దక్షిణ భారత తైక్వాండో పోటీలకు జిల్లా క్రీడాకారులు
అనంతపురం సప్తగిరి సర్కిల్ :
తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, కేరళ తైక్వాండో అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 6వ దక్షిణ భారత తైక్వాండో చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లాకు చెందిన 13 మంది ఎంపికయ్యారని కోచ్ రామాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఇండోర్ స్టేడియంలో క్రీడాకారులను డీఎస్‌డీఓ బాషామోహిద్దీన్ అభినందించారు. 2016లో రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన సబ్–జూనియర్, క్యాడెట్, జూనియర్, సీనియర్ క్రీడాకారులను దక్షిణ భారత తైక్వాండో క్రీడా పోటీలకు ఎంపిక చేశామన్నారు. పోటీలు కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ వీకే కృష్ణమీనన్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 20 నుంచి 23వ తేది వరకు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా డీఎస్‌డీఓ మాట్లాడుతూ జాతీయస్థాయి క్రీడా పోటీల్లో విజయంతో తిరిగి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కోచ్‌లు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపికైన క్రీడాకారుల వివరాలు
సబ్–జూనియర్ విభాగం(అండర్–11) బాలురు
- 18 కిలోలు–గౌతంకృష్ణారెడ్డి
- 41 లోలు–రిషీచౌహాన్
- బాలికల విభాగం
- 18 కిలోలు–నిహారిక
- 20 కిలోలు–నీతు శ్రీ సాయి
- 24 కిలోలు–జోహ్న
- 26 కిలోలు–వెన్నెల
- 29 కిలోలు–నిఖీత సోరేలు
క్యాడెట్ విభాగం(అండర్–14) బాలురు
- 65 కిలోలు–జయేష్
- 65 కిలోలు–దత్తుసాయి
బాలికలు
- 33 కిలోలు–రోజా
- 41 కిలోలు–సాయిదీప్తి
- 47 కిలోలు–హేమ
జూనియర్ విభాగం(అండర్–17)
- 68 కిలోలు–ఆశాదీక్షిత