రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైన విద్యార్థి
పిట్లం :
రాష్ట్రస్థాయి త్రోబాల్ క్రీడలకు పిట్లంలోని బ్లూబెల్స్ పాఠశాల విద్యార్థి ఎంపికైనట్లు పాఠశాల పీఈటీ ధర్మవీర్ తెలిపారు. బ్లూబెల్స్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న తరుణ్ అనే విద్యార్థి జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చగా రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీల్లో జిల్లా జట్టు నుంచి పోటీల్లో పాల్గొననున్నాడని ఆయన తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో పాఠశాల నిర్వాహకులు నర్సింహా రెడ్డి, ప్రిన్సిపాల్, పీఈటీలు దవులత్, సుధాకర్, సుమలత, అధ్యాపక బృందం విద్యార్థిని అభినందించారు.