దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు రిలయన్స్‌ సిద్ధం..? | market experts expect an jio IPO as soon as early next year | Sakshi
Sakshi News home page

దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు రిలయన్స్‌ సిద్ధం..?

Published Sat, Jul 6 2024 8:22 AM | Last Updated on Sat, Jul 6 2024 1:00 PM

market experts expect an jio IPO as soon as early next year

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. టెలికాం విభాగంలో సేవలందిస్తున్న జియోను పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కు తెచ్చే ప్రతిపాదనలున్నట్లు కొన్ని మీడియా స​ంస్థల కథనాల ద్వారా తెలిసింది. మార్కెట్‌ అనుకునేలా జియో ఐపీఓకు వస్తే దేశంలో మునుపెన్నడూ లేనివిధంగా రూ.55,000 కోట్ల నిధులు సమీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. అది దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా రికార్డు నెలకొల్పనుంది.

రిలయన్స్‌ జియో ఇటీవల మొబైల్‌ టారిఫ్‌లను పెంచింది. దాంతో టెలికాం రంగంలో సేవలందిస్తున్న ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ఐడియా వంటి ఇతర కంపెనీలు జియో పంథానే ఎంచుకున్నాయి. అవి కూడా టారిఫ్‌లను పెంచాయి. దాంతో వినియోగదారుల నుంచి కొంత విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఇలా ఐపీఓ వార్తలు రావడం గమనార్హం. వచ్చే ఏడాది ప్రారంభంలో జియో ఐపీఓ రావొచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు జియో 4జీ టారిఫ్‌లతోనే 5జీ సేవలు అందిస్తుండగా, ఇకపై 5జీకి ప్రత్యేక టారిఫ్‌ నిర్ణయించే అవకాశం ఉందని చెబుతున్నాయి.

జులై నెలలో మొదటి త్రైమాసిక ఫలితాలు వెలువడే అవకాశం ఉండడంతో ఆగస్టులో  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) వార్షిక సాధారణ సమావేశాన్ని (ఏజీఎమ్‌) నిర్వహిస్తుంది. ఇందులో జియో ఐపీఓకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్‌ ఊహిస్తున్న విధంగా జియో ఐపీఓ ద్వారా రూ.55 వేలకోట్లు సమీకరించానుకుంటే దేశంలో అతిపెద్ద ఐపీఓగా నిలువనుంది. ఇప్పటివరకు రూ.21 వేలకోట్లు సమీకరించి లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ఐపీఓనే అతిపెద్దదిగా ఉంది. జియో మొత్తం విలువ దాదాపు రూ.11 లక్షల కోట్లుగా అంచనా. పెద్ద కంపెనీ ఐపీఓకు వస్తే అందులో సుమారు 5 శాతం విక్రయించాల్సి ఉంటుంది. కాబట్టి దాని విలువ రూ.55 వేలకోట్లుగా లెక్కిస్తున్నారు.

ఇదీ చదవండి: గ్యాస్‌ సిలిండర్లకు క్యూఆర్‌ కోడ్‌.. మంత్రి ప్రకటన

ఇటీవల పెంచిన టారిఫ్‌లతో కంపెనీ సగటు వినియోగదారు ఆదాయం (ఆర్పు) పెరుగుతుందని మార్కెట్‌ అంచనా వేస్తుంది. 5జీకు ప్రత్యేకంగా టారిఫ్‌లు తీసుకురావడంతో మరింత ఆదాయం సమకూరుతుంది. దాంతో కంపెనీ రెవెన్యూలో పెరుగుదల ఉంటుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఫలితంగా కంపెనీ షేర్లను కొనుగోలు చేస్తున్నారు. కేవలం గడిచిన నెల రోజుల్లో స్టాక్‌ ధర ఏకంగా 11.4 శాతం పెరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement