
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) యూజర్లకు భారీ షాకిచ్చింది. లైఫ్‌టైమ్ ప్రీ-పెయిడ్ ప్లాన్స్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. లైఫ్‌టైమ్ ప్రీ పెయిడ్ ప్లాన్లను డిసెంబర్ 1నుంచి పూర్తిగా రద్దు చేయనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం లైఫ్ టైమ్ ప్రీపెయిడ్ ప్లాన్లలో కొనసాగుతున్న యూజర్లను వేరే ప్లాన్‌లోకి షిఫ్ట్ చేయనుంది.
చదవండి: ఎలక్ట్రిక్ వాహనాల్లో సంచలనం..! ఒక్కసారి ఛార్జ్‌తో 1000 కిమీ ప్రయాణం..!
లైఫ్ టైమ్ ప్లాన్‌తో ఏలాంటి సంబంధం లేకుండా యూజర్లు వారి బెనిఫిట్స్‌కు ఎలాంటి నష్టం కలిగించకుండా మరో ప్లాన్‌లోకి బదలాయించనుంది. లైఫ్ టైమ్ ప్లాన్లను 107 రూపాయల ప్లాన్‌లోకి మార్చనుంది. ఈ మార్పు ప్రక్రియ డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. అయితే యూజర్లకు రూ. 107 ప్లాన్‌లో ఉండే కొన్ని అదనపు ప్రయోజనాలు వర్తించవని తెలిపారు. రూ. 107 ప్లాన్‌కు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ లేదు. దీని కాల పరిమితి మూడు నెలలు మాత్రమే. ఇదిలా ఉండగా..బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 2399 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీను 60 రోజులకు పెంచింది. దీంతో యూజర్లు 425 రోజుల వ్యాలిడిటీను పొందనున్నారు.
చదవండి: ఎలక్ట్రిక్ కార్లు కాదు..కానీ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయ్..!
Comments
Please login to add a commentAdd a comment