ఔషధ తయారీ రంగంలో ఉన్న లారస్ ల్యాబ్స్ వైజాగ్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని 2017 జూన్ నాటికి నెలకొల్పుతోంది. ఇప్పటికే సంస్థకు హైదరాబాద్‌తోపాటు యూఎస్‌లోని బోస్టన్‌లో ఇటువంటి సెంటర్లున్నారుు. 2,300 మంది సిబ్బందిలో 25 శాతం ఆర్‌అండ్‌డీలో పనిచేస్తున్నారు. ఈ విభాగానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్టు సంస్థ సీఈవో సి.సత్యనారాయణ తెలిపారు. కంపెనీ ఈడీ రవి కుమార్‌తో కలిసి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. వైజాగ్ కేంద్రానికి కొత్తగా 100 మందిని నియమిస్తామని చెప్పారు. ఈ ఏడాది డిసెంబరుకల్లా ఒకటి, 2017 చివరి నాటికి మరో తయారీ కేంద్రం అందుబాటులోకి వస్తుందన్నారు. తయారీ కేంద్రాలకు కొత్తగా 200 మందిని తీసుకుంటామని వివరించారు. తయారీ, ఆర్‌అండ్‌డీ సెంటర్లకు కంపెనీ రూ.450 కోట్లు పెట్టుబడి పెడుతోంది.
Published Sat, Dec 3 2016 7:21 AM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement