public schools
-
కాలిఫోర్నియాలో కలిపిరాత మస్ట్... ఎందుకంటే?
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఇప్పుడు కర్సివ్ రైటింగ్.. అదేనండి గొలుసుకట్టు రాత, కలిపిరాత అని చెబుతూంటారే అదన్నమాట తప్పనసరి! అసలు చేతిరాతనే పూర్తిగా మర్చిపోతున్న ఈ కాలంలో కలిపిరాత గోలేమిటని అనుకుంటున్నారా? ఈ రకమైన రాతతో పిల్లలకు ఎన్నో ప్రయోజనాలున్నాయట. అందుకే 2010లో పూర్తిగా పక్కన బెట్టిన కలిపి రాతను ఈ ఏడాది నుంచి తప్పనిసరి చేసింది కాలిఫోర్నియా. పరిశోధనలు, నిపుణుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు కాలిఫోర్నియా మాత్రమే కాదు...అమెరికాలోని దాదాపు 24కు పైగా రాష్ట్రాలలో దీన్ని తిరిగి అమలు చేసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఇంతకీ కర్సివ్ రైటింగ్ లేదా కలిపిరాతతో పిల్లలకు వచ్చే ప్రయోజనాలేమిటి? కర్సివ్ రైటింగ్‌ని ‘కర్సివ్ - జాయిన్ ఇటాలిక్స్’ అని కూడా పిలుస్తారు. దీనిపై అనేక న్యూరోసైన్స్ పరిశోధనలు జరిగాయి. ఫలితంగా కలిపి రాత అనేది మెదడుకు చాలా మంచిది అని తేలింది. కాలిఫోర్నియాకు చెందిన న్యూరో సైంటిస్ట్ క్లాడియా అగ్యుర్రే ప్రకారం టైప్‌రైటింగ్‌తో పోల్చితే, అక్షరాలను కర్సివ్‌లో రాయడం వల్ల నేర్చుకోవడంలో, భాషాభివృద్ధిలోనూ ఉపయోపడటంతోపాటూ, నిర్దిష్ట నాడీ మార్గాలను యాక్టివేట్ చేస్తుంది. పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ఆక్యుపేషనల్ థెరపీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కెల్సే వోల్ట్జ్-పోరెంబా, చిన్నపిల్లలు కర్సివ్‌ను నేర్చుకోవడం, అనుకరించడం చాలా సులభం అని చెప్పారు. తద్వారా పిల్లల్లో స్వయంప్రతిపత్తి పెరుగుతుంది. అధునాతన, మెరుగైన విజువల్ స్కిల్స్‌ను అలవర్చుకోవడంతోపాటు తొందరగా నేర్చుకుంటారని కూడా ఆమె చెప్పారు. మాన్యువల్ చేతివ్రాత ప్రయోజనాలు స్పష్టంగా ఉన్నప్పటికీ, పిల్లల అభివృద్ధికి ప్రింట్ కంటే కర్సివ్ ప్రత్యేకంగా మంచిదా? కాదా? అనే దానిపై భిన్నమైన అభిప్రాయాలున్నాయి. ఆధునిక ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం అనేది తప్ప కర్సివ్ వల్ల ఎదుగుతున్న పిల్లల్లో ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. ఇండియానా యూనివర్శిటీలో సైకలాజికల్ అండ్ బ్రెయిన్ సైన్సెస్ ప్రొఫెసర్ కరిన్ జేమ్స్ (ప్రింట్ ఓవర్ కర్సివ్) పరిశోధన చేశారు. నాలుగు నుండి ఆరు సంవత్సరాల పిల్లలతో కలిసి చేపట్టిన ఈ రీసెర్చ్‌లో చేతితో రాయడం ద్వారా అక్షరాలు నేర్చుకుంటున్నప్పుడు మెదడులోని నెట్‌వర్క్‌ల యాక్టివ్ కావడం గమనించారు. అయితే కీబోర్డ్‌పై టైప్ చేసినపుడు మాత్రం ఇలా జరగలేదు. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని ఎడ్యుకేషనల్ సైకాలజీలో ప్రొఫెసర్ వర్జీనియా బెర్నింగర్ చేసిన ఇతర పరిశోధనలు కూడా చేతితో రాయడం వలన జ్ఞాపకశక్తి, ఓపిక, ఏకాగ్రతలు పెరుగుతాయి. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని ఎడ్యుకేషనల్ సైకాలజీలో ప్రొఫెసర్ వర్జీనియా బెర్నింగర్ చేసిన ఇతర పరిశోధనలు కూడా ఇదే అంశాన్ని వెల్లడించాయి. అమెరికా పిల్లలు వెనుకబడి ఉండబోతున్నారా? పెన్మాన్షిప్ అండ్ రీడింగ్ అచీవ్మెంట్ ఒక కచ్చితమైన కారణం కానప్పటికీ కొంతమంది విద్యావేత్తలు కర్సివ్‌ను వదిలివేయడం వల్ల విద్యా ఫలితాలలో అమెరికా వెనుకబడిందని భయపడుతున్నారు. ఇటాలియన్ పరిశోధకుల ఒక చిన్న అధ్యయనం ప్రకారం, ప్రాథమిక పాఠశాల మొదటి సంవత్సరంలో విద్యార్థులకు కర్సివ్ బోధన వారి పఠనా నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. పశ్చిమ ఐరోపాలో కర్సివ్ రైటింగ్ ఇప్పటికీ విస్తృతంగా నేర్పిస్తున్నారు. యూకే ప్రభుత్వ ఆఫ్‌స్టెడ్ పరిశోధన సమీక్ష ప్రకారం పిల్లలు కర్సివ్ రైటింగ్ కంటే ముందు విడిఅక్షరాలను నేర్చుకోవాలి. ఆ తరువాత డయోగ్నల్, హారజెంటల్ స్ట్రోక్‌లను నేర్చుకోవాలి అనేది జాతయ జాతీయ పాఠ్యప్రణాళికలో ఉండాలి. స్పెయిన్, ఇటలీ, పోర్చుగల్ ఫ్రాన్స్ ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. కెనడా కూడా కర్సివ్‌ను తొలగించడానికి ప్రయత్నించింది. గత ఏడాది అంటారియో విద్యా మంత్రిత్వ శాఖ కర్సివ్ చేతివ్రాత సూచన అవసరాన్ని పునరుద్ధరించడం గమనార్హం. అయితే ఎలాంటి పాఠాలను గురించి ఆసక్తిగా ఉంటారు? ఆ సూచనలను ఎలా అందించాలి? ఎంతకాలం పాఠాలు ఉండాలి? ఎంత తరచుగా అభ్యాసం చేయాలి? అనే దానిపై ఇక్కడి టీచర్లు ఇంకా కుతూహలంగానే ఉన్నారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (OECD) ప్రోగ్రాం ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ (PISA) 2022 గ్లోబల్ ర్యాంకింగ్స్‌తో పోల్చి చూస్తే, అమెరికా 9వ స్థానంలో ఉంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్ (STEM) లో సింగపూర్‌తో పోలిస్తే అమెరికన్ విద్యార్థులు ఇంకా వెనుకబడి ఉన్నారు. -
సాంకేతికత.. డిజిటల్ బాట
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగానికి పెద్దపీట వేస్తూ పేద విద్యార్థుల ఉన్నత చదువులే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక చర్యలు చేపట్టారు. ఇప్పటికే మనబడి–నాడు నేడు కార్యక్రమంలో కార్పొరేట్‌కు దీటుగా సర్కారీ బడులను తీర్చిదిద్దుతున్నారు. అలాగే అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద వంటి పథకాలతో ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్నారు. దీంతోపాటు పేద పిల్లలకు సాంకేతిక విద్యను చేరువ చేసేలా గతేడాది నుంచి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేసి బైజూస్ కంటెంట్‌తో పాఠాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే డిజిటల్ తరగతులను నిర్వహిస్తోంది. స్మార్ట్ టీవీ, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ద్వారా బోధన, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, వర్చువల్ క్లాస్ రూమ్‌లు, పెర్‌ఫెక్టివ్ అడాప్టివ్ లెర్నింగ్ ట్యాబ్‌లు ఇలా ఒక్కొక్కటిగా సాంకేతికతను చొప్పిస్తూ ప్రభుత్వ విద్యను శిఖరాలకు తీసుకువెళుతోంది. దీంతో విద్యార్థుల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభ్యసనా సామర్థ్యాలు మెరుగుపడుతున్నాయి. గతేడాది నుంచి.. విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీకి గతేడాది శ్రీకారం చుట్టిన ప్రభుత్వం రెండో ఏడాది కూడా అందించాలని నిర్ణయించింది. ఏలూరు జిల్లాలో 398 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 17,410 మందిని ఈ ఏడాది అర్హులుగా గుర్తించారు. గతేడాది 18,370 మంది విద్యార్థులకు, 2,613 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌లను పంపిణీ చేశారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో 276 పాఠశాలల్లో 13,790 మంది విద్యార్థులకు ఈ ఏడాది ట్యాబ్‌లు అందించనున్నారు. గతేడాది 14,353 మంది విద్యార్థులకు, 2373 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు అందజేశారు. గతేడాది ట్యాబ్‌లు అందుకున్న విద్యార్థులు ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది (10వ తరగతి పూర్తి చేసే) వరకూ ట్యాబ్‌లు వారి వద్దనే ఉంచుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. సామర్థ్యం పెంచి.. విద్యార్థుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ట్యాబ్‌ల సామర్థ్యాన్ని పెంచారు. 8.7 అంగుళాల స్క్రీన్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ రోమ్, 256 జీబీ ఎస్టీ కార్డు సామర్థ్యం గల ట్యాబ్‌లు అందించనున్నారు. ట్యాబ్‌ల కోసం గతేడాది ప్రభుత్వం రూ.101.64 కోట్లు వెచ్చించగా ఈ ఏడాది రూ.99.84 కోట్లు ఖర్చు చేసింది. అలాగే ట్యాబ్‌ల పర్యవేక్షణకు ప్రభుత్వం పర్యవేక్షక బృందాన్ని నియమించింది. మండలానికి ఇద్దరు ఉపాధ్యాయులకు ట్యాబ్ సాఫ్ట్వేర్ సమస్యలపై జిల్లా నోడల్ పర్సన్‌తో శిక్షణ ఇప్పించింది. విద్యార్థి అభ్యసనకు సంబంధించి వైఫై మేనేజర్, బైజూస్ కంటెంట్, డిక్షనరీ మాత్రమే ట్యాబ్‌లో అందుబాటులో ఉండేలా సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేస్తారు. ఇతర ఎటువంటి యాప్‌లను డౌన్లోడ్ చేసినా, ఇన్స్టాల్ చేసినా సంబంధిత ఉపాధ్యాయుడికి ఓటీపీ వచ్చేలా ట్యాబ్‌ల రూపకల్పన జరిగింది. -
చదువుకుందాం.. ఆడుకుందాం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ సదుపాయాలు కల్పించి విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం విద్యార్థులను క్రీడల్లోనూ రాణించేలా ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే పాఠశాలలకు పీఈటీలను నియమించగా.. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సమగ్ర శిక్ష ద్వారా రూ.27 కోట్లతో క్రీడా సామగ్రిని సైతం అందించింది. జాతీయ విద్యావిధానంలో భాగంగా క్రీడలనూ అకడమిక్ కేలండర్లో అంతర్భాగం చేసింది. పాఠశాలల్లో క్రీడల్లో ప్రతిభ గల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు త్వరలో ప్రతి జిల్లాలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. వీటిని ఈ విద్యా సంవత్సరంలోనే అందుబాటులోకి తీసుకొచ్చి, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కేంద్రాలలో ఎంపిక చేసిన క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నారు. క్రీడా పరికరాల కొనుగోలు రాష్ట్రంలో 33,704 ప్రాథమిక, 4,138 ప్రాధమికోన్నత, 6,112 ఉన్నత, 1,044 హయ్యర్ సెకండరీ పాఠశాలలు ఉన్నాయి. ఆయా స్కూళ్లలో విద్యార్థుల వయసుకు తగినట్టుగా క్రీడా పరికరాలను కొనుగోలు చేశారు. సీనియర్ సెకండరీ, ఉన్నత పాఠశాలలకు 17 రకాల వస్తువులు, ప్రాథమికోన్నత పాఠశాలలకు 14 రకాలు, ప్రాథమిక పాఠశాలలకు 9 రకాల వస్తువుల చొప్పున అందించారు. వీటిలో వాలీబాల్, నెట్, త్రోబాల్, నెట్, హ్యాండ్ బాల్, టెన్నికాయిట్, యోగా మ్యాట్లు, ఫుట్‌బాల్, షాట్‌పుట్ వంటి వస్తువులు ఉన్నాయి. ఈ సామగ్రి కోసం ఒక్కో పాఠశాలకు రూ.7,080 నుంచి రూ.17,700 చొప్పున నిధులు వెచ్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రగతి, బోధన ప్రమాణాల మెరుగుదల కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రతినెలా సబ్జెక్టుల ఉపాధ్యాయులతో స్కూల్ కాంప్లెక్స్ నిర్వహిస్తున్నారు. ఇకపై ఈ స్కూల్ కాంప్లెక్స్‌లో క్రీడా సామగ్రి వినియోగంపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకున్నారు. స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో పీఈటీలు లేని పాఠశాలల్లో స్థానిక ఉపాధ్యాయులను గుర్తించి విద్యార్థుల్లో క్రీడలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎస్.సురేష్ కుమార్ ఆదేశాలు సైతం జారీ చేశారు. గతానికి భిన్నంగా క్రీడలకు ప్రోత్సాహం ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడల్లో ప్రతిభ గల విద్యార్థులు ఉన్నప్పటికీ గతంలో వారికి ప్రోత్సాహం దాదాపు శూన్యమనే చెప్పాలి. అయితే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక క్రీడలను విద్యలో అంతర్భాగం చేసింది. క్రీడల్లో పాల్గొనే ఆసక్తి గల విద్యార్థుల వివరాలు నమోదు చేసుకునేందుకు స్కూల్ అకడమిక్ మానటరింగ్ యాప్‌లో ‘స్కూల్ గేమ్స్’ విభాగాన్ని కూడా అధికారులు జోడించారు. జిల్లాస్థాయి పోటీలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వం యూనిఫామ్ సైతం అందిస్తోంది. అంతేకాకుండా జిల్లా ఆపై స్థాయి పోటీలకు హాజరయ్యే విద్యార్థులకు రవాణా చార్జీలు సైతం ప్రభుత్వమే అందించడం గమనార్హం. ఇప్పటికే క్రీడల్లో ప్రతిభ చాటిన విద్యార్థులను గుర్తించి జిల్లాకు ఐదు చొప్పున 130 క్రీడా ప్రతిభా అవార్డులను ప్రదానం చేశారు. అంతేకాకుండా జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి అండర్ 14, 17, 19 విభాగాల్లో జిల్లాస్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 120 క్రీడాంశాల్లో ఇప్పటి దాకా 60 క్రీడాంశాల్లో పోటీలు ముగిశాయి. డిసెంబర్లో ఆడుదాం ఆంధ్రా పోటీలు ఉన్నందున ఈ నెలాఖరు నాటికి మిగిలిన అంశాల్లో పోటీలు పూర్తి చేసేందుకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కృషి చేస్తోంది. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ చాటిన వారికి రాష్ట్రస్థాయి పోటీలకు శిక్షణ ఇవ్వనున్నారు. జాతీయ స్థాయిలో పాల్గొనే క్రీడాకారులకు ఫిబ్రవరిలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఉత్తమ క్రీడాకారులను తయారు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రతి జిల్లాలోను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను ఏర్పాటు చేసి, ఆ జిల్లాలో క్రీడల్లో ప్రతిభ గల విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. -
ఏపీలో విద్యారంగం అద్భుతం
► ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా స్ఫూర్తిదాయకమైన విద్యా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నాయి. విద్యారంగంలో నమ్మశక్యం కాని పురోగతిని తీసుకొచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు.. ► ప్రపంచం మొత్తానికి నేను ప్రేరణగా నిలిచి ఉండవచ్చు.. కానీ, ఈ ప్రాంతం నాకు ఎంతో ప్రేరణనిచ్చింది. (గుంటూరులో ప్రపంచ ప్రఖ్యాత ప్రేరణాత్మక వక్త నిక్ వుజిసిక్ ప్రశంసల వర్షం) సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులు ఆంగ్లంలో మాట్లాడుతున్న తీరు.. అందులో స్పష్టత, వారు అడుగుతున్న ప్రశ్నలకు అంతర్జాతీయ మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ మంత్రముగ్థులయ్యారు. ‘ప్రపంచం మొత్తానికి నేను ప్రేరణగా నిలిచి ఉండవచ్చు.. కానీ, ఈ ప్రాంతం నాకు ఎంతో ప్రేరణనిచ్చింది’ అంటూ ఆయన ఫిదా అయ్యారు. గుంటూరు నగరంలోని చౌత్రా సెంటర్లో ఉన్న ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను నిక్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థినులకు లక్ష్యసాధన, దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులతో ముఖాముఖీగా మాట్లాడారు. ఆ తర్వాత సాయంత్రం బీఆర్ స్టేడియంలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలతో పాటు నగరంలోని వివిధ మున్సిపల్ ఉన్నత పాఠశాలల నుంచి వచ్చిన వేలాది మంది టెన్త్ విద్యార్థులనుద్దేశించి చేసిన ప్రసంగంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులు, చేపడుతున్న కార్యక్రమాలపై మరోమారు ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఎంతో అంకితభావం ఉన్న ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉండటం అభినందనీయమంటూ సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. అలాగే, ‘నేను ప్రపంచవ్యాప్తంగా 78 దేశాలలో పర్యటించా. కానీ ఏ దేశంలో లేని అనుభూతి, ప్రత్యేకతను నేను గుంటూరులో పొందాను. అది నా అదృష్టంగా భావిస్తున్నా. ప్రపంచంలో ఎంతోమంది నన్ను హీరో అని పిలిచి ఉండవచ్చు.. కానీ, అంతకంటే ఎక్కువ ఆనందాన్ని ఇక్కడ పొందాను. వెలకట్టలేని విద్యకు, విజ్ఞానానికి అధిక ప్రాధాన్యమిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎంతో మంచి పాలకుడు మీకు ఉన్నారు. అంకితభావం ఉన్న ప్రభుత్వం ఇక్కడ ఉంది. గుంటూరు ప్రాంతం విజ్ఞానం, విద్య పరంగా ఎంతో సామర్థ్యం ఉన్న ప్రాంతం. ప్రపంచవ్యాప్తంగా ఎందరినో కలిశాను. కానీ ఆంధ్రప్రదేశ్ సీఎంతో కలవబోవడం ఎంతో ప్రత్యేకానుభూతిగా ఉంది’.. అంటూ నిక్ తన అనుభూతిని పంచుకున్నారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. విద్యార్థిని ట్యాబ్‌ను పరిశీలిస్తూ.. పాఠ్యపుస్తకంలో నిక్‌పై పాఠం ఇది సామాన్యమైన విషయం కాదు.. ఏపీలోని ప్రభుత్వ, మున్సిపల్ ఉన్నత పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థినులు నేను మాట్లాడిన ఫారిన్ ఇంగ్లిష్ భాషాశైలిని అర్థంచేసుకుని, అంతేస్థాయిలో ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడిన తీరు ఎంతో అద్భుతం. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు ఇంత గొప్పగా ఉంటాయని నేను ఊహించలేదు. కార్పొరేట్‌ను తలదన్నే రీతిలో ఒక ప్రభుత్వ పాఠశాల సకల హంగులతో ఉండటం ఎంతో ఆశ్చర్యంగా ఉంది. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థినులను ఇంత గొప్ప ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దడం సామాన్య విషయం కాదు. నా జీవితగాధపై పాఠ్యాంశమా!? రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన 10వ తరగతి ఇంగ్లిషు టెక్ట్స్‌బుక్‌లోని మొదటి పాఠ్యాంశంగా ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్లో ‘ఆటిట్యూడ్ ఆల్టిట్యూడ్’ పేరుతో తన జీవితగాధను ముద్రించడం ఆశ్చర్యకరం. పాఠ్యాంశంగా నాకు చోటు కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మీ పాఠ్య పుస్తకంలో రాసిన నా జీవితం గురించి చదివారా? (మీ గురించి చదివామని విద్యార్థులు చెప్పగా, ఆయన ఆంతులేని ఆనందానికి లోనయ్యారు.) నాడు–నేడుతో పాఠశాల రూపం మార్చేశారు.. నిక్ వుజిసిక్తో టెన్త్ విద్యార్థిని సాజిదా మాట్లాడుతూ.. ‘నేను చిన్నతనం నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నాను. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం వైఎస్ జగన్ నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆయన చలువతో మా పాఠశాలలో అన్ని రకాల వసతులతో చదువుకుంటున్నాం. జగనన్న విద్యాకానుక కిట్లు, గోరుముద్ద, ఇంగ్లిషు మీడియంతో నేను ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చిన మీతో ఆంగ్లంలో ఇలా మాట్లాడగలుగుతున్నాను.. వైఎస్ జగన్ కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాను’. (ఆత్మవిశ్వాసంతో సాజిదా చెప్పిన మాటలకు నిక్ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.) నాడు–నేడుతో ‘కార్పొరేట్’ను తలదన్నేలా.. మరో విద్యార్థిని డి. శిరీష మాట్లాడుతూ.. ‘ఇంగ్లిష్ టెక్ట్స్బుక్లో మీ బయోగ్రఫీ చదివి స్ఫూర్తి పొందా. ప్రపంచం మెచ్చే మోటివేషనల్ స్పీకర్‌గా ఎదిగిన తీరుతో అందరికీ ఆదర్శంగా నిలిచారు. నాడు–నేడుకు ముందు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎంతో దుర్భరంగా ఉండేది. సరిపడా తరగతి గదుల్లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అయితే, జగన్ మావయ్య సీఎం అయిన తరువాత నాడు–నేడు ద్వారా కల్పించిన వసతులతో మేం కార్పొరేట్ పాఠశాలలను మించిన స్థాయిలో ఆధునిక తరగతి గదులు, నూతన ఫర్నిచర్‌పై కూర్చుని తరగతి గదుల్లో ఫ్యాన్లు, విద్యుత్ లైట్ల మధ్య ఏకాగ్రతతో చదువుకునేందుకు అవకాశం కలిగింది. జగనన్న విద్యాకానుక కిట్‌తో ఉచిత పాఠ్య పుస్తకాలు, బ్యాగులను పొందడంతో పాటు 8వ తరగతిలో విద్యార్థులకు ఇచ్చిన ట్యాబుల్లో నాణ్యమైన బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన తీరు అద్భుతం’.. అంటూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను శిరీష నిక్ దృష్టికి తెచ్చింది. దేశంలోనే బెస్ట్ సీఎం వైఎస్ జగన్ ఇక సీఎం వైఎస్ జగన్ ఎంతో విజన్ కలిగిన నాయకునిగా దేశంలోనే బెస్ట్ సీఎంగా నిలిచారని నిక్ వుజిసిక్ అభివర్ణించారు. ఆ తర్వాత వేణుగోపాల్‌నగర్‌లోని కోన బాల ప్రభాకరరావు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న డ్రాయింగ్ టీచర్ పుష్ప స్వయంగా గీసిన నిక్ చిత్రాన్ని ఆయనకు బçహూకరించగా ఆయన ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎంసలహాదారు ఆర్. ధనుంజయరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్‌రెడ్డి, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు. కాలాన్ని ఎదిరించిన కాలు! ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తిత్వ నిపుణుడు, ప్రేరణాత్మక వక్త నిక్ వుజిసిక్ రాసిన వ్యాసాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఆయన స్ఫూర్తిదాయక ప్రసంగాలు లక్షల మందిలో వెలుగులు నింపి కొత్త జీవితాన్ని ప్రసాదించాయి. టెట్రా అమీలియా సిండ్రోమ్ కారణంగా నిక్ కాళ్లు, చేతులు లేకుండా జన్మించినా నిక్ నైరాశ్యం చెందలేదు. అతి స్వల్పంగా ఉన్న ఎడమ తుంటి భాగం సాయంతో శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు. ఆయన మెల్బోర్న్లో పుట్టారు. 2002లో ఆస్ట్రేలియా నుంచి అమెరికా చేరుకుని అక్కడే స్థిరపడ్డారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా మారాలని నిర్ణయించుకుని 2005లో లైఫ్ వితౌట్ లిమిట్స్ అనే స్వచ్చంద సంస్థను స్థాపించారు. 2007లో ఆటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అనే మరో సంస్థను ప్రారంభించారు. కొద్దిపాటి కాలుతోనే అన్నీ.. నిక్ కష్టాల గురించి తెలుసుకోవాలంటే పొద్దున్నే లేవగానే ఒళ్లు విరుచుకునేందుకు కాళ్లు చేతులు లేకపోవడం.. కాస్తంత దురదగా అనిపించినప్పుడు, ప్రేమగా కౌగిలించుకునేందుకు చేతులు లేకపోవడం ఎలా ఉంటుందో ఊహించుకోవాలి. 26 ఏళ్లుగా ఆయన్ను ఇవేమీ ఆపలేకపోయాయి. ఫుట్‌బాల్, గోల్ఫ్‌తోపాటు ఈత, సర్ఫింగ్ లాంటివి ఆయన వ్యాపకాలు. అవయవ శేషంగా మిగిలిన కొద్దిపాటి కాలుతోనే ఆయన టైప్ చేస్తుంటారు. పెన్నుతో రాస్తుంటారు. ఏదైనా వస్తువులను తీసుకునేందుకు ఆసరాగా వినియోగిస్తుంటారు. తన కాలును ఆయన సరదాగా చికెన్ డ్రమ్‌స్టిక్ అని వ్యాఖ్యానిస్తుంటారు. సాధారణ బడికే.. ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం నిర్వహించే స్పెషల్ స్కూళ్లకు కాకుండా సాధారణ పాఠశాలలకే పంపాలని తన తల్లిదండ్రులు తీసుకున్న కఠిన నిర్ణయం తనను రాటుదేల్చిందని నిక్ చెబుతుంటారు. నిక్ పుట్టగానే ఆస్పత్రిలో ఆయన్ను చూసిన తండ్రి షాక్ తిని వాంతి చేసుకున్నాడు. నాలుగు నెలల వయసు వచ్చేవరకు నిక్ తల్లి సైతం ఆయన్ను దరిచేర్చుకోలేకపోయారు. ► న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ ఆథర్ ► ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన వ్యక్తిత్వ వికాస నిపుణుడు ► 2005లో యంగ్ ఆస్ట్రేలియన్ అవార్డు ► ద బటర్ ఫ్లై సర్కస్ షార్ట్ ఫిల్మ్‌లో నటనకు 2010లో ఉత్తమ నటుడిగా ఎంపిక. ► ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా 2011లో స్విట్జర్లాండ్‌లో నిక్ ప్రసంగం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ► 2012లో జీవిత భాగస్వామి కనే మియహరను కలుసుకున్నారు. వీరికి నలుగురు సంతానం. -
AP: వినూత్న విధానాలు.. విప్లవాత్మక ఫలితాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ద్వారా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలనిస్తున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో లెవల్–2 స్థాయికి చేరుకుని ఏపీ అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. అంతకుముందు ప్రధాని ఆర్థిక సలహా మండలి రూపొందించిన నివేదికలోనూ ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీలో ఏపీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచినట్లు పేర్కొంది. పాఠశాల విద్యకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన కార్యక్రమాలే దీనికి ప్రధాన కారణం. గత సర్కారు హయాంలో నిస్తేజంగా మిగిలిన ఎస్సీఈఆర్టీ ముఖ్యమంత్రి చొరవతో పలు వినూత్న కార్యక్రమాలను రూపొందించి అమల్లోకి తెచ్చింది. విద్యార్థులకు మేలు చేసేలా.. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక శాతం పిల్లలు పేద వర్గాలకు చెందిన వారైనందున నాణ్యమైన విద్యతో అభ్యసన సామర్థ్యాలు పెరిగేలా ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టింది. ఎస్సీఈఆర్టీ ఇందుకోసం విద్యా రంగంలో అగ్రశ్రేణి, ప్రసిద్ధ సంస్థలతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టీచర్లకు కంటెంట్, స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వడం బోధనా సామర్థ్యాలను మెరుగుపరిచింది. ద్విభాషా పాఠ్య పుస్తకాల నుంచి.. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని దృష్టిలో ఉంచుకుని అటు విద్యార్ధులు, ఇటు టీచర్లకు ఉపయుక్తంగా ఉండేలా 1 నుంచి 8వ తరగతి వరకు ద్విభాషా పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. మైనర్ మీడియంలో కూడా వీటిని రూపొందించడం విశేషం. ► విద్యార్థులు తరగతిలో నేర్చుకున్న అంశాలను ఇళ్ల వద్ద అభ్యసించేందుకు తొలిసారిగా వర్కు బుక్స్ రూపొందించి ఉచితంగా అందించింది. ► 1– 5 తరగతుల విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కింద పిక్టోరియల్ (చిత్రాలతో కూడిన) నిఘంటువును పంపిణీ చేసింది. ► 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్ధులు ఇంటి వద్ద పాఠ్యాంశాలు నేర్చుకోవడానికి టీవీ, రేడియో పాఠాలను విద్యా వారధి, విద్యామృతం, విద్యా కలశం పేర్లతో రూపొందించి ప్రసారం చేసింది. గిరిజన పిల్లలకు మాతృభాషలో గిరిజన ప్రాంతాల పిల్లలు సులభంగా నేర్చుకునేలా వారి మాతృభాషల్లోనే ఆయా పుస్తకాలను రూపొందించారు. అంగన్వాడీల కోసం ప్రీ–ప్రైమరీ పాఠ్యపుస్తకాలను 6 గిరిజన భాషల్లోకి అనువదించారు. ‘రూట్స్’ పేరుతో సవర, సుగాలి, ఆదివాసీ ఒరియా, కొండ, కువి, కోయ భాషల్లో వీటిని సిద్ధం చేశారు. కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ ప్రాథమిక స్థాయిలో పాఠ్యాంశాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ తదితర దేశాలకు చెందిన విద్యావేత్తలతో చర్చించి పాఠ్యాంశాల్లో మార్పు చేర్పులు చేశారు. సెకండరీ విద్యార్ధులకు కెరీర్ గైడెన్స్ రిసోర్స్ పుస్తకాలను తెచ్చారు. పదో తరగతి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధమయ్యేలా సబ్జెక్ట్ నిపుణులతో వీడియో ప్రోగ్రామ్‌లను రూపొందించారు. యునిసెఫ్ సహకారంతో సెకండరీ పాఠశాలల్లో ‘అటల్ టింకరింగ్ ల్యాబ్’లను బలోపేతం చేశారు. కరిక్యులమ్‌లో సంస్కరణలను క్యూఆర్ కోడ్ ద్వారా దీక్షా పోర్టల్‌లో పొందుపరిచారు. ఇతర రాష్ట్రాలు, కేంద్రం నుంచి వీటికి ప్రశంసలు లభించాయి. హెడ్మాస్టర్లలో కెపాసిటీ బిల్డింగ్ లెసన్ ప్లాన్ల రూపకల్పన పక్కాగా ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. సీబీఎస్ఈ విధానాలను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో టీచర్లందరికీ వాటిపై శిక్షణ కార్యక్రమాలను చేపట్టింది. 1.32 లక్షల మంది ఉపాధ్యాయులు దీనివల్ల ప్రయోజనం పొందారు. ప్రపంచంలోనే మొదటిసారిగా టీచ్ టూల్ అబ్జర్వర్స్ ట్రైనింగ్ నిర్వహించింది. ఉపాధ్యాయుల బోధనా విధానాన్ని విశ్లేషించి సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఇది ఉపకరిస్తుంది. ’లీడర్షిప్ ఫర్ ఈక్విటీ’ సంస్థ సహకారంతో పాఠశాల విద్యా శాఖ దీన్ని అమలు చేస్తోంది. బేస్‌లైన్ టెస్ట్‌తో లోపాల సవరణ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తించేలా పునాది ప్రమాణాలను అంచనా వేసేందుకు బేస్‌లైన్ పరీక్షను ఎస్సీఈఆర్టీ నిర్వహించింది. గతంలో ఇలా ఎన్నడూ నిర్వహించలేదు. విద్యార్థుల వాస్తవ సామర్థ్యాలను గుర్తించి లోపాలను సవరించేందుకు ఇది ఉపకరించింది. ఇందుకు అనుగుణంగా 90 రోజులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులకు అవసరమైన మెటీరియల్ అందించారు. స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్‌లు విద్యార్థులు ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడేలా స్పోకెన్ ఇంగ్లీషుపై శిక్షణకు శ్రీకారం చుట్టారు. అనర్గళంగా అమెరికన్ యాసలో మాట్లాడేలా అవగాహన కల్పిస్తున్నారు. ఒక్కో జిల్లా నుంచి ఐదుగురు చొప్పున ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టారు. దేశ, విదేశీ నిపుణులను ఇందులో భాగస్వాములను చేస్తున్నారు. విద్యార్ధులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీని అందించిన ప్రభుత్వం రోజుకో ఆంగ్ల పదాన్ని నేర్పిస్తోంది. స్టాండర్డైజ్డ్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీషు ప్రోగ్రామ్ కింద దీన్ని ముందుకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల ఆసక్తి విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ చేపట్టిన కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. అసోం విద్యాశాఖ ఉన్నతాధికారుల బృందం ఇక్కడి డైట్లను, స్కూళ్లను సందర్శించింది. ఉత్తరప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారుల బృందం కూడా రాష్ట్రంలోని కొన్ని స్కూళ్లను సందర్శించి ఇక్కడి విధానాలను అనుసరించేందుకు సిద్ధమైంది. -
చదువుల్లో ఏపీ పరుగులు
ప్రభుత్వ విద్యా రంగం అభివృద్ధికి రాష్ట్రంలో తీసుకుంటున్నన్ని చర్యలు, అమలు చేస్తున్న పథకాలు.. కార్యక్రమాలు మరే రాష్ట్రంలోనూ కనిపించవు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే కేంద్ర పెర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో రాష్ట్రం మంచి స్థానాన్ని దక్కించుకుంటే.. ఆ తర్వాతి సంవత్సరాల్లో మదింపు పూర్తయితే తప్పక అగ్రభాగాన నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ చేపట్టిన కార్యక్రమాలు తొలి ఏడాది నుంచే సత్ఫలితాలు ఇస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభా పాటవాలు గతంలో కన్నా ఎంతో వృద్ధి చెందాయి. ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థుల అభ్యసన ఫలితాలు (లెర్నింగ్ అవుట్‌కమ్) మెరుగు పడినట్లు కేంద్రం ‘పెర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్’ నివేదికలో వెల్లడించింది. 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించిన నివేదికను కేంద్ర విద్యా శాఖ తాజాగా విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పాఠాలు నేర్చుకుంటున్న తీరు, వినూత్న బోధన, హాజరు తదితర అంశాలను పరిశీలించి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూళ్ల ‘పెర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్’ను తయారు చేస్తోంది. 2017–18 నుంచి ఏటా ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల పనితీరు 2019–20 విద్యా సంవత్సరంలో బాగా మెరుగు పడిందని తాజా నివేదికలో స్పష్టం చేసింది. 1000 పాయింట్ల సమగ్ర సూచీలో 10 స్థాయిలతో ఆయా రాష్ట్రాల స్థానాలను నివేదికలో కేంద్రం నిర్దేశించింది. జాతీయ స్థాయిలో 10 లెవల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు 4వ స్థానం దక్కింది. అంతకు ముందు విద్యా సంవత్సరం (2018–19)లో రాష్ట్రం 6వ స్థానంలో నిలిచింది. ముఖ్యమంత్రి జగన్ అధికారం చేపట్టిన తొలి విద్యా సంవత్సరంలోనే రాష్ట్రం లెవల్–6 నుంచి లెవల్–4కు ఎదిగి రెండు స్థానాలను మెరుగు పరుచుకోవడం విశేషం. అమ్మ ఒడి, మనబడి నాడు–నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ అమలు, విద్యార్థులకు బైజూస్ కంటెంట్, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు, బడుల్లో డిజిటల్ లెర్నింగ్‌కు కావాల్సిన మౌలిక వసతుల కల్పన.. తదితర కార్యక్రమాలు అమలు చేస్తున్న నేపథ్యంలో ఇక నుంచి మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని విద్యా వేత్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పాఠశాలల పని తీరు మెరుగు విద్యార్థుల ప్రతిభా పాటవాలు ఏటా పెరుగుతున్నాయా? లేదా? అభ్యసన ఫలితాలు మరింత మెరుగ్గా రావడానికి ఏ అంశాల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది? తదితర విషయాలను తెలుసుకోవడానికి కేంద్ర విద్యా శాఖ నివేదికలు రూపొందిస్తోంది. చదువులలో నాణ్యత గుర్తించడానికి విభిన్న ఇండికేటర్స్‌ను నిర్ధారించింది. 2018–19 విద్యా సంవత్సరంతో పోలిస్తే 2019–20లో ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో నాణ్యత మెరుగు పడిందని నివేదిక పేర్కొంది. 1000 మార్కుల సూచీలో ఆంధ్రప్రదేశ్ 811 పాయింట్లు సాధించి లెవల్–4 (గ్రేడ్–1)లో నిలిచింది. 2018–19 విద్యా సంవత్సరంలో 725 పాయింట్లతో లెవల్–6 (గ్రేడ్–3)లో ఉండింది. అంతకు ముందు 2017–18లో కూడా 728 పాయింట్లతో లెవల్–6 (గ్రేడ్–3)లోనే ఉండింది. కేంద్ర పాలిత ప్రాంతాలను పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రాల స్కోరు ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్‌కు దేశంలో 12వ స్థానం దక్కింది. మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ 772 మార్కులతో 18వ స్థానంలో నిలిచింది. తొలి మూడు స్థానాలను పంజాబ్, తమిళనాడు, కేరళ దక్కించుకున్నాయి. ఐదు ప్రామాణికాలతో ఎంపిక కేంద్ర విద్యాశాఖ స్థూలంగా 5 అంశాలను పరిగణనలోకి తీసుకొని 1000 పాయింట్ల స్కోర్‌తో ఆయా రాష్ట్రాలకు స్థానాలను నిర్ధారిస్తోంది. 1. అభ్యాస ఫలితాలు, నాణ్యత : ప్రభుత్వ పాఠశాలల్లో 3, 5, 8వ తరగతి విద్యార్థుల భాష (తెలుగు/ఇంగ్లిష్/హిందీ), గణితంలో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ అంశాన్ని నిర్ధారించారు. 1000 మార్కుల సూచీలో ఈ అంశానికి 180 మార్కులు కేటాయించారు. 2. పాఠశాల అందుబాటులో ఉన్న తీరు : ప్రైమరీ, సెకండరీ స్థాయిలో విద్యార్థుల కనిష్ట చేరికల నిష్పత్తి, ప్రాథమిక–సెకండరీ స్థాయిలో విద్యార్థులు కొనసాగుతున్న తీరు, ప్రైమరీ నుంచి అప్పర్ ప్రైమరీకి, అక్కడ నుంచి సెకండరీలోకి చేరుతున్న విద్యార్థుల శాతం, చదువుకు దూరంగా ఉంటున్న బడి ఈడు పిల్లల సంఖ్య.. అంశాల ఆధారంగా 1000 మార్కుల సూచీలో ఈ అంశానికి 80 మార్కులు కేటాయించారు. 3. మౌలిక సదుపాయాలు : పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు అందుబాటులో ఉన్న మౌలిక వసతుల ఆధారంగా ఈ అంశానికి 1000 మార్కుల సూచీలో 150 మార్కులు కేటాయించారు. 4. సమానత (ఈక్విటీ) : ఓసీ, ఎస్సీ, ఎస్టీ, గ్రామీణ, పట్టణ, బాలికలు, బాలుర మధ్య అభ్యసన ఫలితాలను పరిశీలించి ఈ అంశానికి 1000 మార్కుల సూచీలో 230 మార్కులు కేటాయించారు. 5. పాఠశాల నిర్వహణ : విద్యా సంస్థల నిర్వహణ, బోధనాంశాల ప్రణాళిక రూపకల్పన తీరును పరిశీలించి ఈ అంశానికి 1000 మార్కుల సూచీలో 360 మార్కులు కేటాయించారు. రానున్న రోజుల్లో మరింత మంచి ఫలితాలు 2019లో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. అమ్మ ఒడి కింద అర్హులైన ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను మనబడి నాడు–నేడు పథకం కింద రూ.వేల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. జగనన్న విద్యా కానుక కింద చదువులకు అవసరమైన వస్తువులు అందిస్తూ కార్పొరేట్ స్కూళ్ల పిల్లలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. జగనన్న గోరుముద్ద పేరుతో విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారం అందిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టారు. పునాది విద్యను బలోపేతం చేసేందుకు ఫౌండేషన్ స్కూళ్లనూ ఏర్పాటు చేశారు. సీబీఎస్ఈ సిలబస్‌ను అమలు చేస్తున్నారు. తాజాగా ప్రపంచంలోనే ప్రముఖ ఆన్లైన్ ఎడ్ టెక్ సంస్థ బైజూస్ భాగస్వామ్యంతో విద్యార్థులకు అత్యుత్తమ కంటెంట్‌ను సమకూరుస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు 8వ తరగతి నుంచి ట్యాబ్‌లు అందిస్తూ డిజిటల్ విద్య ద్వారా ప్రమాణాలు పెంచేలా కార్యాచరణ చేపడుతున్నారు. ఈ కార్యక్రమాల ఫలితాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే కనుక రాష్ట్రం ‘పెర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్’లో దేశంలో అగ్రస్థానంలో ఉంటుందన్నది అక్షర సత్యం. -
డిజిటల్ విద్యతో దీటుగా..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు డిజిటల్ టెక్నాలజీ విద్యతో మరింత రాణించేలా కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆధునిక పద్ధతులను అనుసరించి బోధన చేపట్టడం ద్వారా మన విద్యార్థులు ఉన్నత ప్రమాణాలు సాధించేలా కృషి చేయాలన్నారు. పిల్లలకు పాఠశాల స్థాయి నుంచే డిజిటల్ విద్యా బోధన అందించాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు అందించాలని ఇప్పటికే నిర్ణయించామని గుర్తుచేస్తూ వీటిని ఈ ఏడాది సెప్టెంబర్‌లో పంపిణీ చేయాలని ఆదేశించారు. విద్యాశాఖలో ’మనబడి నాడు – నేడు’ డిజిటల్ లెర్నింగ్‌పై సీఎం జగన్ మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. తరగతి గదుల్లో టీవీలు, డిజిటల్ బోర్డులు తరగతి గదుల్లో డిజిటల్ బోర్డులు, టీవీల ఏర్పాటుపై జూలై 15 కల్లా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి తరగతి గదిలోనూ ఇవి ఉండేలా చూడాలన్నారు. వీటి వల్ల సైన్స్, మేథ్స్ లాంటి సబ్జెక్టులు పిల్లలకు సులభంగా, చక్కగా అర్థం అవుతాయన్నారు. వీటి వినియోగం ద్వారా టీచర్ల బోధనా సామర్ధ్యం కూడా పెరుగుతుందని తెలిపారు. డిజిటల్ స్క్రీన్‌పై కంటెంట్‌ను హైలెట్, ఎన్లార్జ్ చేస్తే బాగుంటుందని సూచించారు. డిజిటల్ స్క్రీన్లు, ప్యానెళ్ల సంరక్షణపై కూడా దృష్టి పెట్టాలన్నారు. బోధనకు అనువుగా డిజిటల్ స్క్రీన్లు తరగతి గదిలో బోధనా కార్యక్రమాలకు అనువుగా డిజిటల్ బోర్డులు, స్క్రీన్లను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఇప్పటికే వీటిని వినియోగిస్తున్న తీరును పరిశీలించి మెరుగైన పద్ధతిలో అమర్చాలన్నారు. నిపుణుల సలహా మేరకు కొన్ని తరగతుల్లో ఇంటరాక్టివ్, మరికొన్ని తరగతుల్లో టీవీ స్క్రీన్లు అమర్చేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు అధికారులు వివరించారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ వెట్రిసెల్వి తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన ట్యాబ్‌లు.. ‘సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు అందించే ట్యాబ్స్‌లో బైజూస్ కంటెంట్‌ను అప్లోడ్ చేయాలి. అందుకు అనుగుణంగా స్పెసిఫికేషన్స్, ఫీచర్లు ఉండాలి. అవి నిర్దారించాకే ట్యాబ్‌ల కొనుగోలు ప్రక్రియ మొదలుపెట్టాలి. టెండర్లు పిలిచేటప్పప్పుడు నాణ్యత, మన్నికను దృష్టిలో ఉంచుకోవాలి’ అని సీఎం జగన్ సూచించారు. 8వ తరగతిలో విద్యార్థికి ఇచ్చే ట్యాబ్‌లు తరువాత 9, 10వ తరగతుల్లో కూడా వినియోగించుకొనేలా ఉండాలని స్పష్టం చేశారు. మూడేళ్లపాటు ట్యాబ్‌లు నాణ్యతతో పని చేసేలా ఉండాలన్నారు. వాటి నిర్వహణ కూడా అత్యంత ప్రధానమన్నారు. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే మరమ్మతులు చేపట్టటాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ట్యాబ్‌ల కొనుగోలులో మంచి కంపెనీలను పరిగణలోకి తీసుకుని నిర్దేశిత సమయంలోగా అందించాలని పేర్కొన్నారు. -
సర్కారు బడి... అడ్మిషన్ల సందడి
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో సర్కారు బడులు కొత్త విద్యార్థుల చేరికతో సందడిగా కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనట్టుగా ప్రభుత్వ పాఠశాలల ముందు అడ్మిషన్ల కోసం క్యూలు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల అయితే విద్యార్థుల సంఖ్య ఎక్కువైపోయి అడ్మిషన్లు ఇవ్వలేమని చెప్పేదాకా వెళ్లిపోయాయి. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం, ‘మన ఊరు–మన బడి’తో ప్రైవేటుకు దీటుగా మెరుగుపర్చడంతోనే విద్యార్థుల చేరికలు పెరుగుతున్నాయని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. అడ్మిషన్లు మొదలైన 15 రోజుల్లోనే లక్షన్నర మందికిపైగా కొత్త విద్యార్థులు చేరారని అంటున్నాయి. బడి బాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తే.. భారీగా అడ్మిషన్లు అవుతాయని పేర్కొంటున్నాయి. 30 వేల పాఠశాలలు.. 30లక్షల విద్యార్థులు రాష్ట్రంలో 30వేల వరకు ప్రభుత్వ విద్యా సంస్థలున్నాయి. వాటి పరిధిలో 30 లక్షల మంది చదువుతున్నారు. రెసిడెన్షియల్ విధానంలో కొనసాగుతున్న గురుకుల విద్యా సంస్థలు, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలు మినహాయిస్తే.. 26,040 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 23.5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ విద్యా సంస్థలను పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు– మన బడి’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఏటా 25 శాతం పాఠశాలలను పూర్తి స్థాయిలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఈ ఏడాది బడ్జెట్లో ఏకంగా రూ.12 వేల కోట్లు కేటాయించింది. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో పనులు కూడా మొదలయ్యాయి. మౌలిక సదుపాయాల కల్పనతోపాటు నాణ్యమైన విద్య అందించేందుకు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దీనితో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాటివైపు ఆకర్షితులవుతున్నారు. పలుచోట్ల ప్రైవేటు పాఠశాలలను వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే గత పదిహేను రోజుల్లో ఏకంగా 1,50,826 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో వేర్వేరు తరగతుల్లో ప్రవేశాలు పొందారు. అంటే రోజుకు సగటున 10వేల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నట్టు లెక్క. అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు నెలాఖరు వరకు ఉంటుందని.. ఇందులో కనీసం నెల రోజుల పాటు రోజూ పెద్ద సంఖ్యలో అడ్మిషన్లు కొనసాగే అవకాశం ఉందని విద్యా శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇదే విధానాన్ని ఇంటర్, డిగ్రీ స్థాయిల్లోనూ అమలు చేస్తే.. పదో తరగతి తర్వాత విద్యార్థుల డ్రాపౌట్లను గణనీయంగా తగ్గించడానికి వీలవుతుందన్న వాదన కూడా వినిపిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా.. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో నమోదవుతున్న ప్రవేశాల్లో అత్యధికం పట్టణ ప్రాంతాల్లోనే ఉంటున్నాయి. రెండేళ్లుగా కోవిడ్–19 ప్రభావంతో పేద, మధ్యతరగతి వర్గాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల ప్రైవేటు విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఉన్న ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు ఫీజులను అడ్డగోలుగా పెంచేశాయి. ఆ భారం మోయలేని పేద, మధ్యతరగతి కుటుంబాల వారు పిల్లలను ఆంగ్ల మాధ్యమం ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు పంపించేందుకు సిద్ధమవుతున్నారు. ► ఇక గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు జీవనోపాధి కోసం ప్రజలు తరలి వస్తున్న నేపథ్యంలో.. నగర శివార్లలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా చేరికలు ఉంటున్నాయి. హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డిలతోపాటు హన్మకొండ, సిద్దిపేట, ఇతర జిల్లా కేంద్రాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు క్రమంగా పెరుగుతున్నాయి. మరోవైపు జిల్లాల్లోనూ గణనీయంగానే అడ్మిషన్లు ఉంటున్నాయి. ► సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ సంస్థ ఈ మధ్య నిర్వహించిన సర్వేలో కరోనా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో తీవ్ర ఒడిదుడుకులకు కారణమైందని.. చాలా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయని తేల్చింది. తమ పిల్లలను మంచి ఇంగ్లిష్ మీడియం పాఠశాలకు పంపించలేని స్థితికి జారిపోయాయని తమ నివేదికలో పేర్కొంది కూడా. ఇంగ్లిష్ మీడియం కలిసి వస్తోంది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరడానికి ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన, 1 నుంచి 8 వరకు ఇంగ్లిష్ మీడియం ప్రారంభించడం కలిసి వస్తున్నాయి. అదే సమయంలో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు విపరీతంగా పెరగడం, కోవిడ్ కారణంగా ప్రజల ఆర్థిక పరిస్థితులు దిగజారడం కూడా కారణమే. ఉపాధ్యాయుల కొరత తీర్చడం, పారిశుధ్య నిర్వహణ మెరుగుపరిస్తే ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడుతాయి. – చావా రవి, టీఎస్టీయుఎఫ్ ప్రధాన కార్యదర్శి స్కూళ్లు నిండిపోతున్నాయి రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటికే విద్యార్థులు ఎక్కువైపోయి.. నో అడ్మిషన్స్ బోర్డులు పెడుతున్నారు. రాబోయే కాలంలో అలాంటి స్కూళ్లు మరింతగా పెరుగుతాయి. విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. మన ఊరు–మన బడి పథకంతో ప్రభుత్వ పాఠశాలలు ఆకర్షణీయంగా మారుతున్నాయి. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం వల్ల తల్లితండ్రులు ఆకర్షితులవుతున్నారు. – రాజ భాను చంద్రప్రకాశ్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు తల్లిదండ్రుల్లో నమ్మకం పెరిగింది ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనను స్వాగతిస్తున్నాం. తల్లిదండ్రులకు ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం పెరగడమే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడానికి కారణం. ప్రైవేటు ఫీజుల భారం కూడా దీనికి కారణమవుతోంది. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక రిక్రూట్మెంట్ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపడితే బాగుంటుంది. – జి.సదానందంగౌడ్, ఎస్టీయూటీఎస్, రాష్ట్ర అధ్యక్షుడు జోరుగా అడ్మిషన్లు ► తెలంగాణ ఏర్పాటు నుంచి ఏటా సగటున లక్షన్నర నుంచి 2 లక్షల మంది వరకు విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతుంటారు. అదికూడా జూన్ రెండో వారం నుంచి ఆగస్టు చివరి వరకు కూడా అడ్మిషన్లు జరుగుతుంటాయి. ► ఈసారి అడ్మిషన్లు మొదలైన 15 రోజుల్లోనే లక్షన్నర మందికిపైగా విద్యార్థులు పాఠశాలల్లో చేరారు. ఈ లెక్కన మొత్తంగా అడ్మిషన్లు ముగిసే నాటికి మూడు లక్షల నుంచి మూడున్నర లక్షల మంది వరకు కొత్తగా చేరే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ► ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం, ‘మన ఊరు– మన బడి’తో సదుపాయాల కల్పనే దీనికి కారణమని చెప్తున్నారు. ► ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు ఎక్కువగా ఉంటున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో సదుపాయాల అభివృద్ధి వేగంగా ఉండటం, గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు కూడా దీనికి కారణమని అంచనా. ► ప్రైవేటు పాఠశాలలు అడ్డగోలుగా ఫీజులు పెంచడం, కరోనాతో కుటుంబాల ఆదాయం తగ్గడం వల్ల కూడా.. ప్రభుత్వ స్కూళ్లకు విద్యార్థులు తరలడానికి కారణం అని విద్యా రంగ నిపుణులు చెప్తున్నారు. -
కరోనా నష్టం.. ‘బ్రిడ్జి కోర్సు’ పాఠం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో కొన్నాళ్లపాటు బ్రిడ్జి కోర్సు నిర్వహించాలని రాష్ట్ర విద్య, శిక్షణ, పరిశోధన మండలి (ఎస్సీఈఆర్టీ) జిల్లా విద్యాశాఖ అధికారులను మంగళవారం ఆదేశించింది. ఇందుకు సంబంధించి పాఠ్య ప్రణాళికను కూడా రూపొందించినట్టు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా మూలంగా విద్యార్థులు అభ్యసన నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. దీన్ని దూరం చేసి తిరిగి గాడిలో పెట్టడమే దీని ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. మొదటి తరగతిలో చేరే విద్యార్థులకు 12 వారాలపాటు విద్యాప్రవేశ్ పేరుతో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ ఉన్న విద్యార్థులకు 4 వారాలపాటు బ్రిడ్జి కోర్సు చేపట్టాలని, ఇందుకు పాఠశాల హెచ్ఎంలు బాధ్యత తీసుకోవాలని ఎస్సీఈఆర్టీ సూచించింది. చదవడం, రాయడం, ప్రమాణాలు పెంచేలా పాఠ్య ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు. బ్రిడ్జి కోర్సు మాడ్యూళ్లు తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో ఉంటాయని విద్యాశాఖ పేర్కొంది. భయం పోగొట్టేలా... విద్యాప్రవేశ్ పేరుతో మొదటి తరగతి విద్యార్థులకు అందించే ప్రత్యేక మాడ్యూల్స్‌లో ఎక్కువ భాగం విద్యార్థుల్లో ఒత్తిడి పోగొట్టేలా చర్యలు తీసుకున్నారు. రెండేళ్లుగా విద్యార్థులు కరోనా కారణంగా స్కూళ్లకు దూరమయ్యారు. పాఠశాల వాతావరణం అంటే కొంత భయం నెలకొంది. ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నా అవి గ్రామీణ ప్రాంతాలకు చేరలేదన్న వాదన ఉంది. ముఖ్యంగా మొదటి తరగతిలో చేరుతున్న విద్యార్థులకు పాఠశాలకు హాజరుకావడం ఇదే తొలిసారి అవుతుందని అధికారులు చెబుతున్నారు. వారిని స్కూల్ వాతావరణానికి అలవాటు చేసి భయం పోగొట్టేలా ఆటపాటలతో చదువు వైపు మళ్లించాలని ఎస్సీఈఆర్టీ భావించింది. ఆహ్లాదకరంగా, ఆనందంగా, స్కూళ్లకు వెళ్లాలనే ఆలోచన విద్యార్థులకు కలిగేలా విద్యాప్రవేశ్ శిక్షణ ఉండాలని సూచించారు. మూడు నెలలపాటు ఈ తరహాలో విద్యార్థులను చదువుకు సిద్ధం చేశాక బోధన ప్రక్రియ మొదలు పెట్టాలని నిర్ణయించారు. మళ్లీ గుర్తుకు తెచ్చేలా... ప్రస్తుతం 2–10 తరగతుల విద్యార్థుల్లో ఆంగ్లం, తెలుగు చదవడం, రాయడం వంటి నైపుణ్యాలు తగ్గాయని ఎస్సీఈఆర్టీ గుర్తించింది. చాలా మంది విద్యార్థులు కనీస స్థాయికన్నా తక్కువగా ఉన్నారని, సాధారణ స్థాయి ప్రమాణాలు దాటిన వారు 15 శాతం మించి లేరని నేషనల్ అచీవ్మెంట్ సర్వే కూడా తేల్చిచెప్పింది. విద్యార్థులు పాఠాలను అర్థం చేసుకొనే పరిస్థితి కనిపించడం లేదని పేర్కొంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని 2–10 తరగతుల విద్యార్థులను నాలుగు విభాగాలుగా అధికారులు విభజించారు. లెవెల్–1లో 2 నుంచి 5వ తరగతి విద్యార్థులను, లెవెల్–2లో 6, 7 తరగతులు, లెవెల్–3లో 8, 9 తరగతులు, లెవెల్–4లో 10వ తరగతి విద్యార్థులను చేర్చారు. బ్రిడ్జి కోర్సు మాడ్యూళ్లను కూడా నాలుగు విభాగాలుగా తయారు చేశారు. ముందు తరగతులకు లింక్ ఉండే పాఠ్యాంశాలను తీసుకొని సరైన పునశ్చరణ ఉండేలా ఇవి ఉంటాయని అధికారులు తెలిపారు. పుస్తకాలు రానందునేనా? స్కూళ్లు తెరిచినా ఇంతవరకూ పుస్తకాల ముద్రణ పూర్తవ్వలేదు. 2.10 కోట్ల పుస్తకాలు కావాల్సి ఉంటే ఇప్పటివరకూ కేవలం 20 లక్షలే ముద్రించారు. మిగతావి రావడానికి ఇంకా రెండు నెలలు పట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అధికారులు బ్రిడ్జి కోర్సును తెరపైకి తెచ్చారనే వాదన విద్యావర్గాల నుంచి వినిపిస్తోంది. -
పాఠ్య పుస్తకాలకు తడ‘బడి’..
► వేసవి సెలవుల అనంతరం జూన్ 13 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ విద్యా సంవత్సరంలోనే 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెడతామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఎక్కువ సంఖ్యలో పాఠ్య పుస్తకాలను ముద్రించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియే పూర్తికాక పోవడంతో విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందే పరిస్థితి లేకుండా పోయింది. ► పాఠ్య పుస్తకాల ముద్రణ ప్రక్రియ ఫిబ్రవరి, మార్చి నుంచే మొదలవ్వాల్సి ఉంది. సాధారణంగా ఏప్రిల్, మేలో పుస్తకాల ముద్రణ పూర్తయినా, విద్యార్థులకు జూలై వరకూ అందని పరిస్థితి ఉండేది. ఇప్పుడు పుస్తకాల ముద్రణ పెరగడంతో పాటు, ఇప్పటివరకు ముద్రణకు టెండర్లే ఖరారు కాకపోవడంతో స్కూళ్లు తెరిచినా కనీసం రెండు నెలల వరకు పుస్తకాల పంపిణీ జరిగే అవకాశం కన్పించడం లేదని విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి. సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది జూన్ 13 నుంచి మొదలయ్యే విద్యా సంవత్సరంలోనే 1 నుంచి 8 తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడతామని ప్రభుత్వం ప్రకటించింది. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ ఈ దిశగా కార్యాచరణ కన్పించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందించే పరిస్థితి లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటివరకు ఉన్న పరిస్థితిని గమనిస్తే స్కూళ్లు తెరిచినా, కనీసం రెండు నెలల వరకూ విద్యార్థి చేతికి పుస్తకం వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. రెండేళ్లుగా కరోనా వల్ల విద్యా సంస్థలు దాదాపుగా మూతపడ్డాయి. అరకొరగా నడిచినా పాఠశాల విద్యపై కరోనా తీవ్ర ప్రభావం చూపించిందని ప్రభుత్వ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ప్రస్తు తం తిరిగి గాడిలో పడుతున్న సమయంలో పాఠ్యపుస్తకాలు ఆలస్యం కానుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పాఠశాల విద్య కమిషనర్ దీనిపై దృష్టి సారించడం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. రెండు భాషలతో పెరిగిన ముద్రణ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం తెలుగు, ఇంగ్లిష్ 2భాషల్లో (బై లింగ్వల్) పుస్తకాలను ముద్రించాలని నిర్ణయించింది. ఒక వైపు ఇంగ్లిష్, మరోవైపు తెలుగు భాషలో పాఠాలను ముద్రిస్తారు. దీంతో పుస్తకం బరువు దాదాపు రెట్టింపు కానుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక్కో సబ్జెక్టును రెండు భాగాలుగా విభజించారు. సమ్మేటివ్ అసెస్మెంట్–1 (ఎస్ఏ–1) వరకు ఉన్న సిలబస్‌ను ఒక పుస్తకంలో, ఎస్ఏ–2లో ఉన్న సిలబస్‌తో మరో పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయించారు. దీంతో ఈసారి ఎక్కువ సంఖ్యలో పుస్తకాలు ప్రింట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లోని 24 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా వీటిని అందజేస్తారు. ఉచితంగా అందించే పుస్తకాలను 2.10 కోట్ల వరకు, ప్రైవేటులో విక్రయానికి మరో 1.40 కోట్ల పుస్తకాలు ముద్రించాల్సి ఉంది. గతంలో ఉచితంగా అందించే పుస్తకాలకు రూ. 60 కోట్లు వెచ్చిస్తే... ఇప్పుడు రూ.120 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు. ఖరారు కాని టెండర్లు ప్రభుత్వ ముద్రణాలయంలో యంత్రాలన్నీ చాలావరకు పాతబడి, ముద్రణకు అనుకూలంగా లేవని చెబుతున్నారు. ఫలితంగా ప్రైవేటు ముద్రణాలయాల్లో వీటిని ముద్రించాల్సి ఉంది. దీని కోసం ప్రత్యేకంగా కమిటీ ఉంటుంది. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ, పరిశ్రమల శాఖ నుంచి ఓ అధికారి, ప్రభుత్వ ముద్రణాలయం ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. అయితే ఇప్పటివరకు ఈ కమిటీ సీనియస్‌గా భేటీ అయిన దాఖలాల్లేవు. కమిటీ భేటీ లేకుండానే టెండర్ల ప్రక్రియ చేపట్టారనే విమర్శలున్నాయి. పేపర్ అందించేందుకు తమిళనాడు పేపర్ మిల్స్, పంజాబ్‌కు చెందిన సాతియా పేపర్స్, చండీగఢ్‌కు చెందిన మరో సంస్థ టెండర్లు వేసింది. అయితే ఇప్పటివరకు ఈ ప్రక్రియ పూర్తికాకపోవడం గమనార్హం. పుస్తకాలు ఆలస్యంగా వస్తే బోధనతో పాటు విద్యార్థులు చదువుకోవడమూ కష్టమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జూన్ నెలాఖరు లక్ష్యంగా పెట్టుకున్నాం పుస్తకాల ముద్రణకు సంబంధించిన టెండర్లు ఈ నెల 16న తెరుస్తాం. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఎల్–1ను గుర్తించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తారు. ద్విభాష ముద్రణ కావడం వల్ల ఈసారి పుస్తకాల ముద్రణ ఎక్కువ సంఖ్యలో చేయాల్సి వస్తోంది. వీలైనంత త్వరగా పుస్తకాలు ముద్రించే ప్రయత్నం చేస్తున్నాం. స్కూళ్ళు తెరిచే సమయానికి కొన్ని పుస్తకాలు అందించడంతో పాటు అన్ని పుస్తకాలను జూన్ నెలాఖరులోగా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – ఎస్ శ్రీనివాసచారి (డైరెక్టర్, ప్రభుత్వ పుస్తకాలు, స్కూల్ ఎడ్యుకేషన్) సకాలంలో పుస్తకాలు ఇవ్వాలి : చెరుకు ప్రద్యుమ్నకుమార్ (ప్రభుత్వ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్, కరీంనగర్) ఆంగ్ల భాషలో బోధన చేపడుతున్న నేపథ్యంలో ముందే విద్యార్థుల చేతికి పుస్తకాలు అందాలి. అప్పుడే వాళ్ళకు కొత్త విధానంపై కొంత అవగాహన ఏర్పడుతుంది. అదే విధంగా ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించేందుకు అవసరమైన ప్రిపరేషన్ చేసుకునే వీలుంటుంది. పుస్తకాలు ఆలస్యమైతే సిలబస్ పూర్తి కోసం బోధనను పరుగులు పెట్టించాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రతి ఏటా ఆలస్యంతో ఇబ్బంది పాఠ్య పుస్తకాల ముద్రణ ఆలస్యం ప్రతి ఏటా ఇబ్బందిగా మారుతోంది. దీనికి శాశ్వత పరిష్కారం ఆలోచించాలి. విద్యార్థులకు ఇచ్చే పుస్తకాలను విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత తిరిగి తీసుకుని, లైబ్రరీలో భద్రపరిచి, కొత్త వారికి ఇవ్వాలి. దీనివల్ల ఆలస్యం సమస్య తలెత్తదు. ప్రభుత్వ ఖజానాపై భారమూ తగ్గుతుంది. – మామిడోజు వీరాచారి (లోకల్ కేడర్ ప్రభుత్వ టీచర్ల సంఘం అధ్యక్షుడు) -
ఏపీ పథకాల వైపే అందరి అడుగులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఏపీని సందర్శించి ఆయా పథకాలు అమలవుతున్న విధానాన్ని అధ్యయనం చేసి వెళ్లాయి. ఆయా రాష్ట్రాల్లో కూడా అమల్లోకి తెస్తున్నాయి. ప్రధానంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మెచ్చుకోవడమే కాకుండా ఆ రాష్ట్రంలోనూ అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇదే కోవలో ఏపీలో అమలవుతున్న బైలింగ్వల్ టెక్ట్స్ బుక్స్ (ద్విభాషా పాఠ్యపుస్తకాలు)ను మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరించడానికి సిద్ధమైంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ద్విభాషా పాఠ్య పుస్తకాలను తమ రాష్ట్రంలోని పాఠశాలల పిల్లలకు పంపిణీ చేయనున్నట్లు మహారాష్ట్ర విద్యా శాఖ మంత్రి వర్షా గైక్వాడ్ ఇటీవల వారి అసెంబ్లీలో ప్రకటించారు. ఏపీలో ఇంతకు ముందు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం మాత్రమే అమల్లో ఉండేది. దీంతో ఆ స్కూళ్లలో చదివే విద్యార్థులు ఉన్నత విద్యలో, ఉద్యోగావకాశాల్లో వెనుకబాటుకు గురయ్యేవారు. ఆంగ్ల భాష పరిజ్ఞానం లేనందున ఆయా సంస్థలు వీరివైపు దృష్టి సారించేవి కావు. ఫలితంగా ప్రభుత్వ స్కూళ్లలోని పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి. ఈ తరుణంలో సీఎం వైఎస్ జగన్.. దూర దృష్టితో ఆలోచించి, ప్రభుత్వ స్కూళ్లన్నింటిలో ఆంగ్ల మాధ్యమానికి శ్రీకారం చుట్టారు. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ‘జగనన్న విద్యా కానుక’ కింద అందించే కిట్లలో డిక్షనరీని కూడా చేర్పించారు. ఆంగ్ల భాషా పదాలు సులభంగా అర్థమవ్వడంతో పాటు ఆ సబ్జెక్టు అంశాలను విద్యార్థులు సంపూర్ణంగా అవగాహన చేసుకొనేందుకు తెలుగు మాధ్యమంలో కూడా అవే పాఠాలు ఒకే పుస్తకంలో అందేలా ఏర్పాట్లు చేయించారు. టెక్టŠస్ పుస్తకంలో పాఠ్యాంశం ఒక పేజీలో ఆంగ్లంలో, మరోవైపు తెలుగులో (మిర్రర్ ఇమేజ్) ఉండేలా ఈ పుస్తకాలను తీర్చిదిద్దారు. ఇవి విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా మారాయి. పాఠ్య పుస్తకాలు తక్కువ బరువుతో ఉండేలా ఇంజనీరింగ్, డిగ్రీ తదితర ఉన్నత విద్యా కోర్సుల్లో మాదిరిగా పాఠశాల స్థాయిలోనూ సెమిస్టర్ విధానంలో ముద్రించి ఇస్తున్నారు. 2020–21లో ఒకటి నుంచి 6వ తరగతి వరకు, 2021–22లో ఏడవ తరగతి వరకు ద్విభాషా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం (2022–23)లో 8వ తరగతి విద్యార్థులకు కూడా అందించనున్నారు. డిగ్రీలోనూ ద్విభాషా పాఠ్య పుస్తకాలు రాష్ట్రంలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్విభాషా (ఇంగ్లిష్–తెలుగు) పాఠ్య పుస్తక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ కోర్సులకు సంబంధించి మొత్తం 13 సబ్జెక్టుల్లో ద్విభాషా పాఠ్య పుస్తకాలను అందిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో మొదటి సెమిస్టర్ పుస్తకాలను ఈ విధానంలో ముద్రించారు. మన నాడు–నేడుపై తెలంగాణ మక్కువ పాఠశాల విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రంలో మనబడి నాడు–నేడు పథకాన్ని ప్రారంభించారు. తద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగు పడడమే కాకుండా, సర్వాంగ సుందరంగా రూపురేఖలు మార్చుకున్నాయి. ఈ పథకాన్ని ఇప్పుడు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ అనుసరిస్తోంది. ఈ పథకానికి వినియోగించిన సాఫ్ట్వేర్ ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని తమకు అందించాలని ఆ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఏపీ ప్రధాన కార్యదర్శికి కొద్ది రోజుల క్రితం లేఖ రాశారు. ఏపీ ఆ సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణకు అందించడమే కాకుండా ఇతరత్రా సహకారం అందించేలా సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం కోసం తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కూడా కేటాయించింది. ఈ ఏడాది మార్చి 22న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మన ఊరు – మనబడి పేరుతో వనపర్తి జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో పథకాన్ని ప్రారంభించారు. 26,065 స్కూళ్లలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాడు–నేడుతో మహర్దశ రాష్ట్రంలో నాడు–నేడు కింద రూ.16,450.69 కోట్లతో 61,661 స్కూళ్ల రూపు రేఖల మార్పునకు ప్రణాళిక రూపొందించారు. తొలిదశలో 15,713 స్కూళ్లను రూ.3,697.86 కోట్లతో సర్వాంగ సుందంగా తీర్చిదిద్దారు. మిగతా వాటిలో రెండో దశ కింద పనులు చేపట్టారు. మొత్తంగా ఈ పథకం కింద పనులు చేపట్టనున్న స్కూళ్లు, వ్యయం వివరాలు ఇలా ఉన్నాయి. -
మన బడిని బాగు చేసుకుందాం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. పాఠశాలలను బాగు చేసేందుకు గ్రామాల సర్పంచ్‌లు, పూర్వ విద్యార్థులు కలసి రావాలని కోరింది. మన ఊరు–మన బడిపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం శనివారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన ఎంసీఆర్హెచ్ఆర్డీలో భేటీ అయ్యింది. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ పాల్గొన్నారు. యుద్ధ ప్రాతిపదికన పాఠశాలల అభివృద్ధి పనులు పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం, డిజిటల్ విద్య, ఇంగ్లిష్ మీడియంలో బోధన తదితర అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ‘ప్రతి వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించడం ద్వారా యుద్ధ ప్రాతిపదికన పాఠశాలల అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం రాష్ట్రంలో సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా సంస్థలకు, ఇతర ప్రభుత్వ విద్యా సంస్థలకు ఒకే కరిక్యులమ్, ఒకే విధానం ఉండేలా చర్యలు తీసుకోవాలి. మే నెల ప్రారంభంలో పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా విద్యా సంస్థల్లో మొక్కలు, పచ్చదనాన్ని పెంచేందుకు రెండు మూడు రోజులు కేటాయించాలి..’అని నిర్ణయించారు. 30 వేల పాఠశాలలకు బ్యాండ్‌విడ్త్ జూన్ 12న పాఠశాలలను పునఃప్రారంభిస్తామని, బడిబాట కార్యక్రమాన్ని జూన్ 1న ప్రారంభించి 12 తేదీ వరకు పూర్తి చేయాలని సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్న విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు. త్వరలోనే టీ ఫైబర్ ద్వారా 30 వేల విద్యా సంస్థలకు బ్యాండ్‌విడ్త్ సౌకర్యాన్ని కల్పించబోతున్నట్లు తెలిపారు. ఒక్కో పాఠశాలకు రూ. 50 వేలు: మంత్రి కేటీఆర్ క్రీడలను ప్రోత్సహించేందుకు వీలుగా క్రీడా పరికరాల కొనుగోలుకు తన నియోజకవర్గ నిధుల నుంచి ఒక్కో పాఠశాలకు రూ. 50 వేల చొప్పున విడుదల చేయనున్నట్లు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ విధంగా చేస్తే క్రీడా సౌకర్యాలు మెరుగుపడతాయన్నారు. పాఠశాలలు నడుస్తున్న ఆవరణలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉంటే వాటిని కూడా అభివృద్ధి సూచించారు. ఈ పథకం కింద చేపట్టిన పనులు వేగవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యరద్శి రామకృష్ణారావు, ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యా డైరెక్టర్ దేవసేన తదితరులు పాల్గొన్నారు. -
మరింత పకడ్బందీగా ‘జగనన్న గోరుముద్ద’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జగనన్న గోరుముద్ద కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత పకడ్బందీగా నాణ్యతతో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ పథకానికి నిధుల కేటాయింపును కూడా ఆ మేరకు పెంచింది. ఈ పథకానికి 2020–21లో రూ.1,546 కోట్లు, 2021–22లో రూ.1,797 కోట్లు ఖర్చు పెట్టింది. 2022–23 విద్యాసంవత్సరానికి రూ.1,908 కోట్లు కేటాయించింది. అలాగే గతంలో ఈ పథకం కింద 32 లక్షల మంది విద్యార్థులు ఉండగా ఈసారి 43.46 లక్షల మందికి మధ్యాహ్న భోజనాన్ని అందించనుంది. గత ప్రభుత్వ హయాంలో కేవలం సాంబారు, అన్నంతోనే సరిపెట్టేవారు. కానీ ప్రస్తుతం వారానికి ఒక మెనూ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గుడ్లు, చిక్కీలు సహా అన్నం, పప్పుచారు, పులిహోర, పప్పూటమోటా, ఆలూకుర్మా, కిచిడి, పొంగలి.. ఇలా రోజుకోరకమైన ఆహారపదార్థాలను విద్యార్థులకు అందించేలా ఏర్పాట్లు చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి విద్యార్థికి వారానికి 5 గుడ్లు అందిస్తున్నారు. గతంలో మధ్యాహ్న భోజనానికి రూ.515 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టేది. అందులోనూ రూ.400 కోట్లు కేంద్రం నిధులే. కానీ ఇప్పుడు కేంద్రం ఇచ్చే రూ.400 కోట్లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.1,500 కోట్లు విద్యార్థుల భోజనం కోసం కేటాయిస్తోంది. కేంద్రం కేవలం 1–8 తరగతుల విద్యార్థులకు మాత్రమే నిధులు అందిస్తుండగా 9, 10 తరగతుల విద్యార్థులకు అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఆహార పదార్థాల్లో నాణ్యత, పౌష్టికతతోపాటు రుచికరంగా ఉండేందుకు వీలుగా గతంలో విద్యార్థులకు ఒక్కొక్కరిపై రోజువారీ వెచ్చించే మొత్తాన్ని పెంచింది. ప్రాథమిక తరగతుల్లో ప్రతి విద్యార్థికి రూ.11.26ను రూ.16.07కి, ప్రాథమికోన్నత తరగతుల్లో ప్రతి విద్యార్థికి రూ.12.87ను రూ.18.75కి, ఉన్నత పాఠశాలల విద్యార్థుల్లో ప్రతి విద్యార్థికి రూ.17.52ను రూ.23.40కి పెంచారు. అలాగే మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే 88,296 మంది వంట వాళ్లు, సహాయకులకు ఇచ్చే రూ.1,000 గౌరవ భృతిని రూ.3 వేలకు ఇంతకు ముందే పెంచిన సంగతి తెలిసిందే. అమలుపై ప్రత్యేక శ్రద్ధ.. నాలుగంచెల్లో పర్యవేక్షణ గతంలో మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఎలాంటి పర్యవేక్షణ లేదు. ఈసారి నాలుగు అంచెల్లో పర్యవేక్షణ చేస్తూ పథకాన్ని సమర్థంగా అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠశాల స్థాయిలో.. ప్రధానోపాధ్యాయుడు, తల్లిదండ్రుల కమిటీలు, గ్రామ, వార్డు సచివాలయాలు, గ్రామ సేవాసంఘాలు (సెర్ప్, మెప్మా), వివిధ స్థాయిల అధికారులకు పర్యవేక్షణ కమిటీల బాధ్యతలు అప్పగించింది. అంతేకాకుండా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ద్వారా జగనన్న గోరుముద్ద పర్యవేక్షణ కోసం ప్రత్యేక యాప్‌ను, డ్యాష్ బోర్డును ఏర్పాటు చేసింది. రాష్ట్రమంతా జగనన్న గోరుముద్ద ఒకేలా నాణ్యతతో అమలయ్యేలా ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను తెచ్చింది. ఎక్కడైనా సమస్య ఏర్పడితే 14417 టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా ప్రవేశపెట్టింది. -
పరీక్ష గదికి 16 మంది విద్యార్థులే
సాక్షి, అమరావతి: రాష్టంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో గదికి 16 మంది విద్యార్థులే ఉండేలా ఎస్సెస్సీ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఇంతకు ముందు గదికి 24 మంది ఉండేవారు. కోవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరించి విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేందుకు గతంలోనే విద్యార్థుల సంఖ్యను కుదించింది. ప్రస్తుతం కరోనా దాదాపు తగ్గుముఖం పట్టినప్పటికీ, విద్యార్థుల ఆరోగ్యంతోపాటు పరీక్షల్లో కాపీయింగ్ జరగకుండా బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది. గతంలో దాదాపు 2 వేల కేంద్రాల్లో టెన్త్ పరీక్షలు నిర్వహించగా, ఇప్పుడా సంఖ్యను 4,200కు పెంచినట్లు ఎస్సెస్సీ బోర్డు డైరక్టర్ డి.దేవానందరెడ్డి ‘సాక్షి’కి వివరించారు. ఈ ఏడాది పరీక్షలకు 6.30 లక్షల మంది హాజరుకానున్నారు. టెన్త్ విద్యార్థులకు, ఉపాధ్యాయులందరికీ ఇప్పటికే ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయించింది. మే 2 నుంచి పరీక్షలు టెన్త్ పరీక్షలను మే 2వ తేదీ నుంచి 13 వరకు నిర్వహించేలా బోర్డు షెడ్యూల్‌ను ఇంతకు ముందే విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సిలబస్ పూర్తి చేశారు. ఇప్పుడు ప్రత్యేక మెటీరియల్‌ను విద్యార్థులకు అందిస్తున్నారు. రివిజన్ చేయిస్తూ రోజువారీ, వారాంతపు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రశ్నపత్రాల బ్లూప్రింట్, మాదిరి ప్రశ్నపత్రాలను బోర్డు విడుదల చేసింది. ఈసారి అంతర్గత మార్కులతో సంబంధం లేకుండా 100 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. గతంలో హిందీ మినహా తక్కినవాటిలో రెండేసి పేపర్లు 50 మార్కులు చొప్పున ఉండేవి. తాజాగా పేపర్లను ఏడింటికి కుదించడంతో 100 మార్కులకు ప్రశ్నపత్రాలు ఉంటాయి. బిట్ పేపర్ విడిగా ఉండదు. వ్యాసరూప ప్రశ్నలకు 8, లఘు సమాధాన ప్రశ్నలకు 4, అతి లఘు ప్రశ్నలకు, లక్ష్యాత్మక ప్రశ్నలకు 1 మార్కు ఇస్తారు. మేథమెటిక్స్‌లో అకడమిక్ స్టాండర్డ్స్ ప్రకారం ప్రాబ్లెమ్ సాల్వింగ్, రీజనింగ్ అండ్ ప్రూఫ్, కమ్యూనికేషన్, కనెక్షన్, విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ అంశాలను పరిశీలన చేసేలా ప్రశ్నలుంటాయి. లక్ష్యాత్మక ప్రశ్నల్లో ప్రయోగాలు, ప్రశ్నలు రూపొందించడం, క్షేత్ర పరిశీలనలు, సమాచార నైపుణ్యాలు, పట నైపుణ్యాలు వంటివి ఉంటాయి. సైన్సు సబ్జెక్టుల్లో సమస్యకు సరైన కారణాలు ఊహించి చెప్పడం, ప్రయోగ అమరిక చిత్రాన్నిచ్చి ప్రశ్నించడం, ప్రయోగ నిర్వహణకు అవసరమైన పరికరాల గురించి అడగడం వంటివి ఉంటాయి. -
అడ్మిషన్ల కోసం పోటీపడేలా..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం పోటీపడే స్థాయికి తీసుకొస్తామని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న అనేక సమస్యలను రాబోయే రెండేళ్లలో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. శనివారం పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో ‘మన బస్తీ– మన బడి’పై హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. తలసాని మాట్లాడుతూ, పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తామని, పేద, మధ్య తరగతి కుటుంబాలకు మంచి విద్యను అందించాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని పేర్కొన్నారు. పాఠశాలల్లో సౌకర్యాలకు నిధులను సీఎం కేటాయించారని, త్వరగా సమస్యలను పరిష్కరించాలని, ఇంగ్లిష్ మీడియంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు ఆయా పాఠశాలలను సందర్శిస్తూ సమస్యలను తెలుసుకోవాలన్నారు. ఫీజులపై ప్రైవేటు స్కూళ్లలో ఒత్తిడి చేస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా, ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీసుకువస్తామని, అప్పుడు ప్రైవేటుకు వెళ్లేవారు తగ్గుతారని తలసాని పేర్కొన్నారు. -
కోటిస్తే.. బడికి మీరు చెప్పిన పేరు
సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు– మన బడి’కార్యక్రమంలో విదేశాల్లో స్థిరపడిన తెలంగాణవాసులు భాగస్వా ములు కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కె.తారక రామారావు పిలుపు నిచ్చారు. కోటి రూపాయలకు పైగా విరాళం ఇస్తే.. వారు సూచించిన పేర్లను ప్రభుత్వ పాఠశాలలకు పెడతామని ప్రకటించారు. రాష్ట్ర విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలసి శనివారం తెలంగాణ ఎన్ఆర్ఐలతో కేటీఆర్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఏర్పాటుపై నెలకొన్న అనుమా నాలను పటాపంచలు చేస్తూ అన్ని రంగాల్లో పురోగతి సాధించి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా రూపాంతరం చెందిందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విద్య, వైద్య రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులతో రాష్ట్రం పురోగతి సాధిస్తోందని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యా రంగంలో సమూల మార్పులు తెస్తూ ప్రాథమిక విద్య మొదలుకుని మహిళా డిగ్రీ కాలేజీల ఏర్పాటు వరకు వందలాది విద్యా సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వెల్లడించారు. గురుకుల విద్యాసంస్థల విద్యార్థులు సాధిస్తున్న విజయాలను కేటీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు.. ‘మన ఊరు– మన బడి’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో రూ.7,289 కోట్లతో సుమారు 26 వేల స్కూళ్లను అభివృద్ధి చేయనుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేసే ఉద్దేశంతో విదేశాల్లో స్థిరపడిన తెలంగాణ ప్రవాసుల సాయాన్ని కూడా కోరుతున్నామన్నారు. ప్రభుత్వం నిర్దేశిం చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రూ.కోటి లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని విరాళంగా ఎవరు ఇచ్చినా వారు సూచించిన పేరును పాఠశాలకు పెడతా మన్నారు. రూ.10 లక్షలు లేదా అంతకు మించి ఆర్థిక సాయం చేసే వారు సూచిం చిన పేర్లు తరగతి గదులకు పెడతామ న్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తోచినంత సాయం చేసేందుకు ముందుకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్ర ఆవిర్భావంతో విద్యారంగంలో అనేక సానుకూల మార్పులు వచ్చాయని, మన ఊరు– మన బడితో ప్రభుత్వ పాఠశాలలు సంపూర్ణంగా రూపాంతరం చెందుతాయని విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చే ఎన్నారైలకు విద్యా శాఖ తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం కో–ఆర్డినేటర్ మహేశ్ బిగాల, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ప్రతినిధి అనిల్ కూర్మాచలం, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ దేవసేన తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తాం.. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే బృహత్తర కార్యక్రమమే ‘మన ఊరు.. మన బడి’ అని విద్యా మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం వైద్య, ఆరోగ్య మంత్రి హరీశ్‌రావుతో కలసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాల యం నుంచి జిల్లా కలెక్టర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లా డుతూ.. తొలి విడతలో 60 శాతంపైగా విద్యార్థులు చదివే 35 శాతం పాఠశాల లను ఎంపిక చేసి, ఆయా పాఠశాలను అభివృద్ధి చేసే ప్రక్రియను ఓ యజ్ఞంలా చేపట్టనున్నట్లు ప్రకటించారు. గ్రామాల్లో ‘మన ఊరు–మన బడి’, పట్టణాల్లో ‘మన బస్తీ– మన బడి’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకెళ్తుందని హరీశ్‌రావు అన్నారు. 12 అంశాలతో రాష్ట్రంలోని 9,123 పాఠ శాలలను మొదటి దశలో అభివృద్ధి చేయ నున్నట్లు మంత్రులు స్పష్టం చేశారు. రూ.కోటి విరాళంగా ఇస్తే ఆ పాఠశాలకు వారి పేరు పెట్టడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
టీచర్లకు పదోన్నతుల వెల్లువ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు త్వరలోనే భారీ ఎత్తున పదోన్నతులు లభించనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన నోట్‌ను పాఠశాల విద్యాశాఖ మంగళవారం అన్ని జిల్లా, డివిజన్, మండల విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు విడుదల చేసింది. రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యలు, కార్యక్రమాలతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు మొత్తంగా పాఠశాల వ్యవస్థకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరనుందని ఆ నోట్లో పేర్కొంది. పదోన్నతులు, ఇతర ప్రయోజనాలు ఇలా.. ► 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు మ్యాపింగ్ చేయడం వల్ల వచ్చే జూన్‌లోగా 30 వేల మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు వస్తాయి. ► రాష్ట్రంలో కొత్తగా 833 జూనియర్ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. తద్వారా పాఠశాలల్లోని స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు ప్రిన్సిపాల్ స్థాయి పదోన్నతులు లభించనున్నాయి. ప్రస్తుతం 41 మండలాల్లో మహిళా కళాశాలలు ఉన్నాయి. 202 మండలాల్లో అసలు కళాశాలలే లేవు. ఈ మండలాల్లో ఒక కో ఎడ్యుకేషన్, ఒక బాలికల జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అంటే.. ఈ 202 మండలాల్లో కొత్తగా 404 జూనియర్ కాలేజీలు రానున్నాయి. మరో 429 మండలాల్లో ఒక్కో బాలికల కళాశాల ఏర్పాటు కానుంది. మొత్తంగా 833 కొత్త కళాశాలలు రానున్నాయి. ► మండల విద్యా శాఖ అధికారులు (ఎంఈవోలు) ఇక నుంచి పూర్తి స్థాయిలో విద్యా శాఖ బాధ్యతలు నిర్వహించేందుకు వీలుగా సెల్ఫ్ డ్రాయింగ్ అధికారాలు ఇవ్వనున్నారు. ప్రభుత్వం దీనిపై విధాన నిర్ణయం తీసుకుంది. మండల వనరుల కేంద్రంగా ఉన్న కార్యాలయాన్ని ఇక నుంచి మండల విద్యాశాఖ కార్యాలయంగా మార్చనున్నారు. ఎంఈవోలు దశాబ్దాలుగా ఈ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యాలయంలో అవసరమైన సిబ్బందిని కూడా ప్రభుత్వం నియమించనుంది. ► మండల స్థాయిలో ఇద్దరు ఎంఈవోలను నియమిస్తారు. డివిజన్, జిల్లా స్థాయిలోనూ పోస్టులు పెరగనున్నాయని నోట్లో విద్యా శాఖ పేర్కొంది. -
22లోగా 2వ దశ స్కూళ్ల మ్యాపింగ్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల మ్యాపింగ్ రెండో దశను ఈనెల 22వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా విద్యా శాఖాధికారులు, ప్రాంతీయ సంచాలకులకు పాఠశాల విద్యా శాఖ సర్క్యులర్ జారీ చేసింది. నూతన విద్యా విధానం ప్రకారం పాఠశాల విద్యలో ఫౌండేషన్ విద్యా విధానాన్ని ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీపంలోని హైస్కూళ్లలో కలుపుతున్నారు. మొదటి దశలో ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న స్కూళ్ల మ్యాపింగ్ పూర్తయినందున అదే తరహాలో 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల పరిధిలోనివి, ఆపైబడి ఉన్న దూరంలోని స్కూళ్ల మ్యాపింగ్ చేపట్టాలని పాఠశాల విద్యా శాఖ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. స్కూళ్లు, విద్యార్థుల సంఖ్య, టీచర్లు, మౌలిక సదుపాయాల వివరాలు, ప్రత్యామ్నాయాలపై కసరత్తు చేయాలని సూచించింది. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లను సమీపంలోని హైస్కూళ్ల హెడ్మాస్టర్ లాగిన్ ద్వారా మ్యాపింగ్ చేయాలని పేర్కొంది. సహజసిద్ధమైన అడ్డంకుల వల్ల మ్యాపింగ్‌కు వీలుకాని వాటికి కారణాలను స్పష్టంగా పేర్కొనాలని తెలిపింది. ప్రభుత్వ, ఎంపీపీ, జెడ్పీపీ, మున్సిపల్, గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలను మ్యాపింగ్ చేసేటప్పుడు ఏ యాజమాన్య స్కూలునైనా పరిగణనలోకి తీసుకోవచ్చని వివరించింది. ఎయిడెడ్, రెసిడెన్షియల్ స్కూళ్లను మాత్రం దీని నుంచి మినహాయించింది. దూరాన్ని వాస్తవిక రోడ్ కనెక్టివిటీ ఆధారంగా చూడాలని, స్ట్రయిట్ లైన్లు, ఏరియల్ వ్యూ ఆధారంగా చేయవద్దని స్పష్టం చేసింది. ఉర్దూ, ఒడియా, తమిళ్, కన్నడ మాధ్యమ స్కూళ్లను అవే మీడియం స్కూళ్లకు మ్యాపింగ్ చేయాలంది. సమానమైన దూరంలో రెండు హైస్కూళ్లు ఉంటే మౌలిక సదుపాయాలు ఎక్కువగా ఉన్న వాటిని ఎంచుకోవాలని తెలిపింది. మూడు కిలోమీటర్ల పరిధిలో హైస్కూళ్లు లేని ప్రాంతాల్లోని అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో మౌలిక సదుపాయాలను అనుసరించి అప్‌గ్రేడ్ చేయాలని పేర్కొంది. టీచర్లకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలు తరువాత విడుదల చేస్తామని చెప్పింది. 2024–25 నాటికి సింగిల్ మీడియం స్కూళ్లు 2024–25 నాటికి సింగిల్ మీడియం స్కూళ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం 2022–23లో 9, 10 తరగతుల్లో మాత్రమే డ్యూయల్ మీడియం ఉండాలని పేర్కొంది. 2023–24లో టెన్త్‌లో మాత్రమే డ్యూయల్ మీడియం ఉండాలని స్పష్టం చేసింది. ఆయా స్కూళ్లలోని సబ్జెక్టు టీచర్ల స్టాఫ్ ప్యాట్రన్‌ను కూడా ఈ సర్క్యులర్‌లో పొందుపరిచారు. -
‘జనాభాకు అనుగుణంగా పాఠశాలలు పెంచాలి’
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు పెంచాలని, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ముందు నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మాధ్యమాన్ని తెచ్చే ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాల్లేవని, ఇప్పటికే అనేక పాఠశాలలు అద్దె భవనాల్లో ఉన్నాయని విమర్శించారు.గురుకులాలకు భవనాల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. -
స్కూళ్లను కాదని ఆన్‌లైన్‌కు వెళితే.. చదువుకు చెద!
నిరంతరాయంగా పాఠశాలల మూసివేత వల్ల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది. పేదలు, అణగారిన వర్గాల పిల్లలు చాలా నష్టపోతారు. అసమానతలు పెరిగి, సమాజంపై దుష్ప్రభావం పడుతోంది. పిల్లల్లో డ్రాపవుట్లకు దారితీస్తోంది. పాఠశాలలు తెరిచిన తరువాత బాలలకు సరైన సామర్థ్యాలు లేక స్కూళ్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపడంలేదు. చివరకు వారు బాల కార్మికులుగా మారే ప్రమాదం ఏర్పడుతోంది. – యునెస్కో (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) నివేదిక సాక్షి, అమరావతి: కరోనా మూడో వేవ్ ఉన్నప్పటికి, విద్యార్థుల భవిష్యత్తు, అభ్యసన సామర్థ్యం దెబ్బతినకుండా విద్యా సంస్థలను తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా ప్రొటోకాల్‌కు అనుగుణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎటువంటి సమస్యలు రాకుండా పటిష్టమైన జాగ్రత్తలతో విద్యాసంస్థల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) కూడా పాఠశాలలను తెరవాలనే చెబుతోంది. విద్యా సంస్థలను తెరిచి, ప్రత్యక్ష బోధనే మేలని వెల్లడించింది. పాఠశాలల మూసివేత వల్ల విద్యార్థులు, ముఖ్యంగా పేద, బడుగు బలహీనవర్గాల పిల్లలు తీవ్రంగా నష్టపోతారని తెలిపింది. ఉన్నత, పేద వర్గాలకు మధ్య అసమానతలు మరింత పెరుగుతాయని, ఇది సమాజంపై దుష్ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. దీని పర్యవసానాలపై యునెస్కో అంతర్జాతీయంగా అనేక కోణాల్లో అధ్యయనం చేసి, ఇటీవల ‘కోవిడ్–19 ఎడ్యుకేషన్ రెస్పాన్స్’ పేరిట నివేదికను విడుదల చేసింది. విద్యా సంస్థల మూసివేత వల్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు.. అంతిమంగా సమాజానికి ఎంతటి నష్టమో వివరించింది. ప్రత్యక్ష బోధన లేక సామర్థ్యాలు, నైపుణ్యాలకు దెబ్బ పాఠశాలలు తెరచి ప్రత్యక్ష బోధన చేయడం వల్ల విద్యార్థులకు ఆశించిన మేరకు అభ్యాసన సామర్థ్యాలు లభిస్తాయి. పాఠశాలలు మూసివేస్తే వారిలో ఉన్న అభ్యసన సామర్థ్యాలను కూడా కోల్పోతున్నారు. సందేహాలు తీర్చే వారుండరు. వారిలోని లోపాలను సరిచేసే వారుండరు. దీంతో వెనుకబాటుకు గురవుతున్నారు. గత రెండేళ్లలో పాఠశాలలు మూతపడి ఈ సమస్య చాలా పెరిగిందని అసర్ సర్వే కూడా తేటతెల్లం చేసింది. స్కూళ్ల మూసివేత వల్ల అట్టడుగు వర్గాల పిల్లలు మరింతగా నష్టపోతారని యునెస్కో తెలిపింది. పాఠశాలలకు వచ్చే పిల్లల్లో, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల పిల్లల్లో అత్యధికులు పేద వర్గాల వారే. వీరికి సరైన ఆహారమూ ఇళ్లలో అందదు. పాఠశాలలు తెరిస్తే మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందుతుంది. లేకపోతే ఆ ఆహారమూ లేక ఆకలితో అలమటిస్తారు. సరైన ఆహారం అందక శారీరక ఎదుగుదల కూడా దెబ్బతింటుంది. డిజిటల్ పరికరాల లేమి ఆన్లైన్ బోధనకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా శాఖ తగిన ఏర్పాట్లు చేస్తున్నా, ఈ స్కూళ్లలో చదివేది అత్యధికులు నిరుపేద విద్యార్థులే. వారికి డిజిటల్ పరికరాలు లేక ఆన్లైన్ బోధనను అందుకోలేకపోతున్నారు. మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల పిల్లలు మరింత వెనుకబాటుకు లోనవుతున్నారు. వారి కోసం దూరదర్శన్, ఆలిండియా రేడియోల ద్వారా పాఠాలను ప్రసారం చేయిస్తున్నా, టీవీ లేని వారికి అవీ అందడంలేదు. పాఠాలు ప్రసారమయ్యే సమయాల్లో పిల్లలను టీవీలు, రేడియోల ముందు కూర్చోబెట్టి వాటిని నేర్చుకొనేలా చేసే అవకాశం పనులకు వెళ్లిపోయే ఆ పేద తల్లిదండ్రులకు ఉండడంలేదు. డిజిటల్ పరికరాలు ఉన్న టీనేజ్ పిల్లలు కొన్ని సందర్భాల్లో ఇతర దురలవాట్లకు లోనయ్యే ప్రమాదమూ ఉంటోంది. వాటి ద్వారా పాఠాల అభ్యసనానికి బదులు ఇతర దుష్ప్రభావాలకు లోనవుతున్నారు. అదే స్కూళ్లు తెరిచి ఉన్నప్పుడు పిల్లల చదువు సంధ్యలను టీచర్లు పర్యవేక్షిస్తారు. పాఠశాలలు మూసివేత వల్ల వైరస్ భయంతో పెద్దలు పిల్లలను బయట కూడా తిరగనివ్వడంలేదు. పిల్లలు ఇళ్లలోనే మగ్గిపోయి, మానసికంగా అనారోగ్యం పాలవుతున్నారు. పిల్లల సంరక్షణ, ఆర్థిక సమస్యలు ఇతర కారణాలతో పెద్దల ఆరోగ్యమూ దెబ్బతింటోంది. ఇది ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోందని యునెస్కో అభిప్రాయపడింది. బాల్య వివాహాలు పాఠశాలలు మూతపడి స్కూళ్లకు వెళ్లాల్సిన టీనేజ్ ఆడ పిల్లలు ఇళ్లకే పరిమితమై పోతుండడంతో తల్లిదండ్రులు వారికి పెళిŠల్ చేసే ఆలోచనలు చేస్తున్నారు. ఇది బాల్య వివాహాలకు దారితీస్తోంది. కొన్ని చోట్ల ఇళ్లకే పరిమితమై ఉండే బాలికలపై లైంగిక వేధింపులు కూడా జరుగుతున్నట్లు యునెస్కో వివరించింది. ఉపాధ్యాయులకూ సమస్యే పాఠశాలలు తెరిస్తే ఉపాధ్యాయులు నేరుగా బోధిస్తారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగు పరుస్తారు. పిల్లలతో నేరుగా సంభాషించి, వారిలోని లోపాలను అప్పటికప్పుడు సరిచేస్తారు. సందేహాలను నివృత్తి చేస్తారు. అదే స్కూళ్లు మూతపడితే ఆన్లైన్లోనో, డిజిటల్ విధానం, వాట్సప్, ఇతర ప్రక్రియల ద్వారా బోధించాలి. విద్యార్ధులతో నేరుగా మాట్లాడలేరు. వారి సామర్థ్యాలను అంచనా వేయలేరు. మరోవైపు పాఠ్యాంశాలను ఆన్లైన్, డిజిటల్ ప్రక్రియల్లోకి మార్చడం కూడా టీచర్లకు సమస్యే. వీడియోలో రికార్డు చేసి బోధించడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. డిజిటల్ కంటెంట్లను విద్యార్థులకు సరిగా అందించలేక ఎక్కువ శాతం టీచర్లు నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. ఆన్లైన్ బోధన వల్ల పరీక్షల నిర్వహణ, ఫలితాలు కూడా సరిగా ఉండవని యునెస్కో వెల్లడించింది. గత రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించినా కోవిడ్ కారణంగా సాధ్యం కాలేదు. అనివార్య పరిస్థితుల్లో పిల్లలందరినీ వారి సామర్థ్యాలు, ప్రతిభతో సంబంధం లేకుండా ఆల్‌పాస్‌గా ప్రకటించాల్సి వచ్చింది. తల్లిదండ్రులపైనా తీవ్ర ఒత్తిడి పాఠశాలల మూత వల్ల పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. పిల్లలకు ఆండ్రాయిడ్ ఫోన్లు, కంప్యూటర్లు వంటివి అందించడం పెద్ద సమస్యగా మారింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు వీటి కోసం అప్పుల పాలవుతున్నాయి. చాలామంది వీటిని సమకూర్చలేక పిల్లల చదువులపై ఆందోళనకు గురవుతున్నారు. పిల్లలకు ఆ పరికరాలు సమకూర్చినా, చదువులు ఎలా సాగుతున్నాయోనని పర్యవేక్షణ మరో సమస్య. వాటి వినియోగంలో పిల్లలు సరైన మార్గంలో వెళ్తున్నారో లేదో అర్థంకాక అయోమయంలో పడుతున్నారని యునెస్కో తెలిపింది. పాఠశాలలకూ ఆన్లైన్ వనరులు సమకూర్చడం సమస్యే పాఠశాల తరగతిలో బోధన జరిగితే స్కూళ్ల యాజమాన్యాలు ఉన్న వనరులతో మంచి ఫలితాలు సాధించే వీలుంటుంది. పాఠశాలలు మూసివేస్తే ఆన్లైన్ బోధనకు ఏర్పాట్లు చేయడం స్కూళ్లకూ సమస్యగా మారింది. ఆన్లైన్ బోధనకు అనువుగా పోర్టళ్లు, కంటెంట్‌ను రూపొందించాలి. ఇవన్నీ యాజమాన్యాలకు తలకుమించిన భారం. వీడియో కంటెంట్లు, లైవ్ ఆన్లైన్ తరగతులు కొన్ని కార్పొరేట్ స్కూళ్లలో కూడా పరిమితంగానే అమలవుతున్నాయి. బడ్జెటరీ పాఠశాలల్లో అదీ ఉండడం లేదు. ఏపీలో అనేక జాగ్రత్తలతో పాఠశాలలు పాఠశాలల మూసివేత వల్ల అనేక నష్టాలు, పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరమయ్యే ప్రమాదం ఉండడంతో రాష్ట్రంలో పాఠశాలలను కొనసాగించడంపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ çపూర్తిస్థాయి జాగ్రత్తలతో విద్యా సంస్థలను నిర్వహిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేసింది. 15 ఏళ్లు పైబడిన పిల్లలకు కూడా యుద్ధప్రాతిపదికన టీకాలు వేస్తోంది. ప్రభుత్వ చర్యలతో సంక్రాంతి సెలవుల అనంతరం సోమవారం నుంచి ప్రారంభమైన స్కూళ్లకు తొలి రోజే 61 శాతం మంది పిల్లలు హాజరవడం విశేషం. ఆన్లైన్ కంటే ఆఫ్‌లైన్ మేలు మానసిక కోణంలో ఆలోచిస్తే విద్యార్ధులకు శిక్షణ, క్రమశిక్షణ చాలా అవసరం. పాఠశాలలు చదువు చెప్పే కేంద్రాలే కావు. పిల్లల్లో సమగ్రమైన అభివృద్ధికి, భావి పౌరులుగా తీర్చిదిద్దే సంస్థలు. పిల్లల్లోని ఎమోషన్సును బేలెన్సు చేసేవి స్కూళ్లే. ఎక్కువ సమయం స్కూల్లోనే ఉంటారు కనుక అనేక అంశాలు నేర్చుకుంటారు. టీచర్ నేరుగా చెప్పడం ద్వారానే ఎక్కువగా నేర్చుకోగలుగుతారు. సాధ్యమైన మేరకు తరగతులు నిర్వహించడమే మంచిది. పిల్లలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలతో పాఠశాలలు నిర్వహించడమే మేలు. – డాక్టర్ ఎన్వీఎస్ సూర్యనారాయణ, సైకాలజిస్టు, విజయనగరం స్కూళ్లు మూస్తే నష్టం స్కూళ్లు మూసివేయడం వల్ల గత రెండేళ్లుగా మా పిల్లలు చాలా నష్టపోయారు. ఆన్లైన్ బోధన వల్ల పాఠాలేవీ నేర్చుకోలేదు. వారి పరిస్థితి చూసి మాకే కష్టమనిపించింది. ఇప్పుడు కూడా స్కూళ్లు మూసివేస్తే మరింత నష్టపోతారు. కరోనా ఉన్నా మాస్కులు వేసి స్కూళ్లకు పంపిస్తున్నాం. ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకొని పాఠశాలలు నడిపించడమే మంచిది. – పెద్దిరెడ్డి (విద్యార్థి తండ్రి) పడమటి యాలేరు, ఆత్మకూరు మండలం, అనంతపురం జిల్లా అన్నీ తెరిచే ఉన్నాయిగా.. సినిమా హాళ్లు, షాపులు, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, మార్కెట్లు అన్నీ తెరిచే ఉంటున్నాయి. పండగలు, జాతరలు, ఉత్సవాలూ వేలాది మందితో జరుగుతున్నాయి. వాటివల్ల రాని కరోనా సమస్య పాఠశాలలు తెరిస్తే వస్తుందా? రెండేళ్లుగా పాఠశాలలు సరిగా తెరవకపోవడం వల్ల పిల్లలు చాలా నష్టపోతున్నారు. ఇప్పటికీ స్కూళ్లు మూసే ఉంటే వారి భవిష్యత్తు దెబ్బతింటుంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని స్కూళ్లలోనే పాఠాలు చెప్పాలి. – శ్రీధర్, ప్రభుత్వ ఉద్యోగి, అనంతపురం మరింత నష్టపోకూడదు పిల్లలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకొని స్కూళ్లు తెరవడమే మేలు. ఇప్పటికే రెండు విద్యా సంవత్సరాలు పిల్లలు నష్టపోయారు. వారు మరింత నష్టపోకుండా స్కూళ్లలోనే బోధన జరగాలి. పిల్లలకు వ్యాక్సిన్ వేస్తున్నందున ఎలాంటి ఇబ్బంది రాదు. – ఓబుళపతి, వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి -
Nadu Nedu: ఏపీలో విద్య భేష్
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంస్కరణలు చాలా బాగున్నాయని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ), ఇతర రాష్ట్రాల విద్యా రంగ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఈ చర్యలతో పాఠశాల విద్యలో అద్భుతమైన ఫలితాలు సుసాధ్యమని చెప్పారు. నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్కుపై ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల విద్యా విభాగాల ప్రతినిధుల రెండు రోజుల శిక్షణ సదస్సు మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా రంగంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాల గురించి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి వేర్వేరుగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతో వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాలు అభినందనీయమని ఎన్సీఈఆర్టీ ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అమలవుతున్న అమ్మ ఒడితో డ్రాపవుట్లు పూర్తిగా తగ్గి, చేరికలు గణనీయంగా పెరగడం, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలవైపు విద్యార్థులు మళ్లడం మంచి పరిణామమని పేర్కొన్నారు. ఎక్కడా లేని విధంగా వేల కోట్ల ఖర్చుతో పాఠశాలల రూపురేఖలనే మార్చివేసేలా నాడు – నేడు కార్యక్రమాలు అమలు చేయడం, విద్యార్థులు, ఉపాధ్యాయులకు సదుపాయాలు సమకూర్చడం గొప్ప విషయమని మైసూరులోని రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్ఐఈ) ప్రతినిధులు చెప్పారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు అభివృద్ధి చేయడం, ఆంగ్ల మాధ్యమం, కరిక్యులమ్ సంస్కరణలతో నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చి, పేద వర్గాల పిల్లల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్సీఈఆర్టీ ప్రతినిధి అభిప్రాయపడ్డారు. జాతీయ నూతన విద్యా విధానం అమల్లోకి రాకముందే రాష్ట్రంలో పునాది విద్యను బలోపేతం చేయడం అభినందనీయమని అన్నారు. ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యుమరసీ (ఎఫ్ఎల్ఎన్)లో దేశంలోనే ఏపీ ముందంజలో నిలిచిందన్నారు. సదస్సు ముగింపు సందర్భంగా ఆయా రాష్ట్రాల ప్రతినిధులకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి జ్ఞాపికలను అందించారు. -
‘నిష్ట’ మనమే ఫస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వేళ విద్యార్థులకు బోధన కుంటుపడకుండా జాగ్రత్తలతోపాటు ఉపాధ్యాయుల సామర్థ్యాలను పెంపొందించేలా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఉద్దేశించిన ప్రతిష్టాత్మక ‘నిష్ట’ కార్యక్రమాల అమలులో ఏపీ దేశంలో అగ్రగామిగా నిలిచిందని కేంద్ర విద్యా శాఖ ప్రశంసించింది. డిజిటల్ విద్యాబోధనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అనుసరించిన పద్ధతులను కేంద్రం అభినందించింది. డిజిటల్ బోధనకు సంబంధించిన 18 అంశాలనూ అమలు చేసిందని పేర్కొంది. నూతన అంశాలను అన్వయిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంపొందించేలా ఆన్లైన్ శిక్షణతో ఏపీలో పలు డిజిటల్ కార్యక్రమాలు అమలయ్యాయని పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు – నేడులో భాగంగా లాంగ్వేజ్ లాబ్‌లు ఏర్పాటుతోపాటు 120 గంటలపాటు ఏకధాటిన ప్రసారమయ్యేలా ఆరు సబ్జెక్టులకు సంబంధించిన కంటెంట్ పెన్‌డ్రైవ్‌లో 1,610 వీడియోలను పొందుపరిచారని తెలిపింది. వెయ్యి ఆదర్శ గ్రంథాలయాల ఏర్పాటుతోపాటు లైబ్రరీల డిజిటలైజేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు డిజిటల్ ఎడ్యుకేషన్‌పై చేపట్టిన కార్యక్రమాలను విశ్లేషిస్తూ ఇండియన్ డిజిటల్ ఎడ్యుకేషన్ నివేదికను కేంద్రం విడుదల చేసింది. నివేదికలో ముఖ్యాంశాలు ఇవీ.. ► నిష్ట.. ఆన్లైన్ కోర్సులు: కేంద్ర ప్రభుత్వం ‘నిష్ట’ ఆన్లైన్ ఫ్లాగ్షిప్ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తొలుత ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రారంభించింది. ఇందులో ఏపీ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. 18 మాడ్యూళ్లలో 90 రోజులపాటు ‘నిష్ట’ ఆన్లైన్ కోర్సులు నిర్వహించారు. 1,03,897 మంది ఉపాధ్యాయులు ప్రైమరీ స్థాయి శిక్షణ పూర్తి చేసుకున్నారు. 97,894 మంది అన్ని మాడ్యూళ్లు పూర్తిచేశారు. వీరందరికీ దీక్ష ప్లాట్‌ఫామ్ ద్వారా ధ్రువపత్రాలు అందజేశారు. ► విద్యావారధి... టీవీ పాఠాలు: ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు దూరదర్శన్ ద్వారా నిపుణులతో బోధన అందించారు. పాఠశాలల మూసివేత సమయంలో విద్యార్థుల అభ్యాసానికి ఆటంకం కలగకుండా 2020 జూన్ 10 నుంచి 2021 జనవరి 31 వరకు బోధన కొనసాగింది. ► జాగ్రత్తలపై ఉపాధ్యాయులకు శిక్షణ: కరోనా మహమ్మారి సమయంలో ఎలిమెంటరీ, సెకండరీ స్కూళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్త్రృత అవగాహన కల్పిస్తూ వాల్‌పోస్టర్లు ప్రచురించారు. ఉయ్ లవ్ రీడింగ్ వర్చువల్ ఓరియెంటేషన్ కార్యక్రమం ద్వారా భాగస్వాములకు అవగాహన కల్పించింది. దీక్షతో లెర్నింగ్ సెషన్లు ఆంధ్రప్రదేశ్‌లో 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 జూలై వరకు ‘దీక్ష’లో భాగంగా 12,14,22,509 లెర్నింగ్ సెషన్లు పూర్తయ్యాయి. 1,46,324 ఎలిమెంటరీ లెర్నింగ్ సెషన్లు పూర్తి చేశారు. ► పాఠశాలలకు దూరమైన చిన్నారులకు ఇంటివద్దే సేవలందిస్తున్న ఫిజియో థెరఫిస్ట్‌ల పనితీరును ప్రభుత్వం ఎప్పటికప్పుడు డాష్‌బోర్డ్ ద్వారా తెలుసుకుంది. ► టీవీ ద్వారా బోధన అర్థం చేసుకునేందుకు విద్యార్థులకు వర్క్‌బుక్స్ అందజేసింది. ► తొమ్మిది, పదో తరగతి విద్యార్థులతో వాట్సాప్ గ్రూపులను ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ఈ–కంటెంట్‌ను ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా విద్యార్థులకు అందజేశారు. ► విద్యార్థులకు సాంకేతిక సదుపాయాలపై సర్వే చేపట్టారు. ► కఠినమైన పాఠ్యాంశాలకు సంబంధించి జూమ్ తరగతులు నిర్వహించారు. ► పాఠశాలు పునఃప్రారంభం కాగానే పాఠశాలల్లో విద్యార్థులను ట్రాక్ చేసేందుకు యాప్ ద్వారా పర్యవేక్షించారు. ► కరోనా సమయంలో వర్చువల్ విధానంలో వ్యాసరచన, వక్తృత్వ తదితర పోటీలు నిర్వహించారు. ► ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్లైన్ బోధనపై డైట్ ఉపాధ్యాయులతో సర్వే చేశారు. ► మార్చి 23, 2021 నుంచి ఏప్రిల్ 4, 2021 వరకూ పాఠశాలలకు దూరమైన విద్యార్థులను గుర్తించేందుకు ‘మన బడికి పోదాం మొబైల్ యాప్’ ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించారు. బడికి దూరమైన వేల మంది విద్యార్థులు, వలస కార్మికుల పిల్లలను ఇలా గుర్తించి తిరిగి పాఠశాలలకు రప్పించగలిగారు. ► రాజ్యాంగ విలువలను మిళితం చేస్తూ భాష, గణితంలో నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించేలా నూతన పాఠ్యాంశాలు ప్రవేశపెట్టారు. -
‘బాల భటులు’ సిద్ధం.. దేశ పోలీసు చరిత్రలో తొలిసారి
సాక్షి, హైదరాబాద్: ‘నేను పొందిన అవగాహన తో నన్ను నేను రక్షించుకోవడంతో పాటు సమాజాన్ని సంరక్షిస్తానని, నా పాఠశాలలో ఉన్న పిల్లలు, పెద్దలు ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వారికి సహాయం చేస్తానని, సలహాలు సూచనలు ఇస్తానని, సైబర్ పోలీసులకు, షీ–టీమ్స్‌కు సమాజానికి మధ్య వారధిగా ఉంటానని ప్రమాణం చేస్తున్నా’ మంగళవారం తెలంగాణలోని 1650 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ‘బాల భటులు’ చేసిన ప్రమాణమిది. దేశ పోలీసు చరిత్రలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు ఈ ప్రయోగం చేశారు. సైబర్ నేరాలను నిరోధించడానికి రాష్ట్ర మహిళ భద్రత విభాగం అమల్లోకి తెచ్చిందే ‘సైబర్ కాంగ్రెస్’. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు సైబర్ అంబాసిడర్లుగా తీర్చిదిద్దారు. విద్యాశాఖ అధికారులతో కలసి వర్చువల్‌గా 3 నెలల పాటు శిక్షణ ఇచ్చారు. ఈ బాల భటులు మంగళవారం నుంచి అధికారికంగా రంగంలోకి దిగారు. మొత్తం 33 జిల్లాల్లోని జిల్లా పరిషత్ స్కూళ్లలో జరిగిన కార్యక్రమాల్లో బాల భటులకు బ్యాడ్జీలు అందించారు. నగరంలోని మహబూబియా స్కూల్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా భద్రత విభాగం అదనపు డీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి పాల్గొన్నారు. వీరి పర్యవేక్షణలో సైబర్ నేరాలపై చైతన్యం, అవగాహన కల్పించేందుకు సైబ్–హర్ క్యాంపెయినింగ్ జరిగింది. దీనికి కొనసాగింపుగా సైబర్ కాంగ్రెస్ చేపట్టారు. ఒక్కో పాఠశాల నుంచి ఇద్దరు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఉన్న పాఠశాలలను 16 యూనిట్లుగా చేశారు. విద్యా శాఖ, పోలీసు విభాగంతో పాటు స్వచ్ఛంద సంస్థ యంగిస్తాన్ ఫౌండేషన్‌తో కలసి మహిళా భద్రత విభాగం పని చేసింది. ఒక్కో ప్రభుత్వ పాఠశాల నుంచి 8, 9 తరగతులు చదువుతున్న ఇద్దరిని ఎంపిక చేశారు. వీరికి సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఇతరుల్లో అవగాహన పెంచడంతో పాటు బాధితులకు సహకరించే విధానాలు నేర్పారు. స్థానిక పోలీసుస్టేషన్లకు చెందిన ఇన్స్పెక్టర్లు అనుసంధానకర్తలుగా పని చేస్తారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలపై దృష్టి పెట్టారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా చైతన్యం కలిగించడంతో పాటు బాలికల భద్రతకు భంగం వాటిల్లకూడదనే లక్ష్యంతో ముందుకెళ్లారు. ఈ విద్యార్థులకు సైబర్ నేరాలపై ప్రతి వారం ఆన్లైన్లో తరగతులు నిర్వహించారు. ఎదురయ్యే సమస్యలను తెలియజేయడంతో పాటు వాటికి పరిష్కార మార్గాలను నేర్పారు. ఇంటర్నెట్ను ఎలా సద్వినియోగం చేసుకోవాలో వివరిస్తూ విద్యార్థుల నుంచి సమాచారం సేకరించారు. ఆన్లైన్ నేపథ్యంలో... కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు తప్పనిసరయ్యాయి. చేతికి స్మార్ట్ఫోన్లు రావ డంతో క్లాసులతో పాటు యాప్‌ల వినియోగం, ఆన్ లైన్ గేమ్స్‌కు అలవాటు పడ్డారు. దీన్ని సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకోవడంతో అనేకమంది విద్యా ర్థులు సైబర్ నేరగాళ్ల వల్లో చిక్కుతున్నారు. పర్యవేక్షణ లేని కొందరు పెడదారి పడుతున్నారు. వీటన్నింటికీ పరిష్కారంగా ఈ సైబర్ అంబాసిడర్లను రంగంలోకి దింపారు. సుశిక్షితులైన ఈ 3,300 మంది తమను తాము కాపాడుకోవడంతో పాటు సహ విద్యార్థులు, తల్లిదండ్రులు, స్నేహితులు, పరిచయస్తులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పి స్తారు. బాధితులుగా మారిన వారికి పోలీసులు, షీ–టీమ్స్ ద్వారా సహాయసహకారాలు అందేలా కృషి చేస్తారు. తొలి విడతలో సైబర్ అంబాసిడర్లుగా మారిన 3,300 మందిలో 1,500 మంది బాలురు కాగా, 1,800 మంది బాలికలు ఉన్నారు. -
Andhra Pradesh: సంస్కరణలకు శుభారంభం
సాక్షి, అమరావతి: రానున్న విద్యా సంవత్సరంలో నూతన విద్యావిధానం అమలు చేయడానికి అవసరమైన చోట్ల అదనపు తరగతి గదుల నిర్మాణంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. కార్యాచరణ పూర్తిచేసి వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం ప్రక్రియ పూర్తయ్యేనాటికి అవసరమైన టీచర్ల సంఖ్యను కూడా గుర్తించాలని సూచించారు. విద్యారంగంలో తెచ్చిన సంస్కరణలు, నూతన విద్యా విధానంపై సీఎం జగన్ బుధవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా టీచర్లను నియమించడంతోపాటు సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులతో బోధనే లక్ష్యంగా నూతన విద్యా విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న విషయం తెలిసిందే. టీచర్లకు అత్యుత్తమ శిక్షణ టీచర్లకు శిక్షణ ఇచ్చే డైట్ సంస్థల సమర్థత పెంచాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. టీచర్లకు అత్యంత నాణ్యమైన శిక్షణ అందాలని, ఈ కార్యక్రమాలపై వచ్చే సమావేశంలో వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. స్కూళ్లలో సమస్యలపై కాల్‌సెంటర్ పాఠశాలల్లో సదుపాయాలకు సంబంధించి ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే వెంటనే కాల్ చేసేలా ఒక నంబర్ అందుబాటులోకి తేవాలని సీఎం ఆదేశించారు. ప్రతి స్కూల్లో అందరికీ కనిపించేలా ఈ నంబర్‌ను ప్రదర్శించాలని సూచించారు. ఈ కాల్‌సెంటర్‌ను అధికారులు పర్యవేక్షణ చేసిన వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని, తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇంగ్లీషుపై ప్రత్యేక శ్రద్ధ ఇంగ్లీషు ఉచ్ఛారణ, భాష, వ్యాకరణాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా పాఠ్య ప్రణాళికపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. విద్యార్థులకు ఇప్పటికే ఇచ్చిన డిక్షనరీలను వినియోగించుకోవాలన్నారు. ప్రతి రోజూ కనీసం మూడు కొత్త పదాలు నేర్పించి వాటిని సాధన చేసేలా పిల్లలకు మెళకువలు నేర్పాలని సూచించారు. మరుగుదొడ్లు నిర్వహణ ఇంట్లో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలని ఎలా కోరుకుంటామో విద్యార్థులు చదివే పాఠశాలల్లో కూడా అలాగే ఉండాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. నాణ్యమైన సదుపాయాలు అందరి లక్ష్యం కావాలన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల స్థితిగతులపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆదేశించారు. టాయిలెట్స్‌లో ట్యాప్‌లు పనిచేయక, నీళ్లు రాక దుర్గంధంతో ఎవరూ వినియోగించని పరిస్థితులు గతంలో చూశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అలాంటి దుస్థితిని నాడు – నేడు ద్వారా సమూలంగా మార్చామని ముఖ్యమంత్రి తెలిపారు. క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ పిల్లలకు మంచి వాతావరణం అందుబాటులో ఉంచాలని సూచించారు. విద్యారంగంపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హెడ్మాస్టర్లే కుటుంబ పెద్దలు పాఠశాలలకు హెడ్ మాస్టర్లే కుటుంబ పెద్దలని సీఎం జగన్ పేర్కొన్నారు. మెరుగైన రీతిలో బోధన దగ్గర నుంచి నాణ్యమైన భోజనం, సదుపాయాలు, మౌలిక వసతులపై తనిఖీలు నిర్వహిస్తూ అంతా సవ్యంగా ఉండేలా హెడ్మాస్టర్లను చైతన్యం చేయాలని సూచించారు. వీటిపై ప్రతిరోజూ పర్యవేక్షణ జరగాలని స్పష్టం చేశారు. గోరుముద్దపై ఫీడ్ బ్యాక్ గోరుముద్దపై క్రమం తప్పకుండా ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. పిల్లలు, తల్లుల నుంచి తప్పకుండా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా, సమస్య తలెత్తినా వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు, జేసీలు, అధికారులు తప్పనిసరిగా గోరుముద్ద అమలును పర్యవేక్షించాలని, స్వయంగా భోజనం చేసి నాణ్యతను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. లెర్న్ టు లెర్న్ కాన్సెప్ట్ లెర్న్ టు లెర్న్ కాన్సెప్ట్‌ను పాఠ్యప్రణాళికలో తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇంటర్నెట్, ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా వివిధ అంశాలను నేర్చుకోవడం, ఇతరులకు తెలియచేయడం లాంటి కాన్సెప్ట్‌ను పిల్లలకు నేర్పాలని అధికారులకు సూచించారు. 1,092 స్కూళ్లకు సీబీఎస్ఈ అఫిలియేషన్ సీబీఎస్ఈ అఫిలియేషన్‌పై కూడా ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. 1,092 స్కూళ్లలో 2021–22 విద్యా సంవత్సరంలో సీబీఎస్ఈ అఫిలియేషన్ జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. దేశంలో ఒకే ఏడాది 1092 స్కూళ్లకు సీబీఎస్ఈ అఫిలియేషన్ ఇవ్వడం రికార్డని చెప్పారు. ఈ విద్యార్థులు 2024–25 నాటికి పదో తరగతి పరీక్షలు రాస్తారని తెలిపారు. అంతర్జాతీయంగా 24 వేల స్కూళ్లకు మాత్రమే సీబీఎస్ఈ అఫిలియేషన్ ఉందని వివరించారు. మూడు దశలుగా మూడేళ్లలో... శాటిలైట్ ఫౌండేషనల్ స్కూల్స్, ఫౌండేషనల్ స్కూల్స్, ఫౌండేషనల్ ప్లస్ స్కూల్స్, ప్రీ హైస్కూల్స్, హైస్కూల్స్, హైస్కూల్ ప్లస్ స్కూళ్లపై సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందచేశారు. 2021–22 నుంచి 2023–24 వరకూ మూడు విద్యా సంవత్సరాల్లో మూడు దశలుగా నూతన విద్యా విధానం పూర్తిగా అమలు కానుంది. ఇందులో భాగంగా 25,396 ప్రైమరీ పాఠశాలలను యూపీ (అప్పర్ ప్రైమరీ) స్కూళ్లు, హైస్కూళ్లలో విలీనం చేస్తారు. తొలిదశ కింద ఈ విద్యా సంవత్సరంలో 2,663 స్కూళ్లను విలీనం చేసినట్లు అధికారులు తెలిపారు. 2,05,071 మంది విద్యార్థులు నూతన విద్యా విధానాన్ని అనుసరించి విలీనమైనట్లు చెప్పారు. మొత్తంగా ఈ ప్రక్రియలో 9.5 లక్షల మంది విద్యార్థులకు నూతన విద్యావిధానం ఈ సంవత్సరమే అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు. సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ.ఆర్.అనురాధ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (ఎండీఎం అండ్ శానిటేషన్) బి.ఎం.దివాన్, మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కృతికా శుక్లా, సర్వశిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రిసెల్వి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.చినవీరభద్రుడు, ఏపీఆర్ఈఐఎస్ సెక్రటరీ వి.రాములు తదితరులు పాల్గొన్నారు. ఎయిడెడ్‌పై బలవంతం లేదు ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వానికి అప్పగించడం అన్నది పూర్తిగా స్వచ్ఛందమని ముఖ్యమంత్రి జగన్ మరోసారి స్పష్టం చేశారు. వివిధ కారణాలతో నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రభుత్వం ఒక అవకాశం మాత్రమే కల్పిస్తుందని చెప్పారు. ఇష్టం ఉన్నవారు స్వచ్ఛందంగా ప్రభుత్వంలో విలీనం చేయవచ్చని లేదంటే యథాప్రకారం నడుపుకోవచ్చన్నారు. విలీనం చేస్తే వారి పేర్లు కొనసాగిస్తామన్నారు. తొలుత విలీనానికి అంగీకరించిన వారు నిర్ణయం మార్చుకుని తామే నిర్వహించుకుంటామంటే నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులకు మంచి సదుపాయాలు, నాణ్యమైన విద్య అందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. ఈ ప్రక్రియలో ఎక్కడా బలవంతం లేదని, అపోహలకు గురి కావద్దని, ఇందులో రాజకీయాలు తగవని సూచించారు. -
విద్యార్థుల హాజరుకు బయోమెట్రిక్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యార్థుల్లో సామర్థ్యాలు, నైపుణ్యాల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది. విద్యార్థులు పాఠశాలలకు రోజూ హాజరయ్యేలా చర్యలు చేపడుతోంది. ఏడాదిలో కనీసం 75 శాతం హాజరు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా విద్యార్థుల హాజరును బయోమెట్రిక్ ద్వారా నమోదు చేసేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ప్రభుత్వం మనబడి – నాడు–నేడు కింద కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు విద్యార్థుల తల్లులకు జగనన్న అమ్మఒడి కింద ఏటా రూ.15 వేలు, జగనన్న విద్యాకానుక కింద 3 జతల యూనిఫామ్, షూ, బెల్టు, బ్యాగు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్‌బుక్స్, డిక్షనరీ అందిస్తోంది. విద్యార్థులకు జగనన్న గోరుముద్ద కింద రుచికరమైన పౌష్టికాహారం అందిస్తోంది. వీటన్నిటి అంతిమ లక్ష్యం.. విద్యాప్రమాణాల పెంపే. 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి విద్యా ప్రమాణాలను పెంచాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే విద్యార్థులు రోజూ పాఠశాలలకు హాజరుకావాలి. ఈ నేపథ్యంలో వారి హాజరును పెంచేందుకు వీలుగా ‘అమ్మఒడి’ పథకానికి హాజరును అనుసంధానం చేస్తోంది. 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి పథకాన్ని వర్తింప చేయనుంది. 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు అమ్మఒడిని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం రూపొందించిన బయోమెట్రిక్ హాజరు యాప్‌ను ప్రయోగాత్మకంగా కృష్ణా జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తోంది. ఇందులో ఏవైనా లోపాలు తలెత్తితే.. వాటిని పరిష్కరించి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తేనుంది. 82 లక్షల మంది విద్యార్థులు రాష్ట్రంలో 61 వేలకు పైగా ఉన్న పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు 72 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యధిక శాతం మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో 6.49 లక్షల మంది, రెండో తరగతిలో 58 వేలకుపైగా చేరారు. వీరిలో 90 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరడం గమనార్హం. మొత్తం మీద ప్రభుత్వ స్కూళ్లలో ఈ ఏడాది 6.5 లక్షల మంది వరకు విద్యార్థులు అదనంగా చేరారు. వీరు క్రమబద్ధంగా పాఠశాలలకు హాజరయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేపడుతోంది. బయోమెట్రిక్ వల్ల విద్యార్థులకు క్రమశిక్షణ బయోమెట్రిక్ హాజరుపెట్టడం వల్ల విద్యార్థులకు క్రమశిక్షణ అలవడుతుంది. పిల్లలు పాఠశాలకు వెళ్లారో, లేదో తెలుస్తుంది. పారదర్శకత కోసం ప్రభుత్వం బయోమెట్రిక్ హాజరు ప్రవేశపెట్టడం మంచి పరిణామం. – గట్టెం అశోక్ కుమార్, విద్యార్థి తండ్రి, పెదపాడు, పశ్చిమ గోదావరి డ్రాపవుట్లు తగ్గుతాయి బయోమెట్రిక్ హాజరుతో డ్రాపవుట్లు తగ్గుతాయి. పాఠశాలకు ఎవరు రాలేదో వెంటనే తెలుస్తుంది. తద్వారా వారి తల్లిదండ్రులకు వెంటనే సమాచారం అందించవచ్చు. ఖచ్చితమైన హాజరు తెలియడంతో మధ్యాహ్న భోజన పథకంలో పారదర్శకత ఏర్పడుతుంది. – తోట ప్రసాద్, ఉపాధ్యాయుడు,మండల ప్రాథమిక పాఠశాల, పెదపాడు, పశ్చిమ గోదావరి -
ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగుతాం..
గుంటూరు ఎడ్యుకేషన్: ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తూ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చిన ఎయిడెడ్ ఉపాధ్యాయులు తమను తిరిగి ఎయిడెడ్‌కు పంపొద్దని డిమాండ్ చేస్తూ శనివారం డీఈవో కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. జిల్లాలోని ఆర్సీఎం యాజమాన్యంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. ఎయిడెడ్ ఉపాధ్యాయులకు సారథ్యం వహించిన మైఖేల్, రాజేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలోని ఆర్సీఎం యాజమాన్యంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న తమను ప్రభుత్వానికి అప్పగిస్తూ లిఖిత పూర్వకంగా తెలియపర్చారని, అయితే మళ్లీ వెనక్కు తీసుకుంటామంటూ యాజమాన్యం వేధిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యాల నిరంకుశ పోకడలతో బానిస జీవితాన్ని గడుపుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోకి వచ్చేందుకు అంగీకరించిన తమను తిరిగి వెనక్కు పంపొద్దంటూ డీఈవో ఆర్ఎస్ గంగాభవానీకి వినతిపత్రం ఇచ్చారు. -
సోషల్ మీడియాలో పోస్టులపై చర్యలేవి?
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చినప్పుడు.. రోడ్డుపై తాగి న్యూసెన్స్ సృష్టించిన నర్సీపట్నం వైద్యుడు డాక్టర్ సుధాకర్‌ను పోలీసులు అదుపు చేయడంపై విచారణకు ఆదేశించినప్పుడు.. ఇలా పలు సందర్భాల్లో హైకోర్టు తీర్పులిచ్చినప్పుడు న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టుల వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐపై గురువారం హైకోర్టు ధర్మాసనం మండిపడింది. నివేదికలు సమర్పించడం మినహా సీబీఐ దర్యాప్తులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. కేసు నమోదు చేసి ఏడాది కావస్తున్నా ఆ పోస్టులను తొలగించాలని సామాజిక మాధ్యమ కంపెనీలను ఎందుకు లిఖితపూర్వకంగా కోరలేదని నిలదీసింది. జడ్జిలపై ఇప్పటికీ కొందరు అనుచిత, అసభ్యకర పోస్టులు పెడుతూనే ఉన్నారని, అలాంటి వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించింది. 11 మందిని అరెస్టు చేశాం.. పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి విదేశాల్లో ఉంటూ నిత్యం పోస్టులు పెడుతుంటే ఎందుకు అరెస్ట్ చేయలేదని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. సీబీఐ తీరు చూస్తుంటే నిందితుల పక్షాన నిలబడుతున్నట్లు కనిపిస్తోందని పేర్కొంది. అభ్యంతరకర పోస్టుల వ్యవహారంలో 11 మందిని అరెస్ట్ చేశామని, ఐదుగురు బెయిల్‌పై విడుదల అయ్యారని సీబీఐ తరఫు న్యాయవాది సుభాష్‌రెడ్డి తెలిపారు. ప్రభాకర్ అరెస్ట్ విషయంలో ఇంటర్ పోల్ సాయం తీసుకుంటున్నామన్నారు. ఇప్పుడు ఏపీనే నా సొంత రాష్ట్రం.. ప్రస్తుతం ఏపీనే తన సొంత రాష్ట్రమని, ఇక్కడ ఇలాంటి చర్యలను అనుమతించబోనని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. వ్యతిరేక తీర్పులొచ్చినప్పుడు మొదట కోర్టులే లక్ష్యాలుగా మారుతున్నాయన్నారు. దీనిపై తాము వీధుల్లోకి వెళ్లి కొట్లాడే పరిస్థితి ఉండదన్నారు. అభ్యంతరకర పోస్టులపై ఏ చర్యలు తీసుకున్నారో తమ ముందు హాజరై స్వయంగా వివరణ ఇవ్వాలని విశాఖపట్నం సీబీఐ బ్రాంచ్ ఎస్పీని ధర్మాసనం ఆదేశించింది. వీటికి సంబంధించిన ‘యూఆర్ఎల్’ వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్‌ను ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ధర్మాసనం తరఫున జస్టిస్ లలిత ఈ ఉత్తర్వులు వెలువరించారు. -
చలో సర్కారు బడి.. అదే సమస్య మరి!
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలను వదిలిపెట్టి పెద్ద సంఖ్యలో విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. సర్కారు స్కూళ్లకు ఇప్పుడు అదే సమస్యగా మారింది. విద్యార్థుల సంఖ్య అమాంతంగా పెరగడంతో ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. దీనికితోడు విద్యా వాలంటీర్ల నియామకాలపై కూడా స్పష్టత లోపించడంతో బోధన ఇబ్బందికరంగా మారింది. ఈ విద్యా సంవత్సరంలో ప్రైవేట్ పాఠశాలలను విడిచి కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులు రెండున్నర లక్షల మందికిపైగా ఉంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే కొన్నిచోట్ల పాఠశాల మొత్తానికీ ఒకే టీచర్! మరికొన్ని చోట్ల వంద మందికి పైగా విద్యార్థులున్నా ఇద్దరే టీచర్లు. అదికూడా హెచ్ఎంతో కలిపి. హెచ్ఎం పాఠాలు చెప్పాలా? పాఠశాల నిర్వహణ, ఇతరత్రా పనులు చూసుకోవాలా? ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుదలకు తగ్గట్టుగా ఉపాధ్యాయులు లేక, చాలాచోట్ల ఒకరిద్దరు ఉపాధ్యాయులతో బోధన కష్టతరంగా మారుతోంది. కనీసం 20 వేల మంది వరకు టీచర్ల కొరత ఉందని ఉపాధ్యాయ సంఘాలంటున్నాయి. బోధనకు బోలెడు కష్టాలు.. తెలంగాణ వ్యాప్తంగా 42,575 స్కూళ్లుంటే, అందులో 30 వేల వరకూ ప్రభుత్వ పాఠశాలలే ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం 28 లక్షల మందికిపైగా సర్కారీ స్కూళ్లలో చదువుతున్నారు. కరోనాతో చితికిపోయిన ఆర్థిక పరిస్థితులు, బడుగు జీవులు పట్నాలు వదిలి పల్లె వాకిటకు చేరడం, ఇతరత్రా కారణాలతో ఇటీవలి కాలంలో ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు పెరిగాయి. కానీ ఉపాధ్యాయుల కొరత మాత్రం అలాగే ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో 1.05 లక్షల మంది ఉపాధ్యాయులుండగా..ఇంకా కనీసం 20 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని చెబుతున్నారు. టీచర్లు సరిపడా సంఖ్యలో లేకపోవడంతో బోధన కుంటుపడుతోందని విద్యారంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు పాఠశాలలను పర్యవేక్షించాల్సిన మండల విద్యాధికారులు కూడా లేరు. సీనియర్ ప్రధానోపాధ్యాయులకే ఆ బాధ్యతలను అప్పగించారు. దీనితో వారు పాఠశాల నిర్వహణ, మండలంలోని ఇతర పాఠశాలల పర్యవేక్షణపై దృష్టి పెట్టలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఆగిన హేతుబద్ధీకరణ ఈ ఏడాది ప్రభుత్వ స్కూళ్లు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపట్టాలని విద్యాశాఖ హడావుడి చేసింది. టీచర్లు తక్కువగా ఉంటే వేరేచోట నుంచి సర్దుబాటు చేయడం, ఎక్కువగా ఉంటే ఇతర స్కూళ్లకు పంపడం, విద్యార్థులు తక్కువ ఉన్న స్కూళ్లను విలీనం చేయడం వంటి కసరత్తు నిర్వహించాలని భావించింది. ఆ తర్వాతే టీచర్ పోస్టుల ఖాళీలు భర్తీ చేయడం గురించి ఆలోచిస్తామని చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఈ ప్రక్రియ ఆదిలోనే ఆగిపోయింది. ఉపాధ్యాయ సంఘాలు మొదలు అన్ని వైపుల నుంచి వచ్చిన అభ్యంతరాలు, విమర్శలతో ముందుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కరోనా నెమ్మదించి పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన మొదలైంది. విద్యా వలంటీర్ల మాటేమిటి? విద్యా వలంటీర్లను సరిపడా తీసుకుంటే సమస్య తీవ్రత కొంత తగ్గుతుందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి. కానీ హేతుబద్ధీకరణ జరగకుండా ముందుకెళ్లేది లేదని విద్యాశాఖ పట్టుబట్టింది. తాజాగా 5,823 తాత్కాలిక పోస్టులను మంజూరు చేసినా కస్తూరిబా బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలకే చాలామందిని కేటాయిస్తారు. దీంతో ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత యథాతథంగానే ఉండే అవకాశం కన్పిస్తోంది. 2017 డీఎస్సీ ద్వారా 7 వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినా ఇప్పటివరకు 2 వేల మందికి మాత్రమే నియామక ఉత్తర్వులిచ్చారు. పదవీ విరమణలతో ఖాళీ అయ్యే పోస్టులను మాత్రమే భర్తీ చేసుకుంటూ పోతుండగా కోర్టుల్లో కేసులు కూడా నియామకాలకు ఆటంకంగా మారాయని సమాచారం. ఏది ఏమైనా టీచర్ల కొరత తీర్చకపోతే క్రమంగా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లవైపు మొగ్గుచూసే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ► నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉర్దూ, ఇంగ్లిష్ మీడియంలో బోధన సాగుతోంది. ఇక్కడ 92 మంది విద్యార్థులున్నారు. వీళ్ళకు చదువు చెప్పేందుకు ఒకేఒక్క టీచర్.. అది కూడా హెచ్ఎం ఉన్నారు. ఆయన కూడా వేరే ప్రాంతం నుంచి డిప్యుటేషన్‌పైనే వచ్చారు. అంతమందికి బోధన ఎట్లా సాధ్యమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ జిల్లాలో 847 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిల్లో 67,546 మంది చదువుతున్నారు. వీరికి 3,400 మంది టీచర్లు అవసరం. కానీ ఉన్నది 3,176 మంది మాత్రమే. ► ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో 94 మంది విద్యార్థులకు నలుగురు ఉపాధ్యాయులున్నారు. ఇందులో ఇద్దరిని వేరే స్కూలుకు సర్దుబాటు చేశారు. దీంతో ఆ స్కూల్లో ఇద్దరే ఉపాధ్యాయులున్నారు. కొత్తపాలెం యూపీఎస్‌లో 110 విద్యార్థులుంటే ఇద్దరు, గుంటుపల్లి గోపవరం యూపీఎస్‌లో 80 మంది విద్యార్థులకు ఒకే టీచర్ ఉన్నారు. ► హనుమకొండలోని ప్రభుత్వ మార్కజీ హైస్కూల్లో 1,120 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ హెచ్ఎం పోస్టు ఖాళీ. దీంతో సీనియర్ ఉపాధ్యాయుడికి బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఇక్కడ 30 మంది టీచర్లున్నారు. విద్యార్థుల నిష్పత్తి ప్రకారం ఇంకా పది మంది ఉపాధ్యాయుల అవసరం ఉంది. విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి. లేకపోతే ప్రభుత్వ స్కూళ్ళపై పేదలు పెట్టుకున్న నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉంది. రా ష్ట్రంలో 594 మండలాలుంటే 20కి మించి మండల విద్యాధికారులు లేరు. తక్షణమే ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలి. పదోన్నతులు కల్పించాలి. లేకపోతే ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. – జంగయ్య, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు -
పాఠశాలల్లో కరోనా కలకలం
తుంగతుర్తి/దేవరకొండ/కట్టంగూర్/నాగర్‌కర్నూల్ క్రైం/లింగాలఘణపురం: రాష్ట్రంలోని పాఠశాలల్లో కరోనా కలకలం సృష్టిస్తూనే ఉంది. తాజాగా సూర్యాపేట, నల్లగొం డ, నాగర్‌కర్నూల్, జనగామ జిల్లాల్లోని పాఠశాలల్లో తొమ్మి ది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని బండరామారం జెడ్పీ ఉన్న త పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలికి బుధవా రం కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నల్లగొండ జిల్లా దేవరకొండ మండల పరిధిలోని కమలాపూర్ ప్రభుత్వ ప్రా థమిక పాఠశాలలో విద్యార్థులకు బుధవారం వైద్య సిబ్బంది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి పాజిటివ్‌గా తేలింది. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని దుగినవెల్లి ప్రా«థమిక పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు కరోనా బారిన పడ్డారు. నాగర్‌కర్నూల్‌లో నలుగురు విద్యార్థినులకు.. తరగతులు పునఃప్రారంభమైన నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నాగర్‌కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, జెడ్పీహెచ్ఎస్ (బాలికల)లో చేసిన పరీక్షల్లో మొత్తం నలుగురు విద్యార్థినులకు పాజిటివ్‌గా తేలింది. మిగతా విద్యార్థులకు గురువారం మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నాగారం ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం పరీక్షలు నిర్వహించగా ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా బారిన పడిన వారికి మెడికల్ కిట్లు అందించి, పాఠశాలలను శానిటైజ్ చేశారు. -
పాఠశాలల్లో పెరుగుతున్న కరోనా కేసులు
ములుగు రూరల్/లోకేశ్వరం(ముధోల్)/కురవి/అమరచింత: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ములుగు, నిర్మల్, మహబూబాబాద్ జిల్లాల్లోని పాఠశాలలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. ములుగు జిల్లా మల్లంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం నలుగురు ఉపాధ్యాయులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో పాఠశాలలో మంగళవారం వైద్యసిబ్బంది కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా మరో ఉపాధ్యాయురాలికి, ఆరుగురు విద్యార్థులకు పాజిటివ్‌గా తేలింది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం హవర్గ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం 63 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోద్గులగూడెం జెడ్పీ హైస్కూల్లో ఓ ఉపాధ్యాయుడు సోమవారం కరోనా బారిన పడ్డారు. దీంతో స్కూల్లో ఇతర ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులకు మంగళవారం పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చింది. పాజిటివ్ కేసులు నమోదైన పాఠశాలల్లో పంచాయతీ సిబ్బంది శానిటైజేషన్ పనులు నిర్వహించారు. పాజిటివ్ వచ్చిందని వదంతులు వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం 190 మంది విద్యార్థులకు కరోనా ర్యాపిడ్ టెస్టులు చేశారు. అయితే వారిలో ఆరుగురికి పాజిటివ్‌గా వచ్చిందని, విషయాన్ని విద్యాశాఖ, ఆరోగ్యశాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారనే వదంతులను సోషల్ మీడియాలో కొందరు పోస్టు చేశారు. అవి వైరల్ కావడంతో మిగతా విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రుల్లో కలవరం మొదలైంది. కలెక్టర్ షేక్ యాస్మిన్‌భాష ఆదేశాలతో డీఈఓ రవీందర్ మంగళవారం పాఠశాలకు చేరుకుని ఆ విద్యార్థులకు మరోసారి ర్యాపిడ్ టెస్టులతో పాటు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించారు. వారికి నెగెటివ్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
సర్కారీ బడుల్లో చదివించే టీచర్లకు అవార్డులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించే ప్రభుత్వ ఉపాధ్యాయులకు తగిన గుర్తింపు ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్ణయించారు. ఇలాంటి వారి పూర్తి వివరాలు అందించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను సోమవారం ఆమె ఆదేశించారు. ఈ ఏడాది జరిగే గురుపూజ దినోత్సవం సందర్భంగా వారిని సత్కరించాలని సబిత భావిస్తున్నారు. ప్రస్తుతం చాలావరకు కార్పొరేట్ విద్యా వ్యవస్థకు ఆకర్షితులవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ టీచర్లు కూడా తమ పిల్లలను ప్రైవేటు బడులకు పంపుతున్నారు. అయితే దీనికి భిన్నంగా కొంతమంది మాత్రం ప్రభుత్వ స్కూళ్ల ఉన్నతిని పెంచాలని తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చదివిస్తున్నారు. వారు ఆదర్శంగా నిలవాలనే ప్రయత్నం చేస్తున్నట్లు ఇటీవల విద్యాశాఖ జరిపిన ఓ సర్వేలో వెల్లడైంది. దీంతో ఇలాంటి ఉపాధ్యాయులను గౌరవించడం వల్ల ప్రభుత్వ బడుల ఉన్నతి మరింత పెరుగుతుందని సబిత భావిస్తున్నారు. -
ఆదేశాలు కరువు: తెలంగాణ ప్రైవేటు స్కూళ్లలో ఆన్‌లైనా.. ఆఫ్‌లైనా?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో నూరుశాతం ప్రత్యక్ష బోధన చేపట్టాలని కచ్చితమైన ఆదేశాలిచ్చిన విద్యాశాఖ, ప్రైవేటు స్కూళ్ల విషయంలో ఈ సాహసం చేయలేకపోతోంది. సెప్టెంబర్ ఒకటి నుంచి అంతా ప్రత్యక్ష తరగతులే ఉంటాయని విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించినా, మార్గదర్శకాలేవీ ఇప్పటివరకూ జారీ కాలేదని, అలాంటప్పుడు ప్రైవేటు స్కూళ్లను ఆఫ్‌లైన్ పెట్టాలని తామెలా కట్టడి చేయగలమని అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్ష విద్యాబోధనపై విద్యామంత్రి సోమవారం ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కోవిడ్ నిబంధనల అమలుపై జరుగుతున్న కసరత్తు గురించి అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యే స్కూళ్లలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా క్లాసులు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. రోజు విడిచి రోజుగానీ, సెక్షన్లు పెంచిగానీ విద్యాబోధన చేయబోతున్నట్టు మంత్రి దృష్టికి తెచ్చారు. క్లాసురూంలో ఎక్కువమందికి కోవిడ్ నిర్ధారణ అయితే తాత్కాలికంగా స్కూల్ నిర్వహణ ఆపి, పూర్తిస్థాయి పరీక్షల తర్వాతే పునఃప్రారంభించాలని పేర్కొన్నట్టు తెలిసింది. ప్రైవేటు రూటే వేరు.. ప్రైవేటు స్కూళ్ల గురించిన పలు విషయాలను అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ప్రైవేటు స్కూళ్లు ఇప్పటికే సగానికిపైగా సిలబస్ పూర్తిచేశాయని, కార్పొరేట్ స్కూళ్లు చాలావరకూ ఫీజులు వసూలు చేశాయని, దీంతో ప్రత్యక్ష బోధనతోపాటు ఆన్లైన్ విధానం కొనసాగుతుందని అవి చెబుతున్నాయని పేర్కొన్నారు. అయితే ప్రైవేట్‌లోనూ ఆఫ్‌లైన్ మాత్రమే ఉండాలన్న కచ్చిత నిబంధన పెడితే బాగుంటుందని అధికారులు మంత్రికి తెలిపినట్టు సమాచారం. దీనిపై మంత్రి స్పందించలేదని తెలిసింది. ఓ వారంపాటు ప్రైవేటు స్కూళ్లు ఆన్లైన్లో బోధన చేసినా పెద్దగా పట్టించుకోవద్దన్న అభిప్రా యం వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రభుత్వ స్కూళ్లలో ఆఫ్‌లైన్ కచ్చితమని చెప్పి, ప్రైవేటు స్కూళ్లకు వెసులుబాటు ఇవ్వడంపై విద్యాశాఖ అధికారులే పెదవి విరుస్తున్నారు. కాలేజీ విద్యార్థులకు వ్యాక్సిన్ ధ్రువీకరణ ఇంటర్, ఆపై తరగతుల విద్యార్థులు టీకా వేయించుకున్నట్టు ధ్రువీకరణ తప్పనిసరి చేయాలని నిర్ణ యించారు. హాస్టల్ విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు చేయించి ప్రవేశం కల్పించాలనే ప్రతిపాదన వచ్చింది. అయితే ఉన్నతవిద్యను అభ్యసించే విద్యార్థులకు ఆన్లైన్ బోధన కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. హాజరుశాతం తప్పనిసరి అనే నిబంధన ఉండబోదని ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి పేర్కొన్నారు. విద్యాసంస్థలు మొదలైన వారం తర్వాతే వాస్తవ పరిస్థితిని అంచనా వేయవచ్చని మంత్రి, విద్యాశాఖ అధికారులు అభిప్రాయపడినట్టు తెలిసింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మరుగుదొడ్లు, క్లాసు రూంల శుభ్రతపై పారిశుధ్య కార్మికులు విముఖత వ్యక్తం చేస్తున్నారని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. కాగా, కోవిడ్ నిబంధనలకు లోబడి సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లను ప్రారంభించేలా జాగ్రత్తలు తీసుకునే బాధ్యత ప్రధానోపాధ్యాయులదే అని విద్యా శాఖ సోమవారం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. జిల్లా అధికారులు రోజూ పర్యవేక్షిస్తూ నివేదికలు పంపాలని పేర్కొంది. సామాజిక దూ రం పాటించేలా విద్యార్థులను ప్రోత్సహించాలని కోరింది. తల్లిదండ్రుల మనోభావాలకే ప్రాధాన్యం : సబిత విద్యాసంస్థల్లో తల్లిదండ్రుల మనోభావాలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సమావేశం వివరాలను ఆమె మీడియాకు వివరిస్తూ, రాష్ట్రంలో విద్యా సంస్థలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనల అమలులో అలసత్వాన్ని ప్రభుత్వం సహించబోదన్నారు. పారిశుధ్య నిర్వహణ, శానిటైజేషన్ పూర్తి చేసేందుకు మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు విధిగా మాస్కులు ధరించేలా చూడాలన్నారు. విద్యార్థుల్లో ఎవరికైనా జ్వర సూచన ఉంటే ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపళ్లు వెంటనే సమీపంలోని పీహెచ్‌సీకి తీసుకువెళ్లి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఒకవేళ కోవిడ్ నిర్ధారణ అయితే విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించాలని కోరారు. సమావేశంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు సందీప్ సుల్తానియా, దేవసేన తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా కేడర్‌గా టీచర్ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మండల, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ పోస్టులను లోకల్ కేడర్‌గా ప్రభుత్వం నిర్ధారించింది. అయితే, వీరందరికి కలిపికాకుండా వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం జీవోలు 254, 255, 256లను జారీ చేశారు. హైకోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వ, జిల్లాపరిషత్, మండల పరిషత్ యాజమాన్యంలోని ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, వాటి తత్సమాన పోస్టులను జిల్లా కేడర్‌గా ప్రభుత్వం నిర్ధారించింది. వాటి ఆధారంగానే భవిష్యత్తులో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని పేర్కొంది. టీచర్ల పదోన్నతులు, బదిలీలకు ఇవే ఆధారం కానున్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని గెజిటెడ్ హెడ్మాస్టర్ గ్రేడ్–1, గ్రేడ్–2 పోస్టులను మల్టీ జోనల్ కేడర్‌గా చేసింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లోని గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్–1, గ్రేడ్–2 పోస్టుల లోకల్ కేడర్ ఆర్గనైజేషన్‌కు సంబంధించిన ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. హైస్కూల్ హెడ్మాస్టర్ పోస్టులు గతంలో జోనల్ కేడర్‌లో ఉండగా, ఇపుడు మల్టీ జోన్ పరిధిలోకి తెచ్చింది. ఆ పోస్టు బదలాయింపు రాష్ట్ర విద్యా శిక్షణా, పరిశోధన సంస్థ (ఎస్సీఈఆర్టీ), కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (సీటీఈ), ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (ఐఏఎస్ఈ)లలో లెక్చరర్ పోస్టులను మల్టీ జోనల్ కేడర్‌కు ప్రభుత్వం బదలాయించింది. ఈ మేరకు గతంలో జారీ చేసిన జీవోకు సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. -
ప్రైవేటుకు గుడ్‌బై.. సర్కారు బడికి జై
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలకు ప్రవేశాల తాకిడి పెరుగుతోంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో సర్కారు బడుల్లో చేరుతున్నారు. గతంలో పిల్లలు వివిధ కారణాలతో సర్కారు బడులను వదిలిపెట్టి ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్లు పొందేవారు. కానీ ఇప్పుడు ప్రైవేటు పాఠశాలలకు గుడ్‌బై కొట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు సర్కారు పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా 2,39,449 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. 2021–22 విద్యాసంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రెండు నెలల వ్యవధిలోనే ఇంత పెద్ద సంఖ్యలో పిల్లలు సర్కారు బడుల్లో చేరడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల విద్యాసంస్థలతో కలిపి అన్ని ప్రభుత్వ యాజమాన్యాల్లో 27.5 లక్షల విద్యా ర్థుల నమోదు ఉండగా.. ఇప్పటికే దాదాపు 10% విద్యార్థులు అదనంగా అడ్మిషన్లు తీసుకోవడంపై విద్యాశాఖ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా దెబ్బ .. ప్రైవేటు బాదుడు కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో దాదాపు ఏడాదిన్నరగా విద్యాసంస్థలు మూతబడి ఉన్నాయి. కొన్ని రోజులు పాక్షికంగా తెరిచినా పూర్తిస్థాయిలో విద్యార్థులను ప్రభుత్వం అనుమతించలేదు. ఉపాధ్యాయులు మాత్రమే విధులకు హాజరవుతున్నారు. ఇప్పటివరకు బోధన ప్రక్రియంతా ఆన్లైన్ పద్ధతిలోనే కొనసాగుతోంది. ప్రైవేటు పాఠశాలల్లోనూ ఇలాగే బోధన జరుగుతున్నా.. ఫీజుల కింద రూ.వేలు డిమాండ్ చేస్తున్నాయి. సకాలంలో చెల్లించకపోతే విద్యార్థులు, తల్లిదండ్రుల్ని ఒత్తిడికి గురి చేస్తున్నాయి. బోధన కార్యక్రమాలు అంతంతగానే ఉండటం, కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో పలువురు తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యాసంస్థల వైపే మళ్లుతున్నారు. సర్కారు బడుల్లో సైతం అన్ని సౌకర్యాలతో నాణ్యమైన విద్య అందుబాటులో ఉండటంతో.. మరో ఆలోచన లేకుండా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఒకటో తరగతికి బాగా గిరాకీ రాష్ట్రంలో ఇప్పటివరకు 2,39,449 కొత్త అడ్మిషన్లు నమోదు కాగా.. ఇందులో కేవలం ఒకటో తరగతిలోనే 1,25,034 అడ్మిషన్లు జరిగాయి. గత విద్యా సంవత్సరం 12 నెలల కాలంలో ఒకటో తరగతి అడ్మిషన్లు 1,50,071 కాగా.. ఆ సంఖ్యతో పోలిస్తే ఈ ఏడాది రెండు నెలల్లోనే 80 శాతానికి పైగా చేరికలు చోటు చేసుకున్నాయి. ఇక ప్రైవేటు విద్యా సంస్థల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులు 1,14,415 మంది ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. వీరంతా ఒకటి నుంచి 12వ తరగతి వరకు వివిధ క్లాసుల్లో అడ్మిషన్లు పొందారు. విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలతో పాటు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ), ఆదర్శ పాఠశాలలు (మోడల్ స్కూల్స్), పట్టణ ఆశ్రమ పాఠశాలలు (యూఆర్ఎస్)ల్లో కొత్త చేరికలు జరిగాయి. 2019–20 విద్యా సంవత్సరంలో ఒకటినుంచి 12వ తరగతి వరకు 68,813 కొత్త ప్రవేశాలు నమోదు కాగా.. ఈ ఏడాది ఇప్పటికే దాదాపు మూడున్నర రెట్లు అడ్మిషన్లు జరగడం గమనార్హం. బడులు పూర్తిగా తెరిస్తే రెట్టింపు ప్రవేశాలకు అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సర్కారీ బడికి సై!
సాక్షి ప్రతినిధి, వరంగల్: కరోనా ఉపాధి అవకాశాలను దారుణంగా దెబ్బతీసింది. ప్రజల ఆర్థిక స్థితిగతులను తలకిందులు చేసింది. ఈ పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి వర్గాలకు పిల్లల చదువులు భారంగా మారిపోయాయి. ప్రైవేట్ పాఠశాలల్లో వేలాది రూపాయల ఫీజులు చెల్లించలేక తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరగతులు సరిగా జరగకున్నా ప్రైవేటు యాజమాన్యాలు ఫీజులు ముక్కు పిండి మరీ వసూలు చేస్తు న్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెరుగుతున్నాయి. ప్రైవేటులో ఫీజులు కట్టలేక,, చాలా వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ఉండటం, అర్హులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన బోధన కూడా కొనసాగుతుండటంతో తల్లిదండ్రులు సర్కారీ స్కూళ్ల వైపు మొగ్గుచూపుతున్నారు. దీనికి తోడు 8వ తరగతిలోపు విద్యార్థులు టీసీ లేకుండానే ఎక్కడైనా అడ్మిషన్ పొందే వెసులుబాటు ఉండటంతో మరో ఆలోచన లేకుండా పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. కొన్ని స్కూళ్లు ‘నో అడ్మిషన్స్’బోర్డులు కూడా పెడుతుండటం ప్రభుత్వ స్కూళ్లకు పెరుగుతున్న ఆదరణను స్పష్టం చేస్తోంది. 2020–21 వరకు తక్కువ చేరికలే.. 2016–17లో రాష్ట్రంలోని పాఠశాలల్లో 58.67 లక్షల మంది విద్యార్థులు ఉంటే అందులో ప్రభుత్వ స్కూళ్లలో 48.29 శాతం మంది, ప్రైవేటు పాఠశాలల్లో 51.71 శాతం మంది ఉన్నారు. అలాగే 2017–18, 2018–19లో కూడా ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు, చేరికల శాతం రెండూ ప్రైవేటు స్కూళ్ల కంటే తక్కువగానే ఉన్నాయి. 2016 విద్యా సంవత్సరంతో పోలిస్తే 2019–20లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 2.15 శాతం మేర తగ్గిపోయింది. 2020–21లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే కరోనా విసిరిన పంజాతో ఉద్యోగాలు కోల్పోయి, ఆదాయాలు పడిపోయిన పేద, మధ్యతరగతి వారంతా ఈసారి ప్రభుత్వ పాఠశాలల బాట పట్టారు. ముఖ్యంగా పట్టణాల్లో, మండల కేంద్రాల్లోని సర్కారీ స్కూళ్లలో అడ్మిషన్లు పెరుగుతున్నాయి. జిల్లాల వారీగా చూస్తే.. ♦వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రభుత్వ పరిధిలోని 562 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో జోరుగా కొత్త అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో సీట్లు దాదాపు నిండడంతో ఇతర గ్రామాల వారికి ‘నో అడ్మిషన్స్’’బోర్డు పెట్టారు. ♦నల్లగొండ జిల్లాలో 2,120 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. పది రోజుల్లో కొత్తగా 3,455 మంది విద్యార్థులు ఈ పాఠశాలల్లో చేరారు. అత్యధికంగా 6వ తరగతిలో 1,793 మంది చేరగా, 1వ తరగతిలో 1,154 మంది చేరారు. నల్లగొండ పట్టణం, మండలంలోని పాఠశాలల్లో అత్యధికంగా 557 మంది విద్యార్థులు చేరారు. ♦ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా 2,361 మంది విద్యార్థులు చేరారు. అత్యధికంగా నేలకొండపల్లి మండలం రాయగూడెం పాఠశాలలోని 1వ తరగతిలో 160 మంది చేరారు. ♦భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని తరగతులు కలిపి కొత్తగా 2,996 అడ్మిషన్లు అయ్యాయి. అత్యధికంగా 3వ తరగతిలో పిల్లలు చేరారు. గౌతమ్‌పూర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ తొమ్మిదవ తరగతిలో 190 మంది విద్యార్థులు, ఆనందఖని ఉన్నత పాఠశాలలో 734 మంది ఉన్నారు. ♦నిజామాబాద్ జిల్లాలో 3,245 అడ్మిషన్లు జరిగాయి. బోర్గాం(పి) హైస్కూల్లో 6వ తరగతిలో 89 మంది ప్రవేశాలు పొందారు. కరీంనగర్ జిల్లాలో 6,7,8 తరగతుల్లో 3,061 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఎక్కువమంది పిల్లలు 6వ తరగతిలో చేరారు. ♦రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 700 మంది విద్యార్థులు చేరారు. మంచిర్యాల జిల్లాలో మొత్తం స్కూళ్లు 753 ఉండగా 1వ తరగతిలో 143 మంది 2 నుంచి 10వ తరగతి వరకు 254 మంది విద్యార్థులు జాయిన్ అయ్యారు. ♦సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతిలో చేరేందుకు 360 దరఖాస్తులు వచ్చాయి. కేవలం 60 సీట్లు మాత్రమే ఉండడంతో మిగతావారికి అడ్మిషన్లు నిరాకరించారు. కరోనాతో ఆర్థిక పరిస్థితి తారుమారైంది నాకు ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు. గత ఏడాది వరకు సూర్యాపేట జిల్లా కోదాడలోని ప్రైవేట్ పాఠశాలల్లో చదివించాను. కరోనా నేప«థ్యంలో పెట్టుబడి డబ్బులు అందక, వ్యవసాయం సరిగా సాగక ఆర్థిక పరిస్థితి తారుమారైంది. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు భారంగా మారాయి. దీంతో ముగుర్నీ బుద్ధారం ప్రభుత్వ పాఠశాలలో 2, 3, 4 తరగతుల్లో చేర్పించా. ఇక్కడ ఇంగ్లిష్ మీడియం కూడా ఉంది. ఉపాధ్యాయుల బోధన కూడా బాగుందని చాలామంది చెప్పారు. గణనీయంగా పెరుగుతున్న అడ్మిషన్లు ప్రభుత్వ పాఠశాలల్లో ఈసారి అడ్మిషన్లు గణనీయంగా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధం గా ఇప్పటివరకు జిల్లాలో ఒకటో తరగతిలో 861 అడ్మిషన్లు వచ్చాయి. రెండో తరగతి నుంచి పదవ తరగతి వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. సుమారు నాలుగు వేల పైచిలుకు నూతన అడ్మిషన్లు జరగొచ్చని అంచనా వేస్తున్నాం. -
Nadu Nedu: బడి భలేగుంది
నాడు ► ముళ్లకంపలు.. పరిసరాల్లో పందులు, కుక్కల విహారం.. విరిగిపోయిన తలుపులు.. పాడైపోయిన టీవీ.. పగుళ్లిచ్చిన గోడలు, పెచ్చులూడి బూజు పట్టిన శ్లాబ్.. పని చేయని ట్యూబ్ లైట్.. నీళ్లు, తలుపులు లేని టాయిలెట్.. ఇంటర్వెల్లో ఇంటికి పరుగెత్తే అమ్మాయిలు.. కిర్రు కిర్రుమని శబ్దం చేసే అయ్యవారు కుర్చీ.. ఇలా ఒకటా.. రెండా.. ప్రభుత్వ స్కూళ్లలో మొన్నటి దాకా అన్నీ సమస్యలే. నేడు ► రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు–నేడు కార్యక్రమంతో ప్రభుత్వ స్కూళ్లకు మహర్దశ మొదలైంది.. పది పన్నెండు రకాల వసతుల కల్పనతో ఇప్పుడవి కళకళలాడుతున్నాయి. బాల బాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు నిర్మించారు. నిరంతరం నీరు, విద్యుత్ సరఫరా ఉంటోంది. చూడచక్కని రంగులతో అల్లంత దూరం నుంచే ఆకట్టుకుంటున్నాయి. కార్పొరేట్ విద్యా సంస్థలను మరిపించేలా ముస్తాబయ్యాయి. ‘అది మా ఊరి సర్కారు బడి’ అని సగర్వంగా చెప్పుకునేలా రూపురేఖలు మార్చుకున్నాయి. నాడు సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడప నగరం జయనగర్‌కాలనీలోని బాలికల హైస్కూల్‌కు రెండేళ్ల క్రితం వరకు ఓ మోస్తరు వర్షం వచ్చినా సెలవు ఇచ్చేవారు. ఏకంగా తరగతి గదుల్లోకి వర్షం నీరు వచ్చేది. 450 మందికి పైగా బాలికలు ఉన్న ఈ పాఠశాలలో కేవలం రెండు బాత్రూమ్లు మాత్రమే ఉండేవి. ఇంటర్వెల్లో పిల్లలు క్యూకట్టేవారు. నీళ్లు ఎక్కువగా తాగితే మూత్రం వస్తుందనే భయంతో చాలా మంది తక్కువగా తాగేవారు. ఒక్క పదవ తరగతి మినహా మిగతా తరగతుల వారందరూ కింద కూర్చొని విద్యనభ్యసించేవారు. వేసవిలో అయితే ఉక్కపోతతో పిల్లలు విలవిల్లాడిపోయేవారు. ఒక్క ఫ్యాన్ కూడా ఉండేది కాదు. ప్రహరీ ఉండేది కాదు. టీవీ ఒకటి ఉందనే విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు. విద్యార్థులకు సరిపడా తరగతి గదులుండేవి కాదు. ప్రహరీ లేనందున రాత్రిళ్లు ఆకతాయిలకు నిలయంగా ఉండేది. ఇంతటి దయనీయ పరిస్థితిలో ఉన్న ఈ పాఠశాల రూపురేఖలు ‘నాడు–నేడు’తో ఈ ఏడాది పూర్తిగా మారిపోయాయి. వర్షం నీరు లోపలకు రాకుండా మట్టి తోలించి సరిచేశారు. రూ.25,91,562తో ఎనిమిది టాయిలెట్లను తీర్చిదిద్దారు. రూ.43,20,753తో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.15,19,094తో అందరికీ çఫర్నిచర్ ఏర్పాటు చేశారు. మొత్తంగా రూ.1,09,97,028 నిధులతో తాగునీరు, ప్రహరీ, విద్యుత్, రంగులు, ల్యాబ్, అదనపు గదులు, ఇతరత్రా సౌకర్యాలన్నీ కల్పించారు. ఇలా ప్రతి ఊళ్లోనూ ప్రభుత్వ స్కూళ్లు సర్వాంగ సుందరంగా మారిపోతున్నాయి. రాజమహేంద్రవరం సీతంపేటలోని ప్రభుత్వ స్కూల్లో ఏర్పాటు చేసిన విద్యార్థుల ఆట వస్తువులు ప్రత్యక్ష తరగతుల నాటికి పనులు పూర్తి రాష్ట్రంలో విద్యా రంగ సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’ తొలి దశ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఆగస్టు 16 నుంచి పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని భావిస్తున్నందున ఆలోగా మొత్తం పనులు పూర్తి చేసేలా పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే 97 శాతం పనులు పూర్తి చేసిన అధికారులు మిగిలిన పనులను నిర్ణీత కాలానికన్నా ముందే పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు ఆహ్లాదకర వాతావరణంలో ఆనందంగా తమ అభ్యసనం సాగించేలా స్కూళ్లను తీర్చిదిద్దారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాసిన గత ప్రభుత్వం.. వేలాది పాఠశాలలను మూత వేయించడమే కాకుండా తక్కిన వాటిని కూడా నిర్వీర్యం చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ తొలి ప్రాధాన్యంగా విద్యా రంగంపై దృష్టి సారించారు. అధ్వాన దశలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్ది, పిల్లలు ఆహ్లాదకర వాతావరణంలో చదువులు కొనసాగించేలా చర్యలు చేపట్టారు. తుది దశలో పనులు ► రాష్ట్రంలో 45 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో విద్యార్థులు, టీచర్లకు అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. మూడు దశల్లో అన్ని స్కూళ్లను అభివృద్ధి చేసేలా ప్రణాళిక రూపొందించారు. ► తొలిదశలో 15,716 స్కూళ్లలో 1,14,903 పనులు చేపట్టారు. ఇప్పటి వరకు రూ.3,360 కోట్ల ఖర్చుతో 1,11,770 పనులు పూర్తి చేశారు. మిగిలిన పనులు కూడా చాలా వరకు చివరి దశకు చేరుకున్నాయి. రంగులు వేయడం వంటి పనులు మిగిలి ఉన్నాయి. వీటిని స్కూళ్లు తెరవడానికి ముందుగానే పూర్తయ్యేలా పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపట్టింది. 4,171 స్కూళ్లకు ప్రహరీలను కూడా నిర్మించారు. ► ఈ పనులు త్వరితగతిన చేపడుతున్న జిల్లాలకు విద్యా శాఖ ర్యాంకులను ఇస్తోంది. ర్యాంకుల అగ్రస్థానంలో 1 నుంచి 5వ ర్యాంకు వరకు ప్రకాశం, కృష్ణా, వైఎస్సార్, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలు ఉండగా.. చివరి మూడు స్థానాల్లో వరుసగా శ్రీకాకుళం, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. ► నాణ్యతలో రాజీ లేకుండా పనులను చేయించారు. మరుగుదొడ్లలో వాడే పరికరాలు, మంచినీటి సరఫరా పరికరాలు, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు వంటివన్నీ బ్రాండెడ్ వస్తువులను అమరుస్తున్నారు. ► నిర్మాణ పనుల్లోనూ పది కాలాల పాటు నిలిచి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉత్తమ కంపెనీల టైల్స్, గ్రానైట్ వంటివి వినియోగించి పాఠశాలలకు కొత్త అందాలను సమకూర్చారు. చదువుల లక్ష్యం నెరవేరేలా సదుపాయాలు ► పాఠశాలలను విద్యార్థులకు నిజమైన అభ్యాస కేంద్రాలుగా, ఉన్నత ప్రమాణాలతో కూడిన జ్ఞానాన్ని అందించే పవిత్ర దేవాలయాలుగా ప్రభుత్వం భావిస్తోంది. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా పాఠశాలల్లో చదువులకు అనువైన వాతావరణాన్ని కల్పించేలా ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమంలో అనేక మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. ► రన్నింగ్ వాటర్ కలిగిన మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం, మేజర్.. మైనర్ రిపేర్లు, పెయింటింగ్.. ఫినిషింగ్, స్కూలు విద్యుదీకరణ, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్ల ఏర్పాటు, విద్యార్థులు, టీచర్లతో సహా పాఠశాలకు అవసరమైన ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, ఇంగ్లిష్ ల్యాబ్‌లు, కాంపౌండ్ వాల్స్, కిచెన్ షెడ్లు, డైనింగ్ హాళ్లు.. తదితర వసతులను కల్పిస్తోంది. ► వివిధ యాజమాన్యాల స్కూళ్లు ఉండడంతో పాటు, వేలాది స్కూళ్లలో లక్షల్లో పనులకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించాల్సి ఉండడంతో ప్రభుత్వం ఈ కార్యక్రమంలో పలు శాఖల ఇంజనీరింగ్ విభాగాలను భాగస్వాములను చేసింది. రెండో విడత పనులకు అనుమతులు మొదటి విడత పనులు దాదాపు పూర్తి కావస్తుండడంతో రెండో విడత నాడు–నేడు పనులకు విద్యా శాఖ చర్యలు ప్రారంభించింది. ఈ దశలో 16,345 స్కూళ్లలో రూ.4,446 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం మార్చి 30వ తేదీన పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. రెండో విడతలో 12,678 స్కూళ్లు, 1,668 ప్రభుత్వ హాస్టళ్లు, 473 జూనియర్ కాలేజీలు, 17 డైట్ సంబంధిత విద్యా సంస్థలు, 391 గురుకుల రెసిడెన్షియల్ స్కూళ్లు, 672 మండల రిసోర్సు కేంద్రాలు, 446 భవిత సెంటర్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. ఈసారి కిచెన్ షెడ్లు, స్కూళ్ల ప్రహరీలు, అదనపు తరగతి గదులను కూడా నిర్మించేలా చర్యలు చేపడుతున్నారు. హాస్టళ్లలో ఫర్నిచర్ కింద విద్యార్థులకు మంచాలు, పరుపులు, బెడ్షీట్లు, బ్లాంకెట్లు, అల్మారాలు తదితరాలను సమకూర్చనున్నారు. జూనియర్ కాలేజీల్లో ల్యాబ్ పరికరాలు, ఫర్నిచర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తారు. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్టులో ఈ విద్యా సంస్థలను ఆహ్లాదకరంగా, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. విశాఖ జిల్లా గిడిజాల గ్రామంలోని పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి కుళాయిలు నమ్మలేకపోతున్నా.. మా ఊరిలో విరిగిపోయిన పెంకులు, పగిలిన గచ్చులతో ఉండే పాఠశాల నేడు పెద్ద ఆఫీసు మాదిరిగా మారింది. మొన్నామధ్య అటుగా వెళ్లిన నేను పాఠశాలను చూసి ఆశ్చర్యపోయాను. చిన్నప్పుడు నేను చదువుకున్న పాఠశాల ఇదేనా.. ఇప్పుడు ఎంత అందంగా, అద్భుతంగా ఉందనిపించింది. నిజంగా సీఎం జగన్‌కు ఓ విద్యార్థి తల్లిగా వందనం చేస్తున్నా. ఇటువంటి ఆధునిక భవనాలలో ప్రశాంత వాతావరణంలో విద్యా బోధనకు శ్రీకారం చుట్టారు. ఈ వాతావరణం విద్యార్థులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.– చోడి పార్వతి, వండవ, వీరఘట్టం మండలం, శ్రీకాకుళం ప్రైవేట్ స్కూల్ కంటే బావుంది మా ఊళ్లోని స్కూల్లో నా కుమారుడు రిçశ్వంత్ చదువుతున్నాడు. గతంలో స్కూల్లో బాత్రూములు, తాగునీరు, కరెంట్ లాంటివేమీ లేవు. ఇప్పుడు జగనన్న వచ్చాక రూపురేఖలు మారిపోయాయి. ఆడ పిల్లలకు, మగ పిల్లలకు వేర్వేరుగా మరుగుదొడ్లు వచ్చాయి. ఆర్ఓ ప్లాంట్ పెట్టారు. స్కూల్లో బల్లలు, ఫ్యాన్లు, బల్బులు వంటివి ఏర్పాటు చేశారు. ప్రైవేటు స్కూల్ కంటే మంచి వాతావరణం కనిపిస్తోంది. – నాగరాణి, పాపానాయుడుపేట, ఏర్పేడు మండలం, చిత్తూరు మా స్కూల్ ఇప్పుడు చాలా బావుంది మా స్కూళ్లో ఇదివరకు బాతు రూమ్ ఉన్నప్పటికీ శుభ్రంగా ఉండేది కాదు. డోర్లు ఊడిపోయి, విరిగిపోయి ఉండేవి. నాడు–నేడు పథకం కింద బాత్ రూములు చాలా బాగా కట్టించారు. టైల్స్, వెస్ట్రన్ మోడల్ కమోడ్, ట్యాపులు అన్నీ అందుబాటులో ఉన్నాయి. నీటి సౌకర్యం కూడా ఉంది. కొత్త బెంచీలు వేశారు. ఇప్పుడు మా స్కూల్ చాలా బాగుంది. – కర్రి శ్యామ్యూల్, 9వ తరగతి, జెడ్పీ ఉన్నత పాఠశాల, ఆకివీడు, పశ్చిమగోదావరి -
9, 10 తరగతుల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు అమ్మఒడి పథకం కింద ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. డ్యుయెల్ కోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్ డిస్క్, 14 ఇంచ్‌ల స్క్రీన్, విండోస్ 10 (ఎస్టీఎఫ్ మైక్రోసాఫ్ట్), ఓపెన్ ఆఫీస్ (ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్)ల కాన్ఫిగరేషన్‌తో ల్యాప్‌టాప్‌లు అందించనుంది. వీటికి మూడేళ్ల వారెంటీ ఉంటుంది. అమ్మఒడి ఆర్థిక సాయానికి బదులు తమకు ల్యాప్‌టాప్‌లు కావాలని కోరుకునే విద్యార్థులకు వీటిని అందిస్తుంది. ల్యాప్‌టాప్‌లకు మెయిన్టెనెన్స్ సమస్యలు ఎదురైతే ఫిర్యాదు ఇచ్చిన వారంలోపు పరిష్కరించేలా సదరు కంపెనీకి షరతు విధిస్తున్నారు. ఫిర్యాదులను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించాల్సి ఉంటుంది. -
స్కూళ్లు రోజూ తెరవాల్సిందే: పాఠశాల విద్యాశాఖ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ రోజూ తెరవాల్సిందేనని, టీచర్లు మాత్రమే ఆల్టర్నేటివ్ (రోజువిడిచి రోజు) విధానంలో విధులకు హాజరు కావాల్సి ఉంటుందని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. జూలై ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను తెరిచేందుకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ జూన్ 30న మెమో 1441536ను జారీ చేశారు. స్కూళ్లకు టీచర్లు ఒకటో తేదీన అందరూ హాజరు కావాలని, మరునాటి నుంచి రోజు విడిచి రోజు రావాలని అందులో పేర్కొన్నారు. విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ రప్పించవద్దని స్పష్టం చేశారు. 2వ తేదీ నుంచి ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ టీచర్లు ఆల్టర్నేటివ్ రోజుల్లో స్కూళ్లకు హాజరు కావాలని సూచనల్లో ఉంది. ఈ మెమోలోని అంశాలపై టీచర్ల నుంచి సందేహాలు వ్యక్తం కావడంతో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు వివరణ ఇచ్చారు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లు రోజూ 50 శాతం సిబ్బందితో నడవాలని పేర్కొన్నారు. టీచర్లు మాత్రం ఆల్టర్నేటివ్ రోజుల్లో హాజరు కావచ్చని, స్కూలు మాత్రం రోజూ నడవాలన్నారు. సింగిల్ టీచర్లున్న స్కూళ్లు కూడా రోజూ హాఫ్ డే ఉండాలన్నారు. ఆ స్కూళ్ల టీచర్లు రోజూ స్కూలుకు హాజరు కావలసి ఉంటుందని వివరించారు. ఏ రోజు ఏ టీచర్ హాజరు కావాలన్న అంశాన్ని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నిర్ణయిస్తారని పేర్కొన్నారు. -
టీచర్లకు ఇంగ్లిష్ సర్టిఫికెట్ కోర్సు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్ల టీచర్లు తమ ఇంగ్లిష్ ప్రావీణ్యాన్ని మెరుగుపరచుకునేందుకు నెల రోజుల పాటు శిక్షణతో కూడిన సర్టిఫికెట్ కోర్సు అందించాలని ఏపీ సమగ్ర శిక్ష నిర్ణయించింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే లక్ష్యంలో భాగంగా దీన్ని అమలు చేస్తోంది. సర్టిఫికెట్ ఇన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్(సీఈఎల్‌టీ) శిక్షణను అందించనున్నారు. ఈనెల 19 నుంచి ఆగస్టు 17 వరకు నెల పాటు ఆన్లైన్ ద్వారా రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్(సౌత్ ఇండియా, బెంగళూరు) సంస్థ ఈ శిక్షణ ఇవ్వనుంది. అర్హులైన వారిని ఎంపిక చేయాలని ఇప్పటికే అన్ని జిల్లాల విద్యాధికారులకు సమగ్ర శిక్ష ఆదేశాలిచ్చింది. ఈ ట్రైనింగ్‌కు జిల్లా నుంచి 25 మంది చొప్పున టీచర్లను ఎంపిక చేయనున్నారు. ఆన్లైన్ శిక్షణకు ఆసక్తి వ్యక్తీకరణను టీచర్ల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, విభిన్న ప్రతిభావంతులైన వారికి చోటు కల్పించాలి. కొత్తగా నియమితులైన టీచర్లకు ప్రాధాన్యమివ్వాలి. ఇంతకుముందు శిక్షణ పొందిన వారిని ఎంపిక చేయకూడదు. 50 ఏళ్లలోపు వయసున్న వారినే ఎంపిక చేయాలి. టీచర్లకు ఇంటర్నెట్ సదుపాయం, ఇతర డిజిటల్ డివైజ్‌లు అందుబాటులో ఉండాలి. అలాగే ఇంగ్లిష్ బోధిస్తున్న వారిని గుర్తించి డీఈవోలు, ఏపీవోలు ఈనెల 5లోపు జాబితా పంపించాలని సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. -
Andhra Pradesh Government: నాణ్యమైన విద్యకు బాటలు
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో ప్రమాణాల పెరుగుదలకు విద్యార్థులకు అన్ని సదుపాయాలతో కూడిన పాఠశాలల అందుబాటు ఎంత ముఖ్యమో వాటిలో నాణ్యమైన బోధనాభ్యసన కార్యక్రమాలు అమలు చేయడం అంత కన్నా ముఖ్యం. పిల్లలను స్కూలు వరకు తీసుకువచ్చేందుకు ఆ స్కూలులో అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తూ.. ఆపై స్కూలులో చేరిన పిల్లలకు మెరుగైన బోధన అందించగలిగితేనే లక్ష్యం మేరకు ఫలితాలు సాధించడానికి వీలుంటుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల ఫలితాలు ఇప్పుడిప్పుడే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ‘స్కూలింగ్ టు లెర్నింగ్’ దిశగా అడుగులు వేస్తోంది. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విద్యా రంగ అభివృద్ధిపై దృష్టి సారించారు. ముఖ్యంగా పాఠశాల విద్యను బలోపేతం చేసే దిశగా పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాల ఫలితాలు ఇప్పుడు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నెన్నో కార్యక్రమాలు.. ► అమ్మ ఒడి, మనబడి నాడు–నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం, కరిక్యులమ్ సంస్కరణలు, స్కూల్ శానిటేషన్, మరుగుదొడ్ల నిర్వహణ నిధి, తదితర పథకాలు, కార్యక్రమాలపై ప్రధానంగా ప్రభుత్వం దృష్టి సారించింది. ► కరోనాతో స్కూళ్లు మూత పడిన తర్వాత పిల్లలు ఇళ్లకే పరిమితమైన సమయంలోనూ విద్యా కార్యక్రమాలు ఆగకుండా ఆన్లైన్, డిజిటల్ ప్లాట్‌ఫాంల ద్వారా కొనసాగించారు. ► విద్యామృతం, విద్యా కలశం, విద్యా వారధి, టీచర్ ట్రయినింగ్, సందేహాల నివృత్తికి స్టూడెంట్ హైల్ప్‌లైన్, వాట్సప్ గ్రూపులు, టీచర్లకు ఆన్లైన్ టీఎల్ఎం పోటీలు, విద్యార్థులకు ఆన్లైన్ డ్రాయింగ్ పోటీలు, టీచర్లు, విద్యార్థుల కోసం అభ్యాస యాప్, నిష్టా యాప్‌తో టీచర్లకు శిక్షణ ద్వారా ప్రాథమిక విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. ప్రభుత్వ కార్యక్రమాల ఫలితాలు ఇలా.. ► గరిష్ట చేరికల నిష్పత్తి (గ్రాస్ ఎన్రోల్మెంటు రేషియో – జీఈఆర్)లో పెరుగుదల. ► 2018–19లో ప్రైమరీ విభాగంలో 87 శాతంగా ఉన్న చేరికలు ఏడాదిలోనే 91.97 శాతానికి చేరాయి. ► అప్పర్ ప్రైమరీలో 84 శాతం నుంచి 87 శాతానికి, సెకండరీలో 82 శాతం నుంచి 84 శాతానికి పెరిగాయి. ► విద్యాశాఖ గణాంకాల ప్రకారం ప్రభుత్వ స్కూళ్లలో 6.12 లక్షల మంది విద్యార్థులు అదనంగా చేరారు. ఈ సంఖ్య క్రమేణా పెరుగుతూ వస్తోంది. ఇదే సమయంలో ప్రయివేటు స్కూళ్లలో చేరికలు తగ్గాయి. ► ప్రైమరీ, యూపీ పాఠశాలల్లో డ్రాపవుట్ల శాతం గతంలో కన్నా తగ్గుముఖం పట్టింది. 2015–16లో ప్రైమరీలో 6.27 శాతంగా ఉన్న డ్రాపవుట్లు.. 2019–20 నాటికి సున్నాకు చేరాయి. అప్పర్ ప్రయిమరీలో 5.47 నుంచి 0.27కు తగ్గాయి. ప్రీప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్లు ► తదుపరి దశగా ప్రభుత్వం వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్ల ఏర్పాటుతో నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టబోతోంది. ప్రస్తుతం ఉన్న వనరుల సర్దుబాటు, సద్వినియోగం చేసుకొని గరిష్ట ఫలితాలను సాధించేందుకు విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. ► ప్రస్తుతం కొన్ని స్కూళ్లలో విద్యార్థులకు తగ్గ టీచర్లు లేరు. కొన్ని చోట్ల టీచర్లు ఉన్నా, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. కొన్ని స్కూళ్లలో తరగతి గదుల సమస్య ఉంది. వీటిని ముందుగా పరిష్కరించే ఆలోచనలు సాగుతున్నాయి. ► ఇప్పటికే ఏయే స్కూళ్లలో ఎంతెంత మంది పిల్లలున్నారు? ఏ స్కూళ్లలో ఎంత మంది టీచర్లున్నారు? తరగతి గదులు ఎన్ని ఉన్నాయన్న అంశాలపై విద్యా శాఖ సమగ్ర సమాచారం తెప్పించుకుంది. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు మెరుగైన బోధనను అందించి వారిలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు వీలుగా ‘మిషన్ స్కూలింగ్ టు లెర్నింగ్’ కార్యక్రమంపై దృష్టి పెట్టింది. పిల్లలకు మనం ఇవ్వగలిగిన విలువైన ఆస్తి చదువే. అందుకే పేద పిల్లలు విద్యను అభ్యసించే ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌కు దీటుగా ఉండాలి. కాంపౌండ్ మొదలు తరగతి గదులు, బెంచీలు, ఫ్యాన్లు, ల్యాబ్‌లు, టాయ్లెట్లు, సరిపడా టీచర్లు, ఇతరత్రా అన్ని వసతులు అందుబాటులో ఉండాలి. అప్పుడే పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు రాగలుగుతారు. అలాంటప్పుడే వారికి నాణ్యమైన విద్యను అందించడానికి వీలవుతుంది. – అధికారంలోకి వచ్చిన కొత్తలో సీఎం వైఎస్ జగన్ ఆ లక్ష్యం మేరకు నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తద్వారా పాఠశాలల్లో సకల మౌలిక సదుపాయాలు సమకూరాయి. దీనికి తోడు వివిధ పథకాల ద్వారా లబ్ధి కలిగించడం వల్ల తల్లిదండ్రులు.. తమ పిల్లలను బడికి పంపేలా చేయగలిగారు. పర్యవసానంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు వెల్లువలా పెరిగాయి. ఈ దశలో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడం అత్యంత ఆవశ్యకం. ఈ దిశగా విద్యా శాఖ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. -
మునిసిపల్ స్కూళ్లలో 'ఇ–లెర్నింగ్'
సాక్షి, అమరావతి: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా రాష్ట్రంలో మునిసిపల్ పాఠశాలలు ముందడుగు వేస్తున్నాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పదోతరగతి విద్యార్థులను పూర్తిస్థాయిలో పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ఇ–లెర్నింగ్ బాట పట్టాయి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ క్లాసులు చేపట్టడం ఇదే తొలిసారి. ముందుగా 5 మునిసిపాలిటీల్లో పదో తరగతి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు బుధవారం ప్రారంభించారు. వచ్చే వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 125 మునిసిపాలిటీల్లోనూ అమలు చేయనున్నారు. తద్వారా 32 వేలమంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. అత్యుత్తమ ఫలితాలే లక్ష్యంగా.. మరో నెలరోజుల్లో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా పరిస్థితులతో పాఠశాలలకు సెలవులు ఇవ్వాల్సి వచ్చింది. కానీ మునిసిపల్ పాఠశాలల్లో పదోతరగతి విద్యార్థులు నష్టపోకుండా ఉండాలని పురపాలకశాఖ భావించింది. అందుకే ఇ–లెర్నింగ్ విధానంలో వారిని పరీక్షలకు పూర్తిస్థాయిలో సన్నద్ధపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం నెలరోజులపాటు ఆన్లైన్ క్లాసుల నిర్వహణ ప్రణాళికను రూపొందించింది. ఆన్లైన్ తరగతుల నిర్వహణ కోసం అన్ని సబ్జెక్ట్ నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు ముందుగా తయారుచేసిన టీఎల్ఎం వీడియోలు, పీపీటీలను ఆన్లైన్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచి బోధిస్తారు. విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తారు. పదోతరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రం మోడల్లోనే విద్యార్థులకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రస్తుతం విజయవాడ, ఒంగోలు, శ్రీకాళహస్తి, తిరుపతి, నరసాపూర్ నగరాలు, పట్టణాల్లో ఆన్లైన్ తరగతులు ప్రారంభించారు. సబ్జెక్టులవారీగా నిపుణులు ఆన్లైన్ క్లాసులు నిర్వహించి విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. వారికి ప్రేరణనివ్వడం, చేతిరాత పరిశీలించడం, పరీక్షల్లో వివిధ అంశాలపై సకాలంలో సమాధానాలను రాసే విధానాన్ని పర్యవేక్షించారు. తొలిరోజు సమస్యలేమీ ఎదురుకాలేదు. మరో నాలుగు రోజులపాటు వీరికి ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తారు. వచ్చే వారం నుంచి రాష్ట్రంలోని 125 మునిసిపాలిటీల్లోని 32 వేలమంది పదో తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించనున్నారు. సందేహాలు నివృత్తి అవుతున్నాయి పదోతరగతి పరీక్షలు నెలరోజులు ఉన్నాయి. స్కూల్‌కు వెళ్లలేకపోతున్నామని ఎంతో కంగారుపడ్డాను. ఇప్పుడా ఆందోళన తీరింది. ఆన్లైన్ క్లాసులు మాకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. పదోతరగతి పరీక్షలకు సంబంధించిన సందేహాలను ఉపాధ్యాయులు నివృత్తి చేస్తున్నారు. – మురపాక జ్యోత్స్న, పదోతరగతి విద్యార్థిని, నరసాపురం మునిసిపల్ పాఠశాల కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా.. ఆన్లైన్ క్లాసులు అంటే కార్పొరేట్ పాఠశాలలకే పరిమితం అన్న భావనను తొలగిస్తున్నాం. మునిసిపల్ పాఠశాలల పదోతరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాం. – డి.కృష్ణవేణి, స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్), విజయవాడ. ఇప్పుడు ధైర్యంగా ఉంది మా పిల్లలు పదోతరగతి పరీక్షల కోసం ఎలా చదువుతారో అనే భయం ఉండేది. కానీ ఆన్లైన్ క్లాసులు మొదలు పెట్టడంతో మా భయం పోయింది. ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలన్న నిర్ణయం ఎంతో ఊరటనిస్తోంది. – ఎస్.మాధురి, విద్యార్థిని తల్లి, తిరుపతి అత్యుత్తమ ఫలితాలే ధ్యేయం కరోనా పరిస్థితులతో మా విద్యార్థులు నష్టపోకూడదు. అందుకే మునిసిపల్ విద్యాశాఖ ఆన్లైన్ తరగతుల ప్రణాళిక రూపొందించింది. పదోతరగతి పరీక్షలకు మా విద్యార్థులను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేస్తాం. – మిద్దే శ్రీనివాసరావు, స్కూల్ అసిస్టెంట్ (ఫిజిక్స్), గుడివాడ. -
బంగారు భవిష్యత్తుకే ‘సీబీఎస్ఈ’
సాక్షి, అమరావతి: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న విద్యా విధానాలకు అనుగుణంగా మార్పులు తెచ్చి రాష్ట్ర విద్యార్థులు పోటీ పడేలా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సిలబస్‌ను ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తరఫున రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రస్తుతం రాష్ట్రంలో 61,208 పాఠశాలలు ఉండగా 44,639 (73 శాతం) ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీటిలో 43 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 6,13,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో అదనంగా ప్రవేశం పొందారు. వీరిలో దాదాపు 4 లక్షల మంది ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు రాగా రెండు లక్షల మంది కొత్తగా ప్రవేశం పొందారు. ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం, అదికూడా కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో ప్రవేశాలు పొందడం చరిత్రాత్మకం. వీరందరికీ బంగారు భవిష్యత్తు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఎస్ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. సీబీఎస్ఈకి దేశ విదేశాల్లో 25,000కి పైగా పాఠశాలలు అనుబంధంగా ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను దశల వారీగా బోర్డుకు అనుసంధానించేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది. 2024 – 2025 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులు సీబీఎస్ఈ బోర్డు ద్వారా ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాసేలా చర్యలు చేపడుతుంది’ అని పేర్కొన్నారు. -
నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ
-
AP Cabinet Meet: నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం 11.30 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారని అధికార వర్గాల సమాచారం. సమావేశంలో ఎలక్ట్రానిక్ పాలసీతో పాటు ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్ అమలుకు అవగాహన ఒప్పందం చేసుకోవడంపైన, రాష్ట్రంలో కోవిడ్–19 నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై తీసుకుంటున్న చర్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. -
పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు రూ.440 కోట్లు
సాక్షి, అమరావతి: దేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ కోసం రూ.440 కోట్లతో ప్రత్యేక నిధిని సీఎం వైఎస్ జగన్ ఏర్పాటు చేయించారని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణపై విజయవాడలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళల ఆత్మగౌరవం కాపాడేలా పాఠశాలల్లో విద్యార్థినులకు, మహిళా టీచర్లకు టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి వదిలేస్తే సరిపోదని, వాటి నిర్వహణ కూడా ముఖ్యమని చెప్పారు. విద్యార్థులు ఎక్కువ సమయం పాఠశాలల్లోనే గడుపుతారని.. వారి కోసం ఇంతలా ఆలోచించిన ప్రభుత్వాలు గతంలో లేవన్నారు. బుక్స్, బ్యాగ్స్, షూస్, డ్రస్, గ్రీన్ బోర్డు, కాంపౌండ్ వాల్స్, లైట్లు, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, మంచినీరు, మధ్యాహ్న భోజనం.. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని సీఎం స్వయంగా పరిశీలించడం ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదన్నారు. అమ్మఒడి కింద ఇచ్చే రూ.15 వేలల్లో రూ.1,000 టాయిలెట్ల నిర్వహణకు కేటాయిస్తున్నామన్నారు. ప్రతి ఆయాకు నెలకు రూ.6 వేలు గౌరవ వేతనం అందిస్తామని మంత్రి ఆదిమూలపు చెప్పారు. -
సర్కారు స్కూళ్లకు 2,93,388 సీలింగ్ ఫ్యాన్లు
సాక్షి, అమరావతి: విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పడుతోంది. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలూ ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన గురించి పట్టించుకోలేదు. తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘మన బడి నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా సర్కారు బడులను బాగు చేయడమే కాకుండా విద్యార్థులు, ఉపాధ్యాయులు కూర్చునేందుకు అవసరమైన ఫర్నిచర్‌ను పెద్దఎత్తున సమకూర్చుతున్నారు. ఒక పక్క స్కూలు భవనాల మరమ్మతులు నిర్వహిస్తూనే మరోపక్క బల్లలు, కుర్చీలు, టేబుళ్లతో పాటు సీలింగ్ ఫ్యాన్లు సమకూర్చుతున్నారు. అల్మారాలు, స్మార్ట్ టీవీలు, రక్షిత మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు లాంటి సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో దశాబ్దాల తరువాత రాష్ట్రంలో సర్కారు బడుల రూపురేఖలు మారుతున్నాయి. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా.. 2019 నవంబర్ 14వ తేదీన తొలిదశలో 15,715 స్కూళ్లలో మన బడి నాడు–నేడు పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు నాడు–నేడు తొలి దశ పనులకు రూ.2,580 కోట్లను వ్యయం చేశారు. పనులన్నీ శరవేగంగా సాగుతుండగా ఇప్పటికే çపనులు పూర్తయిన బడులు కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా కనిపిస్తున్నాయి. తొలి దశ నాడు నేడు పనులకు రూ.3,437 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అయితే ఎక్కడా రాజీలేకుండా పనులు చేస్తుండటంతో అంచనాలు పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెలాఖరుకు తొలిదశ పనులు పూర్తి ప్రభుత్వ పాఠశాలల దుస్థితి, విద్యార్థుల వెతలను పాదయాత్రలో స్వయంగా చూసిన ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాగానే మన బడి నాడు–నేడు ద్వారా చేపట్టాల్సిన పనులను నిర్దేశించారు. రూ.826.70 కోట్ల అంచనా వ్యయంతో రన్నింగ్ వాటర్‌తో కూడిన మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. తొలిదశలో 14,293 మరుగుదొడ్ల పనులు మంజూరయ్యాయి. తొలి దశ నాడు–నేడులో రూ.325.19 కోట్ల వ్యయంతో 14,474 రక్షిత మంచినీటి పనులను చేపట్టారు. ఈ నెలాఖరుకు తొలి దశ నాడు–నేడు పనులు పూర్తి చేయాలని ఇటీవల స్పందన కార్యక్రమం సమీక్షలో కలెక్టర్లు, జేసీలను ముఖ్యమంత్రి ఆదేశించారు. -
‘టెట్’కు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయులుగా పనిచేయాలంటే తప్పనిసరిగా అవసరమైన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ బుధవారం జీవో 23ను విడుదల చేశారు. కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం నేపథ్యంలో టెట్‌లో ఇంగ్లిష్ ప్రొఫెషియన్సీ ప్రశ్నలను ఈసారి తప్పనిసరి చేస్తున్నారు. 1–5 తరగతులకు సంబంధించి సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు పేపర్–1ఏను, 6–8 తరగతులకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులకు పేపర్–2ఏను నిర్వహించనున్నారు. పేపర్–2ఏ రాసేవారు ఆసక్తి ఉంటే పేపర్–1ఏ కూడా రాయొచ్చు. కాగా, ప్రత్యేక స్కూళ్ల పోస్టులకు పేపర్–1బీ, పేపర్–2బీ నిర్వహిస్తారు. ఇకపై ఏడాదికి ఒకసారే టెట్ ఉంటుంది. కాగా, టెట్ నోటిఫికేషన్‌ను మేలో విడుదల చేసి జూలైలో పరీక్షలు నిర్వహించే అవకాశముంది. పేపర్–1ఏకు అర్హతలు ఇలా.. పేపర్–1ఏకు ఇంటర్మీడియెట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్రుగాడ్యుయేషన్‌లో ఓసీలు 50 శాతం (ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు 45 శాతం) మార్కులు సాధించి ఉండాలి. రెండేళ్ల డీఎడ్ కోర్సు లేదా నాలుగేళ్ల బీఈడీ కోర్సు, రెండేళ్ల స్పెషల్ ఎడ్యుకేషన్ డిప్లొమా లేదా బీఈడీ పూర్తి చేసి ఉండాలి. ► 2010 ఆగస్టు 23 కంటే ముందు డీఈడీ, బీఈడీ పూర్తి చేసి ఉన్నవారిలో ఓసీలు 45 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు 40 శాతం మార్కులు సాధించి ఉండాలి. ► పేపర్–1బీకి సంబంధించి విభాగాలను అనుసరించి వేర్వేరుగా 11 రకాల అర్హతలను నిర్దేశించారు. పేపర్–2ఏకు అర్హతలు ఇలా.. పేపర్–2ఏకు గ్రాడ్యుయేషన్ (సంబంధిత సబ్జెక్టు)లో ఓసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు 40 శాతం మార్కులు సాధించి ఉండడంతోపాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలి. బీఈడీలో ఓసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు 45 శాతం మార్కులు సాధించి ఉండాలి. లాంగ్వేజ్ పోస్టులకు సంబంధిత లాంగ్వేజ్‌లో బీవోఎల్, పీజీతోపాటు పండిట్ ట్రైనింగ్ పూర్తి చేసినవారు అర్హులు. స్పెషల్ స్కూళ్లకు సంబంధించి పేపర్–2బీలో ఆయా విభాగాలను అనుసరించి అర్హతలను నిర్దేశించారు. 150 ప్రశ్నలు.. 2.30 గంటల సమయం ► టెట్‌ను 150 మార్కులకు 150 బహుళైచ్ఛిక ప్రశ్నలతో నిర్వహించనున్నారు. పరీక్ష సమయం 2.30 గంటలు. ► చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి, లాంగ్వేజ్–1, లాంగ్వేజ్–2 (ఇంగ్లిష్), మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ సబ్జెక్టుల్లో ప్రతిదానిలో 30 ప్రశ్నలు చొప్పున ఇస్తారు. వీటికి 30 మార్కుల చొప్పున ఉంటాయి. ► పేపర్–1ఏలో స్కూళ్లలో ఫస్ట్ లాంగ్వేజ్‌గా ఉండే తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడం, తమిళం, ఒడియాలలో అభ్యర్థి ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి. అభ్యర్థి ఆ భాషను 1–10 వరకు ఒక సబ్జెక్టుగా అభ్యసించి ఉండాలి. లాంగ్వేజ్–2 (ఇంగ్లిష్) అభ్యర్థులందరికీ తప్పనిసరి. ► పేపర్–1బీలో కూడా ఇదేవిధమైన ప్రశ్నలు, ఆప్షన్లు ఉంటాయి. పేపర్–2ఏలో చైల్డ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్–1, లాంగ్వేజ్–2 (ఇంగ్లిష్)లలో 30 ప్రశ్నలు చొప్పున 30 మార్కులకు ఉంటాయి. మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్, కన్నడం, ఒడియా, తమిళం, సంస్కృతం సబ్జెక్టులకు సంబంధించి 60 మార్కులకు 60 ప్రశ్నలు ఉంటాయి. పేపర్–2బీలో చైల్డ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్–1, లాంగ్వేజ్ –2 ఇంగ్లిష్‌తోపాటు డిజేబిలిటీ స్పెషలైజేషన్ అంశాలుంటాయి. అర్హత మార్కులు ఇలా.. టెట్ పరీక్షలు రాసే జనరల్ అభ్యర్థులు 60 శాతం మార్కులు, బీసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగుల పిల్లలు 40 శాతం మార్కులు సాధిస్తేనే అర్హత సాధించినట్టుగా పరిగణిస్తారు. టెట్ స్కోర్‌కు ఏడేళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. టెట్‌లో ఆయా అభ్యర్థుల స్కోరుకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజ్ ఉంటుంది. టెట్ నుంచి 20 శాతం, డీఎస్సీ నుంచి 80 శాతం వెయిటేజ్ కలిపి మెరిట్‌ను నిర్ణయిస్తారు. -
ఈసారి 43 లక్షల మందికి విద్యా కానుక
సాక్షి, అమరావతి: అమ్మ ఒడి, నాడు–నేడు వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు గణనీయంగా పెరగడంతో ఈ ఏడాది జగనన్న విద్యాకానుక బడ్జెట్ కూడా భారీగా పెరగనుంది. రూ.731.30 కోట్లతో ప్రభుత్వం జగనన్న విద్యా కానుక పథకం కింద విద్యార్థుల విద్యాభ్యాసానికి అవసరమైన వస్తువులను కిట్ల రూపంలో అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు అందించే జగనన్న విద్యా కానుక కిట్లలో 3 జతల యూనిఫారం, షూ, 2 జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు, పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్‌లు, నోట్ బుక్‌లతో పాటు ఈసారి అదనంగా ఇంగ్లిష్ – తెలుగు డిక్షనరీని అందించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టిన నేపథ్యంలో జగనన్న విద్యాకానుకలో ఈ ఏడాది కొత్తగా డిక్షనరీని చేర్చారు. డిక్షనరీ ఉపయోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని నాణ్యత కూడా బాగుండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఇప్పటికే ఆదేశించారు. ఆంగ్ల మాధ్యమానికి తల్లిదండ్రుల మద్దతు ► పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమానికి తల్లిదండ్రుల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తోంది. పాఠశాలల్లో చేరే పిల్లలు, వారి తల్లిదండ్రులు 96.17% మంది ఆంగ్ల మాధ్యమానికే ఆప్షన్ ఇచ్చారు. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టినా తెలుగుకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ అన్ని పాఠశాలల్లో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు దాన్ని తప్పనిసరి చేశారు. ► 2020–21 విద్యా సంవత్సరంలో 1 నుంచి 6వ తరగతి వరకు అమలైన ఆంగ్ల మాధ్యమం.. 2021–22 నుంచి ఏటా ఒక్కో తరగతి చొప్పున వరుసగా పదోతరగతి వరకు అమలు కానుంది. దీంతో పాటు రాష్ట్రంలో సీబీఎస్ఈ విధానం అమలు చేయడానికి సీఎం సూత్రప్రాయంగా అంగీకరించారు. ► ఇప్పటికే ఇంగ్లిష్ మీడియంలో బోధించడానికి ఉపాధ్యాయులకు అవసరమైన నైపుణ్యం, అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇచ్చారు. విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సులతో పాటు ఇంగ్లిష్ ల్యాబ్స్ ఉండేలా చర్యలు చేపట్టారు. ► పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదని సీఎం జగన్ అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నారు. బడికి వెళ్లే పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు మంచి మెనూతో జగనన్న గోరుముద్ద పథకం తీసుకొచ్చారు. నాణ్యతలో రాజీ లేదు.. ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీపీ, మునిసిపల్, వివిధ సంక్షేమ శాఖల రెసిడెన్షియల్ స్కూళ్లు, ఆశ్రమ, ఎయిడెడ్, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గుర్తింపు ఉన్న మదర్సాలల్లో 1–10 వరకు చదువుతున్న దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు ఈ కిట్లు అందించనున్నారు. గతేడాదితో పోలిస్తే దాదాపు నాలుగు లక్షల మంది పిల్లలు పెరిగారు. 2020–21 విద్యా సంవత్సరంలో జగనన్న విద్యా కానుక కోసం ప్రభుత్వం రూ.648.10 కోట్లకు పైగా వెచ్చించగా, ఈ ఏడాది రూ.731.30 కోట్లను మంజూరు చేసింది. వీరందరికీ యూనిఫారం కుట్టు కూలీగా 1–8 విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.120, అదే విధంగా 9–10 విద్యార్థుల కోసం ఒక్కొక్కరికి రూ.240 చొప్పున నిధులు అందిస్తోంది. స్టూడెంట్ కిట్ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని అధికారులను సీఎం ఆదేశించారు. వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ఇంగ్లిష్ – తెలుగు డిక్షనరీ ద్వారా పిల్లలు ప్రతి రోజూ ఒక పదం చొప్పున నేర్చుకునేలా చూడాలని సూచించారు. -
స్కూళ్లు, కాలేజీల్లో శానిటరీ న్యాప్కిన్స్ సరఫరా
సాక్షి, అమరావతి: ఆరోగ్యకరమైన సమాజంలో బాలికలు పెరిగేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న వారికి ఉచితంగా శానిటరీ న్యాప్కిన్స్ను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం ప్రారంభించనున్నారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న 12–18 సంవత్సరాల విద్యార్థినులకు ప్రభుత్వం వీటిని ఇవ్వనుంది. శానిటరీ న్యాప్కిన్స్ కూడా కొనుగోలు చేయలేని తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నట్లు పలు సర్వేల్లో తేలింది. దీని వల్ల బాలికల విద్యకు విఘాతం కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న కౌమార దశ బాలికలు 12.50 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. ఒక్కొక్కరికి సంవత్సరానికి 120 ప్యాడ్స్ ప్రకారం 15 కోట్ల ప్యాడ్స్ కావాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందుకోసం రూ.41.4 కోట్ల నిధులు అవసరం అవుతాయి. తక్కువ ధరతో సరఫరాకు ఆలోచన ► పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని వైఎస్సార్ చేయూత దుకాణాల్లో శానిటరీ న్యాప్కిన్లను మహిళలకు తక్కువ ధరలకు విక్రయించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ► ఇందు కోసం మెప్మా, సెర్ప్‌లు రాష్ట్ర స్థాయిలో టెండర్ నిర్వహించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ శానిటరీ నాప్కిన్లు లబ్ధిదారులకు ఎల్–1 రేటు కంటే 15% మార్జిన్‌తో అందించవచ్చని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో చేయూత స్టోర్లు 35,105, పట్టణాల్లో 31,631 ఉన్నాయి. ► రాష్ట్రంలో 18–50 ఏళ్ల వయస్సు ఉన్న మహిళల సంఖ్య సుమారు 1.26 కోట్లు ఉంటుదని అంచనా. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే– 4 (2015–16) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 15–24 సంవత్సరాల వయస్సు గల మహిళలు 67.5% మంది నెలవారీ పరిశుభ్రమైన పద్ధతిని ఉపయోగిస్తున్నారు. జాతీయ సగటు 57.6%గా ఉంది. ► జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే – వి (2019–20) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో15–24 సంవత్సరాల వయస్సు గల మహిళలు 85.1% మంది రక్షణకు పరిశుభ్రమైన పద్ధతిని ఉపయోగిస్తున్నారు. (పట్టణాల్లో 90.6%, గ్రామీణ ప్రాంతాల్లో 82.5%) పరిశుభ్రమైన పద్ధతిలో స్థానికంగా తయారు చేసిన న్యాప్కిన్లు, శానిటరీ న్యాప్కిన్లు, టాంపోన్లు ప్రస్తుతం అందుతున్నాయి. మిగిలిన వారందరూ కూడా ఆరోగ్యకరమైన పద్ధతిని పాటించడం కోసమే ప్రభుత్వం చొరవ తీసుకుంది. -
టెట్, డీఎస్సీ, బదిలీలు, భర్తీ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే నాడు–నేడు ద్వారా 45 వేలకుపైగా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్న విషయం తెలిసిందే. రన్నింగ్ వాటర్‌తో మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం, కుర్చీలు, బెంచీలు, ర్యాకులు, గ్రీన్ చాక్ బోర్డులు, భవనాలకు మరమ్మతులు, రంగులు ఇలా పలు రకాల సదుపాయాలు కల్పిస్తుండగా మొదటి దశ కింద 15 వేలకు పైగా స్కూళ్లలో పనులు మార్చి ఆఖరుకు పూర్తిచేయనున్నారు. ఇతర దశల పనులకు సంబంధించి కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. మరోవైపు ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు కూడా విద్యాశాఖ కార్యాచరణ ప్రారంభించింది. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించగానే తదుపరి చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తోంది. తొలుత ‘టెట్’ ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం డీఎస్సీ ప్రకటించటానికి ముందు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. 2018లో టెట్ రెండుసార్లు నిర్వహించిన అనంతరం మళ్లీ ఆ పరీక్షలు జరగలేదు. డీఎడ్ పూర్తిచేసిన కొత్త బ్యాచ్‌ల అభ్యర్థులు టెట్ కోసం నిరీక్షిస్తున్నారు. వారు డీఎస్సీకి దరఖాస్తు చేయాలంటే టెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి కావడంతో తొలుత టెట్ నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. గతంలో రాసినవారితోపాటు ఏడేళ్ల కాలపరిమితి దాటిన వారు (గతంలో ఉత్తీర్ణులు) ఈసారి టెట్ పరీక్షకు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. గతంలో టెట్‌కు 3,97,957 మంది దరఖాస్తు చేయగా 3,70,576 మంది హాజరయ్యారు. ఈసారి ఈ సంఖ్య 5 లక్షలకు పైగా ఉండే అవకాశముంది. ఆంగ్ల నైపుణ్యాలకు పరీక్ష టెట్, డీఎస్సీ సిలబస్‌లో ఈసారి కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం నేపథ్యంలో ఇంగ్లీషులో అభ్యర్థుల బోధనా నైపుణ్యాలను పరీక్షించేలా చర్యలు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి టెట్‌లో ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ కింద అదనంగా పరీక్ష నిర్వహించనున్నారు. ఈమేరకు పాఠశాల విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) సిలబస్ రూపొందిస్తోంది. పాఠ్యపుస్తకాల్లో అంశాలను కూడా గత ఏడాది మార్పు చేసినందున డీఎస్సీ సిలబస్‌లోనూ మార్పులు జరగనున్నాయి. మరోసారి బదిలీలకు అవకాశం! టెట్ –2021 నిర్వహించిన అనంతరం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలో అందుబాటులో ఉన్న ఖాళీలన్నిటినీ భర్తీ చేసేలా పోస్టుల సంఖ్యతో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఈ డీఎస్సీలో ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు ఇచ్చే ముందు మరోసారి టీచర్ల బదిలీలకు అవకాశం కల్పించనున్నారు. ఇటీవల బదిలీల సందర్భంగా మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీల్లోని పాఠశాలల్లో టీచర్ స్థానాలు ఖాళీ అయిపోకుండా విద్యాశాఖ దాదాపు 15 వేల వరకు పోస్టులను బ్లాక్ చేసి ఉంచింది. ఈ పోస్టులను ఇప్పటికే మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న, సర్వీసులో ఉన్న టీచర్లతో సీనియార్టీని అనుసరించి భర్తీ చేయనున్నారు. ఇందుకు అనుగుణంగా బదిలీలకు అవకాశం కల్పిస్తారు. ఈ బదిలీల ప్రక్రియ అనంతరం డీఎస్సీలో ఎంపికైన కొత్త టీచర్లకు గ్రామీణ ప్రాంతాల్లో పోస్టింగ్ ఇవ్వనున్నారు. ప్రత్యేక కేటగిరీ పోస్టుల భర్తీ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకోసం 2018లో నిర్వహించిన ప్రత్యేక డీఎస్సీలో 403 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా కొన్ని మాత్రమే భర్తీ అయ్యాయి. వాటికి మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. 2018 జనరల్ డీఎస్సీకి సంబంధించి పలు న్యాయవివాదాలు తలెత్తడంతో ఆ పోస్టుల భర్తీ విద్యాశాఖకు కత్తిమీద సాములా మారింది. వివాదాలను ఒక్కొక్కటే పరిష్కరిస్తూ దాదాపు అన్ని పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇచ్చారు. -
గుర్తింపు లేని విద్యాసంస్థలను మూసివేయిస్తాం
తిరుపతి ఎడ్యుకేషన్: గుర్తింపులేని విద్యాసంస్థలను మూసివేయిస్తామని ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఏపీఎస్‌ఈఆర్‌ఎం) వైస్ చైర్పర్సన్ డాక్టర్ విజయ శారదారెడ్డి చెప్పారు. తిరుపతి పరిసరాల్లోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలను కమిషన్ సభ్యులతో కలిసి శనివారం ఆమె సందర్శించారు. అనంతరం ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది ట్యూషన్ ఫీజులో 70 శాతం ఫీజును విడతలుగా తీసుకోవాలని ప్రభుత్వం జీవో 57ను విడుదల చేసిందని గుర్తుచేశారు. ఈ జీవోను అమలు చేయకుంటే గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోని 784 ప్రైవేట్ డీఎడ్ కళాశాలల్లో 60 శాతం కళాశాలల మూసివేతకు ప్రభుత్వానికి సిఫార్సు చేశామని తెలిపారు. -
పల్లెలకు కొత్తరూపు.. 'దారులన్నీ ప్రగతి వైపు'
సాక్షి, విశాఖపట్నం: పల్లె ప్రజలకు స్వర్ణయుగం ఇది. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులకు చేరుతోంది. అందుకు గ్రామ సచివాలయాలు తోడ్పాటు అందిస్తున్నాయి. వాటితో పాటు రైతుభరోసా కేంద్రాలు రైతులకు అండగా నిలు స్తున్నాయి. ప్రాథమిక వైద్యం సకాలంలో చెంతనే అందించేందుకు వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు కూడా రాబోతున్నాయి. వీటన్నింటికీ శాశ్వత భవనాలను అన్ని హంగులతో ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. నాడు–నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారిపోతున్నాయి. బాలబాలికలు ప్రతి ఒక్కరూ బడిబాట పడుతున్నారు. మత్స్యకారుల జీవనోపాధికి భరోసా విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలోని పూడి మడక వద్ద రూ.353.10 కోట్లతో ఫిషింగ్ హార్బర్ నిర్మా ణానికి ప్రభుత్వం సం కల్పిం చింది. సము ద్రంలో చేపలవేట ఆధారంగా జీవిస్తున్న 20,273 మత్స్యకార కుటుం బాలకు వేట నిషేధకాలంలో రూ.10 వేల చొప్పున రూ.20.27 కోట్లు అంద జేసింది. ఫిషింగ్ బోట్లకు డీజి ల్‌పై లీటరుకు రూ.9 చొప్పున రూ.5.83 కోట్ల రాయితీ ఇచ్చింది. మహిళాలోకానికి పెద్దపీట జిల్లాలో 4,16,007 మంది స్వయం సహాయక సంఘ (డ్వాక్రా) సభ్యులకు 2019 ఏప్రిల్ నాటికి రూ.1,184 కోట్ల బ్యాంకు అప్పు ఉండేది. దీన్లో తొలి విడతగా ప్రభుత్వం రూ.296 కోట్ల రుణ మాఫీ చేసింది. బ్యాంకు లింకేజీ ద్వారా 35,716 సంఘాలకు రూ.960.56 కోట్ల రుణాల సదుపా యం కల్పించింది. 21,019 మంది సభ్యులకు మహిళా బ్యాంకు ద్వారా రూ.106.16 కోట్లు విడుదల చేసింది. 2,333 మంది మహిళలకు కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి రూ.17.50 కోట్లు విడుదల చేసింది. 1వ తేదీనే ఠంచనుగా పింఛను అర్హత ఉంటే చాలు.. గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లోనే మంజూరు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ఆదేశాలు పక్కాగా అమలవుతున్నాయి. ప్రతినెలా ఠంచనుగా 1వ తేదీనే 12 రకాల పింఛన్లను గ్రామ వలంటీర్లు లబ్ధిదారుల ఇంటికే వెళ్లి అందిస్తున్నారు. ఈ ఏడాదిన్నర కాలంలోనే దాదాపు 70 వేల కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. ఈ ఏడాది ఉపాధి హామీ పథకం కింద పనులు చేసినవారికి రూ.537.16 కోట్లు చెల్లించారు. విశాఖ ఏజెన్సీలోని 51,683 మంది గిరిజన రైతులకు 86,473 ఎకరాల అటవీ భూములపై హక్కు కల్పిస్తూ ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను ప్రభుత్వం అందజేసింది. మారుమూల గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు వివిధ పథకాల కింద 623.18 కోట్లతో 256 రోడ్ల పనులు మంజూరు చేసింది. ఆరోగ్యానికి రక్ష.. పేదలందరికీ ఇళ్లు.. జిల్లాలో 11,24,884 కుటుంబాలకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కార్డులను ప్రభుత్వం అందజేసింది. కంటివెలుగు కార్యక్రమంలో 6,35,645 మంది విద్యార్థులకు, 32,222 మంది వృద్ధులకు కళ్లద్దాలను పంపిణీ చేసింది. మరో 6,256 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించింది. జిల్లాలో పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో 3,00,124 మందికి ప్రభుత్వం ఇళ్లస్థలాల పట్టాలు ఇచ్చింది. ఇందుకోసం 5,364.38 ఎకరాల్లో లేఅవుట్లను అభివృద్ధి చేసింది. అక్కడే ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తోంది. వీఎంఆర్డీఏ పరిధిలోని 15 మండలాల్లో 52,050 మందికి ఇళ్లు మంజూరయ్యాయి. ప్రతి ఇంటికి రూ.1.80 లక్షల చొప్పున పూర్తి సబ్సిడీ ఇచ్చేందుకు రూ.936.90 కోట్లు మంజూరయ్యాయి. ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యం జిల్లాలో కొత్తగా అర్హులైన 2,23,897 కుటుంబాలకు బియ్యం కార్డులు మంజూరయ్యాయి. మొత్తం జిల్లాలో దాదాపు 13 లక్షల పేద కుటుంబాలకు నాణ్యమైన బియ్యం ప్రతి నెలా వారి ఇంటి వద్దకే తీసుకెళ్లి అందించడానికి ప్రభుత్వం 828 మినీ ట్రక్కులను ప్రారంభించింది. మారిన పాఠశాలల దశ, దిశ మనబడి ‘నాడు–నేడు’ కింద తొలివిడత 1,149 ప్రభుత్వ పాఠశాలల్లో రూ.307.04 కోట్లతో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తోంది. 592 అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తోంది. అమ్మ ఒడి పథకంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న 6,30,386 మందికి సంబంధించి 4.10 లక్షల మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.615 కోట్ల సాయాన్ని ప్రభుత్వం జమచేసింది. 3,17,202 మంది విద్యార్థులకు రూ.42.82 కోట్ల వ్యయంతో జగనన్న విద్యాకానుక అందించింది. ప్రతి గ్రామంలోను శాశ్వత భవనాలు జిల్లాలో 728 గ్రామ సచివాలయాలకు రూ.261.42 కోట్లతో ప్రభుత్వం శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టింది. వాటిలో 293 భవనాల నిర్మాణం పూర్తయింది. రూ.157.30 కోట్లతో చేపట్టిన 702 రైతుభరోసా కేంద్ర భవనాలు వివిధ దశల్లో ఉన్నాయి. గ్రామీణ ప్రజలకు చెంతనే వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లను ప్రారంభించనుంది. ఇందుకోసం రూ.85.36 కోట్లతో 558 కొత్త భవనాల నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇవన్నీ మార్చి నెలాఖరులోగా పూర్తిచేయాలనేది లక్ష్యం. రికార్డు స్థాయిలో దిగుబడికి కృషి విశాఖ జిల్లా రైతులు గత ఖరీఫ్ సీజన్ వరిసాగులో సగటున హెక్టారుకు 3,416.25 కిలోల దిగుబడి సాధించి రికార్డు సృష్టించారు. ఇందుకు ప్రభుత్వం 622 రైతుభరోసా కేంద్రాల ద్వారా అన్నదాతలకు వెన్నంటి నిలిచింది. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం 3,78,715 మంది రైతులకు వైఎస్సార్ రైతుభరోసా కింద అందించిన రూ.309.29 కోట్ల పెట్టుబడి సాయం కూడా ఉపయోగపడింది. 2019–20 ఖరీఫ్‌లో ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయిన 2,971 మంది రైతులకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా రూ.2.12 కోట్లను త్వరితగతిన ప్రభుత్వం అందజేసింది. ఇటీవలే నివర్ తుపానుతో నష్టపోయిన 37,715 మంది రైతులకు నెల రోజుల్లోపే రూ.25.57 కోట్ల పరిహారం అందించడం ఒక రికార్డు. ఇక 43,080 వ్యవసాయ బోర్లకు పగటిపూట నిరంతరాయంగా 9 గంటల పాటు ఉచితంగా విద్యుత్తు అందుతోంది. -
నాడు–నేడుకు లారస్ ల్యాబ్స్ రూ.4 కోట్ల విరాళం
సాక్షి, అమరావతి: నాడు–నేడు పథకం మొదటి విడతలో భాగంగా..మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం సీఎం సహాయనిధికి లారస్ ల్యాబ్స్ తరఫున రూ.నాలుగు కోట్ల విరాళం అందించారు. తెనాలి, కంచికచర్ల, వీరులపాడు, అచ్యుతాపురం మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల కోసం ఈ విరాళం అందించారు. 2, 3 విడతల్లో అదే మండలాల్లోని మిగిలిన పాఠశాలల్లో నేరుగా లారస్ ల్యాబ్స్ మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు సీఎంకు తెలిపారు. విరాళానికి సంబంధించిన చెక్కును, సంబంధించిన పత్రాలను బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి లారస్ ల్యాబ్స్ వైస్ ప్రెసిడెంట్ చావా నరసింహరావు, సీనియర్ మేనేజర్ రామకృష్ణ అందజేశారు. కనెక్ట్ టూ ఆంధ్ర సీఈవో వి.కోటేశ్వరమ్మ పాల్గొన్నారు. -
76 వేలమంది టీచర్ల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బదిలీ ఉత్తర్వుల జారీ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఈనెల 17 వరకు ఆన్లైన్లో విభాగాల వారీగా బదిలీ ఉత్తర్వులు జారీచేస్తారు. బుధవారం 1,400 మంది ఎల్ఎఫ్ఎల్ (లో ఫిమేల్ లిటరసీ) హెచ్ఎంలకు బదిలీ ఉత్తర్వులను వెబ్సైట్ నుంచి జారీచేశారు. రాష్ట్రంలో మొత్తం 76 వేలమంది టీచర్లకు బదిలీలు జరుగుతున్నాయి. బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం, నోటిఫికేషన్ విడుదల చాలారోజుల ముందే మొదలైనా.. అనివార్య కారణాలతో ఆ ప్రక్రియ పూర్తికావడానికి తీవ్ర జాప్యం జరిగింది. ఎదురైన అనేక సమస్యల్ని పరిష్కరిస్తూ పాఠశాల విద్యాశాఖ ఒక్కో దశను దాటుకుంటూ వచ్చింది. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఈ బదిలీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఒకే స్కూలులో ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న టీచర్లను, అయిదేళ్లుగా చేస్తున్న ప్రధానోపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేస్తున్నారు. బదిలీకి దరఖాస్తు చేయడానికి రెండేళ్ల కనిష్ఠ సర్వీసు పెట్టారు. ఇలా అన్నీ కలిపి.. మొత్తం 76 వేలమంది ఈ బదిలీ ప్రక్రియలోకి చేరారు. వివిధ ప్రాతిపదికల ఆధారంగా వారికి కేటాయించే పాయింట్లను బట్టి ఈ బదిలీ చేస్తున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలు, వితంతు ఉపాధ్యాయినులు.. ఇలా కొన్ని కేటగిరీల టీచర్లకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు. వారికి వచ్చిన పాయింట్ల ఆధారంగా వారు ప్రాధాన్యక్రమంలో ఇచ్చిన పాఠశాలల వెబ్ ఆప్షన్లను అనుసరించి బదిలీ చేస్తున్నారు. బదిలీ ఉత్తర్వులు డౌన్లోడ్ చేసుకుని తాము పనిచేస్తున్న స్కూలు నుంచి రిలీవ్ అయి తమకు కేటాయించిన కొత్త స్కూలులో జాయిన్ అవ్వాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఆదేశాలు జారీచేశారు. బదిలీ అయిన టీచర్ల రిలీవ్, జాయిన్ ప్రక్రియను రీజనల్ జాయింట్ డైరెక్టర్లు, డీఈవోలు పర్యవేక్షించాలని పేర్కొన్నారు. సంక్రాంతి సెలవుల అనంతరం ఈనెల 18 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. -
‘అమ్మ ఒడి’లో ల్యాప్‌టాప్
‘‘పుట్టిన ప్రతి బిడ్డకు అమ్మ ఒడి శ్రీరామరక్ష అయితే చదువులమ్మ బడిలో ఎదిగే పిల్లలకు అమ్మ ఒడి పథకం శ్రీరామరక్ష లాంటిది’’ కోవిడ్ సమయంలో పెద్ద స్కూళ్లు, కాలేజీలు ఆన్లైన్లో క్లాసులు నిర్వహిస్తే.. ప్రభుత్వ బడుల్లో చదివే పేదింటి పిల్లలు చదువుకు దూరం కావడాన్ని మనమంతా చూస్తున్నాం. ఈ పరిస్థితి మారాలని, ఈ తరం పిల్లలు ఇంగ్లిష్ మీడియం, కంప్యూటర్ల వాడకానికి దూరం కారాదనే ఉద్దేశంతో వచ్చే ఏడాది నుంచి అమ్మ ఒడి ద్వారా మీరు కోరుకుంటే నగదుకు బదులుగా ల్యాప్‌టాప్ ఇవ్వాలని నిర్ణయించాం. పదేళ్ల తర్వాత మారిన తరంలో ఈ పిల్లలు వెనుకబడకూడదనే బాధ్యతతో ఒక అన్నగా, తమ్ముడిగా, మీ పిల్లలకు మేనమామగా ఇది చేస్తున్నా – సీఎం వైఎస్ జగన్ సాక్షి , నెల్లూరు: రాష్ట్రంలో చదువుల విప్లవాన్ని తెచ్చి 19 నెలల్లో విద్యారంగంపై రూ.24 వేల కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. బడి వయసు పిల్లలంతా వంద శాతం చదువుకునేలా వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పిల్లలకు ఓటు హక్కు లేదని గత పాలకులు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. పిల్లలకు ఓటు హక్కు లేకపోయినా ఒక మేనమామగా వారి మంచి చెడులను చూడడం తన బాధ్యతని స్పష్టం చేశారు. సోమవారం నెల్లూరులోని శ్రీవేణుగోపాలస్వామి కళాశాల ప్రాంగణంలో ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం రెండో ఏడాది నగదు జమ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. అమ్మ ఒడి ద్వారా 84 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలిగేలా 44.48 లక్షల మందికిపైగా తల్లుల ఖాతాల్లో రూ. 6,673 కోట్ల నగదును బటన్ నొక్కడం ద్వారా నేరుగా జమ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వచ్చే ఏడాది నుంచి అమ్మ ఒడి కింద నగదుకు బదులుగా తల్లులు కోరుకుంటే ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ప్రకటించారు. పథకంలో కొత్త ఆప్షన్‌ను చేర్చి 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు దీన్ని వర్తింప చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, జలవనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనిల్ యాదవ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఎంపీలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సీఎం ప్రసంగంలో ముఖ్యాంశాలివీ... నెల్లూరు సభలో అమ్మ ఒడి నగదును విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తున్న సీఎం వైఎస్ జగన్ ప్రైవేట్ స్కూళ్ల నుంచి 4 లక్షల మంది సర్కారు బడులకు.. స్కూలు ఫీజులు కట్టలేక తమ పిల్లలను కూలి పనులకు పంపుతున్న పరిస్థితులను 3,648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో చూశా. ఇలాంటి పరిస్థితులను మార్చేందుకే అమ్మఒడి పథకాన్ని తెచ్చాం. 42.33 లక్షల మంది పేద తల్లులకు గతేడాది రూ.6,400 కోట్లు ఇచ్చాం. ఈ సంవత్సరం 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.6,673 కోట్లు అమ్మఒడి కింద ఇస్తున్నాం. గతేడాది 82 లక్షల మంది పిల్లలకు లాభం కలిగితే ఈ ఏడాది 84 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతోంది. మరో రెండు లక్షల మందికి ఈ పథకం ద్వారా మేలు జరుగుతోంది. ప్రభుత్వ స్కూళ్లలో గతంలో దాదాపు 38 లక్షల మంది విద్యార్థులుంటే ఇప్పుడు 42 లక్షల మంది ఉన్నారు. నాలుగు లక్షల మంది ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. కోవిడ్ సమయంలో కూడా అమ్మఒడి పారదర్శకంగా ఇస్తుండటంతో తమ పిల్లలను వారి మేనమామ చూసుకుంటాడన్న నమ్మకం అక్కచెల్లెమ్మల్లో పెరిగింది. బడికి రాకపోతే వెంటనే మెసేజ్.. ఇక నుంచి పిల్లలు బడికి రాకపోతే వెంటనే తల్లిదండ్రుల ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. మూడో రోజు వలంటీర్ నేరుగా ఇంటికి వచ్చి పిల్లల యోగ క్షేమాలను విచారిస్తారు. పిల్లలను బడికి పంపే బాధ్యత తల్లిదండ్రులదైతే తీసుకొచ్చే బాధ్యతను గ్రామ సచివాలయానికి అనుసంధానంగా ఉన్న ఉద్యోగులు, వలంటీర్లు, పేరెంట్స్ కమిటీతో పాటు టీచర్ల మీద పెడుతున్నాం. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాలను వైఎస్సార్ ప్రీ ప్రైమరీ –1, వైఎస్సార్ప్రీ ప్రైమరీ – 2, వైఎస్సార్ ప్రీ ఫస్ట్ క్లాస్‌గా మార్చి ఇంగ్లిష్ మీడియంకు శ్రీకారం చుడుతున్నాం. అంగన్వాడీల రూపు రేఖలు మార్చడానికి మరో రూ.4 వేల కోట్లు ఖర్చు చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సంపూర్ణ పోషణ పథకం కోసం ఏటా రూ.1,870 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గత ప్రభుత్వం ఏటా రూ.550 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. టాయిలెట్స్ లేక చదువులు మానేస్తున్న దుస్థితి.. బడుల్లో సరైన టాయిలెట్స్ లేకపోవడం వల్ల 12 నుంచి 23 శాతం వరకు ఆడ పిల్లలు చదువు మానేస్తున్నారని యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. టాయిలెట్స్ మీద మనం ఖర్చు చేసే ప్రతి ఒక్క రూపాయి మీద రూ.34 ఫలితం వస్తుందని ప్రపంచ బ్యాంకు నివేదికలు చెబుతున్నాయి. అందుకే అమ్మ ఒడి ద్వారా మార్పు కోసం శ్రీకారం చుట్టాం. మేం రూ.వెయ్యి ఇచ్చాం, టాయిలెట్లు ఎందుకు బాగాలేవని హెడ్మాస్టర్లను ప్రశ్నించవచ్చు. సక్రమంగా నిర్వహించకుంటే 1902కు డయల్ చేస్తే సీఎం ఆఫీస్ రంగ ప్రవేశం చేస్తుంది. పుస్తకాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి జగన్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు.. అమ్మఒడి ద్వారా ఇస్తున్న సొమ్మును తమ పిల్లల కోసం మరింత మెరుగ్గా వినియోగించుకునేలా వచ్చే ఏడాది నుంచి ప్రతి అక్క చెల్లెమ్మకు ఒక ఆప్షన్ ఇస్తున్నాం. 9 నుంచి 12వ తరగతి విద్యార్థుల తల్లులు కావాలంటే నగదుకు బదులుగా ల్యాప్‌టాప్ తీసుకోవచ్చు. బయట మార్కెట్లో రూ.25 వేల నుంచి రూ.27 వేల వరకు ఉండే ఈ ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లకు ప్రభుత్వం పెద్ద కంపెనీలతో చర్చలు జరిపింది. హెచ్‌పీ, డెల్, లెనోవా, ఏసర్, ఎంఐ, ఫాక్స్‌కాన్ లాంటి కంపెనీలతో చర్చలు జరపడంతో 18 శాతం జీఎస్టీ కలుపుకుని రూ.18,500కే ల్యాప్‌టాప్ ఇవ్వడానికి కంపెనీలు ముందుకు వస్తున్నాయి. టెండర్లు పిలిచి రివర్స్ టెండరింగ్ జరపడం వల్ల రేటు ఇంకా తగ్గే అవకాశం ఉంది. 4 గిగాబైట్ ర్యామ్, 500 గిగా బైట్ స్టోరేజీ, ఇంటెల్ ఏఎండీ లేదా సమానమైన ప్రాసెసర్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు విండోస్ 365 స్టూడెంట్ వెర్షన్ స్పెసిఫికేషన్లు కలిగిన ల్యాప్‌టాప్‌లకు టెండర్లు పిలుస్తాం. వసతి దీవెన కింద ఆర్థిక సాయం పొందుతున్న విద్యార్థులకు కూడా ల్యాప్‌టాప్‌లు పొందే ఆప్షన్ ఇస్తాం. మూడేళ్ల పాటు వాటి వారెంటీ కూడా సంబంధిత కంపెనీపైనే పెడుతున్నాం. ఒక వేళ ల్యాప్‌టాప్ పాడైతే 7 రోజుల్లో బాగు చేసి ఇవ్వాలి. లేదంటే రీప్లేస్ చేసి ఇవ్వాలి. ఇందుకోసం వచ్చే మూడేళ్లలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. కేవలం అండర్ గ్రౌండ్స్ కేబుల్ వేయడానికే రూ.5,900 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. నిర్వహణ వ్యయం కూడా ఉంటుంది. అయినా సరే ఇది చేస్తున్నాం. ప్రతిపక్షాలకు కడుపు మంట.. రేపు బడుల మీద పడతారేమో! రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం కాబట్టి ప్రతిపక్షానికి చోటు లేకుండా పోతోందనే కడుపు మంట కనిపిస్తోంది. అది ఏ స్థాయిలో ఉందంటే.. ఎవరూ లేని చోట, రాత్రి పూట విగ్రహాలను ఎవరు ధ్వంసం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ధ్వంసమైన విగ్రహాలను పరిశీలిస్తామంటూ మళ్లీ అక్కడకు వారు ఎందుకు వెళ్తున్నారో అర్థం చేసుకోండి. రథాలు ఎందుకు తగలబెడుతున్నారో, ఆ తర్వాత రథయాత్రలు ఎందుకు చేయబోతున్నారో ఆలోచించండి. మనం ప్రజలకు మంచి చేసే ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా సరిగ్గా ఒకటి రెండు రోజులు అటు ఇటుగా చీకట్లో వెళ్లి గుడులను గోపురాలను టార్గెట్ చేస్తున్నారు. వీరంతా రేపు బడుల మీదా పడతారేమో.. అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా. మన కుటుంబాలు ఎదుగుతుంటే, సమాజంలో మంట పెట్టడానికి వస్తున్న వారికి బుద్ధి చెప్పాలని కోరుతున్నా. బడికి వచ్చే పిల్లలు ముఖ్యంగా ఆడ పిల్లలు, మహిళా టీచర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రతి ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో టాయిలెట్లను నిర్మించడమే కాకుండా నిర్వహణ కోసం అమ్మ ఒడిలో ఇచ్చే రూ.15 వేలల్లో రూ.1,000 మినహాయిస్తున్నాం. ఇంత డబ్బు ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి ఈ వెయ్యి రూపాయలు ఎక్కువ కాకపోయినా పిల్లల చదువుకునే బడి, పరిశుభ్రతను వారి డబ్బుతోనే నిర్వహిస్తే జవాబుదారీతనం, పరిస్థితులు మెరుగు పడతాయనే ఉద్దేశంతో మినహాయిస్తున్నాం. దైవ భక్తి లేని వారు.. దేవాలయ భూములు కాజేసిన వారు.. పట్టపగలు గుడులను కూల్చిన వారు.. చివరికి అమ్మవారి ఆలయంలో క్షుద్రపూజలు చేసిన వారు ఇవాళ ఉన్నట్లుండి కొత్త వేషాలు కడుతున్నారు. దేవుడి మీద ప్రేమ ఉన్నట్లు డ్రామాలాడుతున్నారు. కోవిడ్‌కు భయపడి ప్రతి పక్షనేత, ఆయన కుమారుడు హైదరాబాద్‌లో దాక్కుంటున్నారు. సామాన్య ప్రజలు చస్తే ఎంత? బతికితే ఎంత? అని ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తున్న బాబు కోవర్టులు పదవుల్లో ఎలా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా. పేదలకు మంచి చేయడానికి అడుగులు ముందుకు వేస్తే అడ్డు తగులుతూ ఏకంగా దుర్మార్గపు ఆర్డర్లు ఇస్తున్న పరిస్థితిని గమనించాలని కోరుతున్నా. మామ మనసు చాలా గొప్పది.. దేశంలోనే అద్భుతమైన పథకం అమ్మ ఒడి ద్వారా ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో ఏటా రూ.15 వేలు జగన్ మామ జమ చేస్తున్నారని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గిద్దలూరు హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న టి.ఆశ్రిత ఆనందం వ్యక్తం చేసింది. సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, పేదలందరికీ ఇళ్లు తదితర పథకాలను సీఎం జగన్ ప్రవేశ పెట్టారని గుర్తు చేసింది. ఇంగ్లిష్‌ను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెట్టి పేదల పట్ల జగన్ మామ గొప్ప మనసును చాటుకున్నారని పేర్కొంది. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో చక్కటి సదుపాయాలు సమకూర్చారని, బ్లాక్ బోర్డులు, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ బాగు చేశారని, తమ కుటుంబంలో నాలుగు పథకాల ద్వారా లబ్ధి పొందామని తెలియచేస్తూ జగన్ మామకు కృతజ్ఞతలు తెలిపింది. ఇలాంటి సీఎం ఉంటే నేనూ చదివేదాన్ని.. ఇళ్లలో పనులు చేసుకుంటూ పొట్ట పోషించుకునే నేను మా అమ్మాయిని ప్రైవేట్ స్కూల్లో చేర్చి ఎనిమిదేళ్లు ఫీజులు కట్టలేక అల్లాడిపోయాను. ఇక నావల్ల కాదని భావించి నాతోపాటు పనికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నా. ఆ సమయంలో అమ్మఒడి ద్వారా నా కోరిక నెరవేరింది. జగనన్న విద్యాకానుక ద్వారా ఇచ్చిన వస్తువులు బయట కొనాలంటే రూ.7 వేలు అయ్యేవి. ఆ వస్తువులు రూ.10 వడ్డీతో ప్రైవేట్ స్కూళ్లలో కొనుగోలు చేయాల్సి వచ్చేది. నా చిన్నప్పుడు ఇలాంటి సీఎం ఉంటే నేనూ చదువుకునేదాన్ని. – వెంకట రమణమ్మ, విద్యార్థిని తల్లి, గుమ్మళ్లదిబ్బ, కోవూరు మండలం, నెల్లూరు జిల్లా అమ్మ ఒడిని అడ్డుకోవాలని చూశారు ప్రతిపక్ష నేత చంద్రబాబు కుటిల, నీచ రాజకీయాలతో జగనన్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూశారని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. జగనన్న అమ్మ ఒడి రెండో విడత కార్యక్రమంలో అనిల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టేందుకు నిర్ణయించగా.. చంద్రబాబు కోర్టులో కేసు వేయించారన్నారు. ఇప్పుడు పేద విద్యార్థుల చదువు కోసం అమలు చేస్తున్న అమ్మఒడి సాయంతో మహిళలు మహా సంక్రాంతి జరుపుకుంటుంటే అడ్డుకునే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. అమ్మ ఒడి కార్యక్రమానికి ప్రతిపక్షం ఎన్నో అడ్డంకులు సృష్టించినా.. కుట్రల్ని ఛేదించుకుని పథకాన్ని మరింత ఎక్కువ మందికి వర్తింప చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్సార్ సంక్షేమంలో పది అడుగులు వేస్తే.. ఆయన బిడ్డగా సీఎం జగన్ వంద అడుగులు ముందుకు వేస్తున్నారన్నారు. -
పండుగ తరువాతే టీచర్ల బదిలీ ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఉత్తర్వుల జారీ ప్రక్రియను సంక్రాంతి సెలవుల అనంతరమే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. పండుగ సెలవుల తర్వాతే ఆయా టీచర్లు తమకు కేటాయించిన కొత్త పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. టీచర్ల బదిలీల ప్రక్రియలో భాగంగా ఆప్షన్ల నమోదును ఇప్పటికే పూర్తిచేయించిన విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం వాటిని పూర్తిగా ఫ్రీజ్ చేశారు. నిజానికి సంక్రాంతికి ముందే బదిలీ ఉత్తర్వులు జారీచేయాలని ముందు భావించినప్పటికీ కొన్ని కారణాలవల్ల సెలవుల తర్వాతకు ఆ ప్రక్రియను వాయిదా వేశారు. బదిలీల ప్రక్రియలో విద్యాశాఖ జాగ్రత్తలు.. ఈసారి బదిలీల ప్రక్రియకు సంబంధించి విద్యాశాఖ పలు జాగ్రత్తలు తీసుకుంది. ముఖ్యంగా బదిలీల కారణంగా ఏజెన్సీ, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు మూతపడకుండా చర్యలు చేపట్టింది. అలాగే.. – టీచర్లలో ఒకే స్కూలులో 8 ఏళ్లు సర్వీసు నిండిన వారికి, ప్రధానోపాధ్యాయుల్లో ఒకేచోట 5 ఏళ్లు సర్వీసు పూర్తిచేసిన వారికి తప్పనిసరి బదిలీ నిబంధన పెట్టారు. – ఇతరులలో ఒకేచోట కనీసం రెండేళ్లు నిండిన వారికి బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశమిచ్చారు. – రెండేళ్ల కన్నా తక్కువ సర్వీసు పూర్తిచేసిన వారికి కారణాలతో కూడిన అభ్యర్థన పూర్వక బదిలీ దరఖాస్తుకు వీలు కల్పించారు. 16వేల పోస్టులు బ్లాక్ మారుమూల ప్రాంతాల స్కూళ్లకు ఇబ్బంది లేకుండా.. అందరూ పట్టణ, మైదాన ప్రాంతాలకు వెళ్లిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందుజాగ్రత్తగా 16వేల పోస్టులను విద్యాశాఖ బ్లాక్ చేసింది. దీనివల్ల ఆయా ప్రాంతాల్లోని పిల్లల చదువులకు ఎలాంటి ఆటంకం ఉండదు. పోస్టులను బ్లాక్ చేస్తున్న అంశాన్ని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారికంగా వెల్లడించారు. అలాగే, ఈ సమాచారాన్ని మండలాల వారీగా అందరికీ తెలిసేలా బోర్డుల్లో ప్రదర్శించారు. పోస్టులు బ్లాక్ చేయకుంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్న 145 మండలాల్లోని 5,725 స్కూళ్లలో ఉన్న 10,198 పోస్టులు భర్తీ కాకుండా ఖాళీగా ఉండిపోయే ప్రమాదముంది. దీనివల్ల ఉపాధ్యాయుల్లేక ఆ పాఠశాలలు మూతపడే అవకాశముండేది. 76వేల బదిలీలకు వెబ్ ఆప్షన్లు ఇదిలా ఉంటే.. 76,119 బదిలీలకు సంబంధించి దాదాపు అంతా బదిలీకి వీలుగా వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. కంపల్సరీ కేటగిరీలో 26,117 పోస్టులు, రిక్వెస్టు కేటగిరి కింద 50,002 ఖాళీ పోస్టులకు వెబ్ ఆప్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తినా విద్యాశాఖ వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించింది. అలాగే, వెబ్ ఆప్షన్ సమయంలో సర్వర్లు మొరాయిస్తున్నాయన్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని, జిల్లాల వారీగా సర్వర్లు విభజించారు. పాయింట్ల ఆధారంగా బదిలీలు ఉపాధ్యాయుల సర్వీసుతో పాటు వారి పనితీరును కూడా బదిలీల్లో విద్యాశాఖ పరిగణనలోకి తీసుకుంది. వీటికి కొన్ని పాయింట్లను కేటాంచింది. విడో, భార్యాభర్తలు, తీవ్ర ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఇలా కొన్ని కేటగిరీల వారికి ప్రాధాన్యతనిస్తూ అదనపు పాయింట్లు ఇచ్చింది. ఆ ప్రకారం పాయింట్ల మెరిట్ ప్రాతిపదికన బదిలీలు చేయనున్నారు. ఈ ప్రక్రియ మేన్యువల్‌గా కాకుండా పారదర్శకంగా కంప్యూటర్ ద్వారా ఆటోమేటిగ్గా జరిగేలా కంప్యూటర్ జనరేటెడ్ బదిలీ ఉత్తర్వులు జారీచేయనున్నారు. -
‘నాడు–నేడు’తో స్కూళ్లలో అద్భుత అభివృద్ధి
గుంటూరు ఎడ్యుకేషన్: ‘మన బడి నాడు–నేడు’ పథకం ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ వి.నారాయణరెడ్డి, సీఏవీ ప్రసాద్, బి.ఈశ్వరయ్య పేర్కొన్నారు. గుంటూరు నగరంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను వారు శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 15 వేల ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు మొదటి దశ కింద ప్రభుత్వం అభివృద్ధి చేసిందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క విషయంలోనూ రాజీ పడకుండా నిధులు కేటాయిస్తోందన్నారు. మొదటి దశ అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తయ్యాయని.. రెండు, మూడు దశల్లో మరో 30 వేల పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా ప్రభుత్వం తీర్చిదిద్దనుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను ఈ స్థాయిలో అభివృద్ధి చేయడం గతంలో ఏ ప్రభుత్వ పాలనలోనూ చూడలేదన్నారు. పాఠ్యాంశాల రూపకల్పనలో సైతం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందన్నారు. కమిషన్ సభ్యులతో పాటు ఆర్జేడీ కె.రవీంద్రనాథ్‌రెడ్డి, డీఈవో గంగా భవాని తదితరులున్నారు. -
పాఠశాలల్లో పెరుగుతున్న విద్యార్థుల హాజరు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం రోజురోజుకు పెరుగుతోందని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ శుక్రవారం వెల్లడించారు. ఈ నెల 2వ తేదీన పాఠశాలలు తెరవగా 6వ తేదీ నాటికి క్రమేణా హాజరు శాతం పెరుగుతోందన్నారు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. శుక్రవారం 10వ తరగతి విద్యార్థులు 49.63% మంది హాజరయ్యారు. 9వ తరగతి విద్యార్థులు 38.29% కాగా, ఉపాధ్యాయులు 89.86% విధులకు హాజరయ్యారు. మొత్తంగా విద్యార్థుల హాజరు 43.88కి చేరింది. గత నాలుగు రోజుల్లో విద్యార్థుల హాజరును పరిశీలిస్తే 2వ తేదీన 42%, 3న 33.69, 4న 40.30, 5వ తేదీన 35 శాతం విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు. 6వ తేదీ నాటికి 43.89కి చేరింది. కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు బయటపడుతుండగా వారిని హోమ్ ఐసొలేషన్‌లో ఉంచి వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు టెస్టులు చేస్తున్నారని మంత్రి చెప్పారు. కోవిడ్‌పై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించటం, శానిటైజేషన్, మాస్క్‌లు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అన్ని జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నామని వివరించారు. పాఠశాలల్లో పారిశుధ్య పరిస్థితులనూ పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మాస్క్, శానిటైజేషన్, భౌతిక దూరం విషయాల్లో రాజీపడేది లేదన్నారు. -
హైస్కూళ్లలోనే డ్రాపవుట్ రేట్ ఎక్కువ..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి 148 మంది విద్యార్థులకు ఒక పాఠశాల ఉన్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది. రెండు జిల్లాల్లో 300 మందికి పైగా విద్యార్థులకు ఒక పాఠశాల ఉండగా, 7 జిల్లాల్లో ప్రతి 100లోపు విద్యార్థులకు ఒక స్కూల్ ఉన్నట్లుగా రాష్ట్ర ప్రణాళిక శాఖ తాజాగా రూపొందించిన ‘తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్–2020’లో వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 40,597 పాఠశాలలు ఉండగా.. అందులో 20,753 ప్రాథమిక పాఠశాలలు.. 7,356 ప్రాథమికోన్నత పాఠశాలలు.. 11,847 ఉన్నత పాఠశాలలు, 641 హయ్యర్ సెకండరీ స్కూళ్లు ఉన్నట్లు చెప్పింది. మొత్తం స్కూళ్లలో 10,369 ప్రైౖ వేటువి ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని పాఠశాలల పరిస్థితి, విద్యార్థుల నమోదు, డ్రాపవుట్ రేట్ తదితర అంశాలను ఆ నివేదికలో పేర్కొంది. నివేదికలోని ప్రధాన అంశాలివే.. ►రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య ఆయా జిల్లాల్లో నిర్దేశిత వయసున్న పిల్లల సంఖ్యతో పోల్చితే ప్రాథమిక పాఠశాలల్లో 98.4 శాతం ఉండగా, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 88.1 శాతంగా ఉంది. ఉన్నత పాఠశాలల్లో చేరే వయసున్న వారి సంఖ్యతో పోలి్చతే బడిలో చేరిన విద్యార్థుల సంఖ్య 87.08 శాతంగా నమోదైంది. మూడు జిల్లాల్లో హైసూ్కళ్లలో చేరే వయస్సు ఉన్న విద్యార్థుల సంఖ్యతో పోల్చితే.. 100 శాతానికిపైగా (వలస వచ్చిన వారు) విద్యార్థులు చేరారు. ►విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం.. విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1:30 కాగా, ఉన్నత పాఠశాలల్లో 1:35. రాష్ట్రంలో ప్రతి 26 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. నాలుగు జిల్లాల్లోని ప్రైమరీ స్కూళ్లలో మాత్రం ఉండాల్సిన టీచర్ల సంఖ్య కంటే తక్కువ మంది ఉన్నారు. ఒక జిల్లాలోని ప్రాథమికోన్నత పాఠశాలలో, రెండు జిల్లాల్లోని ఉన్నత పాఠశాలల్లో టీచర్ల సంఖ్య తక్కువగా ఉంది. ►హైస్కూళ్లలో మధ్యలోనే బడి మానేసిన విద్యార్థుల సంఖ్య (డ్రాపవుట్ రేట్) ఎక్కువ. ఆరు జిల్లాల్లో 50 శాతానికి పైగా డ్రావుట్ రేట్ ఉంది. ప్రాథమిక పాఠశాలల్లో 15.76 శాతంగా, ఎలిమెంటరీ పాఠశాలల్లో 29.37 శాతంగా, ఉన్నత పాఠశాలల్లో 34.65 శాతంగా డ్రాపవుట్ రేట్ ఉంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో–8.01 శాతం, హైదరాబాద్‌లో–0.69 శాతం, రంగారెడ్డిలో–7.12 శాతం డ్రాపవుట్ రేట్ ఉంది. మేడ్చెల్‌లోని మల్కాజిగిరిలో ప్రాథమికోన్నత పాఠశాలల్లోనూ –5.66 శాతం డ్రాపవుట్ రేట్ ఉంది. ►రాష్ట్రంలోని స్కూళ్లల్లో 60,15,597 మంది విద్యార్థులు చదువుతుండగా అందులో ఎక్కువ మంది మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనే ఉన్నా రు. ఈ లెక్కలన్నీ 2018, సెపె్టంబర్ 30 నాటికి(2011 జనాభా లెక్కల ప్రకారం..) ఉన్నవిగా ఆ నివేదికలో పేర్కొంది. -
రెండ్రోజులకు ఒకసారి తరగతులు
సాక్షి, అమరావతి: వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలల్ని తెరుస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. కోవిడ్–19 నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా స్కూళ్ల తెరవడంపై సీఎం పలు సూచనలు చేశారు. రెండు రోజులకు ఒకసారి మాత్రమే తరగతులను నిర్వహించనున్నట్టు తెలిపారు. తరగతులు నిర్వహించేది ఇలా.. ► 1, 3, 5, 7 తరగతుల వారికి ఒక రోజు.. 2, 4, 6, 8 తరగతుల విద్యార్థులకు మరో రోజు క్లాసులు నిర్వహిస్తారు. ► ఒకవేళ ఏదైనా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే మూడు రోజులకు ఒకసారి తరగతులు నిర్వహిస్తారు. ► అన్ని స్కూళ్లలో కేవలం మధ్యాహ్నం వరకు మాత్రమే తరగతులు జరుగుతాయి. భోజనం పెట్టిన అనంతరం విద్యార్థులను ఇంటికి పంపిస్తారు ► నవంబర్ నెలలో ఇదే విధానం అమలవుతుంది. పరిస్థితిని బట్టి డిసెంబర్లో తదుపరి నిర్ణయం తీసుకుంటారు. ► ఒకవేళ తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడికి పంపకపోతే.. అలాంటి విద్యార్థుల కోసం ఆన్లైన్ తరగతులు నిర్వహించాలి. -
జగనన్న విద్యా కానుక కిట్
-
తరగని ఆస్తి చదువు ఒక్కటే: సీఎం జగన్
సాక్షి, కృష్ణా జిల్లా: ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క విద్యకే ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో 'జగనన్న విద్యాకానుక' పథకాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి మన పేద పిల్లలకు రావాలన్నారు. చదువే విద్యార్థులకు ఒక శక్తి అని పేర్కొన్నారు. ‘‘పిల్లలను గొప్పగా చదివించాలనే తల్లిదండ్రులు భావిస్తారు. స్కూళ్లలో డ్రాప్ అవుట్స్‌పై గత ప్రభుత్వం ఆలోచించలేదు. ఇంగ్లీషు మీడియం చదవాలంటే ఆర్థిక భారంగా మారిన పరిస్థితులు ఉన్నాయని’’ సీఎం పేర్కొన్నారు. (చదవండి: ‘విద్యా కానుక’.. తల్లిదండ్రుల వేడుక) ‘‘పేదలకు మంచి విద్యాప్రమాణాలు అందించాలనే అంగన్వాడి నుంచి ఉన్నతవిద్య వరకు విప్లవాత్మక మార్పులు చేపట్టాం. నాడు -నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లల్లో రూపురేఖలు మారుస్తున్నాం. బడికి వెళ్లే పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు గోరుముద్ద పథకం తీసుకొచ్చాం. పేద పిల్లలు గొప్పగా చదవాలని భావించాను. ఒకటి నంచి టెన్త్ వరకు ప్రతి విద్యార్థికి విద్యాకానుక అందిస్తున్నాం. నవంబర్ 2 లోగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 44.32 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుక కిట్లు అందిస్తాం. రూ.650 కోట్ల ఖర్చుతో విద్యాకానుకను అందిస్తున్నాం. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా మూడ్రోజులపాటు ఈ కార్యక్రమం ఉంటుంది. ఉన్నత విద్య వరకు ప్రతి విద్యార్థి చదువుకోవాలి. ఉద్యోగం ఇచ్చేందుకు ప్రపంచమంతా మన దగ్గరకు రావాలి. ప్రతి విద్యార్థి గొప్పగా చదవాలని ఆశిస్తున్నాం. పేదవాడి తలరాతలు మార్చాలని 8 ప్రధాన పథకాలు అమలు చేస్తున్నాం. అమ్మఒడి పథకం ద్వారా రూ.15 వేలను ప్రతి తల్లి అకౌంట్లో వేస్తున్నామని’’ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. (చదవండి: పేదల విద్యార్థులను ఆదుకునేలా ‘విద్యా కానుక’) గర్భిణీ తల్లులు, బిడ్డల కోసం సంపూర్ణ పోషణ పథకం అమలు చేస్తున్నామని, అంగన్వాడీలను చదువుల కేంద్రంగా మార్చామని సీఎం తెలిపారు. అంగన్వాడీలను వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారుస్తున్నాం. మధ్యాహ్న భోజనం ద్వారా ప్రతి విద్యార్థికి పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు. ఇంజినీరింగ్, మెడికల్ వంటి పెద్ద చదవుల కోసం పూర్తి ఫీజురీయింబర్స్‌తో పాటు హాస్టల్ ఖర్చు కోసం వసతి దీవెన కూడా అందిస్తున్నామన్నారు. విద్యార్థుల కోసం కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని చేపట్టాం. పోటీ ప్రపంచంలో నిలిచి గెలిచేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
మరో ప్రతిష్టాత్మక పథకానికి సీఎం జగన్ శ్రీకారం
సాక్షి, కృష్ణా జిల్లా: దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రతిష్టాత్మక పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జెడ్పీ పాఠశాలలో ‘జగనన్న విద్యాకానుక’ పథకాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. తొలుత పునాదిపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో నాడు-నేడు పనులను పరిశీలించిన సీఎం.. విద్యార్థులను ప్రేమగా, ఆప్యాయంగా పలకరించి కాసేపు వారితో మాట్లాడారు. తరగతి గదుల్లో బల్లలపై కూర్చుని విద్యార్థుల అభిప్రాయాలను సీఎం జగన్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేక స్కూల్ కిట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. (చదవండి: ఒకవైపు ఆంగ్లం.. మరోవైపు తెలుగు) పాఠశాలల్లో పిల్లల నమోదును గణనీయంగా పెంచడంతో పాటు, మెరుగైన ఫలితాలు సాధించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 42,34,322 మంది విద్యార్థులకు వారి విద్యాభ్యాసానికి అవసరమైన ఏడు రకాల వస్తువులను ఈ కిట్ల రూపంలో అందించనున్నారు. పిల్లలను బడిలో చేర్చే సమయంలో ఇబ్బంది పడే పేదింటి అక్కచెల్లెమ్మలకు విముక్తి కలిగించడంతో పాటు, పాఠశాలల్లో “డ్రాప్ అవుట్లను గణనీయంగా తగ్గిస్తూ, బాలల బంగారు భవిష్యత్తుకుక బాటలు వేయడమే లక్ష్యంగా “జగనన్న విద్యా కానుక’ను ప్రభుత్వం అమలు చేస్తోంది. (చదవండి: ‘ఎవరైనా లంచం అడిగితే ఆ నంబర్ ఇవ్వాలి’) రాష్ట్ర వ్యాప్తంగా 42,34,322 మంది విద్యార్థిని, విద్యార్థులకు దాదాపు రూ.650 కోట్ల ఖర్చుతో స్కూల్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలు యూనిఫామ్‌లు కుట్టించుకునే విధంగా వారికి ముందుగానే ఈ కిట్లు అందజేస్తున్నారు. ప్రతి విద్యార్థికి స్కూల్ కిట్‌తో పాటు మూడు మాస్కులు అందించనున్నారు. 3.13 కోట్లకు పైగా పాఠ్య పుస్తకాలు, 2.19 కోట్లకు పైగా నోట్ పుస్తకాలు, 1.27 కోట్ల యూనిఫారాలు (క్లాత్), బూట్లు, సాక్సులు, బెల్టు, బాల బాలికలకు వేర్వేరు రంగుల బ్యాగులు ఆయా తరగతులకు తగ్గట్టుగా అందించనున్నారు. యూనిఫామ్ కుట్టు కూలీ మూడు జతలకి రూ.120 చొప్పున తల్లుల అకౌంట్‌కే నేరుగా జమ చేస్తారు. స్కూల్ కిట్‌కు సంబంధించిన వస్తువుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడలేదు. అత్యంత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్, ఈ–ప్రొక్యూర్మెంట్ విధానంలో సేకరించారు. చదువుకు పేదరికం అడ్డుకాకూడదు: మంత్రి సురేష్ విద్యా ప్రమాణాలు పెంచడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పేద విద్యార్థులకు బంగారు బాట వేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. నాడు - నేడు కింద ప్రతి పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దామని, నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. చదువుకు పేదరికం అడ్డుకాకూడదని సీఎం జగన్ భావించారని, 'జగనన్న విద్యాకానుక'తో విద్యార్థులకు సీఎం జగన్ అండగా ఉన్నారని మంత్రి సురేష్ తెలిపారు. ఎన్నో సంక్షేమ పథకాలు: పార్థసారధి వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. ఎక్కడాలేని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్థాయికి సీఎం జగన్ తెచ్చారని తెలిపారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. కుల,మతాలు, పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పార్థసారధి పేర్కొన్నారు. జగన్ మావయ్య అంటే ఎంతో ఇష్టం.. సభ వేదికపై సీఎం వైఎస్ జగన్‌ని విద్యార్థులు మావయ్య అంటూ సంబోధిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వారు మాట్లాడిన తీరు ఆకట్టుకుంది. జగన్ మామాయ్య సీఎం అయిన తర్వాత చాలా పథకాలు ప్రవేశ పెట్టారని, 'జగనన్న విద్యాకానుక'ను ప్రారంభిస్తున్నారని తెలిపారు. ‘‘నేను భవిష్యత్‌లో కలెక్టర్ కావాలని అనుకుంటున్నా. నేను కలెక్టర్ అయ్యేంతవరకు సీఎంగా జగనే ఉండాలని కోరుకుంటున్నా. జగన్ మావయ్య అంటే నాకు ఎంతో ఇష్టం’’ అంటూ హైస్కూల్ విద్యార్థిని అభిమానాన్ని చాటుకుంది. మరో విద్యార్థిని లీలాలహరి మాట్లాడుతూ 3వ తరగతి వరకు ప్రైవేట్ స్కూల్లో చదివానని, కానీ ఇప్పుడు గవర్న్మెంట్ స్కూల్లో చేరానని తెలిపింది. ‘జగనన్న విద్యాకానుక’ ఇవ్వడం పట్ల చాలా ఆనందంగా ఉందని పేర్కొంది. ఈ స్కూల్లో చదవడం తనకు చాలా గర్వంగా ఉందని, అన్ని వసతులు ఉన్నాయని విద్యార్థిని తెలిపింది. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ జగనన్న విద్యాకానుక ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం ప్రారంభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని తల్లిదండ్రులు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేడు జగనన్న విద్యా కానుక
-
నేడు జగనన్న విద్యా కానుక
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుక గురువారం ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అందనుంది. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేక స్కూల్ కిట్లు అందజేయనున్నారు. పాఠశాలల్లో పిల్లల నమోదును గణనీయంగా పెంచడంతో పాటు, మెరుగైన ఫలితాలు సాధించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 42,34,322 మంది విద్యార్థులకు వారి విద్యాభ్యాసానికి అవసరమైన ఏడు రకాల వస్తువులను ఈ కిట్ల రూపంలో అందించనున్నారు. పిల్లలను బడిలో చేర్చే సమయంలో ఇబ్బంది పడే పేదింటి అక్కచెల్లెమ్మలకు విముక్తి కలిగించడంతో పాటు, పాఠశాలల్లో “డ్రాప్ అవుట్లను గణనీయంగా తగ్గిస్తూ, బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే లక్ష్యంగా “జగనన్న విద్యా కానుక’ను ప్రభుత్వం అమలు చేస్తోంది. 42,34,322 మంది విద్యార్థులకు లబ్ధి రాష్ట్ర వ్యాప్తంగా 42,34,322 మంది విద్యార్థిని, విద్యార్థులకు దాదాపు రూ.650 కోట్ల ఖర్చుతో స్కూల్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలు యూనిఫామ్‌లు కుట్టించుకునే విధంగా వారికి ముందుగానే ఈ కిట్లు అందజేస్తున్నారు. ప్రతి విద్యార్థికి స్కూల్ కిట్‌తో పాటు మూడు మాస్కులు అందించనున్నారు. 3.13 కోట్లకు పైగా పాఠ్య పుస్తకాలు, 2.19 కోట్లకు పైగా నోట్ పుస్తకాలు, 1.27 కోట్ల యూనిఫారాలు (క్లాత్), బూట్లు, సాక్సులు, బెల్టు, బాల బాలికలకు వేర్వేరు రంగుల బ్యాగులు ఆయా తరగతులకు తగ్గట్టుగా అందించనున్నారు. యూనిఫామ్ కుట్టు కూలీ మూడు జతలకి రూ.120 చొప్పున తల్లుల అకౌంట్‌కే నేరుగా జమ చేస్తారు. స్కూల్ కిట్‌కు సంబంధించిన వస్తువుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడలేదు. అత్యంత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్, ఈ–ప్రొక్యూర్మెంట్ విధానంలో సేకరించారు. కోవిడ్ నేపథ్యంలో ప్రతి పాఠశాలలో వరుసగా మూడు రోజుల పాటు కిట్లు పంపిణీ చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఆదేశించారు. అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటికే కిట్లు చేరాయన్నారు. కిట్ తీసుకునేటప్పుడు విద్యార్థి బయెమెట్రిక్, ఐరిష్ హాజరుకు సహకరించాలని కోరారు. ఏవైనా సమస్యలు ఎదురైతే 9121296051, 9121296052 హెల్ప్ లైన్ నంబర్లను పని దినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటలలోపు సంప్రదించాలన్నారు. పునాదిపాడు జెడ్పీ పాఠశాలలో శ్రీకారం కంకిపాడు (పెనమలూరు): జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జెడ్పీ పాఠశాలలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథితో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. (చదవండి: ఏపీలో రికార్డు స్థాయిలో పాఠ్యపుస్తకాల పంపిణీ) -
ఇంగ్లిష్ మీడియాన్ని వ్యక్తిగతంగా సమర్థిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: ఇంగ్లిష్ మీడియంలో బోధనను వ్యక్తిగతంగా సమర్థిస్తానని, అయితే తన వ్యక్తిగత అభిప్రాయాలను విచారణలో చొప్పించలేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధనకు సంబంధించి జారీచేసిన జీవోలు 81, 85ను హైకోర్టు రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై మంగళవారం చీఫ్ జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కె.వి.విశ్వనాథన్, న్యాయవాది మెహ్‌ఫూజ్ ఎ.నజ్కీ వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వు.. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే అనేకమంది దళిత, మైనారిటీ, నిరుపేద విద్యార్థుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసిందని పేర్కొన్నారు. చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకుంటూ ఇదే విషయమై కర్ణాటకకు సంబంధించిన పిటిషన్ కూడా ఉందని, రెండింటిని కలిపి విచారిస్తామని చెప్పారు. ఇది ముఖ్యమైన, అత్యవసరంగా వినాల్సిన, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పరిష్కరించాల్సిన అంశమని సీనియర్ న్యాయవాది విశ్వనాథన్ నివేదించారు. మండల కేంద్రంలో తెలుగు మీడియం పాఠశాల ఉంటుంది విశ్వనాథన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. 96 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆంగ్ల మాధ్యమాన్నే కోరుకున్నారన్నారు. ప్రతి మండల కేంద్రంలో తెలుగు మీడియం పాఠశాల అందుబాటులో ఉంటుందని, అక్కడ చదువుకోవాలనుకునేవారికి ఉచిత రవాణా సదుపాయం కూడా అందుబాటులో ఉంటుందని చెప్పారు. చదువుకునే మీడియం నిర్ణయించుకునే హక్కు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఉందని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పిందని నివేదించారు. సీజే జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే జోక్యం చేసుకుంటూ ‘మీరు చెల్లుబాటు అయ్యే ఒకే కోణం చెబుతున్నారు. వ్యక్తిగతంగా నేను మీతో ఏకీభవిస్తున్నాను. ఈ ధర్మాసనంలోని ముగ్గురు సభ్యులం ఏకీభవిస్తున్నాం. ఇంగ్లిష్ థ్రూ అవుట్ అవర్ లైవ్స్ (ఇంగ్లిష్ మన జీవితంలో భాగమైంది).. మేం వ్యక్తిగతంగా మీతో ఏకీభవిస్తున్నాం. కానీ మా అభిప్రాయాలను విచారణలో ఆపాదించాలని అనుకోవడం లేదు. సమగ్రంగా పరిశీలించాల్సి ఉంది. పిల్లలకు మాతృభాషలో పునాది పడడం చాలా ముఖ్యం..’ అని పేర్కొన్నారు. గణాంకాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోలేమని వ్యాఖ్యానిస్తూ ధర్మాసనం విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
ఏపీలో సర్కారీ బడికి సై
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం సన్యాసిపుట్టుగ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గతంలో 23 మంది విద్యార్థులు మాత్రమే ఉండగా ఈ ఏడాది 58కి చేరింది. ఇదే మండలం ధర్మవరం ఆదర్శ పాఠశాలలో గతంలో 33 మంది ఉండగా ఇప్పుడు విద్యార్థుల సంఖ్య 63కి పెరిగింది. విజయవాడలో 1,600 మంది విద్యార్థులున్న ఏకేటీపీ హైస్కూలులో అడ్మిషన్ల కోసం పలువురు సిఫార్సులతో వస్తున్నారు. జీడీఈటీ హైస్కూలులో ఇప్పటికే 1,300 మంది విద్యార్థులు ఉండటంతో సీట్లు లేవని చెబుతున్నారు. ఇదే నగరంలో 800 మంది చదువుతున్న బీఎస్ఆర్కే హైస్కూల్లో, 700 మంది ఉన్న ఎస్పీఎస్ఎంసీ హైస్కూలులో సీట్లు లేవని సర్ది చెప్పాల్సి వస్తోంది. వీఎంసీ ఎలిమెంటరీ స్కూల్లో, ప్రశాంతి నగర్ ఎలిమెంటరీ స్కూల్లోనూ ఇదే పరిస్థితి. కాకినాడ, విశాఖ, విజయనగరం, గుంటూరు, ఏలూరు, కర్నూలు, కడప, అనంతపురంలోని మున్సిపల్ స్కూళ్లలో సీట్ల కోసం తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంది. సాక్షి, అమరావతి: విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక సంస్కరణలు, విద్యాభివృద్ధి కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపవుట్లు తగ్గడంతోపాటు విద్యార్థుల చేరికలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడం, పేద విద్యార్థులు పెద్ద చదువులు చదివేలా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించి విద్యారంగం పట్ల సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం సర్కారీ స్కూళ్ల వైపు విద్యార్థులు మొగ్గు చూపటానికి ప్రధాన కారణం. 2019–20 విద్యా సంవత్సరంలో దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లను వీడి ప్రభుత్వ పాఠశాలల్లో చేరగా, ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ రెండు నెలల వ్యవధిలోనే మరో 70,000 మందికిపైగా విద్యార్థులు సర్కారీ స్కూళ్లలో ప్రవేశాలు పొందారు. అడ్మిషన్లు ఇంకా కొనసాగుతున్నందున ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలను వీడి ప్రైవేట్ స్కూళ్లలో చేరిన వారి సంఖ్య దాదాపు 519 మాత్రమే ఉండటం గమనార్హం. ► ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతూ 1–10 వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతుండడంతో తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూళ్ల వైపు బారులు తీరుతున్నారు. ► ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తూ చేపట్టిన ‘అమ్మ ఒడి’, జగనన్న గోరుముద్ద ద్వారా నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తుండటంతో ప్రభుత్వ స్కూళ్ల పట్ల ఆసక్తి పెరిగింది. జగనన్న విద్యా కానుక ద్వారా రూ.650 కోట్లకు పైగా ఖర్చు చేసి 3 జతల దుస్తులు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, షూలు, సాక్సులు, బెల్టు, బ్యాగు ఇవ్వడం ప్రభుత్వ స్కూళ్లకు ఆదరణ పెంచుతోంది. ► ‘అమ్మ ఒడి’ద్వారా రూ.6,300కోట్లను విద్యార్థుల తల్లులకు ప్రభుత్వమిచ్చిన సంగతి తెలిసిందే. ► నాడు–నేడు కింద దాదాపు 45 వేల ప్రభుత్వ స్కూళ్లలో రూ.12 వేల కోట్లతో మరమ్మతులు చేపట్టడంతోపాటు మంచి నీటి సదుపాయం, రన్నింగ్ వాటర్‌తో మరుగుదొడ్లు, గ్రీన్ చాక్ బోర్డులు, అదనపు తరగతి గదులు, కిచెన్ షెడ్లు, ప్రహరీల నిర్మాణం, ఫర్నీచర్, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, ఇంగ్లిష్ ల్యాబ్‌లు, కంప్యూటర్, లైబ్రరీ బుక్స్, డిజిటల్ తరగతులు తదితర సదుపాయాలతో కార్పొరేట్ విద్యా సంస్థల తలదన్నేలా సర్కారీ స్కూళ్లను తీర్చిదిద్దడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆకర్షితులవుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు క్యూలు కడుతున్నారని మున్సిపల్ స్కూళ్ల టీచర్ల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలను దశల వారీగా ప్రభుత్వ స్కూళ్లకు అనుసంధానం చేసి ప్రీ ప్రైమరీ కూడా ప్రవేశ పెడుతుండడంతో చేరికలు మరింత పెరగనున్నాయి. అంచనాలకు మించి! ► కోవిడ్ వల్ల పాఠశాలలు ఇంకా తెరుచుకోలేదు. దీంతో తల్లిదండ్రులు మాత్రమే వచ్చి తమ పిల్లల అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ► ప్రస్తుతం 1– 9వ తరగతి వరకు విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తూ వారి డేటాను ఆన్లైన్లో చేరుస్తున్నారు. టెన్త్ పూరై్తన దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు కాలేజీల్లో చేరనున్నారు. మరోవైపు కొత్తగా ఒకటో తరగతితోపాటు ఇతర తరగతుల్లోనూ ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని విద్యాశాఖ తాత్కాలిక తేదీని నిర్ణయించింది. ఆ తరువాత విద్యార్థుల చేరికలపై పూర్తి స్థాయిలో స్పష్టత రానుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది లక్ష్యం 72,46,428 మంది విద్యార్థులకు గాను ఛైల్డ్ ఇన్ఫో ప్రకారం 62,94,005 మంది ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ► విద్యాశాఖ గణాంకాల ప్రకారం ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు 4,77,577 మంది విద్యార్థుల చేరికలకు సంబంధించి డేటా అప్లోడ్ అయింది. వీరు కాకుండా టీసీలు, డ్రాపవుట్లు 7,79,174 వరకు ఉన్నట్లు అంచనా. ప్రభుత్వ స్కూళ్లవైపే అంతా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ నుంచి ప్రభుత్వ స్కూళ్లలోకి వచ్చే విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పుడు మా స్కూలు బావుంది గతంలో ప్రైవేట్ పాఠశాలలో చదివా. ఇటీవల మా ఊరిలో ప్రభుత్వ పాఠశాల సూపర్‌గా తయారైంది. బెంచీలు, గ్రీన్ బోర్డులు, ఫ్యాన్లు, రంగులతో బొమ్మలు చాలా బాగున్నాయి. అందుకే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలోనే చేరా. – మంతెన సాత్విక్ వర్మ, 5వ తరగతి, పోణంగి ఎంపీపీ స్కూల్, పశ్చిమగోదావరి పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య.. మా ఇద్దరు అమ్మాయిలను ఇచ్ఛాపురంలో రెండు కార్పొరేట్ స్కూళ్లలో చదివిస్తుండేవాడిని. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తుండటం చూసి ఆశ్చర్యమేసింది. పైసా ఖర్చు లేకుండా మా పిల్లలను అన్ని సదుపాయాలున్న ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని నిర్ణయించి సన్యాసిపుట్టుగ ప్రాథమికోన్నత పాఠశాలలో చేర్పించా. – లాబాల జానకిరావు, కేశుపురం, శ్రీకాకుళం జిల్లా -
పాఠశాలలకు టీచర్ల హాజరు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలు పాటిస్తూ సోమవారం నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు హాజరయ్యారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు సోమవారం నుంచి 50 శాతం మంది చొప్పున టీచర్లు హాజరు కావచ్చని కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు ఇటీవల రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కూడా కొన్ని సూచనలు జోడించిన సంగతి తెలిసిందే. ► ఆన్లైన్, దూరదర్శన్ ద్వారా బోధించే పాఠాలలోని సందేహాలను నివృత్తి చేసుకోవడం కోసం స్కూళ్లలోకి 9, 10 తరగతుల విద్యార్థులు, కాలేజీల్లోకి 11, 12 తరగతుల విద్యార్థులను మాత్రమే అనుమతించారు. ► తల్లిదండ్రుల నుంచి సమ్మతి పత్రాలు తీసుకొన్నాకనే స్కూళ్లు, కాలేజీల్లోకి అనుమతించారు. ► ఇదిలా ఉండగా, రాష్ట్రంలో విద్యా వారధి, విద్యామృతం కార్యక్రమాల ద్వారా రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) దూరదర్శన్, ఆకాశవాణిల ద్వారా అవకాశం ఉన్న చోట్ల ఆన్లైన్లో బోధనా కార్యక్రమాలు ఇప్పటికే కొనసాగిస్తుండటం, సందేహాల నివృత్తి కోసం స్కూళ్లలో కొంత మంది టీచర్లను అందుబాటులో ఉంచడం తెలిసిందే. -
పూర్తి కావొచ్చిన నాడు–నేడు తొలి దశ పనులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రభుత్వ పాఠశాలల్లో ‘నాడు–నేడు’ మొదటి దశ పనులు పూర్తి కావొచ్చాయి. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం టాయిలెట్స్ కూడా లేక ఆడ పిల్లలు పడుతున్న అవస్థలను ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేస్తున్నప్పుడు గమనించిన వైఎస్ జగన్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా నాడు–నేడు కార్యక్రమం చేపట్టారు. తద్వారా భారీ ఖర్చుతో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారిపోతున్నాయి. ► రాష్ట్రంలో 46,788 ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో పది రకాల కనీస మౌలిక సదుపాయాల కల్పన కోసం మూడు దశల్లో మన బడి నాడు–నేడు కార్యక్రమాన్ని చేపట్టారు. ► మూడు దశల్లో నాడు–నేడు కార్యక్రమానికి రూ.12,000 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో భాగంగా గత ఏడాది నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం నాడు ఒంగోలులో మన బడి నాడు–నేడు తొలి దశను ప్రారంభించారు. ► తొలి దశలో రూ.3,627 కోట్ల వ్యయంతో 15,715 ప్రభుత్వ విద్యా సంస్థల్లో పది రకాల మౌలిక వసతుల పనులకు శ్రీకారం చుట్టారు. ► ఇందులో ఇప్పటికే 58,559 పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందు కోసం ఇప్పటికే రూ.1,417 కోట్లు వ్యయం చేశారు. రెండు, మూడవ దశల పనులపై దృష్టి ► రెండో దశలో 14,584 స్కూళ్లలోరూ.4,732 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో రెండో దశ పనులను చేపట్టి వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ► మూడో దశలో 16,489 స్కూళ్లలో రూ.2,969 కోట్ల వ్యయంతో పనులు చేపట్టేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పనులను వచ్చే ఏడాది నవంబర్‌లో ప్రారంభించి మార్చి నెలాఖరుకు పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఇందుకు నిధుల సమీకరణ మార్గాలపై కూడా మార్గ నిర్దేశం చేశారు. పిల్లల తల్లిదండ్రుల కమిటీ పర్యవేక్షణలో పనులు సాగుతున్నాయి. పాఠశాల ప్రస్తుత పరిస్థితిపై లక్షల ఫొటోలు తీశారు. రేపు మౌలిక సదుపాయాలు కల్పించాక.. ఆ మార్పును కళ్లకు కట్టినట్లు చూపిస్తారు. -
పాఠశాల విద్యకు కొత్త రూపు
స్కూళ్లలో ఉన్న విద్యార్థుల ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. రెగ్యులర్‌గా హెల్త్ చెకప్స్, పరిశుభ్రత పాటించడంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో హెల్త్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, ఏఎన్ఎంల సేవలను సంపూర్ణంగా వినియోగించుకోవాలి. – సీఎం వైఎస్ జగన్ ప్రతి మండలంలో ఒక జూనియర్ కాలేజీ రాష్ట్రంలో 270 మండలాల్లో జూనియర్ కాలేజీలు లేవు. ప్రతి మండలానికి ఒక హైస్కూల్‌ను జూనియర్ కాలేజీగా మార్చేలా ఇదివరకే తీసుకున్న నిర్ణయంతో ఈ సమస్యను అధిగమిస్తాం. ► ప్రస్తుతం ఉన్న జూనియర్ కాలేజీల్లో ఖాళీలను భర్తీ చేయడంపై దృష్టి పెట్టాలి. ఐఐటీ, జేఈఈ లాంటి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసే దిశగా కార్యాచరణ ఉండాలి. ► ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ఒక భవనం ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయుల శిక్షణకు సరైన పాఠ్య ప్రణాళికను అనుసరించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న నాడు –నేడు కార్యక్రమాల్లో భాగంగా మధ్యాహ్న భోజనం తయారీ కోసం కిచెన్ షెడ్‌ను కూడా నిర్మించాలి. నాడు–నేడు కార్యక్రమాల్లో 10వ అంశంగా దీన్ని చేర్చాలి. మధ్యాహ్న భోజనం తయారీ కోసం వినియోగించే పాత్రలు, పరికరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. సాక్షి, అమరావతి: ఆరు సంవత్సరాలలోపు పిల్లల కోసం ప్రీ ప్రైమరీ–1 (ఎల్కేజీ), ప్రీ ప్రైమరీ–2 (యూకెజీ)లను ప్రాథమిక విద్య పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా కిండర్ గార్డెన్స్ (ఎల్కేజీ, యూకేజీ)పై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. విద్యా రంగంలో సమూల మార్పులకు నాంది పలుకుతూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. నాణ్యమైన విద్య, జగనన్న గోరుముద్దపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన విద్య, మానవ వనరుల సమర్థ వినియోగం, ఉత్తమ బోధన తదితర అంశాలపై చర్చించారు. స్కూలు పిల్లల కోసం రూపొందించిన పాఠ్య పుస్తకాలను పరిశీలించారు. సమీక్ష వివరాలు ఇలా ఉన్నాయి. కిండర్ గార్డెన్‌పై ప్రత్యేక దృష్టి ► ప్రీ ప్రైమరీ–1, ప్రీ ప్రైమరీ–2 (పీపీ–1, పీపీ–2) క్లాసులను కూడా ప్రాథమిక విద్య పరిధిలోకి తీసుకొచ్చి, వారికి నాణ్యమైన విద్యనందించే దిశగా చర్యలు తీసుకోవాలి. ఇందుకు పకడ్బందీ పాఠ్య ప్రణాళిక ఉండాలి. ► ఒకటో తరగతి నుంచి బోధించే పాఠ్యాంశాలతో పీపీ–1, పీపీ–2 పాఠ్యాంశాల మధ్య సారూప్యత ఉండాలి. పీపీ–1, పీపీ–2 విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా టీచర్లు ఉండాలి. టీచర్ల విషయంలో రాజీ పడొద్దు. ► రాష్ట్రంలో 55 వేల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అందులో దాదాపు 35 వేల కేంద్రాలకు భవనాలు లేవు. ► కొత్త భవనాల నిర్మాణం కోసం స్థలాలు గుర్తిస్తున్నారు. ► ప్రైమరీ స్కూళ్లకు సమీపంలోనే అంగన్వాడీ కేంద్రాలు ఉండాలంటే.. ముందుగా ఆయా స్కూళ్లలో తగిన స్థలం ఉందా.. లేదా? అన్నదాన్ని పరిశీలించి, మ్యాపింగ్‌తో ఒక నివేదిక తయారు చేయాలి. క్యాంపు కార్యాలయంలో నాణ్యమైన విద్య, జగనన్న గోరుముద్దపై సమీక్షిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లెర్న్ టు లెర్న్ కాన్సెప్ట్‌కు నాంది ► డిజిటల్ లెర్నింగ్, డివైజ్‌లపై అవగాహన కల్పించాలి. లెర్న్ టు లెర్న్ కాన్సెప్ట్‌కు ఇది నాంది కావాలి. దీని వల్ల పిల్లలు.. వారి తల్లిదండ్రులకు అవగాహన కలుగుతుంది. ► హై ఎండ్ డిజిటల్ లెర్నింగ్‌లో భాగంగా 8 లేదా 9వ తరగతిలో డాంగిల్, ఐపాడ్ ఇవ్వాలన్నది ఆలోచన. 8వ తరగతి నుంచి లైఫ్ స్కిల్స్, కెరీర్ కౌన్సెలింగ్ కార్యక్రమం మొదలవ్వాలి. ► హైస్కూల్లో లైబ్రరీలు, సైన్స్ లేబరేటరీలు, ప్లే గ్రౌండ్స్, ఫిజికల్ లిటరసీ కల్పించే దిశగా చర్యలు చేపట్టాలి. పిల్లలకు వ్యాయామం అన్నది పాఠ్య ప్రణాళికలో భాగం కావాలి. ► స్కిల్ డెవలప్మెంట్ కాలేజీల్లో ఐటీఐ, పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారికి నైపుణ్యాభివృద్ధి కల్పిస్తాం. హైస్కూల్లో డ్రాప్ అవుట్ అయిన వారికి వివిధ పనుల్లో శిక్షణ ఇస్తాం. ప్రైవేటు స్కూళ్లకు అక్రిడిటేషన్ విధానం ► ప్రైవేటు స్కూళ్లకు అక్రిడిటేషన్ విధానం, వాటి ఫీజులపై పర్యవేక్షణ ఉండాలి. ప్రతి ఏటా ప్రైవేటు స్కూళ్లలో తనిఖీలుండాలి. ఫిర్యాదు చేసేందుకు కంప్లైంట్ బాక్స్ ఉండాలి. ఒక యాప్ కూడా తీసుకురావాలి. ► లంచాలు, ప్రలోభాలకు తావు ఉండకూడదు. ప్రాధాన్యత కార్యక్రమం గోరుముద్ద ► మధ్యాహ్న భోజనంలో నాణ్యత, స్కూళ్లలో బాత్ రూమ్స్ పరిశుభ్రత చాలా ముఖ్యం. వీటిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి. పాఠశాలలు తెరిచే సమయానికి అన్ని చర్యలూ తీసుకోవాలి. సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ వి.చినవీరభద్రుడు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
బడుగులకు సర్కారు బడే అండ
సాక్షి, అమరావతి: బడుగు, బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు చెందిన అత్యధిక శాతం మంది పిల్లలకు ప్రభుత్వ బడులే అండగా నిలుస్తున్నాయి. వీరిలో అత్యధిక శాతం మందివి నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలే కావడంతో తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలోని ఫీజులు చెల్లించే స్థోమత లేక ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఇప్పటివరకు ఆంగ్ల మాధ్యమం ప్రభుత్వ స్కూళ్లలో లేకపోవడంతో స్థోమత ఉన్న కుటుంబాలు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. వీరిలో అత్యధికం ఓసీలే. వారితో పాటు కొంతమంది సామాన్యులు కూడా అప్పోసప్పో చేసి తమ పిల్లలనూ ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు. అగ్రవర్ణాల్లోని నిరుపేదలూ తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకే పంపిస్తున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2019–20లో రాష్ట్రంలోని మొత్తం స్కూలు విద్యార్థుల్లో ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లల్లో 56 శాతం, ప్రైవేట్ స్కూళ్లల్లో 44 శాతం మంది చదువుతున్నారు. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు దళారులను నియమించి ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా తమ స్కూళ్లలో చేర్పించుకుంటున్నారు. 2020–21 నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతుండడంతో పాటు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక వంటి కార్యక్రమాలు, టీచర్లకు ఆంగ్ల మాధ్యమ బోధనలో శిక్షణనివ్వడం వంటి చర్యలతో ప్రభుత్వ స్కూళ్లలో వచ్చే విద్యా సంవత్సరంలో చేరికలు మరింత పెరుగుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ‘ప్రైవేట్’లో కమీషన్లు..అడ్మిషన్లు ► ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు పిల్లలను, వారి తల్లిదండ్రులను ఆకర్షించడానికి అనేక రకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. ► కొన్ని స్కూళ్లు దళారీలను నియమించుకుని కమీషన్లు ముట్టచెబుతున్నాయి. ► అంతేకాక.. తమ సంస్థల్లో పనిచేసే బోధనా సిబ్బందికి టార్గెట్లు పెట్టి మరీ విద్యార్థులను చేర్పిస్తున్నాయి. ► టార్గెట్లు పూర్తిచేయకపోతే ఉద్యోగం ఉండదని హెచ్చరిస్తున్నాయి. మాకు అన్ని సదుపాయాలూ కల్పిస్తున్నారు నేను 9వ తరగతి చదువుతున్నాను. మా స్కూలులో ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తోంది. చాలా పేద గిరిజన కుటుంబం నుంచి వచ్చిన నాకు ప్రభుత్వ పాఠశాలే అన్ని విధాలుగా ఆదుకుంటోంది. అమ్మఒడి కింద డబ్బులు అందించడంతో పాటు స్కూలులో పుస్తకాలు, ఇతర పరికరాలు అందిస్తూ మంచిగా చదువులు చెప్పిస్తున్నారు. – రూపేంద్ర నాయక్, 9వ తరగతి, మిట్టపల్లి జడ్పీ హైస్కూల్, ఓడీ చెరువు మండలం ఇ.గొల్లపల్లి గ్రామం, అనంతపురం జిల్లా ఆంగ్లంలోనే మాకు పాఠాలు నేను 7వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ మాకు ఇంగ్లీషు మీడియంలోనే పాఠాలు చెబుతున్నారు. ప్రైవేటు స్కూలు కన్నా మంచిగా, సులభంగా అర్ధం చేసుకునేలా పాఠాలు చెబుతున్నారు. అమ్మఒడి పథకంతో పాటు పుస్తకాలు, ఇతర వస్తువులు కూడా స్కూలులో ఇస్తున్నారు. చదువు ఒక్కటే కాకుండా ఆటలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటున్నాయి. – సత్యగంగాధర్,కేఏఎన్ మున్సిపల్ హైస్కూల్,సాలూరు, విజయనగరం జిల్లా -
రేపటి నుంచి విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు
సాక్షి, అమరావతి: పాఠశాలలు ఆగస్టు 3 నుంచి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఈలోగా విద్యార్థులను ఆంగ్ల మాధ్యమానికి సన్నద్ధం చేసేందుకు వీలుగా బుధవారం నుంచి బ్రిడ్జి కోర్సులు ప్రారంభం కానున్నాయి. దూరదర్శన్‌తోపాటు ఆన్‌లైన్‌లోనూ వీడియో పాఠాలు బోధించేలా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. బ్రిడ్జి కోర్సులను విద్యార్థులకు వసతి సదుపాయాలతో నిర్వహించాలని తొలుత భావించినా కరోనా కారణంగా నిలిచిపోయింది. 2020–21 విద్యాసంవత్సరం నుంచి 1 – 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించి తదుపరి తరగతులను ఆపై ఏడాదుల్లో ఆంగ్ల మాధ్యమాలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. తల్లిదండ్రులు, విద్యార్థుల అభిప్రాయాలను సేకరించి విద్యాశాఖ ఆ దిశగా ఏర్పాట్లు చేపట్టింది. ఇప్పటికే టీచర్లకు ఆంగ్ల మాధ్యమంలో బోధనపై శిక్షణ కూడా పూర్తయింది. నిర్దేశిత తేదీల్లో స్కూలుకు రావాలి.. ► మొబైల్ నెట్వర్క్, టీవీలో పాఠాలు చూసే అవకాశం లేని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పుస్తకాల ద్వారా బ్రిడ్జి కోర్సులు నేర్చుకొనేందుకు వీలుగా ప్రాథమిక పాఠశాలల టీచర్లు ప్రతి మంగళవారం పాఠశాలలకు హాజరు కావాలని ఆదేశించారు. ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభించి ప్రతి మంగళవారం పాఠశాలల్లో విద్యార్థుల నోట్ పుస్తకాలు, వర్కు పుస్తకాలను సరిచూసేందుకు తల్లిదండ్రులు, పేరెంట్స్ కమిటీలకు సమాచారం అందించాలి. విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా బ్రిడ్జి కోర్సు లెవెల్ – 1 లేదా బ్రిడ్జి కోర్సు లెవెల్ – 2 పుస్తకాలను విద్యార్థులకు అందించాలని హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు సూచించారు. ► 6, 7వ తరగతి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు టీచర్లు 17 నుంచి ప్రతి బుధవారం హాజరు కావాలి. ► 8, 9వ తరగతుల విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు 19 నుంచి ప్రతి శుక్రవారం పాఠశాలలకు హాజరు కావాలి. ► పదో తరగతి బోధించే టీచర్లు ప్రతి బుధ, శుక్రవారాల్లో పాఠశాలలకు హాజరు కావాలి. ► వీడియో పాఠాలు నేర్చుకునే విద్యార్థుల నోట్ బుక్స్, వర్క్ బుక్స్‌ను టీచర్లు తనిఖీ చేసి మూల్యాంకనం చేయాలి. రేపట్నుంచి ‘సప్తగిరి’లో.. ► ఈ నెల 10 నుంచి బ్రిడ్జి కోర్సులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఎక్కువ మందికి కంప్యూటర్లు అందుబాటులో ఉండనందున దూరదర్శన్ సప్తగిరి చానల్ ద్వారా బ్రిడ్జి కోర్సు పాఠాలను ప్రసారం చేయనున్నారు. ► దూరదర్శన్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు 1 – 5వ తరగతి విద్యార్థులకు, ఆ తర్వాత 2 గంటల నుంచి 3 వరకు 6, 7 తరగతులకు పాఠాలు ఉంటాయి. 3 నుంచి 4 గంటల వరకు 8, 9, 10వ తరగతులకు నిపుణులతో ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలను రోజూ ప్రసారం చేయనున్నారు. ► జూలై నెల సిలబస్‌కు సంబంధించిన అంశాలన్నీ వీటిలో ఉంటాయి. రోజువారీ పాఠ్యాంశాల షెడ్యూల్‌ను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. -
టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్
‘నాడు – నేడు’ నా మనసుకు చాలా నచ్చిన కార్యక్రమం. దీని కింద పాఠశాలల నిర్మాణాల్లో, పనుల్లో నాణ్యత కోసం పాటించాల్సిన పద్ధతులకు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) రూపొందించాలి. దీనిని సంబంధిత విభాగాలకు పంపించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఇంజినీరింగ్ అసిస్టెంట్‌నూ భాగస్వామ్యం చేయాలి. గవర్నమెంట్ అంటే నాసిరకం కాదు.. క్వాలిటీ అన్న పేరు రావాలి. 6 నుంచి 10 తరగతుల పిల్లలు నేర్చుకునే విధానం, వారు చూపిస్తున్న ప్రతిభపై నిరంతరం అధ్యయనం జరగాలి. విద్యార్థులకు వస్తున్న మార్కులు, వారు చూపిస్తున్న ప్రతిభపై సమాచారాన్ని సేకరించి అనలైజ్ చేయాలి. ఏయే సబ్జెక్టుల్లో వెనకబడి ఉన్నారో గుర్తించి.. నేర్చుకోవడంలో వారికున్న సమస్యలను అధిగమించడానికి ప్రత్యేక పద్ధతులు, విధానాలను రూపొందించాలి. డిజిటల్ లెర్నింగ్ కోసం సమగ్రంగా యాప్ రూపకల్పన చేయాలి. విద్యార్థుల సందేహాల నివృత్తికి వీడియో కాల్ సదుపాయం కూడా ఉండేలా చూడాలి. సెంట్రలైజ్డ్ వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయాలి. తద్వారా టీచర్లు, విద్యార్థులు ఇంటరాక్ట్ అవడానికి వీలుంటుంది. ఈ అంశాల మీద అధికారులు దృష్టి పెట్టాలి. భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి ఈ పద్ధతులు ఉపయోగపడతాయి. –సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: విద్యార్థుల సంఖ్య ఆధారంగా, వారి అవసరాల మేరకే టీచర్లను నియమించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు, టీచర్ల నిష్పత్తిని కచ్చితంగా పాటిస్తూ బదిలీలు ఉండాలని దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమంపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు మంచి చేయడానికి టీచర్ల బదిలీలు దోహదం చేసేలా విధివిధానాలు రూపొందించాలని స్పష్టం చేశారు. జూలై 15 తర్వాత ఆన్లైన్ విధానంలో టీచర్ల బదిలీలు నిర్వహిస్తామని అధికారులు సీఎంకు వివరించారు. ఏ పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారనే దానిపై మ్యాపింగ్ చేయాలని సీఎం సూచించారు. 2017లో అనుసరించిన పద్ధతుల కారణంగా 7,991 స్కూళ్లకు సింగిల్ టీచర్‌ను కేటాయించారని, వీటిలో చాలా వరకు మూతబడ్డాయని సమావేశంలో చర్చకు వచ్చింది. సమీక్షలో సీఎం ఆదేశాలు, అధికారులు వెల్లడించిన అంశాలు ఇలా ఉన్నాయి. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో ఏర్పాటు చేయబోయే నూతన కుర్చీలు, బెంచీలు, సీలింగ్ ఫ్యాన్లు, తాగునీటి వాటర్ప్లాంట్లను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిల్లలకు మంచి జరగాలి ► ప్రభుత్వ స్కూళ్లను ఎలా నిర్వీర్యం చేయాలి.. విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలకు ఎలా పంపాలి.. అనే కోణంలో అప్పుడు నిర్ణయాలు జరిగాయి. దీనివల్ల ప్రభుత్వ విద్యా రంగానికి తీవ్ర నష్టం జరిగింది. ► అక్టోబర్, నవంబర్ నెలలు వచ్చినా యూని ఫామ్స్, పుస్తకాలు ఇవ్వలేదు. ఇప్పుడు పిల్లల కు మంచి చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నాం. ► పిల్లలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరినీ ఇబ్బందులకు గురి చేయొద్దు. అధికారులు అందరూ కూర్చొని టీచర్ల రీ పొజిషన్‌కు సంబంధించి విధి విధా నాలు రూపొందించాలి. ► ప్రభుత్వ పాఠశాలల్లో మంచి చదువులు అందించడానికి విప్లవాత్మకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. చురుగ్గా పనులు ► నాడు –నేడు కార్యక్రమాల్లో నాణ్యతను ఎలా పెంచాలన్న దానిపై దృష్టి పెట్టాలి. దీని కోసం ఒక విధానాన్ని రూపొందించాలి. ఆగస్టు 3న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నందున, జూలై చివరి నాటికి పనులన్నీ పూర్తి చేయాలి. ► నాడు – నేడు పనులకు సంబంధించి రూ.533 కోట్లు పేరెంట్స్ కమిటీల ఖాతాల్లో ఉన్నాయని అ«ధికారులు వెల్లడించారు. గుంటూరు జిల్లాలో అత్యధిక నిధులు ఖర్చయ్యాయని, లాక్డౌన్ సడలింపులతో గత వారం నుంచి పనుల్లో వేగం పెరిగిందని చెప్పారు. ► ప్రత్యేకంగా జేసీలను నియమించడం వల్ల పనులు చాలా చురుగ్గా సాగుతున్నాయని అధికారులు వివరించారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం బొమ్మినేనివారిపాలెం (యెండ్లూరు) గ్రామంలో నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఉన్నత పాఠశాల తరగతి గదులకు కరెంటు వైరింగ్, ఫ్లోరింగ్ పనులు చేస్తున్న దృశ్యం మధ్యాహ్న భోజనం నాణ్యత బావుండాలి ► గోరుముద్ద కింద పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం ఏ స్కూల్లో చూసినా ఒకటే నాణ్యతో ఉండాలి. పేమెంట్ల విషయంలో ఎలాంటి ఆలస్యం ఉండకూడడు. ► కలెక్టర్లు, జేసీలు మధ్యాహ్న భోజనంపై నిరంతరం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలి. దీన్ని విధిగా పాటించేలా ఆదేశాలు ఇవ్వాలి. స్కూల్లో సదుపాయాలపై ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి. ఏ సమస్య ఉన్నా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫోన్ చేసేలా ఆ నంబర్‌ను ప్రదర్శించాలి. సమస్యలు ఉంటే తల్లిదండ్రులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ► పాఠశాలలు, అందులోని బాత్రూమ్స్ను పరిశుభ్రంగా ఉంచడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ► జగనన్న విద్యా కానుక కోసం ఈ నెల 8, 9 తేదీలలో షూస్ కోసం విద్యార్థుల కొలతలు తీసుకుంటున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ► సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి రాజ శేఖర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం సూచనల మేరకే టీచర్ల బదిలీలు టీచర్ల బదిలీలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకే బదిలీలు చేప డతాం. వెబ్ బేస్ కౌన్సిల్ ద్వారా టీచర్ల బదిలీలు ఉంటాయి. టీచర్లు బదిలీల కోసం ఎవరి చుట్టూ తిరగా ల్సిన అవసరం లేదు. పదవ తరగతి పరీక్షలు పూర్తి అయ్యాక స్కూల్స్ ప్రారంభం అయ్యేలోపు బదిలీలు ఉంటాయి. ఒక్క స్కూల్ కూడా మూయడానికి వీల్లేదని సీఎం ఆదేశించారు. – ఆదిమూలపు సురేష్, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి రివర్స్ టెండరింగ్‌లో రూ.144.80 కోట్లు ఆదా నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో వస్తువులు, పరికరాల కొనుగోళ్లలో ఇప్పటి వరకు రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.144.80 కోట్లను ఆదా చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తెలిపారు. వస్తువులు, పరికరాల కోసం దాదాపు రూ.890 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశామని, శానిటరీ ఐటమ్స్ కాకుండా మిగతా వాటికి టెండర్లు కూడా ఖరారు చేశామని చెప్పారు. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో తొలి దశలో చేపడుతున్న పనుల పురోగతిని సీఎం జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్న పిల్లలు కూర్చునే బల్లల నమూనాలతో పాటు వాటర్ ప్యూరిఫైర్, ఫిల్టర్, అల్మరాలు, సీలింగ్ ఫ్యాన్లను స్వయంగా పరిశీలించారు. అనంతరం పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే.. సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్‌కు వెళ్లాలి ► పాఠశాలలకు అవసరమైన వస్తువులు, ఫర్నిచర్.. తదితర వాటి కొనుగోలు కోసం సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్‌కు వెళ్లడం ద్వారా సమయానికి వాటిని పొందడమే కాకుండా, నాణ్యత ఉంటుంది. బిడ్డింగ్‌లో పోటీ కారణంగా తక్కువ ధరకే లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. ► గవర్నమెంట్ స్కూళ్లలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ చేపట్టిన ఈ కార్యక్రమంలో నాణ్యత విషయంలో రాజీ పడొద్దు. ఫర్నిచర్ ఏర్పాటు చేయడమే కాదు, వాటి నిర్వహణ కూడా ఎంతో ముఖ్యం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వచ్చే నెల చివరి నాటికి అన్ని స్కూళ్లలో ఏర్పాట్లు పూర్తి కావాలి. ఏవేవి ఎన్నెన్నంటే.. ► తొలి దశలో 15,715 స్కూళ్ల మార్పులో భాగంగా 9 రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. 1 నుంచి 3వ తరగతి వరకు 1.50 లక్షల బల్లలు, 4 నుంచి 6వ తరగతి వరకు మరో 1.50 లక్షల బల్లలు, 7 నుంచి 10వ తరగతి వరకు డ్యుయల్ డ్రాలతో కూడిన 2.10 లక్షల బల్లలు కొనుగోలు చేస్తోంది. టీచర్ల కోసం 89,340 కుర్చీలు, టేబుళ్లు, 72,596 గ్రీన్ చాక్ బోర్డులు, 16,334 అల్మారాలు, 1,57,150 ఫ్యాన్ల కొను గోలుకు టెండర్లు ఖరారు చేసింది. -
ప్రభుత్వ టీచర్ల నుంచి ఆనూహ్య స్పందన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పెంచేందుకు వీలుగా టీచర్లలో మరిన్ని నైపుణ్యాలను పెంపొందించేందకు ప్రభుత్వ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ), సమగ్ర అభ్యసన అభివృద్ధి కార్యక్రమం (సీఎల్‌ఈపీ) పేరుతో చేపట్టిన వెబ్‌నార్ శిక్షణకు ప్రభుత్వ టీచర్ల నుంచి ఆనూహ్య స్పందన లభిస్తోంది. వెబ్‌నార్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అందించే ఆంగ్లం, తదితర టీచింగ్ శిక్షణకు 1.10 లక్షల మంది హాజరయ్యారు. వీరికి ఎస్సీఈఆర్టీ రెండు విధాలుగా శిక్షణనిస్తోంది. రీడింగ్ మెటీరియల్, సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్‌లను ‘అభ్యసన’ యాప్‌లో నిర్వహిస్తున్నారు.వెబ్‌నార్ పోర్టల్‌లో లైవ్ తరగతులను వివిధ విశ్వవిద్యాలయాలు, ఇతర జాతీయ సంస్థల విద్యావేత్తలతో నిర్వహిస్తున్నారు. సాంకేతిక, సబ్జెక్ట్ అంశాలపై శిక్షణ వెబ్‌నార్ పోర్టల్ ద్వారా తొలుత టీచర్లకు టెక్నాలజీ అంశాలపైనా బోధన సాగింది. పోర్టల్ వినియోగం, ఎలాంటి కంటెంట్‌ను ఎలా తీసుకోవాలి? యూ ట్యూబ్‌లో ఏయే అంశాలను గ్రహించాలి వంటి అంశాల్లో సాంకేతిక నైపుణ్యాలను అందించారు. తరువాత ఆంగ్ల నైపుణ్యాలు, వివిధ సబ్జెక్టుల బోధనా విధానాలపై 15 రోజులు శిక్షణనిచ్చారు. ఇంగ్లిష్ గ్రామర్‌తో పాటు వివిధ సబ్జెక్ట్‌ల కంటెంట్ కూడా ఉంది. ప్రస్తుతం స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ చేపడుతున్నాం. విద్యార్థులకు దూరదర్శన్, ఆకాశవాణి ద్వారా పాఠ్యాంశాలు చెప్పించాం. టీచర్లే స్వయంగా ఆయా పాఠ్యాంశాలపై వీడియోలు చిత్రీకరించేలా వీడియో ఎడిటింగ్, ఫొటో ఎడిటింగ్ అంశాలపై లండన్‌కు చెందిన నిపుణురాలు ఎడ్విన్‌తో ఆ టెక్నాలజీపై శిక్షణ ఇప్పించాం. దీంతో టీచర్లు పలు అంశాలపై 800 వీడియోలు రూపొందించారు. – డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి, ఎస్సీఈఆర్టీ ఇన్చార్జ్ డైరెక్టర్ ఆన్లైన్లో అభిప్రాయాల సేకరణ ► వెబ్‌నార్ శిక్షణ ద్వారా వారు ఆంగ్ల నైపుణ్యాలు పెంపుదల, ప్రయోజనం, సమస్యలు అవసరమైన మార్పులపై టీచర్ల నుంచి ఆన్లైన్ పద్ధతిలో అభిప్రాయాలను తీసుకున్నారు. ► 5 పాయింట్ల రేటింగ్ ఉండే ప్రతి అంశానికి దాదాపు అందరు టీచర్లు కూడా 4.5 నుంచి 5 పాయింట్ల రేటింగ్ ఇచ్చారు. ఈ శిక్షణ నిరంతరం కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. ► టీచర్లు, విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులను కూడా ప్రారంభించారు. ► శిక్షణ సందర్భంగా రోజువారీ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌ల పేరుతో సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్‌లను నిర్వహిస్తున్నారు. ► వెబ్‌నార్ శిక్షణలో 80 వేల మంది టీచర్లు గ్రాండ్ టెస్ట్‌కు హాజరయ్యారు. ► టీచర్లు ఎప్పుడు పాల్గొన్నా ఇబ్బంది లేకుండా అంతకు ముందు అంశాల రికార్డులను చూసి నేర్చుకొనేలా చేశారు. ఎంతో ప్రయోజనం లాక్డౌన్ సమయంలోప్రభుత్వం ఉపాధ్యాయుల కోసం మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ల ద్వారా వెబ్‌నార్ శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనే వీలు కల్పించడంతో ఎంతో మేలు జరుగుతోంది. మే 27 నుంచి ప్రారంభమైన స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ జూన్ 30 వరకూ కొనసాగనుంది. ఈ వెబ్‌నార్ శిక్షణ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్‌గా వ్యవహరించాను. 2012 నుండి 1 నుండి 5 తరగతుల వరకు ఉన్న పాఠాలను వీడియో పాఠాలుగా తయారుచేసి సుమారు 800 వీడియోలను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాను. 6 లక్షల మందికి చేరువగా ఆన్లైన్ క్లాసులు లాక్డౌన్ సమయంలో విద్యార్థులకు నిరంతరాయ విద్యా బోధన దిశగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న ఆన్లైన్ తరగతులకు విశేష ఆదరణ లభిస్తోంది. దూరదర్శన్, రేడియా, జూమ్ యాప్‌ల ద్వారా నిర్వహిస్తున్న ఈ క్లాసులు ఆరు లక్షల మంది విద్యార్థులకు చేరుకునే దిశగా నడుస్తున్నాయి. ఇప్పటికే లక్షమందికి పైగా ఆన్లైన్ క్లాసులు అందుతున్నాయి. లాక్డౌన్ కారణంగా పదో తరగతి పరీక్షలు వాయిదా పడటంతో మరింత ప్రాధాన్యం పెరిగింది, ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కూడా ఆలస్యం కానున్నందున సకాలంలో సిలబస్ పూర్తి చేసేలా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి కల్నల్ వి రాములు తెలిపారు. ► విద్యామృతం పేరుతో ఈ పథకం ప్రారంభించి డీడీ–సప్తగిరి ఛానల్ ద్వారా క్లాసులు. ► ఈ–విద్యాలోక టెక్నాలజీ ద్వారా ఆన్లైన్ బోధన. నిష్ణాతులైన గురుకుల ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో తరగతులు. ► ఎంసెట్ విద్యార్థులకు ఆలిండియా రేడియో ద్వారా క్లాసులు. ► 409 మంది నూతన టీజీటీలకు జూమ్ యాప్ ద్వారా శిక్షణ తరగతులు. ► కొత్తగా పదోన్నతి పొందిన గురుకుల ప్రిన్సిపాల్స్‌కు ‘లీడర్షిప్ ఇంపరేటివ్స్’పై శిక్షణ. ► లిటిల్ టీచర్స్ పేరుతో 39 మంది విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు. ► గురుకుల విద్యాలయాల సొసైటీ సిబ్బందికి ఇంగ్లిష్ గ్రామర్, ఈ–ఆఫీస్ రికార్డు వర్కులపై శిక్షణ. -
చరిత్ర గతిని మార్చి నవశకాన్ని లిఖించి..
‘‘జగన్ అనే నేను..’’ అభిమాన జనం.. జయజయధ్వానాల మధ్య ఆ మాట వినిపించి సరిగ్గా సంవత్సరమయ్యింది. ప్రమాణస్వీకారం నాడు ప్రారంభమైన సంక్షేమ రథం విరామంలేకుండా పరుగులు తీస్తోంది. పేదల కోసం రెండడుగులు ముందుకే వేస్తున్నాడని అడుగడుగునా నిరూపితమయ్యింది. అనుభవజ్ఞులను మించిన ‘మంచి ముఖ్యమంత్రి’ అంటూ దేశమంతా కితాబులిచ్చింది. పథకాల అమలులోనే కాదు పాలనలోనూ ఓ కొత్త శైలి.. ప్రతి అడుగులో ఓ కొత్త ఒరవడి... నేటి కంటే రేపు బావుండటాన్ని.. అభివృద్ధి అంటాం. ప్రతి పేదవాడి ఇంట్లో నుంచి ఒక ఇంజనీరో, ఒక డాక్టరో, ఒక కలెక్టరో వచ్చినప్పుడే వారు పేదరికం నుంచి బయటపడినట్లు, అభివృద్ధి చెందినట్లు లెక్క. ఈ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలి ఏడాదిలోనే బలంగా అడుగులు ముందుకు వేశారు. అన్ని వర్గాల వారికి భరోసా ఇచ్చేలా రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలే ఇందుకు నిదర్శనం. సాక్షి, అమరావతి: ఏడాది పాలనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ సంతకం చేశారు. ఏడాది పాలనలో వినూత్న, విప్లవాత్మక నిర్ణయాలకు శ్రీకారం చుట్టడం ద్వారా చరిత్ర గతిని మార్చారు. ప్రతి గడపకు ప్రభుత్వ సేవలను తీసుకెళ్లిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఎన్నికల్లో తనపై అత్యధిక శాతం ప్రజల్లో వ్యక్తమైన విశ్వాసం మరింతగా పెంపొందించేలా.. అత్యల్ప శాతం ప్రజల్లో వ్యక్తమైన అనుమానాలను నివృత్తి చేసేలా.. అన్ని వర్గాల ప్రజలు సగర్వంగా తలెత్తుకునేలా ఏడాది పాలన జనరంజకంగా సాగింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే పెన్షన్లను రూ.2,250కి పెంచుతూ మొదటి సంతకం చేసి ‘ఎన్నికల మేనిఫెస్టో’ అమల్లో తొలి అడుగే బలంగా వేశారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా.. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సరి కొత్త చరిత్రను లిఖించారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సూచిక(ఇండెక్స్)గా నిర్దేశించుకున్న వైఎస్ జగన్.. అన్ని రంగాల్లోనూ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. నాణ్యమైన విద్య నుంచి ఉపాధి దాకా.. ► విద్యార్థులకు బంగారు భవిత కోసం విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణల అమలుకు నడుం బిగించారు. పిల్లలందరినీ బడులకు పంపేలా తల్లులకు ఆర్థికంగా ఊతమిచ్చేలా ‘అమ్మ ఒడి’ కింద రూ.15 వేలు అందజేయడంతోపాటు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ‘నాడు–నేడు’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ► పిల్లలకు ఉచితంగా పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫామ్‌లు తదితరాలు సమకూర్చేలా ‘విద్యా కానుక’.. ఉన్నత చదువులను నిరుపేద విద్యార్థులకు అందించే లక్ష్యంతో ఫీజు రీయింబర్స్ చేయడానికి ‘విద్యా దీవెన’.. ఉన్నత చదువులు చదివే విద్యార్థుల వసతి, హాస్టల్ ఖర్చుల కోసం ‘వసతి దీవెన’ పథకాలు ప్రారంభించారు. క్రమం తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి పరీక్షలు నిర్వహిస్తామని ఇచ్చిన హామీ అమలులో భాగంగా తొలి ఏడాదే గ్రామ సచివాలయాల్లో 1.34 లక్షల మంది ఉద్యోగులను, 2.75 లక్షల మందిని వలంటీర్లుగా నియమించారు. ► పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం చేసి– ఉపాధికి ఢోకా లేకుండా చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయడం ద్వారా పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం నుంచి ఉపాధికి భరోసా కల్పించేలా సంస్కరణలను అమలు చేస్తూ విద్యారంగంలో సరి కొత్త చరిత్ర సృష్టించారని విద్యావేత్తలు అభినందిస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం ► వైద్యం కోసం పేదలు అప్పుల పాలు కాకూడదన్నది సీఎం వైఎస్ జగన్ అభిలాష. ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ‘నాడు–నేడు’కు శ్రీకారం చుట్టారు. ► డాక్టర్లు, నర్సులు తదితర ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆదేశించారు. ఏడాదికి రూ.5 లక్షల వరకూ ఆదాయం ఉన్న వారందరినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. వైద్య చికిత్స వ్యయం రూ.వెయ్యి దాటితే.. వాటిని ఆరోగ్యశ్రీ కింద చెల్లింపులు చేయాలని నిర్ణయించారు. ఆరోగ్యానికి భరోసా కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి బాటలు వేశారంటూ వైద్య నిపుణులు, సామాజికవేత్తలు అభినందిస్తున్నారు. ► మద్యపాన నియంత్రణ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారని.. ఇప్పటికే బెల్ట్ షాపులు మూతపడ్డాయని.. మద్యం దుకాణాల సంఖ్య గణనీయంగా తగ్గించారని.. మద్యం సీసాను ముట్టుకోవాలంటేనే షాక్ కొట్టేలా ధరలు పెంచారని, ఇది ప్రజల జీవన ప్రమాణాలపై గణనీయమైన ప్రభావం చూపుతోందని సామాజికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ► విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్లో ఉంచి, వైద్య సేవలు అందించడం.. ఎక్కువ పరీక్షలు చేయడం ద్వారా బాధితులను గుర్తించి ఆసుపత్రుల్లో చికిత్స అందించడం ద్వారా కరోనా వ్యాధి విస్తరణకు అడ్డుకట్ట వేయడంలో సీఎం వైఎస్ జగన్ విజయం సాధించారని వైద్య నిపుణులు ప్రశంసిస్తున్నారు. మేనిఫెస్టోకు సిసలైన నిర్వచనం ► ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 341 రోజులపాటు 3,648 కిలోమీటర్ల మేర నిర్వహించిన పాదయాత్ర ద్వారా కష్టాల్లో ఉన్న ప్రజలకు ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అని భరోసా ఇస్తూ ఇచ్చిన హామీలనే ఎన్నికల మేనిఫెస్టోగా ప్రకటించిన వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ 50 శాతం ఓట్లతో.. 86 శాతం శాసనసభ.. 92 శాతం లోక్‌సభ స్థానాలను దక్కించుకుని చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ► ప్రజలు తనపై పెట్టుకున్న విశ్వాసాన్ని.. మరింతగా పెంపొందించేలా అధికారం చేపట్టాక తొలి ఏడాదిలోనే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 90 శాతానికిపైగా అమలు చేయడం ద్వారా వైఎస్ జగన్.. ప్రజాస్వామ్య చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెర తీశారని రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. ► టీడీపీ సర్కార్ చేసిన అప్పుల వల్ల రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయినప్పటికీ, సంక్షేమ పథకాల అమలుకు బ్రేక్ వేయకుండా.. నిధులు విడుదల చేయడాన్ని బట్టి చూస్తే సామాజిక భద్రతకు సీఎం జగన్ ఎంత ప్రాముఖ్యతను ఇస్తున్నారన్నది విశదమవుతుందని సామాజిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు. ► నామినేటెడ్ పదవులు, పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం తీసుకొచ్చారు. మహిళల భద్రత కోసం దేశం యావత్తు మనవైపు చూసేలా ‘దిశ’ చట్టం చేశారు. పండగలా వ్యవసాయం ► పెట్టుబడులకు రైతులు ఇబ్బందులు పడకుండా ‘రైతు భరోసా’ కింద ఏటా రూ.13,500ను ప్రభుత్వం అందజేస్తోంది. రాయితీపై విత్తనాలు, ఎరువులను సరఫరా చేస్తోంది. వ్యవసాయ సహాయకుల ద్వారా పంటల సాగులో సలహాలను అందజేస్తోంది. ► పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం సర్కారే కొనుగోలు చేస్తుండటంతో వ్యాపారులు కనీస మద్దతు ధర మేరకు పంటలను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్టుబడి నుంచి పంట కొనుగోలు వరకూ.. రైతుకు ప్రభుత్వం దన్నుగా నిలుస్తుండటంతో వ్యవసాయం పండగలా మారిందని వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రశంసిస్తున్నారు. సుపరిపాలన.. పారదర్శకత.. ► సుపరిపాలన అందించడానికి విప్లవాత్మక సంస్కరణలకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయడం కోసం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ► టీడీపీ సర్కార్ ఇంజనీరింగ్ పనుల్లో పాల్పడిన అక్రమాలను ప్రక్షాళన చేసి.. వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా తొలి ఏడాదిలోనే రూ.2,080 కోట్లను ఖజానాకు మిగిల్చారు. సమగ్రాభివృద్ధి దిశగా అడుగులు ► రాష్ట్రంలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో గోదావరి, కృష్ణా, వంశధార, పెన్నా, నాగావళి నదీ జలాలను ఆయకట్టుకు అందించడంలో సర్కార్ విజయవంతమైంది. ► ఖరీఫ్‌లో కోటి ఎకరాలకు.. రబీలో 20.77 లక్షల ఎకరాలకు నీళ్లందించడం వల్ల రికార్డు స్థాయిలో దిగుబడులు రావడంతో రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ► రాష్ట్రాన్ని సుభిక్షం చేయడానికి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన పోలవరంతోపాటు ఇతర ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడం.. నదీ వరద జలాలను ఒడిసి పట్టి బంజరు భూములను సుభిక్షం చేసి.. రాష్ట్రానికి అన్నపూర్ణగా ఉన్న నామధేయానికి సార్థకత చేకూర్చడం కోసం పంచశీల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ► పారిశ్రామికాభివృద్ధికీ పెద్దపీట వేస్తున్నారు. తొలి ఏడాదిలోనే 39 భారీ, మధ్యతరహా పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించేలా చేశారు. దీనివల్ల 34,822 మందికి ఉపాధి దొరికింది. కొత్తగా ఏడాదిలో 13,122 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటి వల్ల రూ.2503 కోట్ల పెట్టుబడితో 63,897 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ప్రభుత్వ పారదర్శక విధానాల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. ఏడాది పాలనపై నిజాయితీగా సమీక్ష ఏడాది పాలనపై గత ఐదు రోజులుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజాయితీగా సమీక్షించుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబులా నేల విడిచి సాము చేయలేదన్నారు. తొలి ఏడాదిలోనే మేనిఫెస్టోలోని హామీలు దాదాపు పూర్తి చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన వారికి చేసిన మంచి పనులు, సంక్షేమ పథకాలు తెలియజేసి నిజాయితీగా, వినమ్రతతో సలహాలు సూచనలు తీసుకున్నారని వివరించారు. ఏడాది కాలంలో సీఎం వైఎస్ జగన్ పూర్తిగా పని మీదే దృష్టి పెట్టారని చెప్పారు. సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను విడుదల చేసి కొత్త ఒరవడికి పునాదులు వేశారన్నారు. వీటి అమలును పటిష్టం చేసుకుంటూ నీటిపారుదల, పారిశ్రామికరంగం, విద్యా వైద్య రంగాల్లో మౌలికసదుపాయాల కల్పనతో దేశంలోనే నంబర్–1 చేసే దిశలో అడుగులేస్తున్నారని చెప్పారు. -
ఇంగ్లిష్ మీడియం..పేదబిడ్డల బాగు కోసమే
పేదలు తమ పిల్లల బతుకులు మారాలని ఆరాటపడుతున్నా.. మన ఖర్మ కొద్దీ ఒక చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో బతుకుతున్నాం. అటువంటి కార్యక్రమానికి కూడా అడ్డంకులే. బయట ఒకటి మాట్లాడుతూ అసెంబ్లీలో బిల్లును అడ్డుకున్నారు. అయితే బిల్లును జాప్యం చేయగలిగారు కానీ అడ్డుకోలేకపోయారు. ఆ బిల్లును మళ్లీ పెట్టి పాస్ చేయించాం – ముఖ్యమంత్రి జగన్ సాక్షి, అమరావతి: ఉన్నత విద్యతోనే నిరుపేదల బతుకులు మారతాయని, ఆ దిశగానే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇంగ్లిష్ మీడియం వద్దంటున్న పెద్ద మనుషులు వారి పిల్లలను, మనవళ్లను ఏ మీడియంలో చదివిస్తున్నారో ఆలోచించుకోవాలన్నారు. రాష్ట్రంలో 96 శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లిష్ మీడియం కోరుకుంటున్నారని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం కోసం సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించామని చెప్పారు. 94 శాతం పేరెంట్స్ కమిటీలు కూడా ఇంగ్లిష్ మీడియాన్నే కోరుకున్నాయన్నారు. దేశంలో ఉన్నత చదువులు చదివే వారు శాతం కేవలం 25.8 శాతమేనని, పేదరికంతో ఫీజులు చెల్లించలేక విద్యకు దూరమవుతున్నారని సీఎం పేర్కొన్నారు. ‘మన పాలన– మీ సూచన’లో విద్యారంగంపై బుధవారం మేధోమథన సదస్సులో ఇంగ్లిష్ మీడియం ఆవశ్యకత గురించి ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. ఆ వివరాలివీ... పేరెంట్స్ కమిటీలు కావాలన్నాయి పేద విద్యార్థులు, వారి కుటుంబాల మేలు కోసం ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీషు మీడియం స్కూళ్లుగా మార్చాలని నిర్ణయించాం. ఈ క్రమంలో పేరెంట్స్ కమిటీలను ఏర్పాటు చేసి మాధ్యమంపై అభిప్రాయాలను కోరాం. దాదాపు 94 శాతం పేరెంట్స్ కమిటీలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఉంటేనే తమ పిల్లలు ఆంగ్లం నేర్చుకుని బాగా చదువుకుంటారని, భావి ప్రపంచంతో పోటీ పడగలుగుతారని తేల్చి చెప్పాయి. కొత్త థియరీలు... ► కొంతమంది ప్రతి అడుగులోనూ అడ్డుకుంటూ చివరకు ఎలా మాట్లాడుతున్నారంటే ఇంగ్లీషు మీడియం తెస్తే తెలుగును అగౌరవపర్చినట్లు అంటూ కొత్త థియరీలు తెస్తున్నారు. అంతగా తెలుగును గౌరవించాలనే ఈ పెద్దమనుషులు తమ పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లను ఎక్కడ చదివిస్తున్నారు? అంతా ఇంగ్లీషు మీడియంలోనే చదివిస్తున్నారు. కానీ పేదబిడ్డలు మాత్రం తెలుగు మీడియంలోనే చదవాలట. కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా పేదల జీవితంలో మార్పు తెచ్చేందుకు ఉక్కు సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తున్నాం. ► సదస్సులో మంత్రులు ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, విద్యా శాఖ అధికారులతో పాటు, నిపుణులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
జగనన్న విద్యా కానుక
-
స్కూల్‌కు వచ్చిన తొలిరోజే విద్యా కానుక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు అభ్యసనంలోనే కాకుండా ఆహార్యంలోనూ కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులకు దీటుగా ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. 2020–21 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు 7 రకాల వస్తువులను కానుకగా అందించనుంది. జగనన్న విద్యా కానుక కింద వీటన్నిటినీ కలిపి కిట్ రూపంలో ప్రతి విద్యార్థికి పంపిణీ చేయనుంది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 39.70 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ పాఠశాలలు తెరిచిన మొదటి రోజునే 7 రకాల వస్తువులను విద్యార్థులకు అందించేందుకు సమగ్ర శిక్ష అభియాన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులకు బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. వేరే వాహనాల్లో వచ్చే వారికి అయ్యే ఛార్జీని కూడా చెల్లించనుంది. విద్యార్థి అభీష్టం మేరకు ఆంగ్ల మాధ్యమంలో కూడా బోధన కొనసాగనుంది. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉన్నా ప్రతి తరగతిలో తెలుగు తప్పనిసరిగా ఉంటుంది. ► జగనన్న విద్యా కానుక కింద 3 జతల దుస్తుల వస్త్రం, బెల్టు, ఒక జత షూ, రెండు జతల సాక్స్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్ అందిస్తారు. ► దుస్తుల వస్త్రాన్ని పాఠశాలల పేరెంట్స్ కమిటీల ద్వారా విద్యార్థుల తల్లులకు పంపిణీ చేయిస్తారు. ఒక్కో జతకు కుట్టుకూలి కింద రూ.40 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లోనే ప్రభుత్వం జమ చేస్తుంది. ► జగనన్న విద్యా కానుక కింద ప్రభుత్వం 2020–21 విద్యాసంవత్సరానికి రూ. 650.60 కోట్లను వెచ్చిస్తోంది. ► వస్తువుల నాణ్యతలో ఏమాత్రం రాజీ వద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా ఆయనే స్వయంగా విద్యార్థులకు అందించే ప్రతి వస్తువునూ క్షుణ్నంగా పరిశీలించారు. ► సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ద్వారా 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకే నిధుల లభ్యత ఉంటుంది. రాష్ట్రం 40 శాతం, కేంద్రం వాటా 60 శాతం నిధులు కేటాయిస్తాయి. 9, 10 తరగతుల వారికి ఎస్ఎస్ఏ నిధులు రావు. దీంతో ఆ విద్యార్థులకు అయ్యే వ్యయం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ► ఇటీవలే ఈ విద్యార్థులకు అవసరమయ్యే దుస్తులు, తదితరాల కోసం రూ.80,43,88,866 మంజూరు చేసింది. ► దీనివల్ల 9, 10 తరగతులకు చెందిన 8,28,369 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. -
ఇంగ్లిష్ మీడియానికే ఓటు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంపై రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) 58 పేజీల నివేదికను ప్రభుత్వానికి సోమవారం సమర్పించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో అనేక అంశాలపై సమగ్రంగా విశ్లేషణ చేయడంతోపాటు పాఠశాల స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమం ఎంత అవసరమో నొక్కి చెప్పింది. 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రానున్న విద్యా సంవత్సరం నుంచి ఏ మాధ్యమంలో బోధన కావాలనే విషయమై ప్రభుత్వం ఇటీవలే విద్యార్థుల తలిదండ్రుల నుంచి లిఖితపూర్వక ఆప్షన్లను సేకరించగా.. 96.17 శాతం మంది ఆంగ్ల మాధ్యమంలోనే బోధన ఉండాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ దృష్ట్యా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టేందుకు వీలుగా సిఫార్సులతో కూడిన నివేదిక ఇవ్వాలని ఎస్సీఈఆర్టీని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎస్సీఈఆర్టీ సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం. నివేదికలో ఏముందంటే.. ► అన్ని రకాల సమగ్ర విశ్లేషణల అనంతరం ఎస్సీఈఆర్టీ ఈ దిగువ విషయాలను నివేదికలో పొందుపర్చినట్లు తెలిసింది. విద్యార్థులు మాతృభాషలో ప్రావీణ్యం పొందేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూనే ఇతర సబ్జెక్టుల్లో సమగ్ర నైపుణ్యానికి ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉండాలని సిఫార్సు చేసింది. దీని ద్వారానే అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయని స్పష్టం చేసినట్లు సమాచారం. ఆ వివరాలిలా. ► ఆంగ్ల మాధ్యమం వల్ల విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలు, ప్రమాణాలు అభివృద్ధి చెందుతాయి. ► దీనివల్ల రాజ్యాంగం నిర్దేశించిన విలువలు విద్యార్థుల్లో పెరుగుతాయి. విద్యార్థుల్లో సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. ► శారీరక, మానసిక సామర్థ్యాల పెంపు దిశగా.. విద్యార్థి కేంద్రంగా బోధన జరగాలి. అభ్యసనం అనేది వివిధ ప్రక్రియలను చేపట్టడం ద్వారా కొనసాగాలి. ► విద్యార్థుల్లో ఒత్తిడి, భయం, ఆందోళన లేకుండా తమ భావాలను స్వేచ్ఛగా.. తడబాటుకు తావు లేకుండా చెప్పగలగాలి. ► నిరంతర సమగ్ర మూల్యాంకన విధానంలో విద్యార్థులు సాధిస్తున్న జ్ఞాన సముపార్జనను ఎల్లప్పుడూ పర్యవేక్షించటం ద్వారా వారిలో సామర్థ్యాలు ఏ మేరకు పెరుగుతున్నాయో కూడా తెలుసుకోవచ్చు. ► ఈ దృష్ట్యా ప్రభుత్వం 1నుంచి 10 తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని దశలవారీగా ప్రవేశ పెట్టాలి. ► ఇందుకు సంబంధించి ఎస్సీఈఆర్టీ 1నుంచి 6వరకు ఆంగ్ల మాధ్యమం పాఠ్య పుస్తకాలను అభివృద్ధి చేయించింది. ► ఉర్దూ, తమిళం, కన్నడ, ఒరియా మాధ్యమం స్కూళ్లు యథాతథంగా కొనసాగుతాయి. ఆ స్కూళ్లలో విద్యార్థుల ఆప్షన్లకు అనుగుణంగా ఆంగ్ల మాధ్యమం తరగతులు సమాంతరంగా కొనసాగించవచ్చు. ► తెలుగు సబ్జెక్టును 1నుంచి 10 తరగతి వరకు తప్పనిసరిచేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఎస్సీఈఆర్టీ తెలుగు సబ్జెక్టు పాఠ్య పుస్తకాలను ఇప్పటికే పునర్నిర్మితం చేసి మాతృభాష మరింత పటిష్టమయ్యేలా తీర్చిదిద్దింది. ► బోధనాభ్యసన ప్రక్రియలను పరిపుష్టం చేయడం, ప్రభుత్వ పథకాల ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి పర్చడం వంటి చర్యలు ఫలితాలిస్తాయి. ► విద్యార్థులకు వర్క్ బుక్స్, స్కూల్ కిట్స్, అభివృద్ధిపర్చిన పాఠ్య పుస్తకాలు, పౌష్టికతతో కూడిన మధ్యాహ్న భోజనం వంటివి దీనికి మరింత తోడ్పాటునిస్తాయి. ► ఐసీటీ వేదికల ఆధారంగా టీచర్ల సామర్థ్యాలు పెంచేందుకు వీలుగా వారికిచ్చిన అనేక శిక్షణ కార్యక్రమాలు ఇందుకు ఉపకరిస్తాయి. ► తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ విద్యార్థులు పురోగతిపై వారికి వివరిస్తూ చర్చిస్తూ ఉండాలి. -
విజ్ఞాన ప్రపంచంలో ఇంగ్లిష్ పరిజ్ఞానం తప్పనిసరి
సాక్షి, అమరావతి: విజ్ఞానంతో కూడిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆంగ్ల భాషా పరిజ్ఞానం, నైపుణ్యాలు బాగా ఉన్నవారికే ఎక్కువ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ స్పష్టం చేశారు. ఆంగ్ల నైపుణ్యాలు ఉన్నవారికే ఆదాయం కూడా ఎక్కువగా వస్తోందని కుండబద్దలు కొట్టారు. ప్రస్తుత ప్రపంచీకరణ, సరళీకరణ నేపథ్యంలో ఇంగ్లిష్ ఎవరూ కాదనలేని వాస్తవమని తేల్చిచెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో డ్రాపవుట్లు పెరగడానికి కారణం.. అక్కడ ఇంగ్లిష్ మాధ్యమం లేకపోవడమేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమాన్నే కోరుకుంటున్నారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించి ఆంగ్ల మాధ్యమంలో సమర్థంగా, సమగ్రంగా బోధించగలిగేలా టీచర్లను తీర్చిదిద్దాలన్నారు. అప్పుడే ఆంగ్ల మాధ్యమం సత్ఫలితాలిస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రొఫెసర్ నాగేశ్వర్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ► మాతృభాషలో బోధన శాస్త్రీయమే అయినప్పటికీ ఈనాటి ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ఇంగ్లిష్ ప్రభావమే ఎక్కువ. గ్లోబల్ ఎకానమీ, గ్లోబల్ నాలెడ్జి దానిపైనే ఆధారపడి ఉన్నాయి. ప్రపంచ వాణిజ్య లావాదేవీలు కూడా అత్యధికం ఇంగ్లిష్‌లోనే జరుగుతున్నాయి. ► ప్రతిభావంతులైన విద్యార్థులు ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం లేకపోవడంతో ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ► స్టార్ హోటల్లో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం రావాలన్నా మంచి ఇంగ్లిష్ రావాలి. ఆ స్థాయిలో ప్రపంచ ఎకానమీ మారింది. మంచి ఉద్యోగం, ఆదాయం పొందాలంటే అది ఇంగ్లిష్‌తోనే సాధ్యం. ప్రపంచ పరిజ్ఞానం కూడా అత్యధికం ఇంగ్లిష్‌లోనే ఉంది. ఆ విజ్ఞానాన్ని సముపార్జించాలంటే ఇంగ్లిష్ మాధ్యమం కావాల్సిందే. ► అయితే తెలుగు మీడియంలో చదువుకుంటూ ఇంగ్లిష్‌ను నేర్చుకుంటానన్నా అవకాశం ఇవ్వాలి. ► బోధన ఏ మాధ్యమంలో ఉండాలన్నది తల్లిదండ్రులు, పిల్లల నుంచే తెలుసుకోవాలి. వారి అభిప్రాయం మేరకు మాధ్యమం పెట్టాలి. ► ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఇంగ్లిష్‌లోనే ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా ఇంగ్లిష్ మీడియమే కోరుతున్నారు. నా అభిప్రాయం కూడా ఇంగ్లిష్ మాధ్యమం ఉండాలనే. ► ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియాన్ని పెడితే డ్రాపవుట్లను కూడా నియంత్రించొచ్చు. ఇంగ్లిష్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు ప్రతి స్కూల్లో సమర్థులైన ఇంగ్లిష్ టీచర్లను నియమించాలి. ఇంగ్లిష్ ల్యాబ్స్, పుస్తకాలు,రిఫరెన్సు గ్రంథాలను సమకూర్చాలి. అదేవిధంగా అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేయాలి. తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియానికి మార్చేటప్పుడు ఒక సమగ్ర ప్రణాళిక ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా పాఠశాలల్లో ప్రమాణాలు పెరగాలి. బోధన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలి. అలాంటి ప్రమాణాలుంటేనే అన్ని వర్గాల మధ్య సమానత్వం ఏర్పడుతుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకొనే పేద వర్గాలకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపవుట్లు అందుకే.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం లేకపోవడం వల్లే డ్రాపవుట్లు పెరుగుతున్నాయి. పేదలు కూడా తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియం కోసమే ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు. పేదపిల్లలు ప్రైవేటు స్కూళ్లకు ఎందుకు వెళ్తున్నారని అధ్యయనం చేస్తే కనిపించే మొట్టమొదటి కారణం.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం లేకపోవడమే. భాషాభిమానం ఉన్నా వాస్తవాన్ని గ్రహించాలి భాషాభిమానం ఉండొచ్చు కానీ రియాలిటీ ఏమిటో గుర్తించాలి. మన అభిప్రాయాలతో రియాలిటీని ఆపలేం. తెలుగును ప్రేమించినంత మాత్రాన ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకించాల్సిన పనిలేదు. తెలుగు పండితులు, కవుల పిల్లలు ఈరోజు ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతున్నారు. -
ఆంగ్లమా... తెలుగా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు బోధనా మాధ్యమంగా ఏ భాష ఉండాలన్న అంశంపై తల్లిదండ్రుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయ సేకరణ చేపట్టింది. వారి మనోభావాలకు అనుగుణంగా బోధనా మాధ్యమం ఉండాలన్న ఉద్దేశంతో లిఖితపూర్వకంగా అభిప్రాయాలు సేకరిస్తోంది. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులకే పూర్తి స్వేచ్ఛనిచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల నుంచి ఎంఈఓలు, డిప్యుటీ డీఈఓలు, మున్సిపల్ కమిషనర్లు, డీఈఓలను అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో భాగస్వాములను చేసింది. తమ పిల్లలు ఏ భాషా మాధ్యమంలో చదువుకుంటారో తల్లిదండ్రులు సచివాలయ కార్యదర్శులు ఇచ్చే ప్రత్యేక ఫార్మాట్లో టిక్ చేసి సంతకం చేసి ఇవ్వాలి. ► హైకోర్టు సూచనల మేరకు తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలను సేకరించి మాధ్యమాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఈనెల 21న జీవో 20 జారీ చేశారు. దీన్ని అనుసరించి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా విద్యాధికారులకు ఉత్తర్వులు ఇచ్చారు. ► 2020–21 విద్యా సంవత్సరం నుంచి 1–6వ తరగతి విద్యార్థులకు ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో వారి తల్లిదండ్రులు సచివాలయ కార్యదర్శులు అందచేసే ఆప్షన్ ఫార్మాట్ల ద్వారా తెలియచేయాలి. ► అమ్మ ఒడి కార్యక్రమం కోసం పాఠశాలలు, గ్రామం, మండలాల వారీగా సేకరించిన విద్యార్థులు, తల్లిదండ్రుల వివరాలు అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో సిద్ధంగా ఉన్నాయి. వీటి ఆధారంగా వార్డు, గ్రామ సచివాలయ కార్యదర్శులు మాధ్యమంపై తల్లిదండ్రుల నుంచి ఫార్మాట్లో లిఖిత పూర్వకంగా సేకరించాలి. కోవిడ్ నేపథ్యంలో తగిన ప్రోటోకాల్‌ను పాటించాలి. ► మాధ్యమంపై తల్లిదండ్రుల సంతకాలతో సేకరించిన ఫార్మాట్ హార్డ్ కాపీలను పాఠశాల, మండలాల వారీగా జిల్లా విద్యాధికారి కార్యాలయాల్లో భద్రపరచాలి. ► మండల విద్యాధికారులు ఈ సమాచారాన్ని ఫారం–1 ద్వారా క్రోడీకరించాలి. జిల్లా స్థాయిలో క్రోడీకరించిన సమాచారాన్ని ఫారం–2లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి పంపించాలి. ► ఈ మేరకు కలెక్టర్లు సంబంధిత విభాగాల అధికారులందరికీ ప్రత్యేక సర్క్యులర్లను జారీ చేశారు. ప్రొఫార్మాలో సమాచారం ఇలా ఇవ్వాలి... ► జిల్లా విద్యాధికారిని ఉద్దేశిస్తూ తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో ప్రొఫార్మా ద్వారా తెలియచేయాలి. ► తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏ మీడియం కావాలో ఎంచుకుని పత్రంలో టిక్ చేయాలి. ► 2020–21 విద్యా సంవత్సరంనుంచి తమ కుమారుడు/కుమార్తెకు ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో తెలిపేందుకు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 3 ఆప్షన్లను ఇచ్చింది. మూడు ఆప్షన్లు ఇవీ.. 1. తెలుగు తప్పనిసరిగా బోధిస్తూ ఇంగ్లీషు మీడియం 2. తెలుగు మీడియం 3. ఇతర భాషా మీడియం ► ఎంపిక చేసుకున్న మాధ్యమానికి ఎదురుగా టిక్ చేయాలి ► ఎంపిక చేసుకోని వాటికి ఎదురుగా ఇంటూ గుర్తు పెట్టాలి ► తల్లి/తండ్రి/సంరక్షుకుడు∙సంతకం తప్పనిసరిగాచేయాలి. ► కుమారుడు/కుమార్తె పేరు, ఏ గ్రామం, పాఠశాల, ఏ తరగతి, ఏ మాధ్యమం కావాలో స్పష్టం చేస్తూ తేదీతో సంతకం చేయాలి. -
ఏ విద్యార్థీ ఆకలితో ఉండరాదు
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌తో ప్రభుత్వ పాఠశాలలను మూసేసిన కారణంగా ఇంటివద్ద ఏ ఒక్క విద్యార్థీ ఆకలితో ఉండరాదని ప్రభుత్వం విద్యాశాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. లాక్డౌన్ సమయంలో విద్యార్థుల భోజనానికి అవసరమైన సరుకులను పంపిణీ చేయాలని నిర్దేశించింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని స్కూళ్ల విద్యార్థులకు ఇప్పటికే పంపిణీ పూర్తయింది. తాజాగా వివిధ సంక్షేమ శాఖలకు చెందిన రెసిడెన్షియల్ స్కూళ్లలోని విద్యార్థులకు కూడా సరుకులు అందించాలనే ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు పంపిణీకి సిద్ధమయ్యారు. పాఠశాల విద్యాశాఖలో ఇలా.. ► పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉన్న 45,723 స్కూళ్లలోని 36 లక్షల మంది విద్యార్థులకు పాఠశాలలు మూతపడినప్పటి నుంచి ఏప్రిల్ 23 వరకు సరిపడేలా మధ్యాహ్న భోజనం సరుకులను ప్రభుత్వం పంపిణీ చేసింది. ► మార్చి 19 నుంచి 31వ తేదీ వరకు తొలి విడతగా 4,073 టన్నుల బియ్యం, 2,59,92,180 గుడ్లు, 1,29,96,090 చిక్కీలు అందించారు. ► ఆ తరువాత లాక్డౌన్ పొడిగింపుతో ఏప్రిల్ 23 వరకు సరిపడేలా 6,336 టన్నుల బియ్యం 5.5 కోట్ల గుడ్లు, 3,24,90,225 చిక్కీలు సరఫరా అయ్యాయి. సంక్షేమ స్కూళ్లలో ఇలా.. ► సంక్షేమ శాఖలకు చెందిన రెసిడెన్షియల్ పాఠశాలల్లోని దాదాపు 6 లక్షల మంది విద్యార్థులకు కూడా ఏప్రిల్ 23వ తేదీ వరకు సరిపడా సరుకులను అందించనున్నారు. ► పాఠశాల విద్యాశాఖ పరిధిలోని స్కూళ్లలో మధ్యాహ్న భోజనం మాత్రమే పెడుతున్నందున ఆమేరకే సరుకులు ఇచ్చారు. సంక్షేమ శాఖలు రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు మూడుపూటలా ఆహారాన్ని అందిస్తున్నందున ఆమేరకు అదనంగా సరుకులు ఇవ్వనున్నారు. ► వీరికి 7,414 టన్నుల బియ్యం, 1,80,49,380 గుడ్లు, 1,68,46,088 చిక్కీలను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు గ్రామాల్లోనే సరుకుల పంపిణీ.. విద్యాశాఖ పరిధిలో చదువుతున్న విద్యార్థులే కాకుండా వివిధ సంక్షేమ శాఖల పాఠశాలల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన సరుకులను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించి మధ్యాహ్న భోజన పథకం (ఎండీఎం) విభాగం ద్వారా ఏర్పాట్లు చేస్తున్నాం. లాక్డౌన్ వల్ల గుడ్లు, చిక్కీల సరఫరాలో సమస్యలు ఉన్నా వాటిని అధిగమిస్తున్నాం. విద్యార్థులకు వారి గ్రామాల్లోనే సరుకులు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. టీచర్లు, వలంటీర్ల సహకారంతో విద్యార్థులకు సకాలంలో వీటిని అందించేలా అధికారులు, సిబ్బంది శ్రమిస్తున్నారు. –చిట్టూరి శ్రీధర్, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ -
జగనన్న విద్యా కానుక
-
6 వస్తువులతో జగనన్న విద్యా కానుక
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘జగనన్న విద్యా కానుక’ కింద ఆరు రకాల వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇవన్నీ నాణ్యతతో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. 1వ తరగతి నుంచి 10 తరగతి వరకు చదివే 42 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఈ కిట్లను అందిస్తారు. ప్రతి కిట్‌లో 3 జతల యూనిఫామ్ క్లాత్, నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, షూ– 2 జతల సాక్స్‌లు, స్కూల్ బ్యాగ్, బెల్టు ఉంటాయి. యూనిఫామ్ కుట్టించేందుకు అయ్యే ఖర్చులను విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వమే జమ చేస్తుంది. వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు తెరిచే నాటికి ఈ కిట్లను పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం పాఠశాల విద్యపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులకు అందించే కిట్లలోని వస్తువులను ముఖ్యమంత్రికి చూపించారు. వాటిని పరిశీలించిన సీఎం కిట్‌లో వస్తువులు పూర్తి నాణ్యతతో ఉండాలని స్పష్టం చేశారు. పిల్లలు ఏడాది పాటు వినియోగించే వస్తువులు కనుక నాణ్యత విషయంలో రాజీపడొద్దని ఆదేశించారు. అధికారులకు సీఎం ఇచ్చిన ఆదేశాలివీ ప్రభుత్వ స్కూళ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి పర్చేందుకు చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి - స్కూళ్లలో ఏర్పాటు చేయతలపెట్టిన 9 రకాల కార్యక్రమాలను నిర్ణీత సమయానికి పూర్తిచేసేలా కార్యాచరణ చేపట్టాలి. - నాడు–నేడు పథకం కింద తొలి విడతలో ఎంపిక చేసిన 15,715 స్కూళ్లలో పనులను వేగంగా పూర్తి చేసి స్కూళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి. - పాఠశాలలను ఇంతకు ముందే తీయించిన ఫొటోలతో పోల్చి చూపి అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలి. - జూన్ నాటికి ఏ ఒక్క పనికూడా పెండింగ్‌లో ఉండకూడదు. - వచ్చే సమావేశం నాటికి స్కూళ్లలో చేపట్టిన పనులు ఏయే దశల్లో ఉన్నాయో వివరాలు తయారు చేయాలి. పనుల్లో ప్రగతి కనిపించాలి. ప్రతి స్కూల్‌కూ స్మార్ట్ టీవీ - డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలను బోధించేందుకు వీలుగా ప్రతి స్కూల్‌కూ స్మార్ట్ టీవీలను అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. - ఆంగ్ల మాధ్యమ బోధనపై సమీక్ష నిర్వహిస్తూ విద్యార్థులకు సమగ్రంగా అవగాహన కలిగేలా బోధన జరగాలని ఆదేశం. - నూతన పద్ధతులను అనుసరింపచేయాలని సూచన. - మధ్యాహ్న భోజనంలో నాణ్యత ఏమాత్రం తగ్గకూడదని ఆదేశం. - రాష్ట్రమంతా ఒకే రకమైన మెనూ అమలు చేయాలి. - రుచి, నాణ్యత ఒకేలా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. - గోరుముద్ద కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించేందుకు, సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించాలి. - ఈ కార్యక్రమాన్ని యాప్ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలి. - పాఠశాల ఆవరణల్లోని మరుగుదొడ్లు రన్నింగ్ వాటర్ సదుపాయంతో పరిశుభ్రంగా ఉండేలా తీర్చిదిద్దాలి. - ఇందుకోసం ఏర్పాటు చేసిన యాప్‌లు సరిగా పనిచేస్తున్నాయా లేదా అన్న విషయాన్ని తరచూ పరిశీలిస్తుండాలి. - గోరుముద్ద పథకం బిల్లులు పెండింగ్‌లో ఉండకూడదని సీఎం ఆదేశం. -
‘నో స్కూల్ బ్యాగ్ డే’ అందరూ పాటించాల్సిందే
సాక్షి, అమరావతి: ప్రాథమిక స్థాయి పాఠశాలల్లో చిన్నారులు ఆడుతూ పాడుతూ పాఠాలు నేర్చుకోవడానికి, ఒకటి, రెండు రోజులైనా వారిపై పుస్తకాల భారం పడకుండా చూసేందుకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘నో స్కూల్ బ్యాగ్ డే’ను కొన్ని పాఠశాలలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టాక విద్యా శాఖపై నిర్వహించిన తొలి సమావేశంలోనే ‘నో స్కూల్ బ్యాగ్ డే’ను అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి నెల ఒకటి, మూడో శనివారాల్లో పిల్లలు స్కూళ్లకు పుస్తకాల బ్యాగ్‌లు లేకుండా వస్తారు. కేవలం ఆటపాటలతో కొత్త పరిజ్ఞానాన్ని నేర్చుకొనేందుకు ‘సృజన–శనివారం సందడి’ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. అన్ని స్కూళ్లూ దీన్ని పూర్తి స్థాయిలో పాటించాల్సి ఉంది. కానీ కార్పొరేట్, ప్రయివేట్ పాఠశాలలు పట్టించుకోవడం లేదని విద్యా శాఖ దృష్టికి వచ్చింది. కొన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా దీన్ని తూతూ మంత్రంగా చేపడుతున్నట్లు గమనించింది. ఈ నేపథ్యంలో అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల్లోనూ నిర్ణీత పద్ధతిలో ‘నో స్కూల్ బ్యాగ్ డే’ను అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి.చినవీరభద్రుడు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖాధికారులు. డిప్యూటీ డీఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ బాధ్యులైన హెచ్ఎంలు ప్రతి నెల ఒకటి, మూడో శనివారాల్లో తప్పనిసరిగా ఆయా పాఠశాలలను సందర్శించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2 ప్రయివేటు, 1 ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, తమ విజిటింగ్ రిపోర్టును సంబంధిత వెబ్సైట్ ద్వారా అప్లోడ్ చేయాలని సూచించారు. కాగా, రాష్ట్రంలో అమలవుతున్న ఈ కార్యక్రమంపై తీసిన వీడియోకు జాతీయ స్థాయిలో ఇటీవల అవార్డు లభించింది. కార్యక్రమం ఇలా చేయాలి.. 1, 2 తరగతులు.. పాడుకుందాం: పిల్లలతో అభినయ గేయాలు, దేశభక్తి గీతాలు, జానపద గేయాలు పాడించాలి. పద్యాలు, శ్లోకాలు చెప్పించాలి. మాట్లాడుకుందాం : కథలు చదవడం, చెప్పడం, అనుభవాలు పంచుకోవడం, పొడుపు కథలు, పజిల్స్, సరదా ఆటలు ఆడటం (అన్నీ పిల్లలతోనే చేయించాలి). నటిద్దాం : నాటికలు, స్క్రిప్టులు, మైములు, ఏకపాత్రాభినయం, నృత్యం, అభినయం. సృజన : బొమ్మలు గీయడం, రంగులు వేయడం, బంకమట్టితో బొమ్మలు, నమూనాలు, మాస్కులు చేయడం, అలంకార వస్తువుల తయారీ. 3, 4, 5 తరగతులు.. సృజన : బొమ్మలుగీయడం, రంగులు వేయడం, బంకమట్టి వినియోగించి నమూనాలు రూపొందించడం, మాస్కులు చేయడం, అలంకరణ వస్తువుల తయారీ, నాటికలు, స్క్రిప్టులు, మైములు, ఏకపాత్రాభినయం, నృత్యం, అభినయం వంటివి చేయించాలి. తోటకు పోదాం, పరిశుభ్రం చేద్దాం : బడితోటలో పాదులు చేయడం, కలుపు తీయడం, పందిరి వేయడం, ఎరువులు వేయడం, పరిసరాల పరిశుభ్రతను నేర్పడం. చదువుకుందాం : పాఠశాల గ్రంథాలయాల్లోని పుస్తకాలను ఎంపిక చేసుకొని చదవడం, చర్చించడం, కథలు చదవడం, రాయడం. విందాం.. విందాం.. : ప్రాథమిక ఆరోగ్య కార్యకర్త, పంచాయతీ అధికారి, కుంటుంబ సంక్షేమ అధికారి, పోస్టాఫీసు సిబ్బంది, వ్యవసాయదారుడు, వ్యాపారి, స్థానిక ప్రజా ప్రతినిధి, తదితరులను బడికి ఆహ్వానించి వారితో మాట్లాడించడం. -
పై తరగతులకు పటిష్టమైన అడుగులు
సాక్షి, అమరావతి: ఒక తరగతి నుంచి మరో తరగతిలోకి వెళ్లే విద్యార్థుల్లో అవసరమైన ప్రమాణాలు, నైపుణ్యాలుంటేనే పై క్లాసుల్లోని పాఠ్యాంశాలను సులభంగా నేర్చుకోగలుగుతారు. కింది తరగతుల్లోని అంశాల్లో అవగాహన పెంచుకుని ఉంటే పై తరగతుల్లోని అంశాలు సులభంగా ఆకళింపు చేసుకోగల్గుతారు. కానీ, ఇప్పటివరకు విద్యార్థులకు సరిపడ హాజరు ఉంటే చాలు.. పై తరగతుల్లోకి పంపించేస్తున్నారు. దీనివల్ల తరగతులు పెరుగుతున్నా విద్యార్థుల్లో ప్రమాణాలు పెరగడంలేదు. ఈ నేపథ్యంలో.. విద్యార్థుల్లోని సామర్థ్యాలు ఏ మేరకు ఉన్నాయో ముందే పరిశీలించి లోపాలుంటే వాటిని సరిచేసి పై తరగతులకు పంపించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతోంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 23 వరకు శిక్షణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 17,70,341 మంది విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు కింద ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 23 వరకు ఈ కోర్సు ఉంటుంది. విద్యార్థుల్లో ప్రస్తుత తరగతుల్లోని అంశాలను అవగాహన చేసుకోవడంలో ఏమైనా లోపాలుంటే వాటిని సవరిస్తారు. అలాగే, ఆ తరగతుల్లోని పాఠ్యాంశాలపైనా క్షుణ్ణమైన అవగాహన కలిగి ఉండేలా తీర్చిదిద్దుతారు. ముఖ్యంగా తెలుగు, ఇంగ్లిష్, గణితం, పర్యావరణ అంశాలపై బోధన ఉంటుంది. సాధారణ తరగతుల మాదిరి కాకుండా ఆటపాటల ద్వారా పిల్లలకు ఆసక్తికరమైన రీతిలో ఈ 30 రోజులపాటు బోధన చేపడతారు. ఏ రోజున ఏ కార్యక్రమం చేపట్టాలో సవివరమైన ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు విడుదల చేశారు. 14 థీములలో శిక్షణ అంశాలను రూపొందించారు. ఒక్కో థీమును రెండు రోజులపాటు బోధిస్తారు. పాటలు, కథలు, ఆటలు వంటి కార్యక్రమాల ద్వారా ఆయా అంశాలను నేర్పిస్తారు. ఈ కార్యక్రమంలో 94,805 మంది టీచర్లను భాగస్వాములుగా చేస్తున్నారు. ఈ కోర్సుకు సంబంధించి పిల్లలకు, స్కూళ్లకు ప్రత్యేకంగా టీఎల్ఎం (టీచింగ్, లెర్నింగ్ మెథడాలజీ) కిట్లను సరఫరా చేస్తున్నారు. విద్యార్థుల కిట్‌కు రూ.200 చొప్పున, స్కూల్ కిట్‌కు రూ.1,500 చొప్పున వ్యయం చేస్తున్నారు. ఆడియో వీడియో బోధనకు వీలుగా విద్యార్థులకు టీవీలు, డీవీడీలు, ఇంటర్నెట్ సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు. లక్ష్యాలు ఇవీ.. - భాషకు సంబంధించి అక్షరాలపై స్పష్టత, వినడం, మాట్లాడడం, చదవడం, రాయడంపై దృష్టి పెడతారు. - గణితం, పర్యావరణ విద్యలో అంకెలు సంబంధిత అంశాలలో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తారు. - ఆనందాన్ని పంచే కార్యక్రమాలతో కూడిన బోధన ద్వారా విద్యార్థులకు ఆయా అంశాలను నేర్పిస్తారు. - వినడం, మాట్లాడడం తదితర అంశాల్లో ఆడియో విజువల్ పద్ధతులను అనుసరిస్తారు. - తొలిరోజు ఆయా తరగతుల్లోని పిల్లల స్థాయిలను తెలుసుకుంటారు. - తదుపరి మార్చి 17 నుంచి ఏప్రిల్ 21 వరకు పిల్లలతో వివిధ కార్యక్రమాలు చేపడతారు. - ఏప్రిల్ 22న పిల్లల్లో కొత్తగా పెరిగిన సామర్థ్యాలను గుర్తిస్తారు. - ఏప్రిల్ 23 చివరి రోజున తల్లిదండ్రులు, టీచర్ల సమావేశాలు నిర్వహించి తగిన సూచనలు అందిస్తారు. -
ఇంగ్లీష్ మీడియానికి పేరెంట్స్ సపోర్ట్
-
ఇంగ్లిష్ మీడియంపై పేదల వాదనా వినండి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సమర్థిస్తున్నామని విజయవాడలోని జక్కంపూడి ఎంపీపీ పాఠశాల తల్లిదండ్రుల కమిటీ హైకోర్టుకు తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులందరూ ఎంతో ఆనందంగా ఉన్నారని ఆ కమిటీ ఎక్స్ అఫిషియో సభ్యురాలు బి.శ్వేతా భార్గవి హైకోర్టుకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యానికి సంబంధించి తమ వాదనలూ వినాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఇంగ్లిష్ మీడియం ఉన్న ప్రైవేటు స్కూళ్లలో భారీ ఫీజులు చెల్లించి, తమ బిడ్డలను చదివించేంత స్థోమత తమకు లేదని, అందువల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అందులో పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తాము మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నామని చెప్పారు. ఎస్టీ కులానికి చెందిన తాను ఇంగ్లిష్ మీడియంలో మిగతా 2వ పేజీలో u చదివే స్థోమత లేక తెలుగు మీడియంలోనే విద్యాభ్యాసం కొనసాగించానని, ఉన్నత చదువుల సమయంలో ఇంగ్లిష్ రాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని శ్వేతా భార్గవి వివరించారు. ఇంగ్లిష్ రాక ఎంతో మానసిక వేదన అనుభవించానని చెప్పారు. అనేక ఉద్యోగావకాశాలను కూడా కోల్పోయానని పేర్కొన్నారు. సామాజిక వివక్ష కూడా ఎదుర్కొన్నానని, చిన్నప్పటి నుంచి సరైన పునాది లేకపోవడం వల్ల ఇంగ్లిష్‌ను పూర్తి స్థాయిలో నేర్చుకోలేకపోయానని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలల్లో గుబులు ప్రస్తుత ప్రపంచీకరణలో ఇంగ్లిష్ విశ్వభాషగా మారిపోయిందని శ్వేతా భార్గవి తెలిపారు. ప్రతి దశలో, ప్రతి చోట ఇంగ్లిష్ అవసరం చాలా ఉందని, అందుకే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నారని వివరించారు. చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదివి, ఆ తర్వాత ఇంటర్, డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్ మీడియంలో చదవాల్సిన పరిస్థితులు ఉన్నాయని, దీంతో ఆయా సబ్జెక్టులు సులభంగా అర్థం చేసుకోలేకపోతున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదివిన విద్యార్థుల్లో అత్యధిక శాతం మంది విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనికి పరిష్కారం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు చేయడమేనన్నారు. అటు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం లేక, ఇటు ప్రైవేటు పాఠశాలల్లో లక్షల రూపాయల ఫీజులు చెల్లించలేక పేద పిల్లలు సతమతమైపోతున్నారని ఆమె వివరించారు. దీనికి మందుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఉత్తర్వులని, ఈ ఉత్తర్వుల వల్ల ప్రైవేటు పాఠశాలల్లో గుబులు మొదలైందని, ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకిస్తూ దాఖలైన ఈ వ్యాజ్యాల వెనుక ఆ పాఠశాలలే ఉన్నాయని ఆమె ఆరోపించారు. పేద పిల్లల తల్లిదండ్రుల వాదనలు వినండి పేదల పిల్లలు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం ఓ వరం అని శ్వేతా భార్గవి పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పేద పిల్లలంతా లబ్ధి పొందుతారని, అందువల్ల ఈ విషయంలో న్యాయస్థానం ఎటువంటి వ్యతిరేక ఉత్తర్వులు ఇవ్వరాదని అభ్యర్థించారు. ఈ వ్యవహారంలో తమ వాదనలు కూడా వినాలని, అందువల్ల తమనూ ఈ వ్యాజ్యంలో ఇంప్లీడ్ చేసుకోవాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యం గురించి తల్లిదండ్రుల కమిటీ తరఫు న్యాయవాది మహేష్ మంగళవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. దీంతో ధర్మాసనం విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఇంగ్లిష్ మీడియం ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యాలపై కూడా ఆ రోజు వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. -
ఆంగ్ల మాధ్యమంపై విచారణ ఫిబ్రవరి 4కి వాయిదా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ కౌంటర్ దాఖలు చేసేందుకు 10 రోజులు గడువు కావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) బి.కృష్ణమోహన్ స్పందిస్తూ.. విద్యా హక్కు చట్టం ప్రకారం 8వ తరగతి వరకు మాతృ భాషలోనే విద్యాబోధన జరగాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానమన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఆంగ్ల మాధ్యమంలోనే చదవాలని విద్యార్థులను బలవంతం చేయలేమని, ఇందుకు సుప్రీంకోర్టు తీర్పు సైతం అంగీకరించడం లేదని వ్యాఖ్యానించింది. ఆంగ్ల మాధ్యమంలో పాఠ్య పుస్తకాల ముద్రణ తదితర విషయాల్లో ముందుకెళితే సంబంధిత అధికారులే అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇప్పటికే ఓసారి చెప్పామని, ఇప్పుడు మళ్లీ అదే విషయాన్ని పునరుద్ఘాటిస్తున్నామని ధర్మానసం తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ విచారణను ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా వేసింది. -
పకడ్బందీగా సిలబస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతుండడంతో అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం పాఠ్యాంశాల రూపకల్పనపై దృష్టి సారించింది. వచ్చే ఏడాది వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమ పాఠ్యపుస్తకాలను అందించేందుకు వీలుగా ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగా ఆంగ్ల మాధ్యమ పాఠ్యాంశాలు, ప్రణాళికపై రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) చర్యలు చేపట్టింది. పాఠ్యాంశాలపై రూపకల్పనకు ప్రభుత్వం చేపట్టిన చర్యలివే.. – ఎస్సీఈఆర్టీ అధికారుల బృందం కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హరియాణా, చండీగఢ్ తదితర ప్రాంతాల్లో పర్యటించింది. అక్కడ అనుసరిస్తున్న ఆంగ్ల మాధ్యమ ప్రణాళికలు, పాఠ్యాంశాలను పరిశీలించింది. వీటన్నింటినీ క్రోడీకరించి రాష్ట్ర విద్యార్థులకు అవసరమైన రీతిలో పాఠ్యాంశాలకు రూపకల్పన చేస్తోంది. – ఆంగ్ల మాధ్యమ పాఠ్యప్రణాళిక రూపకల్పనలో 180 మంది నిపుణులు విద్యావేత్తలు పాల్గొంటున్నారు. పాఠ్యాంశాల రూపకల్పనలో అనుభవమున్న నిపుణులు, ప్రొఫెసర్లను భాగస్వాములను చేస్తున్నారు. ఢిల్లీ, మద్రాస్, అంబేడ్కర్, అన్నా, ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలు, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ (ఆర్ఐఈ)– బెంగళూరు, నవోదయ విద్యాలయ సంఘటన్‌తోపాటు పలు ఎడ్యుకేషన్ ఫౌండేషన్ల ప్రతినిధులు కూడా భాగస్వాములవుతున్నారు. – యూకే, యూఎస్ఏ, సింగపూర్, శ్రీలంక, చైనా తదితర దేశాల్లోని ఆంగ్ల మాధ్యమ పుస్తకాలను తెప్పించి ఇక్కడి నిపుణులతో ప్రభుత్వం పరిశీలింపచేస్తోంది. అక్కడి మంచి అంశాలను కూడా చొప్పించి రాష్ట్ర సిలబస్‌ను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు సమాయత్తమవుతోంది. – ఆంగ్ల మాధ్యమ పాఠ్యపుస్తకాలను రాష్ట్రంలోని అన్ని వర్గాల విద్యార్థులకు అనువుగా ఉండేలా రూపొందిస్తున్నారు. గిరిజన ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాల్లోని విద్యార్థులకు కూడా అనుగుణంగా ఉండేలా పాఠ్యాంశాలపై దృష్టి పెడుతున్నారు. పిల్లల చదువులపై దృష్టిపెట్టలేని నిరుపేదలు, కూలి చేసుకుని జీవించే కుటుంబాల్లోని విద్యార్థులకు అనువైన రీతిలో వీటిని సిద్ధం చేస్తున్నారు. – తెలుగు సబ్జెక్టు పాఠ్యాంశాలు కూడా ఉన్నతంగా ఉండేలా మార్పులు చేపట్టారు. 1 నుంచి 6వ తరగతి వరకు 68 మంది ప్రముఖ కవులు, కథకుల రచనల్లోని అంశాలను పాఠ్యాంశాల్లో చేరుస్తున్నారు. కులాలు, మతాలు, ప్రాంతాల మాండలికాలకు సమ ప్రాధాన్యమిస్తున్నారు. కథలు, కవితలు, సంభాషణలు, పద్యాలు.. ఇలా తెలుగుకు సంబంధించి అన్ని అంశాలపై విద్యార్థులకు మరింత శ్రద్ధ పెరిగేలా చర్యలు చేపడుతున్నారు. దేశీ, విదేశీ కలబోతతో సిలబస్ ప్రతాప్‌రెడ్డి, డైరెక్టర్, ఎస్సీఈఆర్టీ దేశీ, విదేశీ కలబోతతో సిలబస్‌ను రూపొందిస్తున్నాం. ఎవరైనా సిలబస్‌ను మార్చాలనుకుంటే మన రాష్ట్రం వైపు చూసేలా చర్యలు చేపడుతున్నాం. యూకే, చైనా, సింగపూర్, శ్రీలంక, అమెరికా పాఠ్యపుస్తకాలను అధ్యయనం చేయిస్తున్నాం. అక్కడి మంచి విధానాలను తీసుకుంటాం. మన పిల్లలు వెనుకపడకుండా, అదే సమయంలో హైస్టాండర్డ్స్ లేకుండా సిలబస్‌ను సరళీకరిస్తున్నాం. -
ఇంగ్లిష్ మీడియం విద్యార్థులే టాప్
సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. పాఠశాలల విద్యార్థుల్లోని ప్రమాణాలను గమనిస్తే తెలుగు మాధ్యమ విద్యార్థుల కంటే ఆంగ్ల మాధ్యమ విద్యార్థులే అన్ని అంశాల్లో ముందంజలో ఉన్నారని తేలింది. ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ఫలితాలను విశ్లేషించిన రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఈ అంశాలను నిగ్గుతేల్చింది. ఏ గ్రేడుల్లో ఆంగ్ల మాధ్యమ విద్యార్థులదే అగ్రస్థానం 2018–19 విద్యా సంవత్సరంలో 6, 7, 8, 9 తరగతుల ఎస్ఏ–2 పరీక్షల ఫలితాలను ఎస్సీఈఆర్టీ పరిశీలించగా ఆంగ్ల మాధ్యమ విద్యార్థులే ముందంజలో ఉన్నారు. ఏ–1 నుంచి బీ2 వరకు గ్రేడ్ల సాధనలో వీరిదే పైచేయి. తెలుగు మాధ్యమ విద్యార్థులు వెనుకంజలో ఉన్నారు. ప్రైవేటు స్కూళ్లు పరుగులు.. ప్రభుత్వ స్కూళ్లు నత్తనడక తెలుగు మాధ్యమంలో నడుస్తున్న ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు మంచి గ్రేడ్లు సాధించలేకపోతున్నారు. ఏ1తోపాటు ఆ తర్వాత గ్రేడ్లలో ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులే అత్యధికం సాధిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారని విద్యావేత్తలు, నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఆంగ్ల మాధ్యమం నడుస్తున్న ప్రభుత్వ గురుకుల స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు), మోడల్ స్కూళ్ల ప్రమాణాలు బాగుండగా తెలుగు మాధ్యమం నడుస్తున్న ఇతర ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులే వెనుకబడి ఉంటున్నారు. సబ్జెక్టుల ఉత్తీర్ణతలోనూ ఆంగ్ల భాషలోనే అధికం ఇక సబ్జెక్టుల వారీ ఉత్తీర్ణతను చూసినా ఆంగ్ల భాషదే పైచేయిగా ఉంది. తెలుగు విద్యార్థులు సంఖ్యలోనే కాకుండా ఉత్తీర్ణతలోనూ వెనుకంజలోనే ఉన్నారని ఎస్సీఈఆర్టీ విశ్లేషణలో తేలింది. లెక్కల్లో అత్యధిక శాతం మంది ఉత్తీర్ణులవ్వగా భౌతిక శాస్త్రంలో వెనుకబడుతున్నారు. ఆంగ్ల మాధ్యమంతోనే మెరుగైన ఫలితాలు – ప్రతాప్‌రెడ్డి, డైరెక్టర్, ఎస్సీఈఆర్టీ 2008లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా సక్సెస్ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఫలితాలను విశ్లేషిస్తే ఆంగ్ల మాధ్యమంలో చదివిన విద్యార్థులే మంచి ఫలితాలు సాధిస్తూ ప్రైవేటు విద్యార్థులకు దీటుగా రాణిస్తున్నారు. గత ఐదేళ్ల ఫలితాలను విశ్లేషించినా ఆంగ్ల మాధ్యమ విద్యార్థులే అత్యధికంగా ఉత్తీర్ణతను సాధించారు. ప్రభుత్వం ఇప్పుడు అన్ని ప్రభుత్వ స్కూళ్లలోనూ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని నిర్ణయించడంతో మరింత మంచి ఫలితాలు వస్తాయి. అందుకు వీలుగా ప్రభుత్వ స్కూళ్ల టీచర్లకు ఆంగ్ల మాధ్యమ బోధనలో అత్యుత్తమ రీతిలో శిక్షణ కార్యక్రమాలను చేపడుతున్నాం. ఇతర రాష్ట్రాలు, సింగపూర్, అమెరికా సహా ఇతర దేశాలకు చెందిన పాఠ్యపుస్తకాల సిలబస్‌లను పరిశీలించి ఆంగ్ల మాధ్యమ పాఠ్యపుస్తకాలను రూపొందిస్తున్నాం. -
మనబడి నాడు–నేడు పర్యవేక్షణకు కమిటీ
సాక్షి, అమరావతి: మన బడి నాడు–నేడు కార్యక్రమం పర్యవేక్షణకు రాష్ట్రస్థాయి కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల్ని కల్పించేందుకు నిర్దేశించిన ఈ కార్యక్రమం అమలుకు ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసి పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి నీలం సాహ్ని శనివారం జీఓ జారీ చేశారు. పాఠశాల విద్యా శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ శాఖల యాజమాన్యంలోని 44,512 పాఠశాలల్లో 2019–20 నుంచి వచ్చే మూడేళ్లలో మౌలిక వసతులు కల్పిస్తారు. ఇవీ మార్గదర్శకాలు.. - మొదటి సంవత్సరం 15,715 పాఠశాలల్లో ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తారు. - ప్రతి యాజమాన్యం నుంచి మూడో వంతు పాఠశాలలను ఏపీ సమగ్ర శిక్ష సొసైటీ డైరెక్టర్ ఎంపిక చేస్తారు. - పాఠశాలల్లో రన్నింగ్ వాటర్‌తో కూడిన టాయిలెట్లు, ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి అవసరమైన ఫర్నిచర్, పాఠశాలకు పెయింటింగ్, చిన్నాపెద్ద మరమ్మతులు, గ్రీన్ చాక్ బోర్డులు, ఇంగ్లిష్ ల్యాబ్‌లు, కాంపౌండ్ వాల్స్ నిర్మించి ప్రమాణాలను మెరుగుపరుస్తారు. - ఏపీ సమగ్ర శిక్ష సొసైటీ, ఏపీఈడబ్లు్యఐడీసీ, పంచాయతీరాజ్, మున్సిపల్ అండ్ పబ్లిక్ హెల్త్, గిరిజన సంక్షేమ శాఖల ఇంజనీరింగ్ విభాగాలు ఈ పథకం అమలుకు ఏజెన్సీలుగా పనిచేస్తాయి. - పథకం అమలు తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, కమిషనర్ కన్వీనర్‌గా, జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా, డీఈఓ కన్వీనర్‌గా రెండు కమిటీలు ఏర్పాటవుతాయి. - ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలతో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల ద్వారా జిల్లా కలెక్టర్ పాఠశాల, పనుల వారీగా సవివర నివేదికలు తయారు చేయించుకోలి. - పాఠశాల ప్రాంగణాలు అందమైన వాతావరణంతో పిల్లలు ఎక్కువ సమయం అక్కడ గడిపేలా తయారు చేయాలి. కొత్త నిర్మాణాలు 75 సంవత్సరాలపాటు ఉండేలా చూడాలి. - సవివర నివేదికలు తయారు చేయడానికి ముందు అమలు ఏజెన్సీలు పేరెంట్స్ కమిటీ సలహాలు, సూచనలు తీసుకోవాలి. అంచనాలు సమర్పించడానికి ముందు అందుకు పేరెంట్ కమిటీల తీర్మానం తీసుకోవాలి. - గ్రీన్ బిల్డింగ్ నిబంధనల ప్రకారంపాఠశాలల్లో సౌకర్యాలు కల్పించేలా అంచనాలు ఉండాలి. దివ్యాంగ విద్యార్థులు సైతం స్వేచ్ఛగా తిరిగే వాతావరణం కల్పించాలి. - స్వాతంత్య్రానికి ముందు కట్టిన కొన్ని పాఠశాలల పురావస్తు ప్రాధాన్యం పోకుండా చూడాలి. వాటి మరమ్మతులు కూడా అదే సంప్రదాయ రీతుల్లో ఉండేలా చూడాలి. - కాంపౌడ్ వాల్ అంచనాలను ఉపాధి హామీ పథకం కింద తీసుకోవాలి. పేరెంట్స్ కమిటీలు ఈ పనిని పర్యవేక్షిస్తాయి. - పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఈ పథకం అమలును పూర్తిస్థాయిలో పర్యవేక్షించి అన్ని విభాగాలను సమన్వయం చేస్తారు. - పథకం అమలుకు వివిధ స్థాయిల్లో శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేసుకోవాలి. -
ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఏపీలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన అద్భుతంగా సాగుతోందని, పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడంతో పాటు ప్రజా సంక్షేమానికి కృషిచేస్తున్నారంటూ గణపతి సచ్చిదానంద స్వామి ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. లోకకల్యాణం, ప్రజా సంక్షేమం కోసం వారణాసిలో నిర్వహిస్తున్న అతిరుద్ర యాగం పదో రోజు సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. తండ్రి వైఎస్సార్ బాటలో జగన్ నడుస్తున్నారని, అనువంశిక అర్చకుల వారసత్వ హక్కులను పునరుద్ధరిస్తూ సీఎం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదని, ప్రతీ ఒక్కరూ ఆహ్వానించదగ్గ నిర్ణయమన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టడం మంచి నిర్ణయమని, దీనిపై పలువురు వివాదం చేయడం సరైనది కాదన్నారు. విదేశాలకు వెళ్లడానికి వీసా ఇంటర్వ్యూకి వెళ్లాలన్నా ఇంగ్లిషు అవసరమన్న విషయం మర్చిపోకూడదన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్న వారి పిల్లల్నంతా ఇంగ్లిషులోనే చదివిస్తున్నారంటూ విమర్శించారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన వారికి సమయం ఇవ్వకుండానే విమర్శలు చేయడం తగదన్నారు. -
1 నుంచి 6 వరకు ఇంగ్లిష్ మీడియం
సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ నిర్ణయాలను రాష్ట్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి పేర్ని నాని విలేకరులకు వివరించారు. ఆ వివరాల్లోని ముఖ్యమైన అంశాలు.. ఇంగ్లిష్ మీడియంలో బోధనకు ఆమోద ముద్ర వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన, తెలుగు లేదా ఉర్దూ తప్పనిసరి సబ్జెక్టు చేయాలన్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర మేధావుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 12వ తరగతి వరకు ప్రతి ఒక్కరూ తెలుగు లేదా ఉర్దూను రెండో సబ్జెక్టుగా తప్పనిసరిగా చదవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే 34% స్కూళ్లలో ఇంగ్లిషులోనే విద్యా బోధన జరుగుతుండగా.. మిగిలిన 66% స్కూళ్లలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలన్నదే సీఎం ఆలోచన. అక్రమ లేఅవుట్లలో ప్లాట్ల క్రమబద్ధీకరణకు అంగీకారం రాష్ట్రంలో కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీల పరిధిలో అక్రమంగా వేసిన లేఅవుట్లలో ప్లాట్లు కొని ఇబ్బందులు పడుతున్న దాదాపు లక్షన్నర మందికి ఊరటనిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అలాంటి లే అవుట్లలో ప్లాట్ కొని, ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వారి ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ఆమోదం తెలిపింది. అక్రమ లే అవుట్లు కావడంతో మౌలిక వసతుల కల్పనకు మున్సిపాలిటీలు ముందుకు రావడం లేదని.. ఇంటి ప్లాన్ ఆమోదం, బ్యాంకు లోను వంటి విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ పెద్ద ఎత్తున వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 2,600 అక్రమ లే అవుట్లలో ప్లాట్ల క్రమబద్ధీకరణకు విధివిధానాలు త్వరలో అధికారికంగా వెల్లడిస్తారు. ఇసుక అక్రమార్కులకు చెక్.. చట్టానికి సవరణలు ఇసుకను అక్రమంగా నిల్వ చేసినా.. రవాణా చేసినా.. బ్లాక్మార్కెట్లో అమ్మినా.. ఒకరి పేరిట కొని, మరొకరికి అమ్మినా రూ. 2 లక్షల వరకు జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష పడేలా చట్టానికి సవరణ చేయాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఇసుక లభ్యత పెంచేందుకు ఒకపక్క చర్యలు తీసుకుంటుంటే.. కొందరు ఉద్దేశపూర్వకంగా అక్రమంగా నిల్వ చేయడం, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడడం చేస్తున్నారని, వారిపై కఠినంగా వ్యవహరించాలని కేబినెట్ భేటీలో సీఎం ఆదేశించారు. ఇసుక నిల్వ చేసే, రవాణా చేసే అధికారం గనుల శాఖకు మాత్రమే ఉండగా.. ఇకపై ఇతరులు అలాంటి చర్యలకు పాల్పడితే ఉక్కుపాదం మోపుతారు. ఇసుక డిమాండ్‌కు సరిపడా సరఫరా చేసేందుకు గురువారం నుంచి ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని భేటీలో నిర్ణయించారు. రోజుకు 2 లక్షల టన్నుల వరకు సరఫరాను పెంచి, వారం పది రోజుల్లో కొరతను పూర్తిగా అధిగమించేలా వారోత్సవాల్లో రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖ అధికారులు దృష్టి పెడతారు. ప్రమాదకర పరిశ్రమ వ్యర్థాలకు చెక్ పరిశ్రమల నుంచి వెలువడే ప్రమాదకర వ్యర్థాలతో నదీ, భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ సంస్థను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 9 వేల వరకు పరిశ్రమలుండగా, రెండు వేల పరిశ్రమలు ప్రమాదకర వ్యర్థాలు విడుదల చేసే రెడ్ కేటగిరీలో ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ వ్యవస్థీకృతంగా లేదని, పరిశ్రమల నుంచి వెలువడే ప్రమాదకర వ్యర్థాల్ని, కలుషిత జలాల్ని శుద్ధిచేసేందుకు తగిన వ్యవస్థ అవసరమని సీఎం జగన్మోహన్రెడ్డి గుర్తించారు. పారిశ్రామిక వ్యర్థాలు విడుదల చేసేవారిని బాధ్యుల్ని చేయడం.. అక్రమంగా వ్యర్థాలు డిస్పోజ్ చేసే వారిపై గట్టి నిఘా పెట్టడం.. వాటిని తీసుకెళ్తున్న వాహనాల్ని ట్రాక్ చేయడం.. మరో పరిశ్రమ పేరిట డిస్పోజ్ చేయడాన్ని నివారించడం.. తదితర అంశాల్ని ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ సంస్థ పర్యవేక్షిస్తుంది. సచివాలయంలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో మాట్లడుతున్న సీఎం వైఎస్ జగన్ మంత్రిమండలి భేటీలోని మరికొన్ని నిర్ణయాలు - ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ పాలసీ–2018, ఆంధ్రప్రదేశ్ విండ్ పవర్ పాలసీ–2018, ఆంధ్రప్రదేశ్ విండ్, సోలార్, హైబ్రిడ్ పవర్ పాలసీ–2018 పాలసీల సవరణలకు ఆమోదం - రాష్ట్రంలో 84 గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు అనుగుణంగా గ్రామ న్యాయాలయాల చట్టం –2008 సవరణకు అంగీకారం - ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం సవరణ, మున్సిపల్ లా చట్టంలో సవరణలకు గ్రీన్‌సిగ్నల్ - రూ. 20 కోట్లకు పైగా ఆదాయముండే 8 ప్రముఖ ఆలయాలకు కొత్తగా ట్రస్టు బోర్డుల నియామకానికి మంత్రిమండలి పచ్చజెండా రెండు జిల్లాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మొక్కజొన్న క్వింటాల్ ధర రూ. 2,200 నుంచి రూ.1,500కి పడిపోయిన నేపథ్యంలో వెంటనే విజయనగరం, కర్నూలులో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయించింది. వ్యవసాయ మంత్రి కన్నబాబు ఈ విషయాన్ని ప్రస్తావించగా, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సీఎం సానుకూలంగా స్పందించారు. వేటకు వెళ్లి మరణిస్తే రూ.10 లక్షల పరిహారం సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ప్రమాదవశాత్తూ మరణిస్తే ఆ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లింపునకు కేబినెట్ అంగీకరించింది. దీనికి వైఎస్సార్ మత్య్సకార భరోసాగా నామకరణం చేశారు. వైఎస్సార్ బీమా పథకం కింద నమోదు చేసుకున్న 18–60 సంవత్సరాల మధ్య వయసున్న వారికి ఇది వర్తిస్తుంది. నవంబర్ 21న ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. -
తినే పదార్థం అనుకుని పురుగు మందు తాగి..
హుస్నాబాద్ రూరల్: పంటలకు వాడే పురుగు మందు ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంది. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లి పంచాయతీ పరిధిలోని పిట్టలగూడెంలో బుధవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న తుమ్మల భాస్కర్ (12), కాలీయ రవీందర్ (11) అనే విద్యార్థులు సాయంత్రం పాఠశాల వదిలేసిన తర్వాత ఇంటికి వస్తున్న సమయంలో సమీపంలో ఉన్న పత్తి చేనుకు వెళ్లారు. వారికి అక్కడ కవర్లో కట్టిన పురుగు మందు బాటిల్స్ కనిపించాయి. వాటిలో ఉన్నది తినే పదార్థం అనుకొని పిల్లలిద్దరూ బాటిళ్లలో ఉన్న ద్రవం తాగి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చిన చిన్నారులు కళ్లు తిరిగిపడి పోవడంతో కుటుంబ సభ్యులు ఇద్దరినీ చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఒకరు మరణించగా మరొకరికి విషమంగా ఉందని వైద్యులు సిద్దిపేటకు పంపించారు. సిద్దిపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరో విద్యార్థి కూడా మరణించాడు. ఇద్దరు పిల్లలు మరణించడంతో పిట్టలగూడెంలో విషాదం నెలకొంది. అన్నా చెల్లెళ్ల కొడుకులు ఇద్దరూ ఒకేసారి మృతి చెందడంతో రెండు కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగిపోయాయి. -
కార్పొరేట్ స్కూళ్లకు కొమ్ముకాసేందుకే..
సాక్షి, విశాఖపట్నం: కార్పొరేట్ స్కూళ్లకు కొమ్ముకాసేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం వద్దని కొందరు రాజకీయ నేతలు చెబుతున్నారని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. మంగళవారం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోటీ ప్రపంచంలో యువత ఉద్యోగాలు సాధించాలన్నా, విదేశాల్లో చదవాలన్నా, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో పోటీ పడాలన్నా ఇంగ్లిష్ భాష తప్పనిసరి అన్నారు. వారి పిల్లల భవిష్యత్ బావుండాలి, బడుగు బలహీనవర్గాల విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో ఉండాలా? అంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం కొనసాగితే తమ కార్పొరేట్ స్కూళ్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందనే కొందరు విపక్ష నేతలు ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని విమర్శించారు. తెలుగుకు అన్యాయం చేయాలనో.. పరభాషని తెలుగు భాషపై రుద్దాలనో తమ నేత ఆలోచన కాదన్నారు. పేదలంతా బాగా చదువుకుని సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలనేదే సీఎం వైఎస్ జగన్ ఆలోచన అని చెప్పారు. బీసీలను టీడీపీ ఓటు బ్యాంక్‌గానే వాడుకుంది రాష్ట్రంలో బీసీలందరినీ టీడీపీ కేవలం ఓటు బ్యాంక్‌గానే వాడుకుంది తప్ప వారి అభివృద్ధికి ఏనాడు ఆలోచన చేయలేదని కృష్ణమూర్తి విమర్శించారు. ఎన్నికలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలన్నీ కేవలం ఐదు నెలల్లోనే అమలు చేసిన ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు. బీసీ కమిషన్ ఏర్పాటు చేసి... బీసీలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం కేటాయించిన ఘనత ఆయనకే చెల్లిందన్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ కార్పొరేట్ స్కూళ్ల పేరుతో కోట్ల రూపాయలు దండుకుంటున్న కొందరు టీడీపీ నేతలు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం పెడుతుంటే వ్యతిరేకిస్తున్నారన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు అబుల్ కలాం విద్యా పురస్కారాలు
ఒంగోలు టౌన్/సాక్షి, అమరావతి : ఈ ఏడాది టెన్త్, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యా పురస్కారాలను అందజేయనున్నట్లు విదాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఒంగోలు సంతపేటలోని తన క్యాంపు కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ జిల్లాకు ఆ జిల్లాలో అక్కడి మంత్రులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందిస్తారన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెడుతున్నట్లు ఆయన స్పష్టంచేశారు. డీఎల్టీ, డైట్ వంటి వాటిని టీచర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లుగా మార్చనున్నట్లు మంత్రి తెలిపారు. వీటి ద్వారా సుశిక్షితులైన ఉపాధ్యాయులను తయారుచేస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఇఫ్లూ, రీచల్ ఇన్స్టిట్యూట్ వంటి వాటితో ఒప్పందాలు చేసుకుని ఇంగ్లిష్ మీడియం బోధించే టీచర్లకు మరింత తర్ఫీదునిస్తామన్నారు. ఎస్సీ గురుకులాల నుంచి 189 మంది ఎంపిక ఇదిలా ఉంటే.. అబుల్ కలాం విద్యా పురస్కారాలకు రాష్ట్రవ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల నుంచి మొత్తం 189 మంది ఎంపికయ్యారు. గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల నుంచి 47 మంది, మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయాల నుంచి 45 మంది ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి వి.రాములు, బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణమోహన్, ఎస్టీ గురుకుల విద్యాలయాల సంస్థ ఇన్చార్జ్ కార్యదర్శి పి రంజిత్‌బాషా అభినందనలు తెలిపారు. 14న సీఎం చేతుల మీదుగా నాడు–నేడు కార్యక్రమం సీఎం వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నాడు–నేడు కార్యక్రమాన్ని ఈనెల 14న ఆయన చేతుల మీదుగా ఒంగోలులో ప్రారంభించనున్నట్లు మంత్రి సురేష్ చెప్పారు. అదేరోజు మిగిలిన జిల్లాల్లోనూ మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ ల్యాబ్‌లు
సాక్షి, అమరావతి: ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ‘నాడు– నేడు’లో భాగంగా ఇంగ్లిష్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధనపై శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీనియర్ అధికారులతో సమీక్షించారు. తొలి దశ కింద వచ్చే విద్యా సంవత్సరం 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మాధ్యమంలో బోధించాలని సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం పాఠ్య ప్రణాళిక రూపకల్పనలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐసీఎస్ఈ) విధానాలను పాటించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 6వ తరగతి వరకే ఎందుకంటే.. తొలుత 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిషు మాధ్యమంలో బోధించాలని నిర్ణయించినప్పటికీ, సమీక్ష అనంతరం మార్పులు చేస్తూ 1 నుంచి 6వ తరగతి వరకు పరిమితం చేశారు. ఆ తర్వాత 7, 8, 9, 10 తరగతులకు వరుసగా ఇంగ్లిషు మాధ్యమం ప్రారంభమవుతుంది. ఇలా ఎందుకంటే.. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ విధానాల్లో పదవ తరగతికి దేశ వ్యాప్తంగా కామన్ పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో ఇతర రాష్ట్రాల్లోని విద్యార్థులతో పోటీ పడాలంటే ఇప్పుడు 8వ తరగతి తొలిసారి ఆంగ్ల మాధ్యమంలో చదివే విద్యార్థికి కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ స్థాయిలో సన్నద్ధం కావడానికి నాలుగేళ్లు పడుతుంది. 6వ తరగతి విద్యార్థి అయితే 10వ తరగతికి వచ్చే సరికి ఇంగ్లిషు బోధనను పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాడు. ఈ దృష్ట్యా తొలి దశలో 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల బోధనను పరిమితం చేశారు. కాగా, ఇంగ్లిష్ ల్యాబ్‌ల వల్ల ప్రతి విద్యార్థి ఇంగ్లిష్ మీడియంలో పాఠ్యాంశాలను సులువుగా అర్థం చేసుకోగలుగుతారు. భాషపై త్వరగా పట్టు సాధించేలా వీటిని తీర్చిదిద్దుతారు. -
ప్రభుత్వ స్కూల్లో గూగుల్ ల్యాబ్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గూగుల్ సహకారంతో ఏర్పాటు చేసిన గూగుల్ ల్యాబ్ సదుపాయంతో విద్యార్థులు అద్భుతాలు చేస్తున్నారు. ఓక్రిడ్జ్, గ్లోబల్, అరబిందో వంటి ఇంటర్నేషనల్ స్కూళ్లలో మాత్రమే అందుబాటులో ఉండే ఈ ఆధునిక గూగుల్ ల్యాబ్‌ను దేశంలో తొలిసారి విజయనగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులోకి తెచ్చారు. ఈ ల్యాబ్‌లో 6 నుంచి పదో తరగతి వరకు ఉన్న విద్యార్థులకు వారంలో 2 క్లాస్‌లు డిజిటల్ బోధన అందించేలా చర్యలు చేపట్టారు. పాఠశాల సిలబస్‌కు సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసి బోధనను నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్య కమిషనర్ విజయ్‌కుమార్ తెలిపారు. రొబోటిక్ ల్యాబ్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణితం సబ్జెక్టులకు సంబంధించిన ప్రయోగాలు చేస్తున్నారని తెలిపారు. అదే స్కూల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. టీచర్లకు గూగుల్ శిక్షణ ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పా టు చేసుకుంటే సాఫ్ట్వేర్ సహాయం అందించడంతోపాటు టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు గూగుల్ ముందుకు వచి్చందని విజయకుమార్ తెలిపారు. ఈ మేరకు గూగుల్ ప్రతినిధులు 2 రోజుల కిందట తమతో సమావేశమై అంగీకారం తెలిపారన్నారు. ల్యాబ్‌ల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని, వాటి ఏర్పాటుతో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించవచ్చన్నారు. గూగుల్ ల్యాబ్ సదుపాయంతో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో మెరుగైన ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీతోపాటు నగదున ఆయన అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల విద్య అదనపు డైరెక్టర్ పీవీ శ్రీహరి, జాయింట్ డైరెక్టర్లు రమేశ్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి వైపు ప్రభుత్వ పాఠశాలలు
-
సర్కారు బడిలో ఇక అభివృద్ధి వెలుగులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడానికి రాష్ట్ర సర్కారు నడుం బిగించింది. పాఠశాలల్లో ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మొట్టమొదటి సమీక్షను విద్యా శాఖపైనే నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను రెండేళ్లలో మార్చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పాఠశాలల ప్రస్తుత స్థితిని ఫొటోలు తీయించి.. వాటి రూపురేఖలు మార్చాక మళ్లీ ఫొటోలు తీయించి ప్రజల ముందు ఉంచనున్నారు. ఇందులో భాగంగా దాదాపు 44,510 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 10.88 లక్షల ఫొటోలను తీయించారు. ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో ఉన్న సదుపాయాలు, అక్కడ నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 2021–22 నాటికి ప్రభుత్వ స్కూళ్లను అన్ని హంగులతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దనున్నారు. ఇందుకు బడ్జెట్లో రూ.10,500 కోట్లు కేటాయింపులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశకింద దాదాపు 16,750 స్కూళ్లను అభివృద్ధి చేయడానికి సర్వశిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందుకు రూ.2,250 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది (2019–20) పనులకోసం బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయించారు. పంచాయతీకొక స్కూల్ తప్పనిసరిగా ఎంపిక స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్ కింద ప్రత్యేక యాప్ ద్వారా ఆయా స్కూళ్ల ఫొటోలను, సమగ్ర సమాచారాన్ని పాఠశాల విద్యాశాఖ తెప్పించింది. తక్షణం మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉన్న పాఠశాలలను గుర్తించనున్నారు. పంచాయతీకి ఒకటి చొప్పున ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లను ఎంపిక చేస్తున్నారు. మండలానికి ఒకటి లేదా రెండు చొప్పున హైస్కూళ్లను గుర్తించి అభివృద్ధి చేస్తారు. మొదటి దశ కింద అభివృద్ధి 12,918 ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లు, 3,832 హైస్కూళ్లను గుర్తించారు. ఇవికాకుండా 6,010 హైస్కూళ్లలో ఎన్ఆర్ఈజీఎస్ కింద ప్రహరీల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. బడ్జెట్లో నిధుల కేటాయింపులు ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు 2019–20 బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయించారు. ఇక 2020–21 ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన పనులకు రూ.4,000 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలోనే చేపట్టి అర్ధంతరంగా నిలిచిపోయిన వాటిని పూర్తిచేయడానికి రూ.750 కోట్లు, కొత్తగా చేపట్టాల్సిన పనులకు రూ.3,250 కోట్లు కావాలని అంచనా వేశారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 కోట్ల బడ్జెట్ కేటాయింపులతో పాఠశాలలకు అవసరమైన అదనపు తరగతి గదులను సమకూర్చనున్నారు. -
బడి పంట!
సాక్షి, హైదరాబాద్: తాజా కూరగాయలు, అప్పటికప్పుడు కోసుకొచ్చిన ఆకుకూరలతో చేసిన వంట రుచికరంగా ఉండటమే కాదు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కూడా. ఇక ఆ కూరగాయలు, ఆకుకూరలను సహజసిద్ధ్దంగా, సేంద్రియ ఎరువులతో పండిస్తే అంతకుమించి కావాల్సింది ఏముంటుంది? ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఇదే తరహా భోజనాన్ని అందించాలనే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ తలపెట్టిన కిచెన్ గార్డెన్స్ సత్ఫలితాలిస్తోంది. 2018–19 వార్షిక సంవత్సరంలో రాష్ట్రంలోని 1,328 పాఠశాలలను విద్యాశాఖ ఇందుకు ఎంపిక చేయగా మంచి ఫలితాలొచ్చాయి. దీంతో 2019–20లో ఏకంగా 13,694 స్కూళ్లకు ఈ కార్యక్రమాన్ని విస్తరించింది. లక్షణమైన లక్ష్యం... విద్యార్థులకు శ్రమ, పంటల సాగుపై అవగాహన కల్పించడంతోపాటు మధ్యాహ్న భోజనంలో తాజా కూరలు అందించాలనే ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ కిచెన్ గార్డెన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులను ఇందులో భాగస్వామ్యులను చేసింది. అవసరాలు, సీజన్‌కు తగిన విధంగా ఈ పంటలు సాగు చేసుకోవాలని సూచించింది. కిచెన్ గార్డెన్ల సాగు పూర్తిగా సేంద్రియ పద్ధ్దతిలో చేపట్టాలి. అప్పటికప్పుడు సేకరించే అవకాశం ఉండంతో పూర్తిగా తాజా కూరగాయలను వండుకోవచ్చు. తాజా దిగుబడులతో చేసిన వంటల్లో సూక్ష్మ పోషకాలు అత్యధికంగా ఉంటాయి. అంతేకాకుండా రసాయనాలు దు్రష్పభావాలు చూపిస్తాయనే ఆందోళన కూడా ఉండదు. పంటల సాగులో విద్యార్థులను భాగస్వామ్యం చేయడంతో వీరికి శ్రమతో పాటు పంటల సాగుపై అవగాహన కలుగుతుంది. నిర్వహణకు కమిటీలు రాష్ట్రవ్యాప్తంగా 13,694 ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లు ఏర్పాటుకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలో ఉన్న స్థలంలో 5 నుంచి 10శాతం జాగాలో వీటిని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కిచెన్ గార్డెన్ల నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారి కనీ్వనర్‌గా వ్యవహరిస్తారు. కిచెన్గార్డెన్ల నిర్వహణకు విద్యాశాఖ ప్రత్యేకించి ఎలాంటి నిధులు కేటాయించలేదు. స్థానిక ప్రజాప్రతినిధులు, దాతల సహకారాన్ని తీసుకుని పక్కాగా నిర్వహించాలని సూచించింది. పాఠశాలల్లో టమాట, వంకాయ, బెండ, దొండ, పాలకూర, మెంతికూర, తోటకూర, కొత్తమీర, పుదీనాలను పండిస్తున్నారు. ఆకుకూరలను పప్పు కలిపి వారంలో 3 రోజులు వండుతుండగా.. మిగిలిన 3 రోజులు కూరగాయలను వండుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు.. రాష్ట్రంలో కిచెన్ గార్డెన్ల నిర్వహణపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో కిచెన్ గార్డెన్ల నిర్వహణపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఇవి చూసిన కేంద్ర ప్రభుత్వం కిచెన్ గార్డెన్ల ఆలోచనను ప్రశంసించింది. పాఠ్యాంశంలో భాగంగా... మా స్కూళ్లో స్థలం ఎక్కువగా లేదు. దీంతో 200 గజాల జాగాలో కూరగాయలు పండిస్తున్నాం. వారంలో మూడు రోజుల పాటు ఇవి సరిపోతున్నాయి. మిగతా రోజుల్లో మార్కెట్లో కొనుగోలు చేసి వండుతున్నారు. కిచెన్ గార్డెన్లతో విద్యార్థులకు సాగు విధానంపై అవగాహన పెరుగుతుంది. పాఠ్యాంశంలో భాగంగా ఉన్న రైతులు, పంటలకు సంబంధించిన అంశాలను సులభతరంగా బోధించే వీలు కలిగింది. ఒక్కో రకం పంటను ఒక్కో తరగతికి బాధ్యతగా అప్పగించడంతో వారు ప్రత్యేక శ్రద్ధ్ద తీసుకుంటున్నారు. – శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు, ముచ్చర్ల ప్రాథమిక పాఠశాల, కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లా సేంద్రియ ఆవశ్యకత తెలియజేయాలి అధిక దిగుబడులు, తక్కువ సమయంలో పంటలు వచ్చేందుకు ప్రస్తుత రైతాంగం పురుగుల మందులు, ఎరువులను విరివిగా వాడుతున్నారు. ఈ పద్ధతి మారాలంటే భావితరానికి సేంద్రియ సాగు ఆవశ్యకతను తెలియజేయాలి. పాఠశాల స్థాయిలోనే ప్రయోగాత్మకంగా విద్యార్థులకు పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు కిచెన్ గార్డెన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. మా స్కూల్లో ఉన్న స్థలంలో పంటలు సాగు చేస్తున్నాం. కూరగాయల పంటలతో పాటు పండ్ల మొక్కలు సైతం నాటాం – జాక్విలిన్, సిరిసిల్ల కేజీబీవీ ప్రిన్స్‌పల్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు 29,343 మొత్తం విద్యార్థులు 28,29,135 గతేడాది కిచెన్ గార్డెన్లు ఏర్పాట్లు చేసిన స్కూళ్లు 1,328 ప్రస్తుత ఏడాదిలో కిచెన్ గార్డెన్లు్ల ఏర్పాటు చేసిన స్కూళ్లు 13,694 -
సర్కారు బడుల్లో ట్యూషన్
సిద్దిపేట రూరల్: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు దత్తత గ్రామం ఇబ్రహీంపూర్ మళ్లీ ఒక వినూత్న కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రైవేటు తరహాలో సాయంత్రం వేళ అదనంగా ట్యూషన్ ప్రక్రియను నిర్వహించే పద్ధతిని గ్రామంలో ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోనే సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు అదనపు తరగతుల బోధనలను బుధవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను విద్యాశాఖ వేగవంతం చేసింది. సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారాన్ని అందించే ప్రక్రియను చేపట్టిన ఎమ్మెల్యే హరీశ్‌రావు సాయంత్రం వేళల్లో విద్యార్థులకు చదువుపై ఆసక్తి కలిగేలా అదనపు తరగతుల బోధనకు శ్రీకారంచుట్టారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో ట్యూషన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో మొదట ఆయన దత్తత గ్రామం ఇబ్రహీంపూర్‌ను ఎంచుకున్నారు. గ్రామానికి చెందిన నిరుద్యోగ బీఈడీ యువత, రిటైర్డ్ టీచర్లతో ప్రతీ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో సాయంత్రం అదనపు తరగతులకు బోధించనున్నారు. -
కలెక్టర్ రొనాల్డ్‌రోస్ వినూత్న ప్రయోగం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రభుత్వ పాఠశాలలంటే అందరిలోనూ చిన్నచూపు ఉంటుంది. చదువు బాగా చెప్పరని, తరగతి గదులు సరిగా ఉండవని, సర్కారీ స్కూళ్లన్నీ సమస్యల వలయం లోనే కొట్టుమిట్టాడతాయని భావిస్తారు. పాలమూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు చూస్తే ఆ అభిప్రాయాలు మార్చుకోక తప్పదు. చుట్టూ పచ్చని చెట్లు.. పరిశుభ్రమైన పరిసరాలు.. ఆకర్షణీయమైన తరగతి గదులు.. చూస్తే ఇది సర్కారీ స్కూలేనా అని ఆశ్చర్యపోయే రీతిలో పాలమూ రు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు సరికొత్త శోభతో కనిపిస్తాయి. ఏళ్లుగా అనేక సమస్యలతో కొనసాగిన ఈ పాఠశాలల్లో ఇప్పుడు ఒక్కొక్క టిగా సదుపాయాలు సమకూరుతున్నాయి. కలెక్టర్ రోనాల్డ్‌రోస్ తీసుకున్న చొరవే ఇందుకు కారణం. సర్కారీ స్కూళ్లంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు మాత్రమే కాదని.. వాటి బాధ్యత అందరిపై ఉందని పేర్కొంటూ ‘ఇంటికి వంద.. బడికి చందా’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి నుంచి స్వచ్ఛందంగా రూ.వంద వసూలు చేసి ఆయా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల న్నది దీని ఉద్దేశం. ఏడాది క్రితమే దీనికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులు, గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు, ప్రైవేట్ కంపెనీలు, స్వచ్చంద సంస్థ ల నిర్వాహకులంతా విరాళాలు ఇస్తున్నారు. ఇప్పటివరకు రూ.1.11 కోట్లు జమ కాగా, ఆ నిధులతో వసతులు కల్పిస్తున్నారు. అందరి భాగస్వామ్యంతోనే.. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్న మహబూబ్‌నగర్ జిల్లా యంత్రాంగానికి అండగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పాటు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయం. రూ.కోటికి పైగా వచ్చిన విరాళాలతో జిల్లాలో 601 ప్రభుత్వ పాఠశాలలను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుకుని.. స్వచ్ఛ పాఠశాలలుగా ప్రకటించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం అదే స్థాయిలో చదువు సామర్థ్యాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుంటున్నారు. ఇదంతా అందరి భాగస్వామ్యంతోనే సాధ్యమైంది. – రొనాల్డ్‌రోస్, కలెక్టర్, మహబూబ్‌నగర్ సమస్యలు గుర్తించి.. పరిష్కారం మహబూబ్‌నగర్ జిల్లాలో 830 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 83వేల మంది చదువుతున్నారు. కనీస సదుపాయాలు లేకపోవడంతో ఈ పాఠశాలల్లో చేరేందుకు నిరుపేద విద్యార్థులు సైతం ముందుకు వచ్చేవారు కాదు. కొన్నిచోట్ల టాయిలెట్లు లేక.. ఉన్నచోట నిర్వహణ సరిగాలేక బాలికలు ఇబ్బందులు పడేవారు. దీంతో చదువుకు స్వస్తి పలికేవారు. ఫలితంగా విద్యార్థుల సంఖ్య పడిపోతూ వచ్చింది. ఆయా స్కూళ్లలో నెలకొన్న సమస్యలే దీనికి కారణమని గుర్తించిన కలెక్టర్ రొనాల్డ్‌రోస్ వాటిని పరిష్కరించాలని నిర్ణయించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటిలోనూ సదుపాయాలు కల్పించే బాధ్యతను భుజస్కందాలపై వేసుకున్నారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న పాఠశాల నిర్వహణ నిధులు సరిపోకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.వంద చొప్పున వసూలు చేసి ఆయా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నా రు. ఈ చర్యలతో ప్రభుత్వ స్కూళ్లలో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 30వేల మంది ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఎంతో కృషి చేశాం కొన్నేళ్లుగా పాఠశాలను పూర్తిస్థాయి స్వచ్ఛ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు ఎంతో కృషి చేస్తున్నాం. స్వచ్ఛభారత్ నిబంధనలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో వసతులు కల్పించినందుకు స్వచ్ఛ పాఠశాలగా ప్రకటించాం. – బాలుయాదవ్ బైకని, హెచ్ఎం,జెడ్పీహెచ్ఎస్ ధర్మాపూర్ -
టీచర్ల సర్దుబాటుకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెరిగిన నేపథ్యంలో ఆయా స్కూళ్లకు తగినట్లుగా టీచర్లను సర్దుబాటు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఇందుకు అవసరమైన విధివిధానాలను ఆ శాఖ కమిషనర్ అధికారులకు పంపించారు. ఎస్జీటీల్లో ఆయా సబ్జెక్టులు బోధించే వారుంటే అలాంటి వారిని గుర్తించి అవసరమైన పాఠశాలలకు డిప్యుటేషన్‌పై వెళ్లి పనిచేయటానికి వారి ఆసక్తిని తెలుసుకోవాలన్నారు. ఈ సర్దుబాటు కూడా పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఈ నెల 22కల్లా పూర్తిచేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఏ పాఠశాలలో ఎంతమంది పిల్లలున్నారు.. అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు, మిగులు టీచర్ల వివరాలను నోటీసు బోర్డులో ప్రదర్శించాలని స్పష్టంచేశారు. విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్.. - 14న ఏ పాఠశాలలో టీచర్ల అవసరం ఉందో గుర్తించి ఆ పాఠశాలల్లో ఉన్న పిల్లల సంఖ్య.. అవసరమైన టీచర్ల వివరాలను ప్రదర్శించాలి. - 16, 17 తేదీల్లో పని సర్దుబాటుపై ఆయా పాఠశాలలకు వెళ్లే ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించాలి. - 19న పని సర్దుబాటు కింద వెళ్లే టీచర్ల పూర్తి వివరాలతో కూడిన నివేదికను రూపొందించాలి. - 22న మండల విద్యాశాఖ, డివిజనల్ విద్యాశాఖ అధికారులు మిగులు ఉపాధ్యాయులను ఏయే పాఠశాలలకు సర్దుబాటు చేయనున్నారో ప్రతిపాదనల రూపంలో జిల్లా విద్యాశాఖకు అందజేయాలి. - 2019 ఆగస్టు 1 నాటి ‘యూడైస్’ గణాంకాలను పరిగణనలోకి తీసుకోవాలి. - ఎస్జీటీలు, సబ్జెక్టు టీచర్లు ఏ మేరకు అవసరమో గుర్తించాలి. - విద్యార్థులు, టీచర్లు ఎంతమంది ఉన్నారు? మిగులు టీచర్లు ఎంతమంది ఉన్నారో గుర్తించాలి. - విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్లు అవసరమైన స్కూళ్లను అవరోహణ క్రమంలో ఎంపిక చేయాలి. - మిగులు టీచర్లను అవసరమైన స్కూళ్లకు కేటాయించాలి. - ఎన్రోల్మెంటుకు అనుగుణంగా విద్యార్థులు ఎక్కువగా ఉన్న స్కూళ్ల నుంచి టీచర్లను కదపరాదు. - స్కూల్ అసిస్టెంట్లు అందుబాటులో లేనిచోట సబ్జెక్టు చెప్పగలిగే ఎస్జీటీలను నియమించాలి. - సబ్జెక్టు టీచర్లు అవసరమైన చోట హైస్కూళ్లకు ప్రాధాన్యతనిస్తూ స్కూల్ అసిస్టెంట్లను, ప్రాథమికోన్నత పాఠశాలలకు సబ్జెక్టు చెప్పగలిగే ఎస్జీటీలను నియమించాలి. - జూనియర్ టీచర్లను మిగులుగా గుర్తించి వారిని సర్దుబాటు చేయాలి. సీనియర్లు సుముఖత చూపిస్తే వారిని కూడా ఆయా స్కూళ్లకు సర్దుబాటు కింద పంపించొచ్చు. - కౌన్సెలింగ్ విధానాన్ని అనుసరించి సీనియార్టీ ఆధారంగా సర్దుబాటు చేయాలి. -
వడివడిగా.. బడి ఒడికి..
సాక్షి, అమరావతి: విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగైదు నెలలు దాటినా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందేవి కావు. తరగతిలో 20 మంది ఉంటే.. పది మందికి మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉండేది. మిగిలిన వారికి ఆ తరువాత ఎప్పుడో వస్తే ఇచ్చేవారు. ఒక పుస్తకాన్ని నలుగురైదుగురు కలిపి చదువుకునే పరిస్థితి. ఇదంతా గతం. ఇప్పుడా పరిస్థితులు మారాయి. పాఠశాలలు తెరిచే నాటికే పాఠ్య పుస్తకాలు సిద్ధం చేశారు. తరగతుల్లోని ప్రతి విద్యార్థి చేతిలో అన్ని సబ్జెక్టుల పుస్తకాలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది జూన్ 12 నుంచి పాఠశాలలు తెరవగా.. ఇప్పటికే రాష్ట్రంలోని 95 శాతానికి పైగా పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు చేరాయి. అమ్మ ఒడి పథకం, ఇతరత్రా కారణాలతో ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యా శాఖ 5 శాతం పుస్తకాలను అదనంగా అందిస్తోంది. 46 వేలకు పైగా స్కూళ్లు.. 39 లక్షలు దాటిన విద్యార్థులు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో ప్రస్తుతం 46,786 పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీటిలో 39,04,141 మంది విద్యార్థులు వివిధ తరగతుల్లో విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీకి ప్రభుత్వం దాదాపు రూ.96 కోట్లు వెచ్చిస్తోంది. ఇందులో రూ.65 కోట్ల వరకు నిధులను పేపర్ కొనుగోలు, సరఫరాకు వెచ్చిస్తుండగా మిగతా మొత్తాన్ని పాఠ్య పుస్తకాల ముద్రణకు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వమే పేపర్ కొనుగోలు చేసి ప్రింటర్లకు అందిస్తోంది. వీటి ముద్రణను ఏటా డిసెంబర్ లేదా జనవరి నెలల్లోనే ప్రారంభించాల్సి ఉంటుంది. గతంలో ముద్రణ టెండర్ల వ్యవహారాన్ని ఏప్రిల్, మే వరకు ఖరారు చేసేవారు కాదు. పేపర్ కొనుగోలు, ముద్రణ టెండర్లకు సంబంధించి లోపాయికారీ ఒప్పందాలు తేలిన అనంతరం కానీ అనుమతి వచ్చేది కాదు. గడచిన విద్యా సంవత్సరంలో ఏకంగా మే మూడో వారంలో కానీ ముద్రణ టెండర్లను ఖరారు చేయలేదు. పుస్తకాల పంపిణీకి అధికారులు నానాయాతన పడాల్సి వచ్చింది. ఈసారి ఆ పరిస్థితులు పునరావృతం కాకుండా పాఠశాల విద్యాశాఖ ముందుగానే ఏర్పాట్లు చేపట్టింది. ఫలితంగా గతంలో లేనివిధంగా పాఠశాలలు తెరవటానికి ముందే పాఠ్య పుస్తకాలు సిద్ధమయ్యాయి. 7 మాధ్యమాల్లో.. 329 పీఠికలు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ, ఒరియా మాధ్యమాలకు సంబంధించి 329 పీఠిక (టైటిల్స్)లతో 2,27,77,774 పుస్తకాలు అవసరమని అంచనా వేశారు. ప్రింటర్ల నుంచి ఇప్పటికే 2,02,83,760 పాఠ్య పుస్తకాలు అందగా.. పాత స్టాకు 14,16,899 కలిపి మొత్తం 2,17,00,659 పాఠ్య పుస్తకాలను మండలాలకు తరలించారు. అక్కడి నుంచి గతంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వీటిని తీసుకెళ్లాల్సి వచ్చేది. దీనికి సమయం పడుతుండటంతో ఈసారి ఆర్టీసీతో ఒప్పందం చేసుకుని బస్సుల్లో పాఠశాలలకు పంపించారు. ఇప్పటికే ప్రధానోపాధ్యాయుల చెంతకు 2,02,74,313 పాఠ్య పుస్తకాలు చేరాయని పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరక్టర్ కృష్ణారెడ్డి వివరించారు. విద్యార్థుల చేరికలు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలకు అదనంగా 5 శాతం పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయిస్తున్నామని ఆయన వివరించారు. జిల్లాల వారీగా పాఠ్య పుస్తకాల వివరాలు -
టీచర్లు లేని చోట విద్యా వలంటీర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యార్థులు ఉండీ టీచర్లు సరిపడ లేని ప్రభుత్వ పాఠశాలలకు త్వరలో విద్యా వలంటీర్లు రానున్నారు. గతేడాది మంజూరు చేసిన 15,661 మంది విద్యా వలంటీర్లను ఈ విద్యా సంవత్సరం కోసం ఎంగేజ్ చేయాలని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల్లో విద్యా బోధనకు ఆటంకం కలుగకుండా చర్యలు చేపట్టాలని మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో స్పష్టం చేసిన ఆయన బుధవారం విద్యా వలంటీర్లను నియమించేందుకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లో అవసరమైన పాఠశాలల్లో వారి సేవలను వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. దీంతో జిల్లాల్లో అందుకు అవసరమైన చర్యలపై డీఈవోలు దృష్టి సారించారు. అయితే గతేడాది పని చేసిన విద్యా వలంటీర్లనే కొనసాగించేందుకు చర్యలు చేపట్టనున్నారు. -
విద్యా వాలంటీర్లను కొనసాగించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో రెగ్యులర్ నియామకాలు చేపట్టనప్పుడు, ఆ నియామకాలు జరిగేంత వరకు అందులో పనిచేస్తున్న విద్యా వాలంటీర్లను యథాతథంగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం పనిచేస్తున్న విద్యా వాలంటీర్లను తొలగించాలంటే రెగ్యులర్ నియామకాలు చేసినప్పుడే తొలగించాలంది. ఓ తాత్కాలిక ఉద్యోగిని మరో తాత్కాలిక ఉద్యోగితో భర్తీ చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొందని ఈ సందర్భంగా గుర్తు చేసింది. అయితే సెలవు పెట్టిన ఉపాధ్యాయుల స్థానంలో విద్యార్థులు ఇబ్బంది పడకుండా విద్యా వాలంటీర్లను నియమించి ఉంటే, ఆ ఉపాధ్యాయుడు సెలవు ముగించుకుని వచ్చిన తరువాత సదరు విద్యా వాలంటీర్‌ను కొనసాగించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. అలాగే అర్హతలు లేని విద్యా వాలంటీర్లను తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందని కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ఇటీవల తీర్పు వెలువరించారు. విద్యా వాలంటీర్లుగా ఏడాది కాలం పాటు పనిచేసినా తమను కొనసాగించకుండా కొత్త వారి నియామకం కోసం చేపట్టిన ప్రక్రియను సవాలు చేస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన భిక్షం, మరో 98 మంది హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ఇటీవల విచారణ జరిపి తీర్పు వెలువరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో రెగ్యులర్ నియామకాలు జరిగేంత వరకు ప్రస్తుతం ఉన్న విద్యా వాలంటీర్లు కొనసాగవచ్చునని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. 2019–20 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయుల ఖాళీలు, ఎంత మంది విద్యా వాలంటీర్ల అవసరం ఉంది తదితర విషయాలపై అధ్యయనం చేయాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. అవసరాన్ని బట్టి విద్యా వాలంటీర్లను నియమించుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉందని, అయితే ప్రస్తుతం పనిచేస్తున్న వారినే కొనసాగించడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదన్నారు. తగిన అర్హతలు లేని విద్యా వాలంటీర్లను తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందన్న ప్రభుత్వ న్యాయవాది వాణీరెడ్డి వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి, ఆ అధికారం ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. -
ప్రైవేటు విద్యార్థులకు కాల్‌సెంటర్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కాల్‌సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులు కూడా తమ సమస్యలను అ«ధికారుల దృష్టికి తీసుకెళ్లేలా ఈ కాల్‌సెంటర్ సేవలను విస్తరించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఈ సేవలను ప్రయోగాత్మకంగా కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలను రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు విస్తరింపజేయడం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తాము తెలుసుకోవడంతోపాటు వాటిని త్వరగా పరిష్కరించేందుకు వీలు కలుగుతుందని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్‌కుమార్ డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు ఏ సమయంలో సమస్యలు వచ్చినా తెలియపరిచేలా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. గురుకులాల్లోనూ ఫోన్ సదుపాయాన్ని కల్పించింది. పోలీసు, వైద్య సహాయం అందించేలా ఏర్పాటు చేసిన 100, 108 నంబర్లతోపాటు పాఠశాల విద్యా డైరెక్టరేట్‌కు మాత్రమే (ఈ మూడు రకాల సేవలు మాత్రమే అందించేలా) ఫోన్ వచ్చేలా రాష్ట్రంలోని 485 కేజీబీవీల్లో ఫ్రీ వైర్లెస్ ఫోన్ సెట్లను ఏర్పాటు చేసింది. విద్యార్థులు ఆ ఫోన్లలోని బటన్‌ను నొక్కితే అది నేరుగా పాఠశాల విద్య డైరెక్టరేట్‌లోని కాల్‌సెంటర్‌కు కనెక్ట్ అవుతుంది. కాల్‌సెంటర్ సిబ్బంది వీటిని రిసీవ్ చేసుకొని సమస్యలను నమోదు చేస్తారు. వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు పంపిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు త్వరగా పరిష్కారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ప్రైవేటు పాఠశాలల్లోనూ ఆ ఫోన్లను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. దీనిపై ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘాలతోనూ సమావేశమై చర్చించామని, అందుకు యాజమాన్యాలు ఒప్పుకున్నాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. -
బోగస్ ఉపాధ్యాయులకు చెక్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లోని బోగస్ టీచర్లకు చెక్ పెట్టేందుకు విద్యాశాఖ సమాయత్తం అవుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు సంబంధించిన సమగ్ర వివరాలను సేకరించాలని నిర్ణయించింది. పాఠశాలలవారీగా ‘ఆధార్’అనుసంధానంతో టీచర్ల వివరాల సేకరణను వచ్చే వారంలో ప్రారంభించి, నెల రోజుల్లోగా పూర్తి చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో అర్హత లేనివారు కూడా టీచర్లుగా ఉన్నారని, కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కొంతమంది రెగ్యులర్ టీచర్లకు బదులుగా ఇతరులు పాఠాలు చెబుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆధార్ అనుసంధానం చేయడం ద్వారా వాటికి అడ్డుకట్ట పడుతుందని విద్యాశాఖ భావిస్తోంది. మరోవైపు పాఠశాలలవారీగా టీచర్ల సమగ్ర వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా ఒక పాఠశాలలో పనిచేసే టీచర్‌ను మరో పాఠశాలలో చూపించకుండా అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 40,821 పాఠశాలలుండగా, అందులో ప్రభుత్వ, జిల్లా పరిషత్తు పాఠశాలలు 28,582, ఎయిడెడ్ పాఠశాలలు 742, సెంట్రల్ స్కూళ్లు 47, ప్రైవేటు పాఠశాలలు 11,470 ఉన్నాయి. 28,582 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 28 లక్షల మంది విద్యార్థులు, 1.30 లక్షల మంది టీచర్లు ఉన్నారు. అయినా ఇంకా టీచర్ల కొరత ఉంది. 11,470 ప్రైవేటు పాఠశాలల్లో 30 లక్షల మంది విద్యార్థులు ఉండగా, టీచర్ల సంఖ్య విషయంలో గందరగోళం నెలకొంది. నిబంధనల ప్రకారం ఉపాధ్యాయుల సంఖ్య ఉందని ప్రైవేటు యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే, ఆ లెక్క తేల్చేందుకు విద్యాశాఖ ఇప్పుడు సిద్ధమైంది. ఆధార్ అనుసంధానంతో వారి వివరాలను తీసుకోవడం ద్వారా తప్పుడు లెక్కలను అరికట్టవచ్చని విద్యాశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
పండిట్, పీఈటీ పోస్టుల అప్‌గ్రెడేషన్‌కు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న భాషా పండితులు, పీఈటీ పోస్టుల అప్‌గ్రెడేషన్‌కు మార్గం సుగమమైంది. స్పెషల్ టీచర్లుగా పనిచేస్తున్న వారికి నోషనల్ ఇంక్రిమెంట్ల మంజూరీకి సైతం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఫైలును ఆమోదించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 2,487 భాషా పండితులు, 1,047 మంది పీఈటీలు స్కూల్ అసిస్టెంట్ కేడర్‌కు పదోన్నతి పొందనున్నారు. అదేవిధంగా స్పెషల్ టీచర్లుగా నియమితులైన వారికి రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చేందుకు కూడా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సంబంధిత ఫైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 11,363 మంది టీచర్లు లబ్ధి పొందనున్నారు. వీరిలో 7,010 మంది ప్రస్తుతం ఉద్యోగాల్లో కొనసాగుతుండగా, ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారు 4,353 మంది ఉన్నారు. వీరికి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.54 కోట్ల భారం పడనుంది. దీనికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నట్లు ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు పూల రవీందర్, కె.జనార్దన్‌రెడ్డి తెలిపారు. అదేవిధంగా విద్యా శాఖలోని వివిధ వర్గాల సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. కేజీబీవీల్లో పనిచేస్తున్న టీచర్లకు 12 నెలల వేతనం, మహిళా ఉద్యోగులకు సెలవులు, గురుకులాలు, మోడల్ స్కూళ్లు, ఎయిడెడ్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు హెల్త్‌కార్డులు, ఉపాధ్యాయుల పదోన్నతులు తదితర సమస్యలకు వీలైనంత త్వరగా పరిష్కారం లభిస్తుందని వారు తెలిపారు. -
మధ్యాహ్న భోజన చార్జీలు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 24 లక్షల మం ది విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజ న ధరలు త్వరలో పెరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో విద్యార్థులకు వండి పెట్టే కూరగాయ లు, నూనె, ఉప్పు, పప్పులకు ఒక్కో విద్యార్థి పై వంట ఏజెన్సీలకు చెల్లించే మధ్యాహ్న భోజనం ధరలను 2016లో పెంచిన కేంద్రం రెండేళ్ల తర్వాత మళ్లీ పెంచింది. 5.35 శాతం ధరలను పెంచి 2018 ఏప్రిల్ 1 నుంచి వాటిని వర్తింపజేయాలని అన్ని రాష్ట్రాలను ఇటీవల ఆదేశించింది. ఇందులో భాగంగా పాఠశాల విద్యాశాఖ కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించింది. ఎన్నికల కోడ్ ముగిశాక వీటికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయనుంది. రోజూ రూ.7 లక్షల అదనపు భారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28,621 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. దీనిలో భాగంగా కూరగాయలు, ఉప్పు, పప్పు, నూనె తదితర వంట సామగ్రి కోసమే రోజూ రూ.1,23,05,648 వెచ్చిస్తోంది. తాజాగా 5.35 శాతం పెంపుతో నిత్యం రూ.1,29,67,108 వెచ్చిం చాల్సి ఉంది. అంటే దాదాపు రూ.7 లక్షలు అదనంగా వెచ్చించాలి. ఇందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని దాదాపు 19 లక్షల మందికి పైగా విద్యార్థులకు అయ్యే ఖర్చులో కేంద్రం 60 శాతం భరిస్తుండగా, రాష్ట్రం 40 శాతం భరిస్తోంది. 9, 10 తరగతుల్లోని 4,73,883 మంది విద్యార్థులకు అయ్యే మొత్తంలో కేంద్రం వాటా లేనందున రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం వెచ్చిస్తోంది. -
విద్యాప్రమాణాలపై హైకోర్టు విస్మయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యా ప్రమాణాలపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. చాలా పాఠశాలల్లో మన ప్రధానమంత్రి ఎవరో కూడా చెప్పలేని స్థితిలో విద్యార్థులున్నారని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపేలా తల్లిదండ్రుల్లో విశ్వాసం నింపేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కేరళలో ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్‌ల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు వెళతారని, అయితే ఇక్కడ అటువంటి పరిస్థితి కనిపించడం లేదని తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాల మెరుగుపై సమగ్ర అధ్యయనం జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఏదైనా ఓ మండలాన్ని ప్రాతిపదికగా తీసుకుని అక్కడ ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రమాణాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మూడువారాలకు వాయిదా వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ ఎంవీ ఫౌండేషన్ కన్వీనర్ వెంకట్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పడిపోతున్నాయి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో రోజురోజుకూ ప్రమాణాలు పడిపోతుండటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఏటా తగ్గిపోతుండటం ఏ మాత్రం ఆశాజనక పరిణామం కాదని పేర్కొంది. ప్రభుత్వ విధానాలు కూడా ప్రభుత్వ పాఠశాలలకన్నా ప్రైవేటు పాఠశాలలను ప్రోత్సహించేలా ఉన్నాయని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అందువల్ల విద్యా శాఖ అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈ కమిటీకి హైకోర్టు స్పష్టం చేసింది.పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఎంవీ ఫౌండేషన్ కన్వీనర్ ఆర్.వెంకటరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
వానాకాలం చదువులు!
రాష్ట్రంలో ప్రాథమిక స్థాయిలో తల్లిదండ్రులు అత్యధికంగా ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. వారంతా వాటిల్లోనే విద్యను కొనసాగించట్లేదు. పై తరగతులకు వెళ్తున్న కొద్దీ క్రమంగా ప్రైవేటు పాఠశాలలకు దూరం అవుతున్నారు. కొంతమంది పూర్తిగా బడి మానేస్తున్నారు. ప్రమాణాల్లోనూ ప్రైవేటు పాఠశాలలు వెనుకబడిపోతున్నాయి. 2018లో ప్రైవేటు పాఠశాలల్లో రెండో తరగతి చదువుతున్న విద్యార్థులు 54.4 శాతం మంది ఉంటే, 8వ తరగతి విద్యార్థులు 24.7 శాతమే ఉన్నారు. 2010లో 44 శాతమే 2వ తరగతి విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చేరితే ప్రస్తుతం వారి సంఖ్య అదనంగా 10 శాతానికిపైగా పెరిగింది. 2010లో 8వ తరగతి విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో 29 శాతం ఉంటే ఇప్పుడు 24.7 శాతానికి తగ్గింది. కాగా, పదాలు, వ్యాక్యాలు చదవగలిగే విద్యార్థుల సంఖ్య గతంలో కంటే మరింత తగ్గిందని యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు (అసర్) వెల్లడిం చింది. ప్రైవేటు పాఠశాలల్లో ప్రమాణాలు ఎక్కువగా పడిపోయినట్లు తేల్చింది. తీసివేతలు, గుణకారం చేయగలిగే విద్యార్థుల సంఖ్య 2016 సంవత్సరంతో పోల్చితే 2018లో ఎక్కువగా ప్రైవేటు పాఠశాలల్లోనే పడిపోయింది. – సాక్షి, హైదరాబాద్ దేశవ్యాప్త సర్వే.. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సర్వే నిర్వహించిన ప్రథమ్ సంస్థ తమ నివేదికను (అసర్–2018) మంగళవారం ఢిల్లీలో విడుదల చేసింది. 596 జిల్లాల్లోని 3 నుంచి 16 ఏళ్ల వయసున్న 5,46,527 మంది విద్యార్థులపై ఈ సర్వే నిర్వహించింది. 2007తో పోలిస్తే బడిలో చేరని పిల్లల సంఖ్య 3 శాతం తగ్గింది. అయితే దేశవ్యాప్తంగా చూస్తే బడిలో ఉన్న పిల్లల్లో ప్రమాణాలు 2.8 శాతం పడిపోయినట్లు పేర్కొంది. తెలంగాణలోనూ అదే పరిస్థితి నెలకొంది. 5వ తరగతి చదివే విద్యార్థుల్లో 2వ తర గతి స్థాయి పాఠ్యాంశాలు చదవగలిగే విద్యార్థులు 2016లో 47.1 శాతం ఉంటే 2018 నాటికి అది 43.6 శాతానికి పడిపోయింది. 8వ తరగతి విద్యార్థుల్లో 2వ తరగతి స్థాయి పాఠ్యాం శాలు చదవగలిగే విద్యార్థులు 2016 సంవత్సరంలో 76.1% ఉంటే 2018 నాటికి అది 69.5 శాతానికి పడిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి.. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యా ప్రమాణా ల స్థాయి 2016 కంటే ఇప్పుడు మరింత తగ్గిపోయాయి. 2012లో 2వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం చదవగలిగిన 8వ తరగతి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో 83.6% ఉండగా వారి సంఖ్య 2018లో 63.1 శాతానికి పడిపోయింది. ఇదీ జాతీయ సగటు 73% కంటే తక్కువ. ప్రైవేటు పాఠశాలల్లో 92.2 శాతం నుంచి 88.9 శాతానికి తగ్గిపోయింది. 1–9 నంబర్లను గుర్తించలేని వారు ఎక్కువే.. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో నంబర్లను గుర్తించలేని విద్యార్థులు ఎక్కువే ఉన్నారు. 1 నుంచి 9 లోపు సంఖ్యలను గుర్తించలేని విద్యార్థులు 1వ తరగతిలో 20 శాతం మంది ఉంటే రెండో తరగతిలో 9.2 శాతం మంది ఉన్నారు. మూడో తరగతిలో 4.9 శాతం మంది, 4వ తరగతిలో 3.3 శాతం మంది, 5వ తరగతిలో 1.8 శాతం, 6వ తరగతిలో 1.6 శాతం, 7వ తరగతిలో 2.7 శాతం, 8వ తరగతిలో 1.1 శాతం మంది విద్యార్థులు ఉన్నారు. వారు ప్రైవేటులోనే అధికం.. మూడో తరగతిలో తీసివేతలు రాని విద్యార్థుల సంఖ్య పెరిగింది. అదీ ప్రైవేటు పాఠశాలల్లో వాటిని చేయగలిగిన వారి సంఖ్య భారీగా తగ్గింది. 2016లో తీసివేత చేయగలిగిన విద్యార్థులు 42.2 శాతం ఉంటే ఇప్పుడు వారి సంఖ్య 34.5 శాతానికి పడిపోయింది. తీసివేతలు చేయగలిగిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో 2016లో 30.7 శాతం ఉంటే 2018లో 30.6 శాతం ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఈ సంఖ్యలో పెద్దగా మార్పు లేకపోయినా ప్రైవేటు పాఠశాలల్లోనే 54.6 శాతం నుంచి 38.9 శాతానికి పడిపోయింది. గుణకారం చేయగలిగిన విద్యార్థులు ఐదో తరగతిలో 2016లో 30.4 శాతం ఉంటే ఇప్పుడు వారి సంఖ్య 27.3 శాతానికి తగ్గిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో 26 శాతం నుంచి 26.7 శాతానికి పెరగ్గా, ప్రైవేటు పాఠశాలల్లో 37.6 శాతం నుంచి 28 శాతానికి తగ్గిపోయింది. 8వ తరగతిలో లెక్కలు చేయగలిగిన విద్యార్థులు 2016లో 54.9 శాతం ఉంటే ఇపుడు 48.7 శాతానికి తగ్గిపోయారు. 8వ తరగతిలో మాత్రం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ప్రమాణాలు పడిపోయాయి. 2016లో 8వ తరగతి విద్యార్థుల్లో 51.4 శాతం మంది లెక్కలు చేయగలిగిన వారు ఉంటే ఇప్పుడు వారి సంఖ్య 43 శాతానికి పడిపోయింది. -
విద్యాశాఖలో నిధుల వృథా!
సాక్షి, హైదరాబాద్: నెట్వర్క్ సమస్యలు, పనిచేయని మిషన్లతో పాఠశాల విద్యాశాఖలో బయోమెట్రిక్ హాజరు అమలుకు నోచుకోవడం లేదు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో విద్యార్థులు, టీచర్ల బయోమెట్రిక్ హాజరుకు చర్యలు చేపట్టినా ఒక్క జిల్లాలో కూడా పక్కాగా అమలుకావడం లేదు. ఇందుకోసం రూ.10 కోట్లు వెచ్చించినా ప్రయోజనం లేకుండాపోయింది. నిర్వహణ సంస్థ వైఫల్యంతో ఆధార్ అనుసంధానిత బయోమెట్రిక్ హాజరువిధానం ఒక అడుగు ముందు కు నాలుగడుగులు వెనక్కు అన్నట్లుగా తయారైంది. ప్రస్తుత లోపాలను సవరించకుండానే రాష్ట్రంలోని మరిన్ని జిల్లాల్లో మరో రూ.20 కోట్లు వెచ్చించి బయోమెట్రిక్ హాజరు అమలుకు కసరత్తు చేస్తుండటంతో నిధులు వృథా అయ్యే పరిస్థితి నెలకొంది. పక్కా చర్యలు చేపట్టే ఉద్దేశంతో.. విద్యార్థులు, టీచర్ల హాజరుపై పక్కా లెక్కలు సేకరించే ఉద్దేశంతో విద్యాశాఖ 2016లో ఈ చర్యలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 27 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలుంటే అందులో 12 జిల్లాల్లోని దాదాపు 7 వేల పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు అమలుకు చర్యలు చేపట్టింది. ఆ బాధ్యతలను తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్‌కు అప్పగించింది. క్షేత్రస్థాయిలోని పాఠశాలల్లో బయోమెట్రిక్ పరికరాల ఏర్పాటు ఆధార్‌తో అనుసంధానం, నెట్వర్క్ లింక్ తదితర అన్ని పనులు పూర్తిచేసిన నిర్వహణ సంస్థ 2018 నుంచి అమల్లోకి తెచ్చింది. అయితే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచీ అనేక సమస్యలు ఎదురయ్యాయి. నెట్వర్క్ సమస్యలతో హాజరు నమోదు కాకపోవడం, బయోమెట్రిక్ పరికరాలు పని చేయకపోవడం సమస్యలతో పాఠశాలల్లో వాటిని ఉపయోగించే వారే లేకుండాపోయారు. దీంతో రూ.10 కోట్లు వెచ్చించినా ప్రయోజనం లేకుండా పోయింది. చేతులెత్తేస్తున్న నిర్వహణ సంస్థ బయోమెట్రిక్ హాజరుపై విద్యాశాఖ గతనెలలో సమీ క్షించింది. కమిషనర్ విజయ్‌కుమార్ నిర్వహణ సంస్థతో 3 గంటలపాటు సమావేశమై చర్చించారు. లోపాలను వారి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. సమస్యలు పరిష్కారం కాలేదు. దీంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో విద్యాశాఖ పడింది. మరిన్ని పాఠశాలల్లో దీన్ని విస్తరింపజేయాలని భావి స్తున్న సమయంలో తొలి విడతలో ఏర్పాటు చేసినవే పని చేయక గందరగోళంలో పడింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఈనెల 3న ఏర్పాటుచేసిన బయోమెట్రిక్ హాజరు వివరాలను పరిశీలించింది. గతనెల 27వ తేదీ నాటి పరిస్థితితో పోల్చి చూస్తే.. పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. గత నెల 27న 1,165 స్కూళ్లనుంచి బయోమెట్రిక్ వివరాలు రాకపోగా ఈనెల 3న 908 స్కూళ్ల నుంచి వివరాలు రాలేదు. గతనెల 27న పాఠశాలకు హాజరైన 6,96,029 మంది విద్యార్థుల్లో 37,352 మంది విద్యార్థుల హాజరు మాత్రమే నమోదైంది. ఇక ఈనెల 3వ తేదీన మాత్రం 16 శాతం విద్యార్థుల బయోమెట్రిక్ హాజరు నమోదైంది. ఇక టీచర్ల హాజరు పరిస్థితి అలాగే ఉంది. గత నెల 27న టీచర్ల హాజరు 52 శాతమే నమోదైతే ఈనెల 3న 66 శాతం నమోదైంది. ఈ పరిస్థితుల్లో బయోమెట్రిక్ హాజరు విధానంపై ఎలా ముందుకు సాగాలన్న గందరగోళంలో విద్యాశాఖ పడింది. -
చాక్‌పీసులకూ పైసల్లేవ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్థిక ఇబ్బందులు అధికమయ్యాయి. మొన్నటివరకు ఎన్నికల సమయం కదా అనుకుంటే, ఎన్నికలు పూర్తయ్యాక కూడా ప్రభుత్వం నుంచి పైసా అందలేదు. దీంతో ప్రధానోపాధ్యాయులు లబోదిబోమంటున్నారు. పాఠశాలల్లో నిర్వహణ ఖర్చులను పక్కనపెడితే, విద్యార్థులకు బోధించేందుకు అవసరమైన చాక్‌పీసులకు కూడా దిక్కులేని పరిస్థితి నెలకొంది. గదులు ఊడ్చే, టాయిలెట్లు శుభ్రంచేసే సిబ్బందికి కూడా వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. 2018–19 విద్యా సంవత్సరంలో జూన్, జూలై, ఆగస్టు నెలలు మినహా ఇప్పటివరకు పాఠశాలలకు ప్రభుత్వం నుంచి పైసా రాకపోవడంతో ప్రధానోపాధ్యాయులు తీవ్ర ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలల నిర్వహణకు, కేజీబీవీల నిర్వహణకు కేంద్రం ఇస్తున్న 60% నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉండిపోవడంతో పాఠశాలల్లో ప్రతి పనికీ ఇబ్బంది తప్పడం లేదు. ముఖ్యంగా సమగ్ర శిక్షా అభియాన్‌లో (ఎస్ఎస్ఏ) వివిధ పనులకు నిధులు లేక, సిబ్బందికి వేతనాలులేక తంటాలు పడుతున్నారు. రాష్ట్రంలో ఎస్ఎస్ఏకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.1,200 కోట్లకు ఆమోదం తెలిపింది. అందులో 60 శాతం కేంద్రం వెచ్చిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను వెచ్చించాల్సి ఉంది. ఇందులో భాగంగా కేంద్రం మొదటి విడతలో తమ వాటాగా రూ.470 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రం తమ వాటా కలిపి మొత్తంగా రూ.600 కోట్లు సర్వ శిక్షా అభియాన్‌కు విడుదల చేయాల్సి ఉంది. కానీ విద్యా సంవత్సరం మొదట్లో కేవలం రూ.80 కోట్లు మాత్రమే ఇచ్చింది. దీంతో మొదటి మూడు నెలలు పెద్దగా ఇబ్బంది లేకపోయినా ఇపుడు పాఠశాలల్లో ఇబ్బందులు తీవ్రతరం అయ్యాయి. విద్యాశాఖ రూ.600 కోట్లను ఖర్చు చేసి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇస్తేనే కేంద్రం రెండో విడత డబ్బును విడుదల చేయనుంది. రాష్ట్రం తమ వాటా ఇవ్వకపోగా, కేంద్రం నుంచి వచ్చిన మొదటి విడత నిధులను కూడా విడుదల చేయకపోవడంతో క్షేత్ర స్థాయిలో 27 వేల పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నిర్వహణ నిధులు లేక, జీతాలు లేక మండలాల్లో పనిచేసే దాదాపు 10 వేల మంది వరకు క్లస్టర్ రీసోర్స్ పర్సన్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఇతర ఎస్ఎస్ఏ సిబ్బంది అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో జిల్లాల్లో, పాఠశాలల ఖాతాల్లో ఏమైనా నిధులు ఉంటే వాటిని వేతనాలుగా తీసుకోవాలని పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసిందంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థమవుతోంది. మరోవైపు గత డిసెంబర్ 12వ తేదీన ప్రభుత్వం రూ.472 కోట్లకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు (బీఆర్వో) ఇచ్చినా డబ్బులను మాత్రం విడుదల చేయకపోవడంతో తంటాలు తప్పడం లేదు. పాఠశాలల్లోని విద్యార్థులను బట్టి కొన్ని పాఠశాలల్లో ఒక్కరు, మరికొన్ని స్కూళ్లలో ఇద్దరు చొప్పున పనిచేస్తున్న వేల మంది స్కావెంజర్లు కూడా వేతనాలు లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ముఖ్యంగా కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లోనూ నిర్వహణ కష్టతరంగా మారింది. -
స్కూలు స్థలం... సొంత‘లాభం’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేందుకు యత్నించే వాళ్లను తరచూ చూస్తుంటాం. అయితే రెండు కంపెనీలకు చెందిన వారు మాత్రం ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని తనఖా పెట్టి రూ.4 కోట్లు ‘లాభం’ పొందారు. ఆ స్థలంపై నకిలీ పత్రాలను సృష్టించి వాటి ఆధారంగా మహారాష్ట్ర బ్యాంకు కు టోకరా వేశారు. ఈ రెండు సంస్థలూ ఒకే ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని దర్జాగా తనఖా పెట్టడం విశేషం. వాయిదాల చెల్లింపులు నిలచిపోవడంతో విషయం గుర్తించిన బ్యాంకు అధికారులు రెవెన్యూ, నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసుల్ని ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. దీనిపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ సమీపంలో ఉన్న గోల్కొండ క్రాస్‌రోడ్స్ చిరునామాతో బేకీస్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఉంది. దీనికి పి.నారాయణ మేనేజింగ్ డైరెక్టర్, రాయపూడి రమాదేవి డైరెక్టర్‌గా ఉన్నారు. వీరిద్దరూ కొన్నాళ్ల క్రితం రుణం కోసం ఖైరతాబాద్‌లోని మహారాష్ట్ర బ్యాంకును ఆశ్రయించారు. దీనికోసం హామీగా బీకే గూడలోని సర్వే నెం.155లో 500 గజాల విస్తీర్ణంలో ఇల్లు ఉన్నట్లు, అది తమ కంపెనీకి చెందినదేనని.. చూపే రిజిస్ట్రేషన్ సేల్‌డీడ్‌ను (నెం.435/2013) చూపించారు. దీని ఆధారంగా ఆ ఆస్తిని తనఖా పెడుతూ 2013 ఫిబ్రవరిలో రూ. 2 కోట్ల రుణం తీసుకున్నారు. మరో వ్యవహారం కూడా... బేకీస్ ఫుడ్స్ బాటలోనే... అన్నా ఇకో లాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా ఇలాంటి వ్యవహారమే నడిపింది. ఈ సంస్థ శానిటరీ నాప్కిన్స్, మెటర్నిటీ ప్యాడ్స్ తదితరాలు తయారు చేసి అమ్ముతుంది. వీటితో పాటు నేచురల్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్, క్రైసెస్ మేనేజ్మెంట్, ఉమెన్ ఎన్పవర్మెంట్, చిల్డ్రన్ డెవలప్మెంట్ తదితర కార్యక్రమాలు చేపడుతుంటుంది. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే అనేక స్వచ్ఛంద సంస్థలతో సంబంధాలు పెట్టుకుంది. దీని డైరెక్టర్లు జి.శ్రీకర్, వై.వెంకటేశ్‌లు రుణం పొందాలని భావించారు. వీరూ ఖైరతాబాద్‌లోని మహారాష్ట్ర బ్యాంకు శాఖనే ఆశ్రయించారు. ఎస్ఆర్నగర్ బీకేగూడలో 500 గజా ల స్థలంలో ఉన్న ఇల్లు తమదేనంటూ అందుకు చెంది న డాక్యుమెంట్స్ (నెం.437/13) దాఖలు చేశారు. దీన్ని తనఖా పెట్టి ప్యానల్ అడ్వకేట్‌తో న్యాయ సలహా కోసం బ్యాంకునకు అందించారు. దీంతో బ్యాంకు వారికీ 2013లో ఫిబ్రవరిలోనే రూ.2 కోట్లు మంజూరు చేసింది. రూ.4 కోట్ల రుణం పొందిన రెండు సంస్థలూ వాయిదాలు చెల్లించకపోవడంతో నిబంధనల ప్రకారం తనఖా పెట్టిన ఆస్తిని వేలం వేసే ప్రక్రియను అధికారులు మొదలు పెట్టారు. ఈ క్రమంలో రుణం తీసుకున్న వారు తమ బ్యాంకులో తనఖా పెట్టిన డాక్యుమెంట్ల వివరాలతో అమీర్‌పేట తహసీల్దార్‌కు లేఖ రాశారు. ఆ ఆస్తులకు చెందిన పూర్తి రికార్డులు కోరుతూ డీమార్క్ చేయాలని అభ్యర్థించారు. ఈ రెండు కంపెనీలు బ్యాంకునకు తనఖా పెట్టిన ఆస్తుల పత్రాలను పరిశీలించిన రెవెన్యూ అధికారులు ఆయా సర్వే నంబర్లలోని స్థలాలు రహమాన్ మంజిల్ ప్రభుత్వ పాఠశాలతో పాటు, సయ్యద్ పటేల్ భాషాలకు చెందిన స్థలాలుగా రికార్డులో ఉన్నాయని బ్యాంకుకు తెలిపారు. దీంతో నకిలీ పత్రాలతో బ్యాంకును మోసం చేశారని గుర్తించిన బ్యాంకు జోనల్ మేనేజర్ సీసీఎస్ పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. కేసులు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
విద్యార్థులను పీడిస్తున్న మేథో బలహీనత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో పలువురిని మేథోబలహీనత వేధిస్తోంది. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు, ఇతర సమస్యల కారణంగా పుట్టినప్పటి నుంచి సరైన పౌష్టికాహారం లేకపోవడం, జన్యుపరమైన లోపాల వల్ల వీరిని ఈ సమస్య వెంటాడుతోంది. ఇటీవల ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి విద్యార్థుల్లోని ‘డౌన్‌సిండ్రోమ్’ (మేథోబలహీనత, శారీరక అసాధారణ పరిస్థితి)పై పరిశీలన నిర్వహించారు. మొత్తంగా 4,719 మందిని పరిశీలించగా 1,040 మంది డౌన్‌సిండ్రోమ్ లక్షణాలతో బాధపడుతున్నట్లు కనుగొన్నారు. ఈ రుగ్మతల వల్ల వారి విద్యాభ్యాసంపై తీవ్ర ప్రభావం పడుతోందని గుర్తించారు. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా చదువుతున్న ప్రభుత్వం పాఠశాలల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో కూడా ఆశించిన మేర పౌష్టికత ఉండడం లేదన్న విమర్శలున్నాయి. రాష్ట్రంలోని ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఈ పథకం అమలవుతోంది. ఇందుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తున్నాయి. దీనికింద హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, హోమ్‌సైన్సు కాలేజీ, అగ్రికల్చరల్ యూనివర్సిటీ సూచనల మేరకు స్థానిక వనరులతో పౌష్టికాహార మెనూను నిర్దేశించారు. అన్నం, పప్పు, కూరగాయలు, సాంబారు, పులిహోరతో పాటు వారానికి అయిదు గుడ్లు, అరటిపండ్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశిత మార్గదర్శకాలు విడుదల చేస్తున్నా ఆ మేరకు పథకం అమలు కావడం లేదు. కోడిగుడ్లు, ఆయిల్, పప్పుల సరఫరా టెండర్లలో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా విద్యార్థులకు సరైన ప్రమాణాల్లో పౌష్టికాహారం అందడం లేదు. పైగా మురిగిపోయిన కోడిగుడ్లు, నాణ్యతలేని కందిపప్పు, సమయం దాటిన ఆయిళ్లు పంపిణీ చేస్తుండడంతో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులే పేర్కొంటున్నారు. అటు నిరుపేద కుటుంబాల పిల్లలకు ఇంటివద్ద పౌష్టికాహారం లేకపోగా ఇటు పాఠశాలల్లోని మధ్యాహ్న భోజనం ద్వారా కూడా అందడం లేదు. ఫలితంగా విద్యార్థుల్లో మేథోపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. క్రోమోజోమ్‌ల లోపంతోనే ఈ సమస్య పుట్టుకతో ఏర్పడిన కొన్ని సమస్యల వల్ల విద్యార్థులు మేథోబలహీనతతో పాటు ఇతర శారీరక రుగ్మతలకు గురవుతున్నారు. పిల్లల పుట్టుకకు 23 జతల క్రోమోజోమ్‌లు కారణభూతంగా ఉంటాయి. వీటిలో 21వ జత క్రోమోజోమ్‌లో అదనపు క్రోమోజోమ్ ఎక్కువగా జతవ్వడం వల్ల పుట్టిన పిల్లలు అసాధారణ శారీరక మార్పులకు గురవుతుంటారు. వీరిలో మెదడు పెరుగుదల ఆశించినంతగా ఉండదు. ఎముకలు గుల్లబారడం, పేగుల్లో సమస్యలు తలెత్తడం వంటివి ఎదురవుతుంటాయి. వీటివల్ల ఈ పిల్లలు చదువుల్లో వెనుకబడిపోతుంటారు. పిల్లలు గర్భంలో ఉన్నప్పుడే తల్లికి సరైన పౌష్టికాహారం వంటివి అందించాల్సి ఉంటుంది. గర్భంలో పిల్లల ఎదుగుదల ఎలా ఉందో ఎప్పటికప్పుడు పరీక్షల ద్వారా తెలుసుకుంటూ తగిన జాగ్రత్తలు చేపట్టాలి. పిల్లలు పుట్టిన దగ్గర నుంచీ కూడా సరైన పౌష్టికాహారం అందించాలి. – డాక్టర్ జి.శ్రీనివాస్, చిన్నపిల్లల వైద్యనిపుణుడు, వైఎస్సార్ జిల్లా పౌష్టికత లోపం వల్లనే ఈ సమస్యలు పౌష్టికత లోపం వల్లనే ఈ సమస్యలు ఏర్పడుతున్నాయి. బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు, ప్రసవం తరువాత తల్లికి సరైన పౌష్టికాహారం అందేలా తొలినుంచి చర్యలు తీసుకోవాలి. పేద కుటుంబాల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవ్వడం వల్లనే ఈ సమస్య ఎక్కువవుతోంది. పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా కూడా సరైన ఆహారం అందడం లేదు. ఐసీడీఎస్ పథకం పూర్తిగా నీరుగారిపోయింది. ఇక పాఠశాలల్లో చేరాక పిల్లలకు మధ్యాహ్న భోజనం ద్వారా పౌష్ఠికాహారం అందించాల్సి ఉన్నా అది కాస్తా అక్రమాలమయంగా మారింది. పిల్లలకు గుడ్లు, అరటి పండ్లు అందడం లేదు. ఆహార పదార్థాల సరఫరాకు రాష్ట్ర స్థాయిలో టెండర్లు పిలుస్తూ భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారు. 60 శాతానికి పైగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. – విఠపు బాలసుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ -
విద్యార్థుల బీమాకు మంగళం
తాడేపల్లి రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బీమా ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం మంగళం పాడింది. దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీమా సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి విద్యార్థి నుంచి రూ.5 వసూలు చేసి, వారికి ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ రూపంలో వైద్యానికి అయ్యే ఖర్చులు అందచేసేవారు. ఒకవేళ ప్రమాదంలో మృతి చెందితే తల్లిదండ్రులకు రూ.1లక్ష అందచేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణం అనంతరం రెండు సంవత్సరాలు నడిచిన పథకం తెలుగుదేశం అధికారం చేపట్టగానే తూట్లు పొడిచి నిధుల్ని పక్కదారి పట్టించింది. సాక్షాత్తు ప్రతి రోజూ ముఖ్యమంత్రి పర్యటించే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గత ఏడాది సుమారు 20మందికి పైగా విద్యార్థులు మృతి చెందారు. ఆయన నివాసం ఉంటున్న తాడేపల్లి మండలంలో టీడీపీ నేతలు అక్రమంగా తవ్విన ఇసుక గుంతల్లో మునిగి నలుగురు విద్యార్థులు చనిపోయారు. మరో విద్యార్థి రైలు ప్రమాదంలో మృతి చెందాడు. ఫిరంగిపురంలో నలుగురు విద్యార్థులు పాఠశాలకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినా, బీమా గురించి ముఖ్యమంత్రికి, విద్యాశాఖ మంత్రికి, అధికారులకు ఆలోచన రాకపోవడం విడ్డూరంగా ఉందంటూ పలువురు విమర్శిస్తున్నారు. చనిపోయిన విద్యార్థులకు బీమా సౌకర్యం ఎందుకు కల్పించలేదని పలు పాఠశాలలో ఉపాధ్యాయులను ప్రశ్నించగా, తమకు తెలియదంటూ సమాధానమిచ్చారు. ప్రతి విద్యార్థికీ రూ.5 చొప్పున ప్రభుత్వం చెల్లించి ఉంటే చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు రూ.1లక్ష, స్వల్పంగా గాయపడిన విద్యార్థులకు రూ.25వేలు, తీవ్రంగా గాయపడితే రూ.50వేల నుంచి రూ.75వేల వరకు బీమా కంపెనీ అందజేసేది. మృతుల కుటుంబాలకు పైసా అందించని ప్రభుత్వం గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలు 6,750 ఉండగా, అందులో చదువుకుంటున్న విద్యార్థులు 9లక్షలకు పైనే ఉన్నారు. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో సుమారు 20మందికి పైగా మృతి చెందగా వారి కుటుంబాలకు నేటికీ ఒక్క పైసా ప్రభుత్వం అందించలేదు. కనీసం చంద్రన్న బీమా కూడా వర్తింప చేయలేదు. తమ బిడ్డలు చదువుకుని ఉద్యోగాలు చేసి తమను పోషిస్తారనుకుంటే చివరకు వారు అకాలంగా మృతి చెందడంతో, ఆర్థికంగా, దిగులుతోను ఆ కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. అలాగే గాయపడిన విద్యార్థులు 40–100 మంది దాకా ఉన్నారు. వారికి కూడా వైద్యం చేయించుకునే స్థోమత లేక విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. బీమా గురించి తెలియదు మా అబ్బాయి చనిపోయిన తర్వాత పాఠశాల నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదు. చంద్రన్న బీమా కూడా వర్తించదని చెప్పారు. పాఠశాలలో బీమా సౌకర్యం ఉన్నదని మాకు తెలియదు. – మలమంటి లక్ష్మి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతా ప్రస్తుతానికి బీమా సౌకర్యం గురించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదు. గతంలో విద్యా శాఖాధికారులు చెప్పినప్పుడు కట్టించుకునే వాళ్లం. మరలా కట్టించుకోమంటే ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర వసూలు చేసి బీమా కంపెనీకి అందజేస్తాం. – విల్సన్ వినోద్, మండల ఇన్చార్జి ఎంఈవో -
బడి బిల్లు కట్టేదెవరు?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్ బిల్లు చెల్లింపుపై సందిగ్ధం నెలకొంది. పాఠశాలల విద్యుత్ బిల్లుల చెల్లింపుల కోసం ప్రాథమిక విద్యాశాఖ విడుదల చేసిన నిధులు సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో ఆ జిల్లాల్లోనే మగ్గిపోతున్నాయి. మరోవైపు పాఠశాలలు బిల్లులు చెల్లించకపోవటంతో ట్రాన్స్ కో అధికారులు విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో ఏంచేయాలో పాలుపోక అధికారులు తలలు పట్టుకుని కూర్చున్నారు. వాస్తవానికి గత విద్యా సంవత్సరం వరకు విద్యుత్ బిల్లులను కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు సంబంధించిన నిధులతో చెల్లింపులు జరిపేవారు. ఉన్నత పాఠశాలలకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్(ఆర్‌ఎంఎస్‌ఏ), ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు సర్వశిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) ద్వారా బిల్లులు చెల్లించేది. తాజాగా ఈ బిల్లు చెల్లింపులను ప్రభుత్వమే చేస్తుందని పాఠశాల విద్యాశాఖ(డీఎస్ఈ) స్పష్టం చేసింది. ఈమేరకు ఆ శాఖ సం చాలకులు టి.విజయ్‌కుమార్ గతనెలలో ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల వారీగా పెండింగ్ బిల్లుల సమాచారాన్ని సేకరించి ప్రాధాన్యత క్రమంలో చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే డీఎస్ఈ నుంచి ఉత్తర్వులు వచ్చి నెలరోజులు గడుస్తున్నా వాటిపై క్షేత్రస్థాయిలో విద్యాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విద్యుత్ బకాయిలు రూ.18 కోట్లు రాష్ట్రంలో 26,114 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు నెలకు సగటున రూ.500 వరకు విద్యుత్ బిల్లు వస్తోంది. కంప్యూటర్ ల్యాబ్‌లు, డిజిటల్ తరగతి గదుల నిర్వహణతో పాటు ఇతర ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ పరికరాల వినియోగాన్ని బట్టి బిల్లుల్లో మార్పులు ఉంటున్నాయి. దీంతో సగటున ఒక ఉన్నత పాఠశాలలో నెలకు రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకు విద్యుత్ బిల్లులు నమోదవుతున్నాయి. 2018–19 వార్షిక సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను ఇప్పటివరకు చెల్లించలేదు. దీంతో దాదాపు ఆర్నెల్లకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో రూ.18 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఇటీవల 13 జిల్లాలకు రూ.1.04 కోట్లు చొప్పున విడుదల చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.40 లక్షలు, ఉన్నత పాఠశాలలకు రూ.64 లక్షలు విడుదల చేసింది. ఆయా జిల్లాల్లో పాఠశాలల వారీగా బకాయిల వివరాలు తెప్పించుకుని ఆమేరకు చెల్లించాలని డీఎస్ఈ ఆదేశించింది. కానీ, ఆ 13 జిల్లాల్లో క్షేత్రస్థాయి నుంచి స్పష్టమైన సమాచారాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు సేకరించలేదు. దీంతో డీఎస్ఈ విడుదల చేసిన నిధులు ఆయా జిల్లాల్లోనే మగ్గిపోయాయి. మరోవైపు ఆర్నెల్ల నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ కనెక్షన్‌ను తొలగిస్తామంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. -
ప్రైవేటు భారం.. ప్రభుత్వమే ఆధారం
సాక్షి, హైదరాబాద్: దళిత, గిరిజనులకు ప్రైవేటు విద్య భారమవుతోంది. ఆయా కుటుంబాల ఆర్థిక స్థితిగతుల్లో పెద్దగా మార్పులు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలకే పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల్లో ఎక్కువ భాగం దళిత, గిరిజనులే. ఆ తర్వాతి స్థానంలో వెనుకబడిన కులాలకు చెందిన పిల్లలుంటున్నారు. సెస్(సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్) ఆధ్వర్యంలో యంగ్‌లైవ్స్ అనే సంస్థ రాష్ట్రంలో విద్య, అభ్యాసన అనే అంశాలపై సర్వే నిర్వహించింది. 2009 నుంచి 2016 మధ్య కాలం నాటి పరిస్థితులను ప్రామాణికంగా తీసుకుని పరిశీలన చేపట్టింది. దీనికి సంబంధించిన నివేదికను ఇటీవల ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ విడుదల చేశారు. ఈ పరిశీలనలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. విద్యాపరంగా అభివృద్ధి వేగవంతమవుతున్నప్పటికీ అందులో మార్పులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. 2009 సంవత్సర గణాంకాలను, 2016 సంవత్సర గణాంకాలతో పోలిస్తే ఎస్సీ, ఎస్టీ పిల్లలే ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నట్లు బయటపడింది. ఎస్సీల్లో 84.7 శాతం పిల్లలు, ఎస్టీల్లో 72.7, బీసీలు 56.4, ఇతర కులాల పిల్లలు 30.2 శాతం మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. మిగతా వారంతా ప్రైవేటు బాట పట్టినట్లు ఈ సర్వే స్పష్టం చేస్తోంది. నమోదు భళా...: 2009 నాటి పరిస్థితులతో పోలిస్తే స్కూళ్లకు వెళ్లే పిల్లల సంఖ్య భారీగా పెరిగింది. ఈ మార్పు ఎస్సీ, ఎస్టీలతోపాటు బీసీలు, ఇతర కేటగిరీల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో అధికంగా ఎస్సీ, ఎస్టీ కేటగిరీలున్నాయి. సామాజిక పరిస్థితులు, సాంకేతిక పరిజ్ఞానం విస్తృతం కావడంతోపాటు అన్ని వర్గాల్లో చైతన్యం వస్తుండటంతో ఈ మార్పు సాధ్యమైందని తెలుస్తోంది. ఈ క్రమంలో 2009 గణాంకాలతో పోలిస్తే ప్రస్తుతం బడికి వెళ్తున్న పిల్లల్లో ఎస్సీల్లో 23 శాతం పెరగగా, ఎస్టీల్లో 32 శాతం పెరిగింది. బీసీల్లో 24 శాతం, ఇతర కేటగిరీల్లో 13.8 శాతం పెరుగుదల కనిపించింది. వచ్చే ఐదేళ్లలో పాఠశాలల్లో నమోదు వంద శాతానికి చేరుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. సామర్థ్యం డీలా.. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు భారీగా పెరిగినప్పటికీ వారిలో సామర్థ్యం మాత్రం డీలా పడుతున్నట్లు పరిశీలనలో తేలింది. ప్రవేశం పొందిన నాటి నుంచి పైతరగతులకు వెళ్తున్నకొద్దీ వారిలో ప్రతిభాపాటవాలు సన్నగిల్లుతున్నాయి. విద్యార్థుల కనీస సామర్థ్యాల గణనలో... చదవడం, రాయడంతోపాటు చతుర్విద ప్రక్రియలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మేరకు ఆయా వర్గాల పిల్లల కనీస సామర్థ్యాలు పరిశీలిస్తే ఫలితాలు తిరోగమనంలో నమోదు కావడం గమనార్హం. 2009 నాటి పరిస్థితులతో పోలిస్తే 2016 నాటికి సగానికి పడిపోయినట్లు పరిశీలనలో తేలింది. 2009తో పోలిస్తే ఎస్సీ విద్యార్థుల్లో 7.5 శాతం పిల్లలు చతుర్విద ప్రక్రియల్లో ఉత్తీర్ణులు కాగా, 2016లో కేవలం 5.3 శాతం మాత్రమే పాసయ్యారు. ఎస్టీల్లో 15 శాతం నుంచి 7 శాతానికి, బీసీల్లో 11.3 శాతం నుంచి 6.2 శాతానికి, ఓసీల్లో 17.6 శాతం నుంచి 11.3 శాతానికి తగ్గినట్లు తేలింది. సరైన సమాధానాలు ఇచ్చినవారిలో ప్రైవేటు పాఠశాలల పిల్లలు కొంత మెరుగ్గా ఉండగా, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం తక్కువగా ఉంది. దీనికి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన పిల్లల తల్లిదండ్రులు పెద్దగా చదువుకోకపోవడమే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. -
24 నుంచి ‘హైజీన్ కిట్లు’ పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లోని 5,90,980 మంది బాలికలకు ఈ నెల 24 నుంచి హెల్త్ అండ్ హైజీన్ కిట్లు పంపిణీ చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. దీనిపై మంగళవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులతో సమీక్షించారు. అలాగే హరితహారం కార్యక్రమంపైనా సమీక్ష జరిపారు. ఈ నెల 31 వరకు జిల్లా పరిషత్, ప్రభుత్వ, మోడల్ స్కూళ్లు, గురుకుల, కేజీబీవీ, పాఠశాల ల్లోని బాలికలందరికీ హైజీన్ కిట్లు అందించాలని నిర్ణయించారు. ఈ కిట్లలో బాలికలకు కావాల్సిన 14 రకాల వస్తువులు ఉండేలా రూపొందించారు. ఏడాదికి సరిపడా వస్తువులను ఒకేసారి ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. దీనికోసం ఒక్కో విద్యార్థినిపై ఏటా రూ.1,600 ఖర్చు చేస్తున్నామని, మొత్తంగా రూ.100 కోట్ల వరకు వెచ్చిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల బాలికలు 4,18,440 మంది, మోడల్ స్కూళ్ల బాలికలు 55,195 మంది, కేజీబీవీ బాలికలు 80,999 మంది, గురుకులాల విద్యార్థినులు 9,651 మంది, ఎయిడెడ్ పాఠశాలల బాలికలు 26,695 మంది.. మొత్తం 5,90,980 మంది బాలికలకు కిట్లను అందజేసేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. 25న ‘హరిత పాఠశాల–హరిత తెలంగాణ’ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఈ నెల 25 నుంచి ‘హరిత పాఠశాల–హరిత తెలంగాణ’ కార్యక్రమం చేపట్టాలని కడియం అధికారులను ఆదేశించారు. హరితహారం నిర్వహణకు ప్రతి పాఠశాలలో విద్యార్థులతో గ్రీన్ బ్రిగేడ్లను నియమించాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. అటవీ శాఖ అధికారులు గ్రీన్ బ్రిగేడ్ల కోసం దుస్తులు, టోపీలు, రుమాళ్లు సమకూర్చాలన్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో ఉన్న దాదాపు 40 లక్షల మంది విద్యార్థులకు దాదాపు కోటి పూలు, పండ్ల మొక్కలు ఇవ్వాలని వెల్లడించారు. హరితహారంలో నాటిన మొక్కల్లో బతుకుతున్న మొక్కల శాతం విద్యాసంస్థల్లోనే ఎక్కువగా ఉందన్నారు. జనగామ జిల్లా కొడకండ్ల గ్రామం లోని రెసిడెన్షియల్ పాఠశాలలో గతంలో నాటిన మొత్తం వెయ్యి మొక్కలనూ పరిరక్షించారని చెప్పారు. సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ప్రిన్సి పల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీకే ఝా, కళాశాల విద్యాకమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
సర్కారు స్కూల్.. ప్రవేశాలు ఫుల్!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2017–18 విద్యాసంవత్సరంతో పోల్చితే ప్రస్తుతం 2.09 లక్షల ప్రవేశాలు అధికంగా నమోదయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో విద్యార్థుల నమోదుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ తాజా గణాంకాలు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 29,343 విద్యాసంస్థలున్నాయి. ఇందులో 26,040 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, 475 కేజీబీవీలు, 1,771 గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటితోపాటు సంక్షేమ సొసైటీలకు సంబంధించి గురుకులాలు, ఆదర్శ పాఠశాలలున్నాయి. ఈ నెల మొదటి వారం నాటి వరకు ఉన్న గణాంకాలను పరిశీలిస్తే ప్రభుత్వ విద్యా సంస్థల్లో 28,29,135 మంది విద్యార్థులున్నారు. గురుకులాల్లో సీట్లు.. మెనూలో మార్పులు.. కేజీ టు పీజీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. ఉచిత వసతితోపాటు ఆంగ్ల మాధ్యమ బోధనకు ప్రాధాన్యం ఇవ్వడంతో గురుకులాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. అలాగే విద్యార్థుల భోజన మెనూలోనూ విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభు త్వం శ్రీకారం చుట్టింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్(ఎన్ఐఎన్) సూచన మేరకు బలవర్థకమైన ఆహారాన్ని ఇచ్చేలా ప్రత్యేక మెనూ రూపొందించింది. దీంతో నెలలో ఆరుసార్లు మాంసాహారంతో కూడిన భోజనం, రోజూ ఉడికించిన కోడిగుడ్డు, పా లు తదితరాలను పిల్లలకు ఇస్తున్నారు. ఈ క్రమంలో ప్రవేశాలు అమాంతం పెరిగాయి. కొత్తగా ప్రారంభించిన గురుకులాల్లో తొలుత 5, 6, 7 తరగతులు ప్రారంభించగా.. ఈ ఏడాది ఎనిమిదో తరగతి అందుబాటులోకి వచ్చింది. దీంతో గురుకులాల సీట్లు వేగవంతంగా భర్తీ అవుతున్నాయి. దాదాపు అన్ని గురుకులాల్లో 99.24 శాతం సీట్లు భర్తీ కావడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఈసారికి విద్యార్థుల ప్రవేశాలు మోస్తరుగా పెరిగాయి. 2017– 18 విద్యా సంవత్సరంలో 21.5 లక్షల మంది పిల్లలుండగా.. 2018–19లో వీరి సంఖ్య 22.69 లక్షలకు పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తే ప్రవేశాల సంఖ్య భారీగా పెరుగుతుంద ని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. -
బుక్కుల్లో బొక్కేశారు!
సాక్షి, అమరావతి: పేద విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచే ప్రభుత్వ పాఠశాలల లైబ్రరీలనూ అధికార పార్టీ నేతలు వదలడం లేదు. గ్రంథాలయాలకు పుస్తకాల కొనుగోళ్ల పేరుతో రూ.4.66 కోట్ల సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) నిధులను మింగేశారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడితోపాటు ఓ ఉన్నతాధికారి ఇందులో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి అవినీతి నిరోధకశాఖకు ఫిర్యాదులు అందినా అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంతో విచారణ ముందుకు సాగడం లేదు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు దృష్టికి వచ్చినా ఈ వ్యవహారానికి అడ్డుకట్ట పడకపోవడం గమనార్హం. అసలు రేట్లను భారీగా పెంచేసి... బెంగళూరుకు చెందిన ‘డ్రీమ్‌వరల్డ్ ఇండియా’ సీడీలు, డీవీడీలతో కూడిన పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలల గ్రంథాలయాలకు పంపిణీ చేస్తామని రెండేళ్ల క్రితం మంత్రి గంటా శ్రీనివాసరావుకు 16 రకాల పుస్తకాలతో ప్రతిపాదనలు అందచేసింది. పుస్తకాల వాస్తవ ధరలపై 71 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తామనడంతో ఎస్ఎస్ఏ ద్వారా పుస్తకాల కొనుగోలుకు మంత్రి ఆదేశించారు. రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్ఈఆర్టీ) ఆధ్వర్యంలో నిపుణుల కమిటీతో పరిశీలన తరువాత 11 రకాల పుస్తకాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇక్కడే గోల్‌మాల్‌కు తెరలేచింది. ముందుగా చెప్పిన్నట్లు కాకుండా పుస్తకాల ధరను పెంచేశారు. డిస్కౌంట్‌ను 71 శాతానికి బదులు 30 శాతానికి పరిమితం చేశారు. ఉదాహరణకు ప్రభుత్వానికి ముందుగా సమర్పించిన ప్రతిపాదనల ప్రకారం ‘స్పిరిట్ ఆఫ్ ఇండియా’ పుస్తకం ధర రూ.1495 ఉంటే ఎస్పీడీ ప్రతిపాదనల్లో అది రూ.2,495కి పెరిగింది. ‘ఓషన్ రిలీవింగ్ ద సీక్రెట్స్ ఆఫ్ డీప్’ పుస్తకం ధర రూ.1,000 నుంచి రూ.1995కి పెంచేశారు. ‘అట్లాస్ ఆఫ్ మై వరల్డ్’ పుస్తకం ధర రూ.695 నుంచి రూ.1,495కు పెంచేశారు. ‘డబుల్’ దందా! వాస్తవానికి తొలుత పేర్కొన్న ధరల ప్రకారం 11 పుస్తకాల సెట్టు ధర రూ.7,200 మాత్రమే. కానీ తరువాత ధరను అమాంతం రూ.13,489కి పెంచారు. రాష్ట్రంలోని 11,217 ప్రాథమికోన్నత పాఠశాలలకు పంపిణీ చేయడానికి రూ.15,13,06,113 అవుతుందని అంచనాలు రూపొందించారు. అయితే తరువాత స్కూళ్ల సంఖ్యను 7,413కి కుదించారు. ఆ ప్రకారం రూ. 9,99,93,957 అవుతుందని లెక్కగట్టారు. ఆమేరకు పుస్తకాలను పాఠశాలలకు అందించాలని జిల్లా ప్రాజెక్టు అధికారులకు ఎస్ఎస్ఏ ఎస్పీడీ ఆదేశాలు జారీచేశారు. మండల పాయింట్లకు డ్రీమ్‌వరల్డ్ సంస్థే పుస్తకాలను సరఫరా చేయాల్సి ఉన్నా కేవలం జిల్లా కేంద్రాలకు అందించేలా ఎస్ఎస్ఏ వెసులుబాటు కల్పించడంతోపాటు జిల్లా కార్యాలయాల నుంచి చెల్లింపులు చేయించారు. ఫైల్‌ను ముందు ముఖ్యకార్యదర్శికి పంపి ఆమోదం పొందాల్సి ఉన్నా అందుకు భిన్నంగా ఆర్డర్లు ఇచ్చిన తరువాత ఫైలును పంపడం గమనార్హం. ఉన్నతాధికారులు మంత్రికి నివేదించినా... డ్రీమ్‌వరల్డ్ తొలుత ప్రభుత్వానికి అందించిన ధరల ప్రతిపాదనల పత్రాలు ఫైల్లో లేకపోవడం, వాటి స్థానంలో అధిక ధరలతో వేరే పత్రాలు ఉండడాన్ని ముఖ్యకార్యదర్శి గుర్తించారు. ముందుగా ఇచ్చిన ఆఫర్ ప్రకారం ఒక్కో సెట్టు వాస్తవ ధర రూ.7,200 కాగా రూ.6,289 చొప్పున అదనంగా రేటు పెంచి రూ.13,489 చేశారు. 11 పుస్తకాల సెట్టు రూ.7200 చొప్పున 7,413 సెట్లకు రూ.5,33,73,600 మాత్రమే అవుతుంది. అయితే ఎస్ఎస్ఏ ఎస్పీడీ కొత్త ధరల పట్టికను చూపిస్తూ రూ.13,489 చొప్పున రూ.9,99,93,957 చెల్లింపులు చేశారు. పుస్తక ధరలను నిర్ణయించేందుకు రాష్ట్ర పుస్తక ప్రచురణ విభాగం ఉన్నా దానితో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ద్వారా ధరలను ఖరారు చేయించారు. ఎస్ఎస్ఏ ఫైల్లో ధరలు భారీగా పెరగడంపై ఉన్నతాధికారులు మంత్రికి నివేదించినా ఫలితం లేకపోయింది. అసలది పబ్లిషింగ్ సంస్థే కాదు.. డ్రీమ్‌వరల్డ్ సంస్థ ముందు ఇచ్చిన ఆఫర్ ప్రకారం చెల్లించాల్సిన మొత్తం రూ.5,33,73,600 మాత్రమే కాగా ధరలు పెంచి రూ.4,66,20,357 అదనంగా చెల్లించారు. విచిత్రమేమంటే డ్రీమ్‌వరల్డ్ ఇండియా సంస్థ అసలు పబ్లిషింగ్ సంస్థే కాదని కేవలం పంపిణీదారు మాత్రమేనని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ సంస్థ ప్యారగాన్ పబ్లిషింగ్ తదితర సంస్థల పుస్తకాలను పంపిణీ చేసి వాస్తవ ధరలను 50 శాతం వరకు పెంచిందని, అధికారులు కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు చిల్లుపెట్టారని ముఖ్యకార్యదర్శి పరిశీలనలో తేలింది. ఆర్డర్లు రద్దు చేసి బిల్లుల చెల్లింపును నిలిపి వేయాలని, డ్రీమ్‌వరల్డ్ సంస్థపై చర్యలు తీసుకోవాలని, తొలుత ప్రతిపాదించిన ధరల కన్నా ఎక్కువ ఎందుకు చెల్లించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని ఎస్ఎస్ఏ ఎస్పీడీని ముఖ్యకార్యదర్శి ఆదేశించారు. -
ప్రకాష్ రాజ్ నిశ్శబ్ద ఉద్యమం
ప్రకాష్ రాజ్... ప్రముఖ సినీ నటుడు... బహుభాషా ప్రేక్షకులకు ప్రియమైన విలన్. నిజ జీవితంలో మాత్రం అణగారిన వర్గాల ప్రియతమ హీరో. బెంగళూరులో హత్యకు గురైన ప్రముఖ జర్నలిస్టు గౌరీలంకేశ్ స్నేహితుడిగా ఆమె చైతన్యాన్ని అందిపుచ్చుకున్నానని ప్రకటించుకొన్నాడు. అభ్యుదయ వేదికల్లో ఆమె ఆదర్శాన్ని కొనసాగిస్తానని తేల్చి చెప్పిన ప్రకాష్ రాజ్ అంతే దృఢంగా ప్రజాస్వామ్య కాంక్షాపరుడినని స్పష్టం చేశారు. ‘జస్ట్ ఆస్కింగ్’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సమాజంలో జరుగుతున్న అన్యాయాలనూ, అరాచకాలనూ బహిరంగంగా సవాల్ చేశారు. ఆ తరువాత జరిగిన కర్ణాటక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించడమే తన ఎజెండా అని ప్రకటించారు. కన్నడ నాట బీజేపీయేతర పార్టీలను గెలిపించండని బహిరంగంగా ప్రకటించి సంచలనం సృష్టించారు. అయితే కర్ణాటక ఎన్నికల తరువాత ఉన్నట్టుండి హఠాత్తుగా మాయమయ్యారు. సోషల్ మీడియాలో కూడా పెద్దగా కనిపించిందీ లేదు. ప్రకాష్‌రాజ్ ఎక్కడికెళ్లినట్టు? అని ఆరాతీస్తే అభ్యు దయ భావాలుగల ప్రకాష్‌రాజ్ పల్లెసీమల్లో పచ్చటి పంట పొలాల్లో, పూరి గుడిసెల్లో, కప్పులేని పాఠశాలల్లో... చిన్నారుల ఆటస్థలాల్లో... పసివారి నల్లని పలకలపై తెలతెల్లని అక్షరాల్లో... మొత్తంగా కన్నడ రాష్ట్రంలోని నిరుపేద గుండెల్లో మెలమెల్లగా మెరిసిపోతున్నాడు. అందుకే ఇప్పుడు కర్ణాటక గ్రామసీమల్లో ప్రకాష్ రాజ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రజాచైతన్యం కోసం... ఎక్కడో పల్లెజనాలను వెతుక్కుంటూ వెళ్లి వారిని చైతన్యం చేసే పనిలో తలమునకలై ఉన్నారు ప్రకాష్ రాజ్. జస్ట్ ఆస్కింగ్ పేరుతో మొన్నమొన్నటి వరకూ కేవలం సవాళ్లకే పరిమితమైన ప్రకాష్‌రాజ్ ప్రస్తుతం ఒకడుగు ముందుకేసి కార్యాచరణకు సైతం పూనుకుంటూ ప్రజల్లో విద్య పట్ల, ఆరోగ్యం çపట్ల అవగాహన రేకెత్తిస్తున్నారు. సంక్షేమం ఎవరో వేసిన భిక్ష కాదని, అది ప్రజల డబ్బని.. ప్రజల హక్కనీ వారికి తెలియజెపుతున్నాడు. అలాగే పాఠశాలలను, ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వాలు నెలకొల్పినా, వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనంటూ సామాజిక బాధ్యతను ప్రజలు గుర్తెరిగేలా చేస్తున్నారు. తను పాఠశాలలను దత్తత తీసుకుంటున్నానని వస్తున్న వార్తల పట్ల ప్రకాష్ రాజ్ స్పందిస్తూ ‘‘దత్తత తీసుకోవడానికి నేనెవరిని? పాఠశాల అందరి సొత్తు. ముఖ్యంగా ప్రజల సొత్తు. దాన్ని కాపాడుకోవాల్సింది వాళ్లేనని’’ తేల్చి చెప్పి వారిని మెప్పించి ఒప్పించారు. భిక్ష కాదు..మన హక్కు మన దగ్గర డబ్బులు లేక పోవచ్చు. కానీ మన పిల్లల చదువులే వారికి మనమిచ్చే సంపద. మీ స్కూలు మీ హక్కు. నిజమైన విద్య ప్రైవేటు పాఠశాలల్లో లేదు. అది ఒక బిజినెస్ మాత్రమే. పేదలకో శిక్షణ, పెద్దల బిడ్డలకో శిక్షణ కాదు. దళితుడికోరకమైన చదువు, ఇతరులకో చదువు కాదు. అందరికీ సమానమైన విద్య ప్రజల హక్కు. అది ప్రభుత్వ బాధ్యత. ఏది బిజినెస్ అవుతుందో అది ప్రజల సొంతం కాదు. ప్రతి పౌరుడికీ సమాన విద్యావకాశాలు, ఆరోగ్యం అనేది ప్రభుత్వం నెరవేర్చాల్సిన కనీస బాధ్యతలు. మన భవిష్యత్తుకోసం పౌరులంతా చేతులు కలపాలంటూ ప్రచారం చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో పేరుకుపోయిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతూ నిశ్శబ్దంగా ఉద్యమిస్తున్నారు ప్రకాష్‌రాజ్. దేవాలయ ప్రాంగణాలను శుభ్రం చేయడం, ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు కుట్టుమిషన్లు ఉచితంగా పంచడం, ఆటల పట్ల ఆసక్తి పెంచేందుకు క్రికెట్ టోర్నమెంట్లను ఏర్పాటు చేయడంతోపాటు లాభాపేక్ష లేకుండా ప్రజలకు ఆన్‌లైన్‌లోనూ వైద్యసేవలందించేవారిని పరిచయం చేస్తున్నారు ప్రకాష్ రాజ్. -
బడికి పంపితే బంగారు కానుక
పళ్లిపట్టు (తమిళనాడు): ప్రైవేటు పాఠశాలల దాటికి ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్న క్రమంలో.. ఉన్న కొద్ది పాఠశాలలనైనా కాపాడుకోవాలని, ప్రాథమిక పాఠశాల స్థాయిలో మాతృభాషను విద్యార్థులకు అందజేయాలని తమిళనాడులోని ఓ ప్రధానోపాధ్యాయుడు వినూత్న ప్రయత్నం చేశాడు. బడిలో చేరిన పిల్లలకు సొంత డబ్బులతో బంగారు కానుక ఇవ్వాలని నిర్ణయించాడు. పళ్లిపట్టు మండలంలోని వడకుప్పం తెలుగువారు ఎక్కువగా ఉన్న గ్రామం. ఈ గ్రామంలో ప్రభుత్వ తెలుగు ప్రాథమిక పాఠశాల ఉంది. 20 మందికి పైగా ఇక్కడ చదువుతున్నారు. ప్రస్తుతం ఆంగ్లంపై మక్కువతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చేర్పిస్తున్నారు. అనేక తెలుగు పాఠశాలలు మూతపడిన క్రమంలో ఉన్న బడినైనా కాపాడుకోవాలనే ఆశయంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భూపతి కృషి చేస్తున్నారు. గ్రాము బంగారం: వడకుప్పం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భూపతి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో పిల్లలను చేర్పిస్తే గ్రాము బంగారు కాయిన్ బహుమతిగా అందజేస్తామని ప్రకటించారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తుండటంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. -
విద్యార్థులకు రవాణా సదుపాయం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేని ఆవాసాలకు చెందిన 20,754 మంది విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా మంగళవారం జీవో జారీ చేశారు. విద్యార్థికి రూ. 1,862 చొప్పున ఆయా విద్యార్థులకు 2018–19 విద్యా సంవత్సరంలో ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. విద్యా హక్కు చట్టం అమలులో భాగంగా పాఠశాలలు అందుబాటులో లేనందున ఈ మొత్తాన్ని చెల్లించనుంది. -
75% ప్రభుత్వ స్కూళ్లలో కనీస వసతుల్లేవ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 75 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేవని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పేర్కొంది. 45 శాతం స్కూళ్లకు ఆట స్థలాలు లేవని, 39 శాతం బడులకు ప్రహరీ గోడలు లేవని వెల్లడించింది. విద్యా హక్కు చట్టం పక్కాగా అమలు కాకపోవడంతో విద్యార్థులకు ఆశించిన ప్రయోజనాలు చేకూరలేదని తెలిపింది. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసే రాష్ట్ర సర్వ శిక్షా అభియాన్‌కు (ఎస్ఎస్ఏ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయక కార్యక్రమాలు కుంటుపడ్డాయని కాగ్ స్పష్టం చేసింది. 50 శాతం వరకు నిధుల విడుదలలో కోత పెట్టడమే ఇందుకు కారణంగా పేర్కొంది. 2014 నుంచి 2017 మార్చి నాటికి విద్యారంగంలో పరిస్థితులను కాగ్ తన నివేదికలో వివరించింది. ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లలో తగ్గుదల రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో (స్థానిక సంస్థలు, ఎయిడెడ్ కలుపుకొని) 2014–17 మధ్య విద్యార్థుల సంఖ్య 1.12 లక్షల మేర (7.65 శాతం) తగ్గగా ప్రైవేటు ప్రాథమిక పాఠశాలల్లో 61 వేల మంది (3.67 శాతం) విద్యార్థుల సంఖ్య పెరిగిందని కాగ్ గుర్తించింది. ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో 20 వేల మంది విద్యార్థులు తగ్గిపోగా ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3 వేల మంది పెరిగినట్లు పేర్కొంది. మరోవైపు మూడేళ్ల కాలంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల సంఖ్య 0.42 శాతం పెరిగితే ప్రైవేటు పాఠశాలల సంఖ్య 12.75 శాతం పెరిగిందని పేర్కొంది. ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో బడుల సంఖ్య 2.89 శాతం పెరగ్గా ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలల్లో 10.09 శాతం పాఠశాలలు పెరిగినట్లు లెక్కించింది. ఎలిమెంటరీలో డ్రాపవుట్స్ ఎక్కువే... ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థుల్లో డ్రాపవుట్స్ ఎక్కువగా ఉన్నట్లు కాగ్ పేర్కొంది. వివిధ కారణాల వల్ల చాలా మంది విద్యార్థులు మధ్యలోనే బడి మానేస్తున్నట్లు తెలిపింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ బాలబాలికల్లో డ్రాపవుట్స్ ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో చైల్డ్ ట్రాకింగ్ వ్యవస్థ అమలు చేయకపోవడం వల్ల పిల్లలు ఎక్కడ చదువుతున్నారన్న అంశం రూఢీకాని పరిస్థితి నెలకొందని, ఫలితంగా 47 వేల మంది పిల్లలు విద్యావకాశాలకు దూరమయ్యారని పేర్కొంది. ఆర్టీఈ అమలుపై సమీక్షేదీ? రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) అమలుపై సమీక్షే జరగడం లేదని కాగ్ విమర్శించింది. విద్యాశాఖ మంత్రి అధ్యక్షతన పని చేయాల్సిన రాష్ట్ర సలహా సంఘాన్ని (ఎస్ఏసీ) ఇంతవరకు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని పేర్కొంది. ప్రైవేటు పాఠశాలల్లో బలహీనవర్గాల పిల్లలకు 25 శాతం రిజర్వేషన్లను కల్పించాలన్న నిబంధనను అమలు చేయడం లేదని, 2014–15, 2015–16 విద్యా సంవత్సరాల్లో 44,412 మంది విద్యార్థులకు రవాణ భత్యాన్ని కూడా ఇవ్వలేదని వెల్లడించింది. ప్రత్యేక అవసరాలుగల పిల్లల కోసం మూడేళ్లలో రూ. 15.42 కోట్లు కేటాయించగా అందులో 35 శాతం నిధులనే ఖర్చు చేసినట్లు పేర్కొంది. 91% కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారు 10 శాతం లోపే.. చదవడం, రాయడం లెక్కలు చేయడం కోసం ‘త్రీ ఆర్స్’కార్యక్రమం నిర్వహించినా ఆశించిన ఫలితాలు రాలేదని కాగ్ పేర్కొంది. రెండో తరగతిలో 38 శాతం మందికి, మూడో తరగతిలో 39 శాతం మందికి అవి రావడం లేదని తెలిపింది. 2016–17లో 2వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదవడం, రాయడం, సాధారణ లెక్కలు చేయడం రాని వారు 31 శాతం ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు ప్రాథమిక పాఠశాలల్లో ఈ మూడేళ్లలో 40 శాతం మార్కులు రాని వారు 14 శాతం నుంచి 26 శాతం మంది ఉంటే ప్రాథమికోన్నత పాఠశాలల్లో 21 శాతం నుంచి 47 శాతం మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపింది. 91 శాతం నుంచి 100 శాతం మార్కులు వచ్చిన వారు ప్రాథమిక స్థాయిలో 5 నుంచి 10 శాతమే ఉండగా ప్రాథమికోన్నత స్థాయిలో 2 నుంచి 6 శాతమే ఉన్నట్లు పేర్కొంది. రెండేళ్లయితే 40 శాతం నిధులే దిక్కు రాష్ట్రంలో ఎస్ఎస్ఏకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 40% నిధులనే విడుదల చేశాయి. 2014–15, 2015–16 విద్యా సంవత్సరాల్లో కేటాయించిన వాటిల్లో సగం నిధులనూ ఇవ్వకుండా 40 శాతం నిధుల విడుదలతోనే సరిపుచ్చాయి. కేంద్ర ప్రభుత్వం మూడేళ్లలో రూ. 3344.43 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా కేవలం రూ. 1,353 కోట్లే ఇచ్చింది. రాష్ట్రం రూ. 2015.98 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, రూ. 1340.55 కోట్లు ఇచ్చింది. -
టీచర్ల భాగస్వామ్యం అవసరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాభివృద్ధిలో ఉపాధ్యాయుల భాగస్వామ్యం అవసరమని నీటి పారుదల మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో (టీయూటీఎఫ్) ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభలు – విద్యా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ‘పాఠశాల విద్య – సంస్కరణ’లు అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి తొలి అడుగులు వేసింది తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీయూటీఎఫ్) అని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో టీయూటీఎఫ్ వీరోచితంగా పాల్గొందని అందుకే ఆ సంఘం మీద ప్రభుత్వానికి ఎనలేని గౌరవమన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ హెల్త్‌కార్డులు అందజేశామన్నారు. ఉపాధ్యాయ నియామకాలు – బదిలీలు జూన్ లోపల పూర్తి చేసేలా విద్యామంత్రి చర్యలు చేపడుతున్నారన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంపై సమస్యల పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామని, అయితే అది పార్లమెంట్లో చట్టం కావాల్సి ఉందన్నారు. 60 ఏళ్ల పరిష్కారం కానీ తాగు, సాగునీరు, విద్యుత్ వంటి సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపుతున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం సాధించని విధంగా 18 శాతం వృద్ధి రేటును ఒక తెలంగాణ సాధించిందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతాయి: ఈటల రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూళ్లు ఎన్ని పెట్టినా ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతాయని రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితులు ఆశాజనకంగా లేకపోయినా అవి మూతపడకుండా ఉండేందుకు టీయూటీఎఫ్ చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమన్నారు. ఈ సదస్సు ద్వారా వచ్చిన డిమాండ్లను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి, శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వి. శ్రీనివాస్ గౌడ్, ఎ.రవీందర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, టీయూటీఎఫ్ అధ్యక్ష – ప్రధాన కార్యదర్శులు సి. స్వామిరెడ్డి, డి. మల్లారెడ్డి, ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ చైర్మన్ కారం రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీచర్ల బదిలీల షెడ్యూల్ ప్రకటించాలి
హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్‌యూటీఎఫ్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆదివారం హైదరాబాద్ దోమలగూడలోని యూటీఎఫ్ కార్యాల యంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ రాములు అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్రంలో రెండేళ్లుగా బదిలీలు, పదోన్నతులు లేకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారన్నారు. సర్వీస్ రూల్స్ సమస్య కోర్టు వివాదంలో ఉన్నందున ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా బదిలీలు, పదోన్నతుల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. ఉప విద్యాధికారి, మండల విద్యాధికారి వంటి పర్యవేక్షణాధికారి పోస్టులు అధిక సంఖ్యలో ఖాళీగా ఉండటంతో విద్యా రంగం కుంటుపడుతోందని పేర్కొన్నారు. అర్హులైన స్కూల్ అసిస్టెంట్లతో పదోన్నతుల ద్వారా జూనియర్, డైట్ లెక్చరర్ల పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యా మిషన్‌ను ప్రక టించాలని, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో తరగతికొక ఉపాధ్యాయుడు, తరగతి గది ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎస్టీఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షుడు నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఎస్టీఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షురాలు సంయుక్త, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, ఉపాధ్యక్షులు సోమశేఖర్, దుర్గాభవాని తదితరులు పాల్గొన్నారు. -
భిక్షాటనతో పాఠశాలలకు సాయం
అన్నానగర్ (చెన్నై): ముసలి వయసులో పిల్లలు వెలివేయడంతో ఆ వృద్ధుడు ఒంటరయ్యాడు. భిక్షాటనతో బతుకు బండి లాగిస్తున్నాడు. భిక్షమెత్తగా వచ్చిన సొమ్ములో కొంత భాగాన్ని ఓ స్కూలుకు అంది స్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. తమిళనాడు, తూత్తుకుడి జిల్లా సాత్తాన్‌కుళం సమీపంలోని ఆలంగినరుకి చెందిన భూల్‌పాండి(68). ఇతని భార్య సరస్వతి. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. సరస్వతి 24 ఏళ్ల కిందట మృతి చెందింది. భూల్‌పాండి తన పిల్లలకి పెళ్లిళ్లు చేశాడు. క్రమంగా వారు అసహ్యించుకోవడంతో భూల్‌పాండి ఇంటి నుంచి బయటకి వచ్చాడు. ఆకలి తీర్చుకోవడానికి భిక్షమెత్తుకోవడం ప్రారంభించాడు. భిక్షాటనతో వచ్చిన డబ్బుతో పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు అందజేశాడు. నెల్లై, తూత్తుకుడి, తిరుచ్చి, తంజావూరు, నాగపట్టణం జిల్లాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలకు పలు పరికరాలను కొనిచ్చాడు. భూల్పాండితో మాట్లాడగా పెరుంతలైవర్ కామరాజర్ మీద ఉన్న అభిమానంతోనే భిక్షాటనతో పాఠశాలలకు సహాయం చేస్తున్నానన్నాడు. దాదాపు 20 వేల మొక్కలను నాటానన్నాడు. దినతంతి పేపర్ని చూసి తాను రాయడం, చదవడం నేర్చుకున్నానని చెప్పాడు. -
జూలై నుంచి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది జూలై నుంచి ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 30 లక్షల మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేసి హెల్త్ కార్డులు అందించాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, వైద్యారోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు. ఆరోగ్య పరీక్షలను 6 నెలల్లో పూర్తిచేసి హెల్త్ కార్డులివ్వాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలపై ఇద్దరు మంత్రులు బుధవారం సచివాలయంలో సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, గురుకుల విద్యాలయాలు, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లోని దాదాపు 8 లక్షల మంది విద్యార్థినులకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కేజీబీవీలు, గురుకుల విద్యా లయాలు, మోడల్ స్కూళ్లలోని 3 లక్షల మందికి విద్యా శాఖ కిట్స్ ఇస్తుందని, మిగతా 5 లక్షల మందికి ఇరు శాఖలు సంయుక్తంగా కిట్స్ అందజేయాలన్నారు. 7, 8, 9, 10వ తరగతి విద్యార్థినులకు యుక్త వయసులో వచ్చే ఆరోగ్య సమస్యలు, సంరక్షణపై అవగాహన తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. -
ఇంటర్ వరకు యూనిఫారాలు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదివే విద్యార్థులకు ఏటా రెండు జతల యూనిఫారాలను అందిస్తున్న ప్రభుత్వం ఇకపై ప్రభు త్వ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ వరకు ఈ సదుపాయాన్ని వర్తింపజేసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను వెచ్చించే ఈ పథకం కింద ప్రస్తుతం ఒక్కో విద్యార్థికి ఏటా రెండు జతల యూనిఫారాల కోసం రూ. 400 కేటాయిస్తున్న కేంద్రం...ఆ మొత్తాన్ని రూ. 600కు పెంచాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకే కాకుండా ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు కూడా యూనిఫారాల పథకాన్ని వర్తింపజేయాలని అన్ని రాష్ట్రాలు కేంద్రానికి విన్నవించాయి. మంగళవారం ఢిల్లీలో జరిగిన అన్ని రాష్ట్రాల విద్యాశాఖ అధికారుల సమావేశంలో ఈ అంశంపై చర్చ జరగ్గా దీనిపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం 8వ తరగతి విద్యార్థుల వరకు ఇస్తున్న యూనిఫారాల వల్ల 25 లక్షల మంది లబ్ధి పొందుతుండగా ఈ సదుపాయాన్ని ఇంటర్ వరకు వర్తింపజేస్తే మరో 14 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ బూట్లు కూడా ఇవ్వాలని రాష్ట్రాలు కేంద్రాన్ని కోరగా ఈ అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కేంద్రం వెల్లడించినట్లు తెలిసింది. స్కూల్ గ్రాంటు పెంపు కోసం పట్టు... పాఠశాలల నిర్వహణ కోసం స్కూల్ మెయింటెనెన్స్ గ్రాంట్‌ను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులు అంగీకరించారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలకు రూ. 5 వేల చొప్పున ఉన్న కనీస గ్రాంటును రూ. 25 వేలకు పెంచేందుకు కేంద్రం ఓకే చెప్పినట్లు తెలిసింది. అలాగే ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల గ్రాంటును కూడా పెంచాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 100 మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్లకు రూ. 25 వేలు, 100 నుంచి 250 మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్లకు రూ. 50 వేలు, 250 నుంచి వెయ్యి లోపు విద్యార్థులు ఉన్న స్కూళ్లకు రూ. 75 వేలు, వెయ్యి కంటే ఎక్కువ మంది ఉన్న స్కూళ్లకు కాంపోజిట్ గ్రాంటుగా రూ. లక్ష ఇచ్చేందుకు కేంద్రం ఓకే చెప్పగా, ఆ మొత్తాన్ని మరింత పెంచాలని రాష్ట్రాలు కోరాయి. ఇందుకు కేంద్ర అధికారు లు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. 1,038 అదనపు టాయిలెట్ల మంజూరుకు ఓకే రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు టాయిలెట్లను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులు ఓకే చెప్పారు. ప్రతి వంద మంది విద్యార్థులకు ఒకటి చొప్పున రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1,038 అదనపు టాయిలెట్లను మంజూరు చేసేందుకు ఓకే చెప్పింది. అయితే స్వచ్ఛ విద్యాలయ పథకం కింద ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక టాయిలెట్ చొప్పున 3 వేలకుపైగా అదనపు టాయిలెట్లు మంజూరు కానున్నాయి. -
‘చెప్పు’ కొనలేని బాధ
సాక్షి, కామారెడ్డి: ప్రభుత్వ పాఠశాలకు వచ్చేది పేదవిద్యార్థులే. తల్లిదండ్రులు కూలీనాలీ చేస్తూ పిల్లలను సర్కారు బడికి పంపిస్తున్నారు. వీరికి మధ్యాహ్న భోజనం, యూనిఫాం.. పుస్తకాలు సరఫరా చేస్తున్న ప్రభు త్వం కాళ్లకు చెప్పులు లేవన్న విషయాన్ని గుర్తించడంలేదు. రాష్ట్రంలో 25,991 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలుండగా.. దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు వాటిలో చదువుతున్నారు. ఇందులో సగానికంటే ఎక్కువమంది విద్యార్థులు చెప్పుల్లేకుండానే బడికి వెళ్తున్నారని విశ్రాంత డైట్ అధ్యాపకుడొకరు ‘సాక్షి’ తో ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో 187 మంది విద్యార్థులున్నారు. అందులో 44 మంది విద్యార్థులకు చెప్పుల్లేవు. ఇదే జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్ తండాకు చెందిన విద్యార్థులు కాళ్లకు చెప్పుల్లేకుండానే నిత్యం కన్నాపూర్ యూపీఎస్‌కు కాలినడకన వెళుతున్నారు. జుక్కల్ మండలం చిన్న ఎడ్గి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 32 మంది విద్యార్థులు బడికి రాగా.. వారిలో నలుగురికి మాత్రమే చెప్పులున్నాయి. -
బ్యాగు బరువు తగ్గాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల బ్యాగు బరువు తగ్గించేందుకు పక్కా చర్యలు చేపట్టాల్సిందేనని పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ డీఈవోలను ఆదేశించారు. ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయాలని స్పష్టం చేశారు. బ్యాగు బరువు తగ్గించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నాటి నుంచి ఎలాంటి చర్యలు చేపట్టారో తెలపాలని, ఎంఈవోల నేతృత్వంలో అధికారులు బృందాలుగా ఏర్పడి బ్యాగు బరువుపై తనిఖీలు చేపట్టాలని పేర్కొన్నారు. జిల్లా విద్యా శాఖ అధికారులతో బుధవారం హైదరాబాద్‌లో కిషన్ సమీక్ష నిర్వహించారు. వచ్చే విద్యా సంవత్సరం కోసం అవసరమైన పాఠ్య పుస్తకాల వివరాలను ఇప్పటివరకు 21 జిల్లాలే అందజేయాలని, మిగతా జిల్లాల డీఈవోలు కూడా ఆ వివరాలను వెంటనే అందజేయాలని సూచించారు. విద్యార్థినిలపై వేధింపులకు సంబంధించి పోలీసు శాఖ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జిల్లాల వారీగా తల్లిదండ్రులకు, విద్యార్థులకు, టీచర్లకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వచ్చే ఫిబ్రవరిలో 10వ తరగతి విద్యార్థులకు నేషనల్ అచీవ్మెంట్ సర్వే నిర్వహణకు పక్కా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
ఈ ‘మోడల్’ బాగుంటుందా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల విషయంగా ఏం చేయాలని విద్యాశాఖ తర్జనభర్జన పడుతోంది. ఆయా పాఠశాలల్లోని టీచర్లు, విద్యార్థులను హేతుబద్ధీకరించాలని.. సమీపంలోని స్కూళ్లకు తరలించడం ద్వారా మెరుగైన విద్య అందించడం సాధ్యమవుతుందని యోచిస్తోంది. ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ప్రతి సబ్జెక్టు టీచర్ ఉండేలా చర్యలు చేపట్టవచ్చని భావిస్తోంది. అయితే దీనిపై ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత రాకుండా.. నిర్వహణ సాధ్యంకాని పాఠశాలలను ఎలా కొనసాగించాలో చెప్పాల్సిందిగా కోరాలని నిర్ణయించింది. మొత్తంగా ఉపాధ్యాయ సంఘాలను కూడా ఒప్పించి హేతుబద్ధీకరణపై ముందుకెళ్లడం మంచిదన్న అభిప్రాయానికి వచ్చింది. అవసరమైతే పిల్లలు తక్కువగా ఉన్న హైస్కూళ్లలోని విద్యార్థులు ఇతర పాఠశాలలకు వెళ్లేందుకు రవాణా సదుపాయం కల్పించడం లేదా సైకిళ్లను అందించాలని.. విద్యార్థులు డ్రాపౌట్స్‌గా మారకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి.. తదుపరి చర్యలు చేపట్టేందుకు విద్యా శాఖ సిద్ధమవుతున్నట్లు తెలిసింది. వృథా అవుతున్న మానవ వనరులు రాష్ట్రవ్యాప్తంగా ఒక్క విద్యార్థి కూడా లేని స్కూళ్లలో 403 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 10 మంది లోపే విద్యార్థులున్న పాఠశాలల్లో 1,769 మంది టీచర్లు పనిచేస్తున్నారు. దీంతో మానవ వనరులు వృథా అవుతున్నాయి. ఇక 11 నుంచి 20 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలల్లో 3,944 మంది టీచర్లు పని చేస్తున్నారు. ఇలా మొత్తంగా 20 మందిలోపే విద్యార్థులున్న స్కూళ్లలో 6,116 మంది టీచర్లు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీచర్లను, విద్యార్థులను సమీప స్కూళ్లకు తరలించి.. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించవచ్చని విద్యాశాఖ యోచిస్తోంది. మోడల్ హైస్కూళ్లుగా.. ప్రతి మండలంలో తక్కువ మంది విద్యార్థులున్న హైస్కూళ్లలోని విద్యార్థులు, టీచర్లను సమీపంలోని హైస్కూళ్లకు తరలించాలని విద్యా శాఖ యోచిస్తోంది. ఇలా ప్రతి మండలంలో రెండు మూడు హైస్కూళ్లలోని విద్యార్థులు, టీచర్లను ఒక చోటికి చేర్చి ఎక్కువ మంది విద్యార్థులు, టీచర్లతో మోడల్ స్కూళ్లుగా మార్చాలని.. మెరుగైన విద్యాబోధన అందేలా చూడాలని భావిస్తోంది. ఈసారైనా అమల్లోకి.. విద్యా శాఖ హేతుబద్ధీకరణపై మూడేళ్లుగా అనేక రకాల ఆలోచనలు చేసింది. కానీ సంఘాల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో ముందడుగు వేయడం లేదు. అయితే ఈసారి హేతుబద్ధీకరణ విషయంలో పక్కాగా వ్యవహరించడమే మంచిదన్న ఆలోచన చేస్తోంది. విద్యార్థులు తక్కువగా ఉండి సరిపడా ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో విద్యార్థులు నష్టపోతారని.. అవసరానికంటే ఎక్కువ మంది టీచర్లున్న చోట మానవ వనరులు వృథా అవుతాయని భావిస్తోంది. వందల సంఖ్యలో పాఠశాలల్లో.. - రాష్ట్రంలో 25,991 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 460 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేరు. ఇందులో ప్రాథమిక పాఠశాలలే 452. - ఒకటి నుంచి 10 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలు 1,285 కాగా.. 11–20 మందిలోపు స్కూళ్లు 2,892, 21 నుంచి 30 మందిలోపు స్కూళ్లు 3,742 ఉన్నాయి. - మొత్తంగా ఒకటి నుంచి 20 మందిలోపు విద్యార్థులున్నవి 4,637 కాగా.. ఇందులో 4,096 ప్రాథమిక పాఠశాలలే. ఇందులో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 189 స్కూళ్లు ఉన్నాయి. - రాష్ట్రవ్యాప్తంగా ఒక్క విద్యార్థీ లేని హైస్కూళ్లు 2 కాగా... 20 మందిలోపు ఉన్నవి 5.. 21 నుంచి 30 మందిలోపు ఉన్నవి 21.. 31 నుంచి 40 మందిలోపు ఉన్నవి 49.. 41 నుంచి 50 మందిలోపు ఉన్నవి 63 పాఠశాలలు ఉన్నాయి. -
బడి పిల్లలకూ ‘ఉపకారం’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ప్రభుత్వం ఉపకార వేతనాలు ఇవ్వనుంది. ఆర్థికంగా వెనుకబడిన పిల్లలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగుల కేటగిరీల్లోని పిల్లలకు సంఖ్యతో నిమిత్తం లేకుండా అర్హులందరికీ లబ్ధి చేకూర్చనుంది. దీనిలో భాగంగా 2017–18 వార్షిక సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు ఉపక్రమించింది. ప్రస్తుతానికి దరఖాస్తుల సమర్పణకు గడువు విధించనప్పటికీ నెల రోజుల్లోగా పూర్తిస్థాయిలో స్వీకరించేలా ’సంక్షేమ శాఖలు చర్యలు వేగవంతం చేశాయి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు... ప్రీమెట్రిక్ విద్యార్థుల దరఖాస్తుల స్వీకరణను సంక్షేమ శాఖలు ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నాయి. కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాం తంలో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలున్న కుటుంబాల్లోని విద్యార్థులు ఈ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, బోనఫైడ్ సర్టిఫికెట్లను దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది. బడి పిల్లలకు దీనిపై అవగాహన లేకపోవడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఈ బాధ్యతలు అప్పగించాలని సంక్షేమ శాఖలు భావిస్తున్నాయి. జిల్లాల వారీగా ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి అర్హులందరి నుంచీ దరఖాస్తులు వచ్చేలా చర్యలు చేపట్టాయి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీతో పాటు వికలాంగ కేటగిరీలో 5 నుంచి పదో తరగతి విద్యార్థులు ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీసీ కేటగిరీలో తొమ్మిది, పదో తరగతి విద్యార్థులే దరఖాస్తు చేసుకునేలా నిబంధనలు విధించింది. విద్యార్థులు ముందుగా ఈపాస్ వెబ్సైట్ లో వివరాలు నమోదు చేసుకోవాలి. నమోదు చేసిన దరఖాస్తును ప్రింటవుట్ తీసి దానికి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను జత చేసి డివిజన్ సంక్షేమాధికారికి సమర్పించాలి. అలా వచ్చిన దరఖాస్తులు డివిజన్ సంక్షేమాధికారి పరిశీలించి ఉపకార వేతన మంజూరీ కోసం జిల్లా సంక్షేమాధికారికి సిఫార్సు చేయాలి. కేటగిరీల వారీగా ఉపకారవేతనాలు ఇలా.. తరగతి ఉపకార వేతనం 5–8 (బాలురు) 1,000 5–8 (బాలికలు) 1,500 9–10 2,250 -
ఆటలపై అలసత్వం వద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు పాఠశాలల్లోనూ స్పోర్ట్స్ పీరియడ్‌ను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. అకడమిక్ కేలండర్లో పేర్కొన్న ఆ పీరియడ్ సమయంలో మరో సబ్జెక్టు బోధన చేపడితే చర్యలు తప్పవని పేర్కొంది. ఆట స్థలాలులేని పాఠశాలలు ఇండోర్ గేమ్స్ నిర్వహించాల్సిందేనని తెలిపింది. విద్యార్థులపై ఒత్తిడి నివారణకు చేపట్టాల్సిన చర్యలపై తల్లిదండ్రుల కమిటీలు, కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో ఇటీవల పాఠశాల విద్యా శాఖ సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై మార్గదర్శకాలు జారీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. స్టేట్ సిలబస్, ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ తదితర అన్ని రకాల సిలబస్‌ను అనుసరించే పాఠశాలలన్నీ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నిర్దేశించిన అకడమిక్ కేలండర్‌ను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. హైదరాబాద్ జంట నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలకు విద్యాశాఖ జారీచేసిన నిర్దేశిత వేళలనే అమలు చేయాలని, హాస్టళ్ల పేరుతో అర్ధరాత్రి వరకు చదివిస్తూ విద్యార్థులను ఒత్తిడికి గురి చేయవద్దని స్పష్టం చేసింది. అలాగే పుస్తకాల బ్యాగు బరువును తగ్గించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. అపార్ట్మెంట్లలో ఉన్న స్కూళ్లలో పరిస్థితులపైనా తనిఖీలు చేసేందుకు సిద్ధం అవుతోంది. విద్యాశాఖ నిబంధనల అమలుపైనా ఆకస్మిక తనిఖీలను చేపట్టే ఆలోచనలు చేస్తోంది. చర్యలు చేపట్టాల్సిన మరిన్ని అంశాలు.. - స్కూళ్లలో కార్పొరల్ పనిష్మెంట్ ఉండకూడదు. - డ్రగ్స్‌వంటి దురలవాట్లను దూరం చేసేందుకు స్కూళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. - ఇప్పటికే కొన్ని పాఠశాలలు వచ్చే ఏడాది వసూలు చేయబోయే ఫీజుల వివరాలను నిర్ణయించాయని, రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ, ఫీజుల విధానం ఖరారు అయ్యాకే ఆ నిబంధనలకు లోబడి ఫీజులను ఖరారు చేయాలి - గైడ్స్, స్టడీ మెటీరియల్‌ను పాఠశాలల్లో నిషేధించాలి. -
మధ్యాహ్న భోజనంపై ‘లెక్క’లేనితనం!
► పాఠశాలల్లో విద్యార్థుల లెక్కలు సరిగ్గా ఇవ్వని టీచర్లు ► రోజువారీగా భోజనం తినే విద్యార్థుల లెక్కలపై కేంద్రం అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థుల వివరాలను టీచర్లు ఇవ్వడం లేదు. రోజువారీగా పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులు భోజనం తింటున్నారు.. ఎంత మంది గైర్హాజర్ అవుతున్నారో తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆటోమేటెడ్ మానిటరింగ్ సిస్టం రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు కావడంలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యాశాఖ చీవాట్లు పడాల్సి వస్తోంది. రాష్ట్రంలో 28,689 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో ఎన్ని పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులు భోజనం చేశారన్న వివరాలను మధ్యాహ్న భోజనం బాధ్యతలు చూసే టీచర్లు సరిగ్గా పంపించడం లేదు. దీంతో గత నెల, ఈ నెలలో పలుమార్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి లేఖ రాసింది. రాష్ట్రంలో ఆటోమేటెడ్ మానిటరింగ్ సిస్టం అమలు కావడం లేదంటూ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ నెల 12, 14 తేదీల్లో 2 శాతం పాఠశాలలు కూడా మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థుల సంఖ్యను తెలియజేయలేదని పేర్కొంది. ఇప్పటికైనా సరిగ్గా వివరాలను పంపించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఇతర రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి.. వివిధ రాష్ట్రాల్లోనూ మధ్యాహ్న భోజనం లెక్కలు కేంద్రానికి సరిగ్గా అందడం లేదు. ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఉండే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు కేంద్రం ఆర్థిక సహకారం అందిస్తోంది. ఈ నేపథ్యంలో నిధులకు పక్కాగా లెక్కలు ఉండాలన్న ఉద్దేశంతో కేంద్రం ఆటోమేటెడ్ మానిటరింగ్ సిస్టంను ప్రవేశ పెట్టింది. ఈ నెల 12వ తేదీన మన రాష్ట్రంలోని 473 పాఠశాలల నుంచి (1.65 శాతం) మాత్రమే భోజనం చేసిన విద్యార్థుల వివరాలు కేంద్రానికి వెళ్లాయి. ఈ నెల 14న కేవలం 232 పాఠశాలలు మాత్రమే ‘భోజనం’ వివరాలను ఇచ్చాయి. -
14 ప్రభుత్వ స్కూళ్లకు ‘స్వచ్ఛ’ పురస్కారాలు
ఒక్కో పాఠశాలకు రూ.50 వేల నగదు బహుమతి సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛభారత్‌లో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించి రాష్ట్రంలోని 14 ప్రభుత్వ పాఠశాలలు జాతీయ స్వచ్ఛ విద్యాలయ–2016 పురస్కారాలకు ఎంపికయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 172 ప్రభుత్వ పాఠశాలలు ఎంపికయ్యాయి. 2016–17 విద్యా సంవత్సరంలో వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత, హ్యాండ్‌వాష్, టాయిలెట్ల పరిశుభ్రత వంటి అంశాల్లో చర్యలు చేపట్టినందుకుగాను రాష్ట్ర స్థాయిలో 40 పాఠశాలలను స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి విద్యాశాఖ ఎంపిక చేసింది. ఈ మేరకు గురువారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ జాబితా ప్రకటించింది. ఎంపికైన పాఠశాలకు రూ.50 వేల చొప్పున నగదు బహుమతి అందజేయనుంది. సెప్టెంబర్ 1న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో నగదు బహుమతితోపాటు, సర్టిఫికెట్లను ఇవ్వనున్నట్లు సర్వశిక్షా అభియాన్ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ భాస్కర్‌రావు తెలిపారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాలు ప్రత్యేక అవార్డులకు ఎంపికయ్యాయని చెప్పారు. ఆయా పాఠశాలలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అభినందనలు తెలిపారు. పురస్కారానికి ఎంపికైన పాఠశాలలు ఇవే... జిల్లా పాఠశాల ఆదిలాబాద్ ఎంపీయూపీఎస్ బండల్ నాగపూర్ మంచిర్యాల టీఎస్‌ఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ బాయ్స్ వార్డు నంబర్–19 బెల్లంపల్లి జగిత్యాల జెడ్పీహెచ్ఎస్ అంబారీపేట కరీంనగర్ టీఎస్ఎంఎస్ గంగాధర, ఎంపీయూపీఎస్ కొత్తపల్లి (పీఎన్) సిద్దిపేట ఎంపీయూపీఎస్ ఇబ్రహీంపూర్ వికారాబాద్ ఎంపీపీఎస్ బుద్ధారం మహబూబ్‌నగర్ ఎంపీపీఎస్ చౌటగడ్డతండ సూర్యాపేట జెడ్పీహెచ్ఎస్ అనంతారం జయశంకర్ జెడ్పీహెచ్ఎస్ తిమ్మాపేట్ ఖమ్మం టీఎస్ఎంఎస్ కారేపల్లి, ఎంపీపీఎస్ మల్లారం, టీఎస్‌ఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ సింగారెడ్డి పాలెం ఎంపీయూపీఎస్ గండగలపాడు. -
లేదు.. లేదంటూనే మూత!
సర్దుబాటు పేరుతో ప్రభుత్వ పాఠశాలల మూసివేత.. సమీపంలోని స్కూళ్లలో చేరాలని విద్యార్థులకు సూచన రాష్ట్రంలో ఒక్క పాఠశాలను కూడా మూసివేయలేదు.. మూసివేసేది లేదు.. విద్యార్థులు వస్తే సున్నా పాఠశాలలనూ కొనసాగిస్తున్నాం.. – ఇటీవల డీఈవోల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాటలివీ.. స్కూళ్ల మూసివేతకు, సర్దుబాటుకు మేం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.. క్షేత్రస్థాయిలో ఎలా మూసేస్తారు.. – పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ వ్యాఖ్యలివీ.. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశాలు, జిల్లా కలెక్టర్ల సూచనల మేరకు తక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూళ్లను విలీనం చేస్తున్నాం.. విద్యార్థులు ఉన్న చోటికి టీచర్లు డిప్యుటేషన్‌పై వెళ్లాల్సిందే. – ఇటీవల రెండు జిల్లాల్లో పాఠశాలలను మూసేసిన డీఈవోలు టీచర్లకు జారీ చేసిన ఆదేశాలివీ. సాక్షి, హైదరాబాద్: మొన్న సూర్యాపేట్‌లో.. నిన్న పెద్దపల్లిలో.. డీఈవోలు స్కూళ్లను మూసేశారు. తక్కువ మంది ఉన్నారన్న సాకుతో ఉన్న విద్యార్థులను ఇతర స్కూళ్లకు వెళ్లిపోవాలని చెప్పారు. వాటిల్లో పనిచేస్తున్న టీచర్లు డిప్యుటేషన్‌పై ఇతర పాఠశాలలకు వెళ్లాలని ఆదేశించారు. అవే కాదు మిగతా జిల్లాల్లోనూ క్షేత్ర స్థాయిలో సర్దుబాటు పేరుతో పాఠశాలల మూసివేతకు డీఈవోలు రంగం సిద్ధం చేశారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మే 31న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఇచ్చిన ఆదేశాలు, జిల్లా కలెక్టర్ ఈనెల 19న జారీ చేసిన నోట్ ఆర్డర్స్ ప్రకారం.. పెద్దపల్లి జిల్లా బ్రాహ్మణపల్లిలో స్కూల్ మూసివేస్తున్నట్లు ఆ జిల్లా డీఈవో ఆదేశాలు జారీ చేశారు. ఈ పాఠశాలలో 28 మంది విద్యార్థులు, 9 మంది టీచర్లు ఉన్నారు. అందులోని టీచర్లు ఇతర పాఠశాలలకు వెళ్లాలని స్పష్టం చేశారు. అయితే తమ స్కూల్ మూసివేతను నిరసిస్తూ విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. స్కూల్ బిల్డింగ్ ఎక్కి తమ పాఠశాలను కొనసాగించాల్సిందేనంటూ నిరసన తెలిపారు. అయినా అధికారులు ఆ స్కూల్‌ను మూసివేసేందుకు చర్యలు చేపట్టారు. మిగతా జిల్లాల్లోనూ మొదలైన కసరత్తు.. ఈ రెండు జిల్లాల్లోనే కాదు.. మిగతా జిల్లాల్లోనూ స్కూళ్ల మూసివేతకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో పది మంది లోపు విద్యార్థులు ఉన్న 23 స్కూళ్లను మూసివేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. 20 మందిలోపు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలు 33 ఉన్నట్లు లెక్కలు తేల్చారు. మరో 11 ఉన్నత పాఠశాలలను కూడా మూసివేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇలా రాష్ట్రంలో 10 మందిలోపున్న ప్రాథమిక పాఠశాలలు, 20 మందిలోపున్న ప్రాథమికోన్నత పాఠశాలలు, 50 మందిలోపు విద్యార్థులు ఉన్న ఉన్నత పాఠశాలలను మొత్తంగా 5 వేల వరకు స్కూళ్లను మూసివేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. సమీపంలో స్కూళ్లు లేకుంటే ‘చార్జీలు’ ప్రస్తుతం మూసివేస్తున్న పాఠశాలలకు నిర్ణీత దూరంలో ప్రభుత్వ పాఠశాలలు లేకపోతే రవాణా చార్జీలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రాథమిక పాఠశాలకు 1 కిలోమీటర్ దూరంలో, ప్రాథమికోన్నత పాఠశాలకు 3 కిలోమీటర్ల దూరంలో, ఉన్నత పాఠశాలకు 5 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ పాఠశాలలు లేకపోతే ఆయా పాఠశాలకు చెందిన విద్యార్థులకు రవాణా చార్జీలు ఇచ్చి మరింత దూరంలో ఉన్న పాఠశాలలకు పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 20 మందిలోపు ఉన్న పాఠశాలలు 4,637 ప్రస్తుతం 20 మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలే 4,637 ఉన్నాయి. వాటన్నింటిని మూసివేసేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సున్నా పాఠశాలలు 460 ఉండగా వాటిని మూసివేసి వాటిల్లో పనిచేస్తున్న 403 మంది టీచర్లను ఇతర స్కూళ్లకు పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇవేకాదు 20 మందిలోపు విద్యార్థులు ఉన్న మరో 4 వేల స్కూళ్లను మూసివేసి వాటిల్లో పని చేస్తున్న దాదాపు 6 వేల మంది టీచర్లను ఇతర పాఠశాలలకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. 50 మందిలోపు విద్యార్థులు ఉన్న మరిన్ని ఉన్నత పాఠశాలలను మూసివేసేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు తెలిసింది. -
వానాకాలం చదువులు
నిండా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ పాఠశాలలు ♦ టీచర్లుంటే సౌకర్యాలుండవు.. సౌకర్యాలుంటే టీచర్లుండరు! ♦ తరగతి గదులు, మౌలిక సదుపాయాలు కరువు ♦ శిథిలమైన భవనాలతో ప్రమాదకరంగా పరిస్థితి ♦ ఎప్పుడు కూలిపడతాయో తెలియని దుస్థితి ♦ ఆరుబయట, చెట్ల కిందే తరగతులు ♦ అనేక చోట్ల వర్షమొస్తే బడికి సెలవే ♦ కనీసం టాయిలెట్లు, మంచినీరూ కరువే ♦ ఏటా వేల కోట్లు ఖర్చు.. అయినా ఫలితం శూన్యం సాక్షి, హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామ పాఠశాలలో 262 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ తెలుగు, ఇంగ్లిష్ మీడియంలకు కలిపి 10 తరగతి గదులు అవసరంకాగా.. 3 గదులే ఉన్నాయి. పాత గదులు శిథిలావస్థకు చేరి కూలిపోయాయి. దాంతో విద్యార్థులు చెట్ల కిందే చదువుకుంటున్నారు. ⇒ జయశంకర్ జిల్లా గొర్లవీడు ప్రాథమిక పాఠశాలలో 116 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ ఉన్న ఏడు తరగతి గదులన్నీ కూడా శిథిలావస్థకు చేరుకు న్నాయి. ఎప్పుడు కూలిపడతాయో తెలియని పరిస్థితుల్లో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువుతున్నారు. ⇒ జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ హైస్కూల్లో 205 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ పది తరగతి గదులు ఉండగా.. ఇందులో ఆరు శిథిలావస్థకు చేరాయి. మిగతా నాలుగు గదుల్లోనే తరగతులు జరుగుతున్నాయి. ⇒ వనపర్తి జిల్లా కేంద్రంలోని బండార్‌నగర్ యూపీఎస్‌లో తరగతి గదులు శిథిలావస్థకు చేరి.. చిన్న వాన కురిసినా పైకప్పు నుంచి నీరు కారుతోంది. ఆ వర్షపు నీటిలో కూర్చొని చదువుకోవాల్సి వస్తోంది. ..ఇవి ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా అనేక పాఠశాలల్లో విద్యార్థులు నిత్యం సమస్యలతో సహవాసం చేస్తున్నారు. తరగతి గదులే కాదు టాయిలెట్లు, మంచినీటి వసతి కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. ఏటా దాదాపు రూ.10 వేల కోట్ల బడ్జెట్ కలిగిన విద్యాశాఖ.. స్కూళ్లలో వసతుల కల్పనకే దాదాపు రూ.2 వేల కోట్లు వెచ్చిస్తున్నా ఈ పరిస్థితి నెలకొనడం గమనార్హం. ప్రతి ప్రభుత్వ పాఠశాలనూ ఏదో ఒక సమస్య పట్టి పీడిస్తోంది. టీచర్లున్న స్కూళ్లలో మౌలిక సదుపాయాలు ఉండవు. మౌలిక సదుపాయాలున్న చోట టీచర్లు ఉండరు. ఇక ప్రతి ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ కచ్చితంగా ఉండాలి. కానీ 50 శాతానికి పైగా ఉన్నత పాఠశాలల్లో ల్యాబ్‌లు లేవు. పట్టించుకోని ప్రజాప్రతినిధులు! పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తున్నా ఆచరణలో ఫలితం కనిపించడం లేదు. ప్రతి నియోజకవర్గంలో రూ.5 కోట్లతో ప్రభుత్వ బడు ల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని సర్కారు యోచించింది. ఒక్కో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.కోటి ఇస్తే జిల్లా కలెక్టర్ క్రూషియల్ ఫండ్స్ నుంచి మరో రూ.కోటి, పాఠశాల విద్యా శాఖ రూ.3 కోట్లు కలిపి.. రూ.5 కోట్లతో పాఠశాలలను అభివృద్ధి చేసేలా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ అందుకు ప్రజా ప్రతినిధులు సహకరించడం లేదు. రాష్ట్రంలోని 119 మంది ఎమ్మెల్యేలలో.. ఇప్పటివరకు సగం మంది కూడా తమ నియోజకవర్గాల్లోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ముందుకు రాలేదు. కనీస వసతులూ లేవు.. అనేక ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. పైకప్పు పెచ్చులూడిపోతూ విద్యార్థులకు ప్రమాదకరంగా మారాయి. దీంతో విద్యార్థులకు ఆరుబయటే చదువు చెబుతున్నారు. వర్షం వస్తే చాలా చోట్ల పాఠశాలలకు అప్రకటిత సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. పలు చోట్ల టాయిలెట్లు లేక, ఉన్నా కూడా నీటి వసతి లేక విద్యార్థులు ఇబ్బంది పడు తున్నారు. చివరకు కిచెన్ షెడ్లు లేకపోవడంతో 8,112 పాఠశాలల్లో వర్షం వస్తే అంతే సంగతులు. వర్షాకాలం వచ్చిందంటే చాలు కిచెన్ షెడ్లు లేని ఆ పాఠశాల ల్లో వంట చేయడం కుదరక విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరిగ్గా పెట్టలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇవేకాదు తరగతి గదులు, ఫర్నిచర్, విద్యుత్తు సదుపా యం, లైబ్రరీ, కాంపౌండ్ వాల్ వంటివి లేక సమస్యలు తప్పడం లేదు. ఎన్నెన్నో సమస్యలు.. రాష్ట్రంలోని 25,183 పాఠశాలలకు పక్కా భవనాలుండగా.. 348 పాఠశాలలకు ఇప్పటికీ సొంత భవనాలు లేవు. 7,093 పాఠశాలలకు అదనపు తరగతి గదులు అవసరమని విద్యాశాఖ లెక్కలు వేసింది. ఇందుకు రూ.589 కోట్లు అవసరమని అంచనా వేసింది. ⇔ ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక టాయిలెట్ ఉండాలన్న నిబంధన ప్రకారం పాఠశాలల్లో ఇంకా 27,644 టాయిలెట్లు నిర్మించాల్సి ఉంది. ఇందులో బాలురకు 15,236 టాయిలెట్లు, బాలికల కోసం 12,408 టాయిలెట్లు అవసరం. ⇔ రాష్ట్రంలో సగానికిపైగా పాఠశాలల్లో విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకునేందుకు కూడా నీటి సదుపాయం లేదు. ఇక 10,768 పాఠశాలల్లో తగిన నీటి సదుపాయం ఉండగా.. 14,763 పాఠశాలల్లో రన్నింగ్ వాటర్ సదుపాయం లేదు. ⇔ 23,329 పాఠశాలలకు విద్యుత్ సరఫరా ఉండగా.. 2,202 పాఠశాలలకు లేదు. ⇔15,649 పాఠశాలలకు ప్రహరీ గోడలు ఉండగా.. 9,882 పాఠశాలలకు ప్రహరీ గోడలు నిర్మించలేదు. ⇔ రాష్ట్రంలోని దాదాపు సగం ప్రభుత్వ స్కూళ్లలో ఆట స్థలాలు లేకపోవడం గమనార్హం. దీంతో విద్యార్థుల శారీరక ఎదుగుదలకు అవసరమైన ఆటలు ఆడించే పరిస్థితి లేకుండా పోయింది. ⇔ మధ్యాహ్న భోజనం వండిపెట్టేందుకు, వంట సామగ్రిని భద్రపరిచేందుకు అవసరమైన కిచెన్ షెడ్లు 17,419 పాఠశాలల్లో ఉన్నాయని.. మరో 8,112 పాఠశాలలకు లేవని విద్యాశాఖ లెక్కలే చెబుతున్నాయి. -
నిలిచిన కంప్యూటర్ బోధన
♦ ప్రభుత్వ పాఠశాలల్లో మూలనపడ్డ కంప్యూటర్లు ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ఆధారిత విద్యావిధానం ఆటకెక్కింది. ఐదేళ్లపాటు నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన కాంట్రాక్టు సంస్థల గడువు ముగియడంతో పాఠశాలల్లో కంప్యూటర్లు మూలనపడ్డాయి.ఐదేళ్లపాటు నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన కాంట్రాక్టు సంస్థల గడువు ముగియడంతో పాఠశాలల్లో కంప్యూటర్లు మూలనపడ్డాయి. దీంతో సర్కార్ బడుల్లో చదివే పేద విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందకుండా పోయింది. 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కంప్యూటర్ విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఐదేళ్లపాటు కంప్యూటర్ విద్యాబోధన చేసేందుకు జిల్లాలో హెడ్కామ్ అనే ప్రైవేట్ సంస్థలకు నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. ఒక్కో పాఠశాలలకు ఇద్దరు చొప్పన బోధకులను నియమించారు. దీంతో విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందడంతో పాటు ఫ్యాకల్టీలు ఉపాధి పొందేవారు. వీరందరినీ తొలగించడంతో ఉపాధి కోల్పోగా, విద్యార్థులు పూర్తి స్థాయిలో కంప్యూటర్ విద్యకు దూరమయ్యారు. జిల్లాలో పరిస్థితి ఇలా.. జిల్లాలో 173 ఉన్నత పాఠశాలలు, 102 ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. ఇందులో 43 ప్రాథమిక పాఠశాలల్లో, 48 ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్యా విధానం అమలులో ఉంది. వీటిలో పనిచేసే 182 మందిని తొలగించడంతో కంప్యూటర్ పరిజ్ఞా నం ఉన్న ఉపాధ్యాయుల చేత కంప్యూటర్ విద్యావిధానాన్ని కొనసాగించాలని అధికారులు భావించారు. అయితే సరైన శిక్షణ లేకపోవడం, అవగాహన కొరవడంతో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో కంప్యూటర్లు మూలనపడ్డాయి. మూడేళ్లయినా పట్టింపేది? కంప్యూటర్ ఆధారిత విద్యాబోధన కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి సర్యశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ఒక్కో పాఠశాలకు 10 నుంచి 12 చొప్పన కంప్యూటర్లు అందజేశారు. ప్రింటర్, యూపీఎస్‌లను సైతం సమకూర్చారు. వీటి సాయంతో తెలుగు, గణితం, ఇంగ్లిష్, పరిసరాల విజ్ఞానం పాఠాలు సులభమైన రీతిలో ఆడియో, వీడియో ద్వారా బోధించేవారు. విద్యార్థులకు నెలవారీ పరీక్షలు కూడా నిర్వహించేవారు. కంప్యూటర్ విద్య అటకెక్కడంతో లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన కంప్యూటర్లు, జనరేటర్లు మూలనపడ్డాయి. మూడు సంవత్సరాలు గడుస్తున్నా విద్యాశాఖ అధికారులు గానీ, ప్రభ్వుత్వం పట్టించుకోక పోవడంతో విద్యార్థులు కంప్యూటర్ విద్యకు దూరమవుతున్నారు. కంప్యూటర్ బోధకులను నియమిస్తే గానీ కంప్యూటర్ ఆధారిత విద్య అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. దీనిని పునరుద్ధరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులు కోరుతున్నారు. బోధకులను తీసుకోవాలి – హేమంత్, కంప్యూటర్ బోధకుడు మూడేళ్ల క్రితం కంప్యూటర్ బోధకులను తొలగించారు. కాంట్రాక్టు సంస్థల ద్వారా కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే కంప్యూటర్ విద్యా విధానాన్ని నడిపించాలి. మమ్మల్ని తొలగించడం ద్వారా ఉఫాధి కోల్పోయాం. విద్యార్థులకు మెరుగైన కంప్యూటర్ విద్య అందించే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. బోధన కొనసాగించాలి ప్రతీ విద్యార్థికి కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో అవసరం. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కంప్యూటర్ విద్యను కొనసాగించాలి. విద్యార్థులు కూడా ప్రతిభను పెంపొందించుకునే అవకాశం లభిస్తుంది. చెడిపోయిన కంప్యూటర్లను మరమ్మతు చేయించాలి. – కౌసర్, ప్రధానోపాధ్యాయుడు,ప్రభుత్వ బాలికల పాఠశాల, ఆదిలాబాద్ ఎదరుచూస్తున్నాం మా పాఠశాలలో రెండు సంవత్సరాలుగా కంప్యూటర్ బోధన నిలిచింది. దీంతో కంప్యూటర్ పరిజ్ఞానం నేర్చుకోలేక పోతున్నాం. కంప్యూటర్ టీచర్లను నియమించి విద్యను అందించాలి. విద్యార్థులంతా దీనికోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. – పరాహా, విద్యార్థిని, ప్రభుత్వ బాలికల పాఠశాల, ఆదిలాబాద్ పరికరాలు అందజేస్తున్నాం పాఠశాలల్లో చెడిపోయిన కంప్యూటర్ల మరమ్మతు కోసం ప్రభుత్వం విడిభాగాలు సరఫరా చేసింది. చెడిపోయిన పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్న పాఠశాలలకు వాటిని అందజేస్తున్నాం. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న గణితం, ఫిజిక్స్ ఉపాధ్యాయులకు ఇదివరకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చాం. – కె.లింగయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి -
‘ఏకీకృతం’ అమలుకు ప్రత్యేక కమిటీ
ఉప ముఖ్యమంత్రి కడియం వెల్లడి.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాగానే విధి విధానాలు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఏకీకృత రూల్స్‌ను ఎలా అమలు చేయాలన్న విషయంలో ప్రత్యే కంగా కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయా నికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫి కేషన్ జారీ చేయగానే కమిటీని ఏర్పాటు చేసి అమలు విషయంలో విధి విధానాలను రూపొందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇదే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. శుక్రవారం వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, రవీం దర్ తదితరులు కడియంను కలిశారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ ఏకీకృత సర్వీసు రూల్స్‌కు గెజిట్ నోటిఫికేషన్ రాగానే కార్యాచరణ ప్రారంభిస్తామని, అమలు కు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలతోనూ సమావే శమై సలహాలు, సూచనలు తీసుకుంటామ న్నారు. టీచర్ల బదిలీలపై కూడా సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 2013లోనే సెల్‌పై ఆంక్షలు తరగతి గదిలో ఉపాధ్యాయులు సెల్ ఫోన్ మాట్లాడవద్దని 2013లోనే సర్క్యులర్ వచ్చిం దని కడియం అన్నారు. ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ప్రధానోపాధ్యా యులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ప్రధానోపాధ్యాయుని గదిలోగానీ, స్టాఫ్ రూమ్ లోగానీ, తరగతి బయటగానీ ఉపాధ్యా యులు సెల్ ఫోన్ మాట్లాడుకోవచ్చని, పాఠాలు చెప్పే తరగతి గదిలో మాత్రం ఫోన్ మాట్లాడవద్దని స్పష్టంచేశారు. ఏకీకృత నిబంధనలు గత 20 ఏళ్లుగా లేకపోవడం వల్ల విద్యావ్యవస్థలో పదోన్నతులు ఆగి, నిర్వహణ వ్యవస్థ కొంత ఇబ్బందిగా మారిందన్నారు. అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయని కడియం పేర్కొన్నారు. ఇప్పుడు ఈ నిబంధనలకు ఆమోదం లభించడంతో పదోన్నతులు వస్తాయన్నారు. దీంతో ఉపాధ్యాయ సంఘాల ప్రధాన డిమాండ్లు అన్నీ కొలిక్కి వస్తున్నాయ న్నారు. ఇప్పటికే ఉపాధ్యాయ ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని నిర్ణయించామని, నోటిఫికేషన్లు కూడా వస్తున్నాయని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయని, ఇందుకోసం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశామని వివరించారు. నమ్మకాన్ని పెంచుతున్నాం.. ప్రధానంగా మూడు కారణాల వల్ల ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం సన్నగిల్లిందని, ఆ నమ్మకాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని కడియం పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు లేకపోవడం అందులో ప్రధానమైందన్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశారని, ప్రతి పాఠశాలలో ప్రైవేట్‌కు దీటుగా వసతులు కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. తమ పిల్లలను ఇంగ్లిషు మీడియంలో చదివించాలనే కోరికతో కూడా చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్ బడుల్లో చేర్పిస్తున్నారన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది 5,000 పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టిందని, ఈ ఏడాది కూడా అవసరమైన మేరకు ఆ సంఖ్యను పెంచుతున్నామని కడియం వెల్లడించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత లేకుండా నియామకాలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలను పూర్తి స్థాయిలో పటిష్టం చేస్తున్నామన్నారు. తల్లిదం డ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వంపై సమష్టిగా ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. మరోవైపు దసరా సెలవుల్లో టీచర్ల బదిలీలు, పదోన్నతులు కల్పించేందుకు చర్యలు చేపడతామని కడియం శ్రీహరి హామీ ఇచ్చినట్లు యూటీఎఫ్ వెల్లడించింది. -
విద్యార్థులకు రవాణా ఖర్చుల మంజూరు
ప్రతి విద్యార్థికి నెలకు రూ.300 ఇచ్చేలా ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేని ఆవాస ప్రాంతాల్లోని విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు గాను రవాణా ఖర్చులు ఇచ్చేందుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 17,619 మంది విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేవని విద్యా శాఖ గుర్తించింది. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న ఆయా విద్యార్థులకు నెలకు రూ.300 చొప్పున రవాణా ఖర్చులు ఇచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 17,619 మంది విద్యార్థులకు రూ. 5.28 కోట్లు మంజూరు చేసింది. సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు ఇందుకు ఆమోదం తెలపడంతో విద్యార్థులకు ఈ మొత్తాన్ని అందజేసేందుకు చర్యలు చేపట్టింది. ఒక కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాలలు, 3 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాలలు అందుబాటులో లేని ఆ విద్యార్థులకు ఈ మొత్తాన్ని అందజేయనుంది. ట్రాన్స్‌పోర్టు సదుపాయం వినియోగించుకునే విద్యార్థులు బ్యాంకు అకౌంట్ నంబర్లు, వారి వివరాలు, ఆధార్ నంబరు ఇస్తే ఆ మొత్తాన్ని అందజేస్తామని పేర్కొంది. ఇందుకు అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని డీఈవోలను పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ ఆదేశించారు. -
నేటి నుంచి బడులు
సర్కారీలో సమస్యలు..ప్రైవేటులో ఫీజులు - 7,093 పాఠశాలల్లో సరిపడా తరగతి గదుల్లేవు - భారీగా ఫీజుల పెంచిన ప్రైవేటు స్కూళ్లు - అధ్యయనమంటూ ‘ఫీజుల కమిటీ’ వాయిదాలు సాక్షి, హైదరాబాద్: బడిగంట మోగనుంది. వేసవి సెలవుల తర్వాత సోమవారం నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. ఎప్పట్లాగే సర్కారీ స్కూళ్లలో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలకనుండగా ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు మోతెక్కనున్నాయి. 20 శాతం నుంచి 50 శాతం ఫీజులు పెంచేందుకు ప్రైవేటు యాజమాన్యాలు రంగం సిద్ధం చేశాయి. ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం నియమించిన ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ నివేదిక సమర్పించడంలో వాయిదాల పర్వం కొన సాగుతోంది. గత ఏప్రిల్‌లో ప్రభు త్వం నియమిం చిన ఈ కమిటీ నెల రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంది. మే మూడో వారంలోనే గడువు ముగిసినా అధ్యయనం పేరుతో 15 రోజుల గడువు కోరింది. ఆ గడువూ మే 29తో ముగిసిపో యింది. ఈ నేపథ్యంలో తమకు పలు విజ్ఞప్తులు వచ్చాయని, వాటిని పరిశీలించాలని సూచిస్తూ తిరుపతిరావు కమిటీకి ప్రభుత్వం సూచించింది. దీంతో కమిటీ మరో నెల రోజుల గడువు కోరింది. ఇంకేముంది ఇప్పుడు స్కూళ్లు ప్రారంభమయ్యాయి. ఆ నివేదిక ఇప్పట్లో ప్రభుత్వానికి చేరదు.. నియంత్రణ అమల్లోకి రాదు. దీంతో ఫీజుల భారాన్ని తల్లిదండ్రులు భరించక తప్పని పరిస్థితి నెలకొంది. వర్షమొస్తే వంట బంద్.. రాష్ట్రంలో 25,183 ప్రభుత్వ పాఠశాల లుండగా 8,112 పాఠశాలల్లో ఇప్పటికీ కిచెన్ షెడ్లు లేవు. దీంతో రానున్న వర్షాకాలంలో విద్యార్థులకు ఇబ్బందులు తప్పవు. వర్షం వస్తే వంట ఆపాల్సిన పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా 348 పాఠశాలలు ఇంకా చెట్ల కిందే కొనసాగుతున్నాయి. వర్షాకాలంలో వాటి పరిస్థితి గందరగోళమే. అలాగే 7,093 పాఠశాలల్లో సరిపడా తరగతి గదులు లేవు. మరోవైపు స్కూళ్లల్లో 27 వేల వరకు టాయిలెట్లు అవసరం ఉంది. అందులో 12 వేల వరకు బాలికలకు ప్రత్యేక టాయిలెట్ల అవసరమున్నట్లు విద్యా శాఖ లెక్కలేసింది. 2 వేలకు పైగా స్కూళ్లల్లో విద్యుత్ సదుపాయం లేకపోగా 10 వేల పాఠశాలలకు ప్రహరీ గోడల్లేవు. బడిబాట తరువాతే హేతుబద్ధీకరణ.. పది మందిలోపు విద్యార్థులున్న స్కూళ్లను సమీప పాఠశాలల్లో విలీనం చేయాలని విద్యాశాఖ మొదట్లో భావించినా ఆ విషయాన్ని ప్రస్తుతం పక్కనపెట్టింది. బడిబాట కార్యక్రమం తరువాత లెక్కలు సేకరించి విలీనంపై ముందుకు సాగాలని.. పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపట్టాలని భావిస్తోంది. రేపటి నుంచి బడిబాట.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు విద్యాశాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. జిల్లాల వారీగా సీనియర్ అ«ధికారులను నియమించి పిల్లల నమోదుకు చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ఈనెల 13 నుంచి 17 వరకు బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 5, 7, 8 తరగతులను ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి చేసిన వారంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే పైతరగతుల్లో చేరేలా చర్యలు చేపట్టింది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తల్లిదండ్రుల డిమాండ్, విద్యార్థుల సంఖ్యను బట్టి ఒకటో తరగతిలో ఇంగ్లిష్ మీడియం మంజూరు చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. -
మూసివేత దిశగా ప్రభుత్వ పాఠశాలలు...
-
మూసివేత దిశగా ప్రభుత్వ పాఠశాలలు...
► వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి అమరావతి: ప్రైవేటు విద్యావ్యాపారాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోందంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇందులో భాగంగా 7,500 ప్రభుత్వం పాఠశాలను మూసివేస్తోందని ఆయన ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చెవిరెడ్డి మాట్లాడుతూ హేతుబద్ధీకరణ పేరుతో ఇప్పటికే 1,446 పాఠశాలలను రద్దు చేసిందని పేర్కొన్నారు., ఈ ఏడాది మరో 1,500 పాఠశాలలను మూసివేయడానికి రంగం సిద్ధం చేసిందని తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం రాష్ట్ర విద్యారంగంలో ప్రాధమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల పేరుతో మూడెంచల విద్యావ్యవస్థ ఉంది., ఇప్పుడు దీన్ని ప్రాధమిక, ఉన్నత పేరుతో రెండెంచలకు కుదించాలని నిర్ణయించిందన్నారు. దీనివల్ల రాష్ట్రంలో ఉన్న సుమారు 4,500 ప్రాధమికోన్నత పాఠశాలలు మూతపడి విద్యార్థులకు చదవు దూరమయ్యే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తోందని చెప్పారు. నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్ స్కూల్స్‌ని ప్రోత్సహించడం కోసం ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలను మూసివేయడం అత్యంత భాధాకరమైన విషయామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 61,529 పాఠశాలలు ఉంటే అందులో కేవలం 16,273 మాత్రమే ప్రైవేటు పాఠశాలుగా ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెపుతున్నాయని సూచించారు. కానీ చాలా ప్రైవేటు పాఠశాలలు ఒకే రిజిస్ట్రేషన్‌తో అనేక పాఠశాలలు నిర్వహిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం 3,870 ఆదర్శ పాఠశాలకు రూ. 3,000 కోట్లు కేటాయిస్తే ఈ మొత్తం కాంట్రాక్టును ముఖ్యమంత్రి క్లాస్‌మేట్‌కి కట్టబెట్టారని ఆయన అన్నారు. అలాగే యూనిఫాంలకై రూ. 132 కోట్లు ఇస్తే ఈ మొత్తాన్ని ఒకే కాంట్రాక్టరుకి ఇవ్వడం వల్ల పిల్లలకు బట్టల సైజులు సరిపోక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మధ్యాహ్నం భోజనం పథకంలో నాసిరకమైన ఆహారాన్ని అందిస్తూ పిల్లలను పరుగుల్లా ఈ ప్రభుత్వం చూస్తోందన్నారు. మరింతమందికి విద్యను అందించే విధంగా ప్రభుత్వ పాఠశాలలను పెంచడమే కాకుండా ఉన్న వాటిలో మౌలిక వసతులు పెంచాలని చెవిరెడ్డి డిమాండ్ చేశారు. విష్ణుకుమార్‌కి ఏదైనా అయితే ప్రభుత్వానిదే బాధ్యత ఒక శాసన సభ సభ్యుని చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారడం అత్యంత విచారకరమన్నారు. విశాఖలో భూ కుంభకోణం వెలికితీసినందుకు రియల్ మాఫీయా విష్ణుకుమార్ రాజ్‌ను బెదిరిస్తోందని, అతనికి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అనేక ప్రజాసమస్యలను నిత్యం సభలో ప్రస్తావించే విష్ణుకుమార్ రాజుకు ప్రతిపక్ష వైఎస్ఆర్పార్టీ అండంగా ఉంటుందని చెప్పారు. -
పుస్తకాలు రాలేదా.. ఫోన్ చేయండి..
సాక్షి, హైదరాబాద్: పాఠ్య పుస్తకాల సరఫరాకు సంబంధించిన సమస్యలు, సమా చారాన్ని అందించేందుకు 18004257462 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు రాకపోయినా, ఏమైనా సబ్జెక్టుల పుస్తకాలు రావాల్సి ఉన్నా ఈ నంబర్ ని సంప్రదించాలని కోరారు. మండల కేంద్రాలకు వచ్చే పాఠ్య పుస్తకాల్లో తమకు అవసరమైన పుస్తకాలను తీసుకెళ్లాల్సిన బాధ్యత హెడ్మాస్టర్లదేనన్నారు.