంబర్ కాంబినేషన్లను ఎంచుకునే అవకాశం ఉందని చాలా మందికి తెలియదు. వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్, రిలయన్స్‌తో సహా భారతీయ టెలికాం మార్కెట్లోని కొన్ని కంపెనీలు ఆసక్తిగల సబ్స్క్రైబర్లకు వారికి నచ్చిన మొబైల్ నంబర్ల నిర్దిష్ట అంకెలను అందిస్తున్నాయి. వీటిలో రిలయన్స్ జియో తక్కువ ధరకే ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు కావాల్సిన నిర్దిష్టమైన మొబైల్ నంబర్లను అందిస్తోంది. ఈ ఛాయిస్ నంబర్ స్కీమ్ ద్వారా కస్టమర్లు పూర్తి నంబర్‌ను ఎంచుకోలేనప్పటికీ తమ కొత్త జియో నంబర్లోని చివరి 4 నుంచి 6 అంకెలను ఎంచుకోవచ్చు. -
టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ గా అశ్విన్..!
-
డబ్ల్యూటీసీ ఫైనల్లో వికెట్ల వెనుక మనోడే
విశాఖ స్పోర్ట్స్: ప్రపంచ టెస్ట్ క్రికెట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) టైటిల్ పోరులో భారత్ జట్టు వికెట్ కీపర్‌గా విశాఖకు చెందిన కె.ఎస్.భరత్ ఎంపికయ్యాడు. ప్రస్తుత సీజన్లో తొలిసారిగా టెస్ట్ క్రికెట్లో ఆరంగేట్రం చేసిన ఈ 30 ఏళ్ల కీపర్ బ్యాటర్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్ట్‌లు ఆడాడు. ఇవన్నీ భారత్‌లోనే జరిగాయి. కానీ విదేశీ గడ్డపై జరగనున్న ఈ చాంపియన్‌ప్‌లో ఆడేందుకు సెకండ్ ఫ్రంట్‌లైన్ వికెట్‌కీపర్‌గా ఉన్న భరత్‌కు అనూహ్యంగా అవకాశం అందివచ్చింది. పంత్ గాయపడి అందుబాటులో లేకపోవడంతో బీసీసీఐ మంగళవారం ప్రకటించిన భారత్ 15వ మెంబర్ స్క్వాడ్‌లో వికెట్‌కీపర్‌గా అవకాశం దక్కింది. అయితే జట్టులో మరో వికెట్‌కీపర్ బ్యాటర్ కె.ఎల్.రాహుల్ ఉన్నా.. వికెట్ల వెనుక భరతే నిలిచే అవకాశాలు ఉన్నాయి. లండన్‌లో జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు జరిగే టైటిల్ పోరులో ఆ్రస్టేలియాతో భారత్ తలపడనుంది. భారత్ వేదికగా బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైంది. మొదటి టెస్ట్‌లో భరత్ తొలి స్టంపౌట్‌గా లబుషేన్‌ను వెనక్కి పంపాడు. సిరీస్‌లో భాగంగా నాలుగు మ్యాచ్‌ల్లో తొలి టెస్ట్‌లో ఓ స్టంపౌట్, ఓ క్యాచ్ పట్టిన భరత్.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఆరు క్యాచ్‌లు పట్టాడు. నాలుగో టెస్ట్‌లో 44 పరుగుల కెరీర్ బెస్ట్ స్కోర్‌తో మొత్తంగా 101 పరుగులు చేశాడు. ఆరో స్థానంలో వచ్చి 67, ఏడో స్థానంలో వచ్చి 26, ఎనిమిదో స్థానంలో వచ్చి 8 పరుగులు చేశాడు. -
14 ప్రభుత్వ స్కూళ్లకు ‘స్వచ్ఛ’ పురస్కారాలు
ఒక్కో పాఠశాలకు రూ.50 వేల నగదు బహుమతి సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛభారత్‌లో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించి రాష్ట్రంలోని 14 ప్రభుత్వ పాఠశాలలు జాతీయ స్వచ్ఛ విద్యాలయ–2016 పురస్కారాలకు ఎంపికయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 172 ప్రభుత్వ పాఠశాలలు ఎంపికయ్యాయి. 2016–17 విద్యా సంవత్సరంలో వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత, హ్యాండ్‌వాష్, టాయిలెట్ల పరిశుభ్రత వంటి అంశాల్లో చర్యలు చేపట్టినందుకుగాను రాష్ట్ర స్థాయిలో 40 పాఠశాలలను స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి విద్యాశాఖ ఎంపిక చేసింది. ఈ మేరకు గురువారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ జాబితా ప్రకటించింది. ఎంపికైన పాఠశాలకు రూ.50 వేల చొప్పున నగదు బహుమతి అందజేయనుంది. సెప్టెంబర్ 1న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో నగదు బహుమతితోపాటు, సర్టిఫికెట్లను ఇవ్వనున్నట్లు సర్వశిక్షా అభియాన్ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ భాస్కర్‌రావు తెలిపారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాలు ప్రత్యేక అవార్డులకు ఎంపికయ్యాయని చెప్పారు. ఆయా పాఠశాలలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అభినందనలు తెలిపారు. పురస్కారానికి ఎంపికైన పాఠశాలలు ఇవే... జిల్లా పాఠశాల ఆదిలాబాద్ ఎంపీయూపీఎస్ బండల్ నాగపూర్ మంచిర్యాల టీఎస్‌ఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ బాయ్స్ వార్డు నంబర్–19 బెల్లంపల్లి జగిత్యాల జెడ్పీహెచ్ఎస్ అంబారీపేట కరీంనగర్ టీఎస్ఎంఎస్ గంగాధర, ఎంపీయూపీఎస్ కొత్తపల్లి (పీఎన్) సిద్దిపేట ఎంపీయూపీఎస్ ఇబ్రహీంపూర్ వికారాబాద్ ఎంపీపీఎస్ బుద్ధారం మహబూబ్‌నగర్ ఎంపీపీఎస్ చౌటగడ్డతండ సూర్యాపేట జెడ్పీహెచ్ఎస్ అనంతారం జయశంకర్ జెడ్పీహెచ్ఎస్ తిమ్మాపేట్ ఖమ్మం టీఎస్ఎంఎస్ కారేపల్లి, ఎంపీపీఎస్ మల్లారం, టీఎస్‌ఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ సింగారెడ్డి పాలెం ఎంపీయూపీఎస్ గండగలపాడు. -
దక్షిణ భారత తైక్వాండో పోటీలకు జిల్లా క్రీడాకారులు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, కేరళ తైక్వాండో అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 6వ దక్షిణ భారత తైక్వాండో చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లాకు చెందిన 13 మంది ఎంపికయ్యారని కోచ్ రామాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఇండోర్ స్టేడియంలో క్రీడాకారులను డీఎస్డీఓ బాషామోహిద్దీన్ అభినందించారు. 2016లో రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన సబ్–జూనియర్, క్యాడెట్, జూనియర్, సీనియర్ క్రీడాకారులను దక్షిణ భారత తైక్వాండో క్రీడా పోటీలకు ఎంపిక చేశామన్నారు. పోటీలు కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ వీకే కృష్ణమీనన్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 20 నుంచి 23వ తేది వరకు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా డీఎస్డీఓ మాట్లాడుతూ జాతీయస్థాయి క్రీడా పోటీల్లో విజయంతో తిరిగి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కోచ్‌లు మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారుల వివరాలు సబ్–జూనియర్ విభాగం(అండర్–11) బాలురు 18 కిలోలు–గౌతంకృష్ణారెడ్డి 41 లోలు–రిషీచౌహాన్ బాలికల విభాగం 18 కిలోలు–నిహారిక 20 కిలోలు–నీతు శ్రీ సాయి 24 కిలోలు–జోహ్న 26 కిలోలు–వెన్నెల 29 కిలోలు–నిఖీత సోరేలు క్యాడెట్ విభాగం(అండర్–14) బాలురు 65 కిలోలు–జయేష్ 65 కిలోలు–దత్తుసాయి బాలికలు 33 కిలోలు–రోజా 41 కిలోలు–సాయిదీప్తి 47 కిలోలు–హేమ జూనియర్ విభాగం(అండర్–17) 68 కిలోలు–ఆశాదీక్షిత -
విస్తీర్ణాన్ని బట్టి ఏసీ ఎంపిక!
గది విస్తీర్ణాన్ని బట్టి ఏసీని ఎంపిక చేసుకోవాలి. 120–140 చ.అ. ఉండే గదిలో 1 టన్ను, 150–180 చ.అ. ఉండే గదిలో 1.5 టన్నులు, 180–240 చ.అ. విస్తీర్ణం ఉండే గదిలో 2 టన్నుల ఏసీ సరిపోతుంది. ఒకవేళ పడక గది దక్షిణం, పశ్చిమ దిశల్లో ఉంటే ఎండ ఎక్కువుంటుంది కాబట్టి సాధారణం కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఏసీని తీసుకోవాలి. టన్ను ఏసీ బదులు 1.5 టన్ను ఏసీని ఎంచుకోవటం ఉత్తమం. ⇒ ఒకవేళ 3–4 నెలలు... రోజులో 8–10 గంటల పాటు ఏసీని వినియోగిస్తే కనీసం త్రీ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీని తీసుకోవటం ఉత్తమం. ఒకవేళ 5–7 నెలల పాటు వినియోగిస్తే మాత్రం ఫైవ్ స్టార్ ఏసీని తీసుకోవటం మేలు. సాక్షి, హైదరాబాద్: ఎండాకాలం వచ్చేసిందంటే చాలు.. కూలరో లేక ఎయిర్ కండీషనర్ (ఏసీ)ని కొనడంలో బిజీ బిజీగా ఉంటారు. నిజం చెప్పాలంటే ఇంటికి ఎలాంటి ఏసీని కొనాలో చాలా మందికి తెలియదు. బ్రాండ్ ఎంపిక బెస్టా? లేక స్టార్ రేటింగ్ ముఖ్యమా? అని నిపుణులనడితే.. గది విస్తీర్ణాన్ని బట్టి ఏసీ ఎంపిక ఉంటుందంటున్నారు. ఇళ్లల్లో ఎక్కువగా వినియోగించే ఏసీలు విండో, స్లి్పట్ రకాలే. అయితే ప్రస్తుతం విండో కంటే స్లి్పట్ ఏసీలను ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. పెద్దగా చప్పుడు లేకుండా చల్లదనాన్ని ఇవ్వడమే దీని ప్రత్యేకత. డైకిన్, ఎల్జీ, శామ్సంగ్, వోల్టాస్, బ్లూస్టార్, క్యారియర్, లాయిడ్, ఓ జనరల్, మిట్సుబిషి, వర్ల్‌పూల్ వంటి ఎన్నో బ్రాండ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పోటాపోటీగా ఆయా సంస్థలు సరికొత్త సదుపాయాలతో మార్కెట్లో రెడీగా ఉన్నాయి. ప్రారంభ ధరలు రూ.25 వేల నుంచి ఉన్నాయి. కొనాలంటే స్టార్ ఉండాల్సిందే.. ఏసీ కొనాలంటే కొనుగోలుదారులు ముందుగా చూసేది స్టార్ గుర్తులే. ఎందుకంటే ఎనర్జీ ఎఫిసియెన్సీ అనేది ఎంత విద్యుత్‌ను ఆదా చేస్తుందనే తెలియజేస్తుంది మరి. అందుకే ప్రస్తుతం ప్రతి సంస్థ కూడా స్టార్ రేటింగ్ ఏసీలను తయారు చేస్తున్నాయి. ఏసీపై ఒక స్టార్ ముద్రించి ఉంటే 5 శాతం విద్యుత్ ఆదా అవుతుందని అర్థం. స్టార్ల సంఖ్య పెరుగుతుంటే విద్యుత్ ఆదా కూడా పెరుగుతుంది. ఒక్కో స్టార్ గుర్తు పెరుగుతుంటే ధర కూడా రూ.2,500 పెరుగుతుంది. ఫైవ్ స్టార్ స్లి్పట్ ఏసీతో పోల్చుకుంటే ఇన్వర్టర్ ఏసీ ధర 20 శాతం అధికంగా ఉంటుంది. -
రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైన విద్యార్థి
పిట్లం : రాష్ట్రస్థాయి త్రోబాల్ క్రీడలకు పిట్లంలోని బ్లూబెల్స్ పాఠశాల విద్యార్థి ఎంపికైనట్లు పాఠశాల పీఈటీ ధర్మవీర్ తెలిపారు. బ్లూబెల్స్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న తరుణ్ అనే విద్యార్థి జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చగా రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీల్లో జిల్లా జట్టు నుంచి పోటీల్లో పాల్గొననున్నాడని ఆయన తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో పాఠశాల నిర్వాహకులు నర్సింహా రెడ్డి, ప్రిన్సిపాల్, పీఈటీలు దవులత్, సుధాకర్, సుమలత, అధ్యాపక బృందం విద్యార్థిని అభినందించారు. -
ఇష్టంగానే సెక్స్ వర్క్ చేస్తున్నాం!
బెంగళూరు: సాటి మనిషికి పట్టించుకునే తీరిక లేనప్పుడు సమస్యలు ఆ వ్యక్తిని చెడుగుడు ఆడేస్తాయి. వాటి బెంగతో కొందరు మహిళలు.. ప్రాణం తీసుకుంటే.. ఇంకొందరు పోరాటానికి నిలబడతారు. మరికొందరు మానం(గౌరవం) ఇచ్చేసైనా బతుకుతారు.. బతికిస్తారు. ఆ సమయంలో గౌరవం లాంటివి వారిని ముందుకు నడిపించలేవు. ఆత్మాభిమానం వారిని అడ్డుకోలేదు. ఎందుకంటే ఆ సమయంలో వారికి అమాంతం తొక్కేస్తున్న సమస్య అనే భూతాన్ని చంపడమే లక్ష్యంగా ఉంటుంది. బెంగళూరులో సునీత(పేరు మార్చాం) అనే మహిళకు 30 ఏళ్లు. చాలా చిన్న వయసులో పెళ్లి చేశారు. ఇద్దరు పిల్లలు కలగగానే భర్త చనిపోయాడు. పరిస్థితులు వెంటనే ఆమెను వ్యభిచార రొంపిలోకి దింపాయి. అక్కడ అనుభవిస్తున్న బాధ నుంచి ఎలాగైనా విముక్తి పొందాలని ఎదురుచూసింది. పోలీసుల రూపంలో సహాయం దొరకడంతో ఆ కూపంలో నుంచి తప్పించుకోగలిగింది. దాదాపు పదేళ్లపాటు అందులో నరకం అనుభవించి తిరిగి స్వేచ్చను పొందింది. ఇప్పుడు ఆమె ఓ వ్యక్తిని తన పిల్లలకు రక్షణగా, తనకు తోడుగా ఉండేందుకు పెళ్లి చేసుకుంది. అతడు ఆమెకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడు. అయితే, ఆమె తన వృత్తిని మాత్రం మానుకోలేదు. భర్త ఇష్టం మేరకే ఆ పనికొనసాగిస్తుంది. అయితే, ఈసారి అలాంటి గృహానికి వెళ్లి కాదు.. బలవంతంగా కాదు. ఆమె ఇష్ట ప్రకారమే.. నచ్చినవారితో మాత్రమే ఆ పనిచేస్తోంది. 'నేనొక సెక్స్ వర్కర్ని.. కానీ బలవంతంగా ఆ పనిచేయడం లేదు.. చాయిస్ ప్రకారం చేస్తున్నాను' అని చెప్తోంది. అలాగే శశికల(పేరు మార్చాం) అనే మరో మహిళ కూడా సెక్స్ వర్కరే.. ఆమె కూడా తన చాయిస్ ప్రకారమే ఆ పనిచేస్తుంది తప్ప బలవంతంగా చేయడం లేదంటూ బదులిచ్చింది. ఆమెకు ముగ్గురు పిల్లలు.. వారిలో ఇద్దరి పెళ్లిల్లు కూడా చేసింది. ఆమె ఆ పనిచేస్తున్న విషయం తన పిల్లలకు తెలుసని.. తన వృత్తే తమకు భోజనం పెడుతుందని, చదువుకు ఫీజులు కట్టిందని.. తన కోడలికి కూడా తన వృత్తి విషయం చెప్పినట్లు చెప్పింది. ఇలా ఎంతోమంది తమకు ఇష్టం ఉండే, నచ్చినవారితోనే అలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం తప్ప ప్రస్తుతం బలవంతంగా ఆ పనిచేయడంలేదని, తమ జీవితాలు ఎలా ఉన్నా తమ పిల్లల భవిష్యత్తు బంగారంగా మారుతుందనే ఈ వృత్తి చేస్తున్నామని చెప్తున్నారు. -
ఆషాఢ లక్ష్ములు...
ముస్తాబు ఆషాఢంలో గోరింట పూసిన చేతులతో ఆదిలక్ష్ములు... శ్రావణంలో సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్ములు... మాసమేదైనా... వేడుకేదైనా... అమ్మాయిల ఛాయిస్ లంగా, ఓణీ అయితే ఐశ్వర్యం ఆ ఇంట కొలువుదీరుతుంది. అమ్మానాన్నలకు కనులపండుగవుతుంది. నేటి తరం అమ్మాయిలు ముస్తాబుకు ఇష్టపడి ఎంచుకునే ముచ్చటైన లంగా, ఓణీల కాంబినేషన్ మీ కోసం... 1- నీలాకాశం రంగు నెట్ లెహంగాకు ఎరుపురంగు బెనారస్ చున్నీని జత చేరిస్తే ఏ పండగైనా నట్టింటికి నడిచొచ్చేస్తుంది. మిర్రర్ వర్క్ ఉన్న లెహంగా బార్డర్, బెనారస్ బ్లౌజ్ అదనపు ప్రత్యేకతలు. 2- హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన సియాన్ గ్రీన్ రా సిల్క్ లెహంగాను మరింత ఆకర్షణీయంగా మార్చివేసింది బెనారస్ చున్నీ. కుందన్ వర్క్ చేసిన ఆఫ్‌వైట్ రా సిల్క్ బ్లౌజ్ ప్రత్యేకంగా కనిపిస్తోంది. 3- కనకాంబరం రంగు లెహెంగాకు రాయల్ బ్లూ చున్నీ జతకడితే పండిన గోరింటాకు ఎర్రదనం చెక్కిళ్లలో పూస్తుంది. సీక్వెన్స్ చమ్కీ వర్క్ బార్డర్ జత చేసిన లెహంగా స్టోన్ వర్క్‌తో మెరిసిపోతుంటే, కుందన్వర్క్ బ్లౌజ్ ప్రత్యేక శోభను తీసుకువస్తుంది. 4- మిర్రర్ వర్క్ చేసిన షిమా జార్జెట్ మెటీరియల్‌ను లెహంగాగా మార్చి, అద్దాలతో కట్ వర్క్ చున్నీని మెరిపిస్తే పట్టపగలే తారలు దిగివచ్చినట్టుగా అనిపించకమానదు. 5- పీచ్ కలర్ నెట్ లెహంగా, మింట్ గ్రీన్ చున్నీ, ఫుల్ స్లీవ్స్ నెట్ బ్లౌజ్.. పైనంతా స్వీక్వెన్స్ వర్క్‌తో రూపుకడితే రాత్రి దీపకాంతిలో దేదీప్యమానంగా వెలిగిపోవచ్చు. డిజైనర్ టిప్స్: కుందన్స్, స్టోన్స్, చమ్కీ, మిర్రర్లతో చేసిన వర్క్‌లు పాడైపోకుండా ఉండాలంటే లెహంగాలను దగ్గరికి మడతపెట్టకూడదు. ఎంబ్రాయిడరీ గల లెహంగాలేవైనా హ్యాంగర్‌కి వేలాడదీయాలి. ఏ లెహంగా అయినా శుభ్రపరచాలంటే మైల్డ్ షాంపూతో లేదంటే డ్రై వాష్ చేయించడం ఉత్తమం. మిర్రర్ వర్క్, స్వీక్వెన్స్ వర్క్ గల లెహెంగాలు రాత్రి వేడుకలకు బ్రైట్‌గా కనిపిస్తాయి. సంప్రదాయ వేడుకలకు కేశాలంకరణగా జడ, కాంబినేషన్ ఆభరణాలు బాగా నప్పుతాయి. బర్త్‌డే, రిసెప్షన్ వంటి ఈవెనింగ్ వేడుకలకు కట్ వర్క్ చున్నీలు, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లు, వదులుగా ఉండే కేశాలంకరణ బాగా నప్పుతాయి. కర్టెసీ: శశి, ఫ్యాషన్ డిజైనర్, ముగ్ధ ఆర్ట్ స్టూడియో, హైదరాబాద్ www.mugdha410@gmail.com -
దుస్తుల అలమరా... 5 సూచనలు
ఖరీదైన అలమరాలు కొనుగోలులో చూపించినంత శ్రద్ధ చాలామంది అందులో దుస్తులను సర్దుకోవడంలో చూపించరు. అందుకే చాలా సమయాలలో డ్రెస్‌కు తగిన మ్యాచింగ్ దుస్తులు అందుబాటులో ఉండక ఇబ్బందులు పడుతుంటారు. అలమరాను సర్దుకోవడానికి ఐదు సూచనలు. 1.అరలలో అన్నీ కుక్కేసినట్టుగా ఉన్న దుస్తులను బయటకు తీసి (అవసరం లేనివి-అవసరం ఉన్నవి) రెండు భాగాలు చేయండి. 2.ఆధునిక దుస్తులైన టీ షర్ట్లు, కుర్తీలు, గౌన్లు, జీన్స్, హారెమ్ ప్యాంట్స్ ... వంటివి ఒక అరలో సర్దండి. 3.సంప్రదాయ తరహా లంగా ఓణీ, చుడీదార్లు, చీరలు ఒక అరలో సెట్ చేయాలి. ఏ డ్రెస్ అయినా మ్యాచింగ్ అయ్యే దుస్తులు ఒకే చోట ఉండేలా జాగ్రత్తపడండి. 4.ఏ సమయంలో అయినా ధరించడానికి వీలుగా ఉండే క్యాజువల్ డ్రెస్సులు, లోదుస్తులు విడిగా అమర్చుకోండి. 5.దుస్తుల మీదకు నప్పే యాక్ససరీస్ (పూసలు, కలప, క్లాత్...ఆభరణాలు, చేతి గడియారాలు, కేశాలంకరణ వస్తువులు, హ్యాండ్ బ్యాగ్..) ఒక అరలో ఉంచాలి. దీని వల్ల సందర్భానుసారం ధరించే దుస్తుల మీదకు సరైన మ్యాచింగ్ సులువుగా తీసుకునే ఉంటుంది. శుభ్రంగా దుస్తుల అలమరను అనుకూలంగా అమర్చుకుంటే కొనుగోలు ఎంపికలోనూ అవగాహన కలుగుతుంది. సందర్భానికి తగ్గట్టు త్వరగా ముస్తాబు అయ్యే అవకాశమూ ఉంటుంది. -
పొడుగ్గా కనిపించాలా!
మీ ఎత్తు 5 అడుగులు... అంతకన్నా తక్కువగా ఉందా! అయితే డ్రెస్ డిజైనర్స్ చెబుతున్న ఈ సూచనలు మీకోసమే! ధరించే దుస్తులు మీ శరీరాన్ని కప్పేసేలా ఉండకూడదు. దీని వల్ల మరింత పొట్టిగా కనిపిస్తారు. ఎప్పుడూ ఫిట్‌గా ఉండే కాస్త కురచ దుస్తులను ఎంచుకోవాలి. టాప్, బాటమ్.. ఒకే రంగు గల డ్రెస్సు ధరిస్తే మరింత చిన్నగా కనిపించడం ఖాయం. అందుకే డ్రెస్సింగ్‌లో విభిన్నతను చూపించండి. ఎప్పుడూ ముదురు రంగులను ఎంచుకోవడమే ఉత్తమం. లేత రంగులు, బరువైన ఫ్యాబ్రిక్ ఎంచుకుంటే చూడ డానికి గాడీగా ఉంటుంది. ఎత్తు తక్కువగా కనిపిస్తారు. పెద్ద పెద్ద పువ్వుల ప్రింట్లు, గాడీ డిజైన్లు కాకుండా చిన్న చిన్న ప్రింట్లు ఉన్న డ్రెస్సులను ఎంచుకోండి. చెక్స్ ఉన్న దుస్తులు తీసుకునేవారు నిలువు చారల దుస్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి. కూర్చునేటప్పుడు, నిల్చునేటప్పుడు చాలామంది అనుకోకుండా నడుము, భుజాలు వంచుతుంటారు. నిల్చున్నా, కూర్చున్నా వీపుభాగం నిటారుగా, భుజాలు విశాలంగా ఉంటే మీలో ఆత్మవిశ్వాసం ఎదుటివారికి ఎత్తుగా ఉండేలా కనిపిస్తుంది. వంగిపోయి ఉంటే మీలోని ఆత్మన్యూనత మరింత పొట్టిగా చూపిస్తుంది. మీ అభద్రతతో సహా!