వ్యాక్సిన్‌ ఆశలు‌- యూఎస్‌ కొత్త రికార్డ్స్‌ | Vaccine hopes- US Markets hit record highs | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్‌ ఆశలు‌- యూఎస్‌ కొత్త రికార్డ్స్‌

Published Tue, Nov 17 2020 10:07 AM | Last Updated on Tue, Nov 17 2020 1:04 PM

Vaccine hopes- US Markets hit record highs - Sakshi

న్యూయార్క్: కోవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌తో వణుకుతున్న ప్రపంచ దేశాలకు తాజాగా మోడర్నా ఇంక్‌ వ్యాక్సిన్‌ ద్వారా అభయం ఇవ్వడంతో సోమవారం యూఎస్‌ మార్కెట్లకు హుషారొచ్చింది. ఇన్వెస్టర్లు  కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో డోజోన్స్‌ 479 పాయింట్లు(1.6 శాతం) జంప్‌చేసి 29,959 వద్ద ముగిసింది. ఈ బాటలో ఎస్‌అండ్‌పీ 42 పాయింట్లు(1.2 శాతం) ఎగసి 3,627 వద్ద నిలవగా.. నాస్‌డాక్‌ 95 పాయింట్లు(0.8 శాతం) పెరిగి 11,924 వద్ద స్థిరపడింది. వెరసి మార్కెట్లు లైఫ్‌టైమ్‌ గరిష్టాలకు చేరాయి. ఇంతక్రితం ఈ ఏడాది ఫిబ్రవరిలో మాత్రమే ప్రధాన ఇండెక్సులు మూడూ ఒకేరోజు చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ రసెల్‌-2000 సైతం ఆల్‌టైమ్‌ హైను తాకడం విశేషం! ఇప్పటికే తమ వ్యాక్సిన్‌ 90 శాతంపైగా సురక్షితమంటూ ఫార్మా దిగ్గజంఫైజర్ డేటాను విశ్లేషించిన విషయం విదితమే. దీంతో సెంటిమెంటు మరింత బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. చదవండి: (మరోసారి మార్కెట్లకు దివాలీ జోష్‌?!)

ఫైజర్‌ డీలా
కోవిడ్‌-19 కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్‌ 94.5 శాతం సురక్షితమంటూ ప్రకటించిన మోడర్నా ఇంక్‌ షేరు 10 శాతం దూసుకెళ్లింది. అయితే ఇతర ఫార్మా కౌంటర్లలో ఫైజర్‌ ఇంక్‌ 3.3 శాతం, ఆస్ట్రాజెనెకా 2 శాతం చొప్పున డీలా పడ్డాయి. వ్యాక్సిన్‌ అంచనాలతో ఎయిర్‌లైన్‌, క్రూయిజర్‌ స్టాక్స్‌కు సైతం డిమాండ్‌ పెరిగింది. కార్నివాల్‌ గ్రూప్ 10 శాతం జంప్‌చేయగా. నార్వేజియన్‌ క్రూయిజ్‌లైన్‌, యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌, అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌, సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్ 6-4 శాతం మధ్య పురోగమించాయి. ఈ బాటలో ప్రత్యర్థి సంస్థ టాబ్‌మెన్‌ సెంటర్స్‌ కొనుగోలు ధరను 80 శాతం తగ్గించిన వార్తలతో సైమన్‌ ప్రాపర్టీ గ్రూప్‌ షేరు దాదాపు 6 శాతం ఎగసింది. ఈ వారం రిటైల్‌ రంగ దిగ్గజాలు వాల్‌మార్ట్‌ ఇంక్‌, హోమ్‌ డిపో, టార్గెట్‌ కార్ప్‌, లోవ్స్‌ క్యూ3(జులై- సెప్టెంబర్‌) త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. చదవండి: (సెన్సెక్స్‌ప్రెస్‌- 44,000 దాటేసింది!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement