Nasdaq
-
‘ఇన్సైడర్ ట్రేడింగ్’.. అమెరికాలో ఎన్నారై విభాగం టీడీపీ నేతలకు 25 ఏళ్ల జైలు శిక్ష!
అమెరికా టీడీపీ ఎన్నారై విభాగంలో కీలక సభ్యులుగా వ్యవహరిస్తున్న నెల్లూరు జనార్ధన్ చౌదరి, బర్మా శివ నారాయణ చౌదరిలు జైలు శిక్ష అనుభవించనున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడినట్లు తేలడంతో అమెరికా న్యాయ స్థానం సుమారు 25 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో తుది తీర్పు వెలువరించనుంది. నెల్లూరు జనార్ధన్ చౌదరి, బర్మా శివ నారాయణ చౌదరిలు అమెరికాలో ఐటీ ప్రొఫెషనల్స్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఓవైపు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూనే అమెరికా టీడీపీ ఎన్నారై విభాగంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే వారిద్దరు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడడంతో కాలిఫోర్నియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికన్ స్టాక్ ఎక్చ్ంజ్లో నమోదైన ఓ పబ్లిక్ ట్రెడెడ్ కంపెనీ నిర్వహించే ట్రేడింగ్‌లో.. ఆ కంపెనీ స్టాక్స్‌తో పాటు ఇతర ఆర్ధిక సంబంధిత రహస్య సమాచారాన్ని నాలుగు సార్లు ఇతరులకు చేరవేయడం ద్వారా నిందితులు లాభపడేలా సెక్యూరిటీ ఫ్రాడ్‌కు పాల్పడినట్లు తేలింది. శివ నారాయణ బర్మాతో పాటు అతని సహచరుడు నెల్లూరు జనార్ధన్ కుట్రపూరితంగా సెక్యూరిటీ మోసానికి పాల్పడ్డారంటూ 2019లో అమెరికన్ పోలీసులు అభియోగాలు మోపారు. కేసు విచారణ కొనసాగుతుండగా సత్యనారాయణ సహచరుడు తాము నేరం చేసినట్లు అంగీకరించాడు. దీనిపై జ్యూరీ ట్రయల్స్ (కోర్టు ధర్మాసనం) విచారణ జరిపి గతేడాది డిసెంబర్ 13న తీర్పు వెలువరించారు. పాలో ఆల్టో నెట్వర్క్స్ జ్యూరీ ట్రయల్స్‌లో నిందితుడు శివ నారాయణ అమెరికా టెక్నాలజీ ఎక్స్ఛేంజ్ 'నాస్డాక్'లో లిస్టైన పాలో ఆల్టో నెట్వర్క్ క్వార్టర్లీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ గురించిన సమాచారాన్ని షేర్ చేసి ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారించారు. సమాచారాన్ని షేర్ చేయకూడదు స్టాక్ ఎక్ఛేంజీలలో లిస్టెడ్ కంపెనీలు తమ పనితీరు, లాభనష్టాల గురించి ప్రతి మూడు నెలలకు (క్యూ1, క్యూ2, క్యూ3, క్యూ4) ఒకసారి బహిరంగంగా ప్రకటిస్తుంటాయి. ఆ మూడు నెలల లోపల కంపెనీ పనితీరు గురించి ఎవరికి షేర్ చేయరు. అలా చేయడం వల్ల స్టాక్ మార్కెట్లో ఆసంస్థ పనితీరుపై ప్రభావం చూపుతుంది. స్టాక్ వ్యాల్యూపెరగడం,తగ్గడంలాంటి ఒడిదుడుకులకు లోనవుతుంటాయి. అందుకే 3 నెలలు ముగిసిన తర్వాతనే కంపెనీల పనితీరును అనౌన్స్ చేస్తాయి. ఆ సమాచారాన్ని సత్యనారాయణ పాలో ఆల్టో నెట్వర్క్స్ పనితీరు గురించి ముందే లీక్ చేశారు. అన్నం పెట్టిన ఇంటికే సున్నం రహస్యంగా ఉండే కంపెనీల సమాచారాన్ని శివ నారాయణ ముందే ఎలా చేరవేశారనే అనుమానంతో పోలీసులు లోతుగా విచారణ జరిపారు. ఆ విచారణలో నిందితుడు పాలో ఆల్టో నెట్వర్క్స్ మాజీ కాంట్రాక్టర్‌గా పనిచేసినట్లు తేలింది. కాంట్రాక్టర్‌గా పనిచేసే సమయంలో ఆ సంస్థ ఐటీ విభాగంలో పనిచేసే ఉద్యోగుల్ని కలిసినట్లు, వారి ద్వారా కంపెనీ ఆర్ధిక పరమైన రహస్యాలు సేకరించినట్లు నార్తన్ డిస్ట్రీక్ కాలిఫోర్నియా న్యాయవాది స్టెఫానీ ఎమ్ హిండ్స్ కార్యాలయం తెలిపింది ఏడాది కాలంగా శివ నారాయణ బర్మా ఓ వైపు ఉద్యోగిగా పనిచేస్తూనే.. మరోవైపు పాలో ఆల్టో నెట్వర్క్ 4 సార్ల త్రైమాసిక ఆదాయ ఫలితాల సమాచారంతో అక్టోబర్ 2016 నుంచి సెప్టెంబర్ 2017 వరకు ఇన్ సైడ్ ట్రేడింగ్ నిర్వహించారు. సంస్థకు చెందిన రహస్య సమాచారంతో పాటు, ట్రేడింగ్ ఇన్స్ట్రక్షన్ గురించి.. ఆ కంపెనీ షేర్లు కొన్న ఇన్వెస్టర్లకు చేరవేశారు. దీంతో మదుపర్లు 5 రెట్లు లాభపడ్డారు. 7.3 మిలియన్ల లాభం అదే సమయంలో శివ నారాయణ సైతం నాలుగు సార్లు 7.3 మిలియన్లు, అంతకంటే ఎక్కువ అర్జించారు. ఇక జ్యూరీ సభ్యులు విచారణలో 18 యూఎస్ఈ సెక్షన్లు 1348ని ఉల్లంఘించి నాలుగు సెక్యూరిటీల మోసాలకు పాల్పడ్డారని, జ్యూరీ గత వారం బరామాను దోషిగా నిర్ధారించింది. 25ఏళ్లు జైలు శిక్ష విచారణలో ప్రధాన యూఎస్ కాలిఫోర్నియా జిల్లా న్యాయమూర్తి రిచర్డ్ సీబోర్గ్ బరామకు శిక్షా విచారణ తేదీని ఖరారు చేయలేదు. ఒకవేళ అతనికి 25ఏళ్ల శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు 18 యూఎస్ఈ సెక్షన్లు 1348ని ఉల్లంఘన నియమావళిలో ఉంది. -
ఫేస్‌బుక్‌కు గట్టి షాకిచ్చిన యూజర్లు..! దెబ్బకు ఒక్క రోజులోనే లక్షన్నర కోట్లు..!
ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును నమోదుచేసుకుంది. ఒక్కరోజులోనే మెటా షేర్లు 20 శాతం తగ్గి సుమారు రూ. 200 బిలియన్ డాలర్ల నష్టాలను మూటగట్టుకుంది. భారీ షాకిచ్చిన యూజర్లు..! సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు యూజర్లు గట్టి షాకిచ్చారు. ఫేస్బుక్ 18 ఏళ్ల చరిత్రలో తొలిసారి రోజువారీ యూజర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో మెటా షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. టిక్‌టాక్, యూట్యూబ్ నుంచి గణనీయమైన పోటీ రావడంతో మెటా గడిచిన త్రైమాసికంలో భారీ నష్టాలను మూటకట్టుకుంది. మెటా మార్కెట్ విలువలో ఏకంగా 200 బిలియన్ డాలర్లు ఇట్టే ఆవిరయ్యాయి. మరోవైపు ట్విటర్, పిన్ట్రస్ట్, స్నాప్ చాట్ షేర్లు కూడా నేల చూపులు చూశాయి. కొంపముంచిన వివాదాలు..! గత ఏడాది మెటా సీఈవో జుకర్‌బర్గ్‌కు అంతగా కలిసి రాలేదు. అనేక వివాదాలలో చిక్కుకొని తీవ్రంగా సతమతమయ్యాడు మార్క్. ఫేస్బుక్ వచ్చిన ఆరోపణలతో పేరెంట్ కంపెనీ పేరును మెటాగా మార్చుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గత ఏడాది ఫేస్‌బుక్‌పై వచ్చిన తీవ్ర ఆరోపణలు యూజర్లపై భారీగానే ప్రభావం చూపింది. మెటా క్యూ 4 అంచనాల్లో యూజర్ల సంఖ్య 1.95 బిలియన్లుగా ఫేస్బుక్ పేర్కొంది. సుమారు రెండు మిలియన్ల మంది డెయిలీ యూజర్లను ఫేస్బుక్ కోల్పోయింది. చదవండి: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన విమానం.. కేవలం గంటలో! -
ఎలన్ మస్క్ దెబ్బకు.. వారంలో రూ.13 లక్షల కోట్లు ఆవిరి
క్షణాలలో లక్షల కోట్లు సంపాదించాలన్నా.. నిమిషాల్లో అంతే సంపదను ముంచేయాలన్నా అపరకుబేరుడు ఎలన్ మస్క్‌కి చిటికేసినంత పని. గతంలో ‘ట్వీట్ల’ ద్వారానే అలాంటి పనులు చేసేవాడు. అలాంటిది తన చేష్టలతో ఈసారి టెస్లా కొంపముంచుతున్నాడు. ఈవీ దిగ్గజం టెస్లా షేర్లు ప్రస్తుతం అమెరికన్ మార్కెట్లో పతనం దిశగా దూసుకుపోతున్నాయి. టెస్లా సీఈవో ఎలన్ మస్క్ చేష్టల వల్లే ఈ పతనం మొదలుకావడం విశేషం. సుమారు 6.9 బిలియన్ డాలర్ల విలువైన తన పది శాతం వాటా ఎలన్ మస్క్ అమ్మేసుకున్న విషయం తెలిసిందే. ఈ మరుక్షణం నుంచే టెస్లా షేర్ల విలువలు పడిపోతూ వస్తున్నాయి. ఎలన్ మస్క్ తన ట్రస్ట్ వద్ద ఉన్న 1.2 మిలియన్ షేర్లను $1.2 బిలియన్లకు విక్రయించాడు. టెస్లాలో తన వాటాలోని షేర్లలో 10 శాతం(17 మిలియన్ షేర్లు) అమ్మకానికి ఉంచాలనుకుంటున్నట్లు గత శనివారం ఆయన ట్వీట్ పోల్ ద్వారా ఫాలోవర్స్ ఒపినీయన్ కోరారు. ఎక్కువ మంది ఆ పోల్‌కు సమ్మతి తెలపడంతో.. ఇప్పటివరకు 6.36 మిలియన్ షేర్లు అమ్మేశాడు. సో.. మరో 10 మిలియన్ షేర్లు అమ్మేస్తే తను అనుకున్నది పూర్తవుతుంది. టెస్లా ఇంక్ షేర్లు శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి 2.8 శాతం పడిపోయిన టెస్లా షేర్లు, 1,033.42 డాలర్ వద్ద ముగిసింది. టెస్లాకు రూ.13 లక్షల కోట్ల నష్టం 2003లో కంపెనీ స్థాపించబడిన తర్వాత మస్క్ ఇంత పరిమాణంలో తన వాటాను అమ్మేయడం ఇదే మొదటిసారి. టెస్లా షేర్లు ఈ వారం 15.4% పడిపోయి మార్కెట్ విలువలో సుమారు $187 బిలియన్ల(రూ.1,39,02,51 లక్షల కోట్లు)ను కోల్పోయింది. ఫోర్డ్ మోటార్ కో, జనరల్ మోటార్స్ కో సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్ల కంటే ఇది చాలా ఎక్కువ. ఈ వారంలో టెస్లా షేర్లు భారీగా నష్టపోయినప్పటికి టెస్లా ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత విలువైన ఆటోమేకర్ సంస్థగా నిలిచింది. ఈ అమ్మకానికి ముందు స్టాక్ ఆప్షన్స్‌తో కలిపి ఎలన్ మస్క్‌కి సుమారు 23 శాతం స్టాక్ వాటా టెస్లాలో ఉంది. అయితే సరైన కారణాలు చెప్పకుండా ఆయన చేస్తున్న పని మార్కెట్‌ను మాత్రం కుదేలు చేస్తోంది. (చదవండి: ఆకాశంలో అద్భుతం.. 580 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి!) -
కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తోన్న ట్రూకాలర్..!
స్టాక్‌హోమ్: స్వీడిష్ కాలర్ ఐడెంటిఫికేషన్ సర్వీస్ మరో కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీకి చెందిన క్లాస్ బీ షేర్లను నాస్డాక్ స్టాక్‌హోమ్‌లో లిస్ట్ చేయడానికి ప్లాన్ వేస్తోంది. మార్కెట్ పరిస్థితులను బట్టి ట్రూకాలర్ లిస్టింగ్ 2021 నాల్గో త్రైమాసికంలో పూర్తవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఐపీవోలో భాగంగా 116 మిలియన్ డాలర్లను సేకరించాలని కంపెనీ యోచిస్తోంది. చదవండి: Jeff Bezos:జెఫ్‌బెజోస్ దెబ్బకు దిగివచ్చిన నాసా..! ట్రూకాలర్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలాన్ మామెడి మాట్లాడుతూ...కనీసం రెండు సంవత్సరాల పాటు ఐపీవోపై ట్రూకాలర్ పనిచేస్తోందని వెల్లడించారు. సీక్వోయా క్యాపిటల్ , అటామికో కంపెనీలు ట్రూకాలర్ ఇన్వెస్టర్లుగా నిలిచాయి. ఒక నివేదిక ప్రకారం ట్రూకాలర్ సుమారు 95 మిలియన్ డాలర్లను సేకరించింది. గత ఆరు సంవత్సరాల నుంచి పలు ఇన్వెస్టర్ల నుంచి 100 మిలియన్ డాలర్లను సేకరించడంతో ట్రూకాలర్ విలువ ఒక బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 278 మిలియన్ల ఆక్టివ్ యూజర్లు ట్రూకాలర్ సొంతం. ఇటీవలి కాలంలో ఆపిల్, గూగుల్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో కాలర్ ఐడి ఫీచర్‌ను మెరుగుపరిచినప్పటికీ, స్పామ్ కాల్‌లను అరికట్టడానికి అనేక ఇతర చర్యలు తీసుకున్నప్పటికీ, ట్రూకాలర్ వాటిని పరిష్కరించలేకపోయింది. భారత్‌ను అతి పెద్ద మార్కెట్‌గా ట్రూకాలర్ పరిగణిస్తోంది. చదవండి: MediaTek : భారీ రిక్రూట్మెంట్కు ప్లాన్ చేస్తోన్న మీడియాటెక్..! -
అమ్మగా.. సీఈవోగా అంజలీ సూద్..
అంజలీ సూద్ ‘వీమియో’ కంపెనీ సీఈవో. వీడియో హోస్టింగ్, షేరింగ్, సర్వీసెస్ ఇస్తుండే అమెరికన్ కంపెనీ వీమియో. ఆరేళ్ల క్రితం వీమియోలో చేరారు అంజలీ. మొదట మార్కెటింగ్ హెడ్, తర్వాత జనరల్ మేనేజర్, గత నాలుగేళ్లుగా సీఈవో. వీమియో ఈ నెల 25న పబ్లిక్ షేర్స్‌కి వెళ్లింది. ఆ ఘనమైన సందర్భాన్ని ట్విట్టర్లో చిన్న ఫొటోతో అతి శక్తిమంతంగా ప్రకటించారు అంజలీ సూద్. అది ఆమె నాస్డాక్ బిల్డింగ్ ఎదురుగా నిలుచుని ఉన్న ఫోటో అయితే కాదు. కొడుకును ఎత్తుకుని తన ఆఫీస్ క్యాబిన్ డోర్ దగ్గర నిలుచుని ఉన్న ఫొటో! వీమియోలో మొదట చేరినప్పుడు గానీ, తర్వాత ఆ కంపెనీకి సీఈవో అయినప్పుడు గానీ, రెండేళ్ల క్రితం ఫార్చూన్ అండర్ 40 జాబితాలో 14వ స్థానంలో ఉన్నప్పుడు గానీ అంజలీ సూద్ నుంచి వర్కింగ్ మదర్స్ పొందిన స్ఫూర్తి బయటికేమీ కనిపించలేదు. ఇప్పుడు ఆ కంపెనీ పబ్లిక్ షేర్స్‌కి వెళ్లి నాస్డాక్లో లిస్ట్ అయినప్పుడు కూడా ఆమె తన రెండేళ్ల వయసున్న కొడుకును ఎత్తుకుని ఉన్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేయకపోయి ఉంటే అది కూడా ఒక మామూలు విషయంగానే నిలిచిపోయేది. ఫొటోతోపాటు అంజలి (37) పెట్టిన కామెంట్ ఎలా ఉందో చూడండి. ‘‘అమ్మ కాలింగ్ బెల్ కొట్టడానికి ముందే వచ్చి అదృష్టం ఆమెను హత్తుకుపోయింది’’ అని! పబ్లిక్ షేర్స్‌కి ఓపెనింగ్ బెల్ ఇవ్వడానికి ముందే తన కంపెనీ ప్రజల్లోకి వెళ్లిపోయింది అని చెప్పడం ఆమె ఉద్దేశం. ‘‘ఇలాంటి రోజు ఒకటి వచ్చిందంటే నమ్మలేక పోతున్నాను’’ అని కూడా ఆ పోస్ట్‌లో రాశారు అంజలి. ఒక పెద్ద కంపెనీ సీఈవో పింక్ సూట్, బూట్లు ధరించి ఆఫీస్‌లో తన కొడుకు ను ఎత్తుకుని చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఫొటో మహిళా సాధికారతకు మాత్రమే కాదు, సంపూర్ణాధికారతకు ప్రతీకలా కనిపించింది. సాధారణ భాషలో చెప్పాలంటే వర్కింగ్ మదర్స్ అందరికీ ఆ ఫొటో భలే ముచ్చటగా అనిపించింది. బహుశా అంజలిలో ఎవరికి వారు తమను చూసుకుని ఉంటారు. శక్తి పొంది ఉంటారు. ఇంటి పనీ, ఆఫీస్ పనీ అంటూ మల్టీ టాస్కింగ్ చెయ్యడం ఏ తల్లికీ సాధ్యం అయ్యే పని కాదు. ‘‘కానీ పిల్లలు సాధ్యం చేయిస్తారు’’ అని ఒక నెట్ యూజర్ అంజలికి థమ్స్ అప్ ఇచ్చారు. ‘‘అలసిన శరీరానికి విశ్రాంతి, అలసిన మనసుకు పిల్లలు’’ అని మరొక మహిళ ట్వీట్ చేశారు. మొదటి ఫొటోను షేర్ చేసిన నాలుగు నిముషాలకు ఈ ఫొటోను షేర్ చేశారు అంజలి. కంపెనీ ‘పబ్లిక్’ షేర్స్‌కి వెళ్లిన సందర్భాన్ని డైరెక్టర్స్‌తో కలిసి షేర్స్ చేసుకుంటున్న ఆ మొదటి ఫొటో కన్నా, కొడుకును ఎత్తుకుని ఉన్న రెండో ఫొటోనే నెటిజన్స్‌ని ఎక్కువ ఆకట్టుకుంది. అనేక వందలసార్లు షేర్ అయింది. ఒక మదర్.. వర్కింగ్ ఉమన్‌గా తన కెరీర్లో అద్భుతాలు సాధించడానికి పిల్లలు శక్తినిస్తారు అనే సందేశాన్ని అంజలి ఆ ఫొటో ద్వారా అందించ తలచినట్లున్నారు. అది సరిగ్గా అందవలసిన వారికే అందింది. పిల్లల బాధ్యతలు తల్లి కెరీర్‌కు ప్రతిబంధకాలు కావని చెప్పలేం. కానీ కెరీర్లోఎదిగే క్రమంలో అవహించే నిస్సత్తువను పోగొట్టే మంత్రదండాలు పిల్లల చిరువ్వులూ, ఇంటికి వచ్చీరాగానే ఎత్తుకోమని ఏడుస్తూ వారు చేసే డిమాండ్లూ! -
యూఎస్ మార్కెట్ల సరికొత్త రికార్డ్
న్యూయార్క్, సాక్షి: యూఎస్ కాంగ్రెస్‌లో డెమక్రాట్ల ఆధిపత్యం కారణంగా కొత్త ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్న జో బైడెన్‌పై అంచనాలు పెరిగాయి. దీంతో కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొనే బాటలో ప్రభుత్వం ఇకపై భారీ సహాయక ప్యాకేజీలకు తెరతీయవచ్చన్న అంచనాలు పెరిగాయి. మరోపక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ట్రంప్‌ను గడువుకంటే ముందే అధికారం నుంచి తప్పించేందుకు చర్యలు మొదలైనట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి గురువారం యూఎస్ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకాయి. డోజోన్స్ 212 పాయింట్లు(0.7 శాతం) ఎగసి 31,041 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 56 పాయింట్ల(1.5 శాతం) వృద్ధితో 3,804 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 327 పాయింట్లు(2.6 శాతం) జంప్‌చేసి 13,067 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త గరిష్టాలుకావడం విశేషం! చదవండి: (మారిన ఐటీ కంపెనీల ఫోకస్) బాండ్ల ఈల్డ్స్ అప్ 10ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్ 10 నెలల గరిష్టం 1.081 శాతానికి ఎగశాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 0.5 శాతం బలపడి 89.78ను తాకింది. మరోపక్క పసిడి ధరలు ఔన్స్ 0.3 శాతం నీరసించి 1914 డాలర్లకు చేరాయి. కాగా.. గత వారం నిరుద్యోగ క్లెయిములు అంచనాలకంటే తగ్గడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు తెలియజేశారు. (ప్రపంచ కుబేరుడిగా ఎలన్ మస్క్?) టెస్లా జోరు ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ 8 శాతం జంప్‌చేసి 816 డాలర్లను తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 773 బిలియన్ డాలర్లను అధిగమించింది. ఫలితంగా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ సంపద 188 బిలియన్ డాలర్లను తాకింది. టెస్లా ఇంక్‌లో మస్క్‌కు 20 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా మస్క్ ఆవిర్భవించినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా.. ఐఫోన్ల దిగ్గజం యాపిల్, ఇంటర్నెట్ దిగ్గజం అల్ఫాబెట్, ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, ఎంటర్టైన్మెంట్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్, ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ 3.5-1 శాతం మధ్య జంప్‌చేశాయి. దీంతో ఎస్అండ్పీ, నాస్డాక్ భారీగా బలపడినట్లు నిపుణులు తెలియజేశారు. డీఎక్స్‌సీ టెక్నాలజీ కొనుగోలుకి ఫ్రాన్స్ ఐటీ కన్సల్టింగ్ గ్రూప్ అటోస్ ఎస్ఈ 10 బిలియన్ డాలర్ల ఆఫర్‌ను ప్రకటించడంతో డిక్సన్ షేరు 9 శాతం దూసుకెళ్లింది. -
ప్యాకేజీ ఆశలు- యూఎస్ మార్కెట్ల రికార్డ్స్
న్యూయార్క్: కొత్త ప్రెసిడెంట్‌గా జనవరిలో బాధ్యతలు స్వీకరించనున్న జో బైడెన్ ప్రభుత్వం సహాయక ప్యాకేజీకి తెరతీయనుందన్నఅంచనాలు వారాంతాన అమెరికా స్టాక్ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. ఇన్వెస్టర్లు ప్రధానంగా ఎయిర్‌లైన్స్, క్రూయిజర్, ఇంధన రంగ కౌంటర్లలో కొనుగోళ్లకు ఎగబడటంతో శుక్రవారం మార్కెట్లు సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. డోజోన్స్ 249 పాయింట్లు(0.85 శాతం) ఎగసి 30,218 వద్ద నిలిచింది. ఎస్అండ్పీ 32 పాయింట్లు(0.9 శాతం) లాభపడి 3,699 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 87 పాయింట్లు(0.7 శాతం) బలపడి 12,464 వద్ద స్థిరపడింది. ఎనర్జీ, మెటీరియల్స్, ఇండస్ట్రియల్స్ రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభించినట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. ఉపాధి వీక్ నవంబర్‌లో వ్యవసాయేతర రంగంలో 2.45 లక్షల మందికి మాత్రమే ఉపాధి లభించినట్లు కార్మిక శాఖ గణాంకాలు వెల్లడించాయి. గత ఆరు నెలల్లో ఇది కనిష్టంకాగా.. 4.69 లక్షల మందికి ఉపాధి లభించగలదని విశ్లేషకులు వేసిన అంచనాలకు దెబ్బ తగిలింది. అక్టోబర్‌లో 6.1 లక్షల ఉద్యోగాల కల్పన జరగడం గమనార్హం! గత నెలలో ఉపాధి క్షీణించడానికితోడు.. సెకండ్‌వేవ్‌లో కేసులు పెరగడం, శీతల సమస్యల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించనున్నట్లు కొత్త ప్రెసిడెంట్‌గా ఎంపికైన జో బైడెన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. దీంతో జీడీపీకి దన్నుగా కాంగ్రెస్ సాధ్యమైనంత త్వరగా సహాయక ప్యాకేజీని ఆమోదించవలసి ఉన్నట్లు డిమాండ్ చేశారు. ఉద్యోగ గణాంకాలు నిరాశపరచినప్పటికీ బైడెన్ వ్యాఖ్యలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. 5.4 శాతం అప్ ఇటీవల చమురు ధరలు బలపడుతుండటంతో ఎనర్జీ రంగం 5.4 శాతం ఎగసింది. డైమండ్‌బ్యాక్ ఎనర్జీ, ఆక్సిడెంటల్ పెట్రోలియం 13 శాతం చొప్పున దూసుకెళ్లాయి. షెవ్రాన్ కార్పొరేషన్ 4 శాతం పుంజుకోగా.. 787 డ్రీమ్‌లైనర్ విమానాల తయారీని తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో బోయింగ్ ఇంక్ 2 శాతం క్షీణించింది. ఇతర కౌంటర్లలో నార్వేజియన్ క్రూయిజ్ 3.3 శాతం, అమెరికన్ ఎయిర్‌లైన్స్ 2 శాతం చొప్పున లాభపడ్డాయి. -
వ్యాక్సిన్ ఆశలు- యూఎస్ కొత్త రికార్డ్స్
న్యూయార్క్: కోవిడ్-19 సెకండ్ వేవ్‌తో వణుకుతున్న ప్రపంచ దేశాలకు తాజాగా మోడర్నా ఇంక్ వ్యాక్సిన్ ద్వారా అభయం ఇవ్వడంతో సోమవారం యూఎస్ మార్కెట్లకు హుషారొచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో డోజోన్స్ 479 పాయింట్లు(1.6 శాతం) జంప్‌చేసి 29,959 వద్ద ముగిసింది. ఈ బాటలో ఎస్అండ్పీ 42 పాయింట్లు(1.2 శాతం) ఎగసి 3,627 వద్ద నిలవగా.. నాస్డాక్ 95 పాయింట్లు(0.8 శాతం) పెరిగి 11,924 వద్ద స్థిరపడింది. వెరసి మార్కెట్లు లైఫ్‌టైమ్ గరిష్టాలకు చేరాయి. ఇంతక్రితం ఈ ఏడాది ఫిబ్రవరిలో మాత్రమే ప్రధాన ఇండెక్సులు మూడూ ఒకేరోజు చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ రసెల్-2000 సైతం ఆల్‌టైమ్ హైను తాకడం విశేషం! ఇప్పటికే తమ వ్యాక్సిన్ 90 శాతంపైగా సురక్షితమంటూ ఫార్మా దిగ్గజంఫైజర్ డేటాను విశ్లేషించిన విషయం విదితమే. దీంతో సెంటిమెంటు మరింత బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. చదవండి: (మరోసారి మార్కెట్లకు దివాలీ జోష్?!) ఫైజర్ డీలా కోవిడ్-19 కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్ 94.5 శాతం సురక్షితమంటూ ప్రకటించిన మోడర్నా ఇంక్ షేరు 10 శాతం దూసుకెళ్లింది. అయితే ఇతర ఫార్మా కౌంటర్లలో ఫైజర్ ఇంక్ 3.3 శాతం, ఆస్ట్రాజెనెకా 2 శాతం చొప్పున డీలా పడ్డాయి. వ్యాక్సిన్ అంచనాలతో ఎయిర్‌లైన్, క్రూయిజర్ స్టాక్స్‌కు సైతం డిమాండ్ పెరిగింది. కార్నివాల్ గ్రూప్ 10 శాతం జంప్‌చేయగా. నార్వేజియన్ క్రూయిజ్లైన్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ 6-4 శాతం మధ్య పురోగమించాయి. ఈ బాటలో ప్రత్యర్థి సంస్థ టాబ్మెన్ సెంటర్స్ కొనుగోలు ధరను 80 శాతం తగ్గించిన వార్తలతో సైమన్ ప్రాపర్టీ గ్రూప్ షేరు దాదాపు 6 శాతం ఎగసింది. ఈ వారం రిటైల్ రంగ దిగ్గజాలు వాల్‌మార్ట్ ఇంక్, హోమ్ డిపో, టార్గెట్ కార్ప్, లోవ్స్ క్యూ3(జులై- సెప్టెంబర్) త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. చదవండి: (సెన్సెక్స్‌ప్రెస్- 44,000 దాటేసింది!) -
వ్యాక్సిన్ బూస్ట్- టెక్ దిగ్గజాల షాక్
న్యూయార్క్: కోవిడ్-19 కట్టడికి రూపొందిస్తున్న వ్యాక్సిన్ చివరి దశ క్లినికల్ పరీక్షలలో 90 శాతంపైగా సఫలమైనట్లు ఫార్మా దిగ్గజం ఫైజర్ ఇంక్ ప్రకటించింది. జర్మన్ కంపెనీ బయోఎన్ టెక్ తో సంయుక్తంగా రూపొందించిన ఈ వ్యాక్సిన్ కు నవంబర్ చివరిలోగా యూఎస్ఎఫ్డీఏ నుంచి ఎమర్జెన్సీ ప్రాతిపదికన వినియోగానికి అనుమతి లభించే వీలున్నట్లు అంచనా వేసింది. ఫలితంగా సోమవారం యూఎస్ స్టాక్ మార్కెట్లకు వ్యాక్సిన్ బూస్ట్ లభించింది. డోజోన్స్ 835 పాయింట్లు(3 శాతం) జంప్ చేసి 29,158కు చేరగా.. ఎస్అండ్పీ 41 పాయంట్లు(1.2 శాతం) ఎగసి 3,551 వద్ద ముగిసింది. అయితే టెక్ దిగ్గజాలలో ట్రేడర్లు అమ్మకాలు చేపట్టడంతో నాస్డాక్ 181 పాయింట్లు(1.5 శాతం) పతనమై 11,714 వద్ద స్థిరపడింది. కార్నివాల్ జోరు వ్యాక్సిన్ ఆశలతో ఫైజర్, మోడర్నా ఇంక్ 7.5 శాతం చొప్పున జంప్ చేయగా.. ఆస్ట్రాజెనెకా 2.5 శాతం క్షీణించింది. అయితే కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ రానుందన్న అంచనాలతో సోమవారం ఎంటర్ టైన్మెంట్ కంపెనీల షేర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. వెరసి ఏఎంసీ 50 శాతం, కార్నివాల్ కార్పొరేషన్ 39 శాతం, సిక్స్ ఫ్లాగ్స్ 18 శాతం చొప్పున దూసుకెళ్లాయి. ఈ బాటలో జెట్ బ్లూ ఎయిర్వేస్, స్పిరిట్ ఎయిర్ లైన్స్ 21 శాతం చొప్పున జంప్ చేశాయి. అయితే జూమ్ వీడియా కమ్యూనికేషన్స్ షేరు 17 శాతం పతనమైంది. కాగా.. అల్జీమర్స్ చికిత్సకు వినియోగించగల ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ.. నో చెప్పడంతో బయోజెన్ 30 శాతం కుప్పకూలింది. ఫాంగ్ స్టాక్స్ డీలా ఫాంగ్ స్టాక్స్ గా పిలిచే దిగ్గజాలలో నెట్ ఫ్లిక్స్ 8.6 శాతం పతనంకాగా.. ఫేస్ బుక్ 5 శాతం, మైక్రోసాఫ్ట్ 2.4 శాతం, యాపిల్ 2 శాతం చొప్పున నష్టపోయాయి. ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ 2 శాతం డీలాపడింది. ఈ ఏడాది భారీ లాభాలతో ర్యాలీ చేస్తున్న టెక్ దిగ్గజాలలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు తెరతీయడంతో నాస్డాక్ పతనమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. -
యూఎస్ మార్కెట్లు అక్కడక్కడే
న్యూయార్క్: అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేందుకు డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ కు అవకాశాలు పెరిగిన నేపథ్యంలో వారాంతాన యూఎస్ స్టాక్ మార్కెట్లు మిశ్రమ ధోరణిలో ముగిశాయి. శుక్రవారం డోజోన్స్ 61 పాయింట్లు(0.2 శాతం) క్షీణించి 28,329కు చేరగా.. ఎస్అండ్పీ నామమాత్ర లాభంతో 3,512 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ 16 పాయింట్లు(0.15 శాతం) పుంజుకుని 11,907 వద్ద స్థిరపడింది. వెరసి ఈ వారం నాస్ డాక్ 9 శాతం జంప్ చేయగా.. డోజోన్స్, ఎస్అండ్పీ 7 శాతం చొప్పున ఎగశాయి. తద్వారా ఏప్రిల్ తదుపరి ఒకే వారంలో అత్యధిక లాభాలు ఆర్జించాయి. పెన్సిల్వేనియా, జార్జియాలలో నమోదైన స్వల్ప ఆధిక్యాలను బైడెన్ పెంచుకోవడం ద్వారా విజయానికి మరింత చేరువైనట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. వరుసగా నాలుగు రోజులపాటు ర్యాలీ చేసిన మార్కెట్లలో వారాంతాన ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగినట్లు తెలియజేశారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలలో అస్పష్టత నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించినట్లు వివరించారు. రికవరీ బాటలో కోవిడ్-19 కారణంగా మాంద్య పరిస్థితులు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థ తిరిగి రికవరీ బాట పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం అక్టోబర్‌లో నిరుద్యోగిత 6.9 శాతానికి పరిమితంకావడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. సెప్టెంబర్‌లో 7.7 శాతంగా నమోదైంది. అక్టోబర్‌లో 6.38 లక్షల మందికి ఉపాధి లభించినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. అయితే సెకండ్ వేవ్ లో భాగంగా మళ్లీ అమెరికాసహా యూరోపియన్ దేశాలలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రభుత్వం మరోసారి సహాయక ప్యాకేజీలను ప్రకటించవలసి ఉంటుందని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. తాజా పాలసీ సమీక్షలో కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. కాగా.. కోవిడ్-19కు ముందు నమోదైన 3.5 శాతం గణాంకాలతో పోలిస్తే నిరుద్యోగిత అధికంగానే నమోదైనట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. దీంతో కొత్త ప్రభుత్వం స్టిములస్ కు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుందని తెలియజేశారు. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ అమలు చేస్తున్న ప్యాకేజీని 190 బిలియన్ డాలర్లమేర పెంచిన విషయం విదితమే. షేర్ల తీరిలా నిపుణుల అంచనాలను మించి త్రైమాసిక ఫలితాలు ప్రకటించడంతో కాస్మెటిక్స్ కంపెనీ కొటీ ఇంక్ దాదాపు 18 శాతం దూసుకెళ్లింది. మూడో క్వార్టర్(జులై- సెప్టెంబర్)లో అంచనాలకు మించి వినియోగదారులు జత కావడంతో టీ మొబైల్ దాదాపు 6 శాతం జంప్ చేసింది. ఇతర బ్లూచిప్స్‌లో మోడర్నా ఇంక్ 1.4 శాతం, ఆస్ట్రాజెనెకా 0.65 శాతం, బోయింగ్ 0.4 శాతం చొప్పున లాభపడ్డాయి. అయితే క్యూ3 పనితీరులో విశ్లేషకులను నిరాశపరచడంతో వీడియో గేమ్ తయారీ కంపెనీ ఎలక్ట్రానిక్స్ ఆర్ట్స్ షేరు 6.5 శాతం పతనమైంది. అమెజాన్ 0.3 శాతం, ఫేస్బుక్ 0.4 శాతం మధ్య డీలాపడగా.. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ 2 శాతం నీరసించింది. -
యూఎస్ మార్కెట్ల దూకుడు
వరుసగా రెండో రోజు బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు హైజంప్ చేశాయి. డోజోన్స్ 371 పాయింట్లు(1.4 శాతం) ఎగసి 27,851కు చేరగా.. ఎస్అండ్పీ 74 పాయింట్లు(2.2 శాతం) పురోగమించి 3,443 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 427 పాయింట్లు(4 శాతం) దూసుకెళ్లి 11,588 వద్ద స్థిరపడింది. వెరసి ఏప్రిల్ తదుపరి ఒకే రోజు 4 శాతం లాభపడింది. అధ్యక్ష ఎన్నికల ఫలితాలలో స్పష్టత లోపించడం.. అటు ట్రంప్, ఇటు బైడెన్లకు విజయావకాశాలు సమానంగా కనిపిస్తుండటం వంటి అంశాల నేపథ్యంలో పలు రంగాల కౌంటర్లు జోరందుకున్నాయి. రెండు వైపులా ఆధిక్యత కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరు గెలిచినా ప్రధాన విధాన నిర్ణయాలలో మార్పులు కష్టతరం కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా.. రిపబ్లికన్ సెనేటర్ సుసాన్ కొలిన్స్ గెలుపొందడంతో సెనేట్‌లో డెమొక్రాట్లకు మెజారిటీ విషయంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవచ్చని పేర్కొన్నారు. ఫెడ్‌పై కన్ను ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపగల కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షా సమావేశాలు నేడు ముగియనుండటంతో నిర్ణయాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ మళ్లీ బలపడింది. అయితే 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్ భారీగా పతనమయ్యాయి. ఇక యూరోపియన్ మార్కెట్లు 2.5 శాతం స్థాయిలో జంప్‌చేశాయి. ఫాంగ్ స్టాక్స్ అప్ ఫాంగ్ స్టాక్స్‌గా పిలిచే టెక్ దిగ్గజాలలో ఫేస్బుక్ 8.3 శాతం, అమెజాన్, అల్ఫాబెట్ 6 శాతం చొప్పున దూసుకెళ్లగా.. మైక్రోసాఫ్ట్ 5 శాతం, యాపిల్ 4 శాతం, నెట్‌ఫ్లిక్స్ 2 శాతం చొప్పున ఎగశాయి. అల్జీమర్స్ వ్యాధి చికిత్సకు రూపొందించిన ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ సానుకూలంగా స్పందించడంతో బయోజెన్ షేరు 44 శాతం దూసుకెళ్లింది. ఫార్మా బ్లూచిప్స్‌లో మెర్క్ అండ్ కో 5 శాతం, ఆస్ట్రాజెనెకా 6.5 శాతం, ఫైజర్ 3 శాతం చొప్పున పెరిగాయి. ఇతర కౌంటర్లలో ఉబర్ టెక్నాలజీస్ 14.5 శాతం, లిఫ్ట్ ఇంక్ 11 శాతం చొప్పున పురోగమించాయి. డిఫెన్స్ కౌంటర్లలో నార్త్రోప్ గ్రమ్మన్ 3.6 శాతం, లాక్ హీడ్ మార్టిన్ 2.4 శాతం చొప్పున బలపడ్డాయి. -
యూఎస్ మార్కెట్లకు జో బైడెన్ జోష్
డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు కొన్ని కీలక రాష్ట్రాలలో ఆధిక్యం లభించనున్న అంచనాలతో మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. డోజోన్స్ 555 పాయింట్లు(2 శాతం) జంప్‌చేసి 27,480కు చేరగా.. ఎస్అండ్పీ 59 పాయింట్లు(1.8 శాతం) ఎగసి 3,369 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 203 పాయింట్ల(1.9 శాతం) వృద్ధిచూపి 11,161 వద్ద స్థిరపడింది. బైడెన్ గెలిస్తే ఎన్నికలకు ముందు డెమొక్రాట్లు పట్టుపట్టిన 2.2 ట్రిలియన్ డాలర్ల సహాయక ప్యాకేజీకి ఆమోదముద్ర పడగలదన్న అంచనాలు ఇన్వెస్టర్లకు హుషారునిచ్చినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రజలకు ఆరోగ్య సవాళ్లు విసురుతున్న కరోనా వైరస్ కట్టడిలో ప్రభుత్వం విఫలమైనట్లు ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఫెడ్‌పై కన్ను ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపగల కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల పాలసీ సమీక్షా సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 0.4 శాతం ఎగసింది. మళ్లీ 94 దిగువన 93.49కు చేరింది. ఇక పసిడి ఔన్స్ 1900 డాలర్లను అధిగమించింది. బీఎన్పీ పరిబాస్‌సహా బ్యాంకింగ్ దిగ్గజాల సానుకూల ఫలితాల కారణంగా మంగళవారం యూరోపియన్ మార్కెట్లు 2.5 శాతం జంప్‌చేశాయి. చమురు అప్ గత వారం పతన బాట పట్టిన ముడిచమురు ధరలు రెండు రోజులుగా బౌన్స్‌బ్యాక్ సాధిస్తున్నాయి. రష్యాసహా ఒపెక్ దేశాలు ఉత్పత్తిలో కోతలను మరికొంతకాలం కొనసాగించనున్న అంచనాలు ఇందుకు సహకరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మంగళవారం లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 3 శాతం జంప్‌చేయగా.. న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు 2.7 శాతం లాభపడింది. ప్రస్తుతం న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు బ్యారల్ 1.4 శాతం ఎగసి 38.18 డాలర్లకు చేరింది. ఈ బాటలో లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ సైతం 1.2 శాతం బలపడి 40.18 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. యాంట్‌కు చెక్ భారీ స్థాయిలో నిధుల సమీకరణకు సిద్ధపడుతున్న యాంట్ గ్రూప్ పబ్లిక్ ఇష్యూకి చైనీస్ ప్రభుత్వం చెక్ పెట్టడంతో మంగళవారం అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ షేరు దాదాపు 10 శాతం కుప్పకూలింది. యాంట్ గ్రూప్‌లో అలీబాబాకు మూడో వంతు వాటా ఉండటం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫాంగ్ స్టాక్స్ అప్ ఫాంగ్ స్టాక్స్‌గా పిలిచే టెక్ దిగ్గజాలలో మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్, ఫేస్బుక్, అల్ఫాబెట్, నెట్‌ఫ్లిక్స్ 1.5-0.6 శాతం మధ్య ఎగశాయి. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ సైతం దాదాపు 6 శాతం జంప్‌చేసింది. ఇతర బ్లూచిప్స్‌లో బోయింగ్ 3.5 శాతం, మోడర్నా ఇంక్ 3 శాతం చొప్పున లాభపడ్డాయి. -
యూఎస్ మార్కెట్స్- టెక్ దిగ్గజాల దెబ్బ
పలు దేశాలలో మళ్లీ కోవిడ్-19 కేసులు విజృంభిస్తుండటంతో శుక్రవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. ప్రధానంగా టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో నాస్డాక్ 2.5 శాతం పతనమైంది. డోజోన్స్ 158 పాయింట్లు(0.6 శాతం) క్షీణించి 26,502కు చేరగా.. ఎస్అండ్పీ 40 పాయింట్లు(1.2 శాతం) నష్టంతో 3,270 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 274 పాయింట్లు(2.5 శాతం) కోల్పోయి 10,912 వద్ద స్థిరపడింది. వెరసి గత వారం డోజోన్స్ 6.5 శాతం పతనంకాగా.. ఎస్అండ్పీ 5.6 శాతం, నాస్డాక్ 5.5 శాతం చొప్పున నీరసించాయి. ఫలితంగా ఈ సెప్టెంబర్ మొదట్లో నమోదైన సరికొత్త గరిష్టం నుంచి ఎస్అండ్పీ-500 ఇండెక్స్ 9 శాతం వెనకడుగు వేసినట్లయ్యింది. ఇక అక్టోబర్ నెలలో చూస్తే.. డోజోన్స్ 4.6 శాతం, ఎస్అండ్పీ 2.8 శాతం చొప్పున క్షీణించగా.. నాస్డాక్ 2.3 శాతం నష్టపోయింది. కోవిడ్-19 షాక్ కొద్ది రోజులుగా యూఎస్‌లో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటంతో కోవిడ్-19 బాధితుల సంఖ్య 90 లక్షలను మించింది. దీనికితోడు సెకండ్‌వేవ్‌లో భాగంగా బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ తదితర యూరోపియన్ దేశాలలో కోవిడ్-19 బాధితులు పెరుగుతుండటంతో సెంటిమెంటుకు దెబ్బ తగిలినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. తాజాగా బ్రిటన్, ఫ్రాన్స్‌లలో పూర్తిస్థాయి లాక్‌డవున్‌లకు తెరతీయగా.. పలు దేశాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. దీంతో మరోసారి ప్రపంచ ఆర్థిక వృద్ధి కుదేలయ్యే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీంతో వారాంతాన యూరోపియన్, యూఎస్ మార్కెట్లు నీరసించినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇక మరోపక్క యూఎస్ అధ్యక్ష ఎన్నికల కారణంగా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు. పతన బాటలో.. వారాంతాన మైక్రో బ్లాగింగ్ కంపెనీ ట్విటర్ ఇంక్ క్యూ3(జులై- సెప్టెంబర్)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది, అంచనాలకంటే తక్కువగా యూజర్లు నమోదుకావడంతోపాటు.. యూఎస్ అధ్యక్ష ఎన్నికల కారణంగా ఆదాయం క్షీణించే వీలున్నట్లు అంచనా వేసింది. దీంతో ట్విటర్ షేరు 21 శాతంపైగా పడిపోయింది. ఈ బాటలో ఫాంగ్ స్టాక్స్‌గా పిలిచే టెక్ దిగ్గజాలలోనూ అమ్మకాలు పెరిగాయి. 2021లో కఠిన పరిస్థితులు ఎదురుకానున్నట్లు పేర్కొనడంతో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ 6.3 శాతం పతనమైంది. కోవిడ్-19 కారణంగా వ్యయాలు పెరగనున్న అంచనాలతో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ 5.5 శాతం నీరసించింది. క్యూ3లో గత రెండేళ్లలోలేని విధంగా ఐఫోన్ల అమ్మకాలు క్షీణించడంతో యాపిల్ ఇంక్ 5.6 శాతం నష్టపోయింది. 5జీ ఫోన్ల విడుదలలో జాప్యం ఐఫోన్ల అమ్మకాలపై ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. గూగుల్ అప్ త్రైమాసిక అమ్మకాలు పుంజుకోనున్నట్లు అంచనాలు ప్రకటించడంతో ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ ఇంక్ షేరు 3.5 శాతం ఎగసింది. ప్రకటనల ఆదాయం తిరిగి ఊపందుకోనుండటం ఈ కౌంటర్‌కు జోష్‌నిచ్చినట్లు నిపుణులు తెలియజేశారు. దీంతో టెక్ కౌంటర్లలో నెలకొన్న ట్రెండుకు ఎదురీదినట్లు పేర్కొన్నారు. కాగా.. ఇతర కౌంటర్లలో మీడియా దిగ్గజం నెట్‌ఫ్లిక్స్, ఫార్మా దిగ్గజం మోడర్నా ఇంక్, ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ సైతం 5.5 శాతం చొప్పున పడిపోయాయి. -
ప్యాకేజీపై ఆశలు- యూఎస్ మార్కెట్లు ఓకే
వారాంతాన అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్అండ్పీ-500 ఇండెక్స్ 12 పాయింట్లు(0.35 శాతం) పుంజుకుని 3.465 వద్ద నిలవగా.. నాస్డాక్ 42 పాయింట్లు(0.4 శాతం) పెరిగి 11,548 వద్ద స్థిరపడింది. అయితే డోజోన్స్ నామమాత్రంగా 28 పాయింట్లు(0.1 శాతం) క్షీణించి 28,336 వద్ద ముగిసింది. కొద్ది వారాలుగా మార్కెట్లు ప్రభుత్వ ప్యాకేజీపై అంచనాలతో కదులుతున్నట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో ప్యాకేజీపై కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా ఇటీవల మార్కెట్లు ఒడిదొడుకులను చవిచూస్తున్నట్లు తెలియజేశారు. శుక్రవారం(23)తో ముగిసిన గత వారం డోజోన్స్ 1 శాతం, ఎస్అండ్పీ 0.5 శాతం చొప్పున బలహీనపడగా.. నాస్డాక్ సైతం 1.1 శాతం క్షీణించింది. అనిశ్చితిలోనే ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ట్రంప్ ప్రతిపాదించిన ప్యాకేజీపై డెమొక్రాట్లకూ, రిపబ్లికన్లకూ మధ్య విభేధాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ప్యాకేజీకి కొన్ని సవరణలు సూచిండంతోపాటు. 2.2 ట్రిలియన్ డాలర్లకు పెంచమంటూ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ ప్రతిపాదించిన విషయం విదితమే. అయితే ఎన్నికలలోగా ప్యాకేజీపై ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నట్లు పెలోసీ పేర్కొన్నారు. ఇక మరోవైపు అధ్యక్ష ఎన్నికలలో భాగంగా ప్రెసిడెంట్ ట్రంప్, ప్రత్యర్ధి జోబిడెన్ మధ్య వాడిగా, వేడిగా డిబేట్ నడిచింది. డిబేట్ తదుపరి ఎన్నికలను ప్రభావితం చేసే పలు రాష్ట్రాలలో పరిస్థితులను అంచనా వేయవలసి ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అమెక్స్ డౌన్ ఈ ఏడాది క్యూ3(జులై- సెప్టెంబర్)లో మార్జిన్లు బలహీనపడటంతో చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ కార్ప్ షేరు 10 శాతం కుప్పకూలింది. కోవిడ్-19 కారణంగా డిమాండ్ పడిపోవడంతో చిన్న సంస్థలు, వినియోగదారులు చౌక ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకి మళ్లినట్లు నిపుణులు తెలియజేశారు. మరోవైపు డేటా సెంటర్లపై ప్రభుత్వ వ్యయాలు తగ్గడం వంటి అంశాలు సైతం ప్రభావం చూపినట్లు వివరించారు. ఫలితంగా ఇంటెల్ లాభదాయకత నీరసించినట్లు అభిప్రాయపడ్డారు. కాగా.. క్యూ3లో ఫలితాలు అంచనాలను చేరకపోవడంతో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ షేరు 3.6 శాతం నష్టపోయింది. కోవిడ్-19 కారణంగా వినియోగం మందగించడంతోపాటు, చెల్లింపుల వైఫల్యాలను ఎదుర్కొనేందుకు కేటాయింపులు చేపట్టడం అమెక్స్ను దెబ్బతీసినట్లు విశ్లేషకులు తెలియజేశారు. గిలియడ్ ప్లస్ కోవిడ్-19 చికిత్సకు వినియోగిస్తున్న యాంటీవైరల్ ఔషధం రెమ్‌డెసివిర్‌కు యూఎస్ఎఫ్డీఏ ఆమోదముద్ర వేయడంతో గిలియడ్ సైన్సెస్ షేరు 0.2 శాతం బలపడింది. అత్యవసర చికిత్సలో భాగంగా ఇప్పటికే ఈ ఔషధాన్ని వినియోగిస్తున్న విషయం విదితమే. కాగా.. వచ్చే వారం ఫాంగ్ స్టాక్స్‌గా పిలిచే యాపిల్, అమెజాన్, అల్ఫాబెట్(గూగుల్), ఫేస్బుక్.. క్యూ3 ఫలితాలు విడుదల చేయనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఈ కంపెనీల పనితీరుపై దృష్టిపెట్టనున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. -
యూఎస్ మార్కెట్లకు ప్యాకేజీ దెబ్బ
కోవిడ్-19 ప్రభావాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ ప్రతిపాదించిన 2.2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీపై సందిగ్ధత కొనసాగుతుండటంతో సోమవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. డోజోన్స్ 411 పాయింట్లు(1.5 శాతం) క్షీణించి 28,195 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 57 పాయింట్ల(1.6 శాతం) నష్టంతో 3,427 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 193 పాయింట్లు(1.7 శాతం) కోల్పోయి 11,665 వద్ద స్థిరపడింది. ఆర్థిక మంత్రి స్టీవ్ ముచిన్‌తో నిర్వహిస్తున్న చర్చలపై మంగళవారంలోగా స్పష్టత వచ్చే వీలున్నట్లు నాన్సీ పెలోసీ తాజాగా పేర్కొన్నారు. తద్వారా ఎన్నికలలోగా ప్యాకేజీ అమలుకు వీలు కలగనున్నట్లు తెలియజేశారు. దీంతో నేడు మార్కెట్లు కోలుకునే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. కాగా.. అధ్యక్ష ఎన్నికలలో భాగంగా గురువారం ప్రెసిడెంట్ ట్రంప్, ప్రత్యర్థి జో బిడెన్ మధ్య చివరి దశ డిబేట్ జరగనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. 4 లక్షలు గత వారం కోవిడ్-19 కేసులు 13 శాతం పెరిగి 3.93 లక్షలుగా నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.అయితే మార్చి తదుపరి ఈ ఆదివారం తొలిసారి 10 లక్షల మందికిపైగా విమాన ప్రయాణికులకు స్క్రీనింగ్ చేసినట్లు భద్రతాధికారులు వెల్లడించడం గమనార్హం! ఈ నేపథ్యంలోనూ ప్రభుత్వ ప్యాకేజీపై సందేహాలతో రవాణా సంబంధ కౌంటర్లు డీలాపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫాంగ్ స్టాక్స్ బోర్లా కొద్ది నెలలుగా మార్కెట్లకు జోష్‌నిస్తున్న ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌లో సోమవారం అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో యాపిల్, అల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్బుక్ 2.6-2 శాతం మధ్య డీలా పడ్డాయి. ఈ బాటలో ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ 2 శాతం నీరసించింది. కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్న ఫార్మా దిగ్గజాలలో మోడర్నా ఇంక్ 4 శాతం పతనంకాగా.. ఆస్ట్రాజెనెకా 1.2 శాతం, ఫైజర్ ఇంక్ 0.4 శాతం చొప్పున క్షీణించాయి. ఇతర కౌంటర్లలో కొనాకోఫిలిప్స్ 3.2 శాతం, షెవ్రాన్ కార్పొరేషన్ 2.2 శాతం చొప్పున నష్టపోయాయి. -
రెండో రోజూ యూఎస్ మార్కెట్ల జోరు
వరుస నష్టాలకు చెక్ పెడుతూ వారాంతాన జోరందుకున్న యూఎస్ స్టాక్ మార్కెట్లు సోమవారం సైతం లాభపడ్డాయి. డోజోన్స్ 410 పాయింట్లు(1.5%) ఎగసి 27,584 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 53 పాయింట్ల(1.6%) బలపడి 3,352 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 204 పాయింట్లు(1.8%) జంప్‌చేసి 11,118 వద్ద స్థిరపడింది. శుక్రవారం సైతం ఇండెక్సులు ఇదే స్థాయిలో పురోగమించిన సంగతి తెలిసిందే. కోవిడ్-19తో సవాళ్లు ఎదుర్కొంటున్న నిరుద్యోగులు, కంపెనీలకు అండగా వాషింగ్టన్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్యాకేజీపై నేడు తిరిగి చర్చలు ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. దీంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఫాంగ్ స్టాక్స్ అప్ ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే టెక్ దిగ్గజాలలో యాపిల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, అల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ 2.5-0.7 శాతం మధ్య లాభపడగా.. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ 3.4 శాతం జంప్‌చేసింది. ఇతర కౌంటర్లలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ 4 శాతం ఎగసింది. ప్రభుత్వం నుంచి 5.5 బిలియన్ డాలర్ల రుణాన్ని పొందడంతో ఈ కౌంటర్‌కు జోష్ వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. కొద్ది రోజులుగా నిలిచిపోయిన 737 మ్యాక్స్ విమానాలపై అంచనాలతో బోయింగ్ కంపెనీ 6.4 శాతం దూసుకెళ్లింది. కాగా.. ప్రత్యర్థి కంపెనీ డబ్ల్యూ పీఎక్స్ ఎనర్జీని 2.56 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్నట్లు డెవాన్ ఎనర్జీ తాజాగా పేర్కొంది. దీంతో ఈ రెండు కౌంటర్లూ 16-11 శాతం చొప్పున జంప్‌చేశాయి. లండన్‌లో కార్యకలాపాలకు కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన వార్తలతో ఉబర్ టెక్నాలజీస్ 3.2 శాతం పుంజుకుంది. -
కరెక్షన్ బాటలో యూఎస్ మార్కెట్లు
ఓవైపు కోవిడ్-19 కేసులు పెరుగుతుండటం, మరోపక్క సహాయక ప్యాకేజీపై కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ప్రతిష్టంభన బుధవారం మరోసారి అమెరికా స్టాక్ మార్కెట్లను దెబ్బతీశాయి. వెరసి డోజోన్స్ 525 పాయింట్లు(1.9%) క్షీణించి 26,763 వద్ద ముగిసింది. ఎస్అండ్పీ 79 పాయింట్ల(2.4%) నష్టంతో 3,237 వద్ద నిలిచింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 331 పాయింట్లు(3%) పతనమై 10,633 వద్ద స్థిరపడింది. దీంతో ఈ నెలలో నమోదైన చరిత్రాత్మక గరిష్టాల నుంచి ఎస్అండ్పీ 10 శాతం, నాస్డాక్ 12 శాతం చొప్పున వెనకడుగు వేసినట్లయ్యింది. డోజోన్స్ ఫిబ్రవరిలో సాధించిన రికార్డ్ గరిష్టంకంటే 9.4 శాతం దిగువన నిలిచింది. ఇది కరెక్షన్కు సంకేతమని సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. దీనిలో భాగంగా నాలుగు రోజుల నష్టాలకు చెక్ పెడుతూ మంగళవారం మార్కెట్లు బలపడినప్పటికీ తిరిగి అమ్మకాలు ఊపందుకున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇటీవల మార్కెట్ల ర్యాలీకి కారణమైన టెక్నాలజీ దిగ్గజాలలో అమ్మకాలు కొనసాగుతుండటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు తెలియజేశారు. డౌన్ డౌన్.. ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే టెక్ దిగ్గజాలలో యాపిల్ 4.2 శాతం పతనమైంది. ఈ బాటలో అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్ 4-2.3 శాతం మధ్య క్షీణించాయి. ఇతర కౌంటర్లలో కంప్యూటర్ చిప్ తయారీ కంపెనీలు ఎన్విడియా, ఏఎండీ సైతం 4 శాతం వెనకడుగు వేశాయి. ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీల తయారీ అంశంలో ఎదురవుతున్న సవాళ్లపై సీఈవో ఎలెన్ మస్క్ వ్యాఖ్యలతో టెస్లా ఇంక్ 10.3 శాతం కుప్పకూలింది. అయితే స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్ ప్రొడక్టుల కంపెనీ నైక్ ఇంక్ 9 శాతం దూసుకెళ్లింది. -
టెక్ షేర్లు వీక్- యూఎస్ వెనకడుగు
టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలు కొనసాగుతుండటంతో వరుసగా మూడో రోజు యూఎస్ మార్కెట్లు నష్టపోయాయి. శుక్రవారం డోజోన్స్ 245 పాయింట్లు(0.9%) నీరసించి 27,657 వద్ద నిలిచింది. ఎస్అండ్పీ 38 పాయింట్లు(1.1%) క్షీణించి 3,319 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 117 పాయింట్ల(1.1%) నష్టంతో 10,793 వద్ద స్థిరపడింది. వెరసి వరుసగా మూడో వారం ఎస్అండ్పీ, నాస్డాక్ వెనకడుగుతో నిలిచినట్లయ్యింది. ఇంతక్రితం 2019 సెప్టెంబర్‌లో మాత్రమే ఈ స్థాయిలో వెనకడుగు వేశాయి. కోవిడ్-19 నేపథ్యంలో గతంలో ప్రకటించిన అతిభారీ ప్యాకేజీ 2 ట్రిలియన్ డాలర్లకు కొనసాగింపుగా ప్రజలకు మరింత ఆర్థిక సహాయాన్ని అందించాలన్న ప్రతిపాదనపై రిపబ్లికన్లు, డెమక్రాట్ల మధ్య సయోధ్య కుదరకపోవడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. తాజా పాలసీ సమీక్షలో భాగంగా ఫెడరల్ రిజర్వ్ కొత్త ప్యాకేజీపై స్పందించకపోవడం దీనికి జత కలిసినట్లు అభిప్రాయపడ్డారు. బేర్ ట్రెండ్? గత కొంత కాలంగా మార్కెట్లకు జోష్‌నిస్తున్న టెక్నాలజీ కౌంటర్లలో కొద్ది రోజులుగా అమ్మకాలు నమోదవుతున్నాయి. దీంతో ఈ నెల మొదటి నుంచీ మార్కెట్లు నేలచూపులతో కదులుతున్నాయి. మార్కెట్లకు బలాన్నిస్తున్న FAAMNG స్టాక్స్‌లో ఈ వారం అమెజాన్, ఫేస్బుక్ 5 శాతంకంటే అధికంగా బలహీనపడ్డాయి. ఈ నెలలో చూస్తే ఫేస్బుక్, అమెజాన్, అల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్ 10 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. యాపిల్ మరింత అధికంగా 17 శాతం క్షీణించింది. ఇటీవల సాధించిన గరిష్టం నుంచి చూస్తే యాపిల్ 23 శాతం పతనమైంది. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువలో 500 బిలియన్ డాలర్లు ఆవిరైంది. మళ్లీ డౌన్.. ఫాంగ్ స్టాక్స్‌గా పిలిచే న్యూఏజ్ టెక్ కౌంటర్లలో వారాంతాన యాపిల్ 3.2 శాతం పతనమైంది. ఇతర కౌంటర్లలో అల్ఫాబెట్ 2.4 శాతం, అమెజాన్ 1.8 శాతం, మైక్రోసాఫ్ట్ 1.2 శాతం, ఫేస్బుక్ 1 శాతం చొప్పున డీలాపడ్డాయి. మోడర్నా ఇంక్ 3 శాతం, ఆస్ట్రాజెనెకా 1 శాతం చొప్పున బలపడగా.. ఫైజర్ 0.5 శాతం నీరసించింది. జాన్సన్ అండ్ జాన్సన్ 1.4 శాతం పుంజుకోగా.. షెవ్రాన్ 0.75 శాతం బలహీనపడింది. -
మళ్లీ యూఎస్ వీక్- ఐపీవోకు టిక్‌టాక్
టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలు రెండో రోజూ యూఎస్ మార్కెట్లను దెబ్బతీశాయి. దీంతో గురువారం డోజోన్స్ 130 పాయింట్లు(0.5%) నీరసించి 27,902 వద్ద నిలిచింది. ఎస్అండ్పీ 28 పాయింట్లు(0.8%) క్షీణించి 3,357 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 140 పాయింట్లు(1.3%) నష్టంతో 10,910 వద్ద స్థిరపడింది. ధరలు పుంజుకునేటంతవరకూ నామమాత్ర వడ్డీ రేట్ల కొనసాగింపునకే కట్టుబడనున్నట్లు ఫెడరల్ రిజర్వ్ తాజా పాలసీలో స్పష్టం చేసింది. నిరుద్యోగిత తగ్గడం, కొన్నిరంగాలలో కనిపిస్తున్న డిమాండ్.. ఆర్థిక రికవరీ సంకేతాలను ఇస్తున్నట్లు అభిప్రాయపడింది. అయితే ఫెడ్.. సహాయక ప్యాకేజీల విషయాన్ని విస్మరించినట్లు ఆర్థికవేత్తలు వ్యాఖ్యానించారు. దీనికితోడు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 విస్తరిస్తూనే ఉండటంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు నెలకొన్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో బుధవారం సైతం ఎస్అండ్పీ, నాస్డాక్ వెనకడుగు వేయడం గమనార్హం! టిక్‌టాక్ ఐపీవో చైనీస్ వీడియో మేకింగ్ యాప్.. టిక్‌టాక్ పబ్లిక్ ఇష్యూ చేపట్టాలని యోచిస్తోంది. ఇందుకు వీలుగా టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇది సాకారమైతే 50 బిలియన్ డాలర్ల విలువతో టెక్నాలజీ రంగంలో అతిపెద్ద ఐపీవోగా నిలిచే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. భద్రతా కారణాలరీత్యా ప్రెసిడెంట్ ట్రంప్.. టిక్‌టాక్ కార్యకాలపాలపై నిషేధాన్ని విధించిన విషయం విదితమే. టిక్‌టాక్‌కు అమెరికాలో 10 కోట్లమంది యూజర్లుండటం విశేషం! దీంతో టిక్‌టాక్ యూఎస్ విభాగంపై ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ కార్పొరేషన్ కన్నేశాయి. ఇందుకు అనుగుణంగా టిక్‌టాక్ ప్రమోటర్ బైట్‌డ్యాన్స్‌కు సాఫ్ట్వేర్ భాగస్వామిగా ఒరాకిల్ ఒప్పందాన్ని కుదుర్చుకుందికూడా. కాగా.. టిక్‌టాక్ యూఎస్ బిజినెస్ కొనుగోలుకి అటు మైక్రోసాఫ్ట్, ఇటు ఒరాకిల్ కార్పొరేషన్ రేసులో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. టెక్ డీలా.. ఫాంగ్ స్టాక్స్‌గా పిలిచే న్యూఏజ్ టెక్ కౌంటర్లలో ఫేస్బుక్ 3.3 శాతం, నెట్‌ఫ్లిక్స్ 3 శాతం, అమెజాన్ 2.3 శాతం, యాపిల్ ఇంక్, అల్ఫాబెట్ 1.6 శాతం, మైక్రోసాఫ్ట్ 1 శాతం చొప్పున క్షీణించాయి. టెస్లా ఇంక్ 4.2 శాతం పతనమైంది. ద్వితీయార్థం నుంచీ టర్న్అరౌండ్ ఫలితాలను సాధించనున్నట్లు సీఈవో లారీ కల్ప్ పేర్కొనడంతో ఇంజినీరింగ్ దిగ్గజం జనరల్ ఎలక్ట్రిక్ 4.4 శాతం జంప్‌చేసింది. మిచిగాన్ ప్లాంటు నుంచి కొత్త తరం పికప్ ట్రక్ F-150 తయారీని ప్రారంభించినట్లు వెల్లడించడంతో ఆటో దిగ్గజం ఫోర్డ్ మోటార్ 3.7 శాతం ఎగసింది. కోవిడ్-19 వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలు తిరిగి ప్రారంభించిన ఆస్ట్రాజెనెకా 1.5 శాతం లాభపడింది. -
ఆటుపోట్లు- యూఎస్ మార్కెట్ల పతనం
తీవ్ర ఆటుపోట్ల మధ్య గురువారం అమెరికా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. మూడు రోజుల భారీ నష్టాల నుంచి బుధవారం కోలుకున్పప్పటికీ తిరిగి ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌లో తలెత్తిన భారీ అమ్మకాలు మార్కెట్లను దెబ్బతీశాయి. దీంతో డోజోన్స్ 406 పాయింట్లు(1.5%) క్షీణించి 27,535 వద్ద నిలిచింది. ఎస్అండ్పీ 60 పాయింట్లు(1.8%) నష్టపోయి 3,339 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 222 పాయింట్లు(2%) పతనమై 10,920 వద్ద స్థిరపడింది. బుధవారం స్పీడును కొనసాగిస్తూ తొలుత డోజోన్స్ 300 పాయింట్లకుపైగా జంప్‌చేసింది. మిడ్‌సెషన్ నుంచీ అమ్మకాలు పెరగడంతో చివరికి డీలాపడింది. ఎందుకంటే? గత వారం నిరుద్యోగ క్లెయిములు అంచనాలను మించుతూ 8.84 లక్షలను తాకడం సెంటిమెంటును దెబ్బతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. కోవిడ్-19 ప్రభావంతో 8.5 లక్షల క్లెయిములను ఆర్థికవేత్తలు అంచనా వేశారు. దీనికితోడు టెక్నాలజీ కౌంటర్లలో కొద్ది రోజులుగా నెలకొన్న ర్యాలీ కారణంగా ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోపక్క యూరోపియన్ దేశాలలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నట్లు వెలువడిన వార్తలతో ఇన్వెస్టర్లు ఆందోళనలకు లోనైనట్లు తెలియజేశారు. నేలచూపులే.. ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే న్యూఏజ్ ఎకానమీ కౌంటర్లలో ఫేస్బుక్, యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్(అల్ఫాబెట్) 2-4 శాతం మధ్య వెనకడుగు వేశాయి. ఇక ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్.. తొలుత 8 శాతం పతనమైనప్పటికీ చివర్లో కోలుకుని 1.4 శాతం లాభంతో ముగిసింది. కంప్యూటర్ చిప్స్ తయారీ దిగ్గజం ఏఎండీ 3.6 శాతం క్షీణించింది. కోవిడ్-19 చికిత్సకు బయోఎన్‌టెక్‌తో సంయుక్తంగా వ్యాక్సిన్ రూపొందిస్తున్న ఫైజర్ ఇంక్ 1.5 శాతం నష్టపోగా.. క్లినికల్ పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేసిన ఆస్ట్రాజెనెకా 1.1 శాతం నీరసించింది. వ్యాక్సిన్ రేసులో ఉన్న మరో ఫార్మా కంపెనీ మోడార్నా ఇంక్ 1.2 శాతం పుంజుకుంది. ఫార్మా దిగ్గజం సనోఫీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన మైఖేల్ మలెట్ను కెనడియన్ బిజినెస్ ఎండీగా ఎంపిక చేసుకున్నట్లు మోడర్నా పేర్కొంది. -
మూడో రోజూ యూఎస్ మార్కెట్లు.. బేర్ బేర్
వరుసగా మూడో రోజు మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే టెక్నాలజీ కౌంటర్లలో తలెత్తిన భారీ అమ్మకాలు మార్కెట్లను దెబ్బతీశాయి. వెరసి డోజోన్స్ 633 పాయింట్లు(2.25%) పతనమై 27,500 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 95 పాయింట్లు(2.78%) దిగజారి 3,332 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 465 పాయింట్లు(4.11%) పడిపోయి 10,848 వద్ద స్థిరపడింది. దీంతో కేవలం మూడు రోజుల్లోనే నాస్డాక్ ఇండెక్స్ 10 శాతం కోల్పోయింది. ఇది దిద్దుబాటు(కరెక్షన్)కు సంకేతమని సాంకేతిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఓవైపు ఆర్థిక వ్యవస్థలకు కోవిడ్-19.. సవాళ్లు విసురుతుండటం, మరోపక్క డీల్ కుదుర్చుకోకుండానే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగనుందన్న(బ్రెగ్జిట్) అంచనాలు సెంటిమెంటును దెబ్బతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో డాలరు ఇండెక్స్ నాలుగు వారాల గరిష్టానికి చేరగా.. ముడిచమురు ధరలు 8 శాతం పడిపోయాయి. పతన బాటలో ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే న్యూఏజ్ ఎకానమీ కౌంటర్లలో యాపిల్ 7 శాతం పతనమైంది. దీంతో ఒక్క రోజులోనే కంపెనీ మార్కెట్ విలువలో 140 బిలియన్ డాలర్లు ఆవిరైంది. 2008 అక్టోబర్ తదుపరి యాపిల్ షేరు 3 రోజుల్లోనే 14 శాతం క్షీణించింది. ఈ బాటలో ఆటో, టెక్నాలజీ కంపెనీ టెస్లా ఇంక్.. తొలిసారి ఒక్క రోజులోనే 21 శాతం కుప్పకూలింది. జనరల్ మోటార్స్ 2 బిలియన్ డాలర్లతో 11 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించడంతో టెస్లా ప్రత్యర్థి సంస్థ నికోలా కార్పొరేషన్ షేరు 41 శాతం దూసుకెళ్లింది. ఫాంగ్ స్టాక్స్ వీక్ టెక్నాలజీ, సోషల్ మీడియా, ఈకామర్స్ దిగ్గజాలలో మైక్రోసాఫ్ట్ 5.4 శాతం, ఫేస్బుక్ 4 శాతం, అమెజాన్ 4.4 శాతం, గూగుల్ 3.7 శాతం, నెట్‌ఫ్లిక్స్ 1.8 శాతం చొప్పున పతనమయ్యాయి. ఈ కౌంటర్లలో బిలియన్ల డాలర్లతో పొజిషన్లు తీసుకున్నట్లు వెలువడిన అంచనాల కారణంగా సాఫ్ట్‌బ్యాంక్ షేరు సైతం 7 శాతం పడిపోయింది. -
రెండో రోజూ యూఎస్ మార్కెట్లు బోర్లా
టెక్నాలజీ దిగ్గజాలలో అమ్మకాల కారణంగా వరుసగా రెండో రోజు యూఎస్ మార్కెట్లకు షాక్ తగిలింది. దీంతో తొలి సెషన్లో డోజోన్స్ 628 పాయింట్లు పతనమైంది. అయితే ఆగస్ట్‌లో ఉపాధి పుంజుకున్నట్లు వెల్లడికావడంతో రికవరీ బాట పట్టాయి. అయినప్పటికీ ప్రస్తావించదగ్గ నష్టాలతో ముగిశాయి. వెరసి శుక్రవారం డోజోన్స్ 159 పాయింట్ల(0.6%) నష్టంతో 28,133 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 28 పాయింట్లు(0.8%) క్షీణించి 3,427 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 145 పాయింట్లు(1.3%) వెనకడుగుతో 11,313 వద్ద స్థిరపడింది. కోవిడ్-19 ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రతిపాదించిన సహాయక ప్యాకేజీపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సయోధ్య కుదరకపోవడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. టెక్ దిగ్గజాలలో భారీ అమ్మకాలతో గురువారం డోజోన్స్ 800 పాయింట్లు పడిపోగా.. నాస్డాక్ 5 శాతం కుప్పకూలిన విషయం విదితమే. సాఫ్ట్‌బ్యాంక్ దెబ్బ! ఇటీవల జపనీస్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ బిలియన్ల కొద్దీ డాలర్లను కుమ్మరించడం ద్వారా టెక్నాలజీ స్టాక్స్‌లో భారీ పొజిషన్లు తీసుకున్నట్లు వెలువడిన వార్తలు రెండు రోజులుగా అమ్మకాలకు కారణమవుతున్నట్లు విశ్లేషకులు వివరించారు. కాగా.. ఆగస్ట్‌లో కొత్తగా 1.37 మిలియన్ ఉద్యోగాలు లభించినట్లు తాజా గణాంకాలు వెలడించాయి. అంతేకాకుండా అంచనాల(14.7 శాతం) కంటే తక్కువగా నిరుద్యోగిత 8.4 శాతంగా నమోదైంది. దీంతో మిడ్‌సెషన్ నుంచీ మార్కెట్లు కోలుకున్నట్లు నిపుణులు తెలియజేశారు. నష్టాల బాట.. వారాంతాన ఫాంగ్(FAAMNG) స్టాక్స్ గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్ 3-1.4 శాతం మధ్య క్షీణించాయి. ఈ బాటలో జూమ్ 3 శాతం పతనంకాగా.. ఐఫోన్ల దిగ్గజం యాపిల్ యథాతథంగా ముగిసింది. ఇతర కౌంటర్లలో తొలుత 6 శాతం పతనమైన ఆటో దిగ్గజం టెస్లా దాదాపు 3 శాతం లాభంతో నిలిచింది. బ్లూచిప్స్ బోయింగ్, హెచ్‌పీఈ 1 శాతం స్థాయిలో బలపడ్డాయి. కాగా.. చైనీస్ టెక్ దిగ్గజం టెన్సెంట్ షేరు రెండు రోజుల్లో 5 శాతం నీరసించడంతో 34 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయింది. పబ్జీ గేమ్‌ను ఇండియాలో నిషేధించడం ఈ కౌంటర్‌ను దెబ్బతీసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. -
టెక్ షాక్- యూఎస్ మార్కెట్లు బోర్లా
వరుస రికార్డులతో హోరెత్తిస్తున్న అమెరికా స్టాక్ మార్కెట్లు గురువారం ఒక్కసారిగా కుప్పకూలాయి. ప్రధానంగా ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే న్యూఏజ్ ఎకానమీ కౌంటర్లలో తలెత్తిన భారీ అమ్మకాలు మార్కెట్లను దెబ్బతీశాయి. దీంతో డోజోన్స్ 808 పాయింట్లు(2.8%) పతనమై 28,293 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 126 పాయింట్లు(3.5%) పడిపోయి 3,455 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 598 పాయింట్లు(5%) దిగజారి 11,458 వద్ద స్థిరపడింది. యాపిల్, మైక్రోసాఫ్ట్, బోయింగ్ తదితర దిగ్గజాల వెనకడుగుతో తొలుత డోజోన్స్ 1,000 పాయింట్లకుపైగా పడిపోవడం గమనార్హం! పతన బాటలో కొద్ది నెలలుగా దూకుడు చూపుతూ అటు ఎస్అండ్పీ, ఇటు నాస్డాక్ కొత్త రికార్డులను చేరుకునేందుకు దోహదపడుతున్న టెక్ దిగ్గజాల కౌంటర్లలో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి జూన్ తదుపరి ఒక్క రోజులోనే ఫాంగ్ స్టాక్స్ అన్నీ భారీగా పతనమయ్యాయి. ఐఫోన్ల దిగ్గజం యాపిల్ 8 శాతం, విండోస్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 6.2 శాతం చొప్పున కుప్పకూలగా.. అమెజాన్, ఫేస్బుక్, గూగుల్, నెట్‌ఫ్లిక్స్ 5 శాతం స్థాయిలో పతనమయ్యాయి. ఇతర కౌంటర్లలో జూమ్ 10 శాతం, టెస్లా 9 శాతం, ఎన్విడియా 9.3 శాతం చొప్పున బోర్లా పడ్డాయి. ఇక బ్లూచిప్స్ హెచ్‌పీ, బోయింగ్, డీరె 3 శాతం చొప్పున డీలా పడ్డాయి. అయితే పటిష్ట త్రైమాసిక ఫలితాల కారణంగా కాల్విన్ క్లెయిన్ బ్రాండ్ కంపెనీ పీవీహెచ్ కార్ప్ 3.3 శాతం ఎగసింది. లాభాల స్వీకరణ ఉన్నట్టుండి గురువారం వెల్లువెత్తిన అమ్మకాలకు ప్రధాన కారణం ట్రేడర్ల లాభాల స్వీకరణే అని విశ్లేషకులు చెబుతున్నారు. కోవిడ్-19 కారణంగా ఆర్థిక వ్యవస్థ అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ న్యూఏజ్ ఎకానమీ కౌంటర్లు నిరవధికంగా దూసుకెళుతున్నట్లు తెలియజేశారు. దీంతో సాంకేతికంగానూ మార్కెట్లు ఓవర్‌బాట్ స్థాయికి చేరుకున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నట్లు వివరించారు. ఉదాహరణకు గురువారంనాటి పతనం తదుపరి కూడా యాపిల్ ఇంక్ షేరు 2020లో ఇప్పటివరకూ 65 శాతం ర్యాలీ చేయడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. బుధవారం రికార్డ్స్ పలు సానుకూల అంశాల నేపథ్యంలో బుధవారం ఎస్అండ్పీ 54 పాయింట్లు(1.5%) బలపడి 3,581కు చేరగా.. నాస్డాక్ 117 పాయింట్లు(1%) ఎగసి 12,056 వద్ద ముగిసింది. వెరసి 2020లో ఎస్అండ్పీ 22వసారి, నాస్డాక్ 43వ సారి సరికొత్త గరిష్టాలను అందుకున్న సంగతి తెలిసిందే. ఇక డోజోన్స్ 455 పాయింట్లు(1.6%) జంప్‌చేసి 29,100 వద్ద స్థిరపడింది. తద్వారా ఫిబ్రవరి గరిష్టానికి 1.5 శాతం చేరువలో నిలవడంతోపాటు.. 6 నెలల తదుపరి తిరిగి 29,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. -
వ్యాక్సిన్ హోప్- యూఎస్ దూకుడు
వరుస రికార్డులతో హోరెత్తిస్తున్న అమెరికా స్టాక్ మార్కెట్లు బుధవారం మరోసారి దూకుడు చూపాయి. వ్యాక్సిన్ల అందుబాటు కారణంగా డిసెంబర్‌కల్లా కోవిడ్-19కు చెక్పెట్టగలమంటూ వెలువడిన అంచనాలు సెంటిమెంటుకు జోష్‌నివ్వగా.. మరో సహాయక ప్యాకేజీపై స్పీకర్ నాన్సీ పెలోసీతో ఆర్థిక మంత్రి స్టీవెన్ ముచిన్ చర్చలు ప్రారంభించడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఎస్అండ్పీ 54 పాయింట్లు(1.5%) బలపడి 3,581కు చేరగా.. నాస్డాక్ 117 పాయింట్లు(1%) ఎగసి 12,056 వద్ద ముగిసింది. వెరసి 2020లో ఇప్పటివరకూ ఎస్అండ్పీ 22వసారి, నాస్డాక్ 43వ సారి సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. ఇక డోజోన్స్ 455 పాయింట్లు(1.6%) జంప్‌చేసి 29,100 వద్ద స్థిరపడింది. తద్వారా ఫిబ్రవరి గరిష్టానికి 1.5 శాతం చేరువలో నిలవడంతోపాటు.. 6 నెలల తదుపరి తిరిగి 29,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. బ్లూచిప్స్ దన్ను ప్రధానంగా దిగ్గజ కంపెనీలు బలపడటంతో మార్కెట్లు జోరందుకున్నాయి. కోక కోలా, జనరల్ మోటార్స్, హెచ్‌పీ 4 శాతం, ఇంటెల్ కార్ప్, ఫేస్బుక్ 2.5 శాతం, మైక్రోసాఫ్ట్ 2 శాతం చొప్పున జంప్‌చేశాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఏడీపీ 3 శాతం, ఫోర్డ్ మోటార్, బోయింగ్ 1.75 శాతం, అమెజాన్ 1 శాతం చొప్పున ఎగశాయి. బాస్కెట్ బాల్ దిగ్గజం మైఖేల్ జోర్డాన్‌ను సలహాదారుగా నియమించుకోవడంతో డ్రాఫ్ట్‌కింగ్స్ 8 శాతం దూసుకెళ్లింది. కంపెనీలో అతిపెద్ద ఇన్వెస్టర్ ఒకరు షేర్లను విక్రయించినట్లు వెల్లడించడంతో ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ 6 శాతం పతనమైంది. ఇక బుధవారం భారీగా ఎగసిన జూమ్ వీడియో 7.5 శాతం దిగజారగా.. యాపిల్ ఇంక్ 2 శాతం క్షీణించింది. -
యూఎస్- ఆరో రోజూ అదే జోరు
వారాంతాన యూఎస్ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. ఎస్అండ్పీ 23 పాయింట్లు(0.7 శాతం) ఎగసి 3,508 వద్ద నిలవడం ద్వారా వరుసగా ఆరో రోజు చరిత్రాత్మక గరిష్టాన్ని సాధించింది. ఈ బాటలో నాస్డాక్ 70 పాయింట్లు(0.6 శాతం) బలపడి 11,696 వద్ద ముగిసింది. వెరసి 2020లో 40వ సారి సరికొత్త గరిష్ట రికార్డును అందుకుంది. ఇక వీటితో పోలిస్తే కొంత వెనకడుగులో ఉన్న డోజోన్స్ శుక్రవారం 162 పాయింట్లు(0.6 శాతం) పుంజుకుని 28,654 వద్ద స్థిరపడింది. తద్వారా 2020లో ఏర్పడిన నష్టాల నుంచి బయటపడింది. అంటే మార్చిలో నమోదైన కనిష్టం నుంచి 57 శాతం ర్యాలీ చేసింది. వెరసి ఫిబ్రవరిలో సాధించిన రికార్డ్ గరిష్టాన్ని బ్రేక్ చేసేందుకు కేవలం 1,000 పాయింట్ల దూరంలోనిలిచింది. కాగా.. వరుసగా ఐదు వారాలపాటు లాభాల్లో నిలవడం ద్వారా ఎస్అండ్పీ మరో రికార్డును సాధించడం విశేషం! 1984 తదుపరి ఆగస్ట్‌లో ఎస్అండ్పీ, డోజోన్స్ 8 శాత స్థాయిలో లాభపడ్డాయి. కారణాలున్నాయ్ కోవిడ్-19 విసురుతున్న సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రెసిడెంట్ ట్రంప్ 1.3 ట్రిలియన్ డాలర్ల భారీ సహాయక ప్యాకేజీకి సిద్ధపడుతుండటం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇక ఆర్థిక రికవరీని సూచిస్తూ జులైలో వ్యక్తిగత వినియోగ సూచీ దాదాపు 2 శాతం జంప్‌చేయడం కూడా ఇందుకు దోహదపడినట్లు తెలియజేశారు. మరోపక్క జాక్సన్హోల్ వద్ద ప్రసంగంలో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్యోల్బణానికంటే ఆర్థిక రికవరీకే అధిక ప్రాధాన్యమివ్వనున్నట్లు స్పష్టం చేయడం ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చినట్లు విశ్లేషకులు వివరించారు. కోక కోలా అప్ వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించడంతో పానీయాల దిగ్గజం కోక కోలా, విమానయాన బ్లూచిప్ యునైటెడ్ ఎయిర్‌లైన్స్ 3 శాతం చొప్పున ఎగశాయి. క్యూ2లో నికర లాభం అంచనాలు మించడంతో డెల్ టెక్నాలజీస్ 6 శాతం జంప్‌చేసింది. క్యూ3పై అంచనాలతో హెచ్‌పీ 6 శాతం పురోగమించింది. వార్షిక సబ్స్క్రిప్షన్లు జోరందుకోనున్నట్లు అంచనాలు ప్రకటించిన వర్క్‌డే ఇంక్ 13 శాతం దూసుకెళ్లింది. టిక్‌టాక్ యూఎస్ యూనిట్ కొనుగోలుకి చేతులు కలిపిన వాల్‌మార్ట్ 2.7 శాతం, మైక్రోసాఫ్ట్ 1 శాతం చొప్పున లాభపడ్డాయి. బెయిన్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయనున్న వార్తలతో న్యుటానిక్స్ ఇంక్ 29 శాతం ర్యాలీ చేసింది. నార్వేజియన్ క్రూయిజ్, రాయల్ కరిబియన్, డెల్టా, అమెరికన్ ఎయిర్‌లైన్స్ 6-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. -
యూఎస్ మార్కెట్ల రికార్డ్.. రికార్డ్స్
వరుసగా నాలుగో రోజు బువారం యూఎస్ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. ఎస్అండ్పీ 35 పాయింట్లు(1 శాతం) ఎగసి 3,479 వద్ద నిలవగా.. నాస్డాక్ 199 పాయింట్లు(1.75 శాతం) జంప్‌చేసి 11,665 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. డోజోన్స్ 83 పాయింట్లు(0.3 శాతం) బలపడి 28,332 వద్ద స్థిరపడింది. వెరసి డోజోన్స్ సరికొత్త గరిష్టానికి 4 శాతం చేరువలో నిలిచింది. జులైలో తయారీ రంగ జోరుకు నిదర్శనంగా డ్యురబుల్ గూడ్స్ ఆర్డర్లు 11 శాతం వృద్ది చెందడంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇండెక్సుల జోరు ప్రధానంగా ఫాంగ్(FAAMNG) స్టాక్స్ లాభపడటంతో నాస్డాక్ 2020లో 39వ సారి సరికొత్త రికార్డును సాధించింది. ఇక ఎస్అండ్పీ సైతం 2020లో ఇప్పటివరకూ 18వ సారి రికార్డ్ గరిష్టాలను అందుకోవడం విశేషం! కాగా.. కోవిడ్-19 ప్రభావతో మార్చి 23న నమోదైన కనిష్టం 2,192 పాయింట్ల నుంచి ఎస్అండ్పీ 59 శాతం దూసుకెళ్లింది. ఇక జనవరి నుంచి చూస్తే కోవిడ్-19 నేపథ్యంలోనూ నాస్డాక్ 30 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! నెట్‌ఫ్లిక్స్ దూకుడు బుధవారం ట్రేడింగ్‌లో నెట్‌ఫ్లిక్స్ గత మూడేళ్లలోలేని విధంగా 12 శాతం దూసుకెళ్లి 547 డాలర్లను అధిగమించింది. ఇతర ఫాంగ్ స్టాక్స్‌లో మైక్రోసాఫ్ట్, అల్ఫాబెట్, ఫేస్బుక్ సరికొత్త గరిష్టాలను తాకాయి. ఈ బాటలో డోజోన్స్ ఇండెక్స్‌లో చోటు సాధించనున్న సేల్స్‌ఫోర్స్.కామ్ సైతం రికార్డ్ గరిష్టానికి చేరింది. పటిష్ట ఫలితాలు, గైడెన్స్ ఇందుకు దోహదం చేయగా.. ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ 6.4 శాతం జంప్‌చేసి 2153 డాలర్ల వద్ద ముగిసింది. ఇతర దిగ్గజాలలో యాపిల్ 1.4 శాతం పుంజుకోగా.. బోయింగ్ 1.6 శాతం క్షీణించింది. ఆదాయ అంచనాలు ఆకట్టుకోవడంతో హెచ్‌పీ ఎంటర్ప్రైజ్ 3.6 శాతం లాభపడగా.. ఫలితాలు నిరాశపరచడంతో రిటైలర్ నార్డ్‌స్ట్రామ్ 5.5 శాతం పతనమైంది. హరికేన్ లారా కారణంగా ఇంధన రంగ షేర్లు డీలాపడ్డాయి. -
ఫాంగ్ స్టాక్స్ దన్ను- మూడో రోజూ రికార్డ్స్
వరుసగా మూడో రోజు మంగళవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు రికార్డులను నెలకొల్పాయి. ఎస్అండ్పీ 13 పాయింట్లు(0.4 శాతం) పుంజుకుని 3,444 వద్ద నిలవగా.. నాస్డాక్ 87 పాయింట్లు(0.76 శాతం) ఎగసి 11,466 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. డోజోన్స్ మాత్రం 60 పాయింట్లు(0.2 శాతం) క్షీణించి 28,249 వద్ద స్థిరపడింది. ఫాంగ్ స్టాక్స్ మరోసారి లాభపడటంతో నాస్డాక్ 2020లో 38వ సారి సరికొత్త రికార్డును సాధించింది. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలు ప్రారంభంకావడంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. గురువారం జాక్సన్హోల్ వద్ద ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చేయనున్న ప్రసంగంపై ఇన్వెస్టర్లు తాజాగా దృష్టిపెట్టినట్లు తెలియజేశారు. యాపిల్ డీలా షేర్ల విభజన తదుపరి డోజోన్స్‌లో యాపిల్ ఇంక్ వెయిటేజీ నీరసించగా.. ఇండెక్స్‌లో చేపట్టిన ఇతర మార్పులు ప్రభావం చూపినట్లు నిపుణులు తెలియజేశారు. డోజోన్స్‌లో ఎక్సాన్ మొబిల్ స్థానే సేల్స్‌ఫోర్స్.కామ్‌కు చోటు లభిస్తుండగా.. హనీవెల్ ఇంటర్నేషనల్ రాకతో రేథియాన్ టెక్నాలజీస్ చోటు కోల్పోనుంది. ఈ బాటలో ఫైజర్ ఇంక్‌ను తోసిరాజని యామ్జెన్ ఇంక్ డోజోన్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నట్లు పేర్కొన్నారు. బోయింగ్ ఇంక్ 2 శాతం, యాపిల్ 1 శాతం చొప్పున క్షీణించడంతో డోజోన్స్ వెనకడుగు వేసింది. అయితే ఫేస్బుక్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ 3-1 శాతం మధ్య లాభపడటంతో ఎస్అండ్పీ, నాస్డాక్ రికార్డులు కొనసాగినట్లు నిపుణులు పేర్కొన్నారు. బెస్ట్ బయ్ వీక్ ప్రభుత్వం పేరోల్ ప్యాకేజీని పొడిగించకుంటే అక్టోబర్‌లో 19,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు ప్రకటించడంతో అమెరికన్ ఎయిర్‌లైన్స్ కౌంటర్ 2.2 శాతం డీలా పడింది. ఎలక్ట్రానిక్స్ చైన్ బెస్ట్ బయ్ అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించినప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా క్యూ3లో అమ్మకాలు క్షీణించవచ్చని అంచనా వేసింది. దీంతో ఈ షేరు 4 శాతం పతనమైంది. ఇక క్యూ2లో పటిష్ట ఫలితాలు సాధించడంతో మెడ్‌ట్రానిక్స్ షేరు 2.5 శాతం ఎగసింది. -
వ్యాక్సిన్ హోప్- రెండో రోజూ రికార్డ్స్
వరుసగా రెండో రోజు సోమవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు రికార్డులను నెలకొల్పాయి. ఎస్అండ్పీ 34 పాయింట్లు(1 శాతం) పుంజుకుని 3,431 వద్ద నిలవగా.. నాస్డాక్ 68 పాయింట్లు(0.6 శాతం) ఎగసి 11,380 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఎస్అండ్పీ తొలిసారి 3,400 మార్క్‌ను అధిగమించింది. ఇక డోజోన్స్ 378 పాయింట్లు(1.4 శాతం) జంప్‌చేసి 28,308 వద్ద స్థిరపడింది. తద్వారా ఆరు నెలల తదుపరి తిరిగి 28,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. వెరసి ఫిబ్రవరి 12న సాధించిన చరిత్రాత్మక గరిష్టానికి 4.2 శాతం దూరంలో నిలిచింది. గత వారం 2.7 శాతం లాభపడటం ద్వారా నాస్డాక్ 2020లో 36వ సారి సరికొత్త రికార్డును సాధించిన విషయం విదితమే. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌కు వాషింగ్టన్ ప్రభుత్వం త్వరితగతిన అనుమతివ్వనున్న వార్తలు సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. నవంబర్‌లో ప్రారంభంకానున్న అధ్యక్ష ఎన్నికలలోపే కోవిడ్-19 చికిత్సకు వినియోగించగల వ్యాక్సిన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే వీలున్నట్లు తెలియజేశారు. ఇక మరోపక్క ప్లాస్మా చికిత్సను యూఎస్ఎఫ్డీఏ తాజాగా అనుమతించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. యాపిల్ భళా వ్యాక్సిన్ అనుమతులపై అంచనాలతో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా షేరు 2 శాతం ఎగసింది. దీంతో ఎయిర్‌లైన్స్, క్రూయిజర్ కంపెనీల కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. వెరసి యునైటెడ్, డెల్టా ఎయిర్‌లైన్స్ 9 శాతం చొప్పున దూసుకెళ్లగా.. కార్నివాల్, నార్వేజియన్ క్రూయిజ్ లైన్, రాయల్ కరిబియన్ 10-5 శాతం మధ్య జంప్‌చేశాయి. ఈ బాటలో బోయింగ్ 6.5 శాతం జంప్‌చేసింది. ఇక ఫాంగ్ స్టాక్స్‌లో ఫేస్బుక్, యాపిల్, అమెజాన్, అల్ఫాబెట్ 1.6-0.6 శాతం మధ్య లాభపడ్డాయి. ప్రధానంగా ఐఫోన్ల దిగ్గజం యాపిల్ తొలిసారి 503 డాలర్ల వద్ద ముగిసింది. ఇతర కౌంటర్లలో ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ షేరు 2 శాతం క్షీణించింది. ఆసియా లాభాల్లో యూఎస్ ఇండెక్సుల ప్రోత్సాహంతో ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ సానుకూల ధోరణి నెలకొంది. జపాన్, సింగపూర్, కొరియా, తైవాన్, ఇండోనేసియా, థాయ్‌లాండ్ 1.8-0.5 శాతం మధ్య జంప్ చేశాయి. ఇతర మార్కెట్లలో థాయ్‌లాండ్, చైనా 0.5-0.2 శాతం చొప్పున డీలాపడ్డాయి. -
ఫాంగ్ స్టాక్స్ జోరు- నాస్డాక్ 35వ రికార్డ్
ప్రధానంగా ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే దిగ్గజాలు జోరందుకోవడంతో గురువారం నాస్డాక్ సరికొత్త ఫీట్ సాధించింది. 118 పాయింట్లు (1.1 శాతం) ఎగసి 11,265 వద్ద ముగిసింది. తద్వారా 2020లో 35వ సారి సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ఈ బాటలో ఎస్అండ్పీ 11 పాయింట్లు(0.3 శాతం) పుంజుకుని 3,385 వద్ద నిలిచింది. ఇక డోజోన్స్ 47 పాయింట్లు(0.2 శాతం) బలపడి 27,740 వద్ద స్థిరపడింది. కాగా. 2020లో నాస్డాక్ 25.5 శాతం జంప్‌చేయగా.. ఎస్అండ్పీ 5 శాతం ఎగసింది. డోజోన్స్ మాత్రం 3 శాతం క్షీణించింది. టెక్ దిగ్గజాల అండతో 2019లో నాస్డాక్ 31సార్లు రికార్డ్ గరిష్టాలను అందుకోగా.. 2018లోనూ 29సార్లు ఈ ఫీట్‌ను సాధించడం విశేషం! తొలి అమెరికన్ కంపెనీ గురువారం ట్రేడింగ్‌లో యాపిల్ షేరు 2.2 శాతం లాభపడి 473 డాలర్ల వద్ద ముగిసింది. తద్వారా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2 లక్షల కోట్ల డాలర్లను అధిగమించి నిలిచింది. బుధవారం ఇంట్రాడేలో ఈ ఫీట్‌ను సాధించిన సంగతి తెలిసిందే. వెరసి అమెరికన్ స్టాక్ మార్కెట్ చరిత్రలో యాపిల్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. కాగా.. ఇతర దిగ్గజాలు నెట్‌ఫ్లిక్స్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ సైతం గురువారం 2.5 శాతం స్థాయిలో ఎగశాయి. దీంతో నాస్‌డాక్‌కు బలమొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ షేరు 6.6 శాతం దూసుకెళ్లింది. 2002 డాలర్ల సమీపంలో నిలిచింది. వెరసి తొలిసారి 2,000 డాలర్ల మార్క్‌ను చేరింది. ఇతర కౌంటర్లలో ట్యాక్సీ సేవల కంపెనీలు ఉబర్ 7 శాతం, లిఫ్ట్ 6 శాతం చొప్పున జంప్‌చేశాయి. -
ఫాంగ్ స్టాక్స్ వీక్- నాస్డాక్ డౌన్
ఊగిసలాట మధ్య వారాంతాన యూఎస్ మార్కెట్లు అటూఇటుగా ముగిశాయి. డోజోన్స్ 47 పాయింట్లు(0.2 శాతం) లాభపడి 27,433కు చేరగా.. ఎస్అండ్పీ 2 పాయింట్ల నామమాత్ర వృద్ధితో 3,351 వద్ద ముగిసింది. అయితే నాస్డాక్ 97 పాయింట్లు(0.9 శాతం) క్షీణించి 11,011 వద్ద స్థిరపడింది. వెరసి గురువారం నమోదైన ఆల్‌టైమ్ హై 11,108 నుంచి వెనకడుగు వేసింది. ప్రెసిడెంట్ ట్రంప్.. చైనీస్ యాప్‌లు వియ్‌చాట్, టిక్‌టాక్‌లను నిషేధించే సన్నాహాల నేపథ్యంలో అమెరికా, చైనా మధ్య వివాదాలు పెరగవచ్చన్న ఆందోళనలు సెంటిమెంటును బలహీనపరచినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. జులైలో వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు 1.76 మిలియన్లకు చేరినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. జూన్‌లో నమోదైన 4.8 మిలియన్లతో పోలిస్తే ఇవి అత్యంత తక్కువే అయినప్పటికీ అంచనాల(1.6 మిలియన్లుకంటే అధికమేనని విశ్లేషకులు తెలియజేశారు. ఫేస్బుక్ అప్ శుక్రవారం ఫాంగ్ స్టాక్స్‌లో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మినహా మిగిలిన కౌంటర్లు బలహీనపడ్డాయి. ఫేస్బుక్ 1.2 శాతం బలపడగా.. ఎంటర్టైన్మెంట్ బ్లూచిప్ నెట్‌ఫ్లిక్స్ 2.8 శాతం క్షీణించింది. ఈ బాటలో ఐఫోన్ల దిగ్గజం యాపిల్ 2.3 శాతం, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ఈకామర్స్ బ్లూచిప్ అమెజాన్ 1.8 శాతం చొప్పున క్షీణించాయి. ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న టెస్లా ఇంక్ సైతం 2.5 శాతం వెనకడుగు వేసింది. కాగా.. జులైలో సబ్స్క్రైబర్లు భారీగా పెరిగినట్లు వెల్లడించిన టీమొబైల్ 6.5 శాతం జంప్‌చేసింది. టెన్సెంట్ నేలచూపు వియ్‌చాట్ నుంచి విడివడిన టెన్సెంట్ మ్యూజిక్ 3.3 శాతం నష్టపోగా.. ఇతర చైనీస్ కంపెనీలలో ఈకామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ 1.9 శాతం, జేడీ.కామ్ 4.1 శాతం చొప్పున డీలాపడ్డాయి. -
మోహన్ బగాన్‌కు అరుదైన గౌరవం
కోల్‌కతా: క్రికెట్ అంటే పడిచచ్చే భారత్‌లో ఇప్పటికీ ఫుట్‌బాల్‌ను బతికిస్తున్న జట్లలో ప్రతిష్టాత్మక మోహన్ బగాన్ క్లబ్ ఒకటి. 131 ఏళ్ల చరిత్ర గల ఈ క్లబ్‌కు బుధవారం అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మక టైమ్స్ స్క్వేర్‌లో ‘నాస్డాక్’ బిల్‌బోర్డులపై క్లబ్ లోగోను, టీమ్ రంగులను ప్రత్యేకంగా ప్రదర్శించారు. భారత్ నుంచి ఏ క్రీడలకు సంబంధించిన జట్టు గురించైనా ఇలా ‘నాస్డాక్’ బిల్‌బోర్డుపై ప్రదర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. జులై 29ని ‘మోహన్ బగాన్ డే’గా వ్యవహరిస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని టైమ్స్ స్క్వేర్‌లో ఈ ఏర్పాటు చేశారు. 1911లో ఇదే రోజు ప్రతిష్టాత్మక ఐఎఫ్ఏ షీల్డ్ టోర్నీలో భాగంగా మోహన్ బగాన్ 2–1తో బ్రిటిష్‌కు చెందిన ఈస్ట్ యార్క్‌షైర్ రెజిమెంట్ జట్టును ఓడించింది. భారత స్వాతంత్రోద్యమ కాలంలో దక్కిన ఈ గెలుపునకు అప్పట్లో ఎంతో ప్రాధాన్యత లభించింది. తమ జట్టుకు తాజాగా దక్కిన గౌరవంపట్ల మోహన్ బగాన్ యాజమాన్యం ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. తమ జట్టు ఎంతో ప్రత్యేకమైందో ఇది చూపించిందని అభిమానులు ఆనందం ప్రదర్శించారు. మరోవైపు ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) కూడా దీనిపై అభినందనలు తెలపడం విశేషం. ‘న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో బిల్‌బోర్డుపై కనిపించిందంటే అది ఒక క్లబ్ మాత్రమే కాదు. ఈ ప్రపంచంలో ఫుట్‌బాల్‌కు అమితంగా మద్దతిచ్చే క్లబ్‌లలో ఒకటైన మోహన్ బగాన్‌ను అభినందనలు’ అని ‘ఫిఫా’ ట్వీట్ చేసింది. -
టెక్ దిగ్గజాల షాక్- నాస్డాక్ పతనం
టెక్ దిగ్గజాల కౌంటర్లలో భారీ అమ్మకాలు చోటుచేసుకోవడంతో గురువారం యూఎస్ మార్కెట్లు డీలాపడ్డాయి. ప్రధానంగా ఫాంగ్ స్టాక్స్‌లో అమెజాన్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్‌తోపాటు.. మైక్రోసాఫ్ట్, టెస్లా పతనంకావడంతో నాస్డాక్ అత్యధికంగా 245 పాయింట్లు(2.3 శాతం) తిరోగమించింది.10,461 వద్ద ముగిసింది. ఈ బాటలో డోజోన్స్ 354 పాయింట్లు(1.3 శాతం) క్షీణించి 26,652కు చేరగా.. ఎస్అండ్పీ 40 పాయింట్ల(1.25 శాతం) వెనకడుగుతో 3,236 వద్ద స్థిరపడింది. వెరసి నాలుగు రోజుల ర్యాలీకి బ్రేక్ పడింది. కారణాలివీ గత వారం నిరుద్యోగ భృతికి దరఖాస్తులు గత నాలుగు నెలల్లోలేని విధంగా 1.416 మిలియన్లకు పెరిగినట్లు కార్మిక శాఖ వెల్లడించింది. మరోవైపు ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌పై వివిధ రాష్ట్రాలలో వినియోగదారుల పరిరక్షణ అంశాలపై దర్యాప్తు జరగనుందన్న వార్తలు టెక్ కౌంటర్లలో అమ్మకాలకు కారణమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోపక్క క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం అజ్యూర్ ఒక త్రైమాసికంలో తొలిసారి 50 శాతంకంటే తక్కువ వృద్ధిని నమోదు చేయడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇక వరుసగా నాలుగో త్రైమాసికంలో లాభాలు ప్రకటించినప్పటికీ షేరు ఇటీవల అనూహ్య ర్యాలీ చేయడంతో టెస్లా ఇంక్ కౌంటర్లో లాభాల స్వీకరణ తలెత్తినట్లు తెలియజేశారు. నేలచూపులో ఎలక్ట్రిక్ కార్ల బ్లూచిప్ కంపెనీ టెస్లా ఇంక్ షేరు 5 శాతం పతనమై 1513 డాలర్లకు చేరగా.. టెక్ దిగ్గజాలలో యాపిల్ 4.6 శాతం వెనకడుగుతో 371 డాలర్లను తాకింది. మైక్రోసాఫ్ట్ 4.6 శాతం పతనమై 203 డాలర్ల దిగువకు చేరగా.. అమెజాన్ 3.7 శాతం నష్టంతో 2987 డాలర్ల దిగువన స్థిరపడింది. ఇతర కౌంటర్లలో గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ 3.4 శాతం, ఫేస్బుక్ 3 శాతం, నెట్‌ఫ్లిక్స్ 2.5 శాతం చొప్పున క్షీణించాయి. కాగా.. వచ్చే రెండు నెలల్లో మరిన్ని సర్వీసులను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలియజేయడంతో అమెరికన్ ఎయిర్‌లైన్స్ 3.7 శాతం ఎగసింది. రోజువారీ వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగినట్లు వెల్లడించడంతో ట్విటర్ 4.1 శాతం జంప్‌చేసింది. -
నెట్ఫ్లిక్స్కూ కోవిడ్-19 షాక్
గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2020) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అయితే మూడో త్రైమాసికానికి(జులై- సెప్టెంబర్) అంచనాలను కుదించింది. కోవిడ్-19 కట్టడికి అమలు చేసిన లాక్‌డవున్, ప్రత్యర్ధి సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీ.. ఇందుకు కారణమయ్యాయి. గురువారం మార్కెట్లు ముగిశాక ఫలితాలు వెల్లడించడంతో ఫ్యూచర్స్‌లో నెట్‌ఫ్లిక్స్ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. వెరసి నాస్డాక్ ఫ్యూచర్స్‌లో నెట్‌ఫ్లిక్స్ షేరు 9.5 శాతం కుప్పకూలింది. 477 డాలర్లకు చేరింది. దీంతో నేటి(శుక్రవారం) ట్రేడింగ్‌లో ఈ ప్రభావం కనిపించే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. గురువారం ట్రేడింగ్‌లో నెట్‌ఫ్లిక్స్ షేరు 0.8 శాతం బలపడి 527 డాలర్లకు ఎగువన ముగిసింది. క్యూ2 రికార్డ్ లాక్‌డవున్‌ల కారణంగా ఈ ఏడాది క్యూ2(ఏప్రిల్- జూన్)లో నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 10 మిలియన్ కొత్త కస్టమర్లను పొందింది. దీంతో కొత్త కస్టమర్ల సంఖ్య 26 మిలియన్లకు చేరింది. అయితే క్యూ3లో కొత్త పెయిడ్ కస్టమర్ల సంఖ్య 2.5 మిలియన్లకు తగ్గనున్నట్లు అంచనా వేసింది. స్ట్రీమింగ్ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 5.3 మిలియన్ కొత్త కస్టమర్లు జతకాగలరని విశ్లేషకులు అంచనా వేశారు. అమెజాన్ ప్రైమ్‌తోపాటు ఇటీవల డిస్నీప్లస్ రేసులోకి రావడంతో పోటీ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ ఏడాది తొలి అర్ధభాగంతో పోలిస్తే ద్వితీయార్ధంలో పనితీరు మందగించనున్నట్లు నెట్‌ప్లిక్స్ అభిప్రాయపడింది. ఆదాయం అప్ క్యూ2లో నెట్‌ఫ్లిక్స్ ఆదాయం 25 శాతం పెరిగి 6.15 బిలియన్ డాలర్లను తాకగా.. నికర లాభం రెండు రెట్లు ఎగసి 72 కోట్ల డాలర్లకు చేరింది. క్యూ3లో 6.33 బిలియన్ డాలర్ల ఆదాయం, 95.4 కోట్ల డాలర్ల నికర లాభాన్ని నెట్‌ఫ్లిక్స్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కంటెంట్ చీఫ్‌గా వ్యవహరిస్తున్న టెడ్ శరండోస్ను కో-సీఈవోగా ప్రమోట్ చేస్తున్నట్లు నెట్‌ప్లిక్స్ తాజాగా పేర్కొంది. తద్వారా కంపెనీ సహవ్యవస్థాపకుడు, సీఈవో రీడ్ హ్యాస్టింగ్కు కార్యకలాపాల నిర్వహణలో మరింత సహకారాన్ని అందించనున్నట్లు తెలియజేసింది. -
టెస్లా షేరు జెట్ స్పీడ్- ఎందుకంట?
కోవిడ్-19 కష్టకాలంలోనూ గ్లోబల్ ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ షేరు లాభాలతో కదం తొక్కుతోంది. అమెరికాలో లిస్టయిన ఎలక్ట్రిక్ కార్ల ఈ స్పెషలిస్ట్ కంపెనీ షేరు పలు రికార్డులు సృష్టించడం ద్వారా ఇటీవల తరచుగా వార్తలకెక్కుతోంది. ఇందుకు యూఎస్‌లోని పలు రాష్ట్రాలలో లాక్డవున్లు కొనసాగుతున్నప్పటికీ వాహన విక్రయాలను పెంచుకోగలగడం, ఎస్అండ్పీ ఇండెక్స్‌లో చోటు లభించనున్న అంచనాలు వంటి అంశాలు దోహదం చేస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇతర వివరాలు చూద్దాం.. జోరు తీరు సోమవారం నాస్డాక్, ఎస్అండ్పీ ఇండెక్సులు 2-1 శాతం మధ్య వెనకడుగు వేయగా.. టెస్లా ఇంక్ షేరు 3 శాతం క్షీణించి 1497 డాలర్ల వద్ద ముగిసింది. అయితే తొలుత 16 శాతం దూసుకెళ్లింది. 1795 డాలర్లకు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) 321 బిలియన్ డాలర్లను తాకింది. తద్వారా అమెరికా స్టాక్ మార్కెట్లలో లిస్టయిన టాప్-10 కంపెనీల జాబితాలో చోటు సాధించింది. అంతేకాకుండా మార్కెట్ విలువలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్(పీఅండ్‌జీ)ను వెనక్కి నెట్టింది. అయితే చివర్లో అమ్మకాలు ఊపందుకుని చతికిలపడటంతో మార్కెట్ విలువ దాదాపు 278 బిలియన్ డాలర్లకు దిగివచ్చింది. 200 శాతం ఈ ఏడాది ఇప్పటివరకూ టెస్లా ఇంక్ షేరు 200 శాతం దూసుకెళ్లింది. ఈ నెల(జులై)లోనే 38 శాతం లాభపడింది. ఈ బాటలో మార్కెట్ విలువరీత్యా జులై మొదటి వారంలో జపనీస్ ఆటో దిగ్గజం టయోటాను అధిగమించిన విషయం విదితమే. ఇందుకు ప్రధానంగా ఏప్రిల్-జూన్(క్యూ2) కాలంలో అంచనాలను మించుతూ 90,650 కార్లను విక్రయించడం ప్రభావం చూపింది. మోడల్ 3, మోడల్ Y కార్లు ఇందుకు సహకరించినట్లు నిపుణులు పేర్కొన్నారు. అంతక్రితం జనవరి-మార్చిలో 72,000 వాహనాలు విక్రయించగా.. పరిశ్రమవర్గాలు 83,000 వాహన అమ్మకాలను అంచనా వేశాయి. కాగా.. మరోపక్క ఎస్అండ్పీ-500 ఇండెక్స్‌లో టెస్లా ఇంక్ షేరుకి త్వరలో చోటు లభించనున్న అంచనాలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో ఇన్వెస్టర్లు కంపెనీ ఫండమెంటల్స్‌కు మించి స్పెక్యులేటివ్‌గా పొజిషన్లు తీసుకుంటున్నట్లు బేర్ ట్రాప్స్ రిపోర్ట్ ఎడిటర్ లారీ మెక్‌డొనాల్డ్ పేర్కొన్నారు. ఎస్అండ్పీలో చోటు లభిస్తే ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్ తదితర మరిన్ని సంస్థలు కంపెనీలో ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుందని తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల టెస్లా ఇంక్ షేరు దూకుడు చూపుతున్నట్లు విశ్లేషించారు. అంచనాలు అధికం గతేడాది టెస్లా దాదాపు 25 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించింది. ఈ బాటలో ఇటీవల వాహన విక్రయాలు పెరుగుతున్న కారణంగా మరింత మెరుగైన ఫలితాలు సాధించగలదన్న అంచనాలు బలపడుతున్నాయి. దీంతో 2025కల్లా కంపెనీ ఆదాయం 100 బిలియన్ డాలర్లను తాకవచ్చని జేఎంపీ సెక్యూరిటీస్ నిపుణులు జో ఓషా అంచనా వేశారు. అయితే టెస్లా ఇంక్ షేరుకి జో వేసిన 1500 డాలర్ల టార్గెట్‌ను ఇప్పటికే అధిగమించడం గమనార్హం! కంపెనీ ఏప్రిల్-జూన్ ఫలితాలను ఈ నెల 22న వెల్లడించనుంది. లాక్‌డవున్ కారణంగా గ్లోబల్ ఆటో కంపెనీలు జనరల్ మోటార్స్, టయోటా, ఫియట్ క్రిస్లర్, ఫోర్డ్ వంటి కంపెనీల అమ్మకాలు నీరసిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. అయితే టెస్లాను పూర్తిస్థాయి ఆటో దిగ్గజ కంపెనీలతో పోల్చడం సరికాదని ఈ సందర్భంగా పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. -
వైరస్‌కు చెక్!- బ్యాంకింగ్ భేష్
ప్రధానంగా బ్యాంకింగ్ రంగ కౌంటర్లు లాభాల దుమ్ము రేపడంతో శుక్రవారం యూఎస్ స్టాక్ మార్కెట్లకు బలమొచ్చింది. మరోపక్క ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్ రూపొందిస్తున్న ఔషధం మరింత ప్రభావం చూపుతున్నట్లు వెలువడిన వార్తలు కరోనా వైరస్ కట్టడికి సహకరించగలవన్న అంచనాలు పెరిగాయి. ఫలితంగా వారాంతాన డోజోన్స్ 369 పాయింట్లు(1.5 శాతం) ఎగసి 26,075 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 33 పాయింట్లు(1 శాతం) పుంజుకుని 3,185 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 70 పాయింట్లు(0.7 శాతం) లాభపడి 10,617 వద్ద స్థిరపడింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. గత ఏడు ట్రేడింగ్ సెషన్లలో నాస్డాక్ ఆరుసార్లు సరికొత్త రికార్డులను నెలకొల్పడం విశేషం! వెరసి గత వారం డోజోన్స్ 1 శాతం, ఎస్అండ్పీ దాదాపు 2 చొప్పున బలపడగా.. నాస్డాక్ మరింత అధికంగా 4 శాతం జంప్‌చేసింది. 1500 డాలర్లకు గత నెలలో కార్ల విక్రయాలు ఊపందుకోవడంతో ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ జోరు కొనసాగుతోంది. వారాంతాన 7 శాతం జంప్‌చేసి 1503 డాలర్ల వద్ద ముగిసింది. తద్వారా కంపెనీ చరిత్రలో తొలిసారి 1500 డాలర్ల మార్క్‌ను తాకింది. ఈ ఏడాది(2020)లో ఇప్పటివరకూ టెస్లా షేరు 259 శాతం ర్యాలీ చేయగా.. ఈ నెలలోనే 39 శాతం లాభపడటం విశేషం! ఇక వచ్చే వారం క్యూ2 ఫలితాలు విడుదల చేయనున్న బ్యాంకింగ్ దిగ్గజాలు సిటీగ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీ మోర్గాన్ చేజ్ 6.5-5.5 శాతం మధ్య జంప్‌చేశాయి. ఇతర బ్లూచిప్స్‌లో గోల్డ్‌మన్ శాక్స్ టార్గెట్ ధరను పెంచడంతో నెట్‌ఫ్లిక్స్ 8 శాతం దూసుకెళ్లింది. దశలవారీగా తిరిగి కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించడంతో క్రూయిజ్‌ల కంపెనీ కార్నివాల్ కార్ప్ దాదాపు 11 శాతం పురోగమించింది. ఈ బాటలో యునైటెడ్, డెల్టా, అమెరికన్ ఎయిర్‌లైన్స్ కౌంటర్లు సైతం 5.5 శాతం చొప్పున ఎగశాయి. ఫార్మా ప్లస్ కోవిడ్-19 రోగులపై క్లినికల్ పరీక్షలలో రెమ్‌డెసివిర్ మరింత ప్రభావం చూపుతున్న వార్తలతో గిలియడ్ సైన్సెస్ షేరు 2.2 శాతం లాభపడింది. డిసెంబర్‌కల్లా కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్ సిద్ధంకావచ్చని వెల్లడించిన నేపథ్యంలో బయోఎన్‌టెక్ షేరు దాదాపు 5 శాతం జంప్‌చేసింది. -
అమెజాన్- టెస్లా- నాస్డాక్ రికార్డ్స్
కరోనా వైరస్ ఉధృతి ఆగనప్పటికీ చైనాసహా అమెరికావరకూ ఆర్థిక వ్యవస్థలు తిరిగి పురోగతి బాట పట్టనున్న అంచనాలు సోమవారం యూరోపియన్, యూఎస్ స్టాక్ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. దీంతో యూరోపియన్ మార్కెట్లలో యూకే, ఫ్రాన్స్, జర్మనీ 1.5-2 శాతం మధ్య ఎగశాయి. ఇక యూఎస్ ఇండెక్సులలో డోజోన్స్ 460 పాయింట్లు(1.8 శాతం) ఎగసి 26,287 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 50 పాయింట్లు(1.6 శాతం) పుంజుకుని 3,180 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 226 పాయింట్లు(2.2 శాతం) పురోగమించి 10,434 వద్ద స్థిరపడింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ఎస్అండ్పీ వరుసగా ఐదో రోజు లాభపడింది. ఇంతక్రితం గతేడాది డిసెంబర్ 17న మాత్రమే ఎస్అండ్పీ ఈ ఫీట్ సాధించింది. ఇండిపెండెన్స్ డే(4న) సందర్భంగా శుక్రవారం(3న) యూఎస్ మార్కెట్లు పనిచేయని సంగతి తెలిసిందే. కాగా.. గత వారం డోజోన్స్ నికరంగా 3.3 శాతం పుంజుకోగా.. ఎస్అండ్పీ 4 శాతం ఎగసింది. నాస్డాక్ అయితే 4.6 శాతం జంప్‌చేసింది. ఈ ర్యాలీ సోమవారం సైతం కొనసాగడం మార్కెట్లలో నెలకొన్న బుల్లిష్ ధోరణిని సూచిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. బ్లూచిప్స్ దూకుడు అమ్మకాలు ఊపందుకుంటున్న అంచనాలతో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ షేరు దాదాపు 6 శాతం జంప్‌చేసి 3057 డాలర్లకు చేరింది. వెరసి తొలిసారి 3,000 డాలర్ల మార్క్‌ను తొలిసారి అధిగమించింది. దీంతో అమెజాన్ మార్కెట్ క్యాప్(విలువ) 1.5 లక్షల కోట్ల డాలర్లను తాకింది. జూన్‌లో కార్ల విక్రయాలు పెరగడంతో వరుసగా ఐదో రోజు ఆటో రంగ దిగ్గజం టెస్లా ఇంక్ దూకుడు చూపింది. ఏకంగా 13.5 శాతం దూసుకెళ్లింది. 1372 డాలర్ల సమీపంలో ముగిసింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకావడం విశేషం! ఇతర కౌంటర్లలో బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ 5 శాతం, బోయింగ్ 4 శాతం, ఉబర్ టెక్నాలజీస్ 6 శాతం, వాల్గ్రీన్ బూట్స్ 2.8 శాతం, బెర్క్‌షైర్ హాథవే 2.4 శాతం చొప్పున ఎగశాయి. -
ఉపాధి జోష్- నాస్డాక్ రికార్డ్
గత నెల(జూన్)లో ఉద్యోగ గణాంకాలు అంచనాలను మించడంతో గురువారం యూఎస్ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. డోజోన్స్ 92 పాయింట్లు(0.4 శాతం) పుంజుకుని 25,827 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 14 పాయింట్లు(0.5 శాతం) ఎగసి 3,130 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 53 పాయింట్లు(0.55 శాతం) పురోగమించి 10,208 వద్ద స్థిరపడింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ఎస్అండ్పీ వరుసగా నాలుగో రోజు లాభపడింది. అంతకుముందు యూరోపియన్ మార్కెట్లలో యూకే, ఫ్రాన్స్, జర్మనీ 1.4-2.8 శాతం మధ్య ఎగశాయి. జూన్‌లో 4.8 మిలియన్ ఉద్యోగాల కల్పన జరిగినట్లు కార్మిక శాఖ తాజాగా వెల్లడించింది. విశ్లేషకులు వేసిన అంచనాలకంటే ఇవి 1.8 మిలియన్లు అధికంకావడం గమనార్హం! ఫలితంగా నిరుద్యోగిత 13.3 శాతం నుంచి 11.1 శాతానికి దిగివచ్చింది. దీంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. నేడు యూఎస్ మార్కెట్లకు సెలవు. ప్యాకేజీపై అంచనాలు జులై 4 బ్రేక్ తదుపరి ప్రభుత్వం లేదా ఫెడరల్ రిజర్వ్ మరోసారి ఆర్థిక వ్యవస్థకు బూస్ట్‌నిచ్చే చర్యలు ప్రకటించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కోవిడ్-19 కారణంగా మార్చి- ఏప్రిల్ మధ్య ఏకంగా 22 మిలియన్ల ఉద్యోగాలకు కోత పడటంతో మరోసారి సహాయక ప్యాకేజీలకు వీలున్నట్లు భావిస్తున్నారు. కాగా.. కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా, కనెక్టికట్ తదితర ప్రాంతాలలో రెండో దశ కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా వచ్చే వారం మార్కెట్లు కొంతమేర ఆటుపోట్లు చవిచూడవచ్చని నిపుణులు ఊహిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ అండ బ్లూచిప్ కంపెనీ మైక్రోసాఫ్ట్ కార్ప్ 0.8 శాతం పుంజుకోవడంతో ఎస్‌అండ్‌పీకి బలమొచ్చింది. కాగా.. విశ్లేషకుల అంచనాలను మించి రెండో క్వార్టర్లో 90,650 వాహనాలను విక్రయించడంతో ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ షేరు 8 శాతం జంప్ చేసింది. 1209 డాలర్ల వద్ద ముగిసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ఏప్రిల్-జూన్‌లో కార్ల విక్రయాలు 8 శాతం పెరిగినట్లు కంపెనీ తెలియజేసింది. టెస్లా షేరు ఈ ఏడాది 190 శాతం దూసుకెళ్లడం విశేషం! -
ఫైజర్ వ్యాక్సిన్?- ఫాంగ్ స్టాక్స్ రికార్డ్
కోవిడ్-19 చికిత్సకు వీలుగా రూపొందిస్తున్న వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందడుగు వేసినట్లు ఫార్మా దిగ్గజం ఫైజర్ ఇంక్ వెల్లడించడంతో బుధవారం యూఎస్ మార్కెట్లు లాభపడ్డాయి. అయితే డోజోన్స్ 78 పాయింట్లు(0.3 శాతం) బలహీనపడి 25,735 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 16 పాయింట్లు(0.5 శాతం) ఎగసి 3,116 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 96 పాయింట్లు(1 శాతం) పురోగమించి 10,155 వద్ద స్థిరపడింది. తద్వారా మరోసారి సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. బయోఎన్‌టెక్‌తో సంయుక్తంగా ఫైజర్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ యాంటీబాడీలను న్యూట్రలైజ్ చేస్తున్నట్లు తాజాగా పేర్కొంది. ఆన్లైన్లో విడుదలైన ఈ ఫలితాలను మెడికల్ జర్నల్ సమీక్షించవలసి ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. కాగా.. వ్యాక్సిన్‌కు ఔషధ నియంత్రణ సంస్థలు అనుమతిస్తే ఏడాది చివరికల్లా 10 కోట్ల డోసేజీలను రూపొందించగలమని ఫైజర్ తెలియజేసింది. ఈ బాటలో 2021 చివరికల్లా 120 కోట్ల డోసేజీలను అందించగమని వివరించింది. ఈ నేపథ్యంలో ఫైజర్ ఇంక్ షేరు 3.2 శాతం ఎగసింది. 34 డాలర్ల సమీపంలో ముగిసింది. ఫేస్బుక్ అప్ ఇటీవల ఫ్లోరిడా, మిసిసిపి, టెక్సాస్ తదితర రాష్ట్రాలలో 60వరకూ స్టోర్లను మూసివేసిన ఐఫోన్ల దిగ్గజం యాపిల్ ఇంక్ తాజాగా మరో రెండు డజన్ల స్టోర్లను తాత్కాలికంగా క్లోజ్ చేయనున్నట్లు వెల్లడించింది. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా కాలిఫోర్నియా, అలబామా, జార్జియా, లూసియానా, ఒక్లహామా తదితర రాష్ట్రాలలో వీటిని మూసివేస్తున్నట్లు తెలియజేసింది. ఫలితంగా మూత పడనున్న స్టోర్ల సంఖ్య 77కు చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే యాపిల్ షేరు స్వల్పంగా 0.2 శాతం నీరసించి 364 డాలర్ల వద్ద నిలిచింది. కాగా..ఇతర ఫాంగ్(FAANG) స్టాక్స్‌లో ఫేస్బుక్ 4.6 శాతం, అమెజాన్ 4.4 శాతం, నెట్‌ఫ్లిక్స్ 6.7 శాతం చొప్పున జంప్‌చేయడంతో నాస్‌డాక్‌కు బలమొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. అమెజాన్ 2879 డాలర్లకు, నెట్‌ఫ్లిక్స్ 486 డాలర్లకు చేరడం ద్వారా సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. ఇక ఆటో దిగ్గజం టెస్లా సైతం 3.7 శాతం పెరిగి 1120 డాలర్లకు చేరడం ద్వారా రికార్డ్ గరిష్టం వద్ద స్థిరపడింది. కొద్ది రోజులుగా పలు రాష్ట్రాలలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్గతంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు కొనసాగుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. దీంతో బుధవారం మార్కెట్లు ఆటుపోట్లు ఎదుర్కొన్నట్లు తెలియజేశారు. -
1987-1999 తదుపరి బెస్ట్ క్వార్టర్
లాక్‌డవున్‌లకు మంగళం పాడుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా పుంజుకుంటుందన్న అంచనాలు యూఎస్ మార్కెట్లకు జోష్‌నిస్తున్నాయి. దీంతో వరుసగా రెండో రోజు మార్కెట్లు ఊపందుకున్నాయి. డోజోన్స్ 217 పాయింట్లు(0.85 శాతం) బలపడి 25,813 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 47 పాయింట్లు(1.55 శాతం) ఎగసి 3,100 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 185 పాయింట్లు(1.9 శాతం) పురోగమించి 10,059 వద్ద స్థిరపడింది. అయితే ఫ్లోరిడా, కనెక్టికట్ తదితర ప్రాంతాలలో రెండో దశ కరోనా కేసులు తలెత్తుతున్న వార్తలతో ఇన్వెస్టర్లలో అంతర్గతంగా ఆందోళనలున్నట్లు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికితోడు కోవిడ్-19 కారణంగా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నట్లు మంగళవారం ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ ముందు పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాగా.. అటు వైట్‌హౌస్, ఇటు ఫెడరల్ రిజర్వ్ భారీ సహాయక ప్యాకేజీలను అమలు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్నట్లు తెలియజేశారు. 33 ఏళ్ల తరువాత ఈ ఏడాది(2020) రెండోత్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో ఎస్అండ్పీ.. 20 శాతం ర్యాలీ చేసింది. తద్వారా 1998 జూన్ క్వార్టర్ తరువాత భారీగా పురోగమించింది. అయితే 2008 తొలి క్వార్టర్ తదుపరి ఈ జనవరి-మార్చిలో 20 శాతం పతనంకావడం గమనార్హం! ఇక క్యూ2(ఏప్రిల్-జూన్)లో డోజోన్స్ సైతం నికరంగా 18 శాతం ఎగసింది. తద్వారా 1987 తొలి క్వార్టర్ తదుపరి అత్యధిక లాభాలు ఆర్జించింది. 1987లో డోజోన్స్ 21 శాతం పుంజుకుంది. ఈ బాటలో రెండో క్వార్టర్లో నాస్డాక్ 31 శాతం జంప్‌చేసింది. వెరసి 1999 నాలుగో త్రైమాసికం తదుపరి మళ్లీ జోరందుకుంది. 1999లో నాస్డాక్ ఏకంగా 48 శాతం దూసుకెళ్లింది. బోయింగ్ వెనకడుగు 737 మ్యాక్స్ విమానాలకు గ్రీన్‌సిగ్నల్ లభించడంతో సోమవారం 15 శాతం దూసుకెళ్లిన బోయింగ్ ఇంక్ తాజాగా 6 శాతం పతనైంది. నార్వేజియన్ ఎయిర్ 97 విమానాల ఆర్డర్‌ను రద్దు చేసుకోవడం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై నష్టపరిహారం కోరనున్నట్లు బోయింగ్ పేర్కొంది. ఇతర కౌంటర్లలో మైక్రాన్ టెక్నాలజీ 5 శాతం జంప్‌చేసింది. పవర్ నోట్‌బుక్స్, డేటా సెంటర్ల నుంచి చిప్‌లకు డిమాండ్ పెరగడంతో మైక్రాన్‌కు డిమాండ్ పెరిగింది. ఫుడ్ డెలివరీ యాప్ పోస్ట్మేట్స్ను కొనుగోలు చేయనున్న వార్తలతో ఉబర్ షేరు 5 శాతం పెరిగింది. -
యూఎస్ మార్కెట్లకు బ్యాంకింగ్ షాక్
స్ట్రెస్ టెస్ట్ నేపథ్యంలో నాలుగో త్రైమాసికం ముగిసేటంతవరకూ అధిక డివిడెండ్లు, షేర్ల బైబ్యాక్‌లను చేపట్టవద్దంటూ బ్యాంకులకు తాజాగా ఫెడరల్ రిజర్వ్ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర బ్యాంకు ఆదేశాల కారణంగా వారాంతాన బ్యాంకింగ్ కౌంటర్లు డీలా పడ్డాయి. ప్రధానంగా గోల్డ్‌మన్ శాక్స్ 8.6 శాతం, జేపీ మోర్గాన్ 5.5 శాతం, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ 4.5 శాతం చొప్పున వెనకడుగు వేశాయి. దీనికితోడు తిరిగి కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం అమెరికా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. ఫ్లోరిడా, కరోలినా, ఆరిజోనా తదితర రాష్ట్రాలలో కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో మరోసారి లాక్‌డవున్ ఆవశ్యకత ఏర్పడవచ్చన్న ఆందోళనలు ఇన్వెస్టర్లలో తలెత్తాయి. ఫలితంగా అమ్మకాలు ఊపందుకున్నాయి. డోజోన్స్ 730 పాయింట్లు(2.8 శాతం) పడిపోయి 25,016 వద్ద నిలవగా..ఎస్అండ్పీ 75 పాయింట్ల(2.4 శాతం) వెనకడుగుతో 3,009 వద్ద స్థిరపడింది. నాస్డాక్ సైతం 260 పాయింట్లు(2.6 శాతం) పతనమై 9,757 వద్ద ముగిసింది. యూరోపియన్ మార్కెట్లలో జర్మనీ 0.7 శాతం నష్టపోగా.. ఫ్రాన్స్ 0.2 శాతం నీరసించింది, యూకే మాత్రం 0.2 శాతం బలపడింది. ఇక ఆసియాలో జపాన్, కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్, ఇండొనేసియా 1-0.2 శాతం మధ్య పుంజుకోగా..హాంకాంగ్ 1 శాతం క్షీణించింది. చైనా, తైవాన్ మార్కెట్లకు సెలవు. 3.3 శాతం డీలా గత వారం డోజోన్స్ నికరంగా 3.3 శాతం పడిపోగా.. ఎస్అండ్పీ దాదాపు 3 శాతం తిరోగమించింది. నాస్డాక్ సైతం 2 శాతం క్షీణించింది. ఎఫ్ఎంసీజీ దిగ్గజం యూనిలీవర్, టెలికం బ్లూచిప్ వెరిజాన్.. ప్రకటనలను నిలిపివేసేందుకు నిర్ణయించడంతో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ 8.5 శాతం పతనమైంది. హేట్ స్పీచ్‌ల కట్టడికి చర్యలు తీసుకోకపోవడంపై ఫేస్‌బుక్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ఈ రెండు కంపెనీలూ పేర్కొన్నాయి. ఇతర కౌంటర్లలో ట్విటర్‌తోపాటు స్పోర్ట్స్‌వేర్ దిగ్గజం నైక్, కీకార్ప్ కౌంటర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో 9-5.5 శాతం మధ్య ఈ కౌంటర్లు కుప్పకూలాయి. కాగా.. రిటైలింగ్ కంపెనీ గ్యాప్ ఇంక్ 19 శాతం దూసుకెళ్లగా.. ఐటీ దిగ్గజం సిస్కో సిస్టమ్స్ 2.4 శాతం ఎగసింది. నేలచూపుల్లో అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన దేశీ స్టాక్స్ (ఏడీఆర్)లో వారాంతాన అత్యధిక శాతం నష్టాలతో ముగిశాయి. టాటా మోటార్స్(టీటీఎం) 5 శాతం పతనమై 6.6 డాలర్ల వద్ద నిలవగా.. ఐసీఐసీఐ బ్యాంక్(ఐబీఎన్) 3.5 శాతం క్షీణించి 9.05 డాలర్ల వద్ద స్థిరపడింది, వేదాంతా(వీఈడీఎల్) 3.8 శాతం నష్టంతో 5.77 డాలర్లను తాకగా.. డాక్టర్ రెడ్డీస్ 2 శాతం బలహీనపడి 52.19 డాలర్లకు చేరింది. ఇతర కౌంటర్లలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్(హెచ్డీబీ) 1.23 శాతం నీరసించి 45.09 డాలర్ల వద్ద స్థిరపడగా.. ఇన్ఫోసిస్ 2.6 శాతం జంప్‌చేసి 9.53 డాలర్ల వద్ద ముగిసింది. ఇక విప్రో లిమిటెడ్ 0.3 శాతం బలపడి 3.27 డాలర్ల వద్ద నిలిచింది. -
యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ రికార్డ్స్
ప్రధానంగా టెక్ దిగ్గజాలు అండగా నిలుస్తుండటంతో నాస్డాక్ సరికొత్త రికార్డులను సాధిస్తోంది. మంగళవారం ఫాంగ్(FAANG) స్టాక్స్ బలపడటంతో 75 పాయింట్లు(0.75 శాతం) పుంజుకుని 10,131 వద్ద ముగిసింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. గత 18 ట్రేడింగ్ సెషన్లలో 16సార్లు లాభాలతో నిలిచింది. ఇంతక్రితం 1999లో మాత్రమే ఈ ఫీట్ సాధించింది. ఈ ఏడాది ఇప్పటివరకూ నాస్డాక్ 21వసారి రికార్డ్ గరిష్టాన్ని సాధించడం విశేషం! ఇక డోజోన్స్ 130 పాయింట్లు(0.5 శాతం) ఎగసి 26,156 వద్ద స్థిరపడగా.. ఎస్అండ్పీ 13 పాయింట్లు(0.45 శాతం) బలపడి 3,131 వద్ద ముగిసింది. ఎస్అండ్పీ ఏప్రిల్ నుంచి ఇప్పటివరకూ 20 శాతం ర్యాలీ చేసింది. మే నెలలో గృహ విక్రయాలు దాదాపు 17 శాతం ఎగసి 6.76 లక్షలను తాకాయి. విశ్లేషకులు 6.4 లక్షల అమ్మకాలను అంచనా వేశారు. దీంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించినట్లు నిపుణులు పేర్కొన్నారు. రికార్డుల బాట.. ఐఫోన్ల దిగ్గజం యాపిల్ 2.15 శాతం లాభంతో 366 డాలర్లను అధిగమించగా.. అమెజాన్ 2 శాతం పుంజుకుని 2764 డాలర్లను దాటింది. ఇక మైక్రోసాఫ్ట్ కార్ప్ 1.35 శాతం వృద్ధితో 202 డాలర్లకు చేరింది. నెట్‌ఫ్లిక్స్ తొలుత 474 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకినప్పటికీ తదుపరి 466 డాలర్లకు నీరసించింది. తద్వారా యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్ సరికొత్త గరిష్టాలను అందుకోగా.. ఫేస్బుక్, అల్ఫాబెట్ సైతం 0.7 శాతం చొప్పున బలపడటం గమనార్హం. బేయర్ అప్ కోవిడ్-19 చికిత్సకు వినియోగించగల ఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ తయారీలో సనోఫీ పాస్టెర్తో భాగస్వామ్యం కదుర్చుకున్నట్లు వెల్లడించడంతో థెరప్యూటిక్స్ కంపెనీ ట్రాన్స్‌లేట్ బయో కౌంటర్ ఏకంగా 47 శాతం దూసుకెళ్లింది. మోన్శాంటో కొనుగోలు తదుపరి వీడ్‌కిల్లర్ ప్రొడక్ట్‌పై తలెత్తిన సమస్యకు 8-10 బిలియన్ డాలర్లతో సెటిల్మెంట్ కుదుర్చుకోనున్న వార్తలతో బేయర్ ఏజీ 5 శాతం జంప్‌చేసింది. కాగా.. ఇతర కౌంటర్లలో బయోన్టెక్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, వన్‌లైఫ్, క్లియర్ వే తదితరాలు 8-5 శాతం మధ్య పతనమయ్యాయి. -
యాపిల్ స్టోర్స్ బంద్- డోజోన్స్ డౌన్
మరోసారి కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం అమెరికా స్టాక్ మార్కెట్లు ఊగిసలాటకు లోనయ్యాయి. హెచ్చుతగ్గుల మధ్య అటూఇటుగా ముగిశాయి. డోజోన్స్ 209 పాయింట్లు(0.8 శాతం) క్షీణించి 25,871కు చేరగా..ఎస్అండ్పీ 18 పాయింట్లు(0.6 శాతం) వెనకడుగుతో 3,098 వద్ద స్థిరపడింది. అయితే నాస్డాక్ 3 పాయింట్ల నామమాత్ర లాభంతో 9,9436 వద్ద స్థిరపడింది. యూరోపియన్ మార్కెట్లలో జర్మనీ, ఫ్రాన్స్, యూకే 0.4-1 శాతం మధ్య బలపడ్డాయి. ఇక ఆసియాలో చైనా, హాంకాంగ్, జపాన్, కొరియా, ఇండొనేసియా 1-0.4 శాతం మధ్య పుంజుకోగా.. సింగపూర్ 1.2 శాతం, థాయ్‌లాండ్ 0.2 శాతం మధ్య బలహీనపడ్డాయి. తైవాన్ యథాతథంగా ముగిసింది. నాస్డాక్ జోరు గత వారం డోజోన్స్ నికరంగా 1 శాతం లాభపడగా.. ఎస్అండ్పీ దాదాపు 2 శాతం ఎగసింది. టెక్ దిగ్గజాల అండతో నాస్డాక్ మరింత అధికంగా 3.7 శాతం జంప్‌చేసింది. కాగా.. ఫిబ్రవరిలో సాధించిన చరిత్రాత్మక గరిష్టాలకు డోజోన్స్ 8.5 శాతం, ఎస్అండ్పీ 12.5 శాతం దూరంలో నిలవగా.. నాస్డాక్ 1.3 శాతం సమీపంలో ముగిసింది. యాపిల్ స్టోర్లు బంద్ ఇటీవల ఫ్లోరిడా, ఆరిజోనా, ఉత్తర, దక్షిణ కరోలినాలలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా కొన్ని ప్రాంతాలలో స్టోర్లను మూసివేస్తున్నట్లు ఐఫోన్ల దిగ్గజం యాపిల్ ఇంక్ పేర్కొంది. దీంతో యాపిల్ షేరు స్వల్పంగా 0.5 శాతం నీరసించింది. కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్న ఆందోళనలతో థియేటర్ల నిర్వాహక సంస్థ ఏఎంసీ ఎంటర్టైన్మెంట్ హోల్డింగ్స్ 2 శాతం క్షీణించింది. ఈ ఆందోళనలతో క్రూయిజర్ కంపెనీలు నార్వేజియన్, కార్నివాల్ 5 శాతం చొప్పున పతనంకాగా.. రాయల్ కరిబ్బియన్స్ 7 శాతం జారింది. ఈ బాటలో రిటైల్ దిగ్గజాలు, వియానయాన కంపెనీలు నార్డ్‌స్ట్రామ్, కోల్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, డెల్టా 6-4 శాతం మధ్య తిరోగమించాయి. బ్యాంక్స్ ప్లస్ అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన దేశీ స్టాక్స్ (ఏడీఆర్)లో వారాంతాన అత్యధిక శాతం లాభాలతో ముగిశాయి. టాటా మోటార్స్(టీటీఎం)3.5 శాతం జంప్‌చేసి 6.6 డాలర్ల వద్ద నిలవగా.. ఐసీఐసీఐ బ్యాంక్(ఐబీఎన్) 2.5 శాతం ఎగసి 9.47 డాలర్ల వద్ద స్థిరపడింది, హెచ్డీఎఫ్సీ బ్యాంక్(హెచ్డీబీ) 2.15 శాతం పుంజుకుని 44.69 డాలర్లను తాకగా.. వేదాంతా(వీఈడీఎల్) 3.7 శాతం పతనమై 5.44 డాలర్ల వద్ద ముగిసింది. ఇతర కౌంటర్లలో విప్రో లిమిటెడ్ 1.2 శాతం నీరసించి 3.3 డాలర్లకు చేరగా.. ఇన్ఫోసిస్ 0.7 శాతం వెనకడుగుతో 9.16 డాలర్ల వద్ద స్థిరపడింది. ఈ బాటలో డాక్టర్ రెడ్డీస్ 0.2 శాతం బలహీనపడి 53.18 డాలర్ల వద్ద నిలిచింది. -
కుప్పకూలిన యూఎస్ మార్కెట్లు
పాలసీ సమీక్షలో భాగంగా అమెరికా కేంద్ర బ్యాంకు.. ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది దేశ జీడీపీ 6.5 శాతం క్షీణించవచ్చని అంచనా వేసింది. నిరుద్యోగ రేటు 9.3 శాతానికి పెరిగే వీలున్నట్లు పేర్కొంది. దీంతో ఒక్కసారిగా సెంటిమెంటుకు షాక్ తగిలింది. వెరసి గురువారం యూఎస్ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. డోజోన్స్ 1862 పాయింట్లు(7 శాతం) కుప్పకూలి 25,128 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 188 పాయింట్లు(6 శాతం) పడిపోయి 3,002 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 528 పాయింట్లు(5.3 శాతం) క్షీణించి 9,493 వద్ద స్థిరపడింది. తద్వారా మార్కెట్లు ఏప్రిల్ 16 తదుపరి ఒకే రోజులో అత్యధిక నష్టాలు చవిచూశాయి. కాగా.. యూరోపియన్ మార్కెట్లు సైతం గురువారం 4.5 శాతం స్థాయిలో పతనంకావడం గమనార్హం! మరోసారి లాక్‌డవున్ ఇప్పటికే 20 లక్షల మందికిపైగా సోకిన కరోనా వైరస్ మరోసారి విజృంభించవచ్చన్న అంచనాలు ఇటీవల తలెత్తుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా మరోసారి లాక్‌డవున్ విధించవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చని కొంతమంది ఆర్థికవేత్తలు భావిస్తున్నట్లు తెలియజేశారు. దీనికితోడు అమెరికా జీడీపీ తీవ్ర మాంద్య పరిస్థితులను ఎదుర్కోనున్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమైనట్లు వివరించారు. కోవిడ్-19 కారణంగా సెప్టెంబర్‌కల్లా మరణాల సంఖ్య 2 లక్షలను దాటవచ్చన్న అంచనాలు సైతం సెంటిమెంటును దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. బోయింగ్ పతనం వైమానిక రంగ దిగ్గజం బోయింగ్ ఇంక్ షేరు దాదాపు 17 శాతం కుప్పకూలగా.. క్రూయిజర్, ఎయిర్‌లైన్ కంపెనీల కౌంటర్లలో గురువారం మళ్లీ అమ్మకాలు ఊపందుకున్నాయి. రాయల్ కరిబ్బియన్, ఎస్పీ కామెయిర్ 14 శాతం చొప్పున పతనంకాగా.. నార్వేజియన్ క్రూయిజ్ లైన్ 16.5 శాతం పడిపోయింది. ఇతర బ్లూచిప్స్‌లో డోఇంక్, ఐబీఎం, గోల్డ్‌మన్ శాక్స్, కేటర్పిల్లర్, ఎక్సాన్ మొబిల్, జేపీ మోర్గాన్, సిస్కో, ఫైజర్, వాల్ట్‌డిస్నీ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, నైక్, ఇంటెల్, కోక కోలా, మెర్క్, మైక్రోసాఫ్ట్, యాపిల్, జాన్సన్ అండ్ జాన్సన్ తదితరాలు 10-5 శాతం మధ్య పతనమయ్యాయంటే అమ్మకాల తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. -
యూఎస్ మార్కెట్ల హైజంప్- ఉపాధి పుష్
వారాంతాన యూఎస్ మార్కెట్లు హైజంప్ చేశాయి. కోవిడ్-19 విసురుతున్న సవాళ్లను అధిగమించి మే నెలలో ఏకంగా 2.5 మిలియన్ ఉద్యోగాల కల్పన జరిగినట్లు వెల్లడికావడంతో ఒక్కసారిగా ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. వెరసి శుక్రవారం డోజోన్స్ 829 పాయింట్లు(3.2 శాతం) దూసుకెళ్లి 27,111 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 82 పాయింట్లు(2.6 శాతం) జంప్‌చేసి 3,194 వద్ద స్థిరపడింది. నాస్డాక్ 198 పాయింట్లు(2 శాతం) క్షీణించి 9,814 వద్ద ముగిసింది. కోవిడ్-19 సమస్యలకు ఎదురొడ్డి ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోగలదన్న ఆశలతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇంట్రాడేలో నాస్డాక్ 9,846కు ఎగసింది. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. ఫిబ్రవరి 19న క్లోజింగ్ రికార్డ్ 9,817కు సమీపంలో ముగిసింది. ఈ బాటలో ఎస్అండ్పీ ఇండెక్స్ రికార్డ్ గరిష్టానికి 6 శాతం చేరువలో నిలిచింది. మే నెలలో వ్యవసాయేతర రంగంలో 2.5 మిలియన్ మందికి ఉద్యోగాలు లభించినట్లు కార్మిక శాఖ పేర్కొంది. నిజానికి 8 మిలియన్లమంది ఉపాధి కోల్పోతారని అంచనా వేశారు. దీంతో నిరుద్యోగిత 13.3 శాతానికి పరిమితమైంది. తొలుత 19.5 శాతంగా అంచనాలు వెలువడ్డాయి. గత వారం జోరు శుక్రవారంతో ముగిసిన గత వారం నాస్డాక్ 3.4 శాతం జంప్‌చేయగా.. ఎస్అండ్పీ 4.7 శాతం, డోజోన్స్ 6.8 శాతం చొప్పున దూసుకెళ్లాయి. కాగా.. అమెరికన్ ఎయిర్‌లైన్స్ షేరు 77 శాతం, బోయింగ్ ఇంక్ 41 శాతం చొప్పున ర్యాలీ చేశాయి. వారాంతాన ఒక్క రోజే బోయింగ్ ఇంక్ 11 శాతం జంప్‌చేసింది. ఇక ఐఫోన్ల దిగ్గజం యాపిల్ ఇంక్ షేరు 3 శాతం ఎగసి 332 డాలర్లకు చేరింది. ఇది సరికొత్త రికార్డ్‌కాగా..మార్చి నుంచీ ఈ షేరు 50 శాతం పురోగమించడం విశేషం! ఈ బాటలో కోక కోలా, చెవ్రాన్, ఎక్సాన్ మొబిల్, వాల్ట్ డిస్నీ, కేటర్పిల్లర్ సైతం మార్కెట్లకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫాంగ్ అండ నాస్డాక్ ర్యాలీకి ప్రధానంగా ఫాంగ్(FAANG) స్టాక్స్.. యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, అల్ఫాబెట్, ఫేస్బుక్ సహకరించాయి. ప్రస్తుతం వీటి మొత్తం మార్కెట్ కేపిటలైజేషన్ 5.7 లక్షల కోట్ల డాలర్లను అధిగమించడం విశేషం! ఈ బాటలో నెట్‌ఫ్లిక్స్ మార్కెట్ క్యాప్ 185 బిలియన్ డాలర్లను తాకింది. ఈ షేరు 2020లో ఇప్పటివరకూ 30 శాతం ర్యాలీ చేసింది. టాటా మోటార్స్ దూకుడు వారాంతాన అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన దేశీ స్టాక్స్ (ఏడీఆర్)జోరు చూపాయి. టాటా మోటార్స్(టీటీఎం) 11.5 శాతం దూసుకెళ్లి 7.45 డాలర్లను తాకగా.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్(హెచ్డీబీ) 5 శాతం జంప్‌చేసి 47.61 డాలర్లకు చేరింది. ఈ బాటలో ఐసీఐసీఐ బ్యాంక్(ఐబీఎన్) 5 శాతం ఎగసి 9.77 డాలర్ల వద్ద నిలవగా.. వేదాంతా(వీఈడీఎల్) 1.8 శాతం బలపడి 5.65 డాలర్ల వద్ద ముగిసింది. ఇతర కౌంటర్లలో ఇన్ఫోసిస్ 1.2 శాతం పుంజుకుని 9.38 డాలర్ల వద్ద, విప్రో 0.6 శాతం లాభంతో 3.33 డాలర్ల వద్ద, డాక్టర్ రెడ్డీస్(ఆర్డీవై) 0.15 శాతం బలపడి 53.04 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. -
కోవిడ్-19లోనూ కొత్త శిఖరానికి నాస్డాక్
లక్షల సంఖ్యలో ప్రజలకు కోవిడ్-19 ఆరోగ్య సమస్యలు సృష్టిస్తున్నప్పటికీ అమెరికా స్టాక్ ఇండెక్స్ నాస్డాక్ గురువారం సరికొత్త రికార్డును అందుకుంది. తొలుత 9,716ను అధిగమించడం ద్వారా ఈ ఫీట్‌ను సాధించింది. అయితే నిరుద్యోగ గణాంకాలు, వచ్చే వారం ఫెడరల్ రిజర్వ్ సమావేశాల నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో చివర్లో వెనకడుగు వేసింది. వెరసి 11 పాయింట్లు(0.7 శాతం) క్షీణించి 9,616 వద్ద ముగిసింది. ఇక డోజోన్స్ 11 పాయింట్లు(0.1 శాతం) బలపడి 26,282 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 42 పాయింట్లు(0.3 శాతం) నీరసించి 3,112 వద్ద స్థిరపడింది. గత వారం అంచనాలకంటే అధికంగా 1.85 మిలియన్లమంది నిరుద్యోగ భృతికి క్లెయిమ్ చేసుకున్నట్లు వెలువడిన వార్తలు కొంతమేర సెంటిమెంటును బలహీనపరచినట్లు నిపుణులు పేర్కొన్నారు. బౌన్స్‌బ్యాక్ ఇలా కరోనా వైరస్ భయాలతో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 23కల్లా 30 శాతం పతనమైన నాస్డాక్ ఇండెక్స్ ఆపై వేగంగా రికవర్అయ్యింది. ఫలితంగా కనిష్టాల నుంచి 43 శాతం ర్యాలీ చేసింది. వెరసి గురువారం ఇంట్రాడేలో చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ఇందుకు అమెజాన్, పెప్సీకో, కాస్ట్కో, పేపాల్ తదితర కౌంటర్లు సహకరించినట్లు నిపుణులు పేర్కొన్నారు. మార్చి కనిష్టం నుంచి అమెజాన్ 30 శాతం, పెప్సీకో 24 శాతం చొప్పున జంప్‌చేయగా.. కాస్ట్కో 8 శాతం బలపడింది. పేపాల్ 81 శాతం ర్యాలీ చేసింది. కాగా.. రికార్డ్ గరిష్టాలకు ఎస్అండ్పీ, డోజోన్స్ 8-11 శాతం దూరంలో నిలవడం గమనార్హం! ఈసీబీ దన్ను ఆర్థికవేత్తలు అంచనా వేసినట్లుగానే యూరోపియన్ కేంద్ర బ్యాంకు(ఈసీబీ) సహాయక ప్యాకేజీను రెట్టింపునకు పెంచింది. 1.35 ట్రిలియన్ యూరోలతో బాండ్ల కొనుగోలు ద్వారా వ్యవస్థలోకి భారీగా నిధులను పంప్చేసేందుకు నిర్ణయించింది. తొలుత ఇందుకు 600 బిలియన్ యూరోలను మాత్రమే కేటాయించింది. 2021 జూన్‌వరకూ కొత్త ప్యాకేజీ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 96 స్థాయికి బలహీనపడగా.. యూరో 1.135కు బలపడింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ జూమ్ జులై నుంచి విమాన సర్వీసులను 55 శాతం పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించడంతో అమెరికన్ ఎయిర్‌లైన్స్ షేరు ఏకంగా 41 శాతం దూసుకెళ్లింది. ఇతర కౌంటర్లలో ఈబే ఇంక్ 6.3 శాతం జంప్‌చేయగా.. చార్లెస్ స్క్వాబ్ 5.5 శాతం, టీడీ అమెరిట్రేడ్ 9 శాతం చొప్పున ఎగశాయి. టీడీ కొనుగోలుకి చార్లెస్‌కు గ్రీన్‌సిగ్నల్ లభించడం ప్రభావం చూపింది. కాగా.. గురువారం ఫేస్బుక్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, అల్ఫాబెట్, యాపిల్ 1.6-0.6 శాతం మధ్య బలహీనపడటంతో మార్కెట్లు వెనకడుగు వేసినట్లు నిపుణులు తెలియజేశారు. ఇతర మార్కెట్లు గరువారం యూరోపియన్ మార్కెట్లలో యూకే, జర్మనీ, ఫ్రాన్స్ 0.6-0.2 శాతం మధ్య నీరసించగా.. ప్రస్తుతం ఆసియాలో సింగపూర్, తైవాన్, కొరియా 0.6 శాతం చొప్పున ఎగశాయి. ఇండొనేసియా 0.5 శాతం నష్టపోయింది. థాయ్‌లాండ్, హాంకాంగ్ నామమాత్ర లాభాలతో, చైనా యథాతథంగా కదులుతున్నాయి. -
కొత్త రికార్డుకు చేరువలో నాస్డాక్
కోవిడ్-19 కట్టడికి విధించిన లాక్‌డవున్‌ను పలు దేశాలు ఎత్తివేస్తున్న నేపథ్యంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ఇందుకు కేంద్ర బ్యాంకుల భారీ సహాయక ప్యాకేజీలు ఆర్థిక రికవరీకి దారిచూపనున్న అంచనాలు దోహదపడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో బుధవారం యూరోపియన్ మార్కెట్లు జర్మనీ, ఫ్రాన్స్, యూకే 3-4 శాతం మధ్య జంప్‌చేయగా.. యూఎస్ ఇండెక్సులు సైతం 2-0.8 శాతం మధ్య ఎగశాయి. ప్రధానంగా నాస్డాక్ సరికొత్త రికార్డ్ గరిష్టానికి 1.5 శాతం చేరువలో నిలవడం విశేషం! బుధవారం డోజోన్స్ 527 పాయింట్లు(2 శాతం) జంప్‌చేసి 26,270 వద్ద ముగిసింది. ఎస్అండ్పీ 42 పాయింట్లు(1.4 శాతం) లాభపడి 3,123 వద్ద నిలవగా.. నాస్డాక్ 75 పాయింట్లు(0.8 శాతం) పుంజుకుని 9,683 వద్ద స్థిరపడింది. వెరసి ఫిబ్రవరిలో నమోదైన రికార్డ్ గరిష్టాలకు నాస్డాక్ 1.4 శాతం, ఎస్అండ్పీ 7.8 శాతం, డోజోన్స్ 11.1 శాతం చేరువలో నిలిచాయి. ఆందోళనలున్నా కరోనా వైరస్ విజృంభణ తదుపరి చైనా, ఇటలీ ఆర్థిక వ్యవస్థలు తిరిగి ప్రారంభమైన విధంగా యూఎస్ సైతం పుంజుకునే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీంతో ఇటీవల జరిగిన నల్లజాతీయుడి హత్యపై జాతి వివక్షకు వ్యతిరేకంగా అల్లర్లు చెలరేగుతున్నప్పటికీ బుధవారం ఇన్వెస్టర్లు ఈక్విటీలలో కొనుగోళ్లకు ఆసక్తి చూపినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. బోయింగ్ జూమ్ వైమానిక దిగ్గజం బోయింగ్ ఇంక్ షేరు 13 శాతం దూసుకెళ్లడంతో డోజోన్స్‌కు బలమొచ్చింది. బిలియనీర్ ఇన్వెస్టర్ డేనియల్ లోబ్స్కు చెందిన థర్డ్ పాయింట్ సంస్థ వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో బ్లూచిప్ కంపెనీ బోయింగ్‌కు భారీ డిమాండ్ ఏర్పడినట్లు నిపుణులు తెలియజేశారు. ఇతర కౌంటర్లలో లిఫ్ట్ ఇంక్ 9 శాతం జంప్‌చేసింది. మే నెలలో రైడ్లు 26 శాతం పెరగడం ఈ కౌంటర్‌కు జోష్‌నివ్వగా.. టెలికాన్ఫరెన్సింగ్ సంస్థ జూమ్ కమ్యూనికేషన్స్ షేరు 8 శాతం ఎగసింది. ఇక అమ్మకాలు, నికర లాభాలపై ఆశావహ అంచనాలు ప్రకటించడంతో మైక్రోచిప్ టెక్నాలజీ షేరు 12.3 శాతం పురోగమించింది. ఈ బాటలో కాస్మెటిక్స్ కంపెనీ కోటీ ఇంక్ 13.4 శాతం లాభపడగా.. క్యాంప్‌బెల్ సూప్ 6 శాతం పతనమైంది. -
నాస్డాక్ అప్- విప్రో ఏడీఆర్ జూమ్
కరోనా వైరస్‌కు కారణమైన చైనాను విమర్శిస్తున్న ప్రెసిడెంట్ ట్రంప్ తాజా ప్రెస్మీట్లో వాయిస్ తగ్గించడంతో ఇన్వెస్టర్లు ఊపిరి పీల్చుకున్నారు. వెరసి వారాంతాన అమెరికా స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య అటూఇటుగా ముగిశాయి. ఇంట్రాడేలో 25,032 వద్ద కనిష్టాన్ని తాకిన డోజోన్స్ చివరికి 18 పాయింట్లు(0.1 శాతం) నీరసించి 25,383 వద్ద నిలిచింది. ఇక ఎస్అండ్పీ15 పాయింట్లు(0.5 శాతం) బలపడి 3,044 వద్ద స్థిరపడింది. అయితే నాస్డాక్ 121 పాయింట్లు(1.3 శాతం) జంప్‌చేసి 9,490 వద్ద ముగిసింది. కోవిడ్-19 కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డవున్‌ను దశలవారీగా ఎత్తివేస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోనుందన్న అంచనాలు ఇటీవల మార్కెట్లకు జోష్‌నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ 3 శాతం, జేపీ మోర్గాన్ 2.5 శాతం చొప్పున క్షీణించడంతో శుక్రవారం డోజోన్స్ బలహీనపడగా.. సెమీకండక్టర్ తయారీ కంపెనీలు మార్వెల్ టెక్నాలజీస్ 9 శాతం, ఎన్విడియా 4.6 శాతం చొప్పున జంప్‌చేయడంతో నాస్డాక్ జోరందుకుంది. డోజోన్స్ భళా గత వారం డోజోన్స్ 3.8 శాతం లాభపడగా.. ఎస్అండ్పీ సైతం 3 శాతం ఎగసింది. నాస్డాక్ దాదాపు 2 శాతం పుంజుకుంది. ఈ నెలలో ఎస్అండ్పీ, డోజోన్స్ 4.5 శాతం స్థాయిలో జంప్‌చేయగా.. నాస్డాక్ మరింత అధికంగా 6.7 శాతం ఎగసింది. కాగా.. ఏప్రిల్‌లో వ్యక్తిగత వ్యయాలు 13.6 శాతం క్షీణించగా.. పొదుపు రేటు 33 శాతం ఎగసినట్లు గణాంకాలు వెల్లడించాయి. ట్రంప్ ఇలా వైట్‌హౌస్‌కు చెందిన రోజ్‌గార్డెన్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)తో తెగతెంపులు చేసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈ సంస్థ పూర్తిగా చైనా నియంత్రణలో పనిచేస్తున్నదని విమర్శించారు. యూఎస్‌లో లిస్టయిన చైనా కంపెనీలు ఖాతాలను విభిన్నంగా నిర్వహించడంపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. హాంకాంగ్‌కు ఇస్తున్న ప్రత్యేక వాణిజ్య హోదాను రద్దు చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే చైనాతో వాణిజ్య వివాదాల జోలికి వెళ్లకపోవడం గమనార్హం. వేదాంతా అప్ అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన దేశీ స్టాక్స్ (ఏడీఆర్)లో వారాంతాన అత్యధిక శాతం లాభాలతో ముగిశాయి. అయితే టాటా మోటార్స్(టీటీఎం) 0.7 శాతం నష్టంతో 5.71 డాలర్ల వద్ద నిలిచింది. కొత్త సీఈవో ఎంపికతో విప్రో లిమిటెడ్ 8.2 శాతం దూసుకెళ్లి 3.31 డాలర్లను తాకగా.. డాక్టర్ రెడ్డీస్ 4 శాతం జంప్‌చేసి 53.44 డాలర్లకు చేరింది. ఈ బాటలో ఐసీఐసీఐ బ్యాంక్(ఐబీఎన్) 2.6 శాతం ఎగసి 8.7 డాలర్ల వద్ద, వేదాంతా(వీఈడీఎల్) 1.9 శాతం బలపడి 4.88 డాలర్ల వద్ద ముగిశాయి. ఇతర కౌంటర్లలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్(హెచ్డీబీ) 1.8 శాతం ఎగసి 41.83 డాలర్ల వద్ద నిలవగా.. ఇన్ఫోసిస్ 0.4 శాతం పుంజుకుని 9.10 డాలర్ల వద్ద స్థిరపడింది. -
సుందర్ పిచాయ్, ఫ్రైడ్మాన్కు అరుదైన గౌరవం
ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ సీఈవో, భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ (46)కు అరుదైన గౌరవం దక్కింది. టెక్నాలజీలో రంగంలో చేసిన విశిష్ట సేవలకు గాను ప్రతిష్టాత్మక యూఎస్ ఇండియా బిజినెస్ అడ్వోకసీ గ్రూప్ (యూఎస్ఐబీసీ) ఇచ్చే గ్లోబల్ లీడర్షిప్ 2019 అవార్డు ఆయన్నువరించనుంది. సుందర్ పిచాయ్‌తోపాటు నాస్డాక్ ప్రెసిడెంట్ అడెనా ఫ్రైడ్మాన్ (50) కూడా ఈ అడార్డుకు ఎంపికయ్యారు. త్వరలో జరగనున్న 'ఇండియాస్ ఐడియాస్ సమ్మిట్'లో గ్లోబల్ లీడర్ షిప్ అవార్డు 2019 గ్లోబల్ లీడర్షిప్ అవార్డు 2019ని సుందర్ పిచాయ్, ఫ్రైడ్మాన్కు అందించనున్నారు. సాంకేతిక రంగ అభివృద్ధికి గూగుల్, నాస్డాక్ కంపెనీలు చేస్తున్న సేవలకు గాను వీరిని ఎంపిక చేశారు. ఈ అవార్డును వాషింగ్టన్కు చెందిన యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సెల్ అందిస్తోంది. 2007 నుంచి ఈ అవార్డును ఇస్తోంది. -
అమెరికా మార్కెట్ల భారీ పతనం
అంతర్జాతీయ మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. రీటైల్, టెక్ షేర్లలో భారీ అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఉదయం ఆసియా, మధ్యాహ్నం యూరో సహా అన్ని తరహా షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. డౌ జౌన్స్ 30 సూచీ ఏకంగా400 పాయింట్లకు పైగా క్షీణించింది. ఎస్ అండ్ పీ 500 కూడా ఒక శాతంపైగా తగ్గింది. ఇక నాస్డాక్ అమ్మకాల జోరు అధికంగా ఉంది. 2.29 శాతం నష్టంతో ఏడు నెలల కనిష్టాన్ని తాకింది. 2018 నాటి లాభాలు తుడిచిపెట్టుకు పోయాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా టెక్ కంపెనీ షేర్లు ఫేస్బుక్ 0.9 శాతం, అమెజాన్, ఆపిల్. నెట్‌ఫ్లిక్స్ 3శాతం, ఆల్ఫాబెట్ 1.4శాతం కుప్పకూలాయి. ఆపిల్ ఫోన్ల అమ్మకాలు మందగించడంతో ఆ కంపెనీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. అక్టోబర్ 3 నుంచి ఈ షేర్ దాదాపు 20 శాతం దాకా క్షీణించింది. నాస్ డాక్ సూచీ ఇపుడు ట్రేడవుతోంది. అనేక టెక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. అటు ముడి చమురు షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. బ్రెంట్ క్రూడ్ 1.8 శాతం క్షీణించగా, డబ్ల్యూటీఐ చమురు రెండు శాతం క్షీణించింది. ఈ పరిణామాలన్నీ రేపటి దేశీయ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. -
నాస్‌డాక్‌తో ఎన్ఎస్ఈ ఒప్పందం
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎస్ఎస్ఈ) తాజాగా అమెరికా స్టాక్ ఎక్సే్చంజ్ ‘నాస్డాక్’తో టెక్నాలజీకి సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే 2–3 ఏళ్లలో ఈ ఒప్పందం అమల్లోకి రానుంది. ‘ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 100 ఎక్సే్చంజ్‌లకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నాం. తాజా ఒప్పందంలో భాగంగా నాస్డాక్ ప్రీమియం మార్కెట్ టెక్నాలజీని ఇండియన్ క్యాపిటల్ మార్కెట్లోకి తీసుకువస్తాం. కస్టమైజ్డ్ రియల్ టైమ్ క్లియరింగ్, రిస్క్ మేనేజ్మెంట్, సెటిల్మెంట్ టెక్నాలజీని ఎన్ఎస్ఈకి అందిస్తాం’ అని నాస్డాక్ ప్రెసిడెంట్, సీఈవో అడెనా ఫ్రైడ్మెన్ తెలిపారు. -
మోత మోగిస్తున్న వాల్ స్ట్రీట్ స్టాక్స్
న్యూయార్క్ : దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు రికార్డుల మోత మోగించిన సంగతి తెలిసిందే. ఇదే బాటలో వాల్ స్ట్రీట్ స్టాక్స్ కూడా ఆ దేశ మార్కెట్లో దుమ్మురేపుతున్నాయి. మంగళవారం ట్రేడింగ్ మొదలైన కొద్దిసేపట్లోనే నాస్డాక్ చరిత్ర సృష్టించింది. మొదటిసారి 6000 మార్కును తాకింది. బ్లూ చిప్ కంపెనీల ఫలితాలు చాలా స్ట్రాంగ్ గా ఉండటంతో వాల్ స్ట్రీట్ స్టాక్స్ దూసుకెళ్తున్నాయని అక్కడి విశ్లేషకులంటున్నారు. నాస్డాక్ తో పాటు డౌ జోన్స్ కూడా లాభాలు పండిస్తోంది. ఓపెనింగ్ బెల్ మోగించిన కొద్ది సమయ వ్యవధిలోనే నాస్ డాక్ కాంపొజిట్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగి, 6,004.27ను తాకింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ కూడా 0.7 శాతం ఎగిసి, 20,911.41 వద్ద ట్రేడైంది. అదేవిధంగా ఎస్ అండ్ పీ 500 కూడా లాభాల్లో నడుస్తుందని తెలుస్తోంది. ఇటు మన దేశీయ మార్కెట్లూ మంగళవారం ట్రేడింగ్ లో ఫుల్ జోష్ లో కొనసాగాయి. ఆరంభం నుంచి రికార్డు లాభాల మోత మోగించాయి. నిఫ్టీ 88.65 పాయింట్లు ఎగిసి రికార్డు స్థాయిలో 9307 వద్ద ముగిసింది. మార్కెట్ చరిత్రలో తొలిసారి నిఫ్టీ 9,300 ని తాకింది. అదేవిధంగా సెన్సెక్స్ కూడా 287.40 పాయింట్ల లాభంలో 29,943 వద్ద క్లోజైంది. -
వాల్ స్ట్రీట్‌లో అడుగుపెట్టబోతున్న ఫ్లిప్‌కార్ట్
-
వాల్‌స్ట్రీట్‌లో అడుగుపెట్టబోతున్న ఫ్లిప్‌కార్ట్
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వాల్ స్ట్రీట్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. అమెరికా స్టాక్ మార్కెట్లో ప్రధాన సూచీ నాస్డాల్లో ఐపీఓ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)కు ప్రీపేర్ అవుతోందని బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ చేసింది. ఇదే సమయంలో నాలుగు అతిపెద్ద ఆడిట్ సంస్థల్లో ఒకదాన్ని నియమించుకోనున్నట్టు బుధవారం తెలిపింది. 2018లో ఈ సంస్థ నాస్డాక్లో ఐపీఓకు రావొచ్చని రిపోర్టు పేర్కొంది. ఈ విషయాన్ని ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈవో బిన్నీ బన్సాల్ ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా తెలిపినట్టు రిపోర్టు వెల్లడించింది. ఐపీవో ద్వారా తన కీలక కర్తవ్యాన్ని చూడబోతున్నారంటూ ఉద్యోగులకు ఆయన తెలిపారు. కాగ, సోమవారం ఫ్లిప్‌కార్ట్ మాజీ టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ కల్యాణ్ కృష్ణమూర్తిని సీఈవోగా నియమించి, సహవ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్‌ను గ్రూప్ సీఈవోగా కూర్చోపెట్టింది. తన పెట్టుబడిదారుల్లో ఒకరు సంస్థను గట్టి నియంత్రణలో పెట్టాలని ఫ్లిప్‌కార్ట్ భావించింది. తాజా మార్పులతో ఫ్లిప్‌కార్ట్‌లో అత్యధిక పెట్టుబడులు కలిగిన టైగర్ గ్లోబల్ కంపెనీకి, సంస్థ గాడ్ ఫాదర్‌గా పేరొందిన లీ ఫిక్సెల్‌కు మేనేజ్మెంట్ స్థాయిలో పూర్తిస్థాయిలో నియంత్రణ దక్కినట్టు అయింది. భారతీయ కీలక ఈ-కామర్స్ కంపెనీ బోర్డు రూమ్‌లో ఈ కంపెనీలు నిర్ణయాత్మక స్థితికి చేరుకోవడం గమనార్హం. -
రికార్డులు సృష్టించిన అమెరికా మార్కెట్లు
అగ్రరాజ్యం అమెరికా మార్కెట్లలో ఏ చిన్న కదలిక కనిపించినా చాలు ప్రపంచమార్కెట్లన్నీ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుంటాయి. అలాంటి స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్‌లో సంచనాలు సృష్టించాయి. మొదటిసారి 1999 నాటి గరిష్ట స్థానానికి ఎగిసి రికార్డుల వర్షం కురిపించాయి. ఆయిల్ ధరలు పెరుగుతున్నాయనే వార్త, మాకీస్, కోహ్ల్స్ డిపార్ట్మెంట్ స్టోర్లు బలమైన రాబడులు ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలపర్చాయి. దీంతో అమెరికా మూడు మేజర్ స్టాక్ సూచీలు డౌజోన్స్, నాస్డాక్, ఎస్ అండ్ పీ 500 రికార్డు స్థాయిలో క్లోజ్ అయినట్టు బైస్పోక్ ఇన్వెస్ట్మెంట్ గ్రూపు వెల్లడించింది. ఆయిల్ ధరలను స్థిరంగా కొనసాగించడానికి తగిన చర్యలు తీసుకుంటామని సౌదీ ఆయిల్ మంత్రి కామెంట్ల అనంతరం క్రూడ్ ఆయిల్ 5 శాతం మేర జంప్ అయింది. తదుపరి కొన్ని నెలలో క్రూడ్ ఆయిల్ మార్కెట్లు మళ్లీ సమతుల్య స్థానానికి వస్తాయని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనావేసింది. దీంతో ఎస్ అండ్ పీ ఎనర్జీ ఇండెక్స్ 1.3 శాతం మేర ర్యాలీ కొనసాగించింది. 10 మేజర్ సెక్టార్లలో ఇదే టాప్‌లో నిలిచింది. డిపార్ట్మెంట్ స్టోర్ ఆపరేటర్ మాకీస్ కనీసం ఎనిమిదేళ్ల అనంతరం అంచనావేసిన దానికంటే తక్కువగానే రాబడులు పడిపోయినప్పటికీ, స్టోర్ అమ్మకాలు ఎగిసినట్టు తన త్రైమాసిక ఫలితాల్లో వెల్లడించింది. దీంతో మాకీస్ షేర్లు 17.09 శాతం దూసుకెళ్లాయి. అదేవిధంగా కోహ్ల్స్ కూడా మార్కెట్ విశ్లేషకలు అంచనాలను అధిగమించి క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. దీంతో ఆ స్టోర్ షేర్లు కూడా 16.17 శాతం ఎగిశాయి. ఈ బలమైన ఆదాయాల సంకేతాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకుందని వెల్లడవుతుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఎస్ అండ్ పీ ఇండెక్స్ జూన్ చివరి నుంచి 7.0 శాతం పెరిగింది. అంచనావేసిన దానికంటే అధికంగానే త్రైమాసిక ఫలితాలు, తక్కువ వడ్డీరేట్లు అమెరికా మార్కెట్ల ర్యాలీకి దోహదం చేశాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ కొంత మంది ఇన్వెస్టర్లు ఎక్కువ వాల్యుయేషన్‌పై భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. థామ్సన్ రాయిటర్స్ డేటా ప్రకారం ఎస్ అండ్ పీ 500 ముందటి రికార్డులను కొల్లగొట్టింది. అంచనావేసిన దానికంటే 17 టైమ్స్ ఎగిసింది. డౌజోన్స్ ఇండస్ట్రియల్ సగటున 100 పాయింట్లకు పైగా పెరిగి 18,613.52 వద్ద, ఎస్ అంట్ పీ 500 ఇండెక్స్ 0.47 శాతం పెరిగి 2,185.79 దగ్గర, నాస్ డాక్ కంపొజిట్ 0.46 ఎగిసి 5,228.40వద్ద క్లోజ్ అయ్యాయి. అమెరికా మార్కెట్లు రికార్డులు సృష్టించడంతో, ఆసియన్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దేశీయ స్టాక్ సూచీలు కూడా శుక్రవారం ట్రేడింగ్‌లో లాభాలతోనే ఎంట్రీ కానున్నట్టు మార్కెట్ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. -
భారీగా పతనమైన అంతర్జాతీయ మార్కెట్లు
న్యూయార్క్: 'ఎబోలా' అమెరికా స్టాక్‌మార్కెట్ ను వణింకించింది. అమెరికాలో ఒకరికి ఎబోలా వైరస్ సోకిందన్న సమాచారం వాల్‌స్ట్రీట్ ను కుదిపేసింది. డౌజోన్స్, నాస్డాక్ ఒక శాతంపైగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. జపాన్ -420(-2.68 శాతం), హాంకాంగ్ -296(-1.29శాతం), సింగపూర్ నిఫ్టీ 100 పాయింట్లు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు అరశాతం పడిపోయాయి. భారత మార్కెట్లకు వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర 94 డాలర్లకు పతనమైంది. -
నాస్డాక్లో ఇన్ఫీ ఏడీఆర్ పతనం
హైదరాబాద్: అమెరికా టెక్నాలజీ ఎక్స్ఛేంజ్ ‘నాస్డాక్’లో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ షేరు (ఏడీఆర్...అమెరికన్ డిపాజిటరీ రిసీట్) నిలువునా పతనమైంది. బుధవారం రాత్రి కడపటి సమాచారం అందేసరికి ఈ ఏడీఆర్ భారీ ట్రేడింగ్ పరిమాణంతో 8 శాతానికి పైగా క్షీణించి 54.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ధర భారత్‌లో రూ. 3,330తో సమానం. అయితే బుధవారం దేశీ స్టాక్ మార్కెట్లలో ఈ షేరు రూ.3,671 వద్ద ముగియటం గమనార్హం. దేశీ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిశాక భారత కాలమానం ప్రకారం రాత్రి అమెరికాలో ట్రేడింగ్ మొదలవుతుంది కనక ఆ ప్రభావం దేశీ మార్కెట్లపై ఉండే అవకాశాలెక్కువ. దీంతో గురువారం భారత్ ఎక్స్ఛేంజీల్లో ఇన్ఫోసిస్ రూ. 300 వరకూ తగ్గే అవకాశం ఉందన్నది నిపుణుల మాట. తాము ముందుగా ప్రకటించిన ఆర్థిక అంచనాల్ని చేరడం కష్టమని కంపెనీ యాజమాన్యం ఒక ఇన్వెస్టర్ల సమావేశంలో బాంబు పేల్చడంతో ఈ పతనం సంభవించింది. గత రెండేళ్లుగా కంపెనీ పనితీరు పట్ల తాను అసంతృప్తి చెందుతున్నానని, కంపెనీ టర్న్ ఎరౌండ్ కావడానికి చాలాకాలమే పట్టవచ్చని ఇన్ఫోసిస్ ఛైర్మన్ నారాయణమూర్తి చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి (2013-14) ఆదాయ వృద్ధి 11.5-12 శాతం వుండవొచ్చని గతంలో కంపెనీ ప్రకటించింది. అయితే తమ క్లయింట్ల వ్యయం ఈ క్వార్టర్లో బలహీనంగా వుందని, ఈ కారణంగా గెడైన్స్‌లో దిగువ శ్రేణిని మాత్రమే చేరవచ్చునని కంపెనీ సీఈఓ శిబూలాల్ తెలిపారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో కూడా వ్యాపారం మందకొడిగా వుంటుం దని ఆయన మరో బాంబు పేల్చారు. కంపెనీ ఛైర్మన్‌గా నారాయణమూర్తి తిరిగి బాధ్యతలు చేపట్టాక వ్యాపారం పుంజుకుందని చెప్పిన విశ్లేషకులు కంపెనీ తాజా ప్రకటనతో ఖిన్నులయ్యారు. -
గూగుల్ షేరు @ 1,000 డాలర్లు
న్యూయార్క్: ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో ఇంటర్నెట్ సెర్చి దిగ్గజం గూగుల్ షేరు ధర అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజీ నాస్డాక్లో శుక్రవారం ఏకంగా 1,000 డాలర్ల (మన కరెన్సీలో సుమారు రూ. 61,000) స్థాయిని దాటింది. ట్రేడింగ్ ప్రారంభంలో 13 శాతం దూసుకెళ్లిపోయి 1,007.40 డాలర్లను తాకింది. తద్వారా వెయ్యి డాలర్ల మార్కును అధిగమించిన రెండో అమెరికన్ సంస్థగా గూగుల్ నిల్చింది. ఇటీవలే ప్రైస్లైన్ అనే ఆన్లైన్ ట్రావెల్ సైట్ ఈ మైలురాయిని దాటింది. తాజా ఫీట్‌తో గూగుల్ మార్కెట్ విలువ 334 బిలియన్ డాలర్లకు చేరింది. కేవలం తొమ్మిదేళ్ల వ్యవధిలో కంపెనీ షేరు, మార్కెట్ విలువ అనేక రెట్లు పెరిగాయి. 2004లో ఐపీవోకి వచ్చిన గూగుల్ షేరు ధర 85 డాలర్లుగా నిర్ణయించింది. ఐపీవో ద్వారా 1.67 బిలియన్ డాలర్లు సమీకరించింది. ఆ ఏడాది ఆగస్టులో స్టాక్ఎక్స్చేంజీల్లో షేరు 100 డాలర్లకు లిస్టు కాగా.. కంపెనీ మార్కెట్ విలువ సుమారు 23 బిలియన్ డాలర్లుగా ఉంది. గూగుల్‌లో షేర్లను విక్రయించడం ద్వారా అనేక మంది ఉద్యోగులు రాత్రికి రాత్రి కోటీశ్వరులయ్యారు. -
నైపుణ్యాలే ఉపాధికి ఊతం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత పోటీ యుగంలో ఉద్యోగావకాశాలు దక్కించుకునేందుకు నైపుణ్యాలు చాలా కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలోనే పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా యువతకు వివిధ అంశాల్లో స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణనివ్వడంపై దృష్టి సారించినట్లు నాస్డాక్ లిస్టెడ్ సంస్థ హీలియోస్ అండ్ మాథెసన్ నేషనల్ హెడ్ (గవర్నమెంట్ వర్టికల్ విభాగం) మండల రవి తెలిపారు. గత ఏడేళ్లుగా ఇటువంటి శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేతులు కలిపామని ఆయన వివరించారు. వివరాలు రవి మాటల్లోనే...ఐటీ, రిటైల్ సేల్స్ వంటి అంశాల్లో శిక్షణ.. పదో తరగతి, ఇంటర్మీడియెట్, గ్రాడ్యుయేట్లకు బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, బీమా రంగం), ఐటీ, రిటైల్ సేల్స్ వంటి అంశాల్లో శిక్షణనిస్తున్నాం. ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే జీహెచ్ఎంసీ వంటి సంస్థలకు కావాల్సిన సిబ్బంది కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నాం. ఇలాంటి ప్రాజెక్టుల కోసం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి మరికొన్ని సంస్థలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిన్న పరిశ్రమల జాతీయ ఇనిస్టిట్యూట్ (ఎన్ఐ-ఎంఎస్ఎంఈ)తో ఇప్పటికే ఒప్పందం కుదిరింది. అటు, జాతీయ స్థాయిలో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ)తోనూ చేతులు కలుపుతున్నాం. అటు ఈగవర్నెన్స్ ప్రాజెక్టులను కూడా దక్కించుకోవడంపై దృష్టి పెట్టాం. మూడేళ్లలో 4 లక్షల మంది టార్గెట్.. 2013-14లో వివిధ రాష్ట్రాల్లో సుమారు 25-30 వేల మందికి శిక్షణ కల్పించాలని భావిస్తున్నాం. వచ్చే మూడేళ్లలో మొత్తం మీద 3-4 లక్షల మందికి శిక్షణనివ్వాలని నిర్దేశించుకున్నాం. ఇంజినీరింగ్ విద్యార్థులకు కూడా ఉద్యోగ నైపుణ్యాల్లో శిక్షణ కల్పించే దిశగా కొన్ని యూనివర్సిటీలతోనూ ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లపై ఆసక్తి ఉన్న వారు మమ్మల్ని సంప్రతించిన పక్షంలో వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల్లో ఏది వారికి అనువైనదిగా ఉంటుందో పరిశీలించి, శిక్షణ కల్పించే ప్రయత్నం చేస్తాం. -
ఫెయిర్‌ఫాక్స్ చేతికి బ్లాక్‌బెర్రీ
ఒట్టావా: ఒకప్పుడు స్మార్ట్ఫోన్ల రాజ్యాన్ని ఏలి... రానురాను మసకబారుతున్న బ్లాక్‌బెర్రీ సంస్థ చేతులు మారుతోంది. దీన్ని 4.7 బిలియన్ డాలర్లకు ఫెయిర్‌ఫాక్స్ కన్సార్షియం కొనుగోలు చేయనుంది. గతవారం భారీ ఎత్తున నష్టాలను ప్రకటించిన బ్లాక్‌బెర్రీ... అప్పటి నుంచే వ్యూహాత్మక ప్రత్యామ్నాయాలను వెదకటం ప్రారంభించింది. చివరికి 4.7 బిలియన్ డాలర్లకు ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్తో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు సోమవారం ప్రకటించింది. మన కరెన్సీలో ఇది దాదాపు రూ.30 వేల కోట్లకు సమానం. ఈ మేరకు రెండు సంస్థలూ లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకాలు చేశాయి. విలువకు సంబంధించి నవంబరు 4లోగా నిజ నిర్ధరణ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ మధ్యలో మరింత మంచి ఆఫర్ల కోసం బ్లాక్‌బెర్రీ వెతుక్కునే అవకాశమూ దీన్లో ఉంది. తాజా వార్తతో నాస్డాక్లో బ్లాక్‌బెర్రీ ధర సర్రుమని ఎగసింది. అయితే కొత్త భాగస్వామిని వెతుక్కుని బ్లాక్‌బెర్రీ గనక ఈ డీల్‌కు గుడ్‌బై చెబితే... అది షేరుకు 0.30 డాలర్ చొప్పున ఫెయిర్‌ఫాక్స్‌కు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే బ్లాక్‌బెర్రీలో ఫెయిర్‌ఫాక్స్‌కు 10 శాతం వాటా ఉంది. ఈ డీల్‌కు బ్యాంక్ ఆఫ్ అమెరికా, మెరిల్ లించ్, బీఎంఓ క్యాపిటల్ మార్కెట్స్ కలిసి రుణం అందిస్తాయని బ్లాక్‌బెర్రీ ఒక ప్రకటనలో తెలిపింది. రీసెర్చ్ ఇన్ మోషన్ పేరును బ్లాక్‌బెర్రీగా మార్చుకున్న ఈ సంస్థ కొన్నాళ్లుగా కొత్త ఫోన్లనైతే మార్కెట్లోకి విడుదల చేస్తోంది తప్ప అవి పెద్దగా సక్సెస్ కావటం లేదు. యాపిల్, శాంసంగ్, ఇంకా ఇతర చౌక మొబైల్ కంపెనీల నుంచి ఎదురవుతున్న పోటీతో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోంది. చివరకు మేనేజ్మెంట్ స్థాయిలో మార్పులు చేసింది. క్యు10, జెడ్10 సిరీస్‌లో కొత్త ఫోన్లు తెచ్చింది. అవి కొంత ఫలితం ఇచ్చినా... అప్పటికే విడుదల చేసిన పలు మోడళ్లు మార్కెట్లో అమ్ముడుకాక డీలర్ల వద్ద పేరుకుపోయాయి. దీంతో బిలియన్ డాలర్ల మేర నష్టాలు ప్రకటించవచ్చని ముందే తెలిపింది కంపెనీ. దీనికితోడు సిబ్బందిలో 40 శాతాన్ని... అంటే దాదాపు 4,500 మందిని తొలగించే అవకాశముందని కూడా తెలియజేసింది. దీంతో కంపెనీ చేతులు మారటం ఖాయమని స్పష్టమైపోయింది. అయితే ఎవరు కొంటారన్న ప్రశ్నలకు తాజా డీల్‌తో సమాధానం లభించినట్లయింది.