పోర్న్ స్టార్ గా మారిన ఫైనాన్స్ ఎక్స్ పర్ట్ | How a Wall Street Intern Became a Porn Star | Sakshi
Sakshi News home page

పోర్న్ స్టార్ గా మారిన ఫైనాన్స్ ఎక్స్ పర్ట్

Published Sat, Jan 30 2016 5:40 PM | Last Updated on Tue, Sep 18 2018 8:00 PM

పోర్న్ స్టార్ గా మారిన ఫైనాన్స్ ఎక్స్ పర్ట్ - Sakshi

పోర్న్ స్టార్ గా మారిన ఫైనాన్స్ ఎక్స్ పర్ట్

చేతి సంచిలో ఫ్లోరిడా యూనివర్సిటీ నుంచి పొందిన ఫైనాన్స్ డిగ్రీ..  హృదయాంతరాళంలో ప్రపంచాన్ని జయించాలనే యవ్వన ఉద్రేకంతో  ఈస్ట్ నదీ తీరంలోని వాల్ స్ట్రీట్ లోకి అడుగుపెట్టిందో యువతి. అంతకు ముందే తాను దరఖాస్తు చేసుకున్న లాజర్డ్ అసెర్ట్స్ మేనేజ్ మెంట్ కంపెనీలో ఇంటర్వ్యూకు వచ్చిన ఆ 22ఏళ్ల ఆ యువతి పేరు పైజే జెన్నింగ్స్ . అర్థ శాస్త్రంలో అంతోఇంతో పట్టున్న ఆమె చలాకీ కూడా. దీంతో ఫైనాన్స్ ఇంటర్న్(శిక్షణ విద్యర్థిని) ఉద్యోగం సులభంగానే లభించింది.

లాజర్డ్  ప్రతినిధిగా వందలాది మంది వినియోగదారులకు నిత్యం ఫోన్లు చేస్తూ, ఆర్థిక విషయాలను వివరించడం, రకరకాల ఆఫర్లు చెబుతూ కొత్త క్లైంట్లను చేర్చుకోవటం జెన్నింగ్స్ దినచర్య. రోజులో సగం సమయం కంపెనీ ఉన్నతికే ధారపోసేది. సౌందర్యవతి అయిన జెన్నింగ్స్ ను బాస్ నుంచి ఆఫీస్ బాయ్ దాకా ఆరాధించేవాళ్లు. కొన్నిసార్లు కొందరు 'అడ్వాంటేజ్' కూడాతీసుకున్నారట. అలా కాలం గడుస్తున్నకొద్దీ జీవితమంటే విరక్తిభావం పెరిగిపోయిందామెలో. చాలీచాలని జీతం కూడా అసహనానికి మరో కారణం.

యవ్వనంలో ప్రవేశించినప్పటి నుంచి ఎన్నో కలలు కన్న ఆమెకు.. తాను కేవలం 'కార్పొరేట్ బాక్స్'గా ఉండిపోవటం నచ్చలేదు. ఆ గజిబిజి ఆలోచనలు జెన్నింగ్స్ ను క్రమంగా అనియంత్రిత లైంగిక వాంఛలవైపు నడిపించాయి. మనుషుల్లో చాలామంది లైంగిన అసంతృప్తతో జీవిస్తారని గట్టిగా నమ్మే ఆమె.. తాను మాత్రం స్వేఛ్చాయిత శృంగార జీవితాన్ని అనుభవిచాలనుకుంది. తన కోరికకు తగ్గట్లు ఆదాయాన్ని కూడా తెచ్చిపెట్టే అవకాశాల కోసం వెదికిన జెన్నింగ్స్ కు పోర్న్ ఒక అద్భుతమైన మార్గంగా తోచింది. ఇండియన్ కెనడియన్ కరన్జీత్ కౌర్ వోహ్రా.. సన్నీ లియోన్ అయినట్లు జెన్నింగ్స్ తన పేరును వెరోనికా వెయిన్ గా మార్చుకుంది. ఆఫీస్ లోని టాయిలెట్లలో హాట్ హాట్ సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే!

24 గంటలు తిరిగిసరికల్లా వెరోనికా హాట్ స్టార్ అయిపోంది. ఫేస్ బుక్, ట్విట్టర్లలో ఆమె ఫొటోలు విపరీతంగా షేర్ అయ్యాయి. నిజానికి ఆమె ఆ సెల్ఫీలు తీసుకుంది .. పేరుమోసిన పోర్న్ రియాలిటీ షో 'సెక్స్ ఫ్యాక్టర్'లో నటించేందుకు అప్లై చెయ్యడానికి! ఎలాగైతేనేం జనంలో క్రేజ్ తో పాటు రియాలిటీ షోలో అవకాశం కూడా వచ్చింది. లాస్ వెగాస్ లో చిత్రీకరణ జరుపుకునే సెక్స్ ఫ్యాక్టర్ నటీనటులకు హాలీవుడ్ స్టార్లకు సమానంగా క్రేజ్ ఉంటుంది.

'శృంగారం నాకు ఇష్టమైన పని. దాన్ని ఆస్వాదింస్తూనే రెండు చేతులా సంపాదిస్తున్నా. ఫైనాన్స్ ఇంటర్న్ గా ఉన్నప్పటి కంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు. ఎలాగూ నేను ఫైనాన్స్ ఎక్స్ పర్ట్ నే కాబట్టి భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తపడుతున్నా. పోర్న్ ఫీల్డ్ లో రాణించడం అంత తేలికేంకాదు. మా అమ్మ, బాయ్ ఫ్రెండ్ సహకారంతోనే నేనీ స్థాయికి ఎదిగా' అంటూ మనోగతాన్ని చెబుతోంది వెరోనికా.

ఉన్నత చదువులు చదివి పోర్న్ స్టార్లుగా ఎదిగనవారు అమెరికాలో కొత్తేంకాదు. ఇప్పటికే ఆ రంగంలో ప్రపంచఖ్యాతి పొందిన నికోల్ ఆనిస్టీన్ ఒకప్పుడు బ్యాంక్ టెల్లర్. మెర్సిడెస్ కెరీరా కొంతకాలం  ఇంజనీర్ గానూ పనిచేసింది. అన్నట్లు ఫోటోలు పోస్ట్ చేసిన నాలుగు నెలల్లోనే పోర్న్ స్టార్ వెరోనికా ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య లక్షకు చేరువైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement