
విరాళం చెక్కు, పత్రాలను సీఎంకు ఇస్తున్న లారస్ ల్యాబ్స్ వైస్ ప్రెసిడెంట్ చావా నరసింçహారావు, సీనియర్ మేనేజర్ రామకృష్ణ
సాక్షి, అమరావతి: నాడు–నేడు పథకం మొదటి విడతలో భాగంగా..మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం సీఎం సహాయనిధికి లారస్ ల్యాబ్స్ తరఫున రూ.నాలుగు కోట్ల విరాళం అందించారు. తెనాలి, కంచికచర్ల, వీరులపాడు, అచ్యుతాపురం మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల కోసం ఈ విరాళం అందించారు. 2, 3 విడతల్లో అదే మండలాల్లోని మిగిలిన పాఠశాలల్లో నేరుగా లారస్ ల్యాబ్స్ మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు సీఎంకు తెలిపారు.
విరాళానికి సంబంధించిన చెక్కును, సంబంధించిన పత్రాలను బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లారస్ ల్యాబ్స్ వైస్ ప్రెసిడెంట్ చావా నరసింహరావు, సీనియర్ మేనేజర్ రామకృష్ణ అందజేశారు. కనెక్ట్ టూ ఆంధ్ర సీఈవో వి.కోటేశ్వరమ్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment