
ఢిల్లీ: డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత దూకుడు పెంచారు. ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని ఆచరణలో పెట్టే పనిలో పడ్డారు. ఇదే సమయంలో భారత్‌పై కూడా సుంకాలు విధించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.
అమెరికా ప్రపంచ దేశాలపై సుంకాల యుద్ధం ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ దేశంలో పర్యటిస్తున్న సమయంలోనే.. టారిఫ్‌లు తగ్గించేది లేదంటూ ట్రంప్ స్పష్టం చేశారు. మనదేశ ఎగుమతులు, దిగుమతుల్లో అత్యధిక వాటా అమెరికాదే. ప్రత్యేకించి ఎగుమతులనే తీసుకుంటే.. మన ఐటీ ఎగుమతులకు, ఫార్మా రంగానికి అమెరికా అతిపెద్ద మార్కెట్. మనదేశ మొత్తం ఎగుమతుల్లో సుమారు 18 శాతం అమెరికాకే వెళ్తున్నాయి. 2021-24 మధ్య కాలంలో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకునే చర్యల వల్ల భారతదేశంపై ఎంత ప్రభావం పడుతుందనేది ఆసక్తికరమైన విషయంగా మారింది.
ట్రంప్ టారిఫ్‌లు ఎందుకు విధిస్తున్నట్లు?
విదేశాల నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే వస్తువులపై ప్రతి దేశమూ పన్నులు/సుంకాలు (టారిఫ్/కస్టమ్స్ సుంకం) విధిస్తుంది. ఇది దేశీయ ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించడం, ఉద్యోగ సృష్టి మరియు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం కోసం చేస్తుంటారు. ప్రతీకార సుంకం అంటే, అమెరికా నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై ఇతర దేశాలు ఎంత టారిఫ్ విధిస్తే, అదే రకమైన వస్తువులపై అమెరికా కూడా టారిఫ్‌లు విధిస్తుంది.
ఇక, 2023-24లో భారతదేశంతో కూడా అమెరికాకు 35.31 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉంది. భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై అమెరికా విధించే సగటు టారిఫ్ రేటు 3.3% అయితే, అమెరికా నుంచి భారతదేశానికి దిగుమతి అయ్యే వస్తువులపై భారత్ విధించే సగటు టారిఫ్ రేటు 17% ఉంది. ఈ వ్యత్యాసం కారణంగా ట్రంప్ ఇప్పుడు టారిఫ్‌లను పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు.
ప్రపంచ వాణిజ్య సంస్థ గణాంకాల ప్రకారం అమెరికా ఈ కింది దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తోంది.
డెయిరీ ఉత్పత్తులు: 188%,
పండ్లు మరియు కూరగాయలు: 132%,
తృణ ధాన్యాలు: 193%,
నూనెగింజలు, కొవ్వులు, నూనెలు: 164%,
పానీయాలు మరియు పొగాకు: 150%,
కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు: 53%,
చేపల ఉత్పత్తులు, రసాయనాలు: 35% నుంచి 56%.
Comments
Please login to add a commentAdd a comment