ప్రముఖ టెలికామ్ దిగ్గజం 'రిలయన్స్ జియో' (Reliance Jio) ఇటీవల తన సబ్‌స్క్రైబర్‌ల కోసం కొత్త ప్లాన్ తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా రూ.148 చెల్లించి ఏకంగా 12 ఓటీటీలను పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
వీడియో స్ట్రీమింగ్ యాప్‌లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో టెలికాం సంస్థలు అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొస్తున్నాయి. ఇటీవల రిలయన్స్ జియో రూ.148తో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా 12 ఓటీటీలు లభిస్తున్నాయి.
జియో రూ.148 ప్లాన్ కేవలం డేటా ప్యాక్ మాత్రమే. వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు ఉండవు. 10 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులు. దీన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే కచ్చితంగా బేస్ ప్లాన్ ఉండాల్సిందే. జియో సినిమా ప్రీమియం కూపన్ మైజియో అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. దీన్ని ఉపయోగించి ఆ ఓటీటీని యాక్టివేట్ చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్.. ఆర్‌బీఐ కీలక ఆదేశాలు
12 ఓటీటీలు ఇవే..
- జియోసినిమా ప్రీమియం
- జీ5
- సోనీలివ్
- లయన్స్‌గేట్ ప్లే
- డిస్కవరీ+
- సన్‌నెక్ట్స్
- డాక్యుబే
- హోఇచోయ్
- ప్లానెట్ మరాఠీ
- చౌపాల్
- ఎపిక్ఆన్
- కంచ లంక
Comments
Please login to add a commentAdd a comment