tariff plans
-
భారత్‌కు ట్రంప్ దెబ్బ.. ఐటీ, ఫార్మాకు బిగ్ షాక్!
ఢిల్లీ: డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత దూకుడు పెంచారు. ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని ఆచరణలో పెట్టే పనిలో పడ్డారు. ఇదే సమయంలో భారత్‌పై కూడా సుంకాలు విధించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.అమెరికా ప్రపంచ దేశాలపై సుంకాల యుద్ధం ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ దేశంలో పర్యటిస్తున్న సమయంలోనే.. టారిఫ్‌లు తగ్గించేది లేదంటూ ట్రంప్ స్పష్టం చేశారు. మనదేశ ఎగుమతులు, దిగుమతుల్లో అత్యధిక వాటా అమెరికాదే. ప్రత్యేకించి ఎగుమతులనే తీసుకుంటే.. మన ఐటీ ఎగుమతులకు, ఫార్మా రంగానికి అమెరికా అతిపెద్ద మార్కెట్. మనదేశ మొత్తం ఎగుమతుల్లో సుమారు 18 శాతం అమెరికాకే వెళ్తున్నాయి. 2021-24 మధ్య కాలంలో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకునే చర్యల వల్ల భారతదేశంపై ఎంత ప్రభావం పడుతుందనేది ఆసక్తికరమైన విషయంగా మారింది.ట్రంప్ టారిఫ్‌లు ఎందుకు విధిస్తున్నట్లు?విదేశాల నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే వస్తువులపై ప్రతి దేశమూ పన్నులు/సుంకాలు (టారిఫ్/కస్టమ్స్ సుంకం) విధిస్తుంది. ఇది దేశీయ ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించడం, ఉద్యోగ సృష్టి మరియు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం కోసం చేస్తుంటారు. ప్రతీకార సుంకం అంటే, అమెరికా నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై ఇతర దేశాలు ఎంత టారిఫ్ విధిస్తే, అదే రకమైన వస్తువులపై అమెరికా కూడా టారిఫ్‌లు విధిస్తుంది.ఇక, 2023-24లో భారతదేశంతో కూడా అమెరికాకు 35.31 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉంది. భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై అమెరికా విధించే సగటు టారిఫ్ రేటు 3.3% అయితే, అమెరికా నుంచి భారతదేశానికి దిగుమతి అయ్యే వస్తువులపై భారత్ విధించే సగటు టారిఫ్ రేటు 17% ఉంది. ఈ వ్యత్యాసం కారణంగా ట్రంప్ ఇప్పుడు టారిఫ్‌లను పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు.ప్రపంచ వాణిజ్య సంస్థ గణాంకాల ప్రకారం అమెరికా ఈ కింది దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తోంది. డెయిరీ ఉత్పత్తులు: 188%, పండ్లు మరియు కూరగాయలు: 132%, తృణ ధాన్యాలు: 193%, నూనెగింజలు, కొవ్వులు, నూనెలు: 164%, పానీయాలు మరియు పొగాకు: 150%, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు: 53%, చేపల ఉత్పత్తులు, రసాయనాలు: 35% నుంచి 56%. -
అన్నంత పనిచేసిన ట్రంప్.. ఒకేసారి
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) అన్నంత పని చేస్తున్నారు. ఒక్కో దేశంపై వరుస పెట్టి సుంకాల మోత మోగించేస్తున్నారు. తాజాగా, అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి తెరతీసేలా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతయ్యే స్టీల్, అల్యూమినియంపై 25శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు.ఆదివారం ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘మంగళవారం లోపు పరస్పర సుంకాల (reciprocal tariffs) విధింపుపై ప్రకటన చేస్తాం. ఇది వెంటనే అమల్లోకి వస్తుంది’ అని స్పష్టం చేశారు. అయితే, ఈ పరస్పర సుంకాల విధింపుల లక్ష్యం ఏంటో స్పష్టత ఇవ్వలేదు. తాను విధించబోయే పరస్పర సుంకాలు విదేశీ సుంకాలకు అనుగుణంగా ఉంటాయని చెప్పారు. ఇది అన్నీ దేశాలకు వర్తిస్తుందని అన్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మా నుంచి వసూలు చేస్తే.. మేము వారి నుంచి వసూలు చేస్తాం’ అని వ్యాఖ్యానించారు.తొలిసారి ఎంత విధించారంటే?తొలిసారి 2016-2020వరకు అమెరికా అధ్యక్షుడిగా విధులు నిర్వహించిన ట్రంప్ స్టీల్‌పై 25శాతం, 10శాతం అల్యూమినియంపై టారిఫ్ విధించారు. అదే సమయంలో కెనడా, మెక్సికో, బ్రెజిల్‌తో సహా వ్యాపార భాగస్వాములకు పన్ను రహిత(డ్యూటీ ఫ్రీ) లావాదేవీలు జరిగేలా చూశారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ డ్యూటీ ఫ్రీ వ్యాపార కార్యకలాపాల్ని బ్రిటన్, జపాన్, యూరోపియన్ యూనియన్లకు విస్తరించారు. కెనడా,మెక్సికోకు దెబ్బఅమెరికా అధికారిక గణాంకాల ప్రకారం.. ట్రంప్ విధించబోయే 25శాతం సుంకం ప్రభావం కెనడా, బ్రెజిల్, మెక్సికో వాణిజ్య రంగంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు సౌత్ కొరియా, వియాత్నంలు సైతం భారీ సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కెనడా నుంచి 79శాతం అల్యూమినియం అమెరికాకు ఎగుమతి అవుతుంది. 2024 మొదటి 11 నెలల్లో అమెరికాకు 79 శాతం ఎగుమతి చేసింది. కెనడా తర్వాత అల్యూమినియం స్క్రాప్, అల్యూమినియం మిశ్రమం ప్రధాన సరఫరాదారుగా మెక్సికో కొనసాగుతుంది. ఈ తరుణంలో ట్రంప్ నిర్ణయాలు ఆయా దేశాల వాణిజ్య విభాగంలో ఆటు పోట్లు ఎదురు కానున్నాయి. -
మళ్లీ మొబైల్ టారిఫ్‌లు పెంపు..?
దేశంలోని టెలికం ఆపరేటర్లు డిజిటల్ మౌలిక వసతుల్లో చేసిన భారీ పెట్టుబడుల ప్రయోజనాన్ని పొందాలంటే పన్నుల తగ్గింపు, టారిఫ్‌ల పెంపు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తదుపరి తరం 5జీ సేవల కవరేజీని విస్తరించేందుకు ప్రైవేట్ ఆపరేటర్లు టెలికం మౌలిక సదుపాయాలు, రేడియోవేవ్స్ కోసం 2024లో సుమారు రూ.70,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. అయితే 18 కోట్ల 2జీ కస్టమర్లను కనెక్ట్ చేయడం, సమ్మిళిత వృద్ధి కోసం 4జీకి మళ్లేలా వారిని ప్రోత్సహించడం సవాలుగా మారింది.‘టెలికం రంగంలో పన్నులను హేతుబద్ధీకరించాలి. భారత్‌లోనే పన్నులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే టారిఫ్‌లు అత్యల్పంగా ఉన్నాయి. అధిక వినియోగ కస్టమర్లు ఎక్కువ చెల్లించడం, ఎంట్రీ లెవల్ డేటా వినియోగదారులు తక్కువ చెల్లించేలా మార్పులు రావొచ్చు. టెలికం సంస్థలు చేసిన పెట్టుబడులు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నాయి. దీని ద్వారా స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ మొత్తం లాభపడింది. పన్నుల హేతుబద్ధీకరణ, టారిఫ్‌ల పెంపు ద్వారా పెట్టుబడులపై రాబడిని పొందే సమయం ఆసన్నమైంది’ అని ఈవై ఇండియా మార్కెట్స్, టెలికం లీడర్ ప్రశాంత్ సింఘాల్ అన్నారు. ఏఆర్పీయూ రూ.300 స్థాయికి..భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు ఒక్కో వినియోగదారు నుంచి సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) రూ.300 స్థాయికి పెంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాయి. గతేడాది జులైలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల పెంపు తర్వాత వొడాఫోన్ ఐడియా ఏఆర్పీయూ ఏప్రిల్–జూన్‌లో రూ.154 నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో 7.8 శాతం పెరిగి రూ.166కి చేరుకుంది. భారతీ ఎయిర్టెల్ రూ.211 నుంచి 10.4 శాతం వృద్ధితో రూ.233కి, రిలయన్స్ జియో రూ.181.7 నుంచి రూ.195.1కి దూసుకెళ్లింది. అయితే టారిఫ్‌ల పెంపు ఈ సంస్థలకు షాక్ తగిలింది. దాదాపు 2 కోట్ల మంది సబ్స్క్రైబర్లు తమ కనెక్షన్లను వదులుకున్నారు. 10–26 శాతం ధరల పెంపు కారణంగా రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంయుక్తంగా 2.6 కోట్ల మంది వినియోగదారులను కోల్పోయాయి.మౌలికంలో పెట్టుబడులు..మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం భారతీ ఎయిర్టెల్ అక్టోబర్‌లో పట్టణ ప్రాంతాల్లో సబ్‌స్క్రైబర్స్‌ను కోల్పోగా, గ్రామీణ ప్రాంతాల్లో నికరంగా భారీ స్థాయిలో జోడించింది. రిలయన్స్ జియో మెట్రోలు, ప్రధాన సర్కిల్స్‌లో చందాదారులను పొందింది. చిన్న సర్కిల్స్‌లో కస్టమర్లను కోల్పోయింది. వొడాఫోన్ ఐడియా నుంచి అక్టోబర్‌లో భారీగా వినియోగదార్లు దూరమయ్యారు. 5జీ పర్యావరణ వ్యవస్థకు మద్దతుగా టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం 2022–2027 మధ్య రూ.92,100 కోట్ల నుంచి రూ.1.41 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు చేయనున్నట్టు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ (డీఐపీఏ) డైరెక్టర్ జనరల్ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. భారతీ ఎయిర్టెల్ రెండో త్రైమాసిక పనితీరుపై జేఎం ఫైనాన్షియల్ రిపోర్ట్ ప్రకారం టారిఫ్ పెంపులు మరింత తరచుగా జరిగే అవకాశం ఉంది. 5జీలో భారీ పెట్టుబడులు, ఐపీవోకు వచ్చే అవకాశం ఉన్నందున జియోకు అధిక ఏఆర్పీయూ అవసరం.ఇదీ చదవండి: గూగుల్ పే, ఫోన్‌పేకి ఎన్పీసీఐ ఊరటబీఎస్ఎన్ఎల్కు మార్పుధరల పెంపుదలకు దూరంగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్కు దాదాపు 68 లక్షల మంది కస్టమర్లు కొత్తగా వచ్చి చేరారు. నష్టాల్లో ఉన్న ఈ సంస్థ ఇప్పటికీ పాత తరం 3జీ సేవలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 4జీ సేవలను పరిచయం చేసేందుకు కసరత్తు చేస్తోంది. భారతీ ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లో సబ్‌స్క్రైబర్ వృద్ధి ఈ రంగానికి కొంత ఆశను కలిగించింది. సేవలను అందించడంలో బీఎస్ఎన్ఎల్ అసమర్థత ఈ వృద్ధికి కారణంగా కొంతమంది విశ్లేషకులు పేర్కొన్నారు. భారతీ ఎయిర్టెల్ అక్టోబర్‌లో వైర్లెస్ విభాగంలో 19.28 లక్షల మంది వినియోగదారులను జోడించింది. క్రియాశీల చందాదారులు దా దాపు 27.23 లక్షలు అధికం అయ్యారు. వొడాఫోన్ ఐడియా 19.77 లక్షల వైర్లెస్ సబ్స్క్రైబర్లను కోల్పోయింది. యాక్టివ్ సబ్స్రైబర్ బేస్ దాదాపు 7.23 లక్షలు తగ్గింది. రిలయన్స్ జియో వైర్లెస్ కస్టమర్ల సంఖ్య అక్టోబర్‌లో మొత్తం 46 కోట్లకు వచ్చి చేరింది. సెప్టెంబర్‌లో ఈ సంఖ్య 46.37 కోట్లు నమోదైంది. క్రియాశీల వినియోగదారుల సంఖ్య బలపడింది. -
అదిరిపోయే ప్లాన్లతో వినియోగదారునికి ఊరట..
-
దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు రిలయన్స్ సిద్ధం..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. టెలికాం విభాగంలో సేవలందిస్తున్న జియోను పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు తెచ్చే ప్రతిపాదనలున్నట్లు కొన్ని మీడియా సంస్థల కథనాల ద్వారా తెలిసింది. మార్కెట్ అనుకునేలా జియో ఐపీఓకు వస్తే దేశంలో మునుపెన్నడూ లేనివిధంగా రూ.55,000 కోట్ల నిధులు సమీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. అది దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా రికార్డు నెలకొల్పనుంది.రిలయన్స్ జియో ఇటీవల మొబైల్ టారిఫ్‌లను పెంచింది. దాంతో టెలికాం రంగంలో సేవలందిస్తున్న ఎయిర్టెల్, వొడాఫోన్ఐడియా వంటి ఇతర కంపెనీలు జియో పంథానే ఎంచుకున్నాయి. అవి కూడా టారిఫ్‌లను పెంచాయి. దాంతో వినియోగదారుల నుంచి కొంత విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఇలా ఐపీఓ వార్తలు రావడం గమనార్హం. వచ్చే ఏడాది ప్రారంభంలో జియో ఐపీఓ రావొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు జియో 4జీ టారిఫ్‌లతోనే 5జీ సేవలు అందిస్తుండగా, ఇకపై 5జీకి ప్రత్యేక టారిఫ్ నిర్ణయించే అవకాశం ఉందని చెబుతున్నాయి.జులై నెలలో మొదటి త్రైమాసిక ఫలితాలు వెలువడే అవకాశం ఉండడంతో ఆగస్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) వార్షిక సాధారణ సమావేశాన్ని (ఏజీఎమ్) నిర్వహిస్తుంది. ఇందులో జియో ఐపీఓకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ ఊహిస్తున్న విధంగా జియో ఐపీఓ ద్వారా రూ.55 వేలకోట్లు సమీకరించానుకుంటే దేశంలో అతిపెద్ద ఐపీఓగా నిలువనుంది. ఇప్పటివరకు రూ.21 వేలకోట్లు సమీకరించి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఐపీఓనే అతిపెద్దదిగా ఉంది. జియో మొత్తం విలువ దాదాపు రూ.11 లక్షల కోట్లుగా అంచనా. పెద్ద కంపెనీ ఐపీఓకు వస్తే అందులో సుమారు 5 శాతం విక్రయించాల్సి ఉంటుంది. కాబట్టి దాని విలువ రూ.55 వేలకోట్లుగా లెక్కిస్తున్నారు.ఇదీ చదవండి: గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్.. మంత్రి ప్రకటనఇటీవల పెంచిన టారిఫ్‌లతో కంపెనీ సగటు వినియోగదారు ఆదాయం (ఆర్పు) పెరుగుతుందని మార్కెట్ అంచనా వేస్తుంది. 5జీకు ప్రత్యేకంగా టారిఫ్‌లు తీసుకురావడంతో మరింత ఆదాయం సమకూరుతుంది. దాంతో కంపెనీ రెవెన్యూలో పెరుగుదల ఉంటుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఫలితంగా కంపెనీ షేర్లను కొనుగోలు చేస్తున్నారు. కేవలం గడిచిన నెల రోజుల్లో స్టాక్ ధర ఏకంగా 11.4 శాతం పెరిగింది. -
కీలక టారిఫ్‌లను తొలగించనున్న జియో, ఎయిర్టెల్?
ఖర్చులను తట్టుకోవడానికి టెలికం రంగ సంస్థలు టారిఫ్‌లను పెంచడానికి రెడీ అవుతున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ ప్రీమియం కస్టమర్లకు ప్రస్తుతం అందించే తమ అన్లిమిటెడ్ 5జీ డేటా ప్లాన్లను ఆపేసే అవకాశం ఉంది. ఆదాయం పెంపునకు 2024 జూన్ నుంచి 4జీతో పోలిస్తే 5జీ సేవలకు కనీసం 5-10శాతం ఎక్కువ ఛార్జీ విధించవచ్చని టెలికం రంగ నిపుణులు చెబుతున్నారు. టెలికం కంపెనీలు 5జీ సేవల కోసం భారీగా ఇన్వెస్ట్ చేశాయి. ఈ ఖర్చును రాబట్టుకోవడానికి 2024 సెప్టెంబర్ క్వార్టర్లో రెండు టెలికాం ఆపరేటర్లు మొబైల్ టారిఫ్‌లను కనీసం 10శాతం పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం. కస్టమర్లను 5జీకి అలవాటు చేయడానికి, ఇప్పటికే ఉన్న వినియోగదారులను ఆకర్షించడానికి ఈ రెండు కంపెనీలు 5జీ అన్లిమిటెడ్ డేటా ఆఫర్లతో పాటు 4జీ ధరలకే 5జీ సేవలను అందిస్తున్నాయి. జనం 5జీకి అలవాటు పడటం మొదలైనందున కంపెనీలు మానిటైజేషన్‌పై దృష్టిసారించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు సంస్థలు కొన్ని నెలల్లో 5జీ- కోసం ప్లాన్లను ప్రకటించవచ్చని జెఫ్రీస్ ఒక రీసెర్చ్ నోట్లో తెలిపింది. ఎయిర్టెల్, జియో 5జీ రేట్లు 4జీ కంటే 5-10శాతం ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. ఇటువంటి ప్లాన్లకు 30-40శాతం అదనపు డేటాను జోడించి మార్కెట్ షేరును పెంచుకొని, లాభాలు పొందవచ్చని తెలిసింది. ఇదీ చదవండి: రోజూ రూ.3 కోట్లు మాయం! ఎలా మోసం చేస్తున్నారంటే.. తగిన సమయంలో ఛార్జీలు పెంచడానికి వెనకాడబోమని గతంలో ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ అన్నారు. ప్రతి కస్టమర్ నుంచి వచ్చే నెలవారీ సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) ప్రస్తుతం ఉన్న రూ.200 నుంచి దాదాపు రూ.250కి పెంచుకుంటామని ప్రకటించారు. జియో, ఎయిర్‌టెల్‌కు కలిపి ఇప్పటికే 12.5 కోట్ల మంది 5జీ యూజర్లు ఉన్నారు. దేశం మొత్తం 5జీ యూజర్ బేస్ 2024 చివరి నాటికి 20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. -
12 ఓటీటీలు అందించే జియో కొత్త ప్లాన్ ఇదే..
ప్రముఖ టెలికామ్ దిగ్గజం 'రిలయన్స్ జియో' (Reliance Jio) ఇటీవల తన సబ్స్క్రైబర్ల కోసం కొత్త ప్లాన్ తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా రూ.148 చెల్లించి ఏకంగా 12 ఓటీటీలను పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వీడియో స్ట్రీమింగ్ యాప్‌లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో టెలికాం సంస్థలు అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొస్తున్నాయి. ఇటీవల రిలయన్స్ జియో రూ.148తో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా 12 ఓటీటీలు లభిస్తున్నాయి. జియో రూ.148 ప్లాన్ కేవలం డేటా ప్యాక్ మాత్రమే. వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు ఉండవు. 10 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులు. దీన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే కచ్చితంగా బేస్ ప్లాన్ ఉండాల్సిందే. జియో సినిమా ప్రీమియం కూపన్ మైజియో అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. దీన్ని ఉపయోగించి ఆ ఓటీటీని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: అకౌంట్లో మినిమం బ్యాలెన్స్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు 12 ఓటీటీలు ఇవే.. జియోసినిమా ప్రీమియం జీ5 సోనీలివ్ లయన్స్‌గేట్ ప్లే డిస్కవరీ+ సన్‌నెక్ట్స్ డాక్యుబే హోఇచోయ్ ప్లానెట్ మరాఠీ చౌపాల్ ఎపిక్ఆన్ కంచ లంక -
Bharti Airtel: ఈ ఏడాది మధ్యలో టారిఫ్‌ల పెంపు
బార్సెలోనా: ఈమధ్యే పలు దఫాలుగా ప్లాన్ల టారిఫ్‌లను పెంచిన టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్ మరో విడత వడ్డింపునకు సిద్ధమవుతోంది. పెట్టుబడులపై రాబడులు అత్యంత తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది మధ్యలో టారిఫ్‌లను పెంచే అవకాశం ఉందని కంపెనీ చైర్మన్ సునీల్ మిట్టల్ తెలిపారు. దీనివల్ల అట్టడుగున ఉన్నవారిపై పడే ప్రభావంపై స్పందిస్తూ.. ప్రజలు మిగతా వాటిపై చేసే ఖర్చులతో పోలిస్తే పెంపు చాలా స్వల్పమే ఉంటుందని పేర్కొన్నారు. ‘ఒక్కటి తప్ప.. అన్నీ పెరిగాయి. జీతాలు .. అద్దెలు పెరిగాయి. ఎవరూ ఫిర్యాదు చేయడం లేదు. ప్రజలు 30 జీబీ డేటాను దాదాపు ఏమీ కట్టకుండానే వినియోగిస్తున్నారు. దేశంలో మరో వొడాఫోన్ తరహా పరిస్థితి తలెత్తకూడదు. మనకు ఒక భారీ టెలికం సంస్థ అవసరం‘ అని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా మిట్టల్ చెప్పారు. కోటి మందికి ఎయిర్టెల్ 5జీ టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ కోటి మంది 5జీ చందాదార్లను సొంతం చేసుకుంది. 2024 మార్చి నాటికి దేశంలోని ప్రతి పట్టణం, ప్రధాన గ్రామీణ ప్రాంతాల్లో 5జీ సేవలను చేర్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో అడుగుపెట్టినట్టు తెలిపింది. ప్రపంచ స్థాయి 5జీ ప్లస్ అనుభూతిని అందించడానికి సరైన మార్గంలో ఉన్నట్టు విశ్వసిస్తున్నామని సంస్థ సీటీవో రన్‌దీప్ సిఖోన్ తెలిపారు. 2022 నవంబర్‌లో 10 లక్షల మంది కస్టమర్లు కంపెనీ 5జీ వేదికపైకి వచ్చారు. వాణిజ్య పరంగా సేవలు ప్రారంభించిన 30 రోజుల్లోనే ఈ ఘనతను సాధించామని ఎయిర్టెల్ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్టెల్ రిటైల్ స్టోర్లను 5జీ ఎక్స్‌పీరియెన్స్ జోన్స్‌గా తీర్చిదిద్దామని కంపెనీ వివరించింది. -
28 రోజుల మొబైల్ రీఛార్జ్ ప్లాన్ వెనక మతలబు ఇదే!
సాక్షి,ముంబై: సాధారణంగా ఏ మొబైల్ ఫోన్ రీచార్జ్ చేసుకోవాలన్నా 28రోజుల వాలిడిటీ ఉంటుంది గమనించారా? నెలలో 30, 31 రోజులుంటే టెలికాం కంపెనీలు లెక్క మాత్రం 28 రోజులే. అలాగే 56 లేదా 84 రోజులు మాత్రమే ఎందుకు? ఉంటాయి. దీనికి వెనుక బిజినెస్ ప్లాన్‌గురించి ఒకసారి ఆలోచిస్తే.. కస్టమర్లు సంవత్సరానికి 12 నెలలకు 12 సార్లకు బదులుగా 13 సార్లు రీఛార్జ్ చేసు కోవాలనేది ఎపుడైనా గుర్తించారా? అదే కంపెనీ దోపిడీ మంత్ర. ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఇలా ఆయా కంపెనీల ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్‌లో అనేక రకాల ప్లాన్లను అందిస్తాయి. ఈ రకమైన ప్లాన్ కారణంగా వినియోగదారులు సంవత్సరానికి 12 రీఛార్జ్‌లకు బదులుగా 13 రీఛార్జ్‌లు చేయాల్సి ఉంటుంది. 28 రోజుల ప్లాన్ కారణంగా 30 రోజులు ఉన్న నెలలో 2 రోజులు మిగిలిపోతాయి. నెలలో 31 రోజులు ఉంటే 3 రోజులు మిగిలి పోతాయి. (పీకల్లోతు మునిగిన వొడాఫోన్ ఐడియా: కస్టమర్లకు బ్యాడ్ న్యూస్) ఫిబ్రవరి నెల 28/29 రోజులు మాత్రమే ఆ సంవత్సరం మరికొన్ని రోజులు అదనంగా మిగులుతాయి. దీని కారణంగా మీరు అదనపు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కంపెనీలు ప్రతి సంవత్సరం గరిష్టంగా ఒక నెల రీఛార్జ్ ప్రయోజనాన్ని కంపెనీలు దండుకుంటున్నాయి. అయితే ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం 30 రోజుల ప్లాన్ ఇప్పటికీ అందిస్తోంది. (డ్రోన్ కెమెరా ఆర్డర్ చేస్తే...ప్యాకేజీ చూసి కస్టమర్ షాక్!) ట్రాయ్ కీలక ఆదేశాలు వినియోగదారుల ఫిర్యాదుమేరకు 28 రోజుల ప్రణాళికను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తప్పుబట్టింది. 28 రోజులకు బదులు 30 రోజుల ప్లాన్ ఇవ్వాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్ మార్గదర్శకం జారీ చేసింది.దీని ప్రకారం నెల చెల్లుబాటయ్యేలా జియో రూ. 259 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అలాగే ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాకూడా మొత్తంగా కాకగాపోయినా కొన్ని ప్లాన్లను లాచ్ చేసింది. -
4జీ చార్జీలకే 5జీ సేవలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్తతరం సాంకేతిక పరిజ్ఞానం అయిన 5జీ సేవలను నేడో రేపో ప్రారంభించేందుకు భారత టెలికం కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. స్పెక్ట్రం అందుకున్న కంపెనీలు ఒకవైపు.. 5జీ హ్యాండ్‌సెట్స్‌తో 5 కోట్ల మంది కస్టమర్లు మరోవైపు. అయితే అందరి చూపూ చార్జీలు ఎలా ఉండబోతున్నాయనే. టెలికం కంపెనీల నుంచి అందుతున్న సమాచారం మేరకు 4జీ రేటుకే 5జీ సేవలను అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక్కో కస్టమర్ నుంచి సమకూరే ఆదాయాన్ని పెంచుకోవాలని కొన్నేళ్లుగా టెలికం సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. కొత్త టెక్నాలజీ కోసం కోట్లాది రూపాయలు వెచ్చించిన ఈ సంస్థలు అందుకు తగ్గ ప్రణాళికనూ రెడీ చేసుకున్నాయి. ఆరు నెలల తర్వాతే.. ముందుగా 4జీ టారిఫ్‌లోనే 5జీ సేవలను ప్రయోగాత్మకంగా అందించే అవకాశం ఉందని దిగ్గజ టెలికం కంపెనీ ప్రతినిధి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘కొత్త టెక్నాలజీపట్ల కస్టమర్ అనుభూతి చెందాలి. 5జీ ప్రయోజనాలు అందుకోవాలి. అంత వరకు రేట్ల సవరణ ఉండకపోవచ్చు. ఆరు నెలల తర్వాతే క్రమంగా కొత్త చార్జీలు అమలులోకి వచ్చే చాన్స్ ఉంది. నెట్వర్క్ స్లైసింగ్ విధానంలో ఒక్కో వినియోగదారుడు కోరుకున్న వేగాన్ని 5జీలో అందించే వీలుంది. నెట్వర్క్ అప్‌గ్రేడ్ కారణంగా అటు 4జీ సేవల నాణ్యతా పెరుగుతుంది’ అని వివరించారు. 2022 మే 31 నాటికి దేశవ్యాప్తంగా 79.47 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్ వినియోగదార్లు ఉన్నారు. వీరిలో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు 76.55 కోట్లు. సగటున ఒక్కో కస్టమర్ నుంచి టెలికం కంపెనీకి సమకూరుతున్న ఆదాయం రూ.200లోపే ఉంటోంది. దీనిని రూ.300–350కి చేర్చాలన్నది కంపెనీల లక్ష్యం. 2021 నవంబర్–డిసెంబర్లో చార్జీలు 20–25 శాతం పెరిగాయి. కంపెనీలకు స్పెక్ట్రం భారం.. టెలికం కంపెనీలు 5జీ స్పెక్ట్రం కోసం భారీగానే ఖర్చు చేశాయి. రిలయన్స్ జియో ఏకంగా రూ.88,078 కోట్లు, భారతీ ఎయిర్టెల్ రూ.43,084 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.18,799 కోట్ల విలువైన స్పెక్ట్రంను కొనుగోలు చేశాయి. ఒక్క 700 మెగాహెట్జ్ బ్యాండ్‌లో 10 మెగాహెట్జ్ స్పెక్ట్రం కోసం జియో ఏకంగా రూ.40,000 కోట్లు ఖర్చు చేసిందంటే ఆశ్చర్యం వేయకమానదు. 700 మెగాహెట్జ్ బ్యాండ్‌లో కవరేజ్ మెరుగ్గా ఉంటుందని జియో అంటోంది. 5జీ సేవల్లో భాగంగా మూడు ప్రైవేట్ టెలికం సంస్థలు నెట్వర్క్ అప్‌గ్రేడ్, విస్తరణకు అయిదేళ్లలో రూ.1.43–1.59 లక్షల కోట్లు వెచ్చించే అవకాశం ఉందని ఓ కన్సల్టింగ్ కంపెనీ వెల్లడించింది. భారీగా ఖర్చులు ఉన్నందున ప్యాక్‌ల చార్జీలు పెంచక తప్పదు. అది కూడా ఆచితూచి వ్యవహరించాలన్నది కంపెనీల భావన. రెండేళ్లలో 15 కోట్లు.. ప్రస్తుతం దేశంలో 5 కోట్ల మంది వద్ద 5జీ హ్యాండ్సెట్స్ ఉన్నాయి. రెండేళ్లలో ఈ సంఖ్యను 15 కోట్లకు చేర్చాలన్నది టెలికం కంపెనీల లక్ష్యం. ఇందుకు అనుగుణంగా మొబైల్స్ తయారీ సంస్థలతో కలిసి బండిల్ ఆఫర్లను టెలికం సంస్థలు ప్రవేశపెట్టనున్నాయి. జియో రాకతో ఒక్కసారిగా దేశంలో 4జీ విప్లవం వచ్చింది. మూడు కంపెనీల గట్టి పోటీతో 5జీలోనూ అదే ఊపు ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. -
జియో యూజర్లకు భారీ షాక్!
దేశీయ టెలికాం కంపెనీలు ఈ ఏడాది టారిఫ్ ధరల్ని పెంచేందుకు ప్రయత్నాలు మమ్మరం చేస్తున్నాయి. అంతకంటే ముందే జియో తన యూజర్లకు భారీ షాకిచ్చింది. ప్రత్యేకంగా జియో ఫోన్ నెక్ట్స్ యూజర్లకు అందిస్తున్న మూడు రీఛార్జ్ ప్లాన్ల ధరల్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. జియో ఫోన్ నెక్ట్స్ ప్రీపెయిడ్ ప్రారంభ రీఛార్జ్ ప్లాన్లు గతంలో రూ.155, రూ.185, రూ.749 ఉండేవి. తాజాగా పై 3 ప్లాన్ల ధరల్ని 20శాతం పెంచింది. ఇప్పుడు ఆ ప్లాన్ ధరలు ఎలా ఉన్నాయంటే? రూ.155 రీఛార్జ్ ప్లాన్ కాస్తా రూ.186కి పెరిగింది. రూ.185 ప్లాన్ భారీగా రూ.222కి చేరింది. ఇక రూ.749 ప్లాన్ ప్రస్తుతం రూ.899తో అందుబాటులో ఉంది. ఈ మూడు ధరల్ని పెంచినట్లు జియో సైతం తన అధికారిక వెబ్ సైట్లో పేర్కొన్నట్లు పలు నివేదికలు తెలిపాయి. జియో ఫోన్ నెక్ట్స్ ప్లాన్లు రిలయన్స్ సంస్థ జియో ఫోన్ నెక్ట్స్ పేరుతో కొనుగోలు దారులకు బడ్జెట్ ధరలో ఫీచర్ ఫోన్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే జియో సంస్థ ఆ ఫోన్‌కు ప్రత్యేకమైన వివిధ టారిఫ్ ధరల్ని అందిస్తుంది. ఇప్పుడు ఆ ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పెరిగిన ప్లాన్స్‌తో అందించే బెన్ఫిట్స్ ఇవే జియో ఫోన్ నెక్ట్స్ యూజర్లకు అందిస్తున్న రూ.186 బేసిక్ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో ప్రతి రోజు 1జీబీ డేటాను అందిస్తుంది. వాయిస్ కాల్స్ తో పాటు 100ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు రూ.222ప్లాన్: 28 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌లో యూజర్లు ప్రతిరోజు ఇంటర్నెట్ స్పీడ్ 64కేబీపీఎస్‌తో 2జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. అదే విధంగా వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్లు సెండ్ చేసుకోవచ్చు. రూ.899 ప్లాన్: 336రోజుల వ్యాలిడిటీతో 24జీబీ డేటాను పొందవచ్చ. ఈ ప్లాన్ 28రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 2జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. వ్యాలిడిటీతో పూర్తయితే రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు 50 ఎస్ఎంఎస్లు, ఉచితంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. చదవండి👉ముఖేష్ అంబానీ స్కెచ్ మామూలుగా లేదుగా! ఇక ప్రత్యర్ధులకు చుక్కలే! -
యూజర్లకు భారీ షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్..!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) యూజర్లకు భారీ షాకిచ్చింది. లైఫ్‌టైమ్ ప్రీ-పెయిడ్ ప్లాన్స్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. లైఫ్‌టైమ్ ప్రీ పెయిడ్ ప్లాన్లను డిసెంబర్ 1నుంచి పూర్తిగా రద్దు చేయనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం లైఫ్ టైమ్ ప్రీపెయిడ్ ప్లాన్లలో కొనసాగుతున్న యూజర్లను వేరే ప్లాన్‌లోకి షిఫ్ట్ చేయనుంది. చదవండి: ఎలక్ట్రిక్ వాహనాల్లో సంచలనం..! ఒక్కసారి ఛార్జ్‌తో 1000 కిమీ ప్రయాణం..! లైఫ్ టైమ్ ప్లాన్‌తో ఏలాంటి సంబంధం లేకుండా యూజర్లు వారి బెనిఫిట్స్‌కు ఎలాంటి నష్టం కలిగించకుండా మరో ప్లాన్‌లోకి బదలాయించనుంది. లైఫ్ టైమ్ ప్లాన్లను 107 రూపాయల ప్లాన్‌లోకి మార్చనుంది. ఈ మార్పు ప్రక్రియ డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. అయితే యూజర్లకు రూ. 107 ప్లాన్‌లో ఉండే కొన్ని అదనపు ప్రయోజనాలు వర్తించవని తెలిపారు. రూ. 107 ప్లాన్‌కు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ లేదు. దీని కాల పరిమితి మూడు నెలలు మాత్రమే. ఇదిలా ఉండగా..బీఎస్ఎన్ఎల్ రూ. 2399 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీను 60 రోజులకు పెంచింది. దీంతో యూజర్లు 425 రోజుల వ్యాలిడిటీను పొందనున్నారు. చదవండి: ఎలక్ట్రిక్ కార్లు కాదు..కానీ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయ్..! -
విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపండి: మోదీ
న్యూఢిల్లీ: విద్యుత్ రంగంలో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలకు తగు పరిష్కారం చూపి, పనితీరు మెరుగు పరుచుకునేందుకు సాయపడాలని ప్రధాని మోదీ కోరారు. రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా విద్యుత్ పంపిణీ విధానం వేర్వేరుగా ఉండటం వంటి వాటిపై దృష్టి సారించాలన్నారు. విద్యుత్ రంగ సమస్యల పరిష్కారానికి తీసుకువచ్చిన టారిఫ్ విధానం, విద్యుత్(సవరణ)బిల్లు–2020లోని అంశాలపై సమీక్ష జరిపారు. విద్యుత్ వినియోగదారుకు సంతృప్తి కలిగించాల్సిన అవసరం ఉందన్న ప్రధాని..నిర్వహణ సామర్థ్యం పెంపు, ఆర్థిక సమృద్ధి సాధించాలన్నారు. డిస్కమ్ లు తమ పనితీరును ఎప్పటికప్పుడు వెల్లడించడం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు, చెల్లిస్తున్న రుసుములను బేరీజు వేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. నవీన, పునరుత్పాద ఇం ధన వనరుల వినియోగం వ్యవసాయ రంగంలో పెరగాలన్నారు. పూర్తిగా రూఫ్‌టాప్ సౌరశక్తి విని యోగించుకునేలా ప్రతి రాష్ట్రం కనీసం ఒక నగరా న్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. విద్యుత్ పరికరాలను దేశీయంగా తయారు చేసుకోవడంతో ఉద్యోగిత పెంపు వంటి ఉపయోగాలున్నాయన్నారు. -
అబ్బే! అంత భారం ఏం కాదు..
విద్యుత్ చార్జీల పెంపు.. సాధారణంగా పెంపు అంటే అన్ని వర్గాలపై భారం పడుతుంది. కానీ ప్రభుత్వ ప్రకటనను పూర్తిగా అర్థం చేసుకుంటే మాత్రం భారమనిపించదు. ప్రభుత్వం ప్రకటించిన కొత్త టారిఫ్‌తో కొన్ని వర్గాలకు స్వల్ప మొత్తంలో భారం పడనుండగా.. సామాన్యులకు, మధ్య తరగతి జీవులకు మాత్రం ఈ టారిఫ్ రిలీఫ్ ఇవ్వనుంది. ఒక ఇంటిలో గతంలో ఒకరు అద్దెకు ఉండి అధిక స్థాయిలో విద్యుత్ వినియోగిస్తే కొత్తగా అద్దెకు దిగిన వారు సైతం ఆ భారాన్ని మోయాల్సి ఉండేది. కానీ ఇప్పుడు కొత్త టారిఫ్‌తో ఆ దుస్థితి తప్పుతుంది. ఎంత మేరకు వాడితే అంత మేరకే బిల్లు చెల్లించేలా శ్లాబ్‌ను ప్రభుత్వం మార్చింది. అంతే కాదు గతంలో ఉన్న పద్ధతి ప్రకారం 100 హెచ్‌పీ దాటి విద్యుత్ వాడితే ఒక్కోయూనిట్‌కు రూ.475 వేసేవారు. కానీ ఇప్పుడు ఆ అదనపు ధర రూ.275కు తగ్గింది. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులకైతే కొత్త పద్ధతి వరమనే చెప్పాలి. ఒక్కో యూనిట్‌పైనా 20పైసలు భారం తగ్గనుంది. సాక్షి, శ్రీకాకుళం : రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు పనిచేస్తున్నా యి. ప్రజలకు మేలు చేస్తున్నా విమర్శించడమే పనిగా వెళ్తున్నాయి. కొత్త విద్యుత్ టారిఫ్‌తో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతున్నా అదేదో భారం మోపుతున్నట్టు గగ్గోలు పెడుతున్నాయి. విద్యుత్ సంస్థలను కాపాడుకునేందుకు ఉన్నతాదాయ వర్గాలపై కాసింత భారం వేస్తే దాన్ని భూతద్దంలో చూపిస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకా రం సామాన్య, మధ్య తరగతి వర్గాలపై భారం మోపకుండా విద్యుత్ కొత్త టారిఫ్‌ను వైఎస్ జగన్మోహన్రెడ్డి అమల్లోకి తెస్తున్నారు. 500యూనిట్లు దాటి వినియోగించే వారికి మాత్రమే కాసింత భారం పడేలా నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో 8లక్షల 35వేల 745సర్వీసులుండగా కేవలం 975 మందిపై మాత్రం భారం పడుతుంది. దీనివలన ఏటా రూ. 25లక్షల ఆదాయం విద్యుత్ సంస్థలకు సమకూరనుంది. భయం పటాపంచలు విద్యుత్ చార్జీలపై ఆ మధ్య ప్రజల నుంచి జిల్లా నియంత్రణ మండళ్లు వినతులు స్వీకరించాయి. అయినప్పటికీ విద్యుత్ చార్జీలు పెంచుతారేమోనని ప్రజలంతా భయపడ్డారు. వాస్త వంగా గృహ వినియోగ సర్వీసులపై కొంతమేర చార్జీలు పెంచాలని, అభివృద్ధి చార్జీలు తదితర వాటిపై ఈపీడీసీఎల్ నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. కానీ వైఎస్ జగన్ సర్కార్ 500 యూనిట్లు దాటి వినియోగించే ఉన్నతాదాయ వర్గాలపైనే కాసింత భారం పడేలా నిర్ణయం తీసుకున్నారు. 500 యూనిట్లకు పైన వినియోగించే వారిపై యూనిట్‌కు 90 పైసలు చొప్పున భారం పడనుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త టారిఫ్ అమల్లోకి రానుంది. బిల్లు భారం పడకుండా.. జిల్లాలో గృహ వినియోగ సర్వీసులు 8,35,745 ఉండగా వీటిలో ప్రతి నెలా 500 యూనిట్లు వాడే సర్వీసుల సంఖ్య 975 మాత్రమే ఉంది. మొత్తం గృహ వినియోగదారుల్లో 0.11శాతం మాత్రమే. వీరికి మాత్రమే కాసింత భారం పడుతుంది. సాధారణంగా గత ఆర్థిక సంవత్సరంలో వినియోగించిన విద్యుత్ ఆధారంగా టారిఫ్ వర్తిసుంది. ఎక్కువ యూనిట్లను వాడితే ఆ లెక్కన తర్వాత ఆర్థిక సంవత్సరంలో శ్లాబ్ ఉంటుంది. సాధారణంగా వేసవిలో విద్యుత్ వినియో గం ఎక్కువగా ఉంటుంది. ఏసీలు, ఫ్రిజ్‌లు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల వినియోగం పెరుగుతుంది. అదే వర్షాకాలం, శీతాకాలం వచ్చేసరికి వినియోగం తగ్గిపోతుంది. అయితే ఈ వ్యత్యాసాన్ని గమనించకుండా గత ప్రభుత్వం అడ్డగోలుగా టారిఫ్‌ను నిర్ణయించింది. ముందటి ఏడాది వినియోగం ప్రకారం ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి శ్లాబ్ నిర్ణయించడం జరిగేది. దీంతో ఏడా దంతా ఒకే పొడవునా శ్లాబ్ చార్జీలు భరించాల్సి ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేకుండా ఏ నెల ఎంత వినియోగిస్తే అంతమేరకు బిల్లింగ్ జరగనుంది. ఉదాహరణకు ఈ నెలలో వినియోగం 50 యూనిట్లలోపు ఉంటే దాని ప్రకారమే తదుపరి నెల బిల్లింగ్ జరుగుతుంది. నెల వారీగా బిల్లులు మారుతుంటాయి. ప్రభుత్వ సంస్థలకు ఉపశమనం ప్రభుత్వ పాఠశాలలకూ, వసతి గృహాలకూ విద్యుత్ చార్జీల్లో రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో యూనిట్‌కు రూ. 7.20చొప్పున వసూలు చేసేవారు. ఇకపై యూనిట్‌కు రూ. 7మాత్రమే వసూలు చేయనున్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ విద్యా సంస్థలకు కొంత ప్రయోజనం చేకూరనుంది. 20పైసలు మేర రాయితీ లభించనుంది. ఈ విధంగా దాదాపు 450 సంస్థలకు మేలు జరగనుంది. సామాన్యులకు మేలు ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తున్న కొత్త టారిఫ్‌తో సామాన్యులకు మేలు జరగనుంది. ముఖ్యంగా అద్దె ఇళ్లల్లో ఉన్న వారికి భారం తగ్గనుంది. ఇంతవరకు గత సంవత్సరం వినియోగించిన విద్యుత్ ఆధారంగా ఈ సంవత్సరం శ్లాబ్ నిర్ణయించేవారు. దీని వల్ల అద్దె ఇళ్లల్లో తరుచూ మారేవారు పెద్ద ఎత్తున భారాన్ని మోయాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. నెలలో ఎంత వినియోగిస్తే అంతే చార్జీలు పడనున్నాయి. 500 యూనిట్లు దాటి వినియోగిస్తే కాసింత భారం పడనుంది. ఈ రకమైన భారాన్ని మోసేవారి సంఖ్య ప్రతి నెల 975లోపే ఉంటుంది. – ఎన్.రమేష్, ట్రాన్స్‌కో ఎస్ఈ, శ్రీకాకుళం ప్రభుత్వ పాఠశాలలకు వరం ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్, వర్చువల్ తరగతుల నిర్వహణ, నాడు నేడు పథకంలో భాగంగా ప్రతి తరగతి గదికీ విద్యుత్ సౌకర్యాల్ని కల్పించడం, నిరంతరాయంగా రన్నింగ్ వాటర్‌ను మరుగుదొడ్లకు అందించాలని ప్రభుత్వం సంకల్పం చేసింది. దీంతో సహజంగా కరెంట్ బిల్లులు గతం కంటే భి న్నంగా అధికంగా వస్తాయి. కానీ అలా జరగకుండా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యుత్ మీటర్ల కేటగిరీలో మార్పులు చేసింది. ఇది ఎంతో మేలు చేసే నిర్ణయం. దీని ద్వారా ప్రభుత్వ బడులకు అయ్యే విద్యుత్ వ్యయం చాలా తగ్గనుంది. – శ్యాంకుమార్, ఖాజూరు, కవిటి మండలం ఇప్పుడు తగ్గుతుంది గతంలో మాకు అధిక మొత్తంలో శ్లాబ్‌రేటు పడేది. ప్రస్తుతం ఎన్ని యూనిట్లు వినియోగిస్తే అన్ని యూనిట్లకు విద్యుత్ బిల్లు కట్టాలని ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించడం ఆనందదాయకంగా ఉంది. విద్యుత్ వినియోగించాలంటే ఆచి తూచి వినియోగించేవాళ్లము. ఎందుకంటే శ్లాబ్ దాటితే యూనిట్ రేటు పెరిగిపోతుంది. ఇప్పుడు ఆ బాధ లేదు. ఎంత వినియోగిస్తే అంతే సొమ్ము చెల్లిస్తాం కాబట్టి మా పై విద్యు త్బిల్లుల భారం కాస్త తగ్గినట్టే. – గొరివిల్లి కృష్ణమూర్తి, పొన్నాంపేట, ఆమదాలవలస మండలం మిల్లర్లకు ఎంతో మేలు ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన విద్యుత్ టారిఫ్‌ల వల్ల రైస్‌మిల్లర్లకు ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పటి వరకూ 100 హెచ్‌పీ(ఎల్టీ) పరిధిలో ఉన్నాం. ఇప్పుడు దీన్ని 150 హెచ్‌పీ పరిధిలోనికి మార్చారు. దీని వల్ల మిల్లర్లు బాగా లాభ పడనున్నారు. ఈ విధంగా చేయమని గత చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం మా విన్నపాన్ని మన్నించి 100 నుంచి 150 హెచ్‌పీకి మార్చడం వల్ల ప్రయోజనం పొందుతున్నాం. 100 హెచ్‌పీ లోడ్ దాటితే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు నుంచి ఇతర ఖర్చులన్నీ మిల్లర్లమే భరించాల్సి వచ్చేది. రూ. 8 లక్షల వరకూ ఆర్థిక భారం పడేది. ఇప్పుడు దీన్ని 150 హెచ్‌పీకి మార్చడం వల్ల విద్యుత్ శాఖ ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు ఇతర సదుపాయాలు కల్పిస్తుంది. దీంతో మిల్లర్లకు ఆర్థిక భారం తగ్గుతుంది. అలాగే గతంలో 100 హెచ్‌పీ దాటితే అదనపు చార్జీలు చెల్లించాల్సి వచ్చేది. మిల్లు రన్ చేసినా చేయక పోయినా మినిమం రూ.30 వేలు కట్టేవారం. ఇప్పుడు 100 నుంచి 150 హెచ్‌పీకి పెంచడంతో హెచ్‌టీ బిల్లింగ్ విదానంలో ఫిక్స్డ్ చార్జీలు (కిలోవాట్‌కు రూ.475) చెల్లించే వాళ్లం ఇప్పుడు భారం తగ్గుతుంది. – తంగుడు జోగారావు, జిల్లా మిల్లర్ల సంఘం మాజీ అధ్యక్షుడు విభాగం విద్యుత్ ధర కేటగిరీ ఎ(గృహ) యూనిట్‌కి( రూ.ల్లో) 0–50యూనిట్లు 1.45 51–75యూనిట్లు 2.60 కేటగిరీ బి 0–100యూనిట్లు 2.60 101–200యూనిట్లు 3.60 201–225యూనిట్లు 6.90 కేటగిరీ సీ( గృహ) 0–50యూనిట్లు 2.65 51–100యూనిట్లు 3.35 101–200యూనిట్లు 5.40 201–300యూనిట్లు 7.10 301–400యూనిట్లు 7.95 401–500యూనిట్లు 8.50 500యూనిట్లు పైన 9.95 వాణిజ్యం 0–50యూనిట్లు 5.40 (55కేవీ వరకూ) 75కేవీ మేజర్ 0–50యూనిట్లు 6.90 51–100యూనిట్లు 7.65 101–300యూనిట్లు 9.05 301–500యూనిట్లు 9.60 500పైన యూనిట్లు 10.15 జిల్లాలో ఉన్న విద్యుత్ సర్వీసులు : 8,35,745 జిల్లాలో ఉన్న పాఠశాలల విద్యుత్ సర్వీసులు : 2705 ప్రభుత్వ వసతి గృహాలు : 315 ప్రభుత్వ ఆస్పత్రుల విద్యుత్ సర్వీసులు : 128 500 యూనిట్లు దాటే విద్యుత్ సర్వీసులు : 975 -
వినియోగదారులకు జియో షాక్ ఇస్తుందా?
సాక్షి,ముంబై : దేశంలో టెలికాం రంగంలో అతిపెద్ద సంచలనం రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వినియోగదారులకు షాక్ ఇవ్వనుందా? తాజా అంచనాలు ఈ అనుమానాలనే బలపరుస్తున్నాయి. డేటా, వాయిస్ కాలింగ్ సేవలను అతి చవకగా భారతీయ వినియోగదారులకు విరివిగా అందుబాటులోకి తీసుకొచ్చిన జియో త్వరలోనే ధరలను భారీగా పెంచనుంది. ఈ మేరకు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు విశ్లేషిస్తున్నాయి. త్వరలోనే జియో ధరలు పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జేపీ మోర్గాన్ తన తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ చెల్లింపులకు గానూ జియో వేలకోట్ల రూపాయల అవసరం ఉంది. దీంతో జియో తన టారిఫ్‌లను పెంచే యోచనలో ఉందని అంచనా వేసింది. దాదాపు 30 కోట్లకు పైగా కస్టమర్లు, విస్తారమైన నెట్వర్క్,1,75,000 టవర్లు కలిగి ఉన్న జియో తన నిర్వాహణ సామర్ధ్యం పెంచుకోడానికి, ఆపరేషనల్ వ్యయాలను తట్టుకోడం కోసం ప్రస్తుతం ఉన్న రేట్లను పెంచనుంది. రేట్లను సవరించి తద్వారా నిధులను సమీకరించుకోనుందని ప్రముఖ మార్కెట్ బ్రోకింగ్ సంస్థలు భావిస్తున్నాయి. మరోవైపు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు కూడా రానున్న కాలంలో టారిఫ్ ధరలను పెంచేందుకు సిద్ధపడుతున్ననేపథ్యంలో జియో ధరల వ్యూహాన్ని మార్చుకోనుందని కోటక్ సెక్యూరిటీస్ కూడా అంచనా వేస్తోంది. 2016లో టెలికాం రంగంలో జియో ఎంట్రీ ఒక సంచలనంగా మారింది. దాదాపు 306.7 మిలియన్ కస్టమర్లను సొంతం చేసుకున్న జియో 2019 నాలుగో క్వార్టర్ ఫలితాల్లో నెట్ ప్రాఫిట్లో దాదాపు 65శాతం వృద్ధిని కనబరిచింది. అంతేకాదు 2019 మార్చి నాటికి దేశంలోనే అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా అవతరించిన జియో రూ.11,100 కోట్ల ఆదాయాన్ని సాధించింది.అయితే నెట్వర్క్ ఆపరేటింగ్ వ్యయాలు దాదాపు 88 శాతం జంప్ జేయడంతో దాదాపు రూ.9 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవలసి ఉంది. ఈ నేపథ్యంలోనే జియో తన టారిఫ్‌లను సవరించవచ్చని మార్కెట్ ఎనలిస్టులు పేర్కొంటున్నారు. రిలయన్స్ జియోలో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టనుందట. సుమారు 2–3 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్మెంట్ ఉండొచ్చని తెలుస్తోంది. వాటాల విక్రయం ద్వారా వ్యాపార సామ్రాజ్య రుణభారాన్నితగ్గించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో తాజా వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా టెలికం మార్కెట్లో విప్లవం సృష్టించిన జియో త్వరలోనే జియో గిగాఫైబర్‌తో మరో విప్లవానికి సిద్ధమవుతోంది. నెలకు కేవలం రూ.600కే గిగాఫైబర్ ద్వారా బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్ లైన్ ఫోన్, టీవీ చానళ్ల ప్రసారాల సేవలను అందించనుందని వార్తలు వస్తున్నసంగతి తెలిసిందే. -
జియో గిగాఫైబర్ టారిఫ్ ప్లాన్స్ ఇవేనట!
టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో.. తాజాగా బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లోనూ తన సత్తా చూపేందుకు వచ్చేస్తోంది. జియోగిగాఫైబర్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ తన 41వ వార్షిక సాధారణ సమావేశంలో లాంచ్ చేసింది. ఇళ్లకు, ఆఫీసులకు, దుకాణాలకు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా హై-స్పీడ్ఇంటర్నెట్ను అందించడమే లక్ష్యంగా జియోగిగాఫైబర్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల్లోనే జియోగిగాటీవీ సేవలను అందించబోతుంది. ఆగస్టు 15 నుంచి ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు 41వ ఇన్వెస్టర్ల సమావేశంలోనే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. కానీ ఆ సమయంలో జియోగిగాఫైబర్ టారిఫ్‌లను రివీల్ చేయలేదు. ఇప్పటి వరకు కూడా ఈ టారిఫ్ ప్లాన్లపై కంపెనీ ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. మరికొన్ని రోజుల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తున్న క్రమంలో జియోగిగాఫైబర్ టారిఫ్ ప్లాన్లు ఈ విధంగా ఉండబోతున్నాయంటూ ఆన్లైన్లో కొన్ని టారిఫ్ ధరలు చక్కర్లు కొడుతున్నాయి. అవేమిటో ఓ సారి చూద్దాం.. 500 రూపాయల జియోగిగాఫైబర్ ప్లాన్... జియోగిగాఫైబర్ తొలి ప్యాకేజీ రూ.500 నుంచి ప్రారంభమవుతుందట. ఈ ప్లాన్ కింద నెలకు 300 జీబీ వరకు డేటాను 50 ఎంబీపీఎస్ స్పీడులో అందించనున్నట్టు తెలుస్తోంది. అయితే 300 జీబీ ఎఫ్‌యూపీ పరిమితి అయిపోయాక, స్పీడ్ తగ్గిపోనుందని సమాచారం. 750 రూపాయల జియోగిగాఫైబర్ ప్లాన్... తర్వాత ప్లాన్ రూ.750గా ఉంటుందని సంబంధిత వర్గాల టాక్. ఈ ప్లాన్ కింద నెలకు 450 జీబీ అపరిమిత డేటాను 50 ఎంబీపీఎస్ స్పీడులో అందించనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్లాన్ 30 రోజుల వాలిడిటీలో మార్కెట్లోకి వస్తుందని టాక్. 999 రూపాయల జియోగిగాఫైబర్ ప్లాన్.... 600జీబీ వరకు అపరిమిత డేటాను రూ.999 ప్లాన్‌పై పొందవచ్చట. దీని స్పీడ్ 100 ఎంబీపీఎస్ అని తెలుస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులుగా ఉంటుందని సమాచారం. 1,299 రూపాయల జియోగిగాఫైబర్ ప్లాన్.... ఈ ప్లాన్ ఎఫ్‌యూపీ పరిమితి 750 జీబీ. ఈ డేటాను 100 ఎంబీపీఎస్ స్పీడులో 30 రోజుల వరకు వాడుకోవచ్చట. 1,599 రూపాయల జియోగిగాఫైబర్ ప్లాన్.... జియోగిగాఫైబర్ కింద అందించే హైయస్ట్ ప్లాన్ ఇదేనట. ఈ ప్లాన్ కింద 900 జీబీ డేటాను 150 ఎంబీపీఎస్ స్పీడులో పొందవచ్చట. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులని తెలుస్తోంది. ఎఫ్‌యూపీ పరిమితి అయిపోయాక స్పీడు పడిపోనుందని టాక్. జియోగిగాఫైబర్ రిజిస్ట్రేషన్లు... జియోగిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల రిజిస్ట్రేషన్లను రిలయన్స్ జియో ఆగస్టు 15 నుంచి ప్రారంభించబోతుంది. జియో అధికారిక వెబ్సైట్ లేదా మైజియో మొబైల్ అప్లికేషన్ నుంచే దీని రిజిస్ట్రేషన్లను ఆమోదించనుంది. తొలి దశలో 1,100 నగరాల్లో ఈ సేవలు లాంచ్ కాబోతున్నాయి. ఎక్కడైతే ఎక్కువ రిజిస్ట్రేషన్లు నమోదు అవుతాయో అక్కడ తొలుత దీని సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
ఒక్క జీబీ డేటా రెండు రూపాయలే!
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో మార్కెట్లోకి వచ్చాక డేటా రేట్లు విపరీతంగా పడిపోయిన సంగతి తెలిసిందే. జియో రాకకు ముందు అంటే 2016 ఆగస్టు నెల వరకు రూ.249 నుంచి రూ.259 వరకు ఉన్న ఒక్కో జీబీ డేటా రేటు, 99 శాతం మేర కిందకి పడిపోయింది. ప్రస్తుతం జియో ప్రకటించిన రిపబ్లిక్ డే ఆఫర్లతో ఈ డేటా రేట్లు మరింత పతనం కానున్నాయి. ఒక్కో జీబీ డేటా రేటు అత్యంత తక్కువకు రూ.2.7కే పడిపోనున్నట్టు బ్యాంకు ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ రిపోర్టు చేసింది. బోఫా-ఎంఎల్ విశ్లేషకుల అంచనాల ప్రకారం జియో రూ.448, రూ.498 ప్లాన్ల కింద ఒక్కో జీబీ డేటా ధర రూ.2.7గా ఉండనున్నట్టు తెలిసింది. జియో రిపబ్లిక్ డే ఆఫర్ కింద ఎంపిక చేసిన ప్లాన్లపై అదనంగా 500 ఎంబీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు వెల్లడించింది. దీంతో రూ.448, రూ.498 ప్లాన్లపై రోజుకు 2జీబీ 4జీ డేటా యూజర్లకు లభించనుంది. అయితే లిమిట్ దాటాక డేటా స్పీడ్ తగ్గిపోనుంది. ఈ ప్లాన్ల వాలిడిటీ 84, 91 రోజులు. అంతకముందు జియో ప్రకటించిన హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ కింద, ఒక్కో జీబీ డేటా ధర 4 రూపాయలకు తగ్గింది. ఈ కొత్త టారిఫ్‌లు 25-33 శాతం టారిఫ్ కోత. అదనపు డేటా ప్రయోజనాలతో పాటు, కొత్త ప్లాన్ రూ.98ను కూడా జియో ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కింద నెలకు 2జీబీ డేటా లభించనుంది. జియో ప్రధాన ప్రత్యర్థి భారతీ ఎయిర్టెల్ తన కొత్త స్కీమ్‌ల కింద ఒక్కో జీబీ డేటాను 4 రూపాయలకు అందిస్తోంది. -
జియో డేటా రెట్టింపు : అంబానీ
-
జియో డేటా రెట్టింపు : అంబానీ
వచ్చే నెలల్లో ప్రస్తుతమున్న జియో డేటాను రెట్టింపు చేస్తామని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. టెలికాం కంపెనీలతో సమానంగా ఛార్జీలు వేయడం ప్రారంభించినప్పటి నుంచి 20 శాతం అత్యధికంగా డేటాను అందిస్తామని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి జియో టారిఫ్ ప్లాన్స్ ప్రారంభిస్తామని అంబానీ చెప్పారు. దానిలో అన్ని వాయిస్ కాల్స్ ఉచితం, నో రోమింగ్ చార్జస్, నో హిడెన్ చార్జస్ అని అంబానీ మంగళవారం ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 2017 వరకు అన్ని గ్రామాలను జియో కవర్ చేస్తుందని అంబానీ పేర్కొన్నారు. నెలకు 100 కోట్ల జీబీ డేటాను వినియోగదారులు వాడుతున్నారని అంబానీ చెప్పారు. అంటే రోజుకు 3.3 కోట్ల జీబీ వాడుతున్నారని తెలిపారు.దేశంలోనే అతిపెద్ద డేటా కన్జ్యూమర్ గా జియో ఉందని పేర్కొన్నారు. డేటా వాడకంలో ప్రపంచంలోనే భారత్ నెంబర్ 1గా ఉందని, జియో రాకముందు మొబైల్ డేటా వాడకంలో భారత్ 150వ స్థానంలో ఉందని తెలిపారు. కేవలం 170 రోజుల్లో 10 కోట్ల మంది వినియోగదారులు చేరుకున్నామని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ప్రకటించారు. సంబంధిత వార్తలు.. జియో యూజర్లకు బంపర్ ఆఫర్ జియో వినియోగదారులకు గుడ్ న్యూస్ జియో డౌన్లోడు స్పీడులో దూసుకుపోయింది! -
జియో ఆఫర్లు ‘సముచితమే’: ట్రాయ్
న్యూఢిల్లీ: టెలికం సంస్థ రిలయన్స్ జియో ప్రకటించిన టారిఫ్ ప్లాన్లు.. నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) భావిస్తోంది. జియో ఉచిత ప్రమోషనల్ ఆఫర్‌ను సవాల్ చేస్తూ టెలికం ట్రిబ్యునల్ టీడీశాట్‌ని ఆశ్రయించిన భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్ తదితర ఆపరేట్లరకు కూడా ఇదే విషయం తెలియజేయనుంది. ‘జియో టారిఫ్‌లను ట్రాయ్ పరిశీలించింది. అవి ప్రస్తుత టారిఫ్ ఉత్తర్వులు, ఇతర నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని అభిప్రాయపడింది’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. జియో టారిఫ్‌లు నిబంధనలను ఉల్లంఘించడం లేదని, ట్రాయ్ ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అటార్నీ జనరల్ ఇటీవలే నియంత్రణ సంస్థకు సూచించిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. నిర్దేశిత 90 రోజులను కూడా అధిగమించి జియో 2017 మార్చి దాకా ఉచిత వాయిస్, డేటా ఆఫర్లను అందించడం నిబంధనలకు విరుద్ధమంటూ ఇతర ఆపరేటర్లు టీడీశాట్‌ను ఆశ్రయించారు. దీంతో ట్రాయ్ నిర్ణయాన్ని తెలియజేయాలంటూ టీడీశాట్ ఆదేశించింది. కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 6న జరగనుంది. కవరేజీ ఓకే.. కానీ స్పీడే లేదు.. రిలయన్స్ జియో నెట్వర్క్ కవరేజీ ఇతర ఆపరేటర్లతో పోలిస్తే చాలా ముందంజలో ఉందని క్రెడిట్ సూసీ ఒక నివేదికలో పేర్కొంది. అయితే, ఉచిత ఆఫర్ కాలంలో నెట్‌వర్క్‌పై అధిక లోడ్ కారణంగా 4జీ స్పీడ్ అందించడంలో మాత్రం ఎయిర్టెల్ కన్నా వెనుకబడే ఉందని వివరించింది.