Laurus Labs
-
పెట్టుబడుల ఆకర్షణకు సీఎం జగన్ చేస్తున్న కృషి అభినందనీయం: లారస్ సీఈఓ
పెట్టుబడుల ఆకర్షణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న కృషి అభినందనీయని లారస్ సీఈఓ చావ సత్యనారాయణ కొనియాడారు. విశాఖ పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా అచ్చుతాపురంలోని లారస్- 2 యూనిట్‌ను సీఎం సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లారస్ సీఈఓ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్య, వైద్య రంగాల్లో తీసుకొస్తున్న మార్పులు దేశానికే ఆదర్శమన్నారు. అచ్యుతాపురంలో రూ.460 కోట్లతో ఏర్పాటు చేసిన యూనిట్ - 2 ద్వారా 1200 మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని తెలిపారు. కొత్తగా రూ.850 కోట్లతో నిర్మించే రెండు యూనిట్లు ద్వారా రానున్న రోజుల్లో మరో 800 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రస్తుతానికి లారస్ లో సుమారు ఐదువేల మంది ఉన్నారని, కొత్తగా 2000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పారు. నాడు-నేడు ద్వారా రాష్ట్రంలో వివిధ రంగాల్లో తీసుకొస్తున్న మార్పులు ఆదర్శప్రామంటున్న లారస్ ల్యాబ్స్ సీఈఓ చావ సత్యనారాయణతో మా ప్రతినిధి ముఖాముఖి. -
లారస్ లాభం 55 శాతం డౌన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ లారస్ ల్యాబ్స్ రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు మధ్యంతర డివిడెండ్ రూ.1.2 చెల్లించాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. మార్చి త్రైమాసికంలో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 55 శాతం క్షీణించి రూ.103 కోట్లు నమోదు చేసింది. మార్జిన్స్ 7.5 శాతం సాధించింది. ఎబిటా 28 శాతం తగ్గి రూ.287 కోట్లు, ఎబిటా మార్జిన్ 20.8 శాతంగా ఉంది. ఈపీఎస్ రూ.1.9 నమోదైంది. టర్నోవర్ 3% తగ్గి రూ. 1,381 కోట్లకు వచ్చి చేరింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.6,041 కోట్ల టర్నోవర్‌పై రూ.790 కోట్ల నికరలాభం పొందింది. క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో లారస్ షేరు ధర గురువారం 2.60 శాతం క్షీణించి రూ.292.25 వద్ద స్థిరపడింది. -
నాడు-నేడుకు లారస్ ల్యాబ్స్ రూ.4 కోట్ల విరాళం
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యామౌలిక సదుపాయాలను పెంపొందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన నాడు- నేడు కార్యక్రమానికి లారస్ ల్యాబ్స్ రూ.4 కోట్లను విరాళంగా అందించింది. దీంతోపాటు పారిశ్రామిక ప్రాంతం అయిన అనకాపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్రత్యేక వార్డు (కాలిన గాయాలకు సంబంధించిన) నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు అందిస్తామని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ డా. సత్యనారాయణచావా.. సీఎం జగన్‌తో తెలిపారు. నాడు- నేడు పథకం కింద లారస్ ల్యాబ్స్ విరాళాన్ని అందించడం ఇది మూడోసారి. ఈ సందర్భంగా సీఎంని కలిసిన వారిలో సీఈఓ డా.సత్యనారాయణ చావా, కార్పొరేట్ డెవలప్మెంట్, సింథసిస్ మరియు ఇంగ్రిడియంట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణచైతన్య చావా, మానవ వనరుల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారావు చావా, సీఎస్ఆర్ హెడ్ సౌమ్య చావా ఉన్నారు. చదవండి: (సీఎం జగన్ చేతుల మీదుగా పాడి రైతులకు బోనస్ పంపిణీ) -
ఫార్మాసిటీ మృతులకు.. రూ.25 లక్షలు చొప్పున పరిహారం
మధురవాడ (భీమిలి)/పరవాడ (పెందుర్తి)/మహారాణిపేట : అనకాపల్లి జిల్లా పరవాడ సమీపంలో ఫార్మాసిటీ లారస్ ల్యాబ్ పరిశ్రమలో సోమవారం రాత్రి సంభవించిన ప్రమాదంలో మృతులు నలుగురికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.25 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఇంతకుముందు కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగినా తక్షణమే చర్యలు తీసుకున్నామన్నారు. బహుళ జాతి కంపెనీలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. గతంలో బ్రాండిక్స్ లాంటి పరిశ్రమల్లో ప్రమాదం జరిగినప్పుడు సైతం అప్రమత్తంగా వ్యవహరించామన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటుచేశామని, సేఫ్టీ ఆడిట్స్ చేయాలని ఆదేశించామని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలో 80–90 వరకు ప్రమాదకర పరిశ్రమలున్నట్లు గుర్తించామన్నారు. వాటిలో భద్రతాపరమెన ఆడిట్స్ చేయాలని ఆదేశించినట్లు అమర్నాథ్ చెప్పారు. పరవాడ ఫార్మాలో ప్రమాద ఘటన ఎందువల్ల జరిగింది? అందులో ఎవరి తప్పిదం ఉందో సమగ్రంగా విచారణ జరిపించాలని అనకాపల్లి కలెక్టర్, ఎస్పీలను ఆదేశించామన్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం ఇక ఈ ప్రమాదంలో మృతులు బి. రాంబాబు, రాజేష్‌బాబు, రాపేటి రామకృష్ణ, మజ్జి వెంకట్రావు మృతదేహాలకు కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం వారి బంధువులకు అప్పగించినట్లు పరవాడ సీఐ పి.ఈశ్వరరావు చెప్పారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎడ్ల సతీష్ షీలానగర్ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల కుటుంబాలకు రూ.2.24 కోట్ల పరిహారం మరోవైపు.. దుర్ఘటనలో మరణించిన నలుగురు కార్మికులకుటుంబాలకు రూ.2.24 కోట్ల పరిహారం చెల్లించడానికి యాజమాన్యం అంగీకరించిందని సీఐటీయూ నాయకులు గనిశెట్టి సత్యనారాయణ చెప్పారు. విశాఖ కేజీహెచ్‌లో ఇరువర్గాల మధ్య మంగళవారం జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరిందన్నారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన పర్మినెంట్ ఉద్యోగులు ఇద్దరికి ఒక్కొక్కరికి రూ.70 లక్షలు చొప్పున రూ.1.40 కోట్లు, అలాగే.. కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి రూ.42 లక్షల చొప్పున రూ.84 లక్షలు పరిహారం ఇవ్వడంతోపాటు బాధిత కుటుంబంలో ఒకరికి పరిశ్రమలో ఉపాధి కల్పించనున్నట్లు చెప్పారు. -
‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా డాక్టర్ చావా సత్యనారాయణ
వ్యాపారం అంటేనే రిస్క్. రిస్క్ అనుకోకుండా ముందుకెళితే? అది రిసెర్చ్. అదే డెవలప్మెంట్. రిస్క్ ఎందుకులే అనుకునే మందుల కంపెనీలు మొదటే ఉత్పత్తిని మొదలు పెట్టేస్తాయి. తర్వాతే ఆర్ అండ్ డి. రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సేఫ్ గేమ్. కానీ.. లారస్ ల్యాబ్స్ తన సేఫ్‌ని చూసుకోలేదు. మొదటే ఆర్ అండ్ డి మొదలు పెట్టేసింది! తర్వాతే మందుల తయారీ. లారస్ ల్యాబ్స్ మొదలై పదిహేనేళ్లే అయినా ఇప్పటి వరకు కనిపెట్టిన కొత్త మందులు 150. అంటే.. నూటా యాభై పేటెంట్లు! రెస్పెక్ట్ – రివార్డు – రీటెయిన్.. అనే మూడు స్తంభాలపై ల్యాబ్స్ నిర్మాణం జరిగింది. నాలుగో స్తంభం డాక్టర్ చావా సత్యనారాయణ. ర్యాన్‌బాక్సీ లో యువ పరిశోధకుడిగా డాక్టర్ సత్యనారాయణ విజయ ప్రస్థానం మొదలైంది. మ్యాట్రిక్స్లో చేరిన ఎనిమిదేళ్లకే ఆ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా శిఖరానికి చేరింది. లారస్ ల్యాబ్ వ్యవస్థాపన (2005 హైదరాబాద్) తో భారతీయ ఔషధ ఉత్పత్తుల రంగానికి ‘హితామహులు’, దిశాదర్శకులు అయ్యారు. సాక్షి ఇప్పుడు తన ఎక్స్‌లెన్స్ అవార్డుతో ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ గా ఆయన్ని ఘనంగా సత్కరించింది. -
కనెక్ట్ టు ఆంధ్రకి లారస్ ల్యాబ్స్ భారీ విరాళం
తాడేపల్లి: నాడు నేడు పథకం రెండో విడత కార్యక్రమానికి భారీ విరాళం అందింది. ఈ కార్యక్రమంలో భాగంగా నాలుగు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో (తెనాలి, కంచికచర్ల, వీరులపాడు, అచ్యుతాపురం, పరవాడ) రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కోసం ‘కనెక్ట్ టు ఆంధ్ర’కు లారస్ ల్యాబ్స్ రూ.4 కోట్ల విరాళం అందించింది. ఈ మేరకు లారస్ ల్యాబ్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని క్యాంప్ కార్యాలయంలో బుధవారం కలిశారు. చెక్కుతో పాటు పనులకు సంబంధించిన పత్రాలను అందజేశారు. మూడు, నాలుగు విడతల్లో అదే మండలాల్లోని మిగిలిన పాఠశాలల్లో నేరుగా లారస్ ల్యాబ్స్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ సీఈఓ డాక్టర్ చావా సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ చావా కృష్ణ చైతన్య, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చావా నరసింహరావు సీఎం జగన్‌కు తెలిపారు. కార్యక్రమంలో కనెక్ట్ టూ ఆంధ్ర సీఈఓ వి. కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. -
నాడు–నేడుకు లారస్ ల్యాబ్స్ రూ.4 కోట్ల విరాళం
సాక్షి, అమరావతి: నాడు–నేడు పథకం మొదటి విడతలో భాగంగా..మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం సీఎం సహాయనిధికి లారస్ ల్యాబ్స్ తరఫున రూ.నాలుగు కోట్ల విరాళం అందించారు. తెనాలి, కంచికచర్ల, వీరులపాడు, అచ్యుతాపురం మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల కోసం ఈ విరాళం అందించారు. 2, 3 విడతల్లో అదే మండలాల్లోని మిగిలిన పాఠశాలల్లో నేరుగా లారస్ ల్యాబ్స్ మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు సీఎంకు తెలిపారు. విరాళానికి సంబంధించిన చెక్కును, సంబంధించిన పత్రాలను బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి లారస్ ల్యాబ్స్ వైస్ ప్రెసిడెంట్ చావా నరసింహరావు, సీనియర్ మేనేజర్ రామకృష్ణ అందజేశారు. కనెక్ట్ టూ ఆంధ్ర సీఈవో వి.కోటేశ్వరమ్మ పాల్గొన్నారు. -
ఫార్మాలో 700 కోట్ల పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలో పేరొం దిన రెండు ప్రముఖ కంపెనీలు హైదరాబాద్‌లో రూ. 700 కోట్ల పెట్టుబడులు పెడు తున్నట్లు మంగళవారం ప్రకటించాయి. ప్రపం చంలోనే అతిపెద్ద కమర్షియల్ ఫార్మాస్యూటి కల్ ఫార్ములేషన్ కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియా రాష్ట్రంలో మరో రూ. 400 కోట్లతో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ యూనిట్ ద్వారా 1,600 మందికి ఉపాధి లభిస్తుంది. వేయి కోట్ల ఫినిష్డ్ డోస్‌లను కొత్తగా ఏర్పాటు చేసే యూనిట్ ద్వారా ఉత్పత్తి చేస్తామని గ్రాన్యూల్స్ ఇండియా ప్రకటించింది. తమ తాజా యూనిట్‌ను జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ సీఎండీ కృష్ణప్రసాద్ వెల్ల డించారు. మరోవైపు లారస్ ల్యాబ్స్ కూడా జీనోమ్ వ్యాలీలో రూ. 300 కోట్లతో దశల వారీగా ఫార్ములేషన్ ఫెసిలిటీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే లారస్ ల్యాబ్ జీనోమ్ వ్యాలీలోని ఐకేపీ నాలెడ్జ్ పార్కులో పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని నెల కొల్పింది. ఇక్కడ యాంటీ రిట్రోవైరల్, అంకా లజీ, కార్డియోవా స్క్యులార్, యాంటీ డయా బెటిక్స్, యాంటీ ఆస్తమా, గ్యాస్ట్రో ఎంటరాల జీకి సంబంధించిన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడి యెంట్లను తయారు చేస్తుంది. ఉపాధి పెరుగుతుంది: కేటీఆర్ గ్రాన్యూల్స్ ఇండియా, లారస్ ల్యాబ్ పెట్టు బడులతో తయారీ రంగంలో స్థానిక యువ తకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఫార్మా సహా వివిధ రంగాల్లో అనేక పెట్టుబడులు వస్తున్నాయని, పెట్టుబడులతో వచ్చే కంపెనీలకు అన్ని విధాలా సాయం అందిస్తామని ప్రకటించారు. గ్రాన్యూల్స్ ఇండియా సీఎండీ కృష్ణ ప్రసాద్, లారస్ ల్యాబ్ సీఈఓ సత్యనారాయణ మంగళవారం కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి తమ నూతన పెట్టుబడుల గురించి వివరించారు. -
ఎస్కార్ట్స్- లారస్ ల్యాబ్స్.. గెలాప్
ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 550 పాయింట్లు జంప్‌చేసి 37,938కు చేరింది. కాగా.. క్యుబోటా కార్పొరేషన్ భాగస్వామ్యంలో ట్రాక్టర్ల తయారీని ప్రారంభించినట్లు వెల్లడించడంతో ఎస్కార్ట్స్ లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు షేర్ల విభజనకు బుధవారం(30న) రికార్డ్ డేట్‌కావడంతో ఫార్మా రంగ కంపెనీ లారస్ ల్యాబ్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. ఎస్కార్ట్స్ లిమిటెడ్ జపనీస్ దిగ్గజం క్యుబోటా కార్పొరేషన్‌తో ఏర్పాటు చేసిన భాగస్వామ్య సంస్థ(జేవీ) ఎస్కార్ట్స్ క్యుబోటా ఇండియా ట్రాక్టర్ల తయారీని ప్రారంభించినట్లు ఎస్కార్ట్స్ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. ఈ జేవీలో క్యుబోటా 60 శాతం, ఎస్కార్ట్స్ 40 శాతం చొప్పున వాటాలను కలిగి ఉన్నట్లు తెలియజేసింది. రూ. 300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన జేవీ ఏడాదికి 50,000 ట్రాక్టర్లను రూపొందించగలదని వెల్లడించింది. ఈ యూనిట్‌ను ప్రధానంగా ఎగుమతులకు వినియోగించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎస్కార్ట్స్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 8 శాతం జంప్‌చేసింది. రూ. 1,300ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 7.4 శాతం లాభంతో రూ. 1,292 వద్ద ట్రేడవుతోంది. లారస్ ల్యాబ్స్ చిన్న ఇన్వెస్టర్లకు సైతం అందుబాటులో ఉండేందుకు వీలుగా షేర్ల విభజనను ప్రకటించిన లారస్ ల్యాబ్స్ షేరు మంగళవారం నుంచీ ఎక్స్డేట్కానుండటంతో జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈలో తొలుత 9.2 శాతం దూసుకెళ్లింది. రూ. 1,450 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 8.8 శాతం ఎగసి రూ. 1,445 వద్ద ట్రేడవుతోంది. జులై 30న సమావేశమైన లారస్ ల్యాబ్స్ బోర్డు 5:1 నిష్పత్తిలో షేర్ల విభజనను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు ఈ నెల 30 రికార్డ్ డేట్‌కావడంతో మంగళవారం నుంచీ షేరు ధర ఇందుకు అనుగుణంగా సర్దుబాటు కానుంది. -
లారస్ ల్యాబ్స్- అలెంబిక్.. భలే జోరు
దేశీ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు హెల్త్‌కేర్ రంగ కౌంటర్లు మరింత దూకుడు చూపుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో లారస్ ల్యాబ్స్ షేరు తాజాగా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ఇక మరోపక్క అలెంబిక్ లిమిటెడ్ సైతం 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఇతర వివరాలు చూద్దాం.. లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ వరుసగా నాలుగో రోజు లారస్ ల్యాబ్స్ షేరు జోరందుకుంది. ఎన్ఎస్ఈలో తొలుత 4.5 శాతం జంప్‌చేసింది. రూ. 1,265కు చేరింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ప్రస్తుతం 2.3 శాతం ఎగసి రూ. 1,239 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో పటిష్ట ఫలితాలు సాధించడంతో ఈ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి గత నాలుగు నెలల్లో ఈ షేరు 171 శాతం ర్యాలీ చేసింది. ఇదే కాలంలో సెన్సెక్స్ 19 శాతంమే బలపడింది. కాగా.. రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 2 ముఖ విలువగల 5 షేర్లుగా విభజించనుంది. ఇందుకు సెప్టెంబర్ 30 రికార్డ్ డేట్‌గా ప్రకటించింది. అలెంబిక్ లిమిటెడ్ ఈ నెల మొదట్లో ప్రమోటర్ గ్రూప్ సంస్థ అదనపు వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడయ్యాక జోరందుకున్న అలెంబిక్ లిమిటెడ్ మరోసారి దూకుడు చూపుతోంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 12 శాతం దూసుకెళ్లి రూ. 115కు చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ఈ నెలలో ఇప్పటివరకూ 30 శాతం ర్యాలీ చేసింది. ఓపెన్ మార్కెట్ ద్వారా ఈ నెల 2-4 మధ్య నిరయూ లిమిటెడ్ అదనంగా 0.6 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు అలెంబిక్ ఇప్పటికే తెలియజేసింది. నిజానికి జూన్‌కల్లా కంపెనీలో ప్రమోటర్ల వాటా 67.62 శాతం నుంచి 69.57 శాతానికి ఎగసింది. ఈ నేపథ్యంలో అలెంబిక్ కౌంటర్ జోరు కొనసాగుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. -
లారస్ లేబ్స్- టాటా కన్జూమర్ ఖుషీ
ప్రపంచ మార్కెట్ల ప్రోద్బలంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా హెల్త్‌కేర్ రంగ కంపెనీ లారస్ లేబ్స్, ఎఫ్ఎంసీజీ రంగ కంపెనీ టాటా కన్జూమర్ స్టాక్స్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం... లారస్ లేబ్స్ యూఎస్ఎఫ్డీఏ నుంచి రెండు ఏఎన్‌డీఏలకు అనుమతి లభించినట్లు వెల్లడించడంతో హెల్త్‌కేర్ రంగ కంపెనీ లారస్ లేబ్స్ కౌంటర్ జోరందుకుంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 3.5 శాతం పెరిగి రూ. 441 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 457ను అధిగమించింది. హెచ్ఐవీ చికిత్సకు వినియోగించే టీఎల్ఈ-400, టీఎల్ఈ-600 ఔషధ విక్రయాలకు యూఎస్ఎఫ్డీఏ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు లారస్ లేబ్స్ తెలియజేసింది. అధ్యక్ష అత్యవసర పథకం(పెఫార్)లో భాగంగా వీటిని తక్కువ, మధ్యాదాయ దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు పేర్కొంది. ఈ ట్యాబ్లెట్లను 300-400-600 ఎంజీ డోసేజీలలో రూపొందించనున్నట్లు వెల్లడించింది.కంపెనీలో ప్రమోటర్లకు 32.04% వాటా ఉంది. టాటా కన్జూమర్ భాగస్వామ్య సంస్థ నౌరిష్కో బెవరేజెస్‌లో విదేశీ దిగ్గజం పెప్సీకోకు గల వాటాను కొనుగోలు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడికావడంతో ఎఫ్ఎంసీజీ కంపెనీ టాటా కన్జూమర్ కౌంటర్‌కు డిమాండ్ పుట్టింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 3.5 శాతం పుంజుకుని రూ. 360 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 363కు ఎగసింది. హిమాలయన్ మినరల్ వాటర్, టాటా గ్లూకో ప్లస్ తదితర బ్రాండ్ల నౌరిష్ కంపెనీలో పెప్సీకో, టాటా కన్జూమర్‌కు 50:50 వాటా ఉంది. ఈ వాటా కొనుగోలు ద్వారా పానీయాల విభాగంలో టాటా కన్జూమర్ మరింత పట్టుసాధించే వీలుంటుందని నిపుణులు పేర్కొన్నారు. -
లారస్‌కు గ్లోబల్ ఫండ్ అనుమతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ కంపెనీ లారస్ ల్యాబ్స్‌కు చెందిన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ 1, 3 యూనిట్స్‌కు యూఎస్ఎఫ్డీఏ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ జారీ చేసింది. ఏపీలోని విశాఖపట్నం వద్ద ఉన్న ఈ రెండు యూనిట్లను ఎఫ్‌డీఏ బృందం జూన్ నెలలో తనిఖీ చేపట్టింది. గ్లోబల్ ఫండ్ ఎక్స్పర్ట్ రివ్యూ ప్యానెల్ అనుమతి సైతం దక్కించుకున్నట్టు కంపెనీ వెల్లడించింది. గ్లోబల్ ఫండ్ నిధులు సమకూరుస్తున్న ప్రాజెక్టులకు ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్లో టీఎల్ఈ 400 అనే ఔషధాన్ని సరఫరా చేస్తారు. యాంటీ రెట్రో వైరల్ థెరపీ విభాగంలో ఈ ఔషధం సరఫరాకై గ్లోబల్ ఫండ్ ఆమోదం లభించిన మూడు కంపెనీల్లో లారస్ ఒకటి. హెచ్ఐవీ/ఎయిడ్స్ చికిత్సకు ఈ మందును వాడతారు. -
లారస్ ల్యాబ్స్ ఐపీవో నేడు ప్రారంభం
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఫార్మా కంపెనీ లారస్ ల్యాబ్స్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) సోమవారం నుంచి ప్రారంభం అవుతోంది. ఈ ఇష్యూ ఈ నెల 8 (బుధవారం)తో ముగుస్తుంది. ఒక్కో షేరుకు కనిష్ట ధర రూ.426 కాగా గరిష్ట ధర రూ.428. గరిష్ట ధర ప్రకారం చూస్తే ఈ ఇష్యూ ద్వారా సమీకరించే మొత్తం రూ.1,332 కోట్లు. రూ.300 కోట్ల విలువ మేర షేర్లను కంపెనీ తాజాగా జారీ చేయనుంది. ఇక కంపెనీలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టి వాటా కలిగిన ఆప్ట్యూట్ (ఏసియా), బ్లూవాటర్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్ఐఎల్ కేపిటల్ మేనేజ్మెంట్ (మారిషస్), ఫిడెలిటీ ఇండియా ప్రిన్సిపల్స్ సంస్థలు 2,41,07,440 షేర్లను ఈ ఇష్యూలో విక్రయానికి ఉంచుతున్నారుు. తాజా షేర్ల జారీ ద్వారా సమకూరే రూ.300 కోట్లను రుణాలను తీర్చివేయడంతోపాటు కార్పొరేట్ అవసరాలకు వినియోగించుకోనున్నట్టు కంపెనీ తెలిపింది. -
వైజాగ్‌లో లారస్ల్యాబ్స్ ఆర్అండ్డీ కేంద్రం
-
వైజాగ్‌లో లారస్ల్యాబ్స్ ఆర్అండ్డీ కేంద్రం
• మరో రెండు తయారీ కేంద్రాలు కూడా • కొత్తగా 300 మంది నియామకం • ఐపీవో డిసెంబర్ 6న ప్రారంభం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఔషధ తయారీ రంగంలో ఉన్న లారస్ ల్యాబ్స్ వైజాగ్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని 2017 జూన్ నాటికి నెలకొల్పుతోంది. ఇప్పటికే సంస్థకు హైదరాబాద్‌తోపాటు యూఎస్‌లోని బోస్టన్‌లో ఇటువంటి సెంటర్లున్నారుు. 2,300 మంది సిబ్బందిలో 25 శాతం ఆర్అండ్డీలో పనిచేస్తున్నారు. ఈ విభాగానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్టు సంస్థ సీఈవో సి.సత్యనారాయణ తెలిపారు. కంపెనీ ఈడీ రవి కుమార్‌తో కలిసి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. వైజాగ్ కేంద్రానికి కొత్తగా 100 మందిని నియమిస్తామని చెప్పారు. ఈ ఏడాది డిసెంబరుకల్లా ఒకటి, 2017 చివరి నాటికి మరో తయారీ కేంద్రం అందుబాటులోకి వస్తుందన్నారు. తయారీ కేంద్రాలకు కొత్తగా 200 మందిని తీసుకుంటామని వివరించారు. తయారీ, ఆర్అండ్డీ సెంటర్లకు కంపెనీ రూ.450 కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఐపీవో ద్వారా రూ.1,331 కోట్లు.. లారస్ ల్యాబ్స్ ఐపీవో ఈ నెల 6న ప్రారంభమై 8న ముగియనుంది. రూ.10 ముఖ విలువ కలిగిన 2.41 కోట్ల షేర్లను జారీ చేస్తోంది. ఒక్కో షేరు ధరను రూ.426-428 ప్రైస్ బ్యాండ్‌గా నిర్ణరుుంచింది. షేర్‌హోల్డర్ల వాటాతో కలుపుకుని మొత్తం 30 శాతం వాటాను విక్రరుుస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఫ్రెష్ ఈక్విటీ ద్వారా రూ.300 కోట్లను సమీకరిస్తోంది. దీనితో కలుపుకుని మొత్తంగా ఐపీవో ద్వారా రూ.1,331 కోట్లను సమీకరిస్తోంది. సేకరించిన నిధులను రుణాల చెల్లింపులు, విస్తరణకు వినియోగించనున్నట్టు కంపెనీ తెలిపింది. కోటక్ మహీంద్రా క్యాపిటల్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్, జెఫరీస్ ఇండియా, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారుు.