
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ కంపెనీ లారస్ ల్యాబ్స్‌కు చెందిన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ 1, 3 యూనిట్స్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ ఎస్టాబ్లిష్‌మెంట్ ఇన్‌స్పెక్షన్ రిపోర్ట్ జారీ చేసింది. ఏపీలోని విశాఖపట్నం వద్ద ఉన్న ఈ రెండు యూనిట్లను ఎఫ్‌డీఏ బృందం జూన్ నెలలో తనిఖీ చేపట్టింది. గ్లోబల్ ఫండ్ ఎక్స్‌పర్ట్ రివ్యూ ప్యానెల్ అనుమతి సైతం దక్కించుకున్నట్టు కంపెనీ వెల్లడించింది. గ్లోబల్ ఫండ్ నిధులు సమకూరుస్తున్న ప్రాజెక్టులకు ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్‌లో టీఎల్‌ఈ 400 అనే ఔషధాన్ని సరఫరా చేస్తారు. యాంటీ రెట్రో వైరల్ థెరపీ విభాగంలో ఈ ఔషధం సరఫరాకై గ్లోబల్ ఫండ్ ఆమోదం లభించిన మూడు కంపెనీల్లో లారస్ ఒకటి. హెచ్‌ఐవీ/ఎయిడ్స్ చికిత్సకు ఈ మందును వాడతారు.