
ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ సీఈవో, భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ (46)కు అరుదైన గౌరవం దక్కింది. టెక్నాలజీలో రంగంలో చేసిన విశిష్ట సేవలకు గాను ప్రతిష్టాత్మక యూఎస్ ఇండియా బిజినెస్ అడ్వోకసీ గ్రూప్ (యూఎస్‌ఐబీసీ) ఇచ్చే గ్లోబల్ లీడర్‌షిప్ 2019 అవార్డు ఆయన్నువరించనుంది. సుందర్ పిచాయ్‌తోపాటు నాస్‌డాక్ ప్రెసిడెంట్ అడెనా ఫ్రైడ్‌మాన్ (50) కూడా ఈ అడార్డుకు ఎంపికయ్యారు. త్వరలో జరగనున్న 'ఇండియాస్ ఐడియాస్ సమ్మిట్'లో గ్లోబల్ లీడర్ షిప్ అవార్డు 2019 గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు 2019ని సుందర్ పిచాయ్, ఫ్రైడ్‌మాన్‌కు అందించనున్నారు. సాంకేతిక రంగ అభివృద్ధికి గూగుల్, నాస్‌డాక్ కంపెనీలు చేస్తున్న సేవలకు గాను వీరిని ఎంపిక చేశారు. ఈ అవార్డును వాషింగ్టన్‌కు చెందిన యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సెల్ అందిస్తోంది. 2007 నుంచి ఈ అవార్డును ఇస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment