ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ వాల్ స్ట్రీట్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. అమెరికా స్టాక్ మార్కెట్లో ప్రధాన సూచీ నాస్డాల్లో ఐపీఓ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)కు ప్రీపేర్ అవుతోందని బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ చేసింది. ఇదే సమయంలో నాలుగు అతిపెద్ద ఆడిట్ సంస్థల్లో ఒకదాన్ని నియమించుకోనున్నట్టు బుధవారం తెలిపింది. 2018లో ఈ సంస్థ నాస్డాక్లో ఐపీఓకు రావొచ్చని రిపోర్టు పేర్కొంది. ఈ విషయాన్ని ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈవో బిన్నీ బన్సాల్ ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా తెలిపినట్టు రిపోర్టు వెల్లడించింది. ఐపీవో ద్వారా తన కీలక కర్తవ్యాన్ని చూడబోతున్నారంటూ ఉద్యోగులకు ఆయన తెలిపారు.