ఒక్కో పాఠశాలకు రూ.50 వేల నగదు బహుమతి
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛభారత్‌లో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించి రాష్ట్రంలోని 14 ప్రభుత్వ పాఠశాలలు జాతీయ స్వచ్ఛ విద్యాలయ–2016 పురస్కారాలకు ఎంపికయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 172 ప్రభుత్వ పాఠశాలలు ఎంపికయ్యాయి.
2016–17 విద్యా సంవత్సరంలో వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత, హ్యాండ్‌వాష్, టాయిలెట్ల పరిశుభ్రత వంటి అంశాల్లో చర్యలు చేపట్టినందుకుగాను రాష్ట్ర స్థాయిలో 40 పాఠశాలలను స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి విద్యాశాఖ ఎంపిక చేసింది. ఈ మేరకు గురువారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ జాబితా ప్రకటించింది.
ఎంపికైన పాఠశాలకు రూ.50 వేల చొప్పున నగదు బహుమతి అందజేయనుంది. సెప్టెంబర్ 1న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో నగదు బహుమతితోపాటు, సర్టిఫికెట్లను ఇవ్వనున్నట్లు సర్వశిక్షా అభియాన్ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ భాస్కర్‌రావు తెలిపారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాలు ప్రత్యేక అవార్డులకు ఎంపికయ్యాయని చెప్పారు. ఆయా పాఠశాలలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అభినందనలు తెలిపారు.
పురస్కారానికి ఎంపికైన పాఠశాలలు ఇవే...
జిల్లా పాఠశాల
ఆదిలాబాద్ ఎంపీయూపీఎస్ బండల్ నాగపూర్
మంచిర్యాల టీఎస్‌ఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్
బాయ్స్ వార్డు నంబర్–19 బెల్లంపల్లి
జగిత్యాల జెడ్పీహెచ్‌ఎస్ అంబారీపేట
కరీంనగర్ టీఎస్‌ఎంఎస్ గంగాధర, ఎంపీయూపీఎస్ కొత్తపల్లి (పీఎన్)
సిద్దిపేట ఎంపీయూపీఎస్ ఇబ్రహీంపూర్
వికారాబాద్ ఎంపీపీఎస్ బుద్ధారం
మహబూబ్‌నగర్ ఎంపీపీఎస్ చౌటగడ్డతండ
సూర్యాపేట జెడ్పీహెచ్‌ఎస్ అనంతారం
జయశంకర్ జెడ్పీహెచ్‌ఎస్ తిమ్మాపేట్
ఖమ్మం టీఎస్‌ఎంఎస్ కారేపల్లి, ఎంపీపీఎస్ మల్లారం, టీఎస్‌ఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ సింగారెడ్డి పాలెం
ఎంపీయూపీఎస్ గండగలపాడు.
14 ప్రభుత్వ స్కూళ్లకు ‘స్వచ్ఛ’ పురస్కారాలు
Published Fri, Aug 18 2017 1:31 AM | Last Updated on Tue, Sep 12 2017 12:20 AM
Advertisement
Advertisement