Wall Street
-
అమెరికా అధ్యక్ష ఎన్నికలు: మళ్లీ ఆయనే హాట్ ఫేవరెట్!
వాషింగ్టన్: వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ఫేవరెట్‌గా మారుతున్నారు. తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ చేసిన సర్వేలో ప్రస్తుత అధ్యకక్షుడు జో బైడెన్‌కంటే 4 శాతం ఎక్కువ అప్రూవల్ రేటుతో ట్రంప్ ముందున్నారు. అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్‌ను 43 శాతం మంది ప్రజలు ఆమోదించగా ట్రంప్‌ను 47 శాతం మంది ఆమోదించడం విశేషం. అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి జో బైడెన్ అప్రూవల్ రేటు 43 శాతానికి పడిపోవడం ఇదే తొలిసారి. 2024 అధ్యక్ష ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ టైమ్ ఉండడంతో డెమొక్రాట్లకు ఈ విషయం ఆందోళన కలిగిస్తోంది. దీంతో డెమొక్రాట్లు రెండోసారి అధ్యక్షపదవికి జోబైడెన్ పోటీలో ఉండటాన్ని వ్యతిరేకిస్తున్నారు. బైడెన్ రెండోసారి పోటీచేయవద్దనేందుకు వాళ్లు మరో కారణం కూడా చూపుతున్నారు. ఎన్నికల నాటికి ఆయన వయసు 81కి చేరనుందని, ఈ వయసులో మళ్లీ పోటీ ఎందుకని కొందరు డెమొక్రాట్ నేతలు వాదిస్తున్నారు. మరోవైపు రిపబ్లికన్ల తరపున అధ్యక్ష పదవికి పోటీలో ట్రంప్‌కు తిరుగులేని మద్దతు లభిస్తోంది. పార్టీలో ట్రంప్ పోటీదారులెవరూ ఆయన దరిదాపుల్లో కూడా లేరు. అయితే ట్రంప్ మీదున్న క్రిమినల్ కేసులు, గతంలో క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి వంటి అంశాలు ఆయన అభ్యర్థిత్వానికి ముప్పుగా పరిణమించే అవకాశాలు లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదీచదవండి..ఈ రెస్టారెంట్లో చెంపదెబ్బలు వడ్డిస్తారు! -
దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!
రెండు విజయవంతమైన యునికార్న్ స్టార్టప్‌లను సృష్టించిన ఏకైక టెక్ వ్యవస్థాపకుడు, సందీప్ అగర్వాల్. వ్యాపారవేత్తగా పాపులర్ అవుతున్న తరుణంలో ఎఫ్‌బీఐ అరెస్టు బాగా దెబ్బతీసింది. రూ. 8వేల కోట్ల సంస్థ పోయింది. చేయని నేరానికి జైలు శిక్ష, మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు అయినా ఫీనిక్స్ పక్షిలా తిరిగి ట్రాక్‌లోకి వచ్చారు. రోలర్ కోస్టర్ లాంటి జీవితాన్నిఎదురీది ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యాపారవేత్తగా, ప్రస్తుతం రూ. 16400 కోట్ల కంపెనీ యజమానిగా తానేంటో నిరూపించుకున్న సందీప్ అగర్వాల్ సక్సెస్ స్టోరీ.. జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో అతని జీవితంలో అనుకోని కుదుపు తీవ్ర సంక్షోభాన్ని సృష్టించింది. కుటుంబంతో కలిసి అమెరికాలో వెకేషన్లో ఉండగా, ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సందీప్ అగర్వాల్‌ను అరెస్ట్ చేసింది. అరెస్టు తర్వాత 8 వేల కోట్ల రూపాయల కంపెనీని కోల్పోవాల్సి వచ్చింది. ఇదే తరుణంలో 17 ఏళ్ల వైవాహ జీవితానికి స్వస్తి పలుకుతూ 2018లో భార్య విడాకులు తీసుకుంది. అయినా ఎక్కడా ఆశను కోల్పోలేదు. కుటుంబానికి దూరంగా యూఎస్‌లో ఉండి, కేసుపై పోరాడవలసి వచ్చింది. కంపుకొట్టే టాయిలెట్ మధ్య జైలు జీవితాన్ని గడిపాడు. మరోవైపు రిమోట్‌గా కార్యకలాపాలను నిర్వహించినప్పటికీ వాటాదారుల అభ్యంతరాలతో కంపెనీ సీఈవో పదవి నుంచి వైదొలిగి, తాను నిర్మించిన సంస్థ పగ్గాలను తన స్నేహితుడికి అప్పగించారు. 2019లో, షాప్‌క్లూస్‌ను మరో కంపెనీ సుమారు 100 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. విచారణ, తీర్పు ఆలస్యం కారణంగా 2014లో ఇండియాకు రావడానికి అనుమతి లభించింది. చివరికి 2020లో యూఎస్ కోర్టు ద్వారా ఆర్థిక నేరాల కేసులో నిర్దోషిగా తేల్చింది. డ్రూమ్ టెక్నాలజీస్ ఏప్రిల్ 2014లో డ్రూమ్ టెక్నాలజీస్ అనే మరొక యునికార్న్ ఏర్పాటుచేశారు.అనేక ఇబ్బందుల మధ్య అత్యంత విశ్వసనీయమైన ఆటోమొబైల్ ప్లాట్‌ఫారమ్‌గా దీన్ని తీర్చిదిద్దారు. కేవలం ఒక్క ఏడాదిలోనే 16 మిలియన్ డాలర్లు ,తరువాతి మూడు సంవత్సరాలలో, పలు దఫాలుగా 90 మిలియన్ డాలర్ల నిధులను సమకూర్చారు. ఏప్రిల్ 2021న భారతదేశంలో 55వ యునికార్న్‌గా అవతరించింది. కంపెనీ వాల్యుయేషన్ 2 బిలియన్ డాలర్లు లేదా రూ.16400 కోట్లు. డ్రూమ్ తన జీవితంలో లేకుంటే తాను ఈ సంక్లిష్ట పరిస్థతులనుంచి తాను బయటపడేవాడిని కాదని ఒక సందర్భలో సందీప్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. కుటుంబానికి దూరంగా, జైలు శిక్షను ఎదుర్కొంటున్న తరుణంలో కంపెనీ తనకు ఊరటనిచ్చిందని చెప్పారు. తరువాత ఉపాసనను రెండో పెళ్లి చేసుకున్నారు. షాప్‌క్లూస్ ముందు సందీప్ అగర్వాల్ ఎంబీఏ పట్టా పొందిన తరువాత అమెరిలో రెండు వేర్వేరు కంపెనీలలో పనిచేశారు. ఆ తరువాత వాల్ స్ట్రీట్‌లో 14 ఏళ్లు ఎనలిస్టుగా పనిచేశారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాహూ! మొదలైన కంపెనీలను కవర్ చేస్తూ ఎనిమిదేళ్లపాటు విశ్లేషకుడిగా పనిచేశాడు.టాప్ ర్యాంక్ రీసెర్చ్ అనలిస్ట్‌గా పేరు సంపాదించారు.TiE సిలికాన్ వ్యాలీలో చార్టర్ సభ్యుడు కూడా. ఇంటర్నెట్ విశ్లేషకుడిగా 2010లో ఇండియాను సందర్శించిన సమయంలోఆన్లైన్ మార్కెట్ ప్రారంభించాలనే ఆలోచనకు పునాది పడింది. షాప్‌క్లూస్ ప్రారంభం డెలావేర్లో రాధికా ఘై అగర్వాల్ (సందీప్ అగర్వాల్ మాజీ భార్య),మృణాల్ ఛటర్జీ , సంజయ్ సేథితో కలిసి ఇ-మార్కెట్ వ్యాపారాన్ని ప్రారంభించారు. సెప్టెంబరు 2011లో ఈ టీం దేశానికి వచ్చి శాశ్వతంగా గుర్గావ్లో స్థిరపడింది. షాప్‌క్లూస్ ప్రారంభంలో తన సోషల్ సర్కిల్స్ ద్వారా 1.95 మిలియన్ డాలర్లను సేకరించడం విశేషం. షాప్‌క్లూస్ పబ్లిక్ బీటా వెర్షన్ 26 జనవరి 2012న విడుదలచేయగా, ముగ్గురు లేదా నలుగురుగా ఉన్న టీంసంఖ్య 25 మంది సభ్యులకు పెరిగింది. నెలవారీ 20 లక్షలకు పైగా యూజర్లతో భారీ లాభాల్ని సాధించింది. ఈ దెబ్బకు అలెక్సా ర్యాంకింగ్ అదే సంవత్సరం ఆగస్టులో 14వేల నుండి 200కి పడిపోయింది. జనవరి 2013 నాటికి, షాప్‌క్లూస్ దేశంలో ఐదో అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్‌గా మారింది. అలెక్సా ర్యాంకింగ్ ఏకంగా 90కి పడిపోయింది. 2013 జూలైలో అమెరికాలో ఎప్బీఐ ఈరెస్టు చేసింది. వాల్ స్ట్రీట్‌లో సీనియర్ ఇంటర్నెట్ రీసెర్చ్ అనలిస్ట్‌గా పని చేస్తున్నప్పుడు అతనిపై 'ఇన్సైడర్ ట్రేడింగ్' ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో చట్టపరమైన ఆరోపణలను నమోదు చేసేదాకా అదే జోరు కొనసాగింది. అప్పటికీ కంపెనీ నెలవారీగా 200-300శాతం వృద్ధిని సాధిస్తోంది. కరియర్లో సందీప్ అగర్వాల్ తొలి అడుగులు 1995లోముంబైలోని కోటక్ మహీంద్రాలో ఇంటర్న్‌గా కరియర్‌ను మొదలు పెట్టారు సందీప్ అగర్వాల్. ఈ ఇంటర్న్‌షిప్ తన వ్యాపార కమ్యూనికేషన్‌తో పాటు తన విశ్లేషణాత్మక నైపుణ్యాలు,వ్యూహాత్మక ఆలోచనలఅభివృద్ధికి తోడ్పడిందని స్వయంగా సందీప్ అగర్వాల్ చెప్పారు. సందీప్ అగర్వాల్ చదువు కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్, దేవి అహల్య విశ్వవిద్యాలయం నుంచి ఫైనాన్స్‌లో మాస్టర్స్ పట్టా పొందారు. వాషింగ్టన్ యూనివర్శిటీ సెయింట్ లూయిస్ ఓలిన్ బిజినెస్ స్కూల్ నుచి ఎంబీఏ చేసారు. గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం సందీప్‌కు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం , గురుగ్రామ్‌లోని తన పెంట్‌హౌస్‌లో దాదాపు 1000 మొక్కలు ఉన్నాయి. తన కుమారులతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడం ఇష్టం. గోల్ఫ్ , స్క్వాష్ ఆడుతారు. తోటపని, ప్రయాణాలు, చదవడం, రాయడం లాంటి ఇష్టాలు తనకు మంచి ఊరట అంటారు సందీప్. ‘ఫాల్ ఎగైన్, రైజ్ ఎగైన్’ అనే పుస్తకాన్ని కూడా రాశారు. -
ఒక్క బ్యాంక్ కోసం ముందుకొచ్చిన 11 బ్యాంక్‌లు.. కారణం అదేనా
అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ మూసివేత తర్వాత మరిన్ని బ్యాంక్‌లు అదే దారిలో ఉన్నాయనే వార్తలు ఆగ్నికి ఆజ్యం పోసినట్లైంది. ఈ నేపథ్యంలో అమెరికాలో 11 బడా బ్యాంకులు ఏకతాటిపైకి వచ్చాయి. మరో భారీ సంక్షోభం రాకుండా పతనం అంచుల్లో ఉన్న ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌ను ఆదుకునేందుకు 30 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించాయి. డిసెంబరు 31 నాటికి ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకులో 176.4 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. అయితే, కుప్పుకూలిపోతున్న బ్యాంకులు, విశ్లేషకుల అంచనాలు, ఇతర పరిణామాలతో ఖాతాదారులు ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ నుంచి నగదును ఉపసంహరించుకుంటున్నారు. దీంతో సదరు బ్యాంక్‌లో నగదు సమస్య ఏర్పడి బ్యాంక్ దివాలా తీయొచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జేపీ మోర్గాన్ చేజ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్, వెల్స్ ఫార్గో, మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మన్ శాక్స్, బీఎన్వై మెలన్, స్టేట్ స్ట్రీట్, పీఎన్సీ బ్యాంక్, ట్రుయిస్ట్, యూఎస్ బ్యాంకులన్నీ ఏకమై ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌ను ఆదుకునేందుకు ముందుకు వచ్చాయి. ఖాతాదారులందరూ బిలియనీర్లే ఇక ఫస్ట్ రిపబ్లిక్లో ఎక్కువ మంది బిలియనీర్లే ఖాతాదారులుగా ఉన్నట్లు సమాచారం. వారిలో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ సైతం ఈ బ్యాంకు నుంచి తనఖా రుణం తీసుకున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. -
యూఎస్ మార్కెట్లు అక్కడక్కడే
న్యూయార్క్: అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేందుకు డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ కు అవకాశాలు పెరిగిన నేపథ్యంలో వారాంతాన యూఎస్ స్టాక్ మార్కెట్లు మిశ్రమ ధోరణిలో ముగిశాయి. శుక్రవారం డోజోన్స్ 61 పాయింట్లు(0.2 శాతం) క్షీణించి 28,329కు చేరగా.. ఎస్అండ్పీ నామమాత్ర లాభంతో 3,512 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ 16 పాయింట్లు(0.15 శాతం) పుంజుకుని 11,907 వద్ద స్థిరపడింది. వెరసి ఈ వారం నాస్ డాక్ 9 శాతం జంప్ చేయగా.. డోజోన్స్, ఎస్అండ్పీ 7 శాతం చొప్పున ఎగశాయి. తద్వారా ఏప్రిల్ తదుపరి ఒకే వారంలో అత్యధిక లాభాలు ఆర్జించాయి. పెన్సిల్వేనియా, జార్జియాలలో నమోదైన స్వల్ప ఆధిక్యాలను బైడెన్ పెంచుకోవడం ద్వారా విజయానికి మరింత చేరువైనట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. వరుసగా నాలుగు రోజులపాటు ర్యాలీ చేసిన మార్కెట్లలో వారాంతాన ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగినట్లు తెలియజేశారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలలో అస్పష్టత నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించినట్లు వివరించారు. రికవరీ బాటలో కోవిడ్-19 కారణంగా మాంద్య పరిస్థితులు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థ తిరిగి రికవరీ బాట పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం అక్టోబర్‌లో నిరుద్యోగిత 6.9 శాతానికి పరిమితంకావడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. సెప్టెంబర్‌లో 7.7 శాతంగా నమోదైంది. అక్టోబర్‌లో 6.38 లక్షల మందికి ఉపాధి లభించినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. అయితే సెకండ్ వేవ్ లో భాగంగా మళ్లీ అమెరికాసహా యూరోపియన్ దేశాలలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రభుత్వం మరోసారి సహాయక ప్యాకేజీలను ప్రకటించవలసి ఉంటుందని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. తాజా పాలసీ సమీక్షలో కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. కాగా.. కోవిడ్-19కు ముందు నమోదైన 3.5 శాతం గణాంకాలతో పోలిస్తే నిరుద్యోగిత అధికంగానే నమోదైనట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. దీంతో కొత్త ప్రభుత్వం స్టిములస్ కు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుందని తెలియజేశారు. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ అమలు చేస్తున్న ప్యాకేజీని 190 బిలియన్ డాలర్లమేర పెంచిన విషయం విదితమే. షేర్ల తీరిలా నిపుణుల అంచనాలను మించి త్రైమాసిక ఫలితాలు ప్రకటించడంతో కాస్మెటిక్స్ కంపెనీ కొటీ ఇంక్ దాదాపు 18 శాతం దూసుకెళ్లింది. మూడో క్వార్టర్(జులై- సెప్టెంబర్)లో అంచనాలకు మించి వినియోగదారులు జత కావడంతో టీ మొబైల్ దాదాపు 6 శాతం జంప్ చేసింది. ఇతర బ్లూచిప్స్‌లో మోడర్నా ఇంక్ 1.4 శాతం, ఆస్ట్రాజెనెకా 0.65 శాతం, బోయింగ్ 0.4 శాతం చొప్పున లాభపడ్డాయి. అయితే క్యూ3 పనితీరులో విశ్లేషకులను నిరాశపరచడంతో వీడియో గేమ్ తయారీ కంపెనీ ఎలక్ట్రానిక్స్ ఆర్ట్స్ షేరు 6.5 శాతం పతనమైంది. అమెజాన్ 0.3 శాతం, ఫేస్బుక్ 0.4 శాతం మధ్య డీలాపడగా.. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ 2 శాతం నీరసించింది. -
యూఎస్ మార్కెట్ల దూకుడు
వరుసగా రెండో రోజు బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు హైజంప్ చేశాయి. డోజోన్స్ 371 పాయింట్లు(1.4 శాతం) ఎగసి 27,851కు చేరగా.. ఎస్అండ్పీ 74 పాయింట్లు(2.2 శాతం) పురోగమించి 3,443 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 427 పాయింట్లు(4 శాతం) దూసుకెళ్లి 11,588 వద్ద స్థిరపడింది. వెరసి ఏప్రిల్ తదుపరి ఒకే రోజు 4 శాతం లాభపడింది. అధ్యక్ష ఎన్నికల ఫలితాలలో స్పష్టత లోపించడం.. అటు ట్రంప్, ఇటు బైడెన్లకు విజయావకాశాలు సమానంగా కనిపిస్తుండటం వంటి అంశాల నేపథ్యంలో పలు రంగాల కౌంటర్లు జోరందుకున్నాయి. రెండు వైపులా ఆధిక్యత కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరు గెలిచినా ప్రధాన విధాన నిర్ణయాలలో మార్పులు కష్టతరం కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా.. రిపబ్లికన్ సెనేటర్ సుసాన్ కొలిన్స్ గెలుపొందడంతో సెనేట్‌లో డెమొక్రాట్లకు మెజారిటీ విషయంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవచ్చని పేర్కొన్నారు. ఫెడ్‌పై కన్ను ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపగల కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షా సమావేశాలు నేడు ముగియనుండటంతో నిర్ణయాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ మళ్లీ బలపడింది. అయితే 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్ భారీగా పతనమయ్యాయి. ఇక యూరోపియన్ మార్కెట్లు 2.5 శాతం స్థాయిలో జంప్‌చేశాయి. ఫాంగ్ స్టాక్స్ అప్ ఫాంగ్ స్టాక్స్‌గా పిలిచే టెక్ దిగ్గజాలలో ఫేస్బుక్ 8.3 శాతం, అమెజాన్, అల్ఫాబెట్ 6 శాతం చొప్పున దూసుకెళ్లగా.. మైక్రోసాఫ్ట్ 5 శాతం, యాపిల్ 4 శాతం, నెట్‌ఫ్లిక్స్ 2 శాతం చొప్పున ఎగశాయి. అల్జీమర్స్ వ్యాధి చికిత్సకు రూపొందించిన ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ సానుకూలంగా స్పందించడంతో బయోజెన్ షేరు 44 శాతం దూసుకెళ్లింది. ఫార్మా బ్లూచిప్స్‌లో మెర్క్ అండ్ కో 5 శాతం, ఆస్ట్రాజెనెకా 6.5 శాతం, ఫైజర్ 3 శాతం చొప్పున పెరిగాయి. ఇతర కౌంటర్లలో ఉబర్ టెక్నాలజీస్ 14.5 శాతం, లిఫ్ట్ ఇంక్ 11 శాతం చొప్పున పురోగమించాయి. డిఫెన్స్ కౌంటర్లలో నార్త్రోప్ గ్రమ్మన్ 3.6 శాతం, లాక్ హీడ్ మార్టిన్ 2.4 శాతం చొప్పున బలపడ్డాయి. -
వాల్ స్ట్రీట్‌కు వైరస్ షాక్
పలు దేశాలలో మళ్లీ కోవిడ్-19 కేసులు విజృంభిస్తుండటంతో బుధవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. డోజోన్స్ 943 పాయింట్లు(3.4 శాతం) పడిపోయి 26,520కు చేరగా.. ఎస్అండ్పీ 120 పాయింట్లు(3.5 శాతం) నష్టంతో 3,271 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 426 పాయింట్లు(3.75 శాతం) కోల్పోయి 11,005 వద్ద స్థిరపడింది. వెరసి మార్కెట్లు నాలుగు నెలల కనిష్టాలకు అంటే జులై స్థాయికి చేరాయి. అమెరికా, రష్యాసహా యూరోపియన్ దేశాలలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆందోళనకు లోనైన ఇన్వెస్టర్లు ఒక్కసారిగా భారీ అమ్మకాలకు తెరతీసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. బ్రిటన్ బాటలో జర్మనీ, ఫ్రాన్స్‌లో లాక్డవున్లు విధించడంతో అంతకుముందు యూరోపియన్ మార్కెట్లు సైతం 2.6-4 శాతం మధ్య కుప్పకూలినట్లు తెలియజేశారు. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ప్రతిపాదించిన భారీ ప్యాకేజీపై కాంగ్రెస్‌లో డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఒప్పందం కుదరకపోవడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు వివరించారు. వచ్చే నెల మొదట్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలలోగా ప్యాకేజీకి ఆమోదముద్ర పడుతుందని ఇన్వెస్టర్లు భావించినట్లు తెలియజేశారు. ఫాంగ్ స్టాక్స్ వీక్ ఫాంగ్ స్టాక్స్‌గా పేర్కొనే యాపిల్, అల్ఫాబెట్, ఫేస్బుక్ నేడు క్యూ3(జులై- సెప్టెంబర్) ఫలితాలు ప్రకటించనున్నాయి. కాగా.. బుధవారం అల్ఫాబెట్, ఫేస్బుక్ 5.5 శాతం, మైక్రోసాఫ్ట్, యాపిల్ 5 శాతం, అమెజాన్ 4 శాతం చొప్పున పతనమయ్యాయి. ఈ బాటలో ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ 4.5 శాతం క్షీణించగా..ఎయిర్‌లైన్స్ కంపెనీలలో యునైటెడ్, సౌత్‌వెస్ట్, డెల్టా, అమెరికన్ 4.6 -2.5 శాతం మధ్య నష్టపోయాయి. క్రూయిజర్ కౌంటర్లలో కార్నివాల్ 11 శాతం, రాయల్ కరిబియన్ 7.5 శాతం చొప్పున కుప్పకూలాయి. ఫార్మా డౌన్ కోవిడ్-19కు వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్న ఫార్మా దిగ్గజాలలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో నోవావాక్స్ 9 శాతం, మోడర్నా ఇంక్ 7 శాతం, ఫైజర్ 5.3 శాతం, జీఎస్కే 4 శాతం, మెక్‌డొనాల్డ్స్ 3.7 శాతం, నోవర్తిస్, ఇంటెల్ కార్ప్ 3 శాతం, సనోఫీ 2.7 శాతం చొప్పున డీలా పడ్డాయి. అయితే ఈ ఏడాది క్యూ3లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో డైవర్సిఫైడ్ దిగ్గజం జనరల్ ఎలక్ట్రిక్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఈ షేరు పతన మార్కెట్లోనూ 5 శాతం దూసుకెళ్లింది. -
యూఎస్ మార్కెట్లకు ట్రంప్ జోష్
డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ప్రతిపాదిస్తున్న ప్యాకేజీకంటే మరింత అధికంగా స్టిములస్ చర్యలకు సిద్ధమంటూ తాజాగా అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడంతో వారాంతాన స్టాక్ మార్కెట్లకు జోష్ వచ్చింది. వారం మొదట్లో అధ్యక్ష ఎన్నికలయ్యే వరకూ డెమొక్రాట్లతో సహాయక ప్యాకేజీలపై చర్చలు నిర్వహించేదిలేదంటూ ట్రంప్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో శుక్రవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. డోజోన్స్161 పాయింట్లు(0.6%) బలపడి 28,587 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 30 పాయింట్లు(0.9%) పుంజుకుని 3,477 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 159 పాయింట్లు(1.4%) జంప్‌చేసి 11,580 వద్ద స్థిరపడింది. ఆగస్ట్ తదుపరి గత వారం యూఎస్ మార్కెట్లు అత్యధికంగా లాభపడ్డాయి. డోజోన్స్ 3.3 శాతం, ఎస్అండ్పీ 3.8 శాతం, నాస్డాక్ 4.6 శాతం చొప్పున ఎగశాయి. ఫాంగ్ స్టాక్స్ జోరు ఫాంగ్ స్టాక్స్‌లో అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్, , నెట్‌ఫ్లిక్స్, గూగుల్ 3-1.5 శాతం మధ్య బలపడ్డాయి. ఇతర కౌంటర్లలో ఫార్మా దిగ్గజం ఆస్ట్రా జెనెకా 1.2 శాతం పుంజుకోగా.. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్, సేల్స్‌ఫోర్స్ 2 శాతం చొప్పున లాభపడ్డాయి. నార్వేజియన్ క్రూయిజర్ 3 శాతం జంప్‌చేయగా.. షెవ్రాన్ కార్పొరేషన్ 1.6 శాతం క్షీణించింది. ఫైజర్, బోయింగ్ 0.3 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. -
లాభాల్లో ముగిసిన అమెరికా మార్కెట్లు
ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన అమెరికా సూచీలు చివరికి 1శాతం లాభంతో ముగిశాయి. డోజోన్స్ ఇండెక్స్ 477 పాయింట్ల లాభంతో 25,605 వద్ద, ఎస్అండ్పీ సూచీ 39 పాయింట్లు పెరిగి 3,041 వద్ద, నాస్డాక్ ఇండెక్స్ 96 పాయింట్లు ర్యాలీ చేసి 9,588 వద్ద స్థిరపడ్డాయి. ఫైనాన్స్, టెక్నాలజీ రంగాలకు చెందిన షేర్ల ర్యాలీ సూచీలకు అండగా నిలిచింది. వారం మొత్తం మీద డోజోన్స్ ఇండెక్స్ 5.5శాతం, ఎస్అండ్పీ ఇండెక్స్ 5శాతం, నాస్డాక్ ఇండెక్స్ 2.50శాతం నష్టపోయాయి. మార్చి 20వ తేదితో ముగిసిన తర్వాత సూచీలు అత్యధిక నష్టాలను మూటగట్టుకుంది ఇదే వారంలో కావడం గమనార్హం. ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యపాలసీ సమావేశం గురువారం జరిగింది. సమావేశం అనంతరం ఛైర్మన్ పావెల్ మాట్లాడుతూ పెరుగుతున్న కోవిడ్-19 కేసులు ఆర్థికవ్యవస్థను మందగమనం వైపు నడిపిస్తున్నాయని, రికవరీకి మరింత ఎక్కువ సమయం పడుతుందన్నారు. దీంతో అదే రోజున సూచీలు 6-7శాతం నష్టాలను చవిచూశాయి. అంచనాలకు మించి త్రైమాసిక ఫలితాలను ప్రకటించడంతో పోటోషాప్ మేకర్ అడోబ్ ఇంక్ 5శాతం లాభంతో ముగిసింది. ఇదే మార్చి క్వార్టర్ ఫలితాలను అందుకోవడంలో విఫలమైన యోగా దుస్తుల తయారీ సంస్థ లులులేమోన్ అథ్లెటికా ఇంక్ 4శాతం నష్టాన్ని చవిచూసింది. భారీ లాభాల్లో ముగిసిన ఏడీఆర్‌లు: అమెరికా మార్కెట్ల లాభాల ముగింపు నేపథ్యంలో అక్కడి మార్కెట్లో ట్రేడయ్యే భారత ఏడీఆర్‌లు భారీ ర్యాలీ చేశాయి. అత్యధికంగా టాటా మోటర్స్ ఏడీఆర్ దాదాపు 7శాతం లాభపడింది. హెచ్డీఎఫ్సీ ఏడీఆర్, ఐసీఐసీఐ ఏడీఆర్‌లు 4శాతం, విప్రో ఏడీఆర్ 1శాతం లాభంతో ముగిశాయి. అయితే డాక్టర్ రెడ్డీస్ ఏడీఆర్ మాత్రం స్వల్పంగా 0.25శాతం నష్టంతో ముగిసింది. -
ట్రంప్‌ను పట్టించుకోని ఫెడ్
వాషింగ్టన్: అమెరికా సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ రిజర్వ్... మరోమారు వడ్డీ రేట్లను పావు శాతం మేర పెంచింది. దీంతో ఈ ఏడాది ఫెడ్ నాలుగు దఫాలు వడ్డీరేట్లను పెంచినట్లయింది. ఒకపక్క రేట్లపెంపుపై యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఫెడ్ రేట్ల పెంపునకు సిద్ధపడడం గమనార్హం. ఈ ఏడాది అమెరికా ఎకానమీ బాగా బలపడిందని, దాదాపు అంచనాలకు తగినట్లే వృద్ధి నమోదు చేస్తోందని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని స్వల్పకాలిక వడ్డీరేట్లను మరో పావు శాతం పెంచుతున్నామన్నారు. తాజా పెంపుదలతో ఫెడ్ రేటు 2.25–2.5%కి చేరింది. ఇదేమీ అసాధారణమైన పెంపు కాదని తెలిపారు. ప్రభావం చూపని ట్రంప్ ట్వీట్ ఫెడ్ సమావేశానికి ముందు రేట్లను పెంచొద్దని, మరో తప్పు చేయొద్దని ఫెడ్‌ను ఉద్దేశించి ట్రంప్ ట్వీట్ చేశారు. రేట్ల పెంపుపై నిర్ణయానికి ముందు ఫెడ్ సభ్యులు వాల్‌స్ట్రీట్ జర్నల్ ఎడిటోరియల్ చదవాలని కూడా ట్వీట్లో సూచించారు. రేట్లను పెంచి మార్కెట్లో లిక్విడిటీ కొరతను తీసుకురావద్దని కోరారు. ఇంత చెప్పినా ఫెడ్ మాత్రం రేట్లను పెంచేందుకే సిద్ధమైంది. కాకపోతే దీనిపై ట్రంప్ ఇప్పటిదాకా స్పందించలేదు. మరోవైపు బ్యాంకు నిర్ణయాలపై ట్రంప్ అభిప్రాయాలు ఎలాంటి ప్రభావం చూపవని ఫెడ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది రెండు సార్లకే పరిమితం ‘‘2019లో మరో 3 మార్లు రేట్లు పెంచేందుకు అవసరమైన ఆర్థిక పరిస్థితులుంటాయని ఫెడ్ సభ్యుల్లో ఎక్కువమంది గతంలో అభిప్రాయపడ్డారు. కానీ తాజా పరిస్థితులను బట్టి చూస్తే వచ్చే సంవత్సరం మరో 2 దఫాలు రేట్లు పెంచితే సరిపోవచ్చు. అయితే మా నిర్ణయాలను ముందుగానే నిర్ధారించలేం. అప్పటికి అందే ఆర్థిక గణాంకాలే విధాన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. దేశీయ ఆర్థిక స్థితిగతులనే కాకుండా అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలను సైతం పరిశీలిస్తూ ఉంటాం’’ అని పావెల్ వివరించారు. -
ఒక్కరోజులోనే భారీగా నష్టపోయిన ప్రపంచ కుబేరుడు
ముంబై : అంతర్జాతీయ మార్కెట్లు ముఖ్యంగా అమెరికా మార్కెట్లు కుప్పకూలడంతో ప్రపంచవ్యాప్తంగా తొలి 500 మంది సంపన్నులు బుధవారం ఒక్క రోజులోనే భారీ మొత్తంలో సంపదను కోల్పోయారు. కేవలం ఒక్కరోజులోనే అక్షరాలా 7.3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు. వీరందరిలో అత్యధికంగా నష్ట పోయింది అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్. ఈయన ఒక్కరే ఈ రోజు ఏకంగా 9.1 బిలియన్ డాలర్ల సంపదను (మన కరెన్సీలో దాదాపు 67 వేల కోట్ల రూపాయలు) కోల్పోయారు. ఈ ఏడాది బిలియనీర్ల సూచీలో వచ్చిన రెండో అతిపెద్ద కుదుపుగా దీనిని బ్లూమ్‌బెర్గ్ అభివర్ణించింది. వీరందరిలోకి బెజోస్ ఎక్కువగా నష్టపోయినట్లు పేర్కొంది. ఇక యూరప్‌కు చెందిన బిలియనీర్ బెర్నార్డ్ అర్నాల్ట్ సంపద రూ.33వేల కోట్లు ఆవిరైంది. ఆయన ఈ ఏడాదిలో పెంచుకున్న విలువలో సగం ఒక్కరోజులోనే కోల్పోయారు. ఇక బెర్క్‌షైర్ హత్వే అధినేత వారన్ బఫెట్ సంపద కూడా దాదాపు రూ.33 వేల కోట్లు తగ్గింది. మరో 67 మంది బిలియనీర్లు తమ సంపదలో దాదాపు రూ.2.3 లక్షల కోట్లను కోల్పోయారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ కుదించింది. ఈ రెండు దేశాలూ వచ్చే ఏడాదిలో వాణిజ్య వివాద ప్రభావాలను చవి చూడాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయిన నేపథ్యంలో ఈ కుబేరులంతా ఒక్క రోజులేనే తమ సంపదలో అధిక భాగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దలాల్ స్ట్రీట్‌కు కూడా ఈ సెగ తాకడంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే తొలి 5 నిమిషాల్లో సుమారు రూ.4లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయిన సంగతి తెలిసింది. -
ట్రంప్ వ్యాఖ్యల దెబ్బ...అమెరికా మార్కెట్లు ఢమాల్
న్యూయార్క్: ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన తరువాత జోరు పెరిగిన అమెరికా స్టాక్ మార్కెట్లు తాజాగా నష్టాల బాట పట్టాయి. రెండు రోజుల్లో దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్స్, రవాణా సంస్థల షేర్లు డీలా పడటంతో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా ఎన్నికల తరువాత అధిక వడ్డీ రేట్లు అంచనాలతో భారీగా లాభపడిన ఎస్ & పి 500 ఆర్థిక ఇండెక్స్ 2.3 శాతం పడిపోయింది. జూన్ 27 తరువాత తొలిసారి ఆ స్తాయిలో దిగజారింది. ఈ నేపథ్యంలో డోజొన్స్ 59 పాయింట్లు(0.3 శాతం) క్షీణించి 19,827 వద్ద ముగియగా, ఎస్అండ్పీ అదే బాటలో నడిచింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 0.6 శాతం నష్టంతో 5,539 వద్ద స్థిరపడింది. నాలుగవ త్రైమాసికంలో రెట్టింపు లాభాల తర్వాత కూడా మోర్గాన్ స్టాన్లీ 3.8 శాతం పడిపోవడం గమనార్హం. డాలర్ భారీగా బలపడటంతో చైనా వంటి దేశాలతో పోటీ పడటంలో అమెరికాకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ట్రంప్ వ్యాఖ్యలు డాలర్‌ను దెబ్బతీశాయి. దీంతో ప్రపంచ పది కరెన్సీలతో మారకంలో డాలరు ఉన్నట్టుండి నీరసించింది. దీంతో ఇటీవల రికార్డ్ స్థాయిలో బలపడిన డాలరు కూడా వెనకడుగు వేసింది. 15 ఏళ్ల గరిష్టంనుంచి దిగజారి 3.5 శాతం నష్టపోయింది. డాలరు ఇండెక్స్ నెల రోజుల కనిష్టం 100.53ను తాకింది. అటు బ్రెక్సిట్ పై ప్రధాని థెరిసా మే వ్యాఖ్యలతో స్టెర్లిన్ 3 శాతం లాభపడిందవి. 1998 తరువాత ఇదే అతిపెద్ద లాభమని విశ్లేషకులు చెబుతున్నారు. అటు దేశీయ కరెన్సీ రూపాయి కూడా డాలర్ తో పోలిస్తే లాభాల్లో కొనసాగుతోంది. రూ.67.93 వద్ద ఉంది. చైనా యెన్ బారీగా లాభపడింది. కాగా ట్రంప్ ఆర్థిక విధానాలు, అమెరికా విధానం లోపాలపై పటిష్ట చర్యల అంచనాలతో అమెరికా మార్కెట్లు ఇటీవల గణనీయంగా పెరిగాయని ఫండ్ మేనేజర్ల అంచనా. దీంతోపాటు ఈ వారంలో వెల్లడికానున్న ప్రధాన బ్యాంకులు సహా, రవాణా సంస్థల త్రైమాసిక ఆదాయ నివేదికలకై పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారన్నారు. ట్రంప్ 45వ అమెరికా ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాక యూఎస్ మార్కెట్లు రెండు నెలలపాటు ర్యాలీ బాటలో సాగిన సంగతి తెలిసిందే. -
వాల్ స్ట్రీట్‌లో అడుగుపెట్టబోతున్న ఫ్లిప్‌కార్ట్
-
వాల్‌స్ట్రీట్‌లో అడుగుపెట్టబోతున్న ఫ్లిప్‌కార్ట్
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వాల్ స్ట్రీట్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. అమెరికా స్టాక్ మార్కెట్లో ప్రధాన సూచీ నాస్డాల్లో ఐపీఓ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)కు ప్రీపేర్ అవుతోందని బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ చేసింది. ఇదే సమయంలో నాలుగు అతిపెద్ద ఆడిట్ సంస్థల్లో ఒకదాన్ని నియమించుకోనున్నట్టు బుధవారం తెలిపింది. 2018లో ఈ సంస్థ నాస్డాక్లో ఐపీఓకు రావొచ్చని రిపోర్టు పేర్కొంది. ఈ విషయాన్ని ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈవో బిన్నీ బన్సాల్ ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా తెలిపినట్టు రిపోర్టు వెల్లడించింది. ఐపీవో ద్వారా తన కీలక కర్తవ్యాన్ని చూడబోతున్నారంటూ ఉద్యోగులకు ఆయన తెలిపారు. కాగ, సోమవారం ఫ్లిప్‌కార్ట్ మాజీ టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ కల్యాణ్ కృష్ణమూర్తిని సీఈవోగా నియమించి, సహవ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్‌ను గ్రూప్ సీఈవోగా కూర్చోపెట్టింది. తన పెట్టుబడిదారుల్లో ఒకరు సంస్థను గట్టి నియంత్రణలో పెట్టాలని ఫ్లిప్‌కార్ట్ భావించింది. తాజా మార్పులతో ఫ్లిప్‌కార్ట్‌లో అత్యధిక పెట్టుబడులు కలిగిన టైగర్ గ్లోబల్ కంపెనీకి, సంస్థ గాడ్ ఫాదర్‌గా పేరొందిన లీ ఫిక్సెల్‌కు మేనేజ్మెంట్ స్థాయిలో పూర్తిస్థాయిలో నియంత్రణ దక్కినట్టు అయింది. భారతీయ కీలక ఈ-కామర్స్ కంపెనీ బోర్డు రూమ్‌లో ఈ కంపెనీలు నిర్ణయాత్మక స్థితికి చేరుకోవడం గమనార్హం. -
పోర్న్ స్టార్ గా మారిన ఫైనాన్స్ ఎక్స్ పర్ట్
చేతి సంచిలో ఫ్లోరిడా యూనివర్సిటీ నుంచి పొందిన ఫైనాన్స్ డిగ్రీ.. హృదయాంతరాళంలో ప్రపంచాన్ని జయించాలనే యవ్వన ఉద్రేకంతో ఈస్ట్ నదీ తీరంలోని వాల్ స్ట్రీట్ లోకి అడుగుపెట్టిందో యువతి. అంతకు ముందే తాను దరఖాస్తు చేసుకున్న లాజర్డ్ అసెర్ట్స్ మేనేజ్ మెంట్ కంపెనీలో ఇంటర్వ్యూకు వచ్చిన ఆ 22ఏళ్ల ఆ యువతి పేరు పైజే జెన్నింగ్స్ . అర్థ శాస్త్రంలో అంతోఇంతో పట్టున్న ఆమె చలాకీ కూడా. దీంతో ఫైనాన్స్ ఇంటర్న్(శిక్షణ విద్యర్థిని) ఉద్యోగం సులభంగానే లభించింది. లాజర్డ్ ప్రతినిధిగా వందలాది మంది వినియోగదారులకు నిత్యం ఫోన్లు చేస్తూ, ఆర్థిక విషయాలను వివరించడం, రకరకాల ఆఫర్లు చెబుతూ కొత్త క్లైంట్లను చేర్చుకోవటం జెన్నింగ్స్ దినచర్య. రోజులో సగం సమయం కంపెనీ ఉన్నతికే ధారపోసేది. సౌందర్యవతి అయిన జెన్నింగ్స్ ను బాస్ నుంచి ఆఫీస్ బాయ్ దాకా ఆరాధించేవాళ్లు. కొన్నిసార్లు కొందరు 'అడ్వాంటేజ్' కూడాతీసుకున్నారట. అలా కాలం గడుస్తున్నకొద్దీ జీవితమంటే విరక్తిభావం పెరిగిపోయిందామెలో. చాలీచాలని జీతం కూడా అసహనానికి మరో కారణం. యవ్వనంలో ప్రవేశించినప్పటి నుంచి ఎన్నో కలలు కన్న ఆమెకు.. తాను కేవలం 'కార్పొరేట్ బాక్స్'గా ఉండిపోవటం నచ్చలేదు. ఆ గజిబిజి ఆలోచనలు జెన్నింగ్స్ ను క్రమంగా అనియంత్రిత లైంగిక వాంఛలవైపు నడిపించాయి. మనుషుల్లో చాలామంది లైంగిన అసంతృప్తతో జీవిస్తారని గట్టిగా నమ్మే ఆమె.. తాను మాత్రం స్వేఛ్చాయిత శృంగార జీవితాన్ని అనుభవిచాలనుకుంది. తన కోరికకు తగ్గట్లు ఆదాయాన్ని కూడా తెచ్చిపెట్టే అవకాశాల కోసం వెదికిన జెన్నింగ్స్ కు పోర్న్ ఒక అద్భుతమైన మార్గంగా తోచింది. ఇండియన్ కెనడియన్ కరన్జీత్ కౌర్ వోహ్రా.. సన్నీ లియోన్ అయినట్లు జెన్నింగ్స్ తన పేరును వెరోనికా వెయిన్ గా మార్చుకుంది. ఆఫీస్ లోని టాయిలెట్లలో హాట్ హాట్ సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే! 24 గంటలు తిరిగిసరికల్లా వెరోనికా హాట్ స్టార్ అయిపోంది. ఫేస్ బుక్, ట్విట్టర్లలో ఆమె ఫొటోలు విపరీతంగా షేర్ అయ్యాయి. నిజానికి ఆమె ఆ సెల్ఫీలు తీసుకుంది .. పేరుమోసిన పోర్న్ రియాలిటీ షో 'సెక్స్ ఫ్యాక్టర్'లో నటించేందుకు అప్లై చెయ్యడానికి! ఎలాగైతేనేం జనంలో క్రేజ్ తో పాటు రియాలిటీ షోలో అవకాశం కూడా వచ్చింది. లాస్ వెగాస్ లో చిత్రీకరణ జరుపుకునే సెక్స్ ఫ్యాక్టర్ నటీనటులకు హాలీవుడ్ స్టార్లకు సమానంగా క్రేజ్ ఉంటుంది. 'శృంగారం నాకు ఇష్టమైన పని. దాన్ని ఆస్వాదింస్తూనే రెండు చేతులా సంపాదిస్తున్నా. ఫైనాన్స్ ఇంటర్న్ గా ఉన్నప్పటి కంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు. ఎలాగూ నేను ఫైనాన్స్ ఎక్స్ పర్ట్ నే కాబట్టి భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తపడుతున్నా. పోర్న్ ఫీల్డ్ లో రాణించడం అంత తేలికేంకాదు. మా అమ్మ, బాయ్ ఫ్రెండ్ సహకారంతోనే నేనీ స్థాయికి ఎదిగా' అంటూ మనోగతాన్ని చెబుతోంది వెరోనికా. ఉన్నత చదువులు చదివి పోర్న్ స్టార్లుగా ఎదిగనవారు అమెరికాలో కొత్తేంకాదు. ఇప్పటికే ఆ రంగంలో ప్రపంచఖ్యాతి పొందిన నికోల్ ఆనిస్టీన్ ఒకప్పుడు బ్యాంక్ టెల్లర్. మెర్సిడెస్ కెరీరా కొంతకాలం ఇంజనీర్ గానూ పనిచేసింది. అన్నట్లు ఫోటోలు పోస్ట్ చేసిన నాలుగు నెలల్లోనే పోర్న్ స్టార్ వెరోనికా ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య లక్షకు చేరువైంది. -
జాక్‌పాట్ కొట్టేసింది!
గ్లామర్ పాయింట్ విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన రిదిమకు అకాడమీ సినిమాల గురించి మాట్లాడుకునే అవకాశం కంటే అకాడమిక్ పుస్తకాల గురించి మాట్లాడే అవకాశమే ఎక్కువగా వచ్చేది. సినిమాల గురించి మాట్లాడుకున్న సందర్భం కంటే సీరియస్ టాపిక్ల మీద మాట్లాడుకున్న సందర్భాలే ఎక్కువ. న్యూయ్యార్క్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత బుద్ధిగా వాల్‌స్ట్రీట్‌లో 9 టు 5 జాబ్‌లో చేరింది రిదిమ. అయినంత మాత్రాన మనసులో దాగున్న ‘కళ’ ఊరికే ఉంటుందా? అందుకే నెలలు తిరక్కుండానే ఆ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి తన అభిరుచిని వెదుక్కుంటూ ముంబాయికి వచ్చింది రిదిమ. సినిమాల కంటే ముందు వొడాఫోన్, కోకోకోలా, టైటాన్... మొదలైన యాడ్స్‌లో నటించింది. అయితే ఇప్పుడు ఆమె జాక్‌పాట్ కొట్టేసింది అంటున్నారు సినీ విశ్లేషకులు. ఎందుకంటే జోయా అఖ్తర్ ‘దిల్ దడ్కన్’ సినిమాలో నటించే అవకాశం ఆమెకు వచ్చింది. తనకు ‘2015’ బాగా కలిసొచ్చే సంవత్సరం అని రిదిమ నమ్ముతోంది. ఆమె నమ్మకం నిజం కావాలని ఆశిద్దాం. -
భారీగా పతనమైన అంతర్జాతీయ మార్కెట్లు
న్యూయార్క్: 'ఎబోలా' అమెరికా స్టాక్‌మార్కెట్ ను వణింకించింది. అమెరికాలో ఒకరికి ఎబోలా వైరస్ సోకిందన్న సమాచారం వాల్‌స్ట్రీట్ ను కుదిపేసింది. డౌజోన్స్, నాస్డాక్ ఒక శాతంపైగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. జపాన్ -420(-2.68 శాతం), హాంకాంగ్ -296(-1.29శాతం), సింగపూర్ నిఫ్టీ 100 పాయింట్లు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు అరశాతం పడిపోయాయి. భారత మార్కెట్లకు వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర 94 డాలర్లకు పతనమైంది. -
వెలుగులో ఐటీ, ఎఫ్ఎంసీజీ
ఆసియా స్టాక్ మార్కెట్లు పతనమైనా, భారత్ సూచీలు బుధవారం ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్ల మద్దతుతో పాజిటివ్‌గా ముగిశాయి. చైనా వృద్ధి రేటు మందగించిన ప్రభావంతో జపాన్, హాంకాంగ్, సింగపూర్, కొరియా తదితర ఆసియా మార్కెట్లు 1-2 శాతం మధ్య పడిపోయాయి. యూరప్ మార్కెట్లు కూడా క్షీణతతో ట్రేడవుతున్నా, బీఎస్ఈ సెన్సెక్స్ 30 పాయింట్ల పెరుగుదలతో 21,856 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 5 పాయింట్లు లాభపడి 6,517 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మన మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడే పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాల పట్ల ఆశాభావంతో మార్కెట్ పాజిటివ్‌గా ముగిసిందని బ్రోకింగ్ వర్గాలు తెలిపాయి. తదుపరి వెలువడిన డేటా ప్రకారం మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఫిబ్రవరి నెల ద్రవ్యోల్బణం రేటు 8.1 శాతానికి తగ్గింది. జనవరి నెలలో పారిశ్రామికోత్పత్తి తగ్గొచ్చన్నది మార్కెట్ అంచనా కాగా, ఐఐపీ సూచీ 0.1 శాతం పెరిగింది. లిస్టింగ్‌లోనే శాంకో నీరసం ముంబై: ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్ ద్వారా లిస్టయిన పీవీసీ పైపుల తయారీ సంస్థ శాంకో ఇండస్ట్రీస్ తొలి రోజు 4% నష్టపోయింది. ఈ చిన్న, మధ్యతరహా సంస్థ(ఎస్ఎంఈ) షేరు రూ. 19 వద్ద లిస్టయ్యింది. ఆపై 4.2% క్షీణించి రూ. 17.25 వద్ద ముగిసింది. హిమాచల్ ప్రదేశ్‌లో యూనిట్ కలిగిన శాంకో ఎన్ఎస్ఈ ఎమర్జ్ ద్వారా లిస్టయిన ఐదో కంపెనీగా నిలిచింది. చిన్న సంస్థలు(ఎస్ఎంఈలు) ఐపీవోలను చేపట్టి నిధులు సమీకరించేందుకు వీలుగా ఎన్ఎస్ఈ ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫామ్ ఎమర్జ్‌కాగా, శాంకో గత నెల 24న రూ. 18 ధరలో 24 లక్షల షేర్లను విక్రయించింది. -
ట్విటర్ ఐపీవో @ బిలియన్ డాలర్లు
న్యూయార్క్: సోషల్ నెట్వర్కింగ్ సైటు ట్విటర్ ప్రతిపాదిత ఐపీవో ద్వారా 1 బిలియన్ డాలర్లను సమీకరించాలని యోచిస్తోంది. ఈ నిధులను వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ వ్యయాలు మొదలైన వాటికి ఉపయోగించుకోనున్నట్లు ట్విటర్లో పోస్ట్ చేసిన ట్వీట్లో సంస్థ పేర్కొంది. 2013లో పెట్టుబడి వ్యయాలు సుమారు 225-275 మిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించింది. ప్రస్తుతానికి ఐపీవోకి సంబంధించి ప్రాథమిక దరఖాస్తు ఎస్-1ని సమర్పించనున్నట్లు ట్విటర్ వివరించింది. కంపెనీ 2011లో 106 మిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించగా 2012లో ఇది 317 మిలియన్ డాలర్లకు పెరిగింది. 2011లో నష్టం 128 మిలియన్ డాలర్లు కాగా, 2012లో నష్టం 79 మిలియన్ డాలర్లు. యూజర్ల సంఖ్య వృద్ధి క్రమంగా నెమ్మదిస్తుండటంతో పాటు పలు అంశాల కారణంగా భవిష్యత్‌లో ఆదాయాల వృద్ధి రేటు కూడా కాస్త నెమ్మదించవచ్చని సంస్థ పేర్కొంది. 2006లో ప్రారంభమైన ట్విటర్ యూజర్లు ప్రస్తుతం సగటున మూడు నెలల్లో 218.3 మిలియన్లుగా ఉన్నారు. -
సెన్సెక్స్ దూకుడు.. 405 పాయింట్ల ర్యాలీ
రిజర్వ్ బ్యాంకు చేపట్టిన తాజా చర్యల ప్రభావమో లేక షార్ట్ కవరింగ్ మహత్మ్యమో... రూపాయి ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. మూడు రోజుల నష్టాలకు చెక్‌పెడుతూ ఏకంగా 3%(225 పైసలు) హైజంప్ చేసి 66.55 వద్ద ముగిసింది. డాలరుతో మారకంలో ఉదయమే ఊపందుకున్న రూపాయి ప్రభావంతో స్టాక్ మార్కెట్లలోనూ జోష్ వచ్చింది. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సెన్సెక్స్ లాభాలతో మొదలైంది. ఆపై ఏక్షణంలోనూ వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్లింది. ట్రేడింగ్ ముగిసేసరికి 405 పాయింట్ల మారథాన్ పూర్తిచేసుకుని 18,401 వద్ద స్థిరపడింది. ఇదే విధంగా స్పందించిన నిఫ్టీ కూడా 124 పాయింట్లు ఎగసి 5,400 పాయింట్ల కీలక స్థాయికి ఎగువన నిలిచింది. 5,409 వద్ద ముగిసింది. చమురు ధరలు తగ్గడం కూడా సెంటిమెంట్‌ను మెరుగుపరచిందని విశ్లేషకులు తెలిపారు. కాగా, రూపాయి బలపడటం, చమురు ధరలు తగ్గడంతో ఆయిల్ షేర్లు పుంజుకున్నాయి. ఆర్ఐఎల్ 4% జంప్‌చేయగా, గెయిల్, ఓఎన్జీసీ, ఐవోసీ 2-1.5% మధ్య లాభపడ్డాయి. వెరసి బీఎస్ఈలో ఆయిల్ ఇండెక్స్ అత్యధికంగా 3% పురోగమించింది. ఈ బాటలో అన్ని రంగాలూ లాభపడినప్పటికీ మెటల్, ఎఫ్ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, ఆటో రంగాలు సైతం 2%పైగా పుంజుకున్నాయి. సెసా గోవా దూకుడు సెన్సెక్స్‌లో 5 షేర్లు మాత్రమే నష్టపోగా, కోల్ ఇండియా 1.5% క్షీణించింది. మరోవైపు సెసా గోవా 13.5% దూసుకెళ్లింది. ఈ బాటలో హెచ్డీఎఫ్సీ 6.3% జంప్‌చేయగా, టెలికం దిగ్గజాలు ఆర్‌కామ్ 8%, భారతీ 4%, ఐడియా 4.5% చొప్పున లాభాల మోత మోగించాయి. ఈ బాటలో హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్, ఎన్టీపీసీ, హీరో మోటో, భెల్, ఐటీసీ, టాటా మోటార్స్, ఎల్అండ్టీ, హెచ్‌యూఎల్, ఎంఅండ్ఎం, టీసీఎస్ సైతం 5-2% మధ్య పురోగమించాయి. ఎఫ్ఐఐలు తాజాగా రూ. 248 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అయితే దేశీయ ఫండ్స్ రూ. 76 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. మిడ్ క్యాప్స్ జోరు పుంజుకున్న సెంటిమెంట్‌ను ప్రతిబింబిస్తూ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.5% బలపడింది. ట్రేడైన షేర్లలో 1,274 లాభపడగా, 990 మాత్రమే క్షీణించాయి. మిడ్ క్యాప్స్‌లో ఆమ్టెక్ ఇండియా, ముత్తూట్ ఫైనాన్స్ 19% చొప్పున దూసుకెళ్లగా, నాల్కో, ఇండియా ఇన్ఫోలైన్, జీవీకే పవర్, జీఎస్ఎఫ్ఎల్, రెలిగేర్, భారత్ ఫోర్జ్, కొటక్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సన్ టీవీ, ఫాగ్ బేరింగ్స్, అమరరాజా, స్టెరిలైట్ టెక్, క్రాంప్టన్ గ్రీవ్స్ 14-6% మధ్య లాభపడ్డాయి. నగదు విభాగంలో బీఎస్ఈ నుంచి రూ. 2,190 కోట్లు, ఎన్ఎస్ఈ నుంచి రూ. 15,790 కోట్లు చొప్పున టర్నోవర్ నమోదుకాగా, ఎన్ఎస్ఈ ఎఫ్‌అండ్‌వోలో చివరి రోజు కావడంతో రూ. 3,20,958 కోట్లు జరిగింది.