New High
-
ఏడాదిలో భారత్- యూఏఈ బంధం ఎలా బలపడింది?
ప్రధాని నరేంద్ర మోదీ తన 2 రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం(ఫిబ్రవరి 13) యూఏఈ చేరుకోనున్నారు. ఫిబ్రవరి 14న అబుదాబిలో నిర్మించిన బీఏపీఎస్ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. కాగా గత ఏడాది కాలంలో భారతదేశం- యూఎఈ మధ్య సంబంధాలలో మరింత సాన్నిహిత్యం ఏర్పడింది. అనేక అంశాల్లో కలిసి పని చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. గడచిన ఏడాదిలో రెండు దేశాల మధ్య ఐదు ఉన్నత స్థాయి పర్యటనలు జరిగాయి. ప్రధాని మోదీ జూలై 2023లో ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం యూఏఈ వెళ్లి, అధ్యక్షుడు హెచ్‌హెచ్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌ను అబుదాబిలో కలిశారు. దుబాయ్‌లో కాప్-28లో పాల్గొంటున్నప్పుడు కూడా అంటే గత ఏడాది నవంబరు 30 ప్రధాని మోదీ యూఏఈ సందర్శించారు. అప్పుడు ప్రధాని మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ హిస్ ఎక్సలెన్సీ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, వైస్ ప్రెసిడెంట్‌ను కలుసుకున్నారు. భారతదేశ మద్దతుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్రిక్స్‌లో సభ్యదేశంగా చేరింది. వాణిజ్య రంగంలో కూడా ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఊపందుకున్నాయి. సరిహద్దు లావాదేవీల కోసం రూపాయి, దిర్హమ్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో యూఏఈ భారతదేశంలో 3.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన నాల్గవ అతిపెద్ద దేశంగా అవతరించింది. 2024, జనవరి 10న యూఎఈ అధ్యక్షుడు హెచ్‌హెచ్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ గుజరాత్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. 2026-39 వరకు అంటే 14 సంవత్సరాల దీర్ఘకాలిక ఒప్పందం కింద 1.2 ఎంఎంటీ ఎల్ఎన్జీ కొనుగోలు చేయడానికి ఐఓసీఎల్, ఏడీఎన్ఓసీ మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఇది భారత్, యూఏఈ మధ్య కుదిరిన మొదటి దీర్ఘకాలిక ఒప్పందం. తాజాగా అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏడీఎన్ఓసీ) గ్యాస్ గెయిల్ ఇండియాకు సంవత్సరానికి 0.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎల్ఎన్జీని సరఫరా చేసేందుకు 10 సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకుంది. రక్షణ రంగంలో గత ఏడాది కాలంలో రెండు దేశాల మధ్య ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. 2024 జనవరిలో భారత్-యూఎఈల ద్వైపాక్షిక సైనిక కసరత్తు రాజస్థాన్‌లో జరిగింది. 2024, జనవరి 21న భారత్- యూఏఈ, ఫ్రాన్స్‌ల వైమానిక దళాలతో కూడిన ఎక్సర్సైజ్ డెసర్ట్ నైట్ యూఏఈలోని అల్ దఫ్రా విమానాశ్రయంలో జరిగింది. ఇటీవల ఎడ్జ్, హెచ్‌ఏఎల్‌లు ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం క్షిపణి వ్యవస్థల ఉమ్మడి రూపకల్పన, అభివృద్ధితో సహా సహకార రంగాలలో ఇరు దేశాలు పరస్పరం సహాయ సహకారాలు అందించుకోనున్నాయి. -
‘ఎక్స్’లెంట్: ట్విటర్ సరికొత్త రికార్డ్! షేర్ చేసిన మస్క్
‘ఎక్స్’(X)గా పేరు మారిన ట్విటర్ (Twitter) సరికొత్త రికార్డ్ సాధించింది. మంత్లీ యూజర్ల సంఖ్యలో నూతన గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు దాని అధినేత ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. మంత్లీ యూజర్ల సంఖ్య 540 మిలియన్లను దాటినట్లు చూపుతున్న గ్రాఫ్‌ను షేర్ చేశారు. ఇటీవల పడిపోయిన ప్రకటనల ఆదాయాన్ని పెంచుకునేందుకు సంస్థలో సంస్థాగత మార్పులు చేపట్టిన తరుణంలో యూజర్ల సంఖ్య రికార్డ్ స్థాయిలో పెరగడం గమనార్హం. మరోవైపు ఇంకొక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మెటా.. ట్విటర్‌కు పోటీగా థ్రెడ్స్ అనే మైక్రో బ్లాగింగ్ యాప్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత అక్టోబర్‌లో మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేయడానికి ముందు 2022 మే నాటికి ట్విటర్ 229 మిలియన్ల మంత్లీ యాక్టివ్ యూజర్లు ఉండగా తన ఆధీనంలోకి వచ్చాక 2022 నవంబర్‌లో 259.4 మిలియన్ డైలీ యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు మస్క్ పోస్ట్ చేశారు. తన ఆధీనంలోకి వచ్చినప్పటి నుంచి మస్క్ ట్విటర్లో అనేక మార్పులు తీసుకొచ్చారు. బ్లూటిక్‌ను పెయిడ్ సర్వీస్‌గా మార్చారు. అస్తవ్యస్తమైన మార్పుల ఫలితంగా ప్రకటనల ఆదాయం క్రమంగా పడిపోతూ వచ్చింది. ఈ నేపథ్యంలో గత మేలో ఎన్బీసీ యూనివర్సల్ అడ్వర్టైజింగ్ చీఫ్‌గా ఉన్న లిండా యాకారినోను ట్విటర్ (ఎక్స్)కు సీఈవోగా నియమించారు. తద్వారా తనకు సబ్స్క్రిప్షన్ రాబడితోపాటు ప్రకటనల ఆదాయం కూడా కీలకమని సంకేతాలిచ్చారు. ఇదీ చదవండి ➤ Elon Musk: అతని కోపం ప్రళయం.. మస్క్ గురించి కీలక విషయాలు చెప్పిన మాజీ ఉద్యోగిని ప్రకటనల ఆదాయంలో దాదాపు 50 శాతం తగ్గిపోయిందని, అలాగే పెరిగిన రుణ భారం కారణంగా నగదు లోటును ఎదుర్కొంటున్నట్లు జులై నెల ప్రారంభంలో మస్క్ చెప్పారు. ఇంతలో ట్విటర్‌ని ‘ఎక్స్’గా రీబ్రాండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే మెటా, మైక్రోసాఫ్ట్‌తోపాటు మరికొన్ని కంపెనీలు ఇప్పటికే ‘ఎక్స్’ అక్షరంపై మేధో సంపత్తి హక్కులను కలిగి ఉన్నాయి. కాబట్టి దీనిపై చట్టపరమైన చిక్కులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. 𝕏 monthly users reach new high in 2023 pic.twitter.com/trqLGBEvvA — Elon Musk (@elonmusk) July 28, 2023 -
బాహుబలి ‘సిప్’ ప్రతి నెలా రూ.12,000 కోట్లపైనే
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు పెట్టే విషయంలో రిటైల్ ఇన్వెస్టర్లు ఎంతో పరిణతి చూపిస్తున్నారు. ఇటీవలి కాలంలో మార్కెట్లలో అస్థిరతలతో సంబంధం లేకుండా ప్రతి నెలా నికర సిప్ పెట్టుబడులు క్రమంగా పెరుగుతూ ఉండడం దీన్నే సూచిస్తోంది. గత నాలుగు నెలలుగా నెలవారీ సిప్ పెట్టుబడుల రాక రూ.12,000 కోట్లపైనే నమోదవుతోంది. ఆగస్ట్‌లో సిప్ పెట్టుబడులు అత్యధికంగా రూ.12,693 కోట్లకు చేరాయి. ఒక నెలలో ఇదే గరిష్ట సిప్ పెట్టుబడులు ఇవి. ఈ ఏడాది మే నెలకు రూ.12,286 కోట్లు, జూన్‌లో రూ.12,276 కోట్లు, జూలైలో రూ.12,140 కోట్ల చొప్పున సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన పెట్టుబడులు రూ.11,863 కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో సిప్ పెట్టుబడులు రూ.61,258 కోట్లకు చేరాయి. ఇక గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద సిప్ పెట్టుబడులు రూ.1.24 లక్షల కోట్లుగా ఉన్నాయి. క్రమబద్ధమైన పెట్టుబడులు.. సిప్ ద్వారా ప్రతి నెలా పెట్టుబడులు పెట్టడం వల్ల మార్కెట్ల ర్యాలీల్లో పాల్గొనొచ్చు. అదే సమయంలో మార్కెట్లలో కరెక్షన్ల సమయంలోనూ కొనుగోలుకు అవకాశం లభిస్తుంది. ఏకమొత్తంలో పెట్టుబడికి ఈ వెసులుబాటు ఉండదు. అందుకని సిప్ రూట్లో పెట్టుబడుల వల్ల దీర్ఘకాలంలో అస్థిరతలను సులభంగా అధిగమించి రాబడులు పొందేందుకు వీలుంటుంది. ఈ వెసులుబాటే సిప్‌కు ఆదరణ పెంచుతోంది. వేతన జీవులు ప్రతి నెలా క్రమం తప్పకుండా సిప్ పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సిప్ అన్నది పొదుపు అలవాటును ప్రోత్సహిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని సిప్ ఆస్తులు (పెట్టుబడులు) 2022 మర్చి చివరికి రూ.5.76 లక్షల కోట్లుగా ఉంటే, ఆగస్ట్ చివరికి రూ.6.4 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి. వార్షికంగా సిప్ ఆస్తులు 30 శాతం మేర పెరిగాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణ ఆస్తుల వృద్ధి కంటే ఇది రెండు రెట్లు అధికంగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల వద్ద నమోదైన మొత్తం సిప్ ఖాతాలు ఆగస్ట్ చివరికి 5.72 కోట్లుగా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ప్రధానంగా సిప్ పెట్టుబడులపైనే ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే 43 మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఉమ్మడిగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో రూ.64.935 కోట్ల ఈక్విటీ పెట్టుబడులను ఆకర్షించగా, ఇందులో రూ.61,258 కోట్లు సిప్ రూపంలో రావడం దీన్నే తెలియజేస్తోంది. వచ్చే 18-24 నెలల్లో సిప్ ద్వారా ప్రతి నెలా వచ్చే పెట్టుబడులు రూ.20,000 కోట్లకు చేరతాయని భావిస్తున్నట్టు మోతీలాల్ ఓస్వాల్ ప్రైవేటు వెల్త్ ఎండీ, సీఈవో ఆశిష్ శంకర్ పేర్కొన్నారు. -
యూఎస్ మార్కెట్ల సరికొత్త రికార్డ్
న్యూయార్క్, సాక్షి: యూఎస్ కాంగ్రెస్‌లో డెమక్రాట్ల ఆధిపత్యం కారణంగా కొత్త ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్న జో బైడెన్‌పై అంచనాలు పెరిగాయి. దీంతో కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొనే బాటలో ప్రభుత్వం ఇకపై భారీ సహాయక ప్యాకేజీలకు తెరతీయవచ్చన్న అంచనాలు పెరిగాయి. మరోపక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ట్రంప్‌ను గడువుకంటే ముందే అధికారం నుంచి తప్పించేందుకు చర్యలు మొదలైనట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి గురువారం యూఎస్ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకాయి. డోజోన్స్ 212 పాయింట్లు(0.7 శాతం) ఎగసి 31,041 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 56 పాయింట్ల(1.5 శాతం) వృద్ధితో 3,804 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 327 పాయింట్లు(2.6 శాతం) జంప్‌చేసి 13,067 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త గరిష్టాలుకావడం విశేషం! చదవండి: (మారిన ఐటీ కంపెనీల ఫోకస్) బాండ్ల ఈల్డ్స్ అప్ 10ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్ 10 నెలల గరిష్టం 1.081 శాతానికి ఎగశాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 0.5 శాతం బలపడి 89.78ను తాకింది. మరోపక్క పసిడి ధరలు ఔన్స్ 0.3 శాతం నీరసించి 1914 డాలర్లకు చేరాయి. కాగా.. గత వారం నిరుద్యోగ క్లెయిములు అంచనాలకంటే తగ్గడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు తెలియజేశారు. (ప్రపంచ కుబేరుడిగా ఎలన్ మస్క్?) టెస్లా జోరు ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ 8 శాతం జంప్‌చేసి 816 డాలర్లను తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 773 బిలియన్ డాలర్లను అధిగమించింది. ఫలితంగా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ సంపద 188 బిలియన్ డాలర్లను తాకింది. టెస్లా ఇంక్‌లో మస్క్‌కు 20 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా మస్క్ ఆవిర్భవించినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా.. ఐఫోన్ల దిగ్గజం యాపిల్, ఇంటర్నెట్ దిగ్గజం అల్ఫాబెట్, ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, ఎంటర్టైన్మెంట్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్, ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ 3.5-1 శాతం మధ్య జంప్‌చేశాయి. దీంతో ఎస్అండ్పీ, నాస్డాక్ భారీగా బలపడినట్లు నిపుణులు తెలియజేశారు. డీఎక్స్‌సీ టెక్నాలజీ కొనుగోలుకి ఫ్రాన్స్ ఐటీ కన్సల్టింగ్ గ్రూప్ అటోస్ ఎస్ఈ 10 బిలియన్ డాలర్ల ఆఫర్‌ను ప్రకటించడంతో డిక్సన్ షేరు 9 శాతం దూసుకెళ్లింది. -
మెటల్స్ మెరుపులు- సెన్సెక్స్ రికార్డ్
ముంబై, సాక్షి: దేశీయంగా కోవిడ్-19 కట్టడికి ఒకేసారి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో స్టాక్ మార్కెట్లలో జోరు కొనసాగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 48,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. వెరసి 9వ రోజూ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 308 పాయింట్లు ఎగసి 48,177 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 114 పాయింట్లు జమ చేసుకుని 14,133 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 48,220 వద్ద, నిఫ్టీ 14,148 వద్ద చరిత్రాత్మక గరిష్టాలను తాకడం విశేషం! (స్ట్ర్రెయిన్ ఎఫెక్ట్- పసిడి, వెండి హైజంప్) పీఎస్‌యూ బ్యాంక్స్ ఓకే ఎన్ఎస్ఈలో దాదాపు అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా మెటల్ 5 శాతం, ఐటీ 2.7 శాతం, ఆటో 1.6 శాతం చొప్పున ఎగశాయి. పీఎస్‌యూ బ్యాంక్స్, ఫార్మా, మీడియా సైతం 1 శాతం స్థాయిలో బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా స్టీల్, హిందాల్కో, ఐషర్, ఓఎన్జీసీ, టీసీఎస్, బీసీసీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, గెయిల్, గ్రాసిమ్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టెక్ మహీంద్రా టాటా మోటార్స్ 8.4-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. బ్లూచిప్స్‌లో కేవలం హీరోమోటో, కొటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, టైటన్, ఏషియన్ పెయింట్స్, పవర్‌గ్రిడ్ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 1.6- 0.5 శాతం మధ్య నీరసించాయి. మెటల్ జూమ్ డెరివేటివ్ స్టాక్స్‌లో చోళమండలం, జిందాల్ స్టీల్, సెయిల్, నాల్కో, వేదాంతా, ఎన్ఎండీసీ, ఐడియా, కమిన్స్, అశోక్ లేలాండ్, భెల్ 7-5 శాతం మధ్య దూసుకెళ్లాయి. అయితే మరోవైపు జీ, జూబిలెంట్ ఫుడ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, బంధన్ బ్యాంక్, ఐబీ హౌసింగ్ 2.6-0.6 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.4 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 2,096 లాభపడగా.. 993 మాత్రమే నష్టాలతో ముగిశాయి. పెట్టుబడులవైపు నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 506 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 69 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 1,136 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 258 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
ఆరో రోజూ ర్యాలీ- 14,000 చేరువలో నిఫ్టీ
ముంబై, సాక్షి: ఈ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు ముందున్న నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు తొలుత తడబడినప్పటికీ చివరికి లాభాలతో నిలిచాయి. వెరసి వరుసగా ఆరు రోజూ ర్యాలీ బాటలో సాగాయి. సెన్సెక్స్ 133 పాయింట్లు పుంజుకుని 47,746కు చేరగా.. నిఫ్టీ 49 పాయింట్లు బలపడి 13,982 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా.. తొలుత 13,865 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరిన నిఫ్టీ చివర్లో 13,997 వరకూ ఎగసింది. వెరసి 14,000 పాయింట్ల మైలురాయికి చేరువలో నిలిచింది. ఇక సెన్సెక్స్ సైతం 47,808-47,358 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నేటితో కలిపి 21 సెషన్లలో 15సార్లు మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకున్న నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు గురువారం డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియనుండటంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ఫార్మా డీలా ఎన్ఎస్ఈలో ప్రధానంగా మెటల్, ఆటో, రియల్టీ 1.3 శాతం చొప్పున పుంజుకోగా.. బ్యాంకింగ్, ఫార్మా 0.2 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో అల్ట్రాటెక్, గ్రాసిమ్, శ్రీ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, ఐషర్, యూపీఎల్, మారుతీ, ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్ 4.5-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే ఇండస్ఇండ్, సన్ ఫార్మా, యాక్సిస్, ఎస్బీఐ, ఎయిర్టెల్, టీసీఎస్, గెయిల్, సిప్లా, ఇన్ఫోసిస్ 1.5-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. సెయిల్ ప్లస్ డెరివేటివ్ స్టాక్స్‌లో సెయిల్, రామ్‌కో సిమెంట్, బాలకృష్ణ, జీఎంఆర్, అంబుజా, కెనరా బ్యాంక్, ఎన్ఎండీసీ, జిందాల్ స్టీల్ 7.5-2.3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఆర్ఈసీ, అదానీ ఎంటర్, పీఎఫ్సీ, పేజ్, బంధన్ బ్యాంక్, ఇండస్ టవర్స్, పీఎన్బీ, భారత్ ఫోర్జ్, సన్ టీవీ 2-1.2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.4 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,671 లాభపడగా.. 1,282 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల జోరు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,349 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,010 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 1,589 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1,387 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
అలుపులేని మార్కెట్లు- రికార్డ్స్ నమోదు
ముంబై, సాక్షి: ఇటీవల రికార్డుల ర్యాలీ చేస్తున్న దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి జోరు చూపాయి. సెన్సెక్స్ 259 పాయింట్లు జంప్‌చేసి 47,613 వద్ద ముగిసింది. నిఫ్టీ 59 పాయింట్లు ఎగసి 13,933 వద్ద నిలిచింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఈ నెలలో ఇప్పటివరకూ 20 ట్రేడింగ్ సెషన్లలో 14సార్లు మార్కెట్లు రికార్డులను నెలకొల్పడం విశేషం! ప్రెసిడెంట్ ట్రంప్ 2.3 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీపై సంతకం చేయడంతో సోమవారం యూఎస్ మార్కెట్లు 0.7 శాతం బలపడ్డాయి. తద్వారా సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. ఇక కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానుండటంతో దేశీయంగానూ సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో మార్కెట్లు నిరవధిక ర్యాలీ చేస్తున్నట్లు వివరించారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 47,714 వద్ద, నిఫ్టీ 13,967 వద్ద చరిత్రాత్మక రికార్డులను అందుకున్నాయి. రియల్టీ డౌన్ ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్, ఐటీ రంగాలు 1.5-0.8 శాతం మధ్య బలపడగా.. మీడియా, మెటల్, ఆటో, ఫార్మా, రియల్టీ 1.5-0.25 శాతం మధ్య బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్, టెక్ మహీంద్రా, యాక్సిస్, ఐసీఐసీఐ, హెచ్‌సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఐటీసీ, గెయిల్ 6-1 శాతం మధ్య లాభపడ్డాయి. బ్లూచిప్స్‌లో హిందాల్కో, నెస్లే, కోల్ ఇండియా, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఆర్ఐఎల్, సిప్లా 2-1 శాతం మధ్య నీరసించాయి. ఐజీఎల్ జూమ్ డెరివేటివ్ స్టాక్స్‌లో ఐజీఎల్, జీఎంఆర్, ఎక్సైడ్, ఎంజీఎల్, పీఎన్బీ, ఎస్కార్ట్స్, శ్రీరామ్ ట్రాన్స్, బంధన్ బ్యాంక్, అపోలో టైర్, నౌకరీ 6-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు జిందాల్ స్టీల్, మ్యాక్స్ ఫైనాన్స్, వేదాంతా, క్యాడిలా హెల్త్, ఎన్ఎండీసీ, మెక్‌డోవెల్, పిరమల్ 3- 1.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో స్మాల్ క్యాప్స్ 0.15 శాతం పుంజుకుంది. ట్రేడైన షేర్లలో 1,559 లాభపడగా.. 1,464 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల జోరు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,589 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 1,387 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం మార్కెట్లకు సెలవుకాగా.. గురువారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1,226 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. డీఐఐలు మాత్రం రూ. 1,898 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 536 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1,327 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
19 సెషన్లలో 13 సార్లు కొత్త రికార్డ్స్
ముంబై, సాక్షి: కోవిడ్-19 భయాల నుంచి బయటపడి రికార్డుల ర్యాలీ చేస్తున్న దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి దూకుడు చూపాయి. సెన్సెక్స్ 380 పాయింట్లు జంప్‌చేసి 47,354కు చేరగా.. నిఫ్టీ 124 పాయింట్లు ఎగసి 13,873 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో వరుసగా నాలుగో రోజూ మార్కెట్లు లాభాల బాటలో కదిలాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 47,407 సమీపంలోనూ, నిఫ్టీ 13,885 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. వెరసి ఈ నెలలో ఇప్పటివరకూ 19 ట్రేడింగ్ సెషన్లలో 13సార్లు మార్కెట్లు రికార్డులను నెలకొల్పడం విశేషం! కొద్ది నెలలుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19కు చెక్ పెట్టేందుకు పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న వార్తలతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు యూఎస్ కాంగ్రెస్ ఆమోదించిన భారీ ప్యాకేజీపై ప్రెసిడెంట్ ట్రంప్ సంతకం చేయడంతో ఇన్వెస్టర్లు హుషారొచ్చినట్లు తెలియజేశారు. దీంతో మార్కెట్లు నిరవధిక ర్యాలీ చేస్తున్నట్లు వివరించారు. ఫార్మా వీక్ ఎన్ఎస్ఈలో ఫార్మా(0.3 శాతం) మినహా అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా రియల్టీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్స్ 2.6 శాతం స్థాయిలో ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, టైటన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, ఎల్అండ్టీ, గెయిల్, ఇండస్ఇండ్, అల్ట్రాటెక్, టాటా స్టీల్, ఐవోసీ, కొటక్ బ్యాంక్, గ్రాసిమ్, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, హెచ్‌ఢీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ 6-1.2 శాతం మధ్య లాభపడ్డాయి. బ్లూచిప్స్‌లో కేవలం హెచ్‌యూఎల్, సన్ ఫార్మా, సిప్లా, శ్రీసిమెంట్, బ్రిటానియా అదికూడా 0.5-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. (14,000 పాయింట్లవైపు నిఫ్టీ పరుగు!) గోద్రెజ్ జూమ్ డెరివేటివ్ స్టాక్స్‌లో సెయిల్, ఐబీ హౌసింగ్, టాటా పవర్, ఆర్బీఎల్ బ్యాంక్, గోద్రెజ్ ప్రాపర్టీస్, మదర్సన్, నాల్కో, బెల్, ఎల్అండ్టీ ఫైనాన్స్, కెనరా బ్యాంక్, యూబీఎల్, జిందాల్ స్టీల్, పీఎన్బీ, ఫెడరల్ బ్యాంక్ 7.5-3.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు బయోకాన్ 3.5 శాతం పతనంకాగా.. ఎస్కార్ట్స్, ఇండస్ టవర్, అపోలో హాస్పిటల్, కమిన్స్, అమరరాజా, ఎంఆర్ఎఫ్, క్యాడిలా హెల్త్ 1.2-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1-1.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 2,021 లాభపడగా.. 997 మాత్రమే నష్టాలతో నిలిచాయి. ఎఫ్‌పీఐల జోరు శుక్రవారం మార్కెట్లకు సెలవుకాగా.. నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 1,226 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దేశీ ఫండ్స్(డీఐఐలు) మాత్రం రూ. 1,898 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 536 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1,327 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
నాలుగో రోజూ- రికార్డులతో షురూ
ముంబై, సాక్షి: క్రిస్మస్ సందర్భంగా వారాంతాన దేశీ స్టాక్ మార్కెట్లకు సెలవుకాగా.. వరుసగా నాలుగో రోజు హుషారుగా ప్రారంభమయ్యాయి. వెరసి ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 47,354ను అధిగమించడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం సెన్సెక్స్ 284 పాయింట్లు జంప్‌చేసి 47,258కు చేరగా.. ఈ బాటలో నిఫ్టీ సైతం తొలుత 13,865 పాయింట్ల వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని చేరింది. ప్రస్తుతం 90 పాయింట్లు ఎగసి 13,839 వద్ద ట్రేడవుతోంది. కొద్ది నెలలుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19కు చెక్ పెట్టేందుకు పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న వార్తలతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. అన్ని రంగాలూ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా రియల్టీ, మెటల్, బ్యాంకింగ్, ఆటో 3-1 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ, ఎస్బీఐ లైఫ్, టాటా స్టీల్, ఇండస్ఇండ్, గెయిల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, యాక్సిస్, ఐసీఐసీఐ, హెచ్‌ఢీఎఫ్‌సీ బ్యాంక్ 4-1 శాతం మధ్య లాభపడ్డాయి. బ్లూచిప్స్‌లో కేవలం ఏషియన్ పెయింట్స్, టీసీఎస్ అదికూడా 0.2 శాతం చొప్పున బలహీనపడ్డాయి. (14,000 పాయింట్లవైపు నిఫ్టీ పరుగు!) గోద్రెజ్ జూమ్ డెరివేటి స్టాక్స్‌లో గోద్రెజ్ ప్రాపర్టీస్, పీవీఆర్, డీఎల్ఎఫ్, ఇండిగో, ఫెడరల్ బ్యాంక్, మదర్సన్, శ్రీరామ్ ట్రాన్స్, చోళమండలం, ఐబీ హౌసింగ్, జిందాల్ స్టీల్, అపోలో టైర్, ఎంఅండ్ఎం ఫైనాన్స్ 4.3-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు వేదాంతా, బయోకాన్, ఇండస్ టవర్, జూబిలెంట్ ఫుడ్, అంబుజా, అపోలో హాస్పిటల్, ఏసీసీ 1.3-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ దాదాపు 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,697 లాభపడగా.. 586 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్‌పీఐల పెట్టుబడులు శుక్రవారం మార్కెట్లకు సెలవుకాగా.. నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 1,226 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దేశీ ఫండ్స్(డీఐఐలు) మాత్రం రూ. 1,898 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 536 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1,327 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
ఐటీ షేర్ల దూకుడు- సరికొత్త రికార్డ్స్
ముంబై, సాక్షి: వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నాయి. తొలుత కొంతమేర ఊగిసలాటకు లోనైనప్పటికీ ప్రస్తుతం సెన్సెక్స్ 311 పాయింట్లు జంప్‌చేసింది. 46,318కు చేరింది. నిఫ్టీ సైతం 91 పాయింట్లు ఎగసి 13,557 వద్ద ట్రేడవుతోంది. కాగా.. కోవిడ్-19 నేపథ్యంలోనూ సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం యాక్సెంచర్ పటిష్ట ఫలితాలు సాధించడంతో దేశీ ఐటీ కౌంటర్లకు డిమాండ్ కొనసాగుతోంది. యాక్సెంచర్ అంచనాలను మించిన గైడెన్స్ ప్రకటించడంతో ఐటీ రంగానికి డిమాండ్ పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీనికితోడు విప్రో తాజాగా జర్మన్ దిగ్గజం మెట్రో ఏజీ నుంచి 70 కోట్ల డాలర్ల డీల్‌ను కుదుర్చుకోవడం, రూ. 9,500 కోట్లతో ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను చేపట్టనుండటం వంటి అంశాలు జత కలిసినట్లు పేర్కొన్నారు. దీంతో ఇన్వెస్టర్లు ఐటీ కౌంటర్లలో కనుగోళ్లకు ఎగబడుతున్నట్లు తెలియజేశారు. ఫలితంగా అటు బీఎస్ఈలోనూ, ఇటు ఎన్ఎస్ఈలోనూ ఐటీ ఇండెక్సులు తాజాగా సరికొత్త గరిష్టాలను చేరాయి. అంతేకాకుండా ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్‌తోపాటు.. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, ఎంఫసిస్ చరిత్రాత్మక గరిష్టాలను తాకాయి. వివరాలు చూద్దాం.. (ఐటీ రికార్డ్- మళ్లీ 46,000కు సెన్సెక్స్) రికార్డుల బాట ఎన్ఎస్ఈలో ఐటీ ఇండెక్స్ 24,162ను అధిగమించగా.. బీఎస్ఈలో 24,174కు చేరింది. సాఫ్ట్వేర్ సేవల కంపెనీలలో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, ఎంఫసిస్, బిర్లా సాఫ్ట్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ సరికొత్త గరిష్టాలకు చేరాయి. ఇంట్రాడేలో టీసీఎస్ రూ. 2,919 వద్ద, ఇన్ఫోసిస్ రూ. 1255 సమీపంలో, టెక్ మహీంద్రా రూ. 960 సమీపంలో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రూ. 933 సమీపంలో సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. ఈ బాటలో ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ రూ. 3,685 సమీపంలో, ఎంఫసిస్ రూ. 1,533 వద్ద, బిర్లాసాఫ్ట్ రూ. 265 సమీపంలో, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ రూ. 1,459 వద్ద చరిత్రాత్మక గరిష్టాల రికార్డులను సాధించాయి. (యూనికార్న్‌కు చేరిన డైలీహంట్ స్టార్టప్) లాభాల్లో ఇతర కౌంటర్లలో బీఎస్ఈలో రామ్‌కో సిస్టమ్స్, ఈక్లెర్క్స్, హెచ్జీఎస్, ఫస్ట్‌సోర్స్, మాస్టెక్, టాటా ఎలక్సీ, ఎన్ఐఐటీ లిమిటెడ్, మైండ్‌ట్రీ, ట్రైజిన్, ఇంటెలెక్ట్ డిజైన్, శాస్కెన్ టెక్నాలజీస్, సొనాటా సాఫ్ట్వేర్ తదితరాలు 8-3.5 శాతం మధ్య జంప్ చేయడం విశేషం! -
ఐటీ రికార్డ్- మళ్లీ 46,000కు సెన్సెక్స్
ముంబై, సాక్షి: దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ సాధించాయి. ముందు రోజు నమోదైన భారీ పతనం నుంచి బంతిలా పైకెగశాయి. వెరసి సెన్సెక్స్ మళ్లీ 46,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. చివర్లో ఊపందుకున్న కొనుగోళ్లతో సెన్సెక్స్ 453 పాయింట్లు జంప్‌చేసి 46,007 వద్ద ముగిసింది. నిఫ్టీ 138 పాయింట్లు ఎగసి 13,466 వద్ద నిలిచింది. రూపు మార్చుకుని యూరోపియన్ దేశాలలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్ కారణంగా సోమవారం సెన్సెక్స్ 1400 పాయింట్లకుపైగా పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే నేటి ట్రేడింగ్‌లోనూ తొలి రెండు సెషన్లలో మార్కెట్లు ఆటుపోట్లను చవిచూశాయి. సెన్సెక్స్ 46,080- 45,112 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 13,492-13,193 పాయింట్ల మధ్య ఊగిసలాటకు లోనైంది. (దిగివచ్చిన పసిడి, వెండి ధరలు) అన్ని రంగాలూ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా ఐటీ 3.4 శాతం ఎగసింది. 23,681 వద్ద ఐటీ ఇండెక్స్ సరికొత్త గరిష్టానికి చేరింది. ఈ బాటలో ఫార్మా, మెటల్, ఆటో, బ్యాంకింగ్ 2.3-1 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, గెయిల్,విప్రో, పవర్‌గ్రిడ్, సన్ ఫార్మా, ఎల్అండ్టీ, నెస్లే, సిప్లా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, దివీస్, ఐషర్, ఏషియన్ పెయింట్స్ 5.5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. బ్లూచిప్స్‌లో కేవలం కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్, ఇండస్ఇండ్, ఆర్ఐఎల్, హిందాల్కో 1-0.2 శాతం మధ్య డీలాపడ్డాయి. (అందరికీ వ్యాక్సిన్లు కష్టతరమే!) కోఫోర్జ్ జోరు డెరివేటి స్టాక్స్‌లో కోఫోర్జ్, మైండ్‌ట్రీ, అదానీ ఎంటర్, ఐజీఎల్, బంధన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సన్ టీవీ, ఇండిగో, వేదాంతా, టాటా పవర్, సెయిల్, క్యాడిలా, టాటా కెమ్ 7.5-3.4 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోపక్క పీవీఆర్, శ్రీరామ్ ట్రాన్స్, పీఎన్బీ, భారత్ ఫోర్జ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఎస్కార్ట్స్, ఎల్ఐసీ హౌసింగ్, అపోలో టైర్, ఎంఅండ్ఎం ఫైనాన్స్ 6-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,568 లాభపడగా.. 1,352 నష్టాలతో నిలిచాయి. ఎఫ్‌పీఐల వెనకడుగు నగదు విభాగంలో ఇటీవల పెట్టుబడులకే కట్టుబడుతున్నవిదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) సోమవారం దాదాపు రూ. 324 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. అయితే దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 486 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. కాగా.. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 2,721 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,425 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
47,000 దాటేసింది- వెనకడుగు వేస్తోంది
ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా సరికొత్త రికార్డులతో దూసుకెళుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు తాజాగా కన్సాలిడేషన్ బాట పట్టాయి. స్వల్ప ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 126 పాయింట్లు క్షీణించి 46,764కు చేరింది. నిఫ్టీ సైతం 36 పాయింట్లు క్షీణించి 13,705 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 47,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. 47,026 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. అయితే తదుపరి అమ్మకాలు తలెత్తడంతో 46,744 వద్ద కనిష్టానికీ చేరింది. ఇక నిఫ్టీ 13,771-13,693 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. ఆర్థిక రికవరీ అంచనాలు, ఈక్విటీలలో ఎఫ్‌పీఐల నిరవధిక పెట్టుబడుల కారణంగా ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లు రికార్డుల ర్యాలీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. గురువారం యూఎస్ స్టాక్ ఇండెక్సులు చరిత్రాత్మక గరిష్టాల వద్ద ముగిశాయి. నాస్డాక్ వరుసగా మూడో రోజు సరికొత్త గరిష్టంవద్ద నిలవడం గమనార్హం. (బెక్టర్స్ ఫుడ్ ఐపీవో- వెల్లువెత్తిన బిడ్స్) ఐటీ అప్ ఎన్ఎస్ఈలో ఐటీ ఇండెక్స్ దాదాపు 2 శాతం జంప్‌చేగా.. ఎఫ్ఎంసీజీ 0.15 శాతం పుంజుకుంది. రియల్టీ, ప్రయివేట్, పబ్లిక్ బ్యాంక్స్, మెటల్, మీడియా 0.8-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, టీసీఎస్, యూపీఎల్, బజాజ్ ఆటో, ఎల్అండ్టీ, డాక్టర్ రెడ్డీస్, హీరో మోటో 2,7-0.8 శాతం మధ్య ఎగశాయి. అయితే హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, కొటక్ బ్యాంక్, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇండస్ఇండ్, బజాజ్ ఫైనాన్స్, ఐషర్ 1.4-0.7 శాతం మధ్య నీరసించాయి. కోఫోర్జ్ ప్లస్ డెరివేటివ్స్‌లో కోఫోర్జ్, మైండ్‌ట్రీ, నౌకరీ, పిడిలైట్, కాల్గేట్ పామోలివ్ 4.25-1.2 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోవైపు శ్రీరామ్ ట్రాన్స్, సన్ టీవీ, ఇండస్ టవర్, ఆర్ఈసీ, సెయిల్, అశోక్ లేలాండ్ 2-1 శాతం క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున డీలాపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,435 నష్టపోగా.. 699 లాభాలతో ట్రేడవుతున్నాయి. ఎఫ్‌ఫీఐల జోరు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,355 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,494 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 1,982 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1,718 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
46,000 దాటేసిన సెన్సెక్స్‌ప్రెస్
ముంబై, సాక్షి: రికార్డుల సాధనే లక్ష్యంగా దేశీ స్టాక్ మార్కెట్లు చెలరేగుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో మరోసారి సరికొత్త రికార్డులకు తెరతీశాయి. సెన్సెక్స్ 495 పాయింట్లు జంప్‌చేసి 46,103 వద్ద ముగిసింది. వెరసి మార్కెట్ చరిత్రలో తొలిసారి 46,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 136 పాయింట్లు జమ చేసుకుని 13,529 వద్ద స్థిరపడింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నవార్తలతో మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం రికార్డ్ గరిష్టాల వద్ద ముగిశాయి. దీంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించినట్లు స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. ఆర్థిక రికవరీపై అంచనాలు, కోవిడ్-19 వ్యాక్సిన్లపై ఆశలు దేశీయంగా సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు తెలియజేశారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 46,164 వద్ద, నిఫ్టీ 13,549 వద్ద కొత్త రికార్డులను సాధించాయి. చదవండి: (బ్యాంకింగ్: డిజిటల్ సేవల్లో సవాళ్లేంటి?) మీడియా స్పీడ్.. ఎన్ఎస్ఈలో ప్రధానంగా మీడియా, ప్రయివేట్ రంగ బ్యాంక్స్, రియల్టీ, ఐటీ, ఎఫ్ఎంసీజీ 4-1 శాతం మధ్య ఎగశాయి. అయితే పీఎస్‌యూ బ్యాంక్స్, మెటల్ 1-0.5 శాతం చొప్పున డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్, ఐవోసీ, ఏషియన్ పెయింట్స్, కొటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్, ఐటీసీ, ఆర్ఐఎల్, ఐటీసీ, హెచ్‌యూఎల్ 4.7-1.3 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే హిందాల్కో, అల్ట్రాటెక్, శ్రీసిమెంట్, విప్రో, గ్రాసిమ్, టాటా స్టీల్, మారుతీ, ఎస్బీఐ, బజాజ్ ఆటో, సిప్లా 1.5-0.4 శాతం మధ్య డీలాపడ్డాయి. చదవండి: (వ్యాక్సిన్ షాక్- పసిడి ధరల పతనం) సిమెంట్ వీక్ డెరివేటివ్స్‌లో పీవీఆర్, ఆర్ఈసీ, కమిన్స్, ఐడిఎఫ్సీ ఫస్ట్, జీఎంఆర్, ఐడియా, సన్ టీవీ, బీఈఎల్ డీఎల్ఎఫ్ 7.5-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు కెనరా బ్యాంక్, పీఎన్బీ, టీవీఎస్ మోటార్, సెయిల్, జూబిలెండ్ ఫుడ్, అపోలో టైర్, ఏసీసీ, రామ్‌కో సిమెంట్, అంబుజా, పెట్రోనెట్ 6.6- 1.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,767 లాభపడగా.. 1,200 నష్టాలతో నిలిచాయి. ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,910 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,641 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 3,792 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,767 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
రికార్డులే హద్దుగా.. మార్కెట్లు షురూ
ముంబై, సాక్షి: రికార్డుల సాధనే లక్ష్యంగా దేశీ స్టాక్ మార్కెట్లు చెలరేగుతున్నాయి. దీంతో మరోసారి చరిత్రాత్మక గరిష్టాల వద్ద ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 284 పాయింట్లు ఎగసి 45,893కు చేరింది. నిఫ్టీ సైతం 80 పాయింట్లు బలపడి 13,473 వద్ద ట్రేడవుతోంది. కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నవార్తలతో మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం రికార్డ్ గరిష్టాల వద్ద ముగిశాయి. దీంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించినట్లు స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 45,926ను తాకింది. ఈ బాటలో నిఫ్టీ 13,484కు చేరింది. ఇవి సరికొత్త గరిష్టాలుకాగా.. ఆర్థిక రికవరీపై అంచనాలు, కోవిడ్-19 వ్యాక్సిన్లపై ఆశలు దేశీయంగా సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు ఈ సందర్భంగా మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. జోరుగా.. ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా మీడియా పీఎస్‌యూ బ్యాంక్స్, ఫార్మా, ఐటీ, రియల్టీ 2-1 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో సన్ ఫార్మా, యూపీఎల్, హెచ్‌సీఎల్ టెక్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, గెయిల్, ఏషియన్ పెయింట్స్, దివీస్ ల్యాబ్స్, టీసీఎస్ 2.25-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే హెచ్డీఎఫ్సీ లైఫ్, మారుతీ, ఐషర్, శ్రీసిమెంట్, టైటన్, అల్ట్రాటెక్, బ్రిటానియా, బజాజ్ ఆటో మాత్రమే అదికూడా 0.5-0.2 శాతం మధ్య డీలాపడ్డాయి. పీఎస్‌యూ షేర్లు అప్ డెరివేటివ్స్‌లో బీఈఎల్ 7 శాతం దూసుకెళ్లగా.. ఆర్ఈసీ, భెల్, జీఎంఆర్, పీఎన్బీ, జీ, పీవీఆర్, బీవోబీ, పీఎఫ్సీ, గ్లెన్‌మార్క్ 4.2-2.2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు రామ్‌కో సిమెంట్, అపోలో టైర్, ఏసీసీ, అంబుజా, బంధన్ బ్యాంక్, ఎక్సైడ్ 1- 0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,532 లాభపడగా.. 681 నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,910 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,641 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 3,792 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,767 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
ఈ షేర్లు- రేస్ గుర్రాలు
ముంబై, సాక్షి: ఓవైపు దేశీ స్టాక్ మార్కెట్లు రికార్డుల ర్యాలీ చేస్తుంటే.. మరోవైపు సానుకూల వార్తల నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన కౌంటర్లు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. వెరసి నేటి ట్రేడింగ్‌లో కొన్ని కంపెనీల షేర్లు సరికొత్త గరిష్టాలను తాకాయి. జాబితాలో అల్ట్రాటెక్, గుడ్ఇయర్ ఇండియా, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. మార్కెట్ క్యాప్ సిమెంట్ రంగ దిగ్గజం అల్ట్రాటెక్ షేరు ఎన్ఎస్ఈలో 3 శాతం ఎగసి రూ. 5.211 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 5,237 వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 1.5 లక్షల కోట్లను తాకడం విశేషం. ఇటీవల 12.8 ఎంటీపీఏ ప్లాంటు ఏర్పాటుకు బోర్డు అనుమతించింది. ఇందుకు రూ. 5,477 కోట్లు వెచ్చించనుంది. దీంతో కంపెనీ మొత్తం సిమెంట్ తయారీ సామర్థ్యం 136.25 ఎంటీపీఏకు చేరనుంది. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో రెసిడెన్షియల్ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించడంతో గోద్రెజ్ ప్రాపర్టీస్ షేరు 4 శాతం లాభపడి రూ. 1,255 వద్ద ముగిసింది. తొలుత రూ. 1262 వద్ద లైఫ్‌టైమ్ గరిష్టానికి చేరింది. 18 ఎకరాలలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు కంపెనీ తెలియజేసింది. చదవండి: (పసిడి, వెండి- 2 వారాల గరిష్టం) డీమార్ట్ జోరు వాటాదారులకు షేరుకి రూ. 80 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించడంతో గుడ్ఇయర్ ఇండియా షేరు ఎన్ఎస్ఈలో తొలుత 18 శాతం దూసుకెళ్లింది. రూ. 1,179 సమీపంలో సరికొత్త గరిష్టాన్ని చేరింది. చివరికి 16 శాతం లాభపడి రూ. 1,157 వద్ద ముగిసింది. డివిడెండ్ చెల్లింపునకు ఈ నెల 17 రికార్డ్‌డేట్‌గా పేర్కొంది. గత 7 రోజుల్లో ఈ షేరు 41 శాతం పెరిగింది! ఇక డీమార్ట్ స్టోర్ల కంపెనీ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ షేరు ఎన్ఎస్ఈలో 6 శాతం బలపడి రూ. 2,678 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో రూ. 2,689 వద్ద రికార్డ్ గరిష్టాన్ని తాకింది. గత 6 రోజుల్లో ఈ షేరు 16 శాతం ర్యాలీ చేసింది. కోవిడ్-19 లాక్‌డవున్‌ల తదుపరి తిరిగి బిజినెస్ జోరందుకోవడంతో ఈ కౌంటర్‌కు డిమాండ్ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. -
లాభాలతో షురూ- కొత్త గరిష్టాలకు మార్కెట్లు
ముంబై, సాక్షి: దేశీ స్టాక్ మార్కెట్ల స్పీడ్ కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 238 పాయింట్లు జంప్‌చేసి 45,665కు చేరింది. నిఫ్టీ సైతం 62 పాయింట్లు పెరిగి 13,418 వద్ద ట్రేడవుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 45,675 వద్ద, నిఫ్టీ 13,426 వద్ద సరికొత్త గరిష్టాలను తాకాయి! ఆర్థిక రికవరీపై అంచనాలు, కోవిడ్-19 వ్యాక్సిన్లపై ఆశలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు ఈ సందర్భంగా మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. మెటల్ వీక్ ఎన్ఎస్ఈలో మెటల్(0.3 శాతం) మినహా అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్, రియల్టీ, ఆటో 1.3 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో మారుతీ, యూపీఎల్, అల్ట్రాటెక్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ, గెయిల్, ఎంఅండ్ఎం, హెచ్‌సీఎల్ టెక్, ఆర్ఐఎల్ 2.6-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్, గ్రాసిమ్, ఐవోసీ, ఐసీఐసీఐ 1.3-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఫైనాన్స్ జోష్ డెరివేటివ్స్‌లో కెనరా బ్యాంక్, పీఎన్బీ, బీవోబీ, ఎక్సైడ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, యూబీఎల్, ఐడియా 7.4-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు లుపిన్, జిందాల్ స్టీల్, మ్యాక్స్ ఫైనాన్స్, శ్రీరామ్ ట్రాన్స్, ఆర్బీఎల్ బ్యాంక్ 1-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,566 లాభపడగా.. 621 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,792 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,767 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 2,970 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1,972 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదితమే. -
ప్యాకేజీ ఆశలు- యూఎస్ మార్కెట్ల రికార్డ్స్
న్యూయార్క్: కొత్త ప్రెసిడెంట్‌గా జనవరిలో బాధ్యతలు స్వీకరించనున్న జో బైడెన్ ప్రభుత్వం సహాయక ప్యాకేజీకి తెరతీయనుందన్నఅంచనాలు వారాంతాన అమెరికా స్టాక్ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. ఇన్వెస్టర్లు ప్రధానంగా ఎయిర్‌లైన్స్, క్రూయిజర్, ఇంధన రంగ కౌంటర్లలో కొనుగోళ్లకు ఎగబడటంతో శుక్రవారం మార్కెట్లు సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. డోజోన్స్ 249 పాయింట్లు(0.85 శాతం) ఎగసి 30,218 వద్ద నిలిచింది. ఎస్అండ్పీ 32 పాయింట్లు(0.9 శాతం) లాభపడి 3,699 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 87 పాయింట్లు(0.7 శాతం) బలపడి 12,464 వద్ద స్థిరపడింది. ఎనర్జీ, మెటీరియల్స్, ఇండస్ట్రియల్స్ రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభించినట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. ఉపాధి వీక్ నవంబర్‌లో వ్యవసాయేతర రంగంలో 2.45 లక్షల మందికి మాత్రమే ఉపాధి లభించినట్లు కార్మిక శాఖ గణాంకాలు వెల్లడించాయి. గత ఆరు నెలల్లో ఇది కనిష్టంకాగా.. 4.69 లక్షల మందికి ఉపాధి లభించగలదని విశ్లేషకులు వేసిన అంచనాలకు దెబ్బ తగిలింది. అక్టోబర్‌లో 6.1 లక్షల ఉద్యోగాల కల్పన జరగడం గమనార్హం! గత నెలలో ఉపాధి క్షీణించడానికితోడు.. సెకండ్‌వేవ్‌లో కేసులు పెరగడం, శీతల సమస్యల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించనున్నట్లు కొత్త ప్రెసిడెంట్‌గా ఎంపికైన జో బైడెన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. దీంతో జీడీపీకి దన్నుగా కాంగ్రెస్ సాధ్యమైనంత త్వరగా సహాయక ప్యాకేజీని ఆమోదించవలసి ఉన్నట్లు డిమాండ్ చేశారు. ఉద్యోగ గణాంకాలు నిరాశపరచినప్పటికీ బైడెన్ వ్యాఖ్యలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. 5.4 శాతం అప్ ఇటీవల చమురు ధరలు బలపడుతుండటంతో ఎనర్జీ రంగం 5.4 శాతం ఎగసింది. డైమండ్‌బ్యాక్ ఎనర్జీ, ఆక్సిడెంటల్ పెట్రోలియం 13 శాతం చొప్పున దూసుకెళ్లాయి. షెవ్రాన్ కార్పొరేషన్ 4 శాతం పుంజుకోగా.. 787 డ్రీమ్‌లైనర్ విమానాల తయారీని తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో బోయింగ్ ఇంక్ 2 శాతం క్షీణించింది. ఇతర కౌంటర్లలో నార్వేజియన్ క్రూయిజ్ 3.3 శాతం, అమెరికన్ ఎయిర్‌లైన్స్ 2 శాతం చొప్పున లాభపడ్డాయి. -
కొత్త రికార్డులతో మార్కెట్లు షురూ
ముంబై, సాక్షి: కరోనా వైరస్ కట్టడికి ఫైజర్ వ్యాక్సిన్‌ను యూకే ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్ వచ్చింది. దీంతో హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 137 పాయింట్లు పెరిగి 44,755కు చేరగా.. నిఫ్టీ 50 పాయింట్లు జమ చేసుకుని 13,163 వద్ద ట్రేడవుతోంది. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,953వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. తద్వారా 45,000 పాయింట్ల మార్క్‌కు చేరువైంది. ఇక నిఫ్టీ 13,216ను అధిగమించడం ఇంట్రాడే గరిష్టం రికార్డును సాధించింది. ఈ ఏడాది క్యూ3లో దేశ ఆర్థిక వ్యవస్థ రికవర్‌కానున్న అంచనాలు సైతం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. మీడియా, మెటల్స్ అప్ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్స్ 2-1.2 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో మారుతీ, గెయిల్, హిందాల్కో, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హీరో మోటో, ఎస్బీఐ 3-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఎస్బీఐ లైఫ్, ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, యాక్సిస్, గ్రాసిమ్, అల్ట్రాటెక్, యూపీఎల్, ఐటీసీ, టీసీఎస్, బజాజ్ ఆటో 1.3-0.4 శాతం మధ్య నీరసించాయి. ఎఫ్‌అండ్‌వోలో డెరివేటివ్స్‌లో టాటా కెమ్, జీ, ఐబీ హౌసింగ్, భారత్ ఫోర్జ్, కోఫోర్జ్, సెయిల్, శ్రీరామ్ ట్రాన్స్, మదర్సన్ 4-2.6 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే అదానీ ఎంటర్, గోద్రెజ్ సీపీ, బాష్ 1 స్థాయిలో డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.7 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 357 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,636 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 3,242 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. అయితే డీఐఐలు రూ. 1,043 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
డోజోన్స్ కొత్త రికార్డ్- ఎందుకీ స్పీడ్?
న్యూయార్క్, సాక్షి: మంగళవారం యూఎస్ స్టాక్ మార్కెట్లలో మరో కొత్త రికార్డ్ నమోదైంది. డోజోన్స్ 455 పాయింట్లు(1.55 శాతం) ఎగసి 30,046 వద్ద ముగిసింది. తద్వారా మార్కెట్ చరిత్రలో తొలిసారి 30,000 పాయింట్ల మైలురాయిని అందుకుంది. ఈ బాటలో ఎస్అండ్పీ 58 పాయింట్లు(1.6 శాతం) పురోగమించి 3,635 వద్ద నిలవగా.. నాస్డాక్ 156 పాయింట్లు(1.3 శాతం) బలపడి 12,037 వద్ద స్థిరపడింది. కాగా.. ఈ నెలలో ఇప్పటివరకూ డోజోన్స్ 13 శాతం దూసుకెళ్లింది. ఇంతక్రితం 1987 నవంబర్‌లో మాత్రమే ఈ స్థాయి లాభాలు ఆర్జించగా.. ఎస్అండ్పీ 11 శాతం, నాస్డాక్ 10.3 శాతం చొప్పున ర్యాలీ చేశాయి. తద్వారా ఈ ఏడాది ఏప్రిల్ తదుపరి గరిష్టంగా లాభపడ్డాయి. బ్లూచిప్స్ అండ మంగళవారం డోజోన్స్‌కు బలాన్నిచ్చిన కౌంటర్లలో షెవ్రాన్ 5 శాతం, జేపీ మోర్గాన్ చేజ్ 4.6 శాతం, గోల్డ్‌మన్ శాక్స్ 3.8 శాతం చొప్పున జంప్ చేశాయి. మార్కెట్లకు ప్రోత్సాహాన్నిచ్చిన ఇతర కౌంటర్లలో టెస్లా ఇంక్ 6.5 శాతం దూసుకెళ్లగా.. ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, గూగుల్, నెట్‌ఫ్లిక్స్, యాపిల్ 3-1 శాతం మధ్య ఎగశాయి. కాగా.. ఫార్మా దిగ్గజాలలో మోడర్నా ఇంక్ 2.5 శాతం, ఆస్ట్రాజెనెకా 2 శాతం చొప్పున క్షీణించాయి. జోరు ఎందుకంటే? ఇటీవల ఫార్మా దిగ్గజాలు ఫైజర్, మోడర్నా ఇంక్ కోవిడ్-19 కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్లు 95 శాతం ఫలితాలనిచ్చినట్లు వెల్లడించడంతో సెంటిమెంటు బలపడింది. ఈ బాటలో బ్రిటిష్ కంపెనీ ఆస్ట్రాజెనెకా సైతం ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్‌ను విడుదల చేయగలమని భావిస్తున్నట్లు పేర్కొంది. ఇక మరోవైపు యూఎస్ కొత్త ప్రెసిడెంట్‌గా జో బైడెన్ బాధ్యతలు చేపట్టేందుకు అడ్డంకులు తొలగిపోవడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. రాజకీయ అనిశ్చితులకు చెక్ పడటం ఇందుకు సహకరించింది. గతంలో కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్‌కు చైర్‌పర్సన్‌గా పనిచేసిన జానెట్ యెలెన్‌ను ఆర్థిక మంత్రిగా బైడెన్ ఎంపిక చేసుకునే వీలున్నట్లు వెలువడిన వార్తలు ఈ సానుకూల అంశాలకు జత కలసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మార్కెట్ల ఫ్రెండ్లీగా వ్యవహరించే యెలెన్ వడ్డీ రేట్లను నేలకు దించడం ద్వారా ఆర్థిక రికవరీకి పాటుపడినట్లు తెలియజేశారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి ప్రభుత్వం భారీ సహాయక ప్యాకేజీకి రూపకల్పన చేసే అవకాశమున్నట్లు అంచనాలు బలపడ్డాయి. వెరసి మార్కెట్లు సరికొత్త రికార్డుల బాటలో పరుగు తీస్తున్నట్లు నిపుణులు వివరించారు. -
రికార్డ్స్ రికార్డ్స్- తొలిసారి 13,000కు నిఫ్టీ
ముంబై, సాక్షి: కరోనా వైరస్ కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న వార్తలు ఇన్వెస్టర్లకు జోష్‌నిస్తున్నాయి. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లలో రికార్డుల ర్యాలీ కొనసాగుతోంది. వెరసి నిఫ్టీ.. మార్కెట్ చరిత్రలో తొలిసారి 13,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఇక సెన్సెక్స్ సైతం ట్రేడింగ్ ప్రారంభంలోనే 44,421 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ 320 పాయింట్లు ఎగసి 44,397 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 95 పాయింట్లు పెరిగి 13,021 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో నిఫ్టీ 13,027 వరకూ జంప్‌చేసింది. కోవిడ్-19 కట్టడికి ఈ ఏడాది చివరికల్లా ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకాసహా పలు కంపెనీలు వ్యాక్సిన్లను విడుదల చేయనున్న వార్తలు సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. బ్యాంక్స్ భేష్ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో, మెటల్, రియల్టీ 1 శాతం స్థాయిలో వృద్ధి చూపాయి. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్, మారుతీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్, ఐసీఐసీఐ, పవర్‌గ్రిడ్, ఓఎన్జీసీ, ఐటీసీ, ఎల్అండ్టీ, ఏషియన్ పెయింట్స్ 3.2-1.2 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్‌లో కేవలం హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ, సన్ ఫార్మా అదికూడా 0.5-0.2 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఇన్ఫ్రాటెల్ జూమ్ డెరివేటివ్ కౌంటర్లలో ఇన్ఫ్రాటెల్ 8 శాతం జంప్‌చేయగా.. మైండ్‌ట్రీ, జీఎంఆర్, ఆర్బీఎల్ బ్యాంక్, ఎస్ఆర్ఎఫ్, అపోలో టైర్, ఐడియా, టాటా కెమికల్స్ 3-2 శాతం మధ్య బలపడ్డ్డాయి. అయితే మరోపక్క ముత్తూట్ ఫైనాన్స్, ఐడీఎఫ్సీ ఫస్ట్, బీహెచ్ఈఎల్, టీవీఎస్ మోటార్, యూబీఎల్, కేడిలా హెల్త్, ఎన్ఎండీసీ, సన్ టీవీ 1-0.4 శాతం మధ్య డీలా పడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.8 శాతం చొప్పున ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,255 లాభపడగా.. 526 నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4,738 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,944 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 3,861 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,869 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
మార్కెట్లు: రికార్డులే రికార్డులు
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లలో దీపావళి సందడి కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతుండటంతో ఇండెక్సులు నిరవధికంగా పరుగు తీస్తున్నాయి. వెరసి రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. తాజాగా సెన్సెక్స్ 315 పాయింట్లు ఎగసి 43,953 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 94 పాయింట్లు పుంజుకుని 12,874 వద్ద నిలిచింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఇంట్రాడేలో తొలిసారి సెన్సెక్స్ 44,000 పాయింట్ల మార్క్‌ను అందుకుంది. నిఫ్టీ సైతం 13,000 పాయింట్ల మార్క్ సమీపానికి అంటే 12,934కు చేరింది. ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్ ఆశలు రేపగా.. తాజాగా మోడర్నా ఇంక్ సైతం వ్యాక్సిన్ విజయవంతమైనట్లు పేర్కొంది. దీంతో సోమవారం యూఎస్ మార్కెట్లు సరికొత్త గరిష్టాల వద్ద నిలవగా.. దేశీయంగానూ ఇన్వెస్టర్లకు జోష్ వచ్చినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఆటో సైతం ఎన్ఎస్ఈలో ప్రధానంగా మెటల్, బ్యాంకింగ్, రియల్టీ రంగాలు 2.5-2 శాతం లాభపడగా.. ఆటో 1 శాతం బలపడింది. మీడియా, ఫార్మా, ఐటీ 1.3-0.3 శాతం మధ్య డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్, ఎల్అండ్టీ 6.2- 2.4 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే బీపీసీఎల్, హీరో మోటో, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌యూఎల్ 4.3-0.6 శాతం మధ్య క్షీణించాయి. చదవండి: (వ్యాక్సిన్ ఆశలు- యూఎస్ కొత్త రికార్డ్స్) చిన్న షేర్లు అప్ డెరివేటివ్ కౌంటర్లలో అదానీ ఎంటర్, జిందాల్ స్టీల్, అపోలో టైర్, నాల్కో, ఐసీఐసీఐ ప్రు, ఎంఆర్ఎఫ్, పేజ్, అంబుజా, టాటా పవర్ 6-3.4 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. మరోపక్క పిరమల్, టొరంట్ ఫార్మా, సన్ టీవీ, ఐబీ హౌసింగ్, లుపిన్, బాష్, ముత్తూట్ 3.2- 1.8 శాతం మధ్య నీరసించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,564 లాభపడగా.. 1,254 నష్టపోయాయి. చదవండి: (జుకర్‌బర్గ్‌ను దాటేసిన ఎలన్ మస్క్?) అమ్మకాలవైపు నగదు విభాగంలో శనివారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 78.5 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 20.3 కోట్లు కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 1,936 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,462 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. కాగా.. ఈ నెలలో 2-13 మధ్య కాలంలో ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్‌లో నికరంగా రూ. 29,436 కోట్లను ఇన్వెస్ట్ చేయడం విశేషం! -
వ్యాక్సిన్ ఆశలు- యూఎస్ కొత్త రికార్డ్స్
న్యూయార్క్: కోవిడ్-19 సెకండ్ వేవ్‌తో వణుకుతున్న ప్రపంచ దేశాలకు తాజాగా మోడర్నా ఇంక్ వ్యాక్సిన్ ద్వారా అభయం ఇవ్వడంతో సోమవారం యూఎస్ మార్కెట్లకు హుషారొచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో డోజోన్స్ 479 పాయింట్లు(1.6 శాతం) జంప్‌చేసి 29,959 వద్ద ముగిసింది. ఈ బాటలో ఎస్అండ్పీ 42 పాయింట్లు(1.2 శాతం) ఎగసి 3,627 వద్ద నిలవగా.. నాస్డాక్ 95 పాయింట్లు(0.8 శాతం) పెరిగి 11,924 వద్ద స్థిరపడింది. వెరసి మార్కెట్లు లైఫ్‌టైమ్ గరిష్టాలకు చేరాయి. ఇంతక్రితం ఈ ఏడాది ఫిబ్రవరిలో మాత్రమే ప్రధాన ఇండెక్సులు మూడూ ఒకేరోజు చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ రసెల్-2000 సైతం ఆల్‌టైమ్ హైను తాకడం విశేషం! ఇప్పటికే తమ వ్యాక్సిన్ 90 శాతంపైగా సురక్షితమంటూ ఫార్మా దిగ్గజంఫైజర్ డేటాను విశ్లేషించిన విషయం విదితమే. దీంతో సెంటిమెంటు మరింత బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. చదవండి: (మరోసారి మార్కెట్లకు దివాలీ జోష్?!) ఫైజర్ డీలా కోవిడ్-19 కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్ 94.5 శాతం సురక్షితమంటూ ప్రకటించిన మోడర్నా ఇంక్ షేరు 10 శాతం దూసుకెళ్లింది. అయితే ఇతర ఫార్మా కౌంటర్లలో ఫైజర్ ఇంక్ 3.3 శాతం, ఆస్ట్రాజెనెకా 2 శాతం చొప్పున డీలా పడ్డాయి. వ్యాక్సిన్ అంచనాలతో ఎయిర్‌లైన్, క్రూయిజర్ స్టాక్స్‌కు సైతం డిమాండ్ పెరిగింది. కార్నివాల్ గ్రూప్ 10 శాతం జంప్‌చేయగా. నార్వేజియన్ క్రూయిజ్లైన్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ 6-4 శాతం మధ్య పురోగమించాయి. ఈ బాటలో ప్రత్యర్థి సంస్థ టాబ్మెన్ సెంటర్స్ కొనుగోలు ధరను 80 శాతం తగ్గించిన వార్తలతో సైమన్ ప్రాపర్టీ గ్రూప్ షేరు దాదాపు 6 శాతం ఎగసింది. ఈ వారం రిటైల్ రంగ దిగ్గజాలు వాల్‌మార్ట్ ఇంక్, హోమ్ డిపో, టార్గెట్ కార్ప్, లోవ్స్ క్యూ3(జులై- సెప్టెంబర్) త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. చదవండి: (సెన్సెక్స్‌ప్రెస్- 44,000 దాటేసింది!) -
ముహూరత్ అదుర్స్- మార్కెట్ల రికార్డ్స్
గత దీపావళి నుంచి ఈ దీపావళి వరకూ విశేషాలు సెన్సెక్స్ : 43,638= దాదాపు 4400 పాయింట్లు(11.4 శాతం) అప్ నిఫ్టీ: 12,780= సుమారు 1150 పాయింట్లు(10.18 శాతం) ప్లస్ డాలరుతో రూపాయి మారకం= 74.60- రూ. 3.76(5.3 శాతం) డౌన్ ముంబై: సరికొత్త ఏడాది సంవత్ 2077 తొలి రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో బోణీ కొట్టాయి. అంతేకాకుండా సెన్సెక్స్, నిఫ్టీ లైఫ్‌టైమ్ గరిష్టాలను తాకాయి. దీపావళి సందర్భంగా నిర్వహించిన ముహూరత్ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 195 పాయింట్లు ఎగసి 43,638 వద్ద నిలిచింది. నిఫ్టీ 60 పాయింట్లు పుంజుకుని 12,780 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 43,831 వద్ద, నిఫ్టీ 12,829 వద్ద సరికొత్త గరిష్టాలకు చేరాయి. వెరసి సాయంత్రం 6.15-7.15 మధ్య నిర్వహించిన మూరత్ ట్రేడింగ్‌లో మార్కెట్లు మరోసారి సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. రోజంతా మార్కెట్లు లాభాల మధ్యే కదలడం విశేషం! మార్కెట్లకు ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ఆర్థిక రికవరీపై ఆశలు, కోవిడ్-19 కట్టడికి వెలువడనున్న వ్యాక్సిన్లపై అంచనాలు బలాన్నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. దివాలీ బలిప్రతిపద నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్లకు సెలవు. చదవండి: (కొనసాగుతున్న రూపాయి పతనం) బీపీసీల్ భళా ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ 0.5-0.2 శాతం మధ్య లాభపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో బీపీసీఎల్ 5.2 శాతం జంప్ చేయగా.. ఐవోసీ, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, గెయిల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ 3-1 శాతం మధ్య వృద్ధి చూపాయి. అయితే హిందాల్కో, హీరో మోటో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, శ్రీ సిమెంట్, టైటన్, యాక్సిస్, పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ 1.2-0.35 శాతం మధ్య బలహీనపడ్డాయి. చదవండి: (సంవత్ 2076కు లాభాల వీడ్కోలు) ఐడియా జోరు డెరివేటివ్స్‌లో ఐడియా 6.3 శాతం జంప్‌చేయగా.. కంకార్, హెచ్‌పీసీఎల్, ఐడీఎఫ్సీ ఫస్ట్, ఎన్ఎండీసీ, భెల్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 5.2-1.4 శాతం మధ్య ఎగశాయి. హిందాల్కో, పిరమల్, శ్రీరామ్ ట్రాన్స్, జీఎంఆర్, ఆర్ఈసీ, అరబిందో, డీఎల్ఎఫ్, పీవీఆర్, ఎంఅండ్ఎం ఫైనాన్స్ 1 శాతం స్థాయిలో క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6-0.8 శాతం మధ్య బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,842 లాభపడగా.. 606 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,936 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,462 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 1514 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్ రూ. 2,239 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
మార్కెట్ల జోరు చూడతరమా..!!
ముంబై: వరుసగా 8వ రోజు దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపాయి. సెన్సెక్స్ 316 పాయింట్లు జంప్‌చేసి 43,594 వద్ద ముగిసింది. నిఫ్టీ 118 పాయింట్లు ఎగసి 12,749 వద్ద స్థిరపడింది. వెరసి ఇండెక్సులు మూడో రోజూ సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. అయితే మిడ్‌సెషన్‌కల్లా మార్కెట్లు లాభాలను పోగొట్టుకుని నష్టాలలోకి ప్రవేశించాయి. 8 రోజుల భారీ ర్యాలీ నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. తొలుత సెన్సెక్స్ 43,708 వరకూ దూసుకెళ్లింది. తదుపరి అమ్మకాలు తలెత్తడంతో 42,970 వరకూ వెనకడుగు వేసింది. అంటే గరిష్టం నుంచి దాదాపు 740 పాయింట్లు క్షీణించింది. ఇక నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 12,770- 12,571 మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. మెటల్స్ మెరుపులు ఎన్ఎస్ఈలో ఫార్మా, మెటల్ 3.5 శాతం చొప్పున జంప్‌చేయగా.. ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, రియల్టీ1.6-0.8 శాతం మధ్య బలపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంక్స్, మీడియా 0.5-0.3 శాతం నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, టాటా స్టీల్ 8 శాతం స్థాయిలో పురోగమించాయి. ఈ బాటలో డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్, ఐషర్, ఐటీసీ, బజాజ్ ఫిన్, హీరో మోటో, టాటా మోటార్స్, సిప్లా, గెయిల్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, కొటక్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, అల్ట్రాటెక్, దివీస్ 4.2-2.8 శాతం మధ్య ఎగశాయి. అయితే ఇండస్ఇండ్ 5.25 శాతం, ఆర్ఐఎల్ 4.2 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇతర బ్లూచిప్స్‌లో టైటన్, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2-0.4 శాతం మధ్య డీలాపడ్డాయి. అపోలో అప్ డెరివేటివ్ కౌంటర్లలో అపోలో హాస్పిటల్స్, అరబిందొ, ఐజీఎల్, లుపిన్, సెయిల్, లుపిన్, జూబిలెంట్ ఫుడ్, టొరంట్ ఫార్మా, ఆర్ఈసీ, అంబుజా, మదర్సన్ 8-3.3 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. భారత్ ఫోర్జ్, ఎన్ఎండీసీ, ఐడీఎఫ్సీ ఫస్ట్, హావెల్స్, బాటా, చోళమండలం, ఎంఅండ్ఎం ఫైనాన్స్, బీవోబీ 4-2.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.8-0.3 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,433 లాభపడగా.. 1,295 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 5,627 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. అయితే దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,309 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 4,548 కోట్లు ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 3,036 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల తొలి వారంలో ఎఫ్‌పీఐలు ఏకంగా రూ. 13,399 కోట్ల పెట్టుబడులు కుమ్మరించడం గమనార్హం! అక్టోబర్‌లో రూ. 14,537 కోట్లు మాత్రమే ఇన్వెస్ట్ చేశారు. -
మార్కెట్లు అదుర్స్- సెన్సెక్స్ ట్రిపుల్
ముంబై: మరోసారి దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. వరుసగా 8వ రోజు లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు మూడో రోజూ సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 318 పాయింట్లు జంప్‌చేసి 43,596ను తాకగా.. నిఫ్టీ 104 పాయింట్లు బలపడి 12,735 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో నిఫ్టీ 12,753కు చేరగా.. సెన్సెక్స్ 43,675ను అధిగమించింది. వెరసి మార్కెట్లు మరోసారి చరిత్రాత్మక గరిష్టాలను సాధించాయి. నిఫ్టీ-50 మార్కెట్ క్యాప్(విలువ) రూ. 100 లక్షల కోట్లను అధిగమించడం విశేషం! చదవండి: (మళ్లీ చమురు ధరల సెగ) అన్ని రంగాలూ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా ఆటో, ఫార్మా, బ్యాంకింగ్ 1.5 శాతం స్థాయిలో ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో గెయిల్, ఎంఅండ్ఎం, హీరో మోటో, కొటక్ బ్యాంక్, ఓఎన్జీసీ, సిప్లా, హెచ్డీఎఫ్సీ, దివీస్ ల్యాబ్స్, హిందాల్కో, ఐటీసీ 4-1.5 శాతం మధ్య పుంజుకున్నాయి. బ్లూచిప్స్‌లో కేవలం హెచ్‌యూఎల్, పవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్ అదికూడా 0.7-0.2 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఎన్ఎండీసీ వీక్ డెరివేటివ్ కౌంటర్లలో బాలకృష్ణ, సెయిల్, లుపిన్, ఐబీ హౌసింగ్, అరబిందో, అపోలో హాస్పిటల్స్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, జీ, ఐజీఎల్, ఎస్కార్ట్స్, పీఎన్బీ, సన్ టీవీ 4-2 శాతం మధ్య జంప్ చేశాయి. అయితే ఎన్ఎండీసీ 4 శాతం పతనంకాగా.. బాటా, జీఎంఆర్, అపోలో టైర్, ఇండిగో, ఐడియా, హావెల్స్, వోల్టాస్ 1.2-0.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,119 లాభపడగా.. 551 నష్టాలతో కదులుతున్నాయి. -
కొత్త చరిత్ర- 43,000 దాటిన సెన్సెక్స్
ముంబై: వరుసగా ఏడో రోజూ స్టాక్ బుల్ కాలు దువ్వింది. రోజంతా లాభాల దౌడు తీసింది. ఫలితంగా దేశీ స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారి ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 43,000 పాయింట్ల మైలురాయిని సులభంగా అధిగమించింది. ఈ బాటలో ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ సైతం వరుసగా రెండో రోజు చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 680 పాయింట్లు జంప్ చేసి 43,278 వద్ద నిలిచింది. నిఫ్టీ 170 పాయింట్లు ఎగసి 12,631 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 43,316 వద్ద, నిఫ్టీ 12,644 వద్ద గరిష్టాలను తాకాయి. వెరసి వరుసగా రెండో రోజు మార్కెట్లు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. రియల్టీ జోరు ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ 4 శాతం జంప్ చేయగా.. రియల్టీ 2 శాతం ఎగసింది. ఫార్మా, ఐటీ 4 శాతం స్థాయిలో పతనమయ్యాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్, ఎల్అండ్ టీ, బజాజ్ ఫిన్, స్టేట్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, గెయిల్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా మోటార్స్, ఐటీసీ, యాక్సిస్, ఎస్బీఐ లైఫ్ 9-3 శాతం మధ్య దూసుకెళ్లాయి. అయితే టెక్ మహీంద్రా, సిప్లా, హెచ్‌సీఎల్ టెక్, దివీస్, నెస్లే, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, టీసీఎస్, విప్రో, హిందాల్కో, మారుతీ, ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్ 6-1 శాతం మధ్య పతనమయ్యాయి. ఇండిగో జూమ్ డెరివేటివ్ కౌంటర్లలో ఇండిగో, అశోక్ లేలాండ్, యూబీఎల్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, ఎల్ఐసీ హౌసింగ్, ఆర్బీఎల్ బ్యాంక్, పీవీఆర్, భారత్ ఫోర్జ్, ఫెడరల్ బ్యాంక్ 9-5 శాతం మధ్య ఎగశాయి. కాగా.. ముత్తూట్, కేడిలా, లుపిన్, జూబిలెంట్ ఫుడ్, కోఫోర్జ్, టొరంట్ ఫార్మా, మైండ్ ట్రీ, అరబిందో, నౌకరీ, మారికో 7-3 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో స్మాల్ క్యాప్ 0.5 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1,231 లాభపడగా.. 1,482 నష్టపోయాయి. ఎఫ్‌పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4,548 కోట్లు ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 3,036 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 4,870 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,939 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
సెన్సెక్స్@ 43,000- ఫైజర్ రికార్డ్
ముంబై: వరుసగా ఏడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు దౌడు తీస్తున్నాయి. వెరసి స్టాక్ మార్కెట్ల చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 43,000 పాయింట్ల మైలురాయిని అందుకుంది. ప్రస్తుతం 418 పాయింట్లు జంప్ చేసి 43,015 వద్ద ట్రేడవుతోంది. సోమవారం సైతం ఇటు సెన్సెక్స్, అటు నిఫ్టీ సరికొత్త రికార్డులను సాధించిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రపంచ మహమ్మారి కోవిడ్-19 కట్టడికి రూపొందిస్తున్న వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలలో 90 శాతంపైగా ఫలితాలనిచ్చినట్లు పేర్కొనడంతో ఫైజర్ లిమిటెడ్ కౌంటర్ జోరందుకుంది. అమెరికన్ పేరెంట్ కంపెనీ ఫైజర్ ఇంక్ షేరు సోమవారం 7.5 శాతం లాభపడటంతో ఈ కౌంటర్ కు డిమాండ్ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. 20 శాతం ప్లస్ జర్మన్ కంపెనీ బయో ఎన్‌టెక్ తో సంయుక్తంగా రూపొందిస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలలో 90 శాతంపైగా సత్ఫలితాలు ఇచ్చినట్లు ఫైజర్ ఇంక్ పేర్కొంది. ఈ నెలాఖరుకల్లా ఎమెర్జీన్సీ ప్రాతిపదికన వినియోగించేందుకు యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతి లభించే వీలున్నట్లు అభిప్రాయపడింది. దీంతో దేశీ అనుబంధ సంస్థ ఫైజర్ లిమిటెడ్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఎన్ఎస్ఈలో తొలుత 20 శాతం దూసుకెళ్లింది. రూ. 977 ఎగసి రూ. 5,900ను తాకింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుుకుంది. ప్రస్తుతం 7 శాతం లాభంతో రూ. 5,256 వద్ద ట్రేడవుతోంది. -
రెండో రోజూ సరికొత్త రికార్డ్స్
ముంబై: వరుసగా ఏడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. తద్వారా రెండో రోజూ సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. ట్రిపుల్ సెంచరీతో ప్రారంభంకావడం ద్వారా సెన్సెక్స్, 80 పాయింట్ల లాభంతో మొదలైన నిఫ్టీ తాజాగా చరిత్రాత్మక గరిష్టాలను సాధించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 42,959ను తాకింది. తద్వారా 43,000 పాయింట్ల మైలురాయిపై కన్నేసింది. ఇక నిఫ్టీ తొలిసారి 12,500ను అధిగమించి 12,557కు చేరింది. సోమవారం సైతం మార్కెట్లు లైఫ్ టైమ్ హైలను సాధించిన విషయం విదితమే. భూగోళాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19 మహమ్మారికి చెక్ పెట్టగల వ్యాక్సిన్ 90 శాతంపైగా విజయవంతమైనట్లు ఫైజర్ పేర్కొనడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం సెన్సెక్స్ 117 పాయింట్లు పెరిగి 42,714కు చేరగా.. నిఫ్టీ 25 పాయింట్లు బలపడి 12,486 వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్స్ జోరు ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ 1.6 శాతం, రియల్టీ 0.7 శాతం చొప్పున పుంజుకోగా.. ఐటీ 3 శాతం, ఫార్మా 1 శాతం చొప్పున డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐసీఐసీఐ, ఎల్అండ్ టీ, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, గెయిల్, ఎస్ బీఐ, ఓఎన్జీసీ, ఇండస్ఇండ్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్, గ్రాసిమ్, ఐవోసీ, శ్రీసిమెంట్, యాక్సిస్ 3-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టీసీఎస్, సిప్లా, దివీస్, నెస్లే, మారుతీ, డాక్టర్ రెడ్డీస్ 4-0.6 శాతం మధ్య క్షీణించాయి. పీవీఆర్ జూమ్ డెరివేటివ్స్‌లో పీవీఆర్, యూబీఎల్, ఇండిగో, మెక్‌డోవెల్, భారత్ ఫోర్జ్, టాటా పవర్, అశోక్ లేలాండ్, బాష్ 6-1.6 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. ముత్తూట్, జూబిలెంట్ ఫుడ్, మైండ్ ట్రీ, అపోలో హాస్పిటల్స్, కోఫోర్జ్, మణప్పురం 6-2.3 శాతం మధ్య నష్టపోయాయి. బీఎస్ఈలో మిడ్‌క్యాప్ 0.2 శాతం నీరసించగా, స్మాల్ క్యాప్స్ 0.2 శాతం పుంజుకుంది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 841 లాభపడగా.. 881 నష్టాలతో కదులుతున్నాయి. -
నవీన్ ఫ్లోరైన్- రూట్ మొబైల్స్.. దూకుడు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ నవీన్ ఫ్లోరైన్ ఇంటర్నేషనల్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో డిజిటల్ కమ్యూనికేషన్ సేవల కంపెనీ రూట్ మొబైల్స్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. నవీన్ ఫ్లోరైన్ ఇంటర్నేషనల్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో నవీన్ ఫ్లోరైన్ ఇంటర్నేషనల్ నికర లాభం 43 శాతం ఎగసి రూ. 68 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 17 శాతం పుంజుకుని రూ. 319 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 3.23 శాతం బలపడి 24.9 శాతానికి ఎగశాయి. వాటాదారులకు షేరుకి రూ. 5 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఇందుకు నవంబర్ 11 రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నవీన్ ఫ్లోరైన్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6.5 శాతం దూసుకెళ్లి రూ. 2,260 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 2,268 సమీపానికి చేరింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. రూట్ మొబైల్స్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో రూట్ మొబైల్స్ నికర లాభం రెట్టింపునకుపైగా పెరిగి రూ. 33 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 77 శాతం జంప్‌చేసి రూ. 349 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 2.3 శాతం బలపడి 13.3 శాతానికి చేరాయి. ఈ నేపథ్యంలో రూట్ మొబైల్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6 శాతం జంప్‌చేసి రూ. 964 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 8 శాతం లాభపడి రూ. 990 సమీపానికి చేరింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని సాధించింది. కాగా.. గత మూడు రోజుల్లో ఈ షేరు 25 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! -
దీపావళికల్లా ఇండెక్సుల సరికొత్త రికార్డ్స్?
ఎన్నో ఆటుపోట్లను చవిచూస్తున్న ఈ క్యాలండర్ ఏడాది(2020)లో దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను మరోసారి నెలకొల్పే వీలున్నట్లు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. తొలుత జనవరిలో అటు సెన్సెక్స్ 42,273 వద్ద, ఇటు నిఫ్టీ 12,430 పాయింట్ల వద్ద చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ఆపై ప్రపంచ దేశాలన్నిటినీ కోవిడ్-19 చుట్టేయడంతో మార్చిలో ఒక్కసారిగా కుప్పకూలాయి. ఫలితంగా ప్రపంచ మార్కెట్ల బాటలో దేశీ స్టాక్ మార్కెట్లు 52 వారాల కనిష్టాలకు చేరాయి. ఆపై తిరిగి రికవరీ బాట పట్టి 50 శాతం ర్యాలీ చేశాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లపై స్టాక్ నిపుణులు ఏమంటున్నారంటే.. రికార్డ్ గరిష్టాలవైపు.. కొద్ది రోజులుగా దేశీ స్టాక్ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 41,000 పాయింట్ల సమీపానికి చేరగా.. నిఫ్టీ 12,000 పాయింట్ల స్థాయిలో కదులుతోంది. ఇందుకు ప్రధానంగా ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు, వివిధ దేశాల ప్రభుత్వాలు అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీల కారణంగా పెరిగిన లిక్విడిటీ దోహదపడుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వెరసి ఇండెక్సులు సరికొత్త గరిష్టాలకు సుమారు 4 శాతం చేరువలో కదులుతున్నట్లు తెలియజేశారు. ఈ బాటలో దీపావళికల్లా మార్కెట్లు సరికొత్త రికార్డులకు చేరే వీలున్నట్లు విశ్లేషిస్తున్నారు. బొనాంజా పోర్ట్‌ఫోలియో రీసెర్చ్ హెడ్ విశాల్ వాగ్, మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ పల్కా చోప్రా తదితర నిపుణుల అభిప్రాయాలు చూద్దాం.. దివాలీకల్లా గత ఐదేళ్లలో దీపావళికి ముందు 30 రోజులు, తదుపరి 4 వారాల్లో మార్కెట్లు సగటున 0.2-0.6 శాతం స్థాయిలో ర్యాలీ చేశాయి. దీంతో ఈ దీపావళి సమయంలోనూ దేశీ స్టాక్ మార్కెట్లలో సరికొత్త రికార్డుల దివ్వెలు వెలిగే వీలుంది. 2015లో దివాలీకి ముందు సెన్సెక్స్ 1.3 శాతం పుంజుకోగా.. తదుపరి నెల రోజుల్లో 3.38 శాతం ఎగసింది. 2016లో తొలుత 0.23 శాతం బలపడగా.. ఆపై 1.85 శాతం లాభపడింది. 2017లో అయితే ముందు 6.4 శాతం జంప్‌చేయగా.. తదుపరి 1.7 శాతం పుంజుకుంది. 2018లో అయితే 2.5 శాతం, 1.24 శాతం చొప్పున లాభపడింది. ఇక 2019లో తొలుత 1.1 శాతం బలపడగా.. దీపావళి తరువాత నెల రోజుల్లో 4.5 శాతం జంప్‌చేసింది. ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే.. ఈసారి(2020లో) మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలను సాధించే అవకాశముంది. ఎఫ్‌పీఐల దన్ను ప్రపంచవ్యాప్తంగా లిక్విడిటీ భారీగా మెరుగుపడగా.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మార్చి నుంచి చూస్తే నికరంగా దేశీ ఈక్విటీలలో రూ. 30,000 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేశారు. అయితే ఇదే సమయంలో దేశీ ఫండ్స్(డీఐఐలు) నికర అమ్మకందారులుగా నిలవడం గమనార్హం! ఈ అంశాలు మార్కెట్ల జోరుకు సహకరిస్తున్నప్పటికీ కరోనా వైరస్ సోకుతున్న కేసులు పెరగడం, తిరిగి లాక్డవున్లు విధంచే పరిస్థితులు తలెత్తడం వంటి అంశాలు సెంటిమెంటును దెబ్బతీయవచ్చు. ఇది ఆర్థిక రికవరీని ఆలస్యం చేసే వీలుంది. ఫలితంగా కంపెనీల పనితీరు మందగించవచ్చు. పండుగల పుష్ ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలు, ఆర్బీఐ లిక్విడిటీ చర్యలు, కోవిడ్-19కు వ్యాక్సిన్ తయారీపై ఆశలు ఇన్వెస్టర్లకు జోష్‌నిస్తున్నాయి. ఇటీవల అన్‌లాక్‌తో ఆర్థిక రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనికితోడు పండుగల సీజన్ ప్రారంభంకావడంతో వాహనాలు, హోమ్ అప్లయెన్సెస్, టెక్స్టైల్స్, ఎఫ్ఎంసీజీ తదితర రంగాలలో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇప్పటికే సెప్టెంబర్ క్వార్టర్(క్యూ2)లో కంపెనీలు ఆశావహ ఫలితాలు సాధించాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు రెండు నెలల కాలంలో మరింత జోరు చూపవచ్చు. 12,050కు పైన సాంకేతికంగా చూస్తే రానున్న కాలంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 12,050 పాయింట్లకు ఎగువన నిలవగలిగితే మరింత పుంజుకునే వీలుంది. అలాకాకుండా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు, కోవిడ్-19 ప్రభావం వంటి అంశాలతో సెంటిమెంటు బలహీనపడితే నిఫ్టీ డీలాపడే వీలుంది. చార్టుల ప్రకారం 11,650 దిగువకు నిఫ్టీ చేరితే.. 11,200 వరకూ బలహీనపడవచ్చు. ఏదేమైనా దీపావళి లేదా.. తదుపరి కాలంలో మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకున్నప్పటికీ ఆ స్థాయిలో కొనసాగుతాయా లేదా అన్నది వేచిచూడవలసిన విషయమే?! -
ఐటీ షేర్లు.. ధూమ్‌ధామ్- సరికొత్త రికార్డ్స్
వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో మార్కెట్లు జోరు చూపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 407 పాయింట్లు జంప్‌చేసి 39,104ను తాకింది. నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 11,537 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి ఐటీ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఎన్ఎస్ఈలో ఐటీ ఇండెక్స్ 3 శాతం ఎగసింది. ఇంట్రాడేలో 20,748ను తాకడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని చేరింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్ల కారణంగా పలు కౌంటర్లు బుల్ దౌడు తీస్తున్నాయి. వివరాలు చూద్దాం.. జాబితా ఇలా సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్) ప్రతిపాదనను ప్రకటించింది. ఇది ఐటీ పరిశ్రమకు బూస్ట్‌నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఐటీ కంపెనీలు పటిష్ట పనితీరును ప్రదర్శించవచ్చన్న అంచనాలు పెరగడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌పట్ల ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. దీంతో టీసీఎస్తోపాటు.. ఇన్ఫోసిస్, మైండ్‌ట్రీ, కేపీఐటీ టెక్నాలజీస్, కోఫోర్జ్, బిర్లాసాఫ్ట్ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. జోరుగా హుషారుగా ఎన్ఎస్ఈలో టీసీఎస్ షేరు తొలుత 6 శాతం ఎగసింది. రూ. 2,679 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. ఇదే విధంగా ఇన్ఫోసిస్ రూ. 1,055 వద్ద, మైండ్‌ట్రీ రూ. 1,374 వద్ద, బిర్లాసాఫ్ట్ రూ. 210 వద్ద, కేపీఐటీ టెక్నాలజీస్ రూ. 130 వద్ద, కోఫోర్జ్ రూ. 2,439 వద్ద చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ఇక విప్రో 6 శాతం జంప్‌చేసి రూ. 331కు చేరింది. ఇది రెండు దశాబ్దాల గరిష్టంకాగా.. ఇంతక్రితం 2000 ఫిబ్రవరి 22న రూ. 388 వద్ద ఆల్‌టైమ్ హై'ని తాకింది. ఇతర కౌంటర్లలో మాస్టెక్, రామ్‌కో సిస్టమ్స్, స్యుబెక్స్, ఇంటెలెక్ట్ డిజైన్, టాటా ఎలక్సీ, ఈక్లెర్క్స్, న్యూక్లియస్ తదితరాలు 5-3 శాతం మధ్య లాభపడి ట్రేడవుతున్నాయి. -
అడ్వాన్స్డ్ ఎంజైమ్- కేపీఐటీ.. దూకుడు
మిడ్‌సెషన్ నుంచీ మార్కెట్లు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న హెల్త్‌కేర్ రంగ కౌంటర్ అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్‌కు మరోసారి డిమాండ్ నెలకొంది. మరోపక్క సాఫ్ట్వేర్ సేవల కంపెనీ కేపీఐటీ టెక్నాలజీస్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ తాజాగా 52 వారాల గరిష్టాలకు చేరాయి. వివరాలు చూద్దాం.. అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ ఇటీవల ముఖ విలువ విభజన నేపథ్యంలో జోరు చూపుతున్న ఫార్మా రంగ కంపెనీ అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ తాజాగా ఏడాది గరిష్టానికి చేరింది. ఎన్ఎస్ఈలో తొలుత 15 శాతంపైగా దూసుకెళ్లి రూ. 339ను తాకింది. ప్రస్తుతం 13 శాతం ఎగసి రూ. 332 వద్ద ట్రేడవుతోంది. రూ. 10 ముఖ విలువగల షేర్లను రూ. 2 ముఖ విలువగల 5 షేర్లుగా కంపెనీ ఇటీవల విభజించింది. దీనికితోడు ఎఫ్‌పీఐ విభాగంలో నలంద ఇండియా ఈక్విటీ ఫండ్ షేరుకి రూ. 264 ధరలో 4.19 మిలియన్ ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. ఇది కంపెనీ ఈక్విటీలో 3.75 శాతం వాటాకు సమానంకాగా.. ఇందుకు రూ. 111 కోట్లు వెచ్చించింది. ఈ కారణాలతో గత వారం రోజుల్లోనే అడ్వాన్స్డ్ ఎంజైమ్ షేరు 45 శాతం దూసుకెళ్లింది! కేపీఐటీ టెక్నాలజీస్ ప్రమోటర్లు వాటాను పెంచుకున్న వార్తలతో తాజాగా కేపీఐటీ టెక్నాలజీస్ షేరు జోరందుకుంది. ఎన్ఎస్ఈలో తొలుత 10 శాతంపైగా జంప్‌చేసింది. రూ. 127ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 5.2 శాతం లాభపడి రూ. 123 వద్ద ట్రేడవుతోంది. ఈ నెల మూడో వారంలో ప్రమోటర్ కుంటుంబంలోని అనుపమ కిశోర్ పాటిల్ రెండు దఫాలలో 14.9 లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. దీంతో అనుపమ కిశోర్ వాటా 0.59 శాతానికి చేరింది. కాగా.. ద్వితీయార్థంలో కంపెనీ పటిష్ట పనితీరును చూపనున్న అంచనాలతో ఇటీవల ఈ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి గత రెండు వారాలలో ఈ షేరు 30 శాతం ర్యాలీ చేసింది! -
ఎస్కార్ట్స్- లారస్ ల్యాబ్స్.. గెలాప్
ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 550 పాయింట్లు జంప్‌చేసి 37,938కు చేరింది. కాగా.. క్యుబోటా కార్పొరేషన్ భాగస్వామ్యంలో ట్రాక్టర్ల తయారీని ప్రారంభించినట్లు వెల్లడించడంతో ఎస్కార్ట్స్ లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు షేర్ల విభజనకు బుధవారం(30న) రికార్డ్ డేట్‌కావడంతో ఫార్మా రంగ కంపెనీ లారస్ ల్యాబ్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. ఎస్కార్ట్స్ లిమిటెడ్ జపనీస్ దిగ్గజం క్యుబోటా కార్పొరేషన్‌తో ఏర్పాటు చేసిన భాగస్వామ్య సంస్థ(జేవీ) ఎస్కార్ట్స్ క్యుబోటా ఇండియా ట్రాక్టర్ల తయారీని ప్రారంభించినట్లు ఎస్కార్ట్స్ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. ఈ జేవీలో క్యుబోటా 60 శాతం, ఎస్కార్ట్స్ 40 శాతం చొప్పున వాటాలను కలిగి ఉన్నట్లు తెలియజేసింది. రూ. 300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన జేవీ ఏడాదికి 50,000 ట్రాక్టర్లను రూపొందించగలదని వెల్లడించింది. ఈ యూనిట్‌ను ప్రధానంగా ఎగుమతులకు వినియోగించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎస్కార్ట్స్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 8 శాతం జంప్‌చేసింది. రూ. 1,300ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 7.4 శాతం లాభంతో రూ. 1,292 వద్ద ట్రేడవుతోంది. లారస్ ల్యాబ్స్ చిన్న ఇన్వెస్టర్లకు సైతం అందుబాటులో ఉండేందుకు వీలుగా షేర్ల విభజనను ప్రకటించిన లారస్ ల్యాబ్స్ షేరు మంగళవారం నుంచీ ఎక్స్డేట్కానుండటంతో జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈలో తొలుత 9.2 శాతం దూసుకెళ్లింది. రూ. 1,450 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 8.8 శాతం ఎగసి రూ. 1,445 వద్ద ట్రేడవుతోంది. జులై 30న సమావేశమైన లారస్ ల్యాబ్స్ బోర్డు 5:1 నిష్పత్తిలో షేర్ల విభజనను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు ఈ నెల 30 రికార్డ్ డేట్‌కావడంతో మంగళవారం నుంచీ షేరు ధర ఇందుకు అనుగుణంగా సర్దుబాటు కానుంది. -
ఫార్మా దూకుడు- రికార్డులే.. రికార్డులు
ప్రధానంగా హెల్త్‌కేర్ రంగానికి పెరిగిన డిమాండ్‌తో దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ ఇన్వెస్టర్లు ఫార్మా కౌంటర్లలో కొనుగోళ్లకు ఎగబడటంతో బీఎస్ఈలో ఫార్మా ఇండెక్స్ సరికొత్త గరిష్టాన్ని తాకింది. ఈ బాటలో లారస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సైతం చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. అంతేకాకుండా పలు ఇతర ఫార్మా రంగ షేర్లు 52 వారాల గరిష్టాలను చేరడం విశేషం! వివరాలు ఇలా.. జోరుగా హుషారుగా బీఎస్ఈలో హెల్త్‌కేర్ రంగ ఇండెక్స్ దాదాపు 4 శాతం జంప్‌చేసింది. 20,529ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ఫార్మాస్యూటికల్ కౌంటర్లలో లారస్ ల్యాబ్స్ తొలుత 6.5 శాతం జంప్‌చేసి రూ. 1497 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ప్రస్తుతం 5.7 శాతం ఎగసి రూ. 1484 వద్ద ట్రేడవుతోంది. ఈ వారంలో లారస్ షేరు 18 శాతం బలపడగా.. కోవిడ్-19 కట్టడికి వీలుగా రష్యన్ వ్యాక్సిన్‌పై మూడో దశ క్లినికల్ పరీక్షలకు సిద్ధపడుతున్న డాక్టర్ రెడ్డీస్ తొలుత దాదాపు 10 శాతం దూసుకెళ్లింది. రూ. 5303కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 8.2 శాతం జంప్‌చేసి రూ. 5222 వద్ద ట్రేడవుతోంది. గత మూడు రోజుల్లోనే ఈ షేరు 15 శాతం ర్యాలీ చేయడం విశేషం! యమ స్పీడ్ హెల్త్‌కేర్ రంగ కౌంటర్లలో ప్రస్తుతం నాట్కో ఫార్మా 19 శాతం దూసుకెళ్లి రూ. 921 వద్ద, ఆర్పీజీ లైఫ్ 8 శాతం జంప్‌చేసి రూ. 406 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ బాటలో హెస్టర్ బయో 8 శాతం ఎగసి రూ. 1790ను తాకగా.. సువెన్ లైఫ్ 6 శాతం లాభంతో రూ. 55కు చేరింది. ఇతర కౌంటర్లలో లుపిన్ 6 శాతం బలపడి రూ. 1100 వద్ద, సిప్లా 6 శాతం పెరిగి రూ. 795 వద్ద, గ్రాన్యూల్స్ 5.5 శాతం జంప్‌చేసి రూ. 384 వద్ద ట్రేడవుతున్నాయి. ఇదే విధంగా న్యూలాడ్ ల్యాబ్స్ 5 శాతం పెరిగి రూ. 1181ను తాకగా.. జేబీ కెమికల్స్ 4.3 శాతం ఎగసి రూ. 1115కు చేరింది. కాగా. దివీస్ ల్యాబ్స్ 4.3 శాతం లాభంతో రూ. 3350 వద్ద, క్యాప్లిన్ పాయింట్ 4 శాతం వృద్ధితో రూ. 595 వద్ద, కేడిలా హెల్త్‌కేర్ 4 శాతం పుంజుకుని రూ. 409 వద్ద, వొకార్డ్ 3.6 శాతం పెరిగి రూ. 307 వద్ద, గ్లెన్‌మార్క్ 3.5 శాతం వృద్ధితో రూ. 510 వద్ద కదులుతున్నాయి. ఏడాది గరిష్టాలకు.. బీఎస్ఈలో స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ 2.3 శాతం పెరిగి రూ. 745 వద్ద, లింకన్ ఫార్మా 2.5 శాతం పుంజుకుని రూ. 270 వద్ద, హికాల్ 3 శాతం ఎగసి రూ. 190 వద్ద, లుపిన్ రూ. 1111 వద్ద, న్యూలాండ్ ల్యాబ్స్ రూ. 1199 వద్ద 52 వారాల గరిష్టాలను అందుకున్నాయి. -
ఆరియన్‌ప్రొ జూమ్- అదానీ గ్రీన్ రికార్డ్
కొద్ది రోజులుగా నిరంతర ర్యాలీ చేస్తున్న అదానీ గ్రీన్ ఎనర్జీ కౌంటర్ మరోసారి వెలుగులో నిలుస్తోంది. ఈ ఏడాది(2020-21) తొలి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించడం ప్రభావం చూపుతోంది. ఇక మరోవైపు సింగపూర్ బ్యాంకింగ్ సంస్థ నుంచి ఆర్డర్‌ను పొందినట్లు వెల్లడించడంతో టెక్నాలజీ ప్రొడక్టుల కంపెనీ ఆరియన్‌ప్రొ సొల్యూషన్స్ కౌంటర్‌కు సైతం డిమాండ్ పెరిగింది. వెరసి ఈ రెండు కౌంటర్లూ 5 శాతం చొప్పున అప్పర్ సర్క్యూట్లను తాకాయి. వివరాలు చూద్దాం.. అదానీ గ్రీన్ ఎనర్జీ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో అదానీ గ్రీన్ ఎనర్జీ రూ. 51 కోట్ల పన్నుకు ముందు లాభం ఆర్జించింది. గతేడాది క్యూ1లో రూ. 131 కోట్ల ఇబిట్ నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం 30 శాతం ఎగసి రూ. 878 కోట్లను తాకింది. కాగా.. సౌర విద్యుదుత్పత్తిలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా ఆవిర్భవించనున్న అదానీ గ్రీన్ ఎనర్జీ కౌంటర్ ఇటీవల నిరవధికంగా లాభపడుతూ వస్తున్న విషయం విదితమే. ఈ బాటలో మరోసారి అమ్మేవాళ్లు కరువుకావడంతో ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 639 వద్ద ఫ్రీజయ్యింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) దాదాపు రూ. లక్ష కోట్లకు చేరింది. వెరసి బీపీసీఎల్, ఓఎన్జీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ తదితర పీఎస్‌యూ దిగ్గజాలను విలువరీత్యా వెనక్కి నెట్టింది. గత ఏడాది కాలంలో అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు ఏకంగా 1,173 శాతం దూసుకెళ్లడం విశేషం! ఆరియన్‌ప్రొ సొల్యూషన్స్ అనుబంధ సంస్థ ఇంటెగ్రో టెక్నాలజీస్ ద్వారా సింగపూర్‌లోని అతిపెద్ద బ్యాంకు నుంచి ఐటీ ప్రొడక్టుల సేవల కోసం ఆర్డర్‌ను పొందినట్లు ఆరియన్‌ప్రొ సొల్యూషన్స్ పేర్కొంది. ఆర్డర్లో భాగంగా స్మార్ట్ లెండర్ ప్రొడక్ట్ వెర్షన్4 ద్వారా సింగపూర్ బ్యాంక్ బ్రాంచీలు, అనుబంధ సంస్థలకు సర్వీసులను అందించనున్నట్లు తెలియజేసింది. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కోసం లభించిన ఈ ఆర్డర్ విలువను 5.5 మిలియన్ డాలర్లుగా ఆరియన్‌ప్రొ తెలియజేసింది. 2022 ఫిబ్రవరిలోగా ప్రాజెక్టును అభివృద్ధి చేయవలసి ఉంటుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆరియన్‌ప్రొ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 61.4 వద్ద ఫ్రీజయ్యింది. -
యాంబర్ పతనం- జూబిలెంట్ ఫుడ్ జోరు
మార్కెట్లు ఆటుపోట్ల మధ్య ట్రేడవుతున్నాయి. కాగా.. క్విప్ ముగిసిన నేపథ్యంలో యాంబర్ ఎంటర్ప్రైజెస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక ఫలితాలపై ఆశావహ అంచనాల కారణంగా జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ యాంబర్ ఎంటర్ప్రైజెస్ షేరు నష్టాలతో డీలాపడగా.. ఫాస్ట్‌ఫుడ్ చైన్ దిగ్గజం జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం.. యాంబర్ ఎంటర్ప్రైజెస్ అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా యాంబర్ ఎంటర్ప్రైజెస్ రూ. 400 కోట్లు సమీకరించింది. షేరుకి రూ. 1,780 ధరలో చేపట్టిన క్విప్ గురువారం(10న) ముగిసింది. ఈ నేపథ్యంలో వరుసగా రెండో రోజు ఈ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 9.6 శాతం కుప్పకూలి రూ. 1,723ను తాకింది. ప్రస్తుతం 8 శాతం నష్టంతో రూ. 1,757 వద్ద ట్రేడవుతోంది. వెరసి మంగళవారం నమోదైన ఇంట్రాడే గరిష్టం రూ. 1,997తో పోలిస్తే 12 శాతం నీరసించింది. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్)లో మెరుగైన ఫలితాలు ప్రకటించగలదన్న అంచనాలతో జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ కౌంటర్ మరోసారి బలపడింది. ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 2,378వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 2.5 శాతం లాభంతో రూ. 2,322 వద్ద ట్రేడవుతోంది. క్యూ1 ఫలితాల సందర్భంగా కంపెనీ జులై, ఆగస్ట్‌లలో అమ్మకాలు సగటున 77 శాతం చొప్పున పుంజుకున్నట్లు వెల్లడించింది. -
లారస్ ల్యాబ్స్- అలెంబిక్.. భలే జోరు
దేశీ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు హెల్త్‌కేర్ రంగ కౌంటర్లు మరింత దూకుడు చూపుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో లారస్ ల్యాబ్స్ షేరు తాజాగా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ఇక మరోపక్క అలెంబిక్ లిమిటెడ్ సైతం 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఇతర వివరాలు చూద్దాం.. లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ వరుసగా నాలుగో రోజు లారస్ ల్యాబ్స్ షేరు జోరందుకుంది. ఎన్ఎస్ఈలో తొలుత 4.5 శాతం జంప్‌చేసింది. రూ. 1,265కు చేరింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ప్రస్తుతం 2.3 శాతం ఎగసి రూ. 1,239 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో పటిష్ట ఫలితాలు సాధించడంతో ఈ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి గత నాలుగు నెలల్లో ఈ షేరు 171 శాతం ర్యాలీ చేసింది. ఇదే కాలంలో సెన్సెక్స్ 19 శాతంమే బలపడింది. కాగా.. రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 2 ముఖ విలువగల 5 షేర్లుగా విభజించనుంది. ఇందుకు సెప్టెంబర్ 30 రికార్డ్ డేట్‌గా ప్రకటించింది. అలెంబిక్ లిమిటెడ్ ఈ నెల మొదట్లో ప్రమోటర్ గ్రూప్ సంస్థ అదనపు వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడయ్యాక జోరందుకున్న అలెంబిక్ లిమిటెడ్ మరోసారి దూకుడు చూపుతోంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 12 శాతం దూసుకెళ్లి రూ. 115కు చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ఈ నెలలో ఇప్పటివరకూ 30 శాతం ర్యాలీ చేసింది. ఓపెన్ మార్కెట్ ద్వారా ఈ నెల 2-4 మధ్య నిరయూ లిమిటెడ్ అదనంగా 0.6 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు అలెంబిక్ ఇప్పటికే తెలియజేసింది. నిజానికి జూన్‌కల్లా కంపెనీలో ప్రమోటర్ల వాటా 67.62 శాతం నుంచి 69.57 శాతానికి ఎగసింది. ఈ నేపథ్యంలో అలెంబిక్ కౌంటర్ జోరు కొనసాగుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. -
చివర్లో అమ్మకాలు- ఐటీ ఇండెక్స్ రికార్డ్
ఆద్యంతం కన్సాలిడేషన్ బాటలో సాగిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి డీలా పడ్డాయి. సెన్సెక్స్ 52 పాయింట్లు క్షీణించి 38,365 వద్ద ముగిసింది. నిఫ్టీ 38 పాయింట్ల నష్టంతో 11,317 వద్ద నిలిచింది. తొలుత బలహీనంగా ప్రారంభమైన మార్కెట్లు మిడ్‌సెషన్‌కల్లా జోరందుకున్నాయి. అయితే చివరి అర్ధగంటలో అమ్మకాలు ఊపందుకోవడంతో చతికిలపడ్డాయి. దీంతో సెన్సెక్స్ 38,746 గరిష్టాన్ని తాకగా.. 38,275 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. వెరసి 500 పాయింట్ల స్థాయిలో హెచ్చుతగ్గులు నమోదు చేసుకుంది. ఈ బాటలో నిఫ్టీ 11,437- 11,290 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. చైనాతో సరిహద్దు వద్ద సైనిక వివాదాలు, యూరోపియన్ మార్కెట్లలో అమ్మకాల కారణంగా మార్కెట్లు ఒడిదొడుకులను చవిచూసినట్లు నిపుణులు తెలియజేశారు. ఐటీ మాత్రమే ఎన్ఎస్ఈలో ఐటీ 1.2 శాతం పుంజుకోగా మిగిలిన అన్ని రంగాలూ 3-0.6 శాతం మధ్య డీలాపడ్డాయి. ఇంట్రాడేలో ఐటీ ఇండెక్స్ 18,672 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకోవడం విశేషం! ఏప్రిల్ నుంచి ఈ రంగం 46 శాతం ర్యాలీ చేసింది. 26 రంగాలలో ఐటీ రంగం మాత్రమే కోవిడ్-19 సవాళ్లకు ఎదురు నిలవగలిగినట్లు కేవీ కామత్ కమిటీ తాజాగా పేర్కొనడం ఇందుకు దోహదపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇన్ఫ్రాటెల్ పతనం నిఫ్టీ దిగ్గజాలలో బీపీసీఎల్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఆర్ఐఎల్, విప్రో, టీసీఎస్, ఐసీఐసీఐ, టెక్ మహీంద్రా 2.7-0.7 శాతం మధ్య ఎగశాయి. అయితే ఇన్ఫ్రాటెల్ 8 శాతం పతనంకాగా.. జీ, టాటా మోటార్స్, హిందాల్కో, టాటా స్టీల్, యాక్సిస్, ఎయిర్టెల్, గ్రాసిమ్, ఓఎన్జీసీ, సన్ ఫార్మా, ఎస్బీఐ, శ్రీ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్, ఎన్టీపీసీ, ఎల్అండ్టీ, అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌పీ లైఫ్ 4.7-1.7 శాతం మధ్య క్షీణించాయి. ఐడియా వీక్ డెరివేటివ్స్‌లో ఐడియా 8.5 శాతం కుప్పకూలగా.. పీవీఆర్, జిందాల్ స్టీల్, ఐడీఎఫ్సీ ఫస్ట్‌బ్యాంక్, సెయిల్, అపోలో టైర్, జీఎంఆర్, ఎన్ఎండీసీ, నాల్కో, టాటా పవర్, ఆర్బీఎల్ బ్యాంక్, శ్రీరామ్ ట్రాన్స్ 6-4 శాతం మధ్య పతనమయ్యాయి. మరోవైపు ఐబీ హౌసింగ్, ఐసీఐసీఐ ప్రు, గోద్రెజ్ సీపీ, పిరమల్, ఇండిగో, జూబిలెంట్ ఫుడ్, ఎస్బీఐ లైఫ్, సీఫోర్జ్ 4.3-0.7 శాతం మధ్య ఎగశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.5-1 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1717 నష్టపోగా.. 978 మాత్రమే లాభపడ్డాయి. అమ్మకాల బాట నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) కేవలం రూ. 7 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 816 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. శుక్రవారం సైతం ఎఫ్‌పీఐలు రూ. 1,889 కోట్లు, డీఐఐలు రూ. 457 కోట్లు చొప్పున అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే -
డిక్సన్ టెక్- వీఎస్టీ టిల్లర్స్.. దూకుడు
ఆటుపోట్ల మధ్య కదులుతున్న మార్కెట్లలో సానుకూల వార్తల కారణంగా అటు డిక్సన్ టెక్నాలజీస్, ఇటు వీఎస్టీ టిల్లర్స్ కౌంటర్లకు డిమాండ్ కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఒడిదొడుకుల మార్కెట్లోనూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వెరసి ఎలక్ట్రానిక్ ప్రొడక్టుల కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరర్ డిక్సన్ టెక్నాలజీస్ షేరు సరికొత్త గరిష్టాన్ని తాకితే.. వ్యవసాయ రంగ పరికరాలు, ట్రాక్టర్ల కంపెనీ వీఎస్టీ టిల్లర్స్ తాజాగా 52 వారాల గరిష్టానికి గరిష్టానికి చేరింది. ఇకపై ఈ రెండు కంపెనీలూ మెరుగైన పనితీరు చూపగలవన్న అంచనాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. వివరాలు చూద్దాం.. డిక్సన్ టెక్నాలజీస్ ఈ ఏడాది మార్చి 24న రూ. 2,900 వద్ద కనిష్టాన్ని చవిచూసిన డిక్సన్ టెక్నాలజీస్ ర్యాలీ బాటలో సాగుతోంది. తాజాగా ఎన్ఎస్ఈలో 3 శాతం ఎగసి రూ. 8,850 వద్ద ట్రేడవుతోంది. తొలుత 4 శాతంపైగా జంప్‌చేసి రూ. 8,940ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ఇటీవలి కనిష్టం నుంచి ఏకంగా 208 శాతం ర్యాలీ చేసింది. దేశీ ఎలక్ట్రానిక్ మార్కెట్లో పలు విభాగాల్లో కంపెనీ కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరింగ్ సర్వీసులను అందిస్తోంది. ఎంఎన్‌సీలు తదితర దిగ్గజాలకు ప్రొడక్టులను తయారు చేస్తోంది. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్, మొబైల్ ఫోన్లు, లెడ్ లైటింగ్ తదితర విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. వీఎస్టీ టిల్లర్స్ ట్రాక్టర్స్ గత ఐదు రోజుల్లో 18 శాతం బలపడిన వీఎస్టీ టిల్లర్స్ ట్రాక్టర్స్ మరోసారి పుంజుకుంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 2.5 శాతం పెరిగి రూ. 1860 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1924 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఆగస్ట్ నెలలో ట్రాక్టర్లు, టిల్లర్ల విక్రయాలు ఊపందుకోవడంతో ఇటీవల ఈ కౌంటర్ జోరు చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. గత నెలలో ప్రధానంగా టిల్లర్ల అమ్మకాలు దాదాపు 84 శాతం జంప్‌చేసి 2,638 యూనిట్లకు చేరడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌పై దృష్టి సారించినట్లు తెలియజేశారు. ట్రాక్టర్ల విక్రయాలు సైతం 813 యూనిట్ల నుంచి 897 యూనిట్లకు పెరగడం గమనార్హం! -
ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ షేర్లు హాట్.. హాట్
రెండు రోజులుగా అమెరికా మార్కెట్ల పతనం, చైనాతో సరిహద్దు వద్ద వివాదాలు దేశీ స్టాక్ మార్కెట్లను దెబ్బతీస్తున్నప్పటికీ ఎంపిక చేసిన కొన్ని మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు ట్రెండ్‌కు ఎదురీదుతున్నాయి. ఇందుకు నిదర్శనంగా ఇటీవల కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీలు హిందుస్తాన్ ఫుడ్స్ లిమిటెడ్, డీఎఫ్ఎం ఫుడ్స్ లిమిటెడ్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. వెరసి వారాంతాన నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో మరోసారి సందడి చేశాయి. ఇందుకు ప్రధానంగా కోవిడ్-19 నేపథ్యంలో ప్యాకేజ్డ్ ఫుడ్‌కు పెరుగుతున్న ఆదరణ కారణమవుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ఈ ఏడాది క్యూ1లో హిందుస్తాన్ ఫుడ్స్ పటిష్ట ఫలితాలు సాధించడం జత కలిసినట్లు తెలియజేశారు. ఎఫ్ఎంసీజీ విభాగంలో కార్యకలాపాలు విస్తరించిన ఈ కంపెనీలు ఇకపై మెరుగైన పనితీరును చూపవచ్చన్న అంచనాలు సైతం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నట్లు వివరించారు. వివరాలు చూద్దాం.. హిందుస్తాన్ ఫుడ్స్ లిమిటెడ్ శుక్రవారం వరుసగా మూడో రోజు హిందుస్తాన్ ఫుడ్స్ కౌంటర్‌కు భారీ డిమాండ్ నెలకొంది. దీంతో ఎన్ఎస్ఈలో ఈ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 858 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. గత 2 రోజుల్లోనూ అప్పర్ సర్క్యూట్లను తాకుతూ వచ్చింది. అంతేకాకుండా ఈ ఏడాది మార్చిలో నమోదైన కనిష్టం రూ. 380 నుంచి చూస్తే 126 శాతం దూసుకెళ్లింది. కంపెనీ ప్రధానంగా హిందుస్తాన్ యూనిలీవవర్, పెప్సీ కో తదితర ఎఫ్ఎంసీజీ దిగ్గజాలకు కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రొడక్టులను తయారు చేసి విక్రయిస్తుంటుంది. డీఎఫ్ఎం ఫుడ్స్ లిమిటెడ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ విభాగంలో క్రాక్స్, కర్ల్స్, నట్‌ఖట్ తదితర బ్రాండ్లు కలిగిన డీఎఫ్ఎం ఫుడ్స్ కౌంటర్ శుక్రవారం వరుసగా నాలుగో రోజూ వెలుగులో నిలిచింది. ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 7 శాతం జంప్‌చేసింది. రూ. 360ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. చివరికి 2.6 శాతం లాభంతో రూ. 342 వద్ద స్థిరపడింది. గత 4 సెషన్లలోనే డీఎఫ్ఎం ఫుడ్స్ షేరు 24 శాతం ర్యాలీ చేసింది. ఈ బాటలో 2020 మార్చిలో నమోదైన కనిష్టం రూ. 154 నుంచి షేరు 133 శాతం జంప్ చేయడం గమనార్హం. -
యూఎస్ మార్కెట్ల రికార్డ్.. రికార్డ్స్
వరుసగా నాలుగో రోజు బువారం యూఎస్ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. ఎస్అండ్పీ 35 పాయింట్లు(1 శాతం) ఎగసి 3,479 వద్ద నిలవగా.. నాస్డాక్ 199 పాయింట్లు(1.75 శాతం) జంప్‌చేసి 11,665 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. డోజోన్స్ 83 పాయింట్లు(0.3 శాతం) బలపడి 28,332 వద్ద స్థిరపడింది. వెరసి డోజోన్స్ సరికొత్త గరిష్టానికి 4 శాతం చేరువలో నిలిచింది. జులైలో తయారీ రంగ జోరుకు నిదర్శనంగా డ్యురబుల్ గూడ్స్ ఆర్డర్లు 11 శాతం వృద్ది చెందడంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇండెక్సుల జోరు ప్రధానంగా ఫాంగ్(FAAMNG) స్టాక్స్ లాభపడటంతో నాస్డాక్ 2020లో 39వ సారి సరికొత్త రికార్డును సాధించింది. ఇక ఎస్అండ్పీ సైతం 2020లో ఇప్పటివరకూ 18వ సారి రికార్డ్ గరిష్టాలను అందుకోవడం విశేషం! కాగా.. కోవిడ్-19 ప్రభావతో మార్చి 23న నమోదైన కనిష్టం 2,192 పాయింట్ల నుంచి ఎస్అండ్పీ 59 శాతం దూసుకెళ్లింది. ఇక జనవరి నుంచి చూస్తే కోవిడ్-19 నేపథ్యంలోనూ నాస్డాక్ 30 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! నెట్‌ఫ్లిక్స్ దూకుడు బుధవారం ట్రేడింగ్‌లో నెట్‌ఫ్లిక్స్ గత మూడేళ్లలోలేని విధంగా 12 శాతం దూసుకెళ్లి 547 డాలర్లను అధిగమించింది. ఇతర ఫాంగ్ స్టాక్స్‌లో మైక్రోసాఫ్ట్, అల్ఫాబెట్, ఫేస్బుక్ సరికొత్త గరిష్టాలను తాకాయి. ఈ బాటలో డోజోన్స్ ఇండెక్స్‌లో చోటు సాధించనున్న సేల్స్‌ఫోర్స్.కామ్ సైతం రికార్డ్ గరిష్టానికి చేరింది. పటిష్ట ఫలితాలు, గైడెన్స్ ఇందుకు దోహదం చేయగా.. ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ 6.4 శాతం జంప్‌చేసి 2153 డాలర్ల వద్ద ముగిసింది. ఇతర దిగ్గజాలలో యాపిల్ 1.4 శాతం పుంజుకోగా.. బోయింగ్ 1.6 శాతం క్షీణించింది. ఆదాయ అంచనాలు ఆకట్టుకోవడంతో హెచ్‌పీ ఎంటర్ప్రైజ్ 3.6 శాతం లాభపడగా.. ఫలితాలు నిరాశపరచడంతో రిటైలర్ నార్డ్‌స్ట్రామ్ 5.5 శాతం పతనమైంది. హరికేన్ లారా కారణంగా ఇంధన రంగ షేర్లు డీలాపడ్డాయి. -
ఎస్అండ్పీ- నాస్డాక్.. రికార్డ్ రికార్డ్స్
ప్రధానంగా ఫాంగ్(FAAMNG) స్టాక్స్ పురోగమించడంతో అమెరికన్ స్టాక్ ఇండెక్సులు మంగళవారం సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. అయితే ఓవైపు డోజోన్స్ నీరసించినప్పటికీ ఎస్అండ్పీ-500, నాస్డాక్ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. తాజాగా ఎస్అండ్పీ 8 పాయింట్లు(0.25 శాతం) పుంజుకుని 3,390వద్ద ముగిసింది. తద్వారా ఈ ఏడాది ఫిబ్రవరి 19న 3,386 వద్ద నిలవడం ద్వారా సాధించిన సరికొత్త గరిష్టాన్ని తిరగరాసింది. అంతేకాకుండా మార్చి 23న నమోదైన కనిష్టం నుంచీ ఏకంగా 55 శాతం ర్యాలీ చేసింది! దీంతో గత 87ఏళ్లలో అత్యధిక లాభాలను ఆర్జించిన రికార్డును సైతం ఎస్అండ్పీ సొంతం చేసుకుంది. ఫలితంగా ఫిబ్రవరి- మార్చి మధ్య నెల రోజుల కాలంలోనే బేర్ ట్రెండ్ అంతమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇది అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతితక్కువ కాలం నిలిచిన బేర్ మార్కెట్‌గా నమోదైనట్లు తెలియజేశారు. నాస్డాక్ జోరు ఈ ఏడాది జూన్‌లోనే ఫిబ్రవరి గరిష్టాలను దాటిన నాస్డాక్ మంగళవారం 81 పాయింట్లు(0.75 శాతం) ఎగసి 11,211 వద్ద నిలిచింది. వెరసి జూన్ నుంచీ ఇప్పటివరకూ నాస్డాక్ 18సార్లు సరికొత్త గరిష్టాలను నెలకొల్పడం విశేషం! అంతేకాకుండా 2020లో ఇప్పటివరకూ 34సార్లు ఈ ఫీట్ సాధించింది. కాగా.. రిటైల్ దిగ్గజాలు హోమ్ డిపో, వాల్‌మార్ట్ ఆకర్షణీయ ఫలితాలు సాధించినప్పటికీ షేర్లు 1 శాతం చొప్పున డీలాపడటంతో డోజోన్స్ 67 పాయింట్లు(0.25 శాతం) నీరసించి 27,778 వద్ద స్థిరపడింది. టెస్లా దూకుడు మంగళవారం ట్రేడింగ్‌లో టెక్నాలజీ, ఈకామర్స్, సోషల్ మీడియా దిగ్గజాలకు డిమాండ్ పెరిగింది. అమెజాన్ 4 శాతం జంప్‌చేయగా, గూగుల్ 2.7 శాతం ఎగసింది. ఈ బాటలో నెట్‌ఫ్లిక్స్ 2 శాతం, యాపిల్ 0.8 శాతం, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ 0.5 శాతం చొప్పున లాభపడ్డాయి. ఇక ఆటో, టెక్నాలజీ కంపెనీ టెస్లా ఇంక్ 2.8 శాతం పెరిగింది. ఆసియా అటూఇటుగా ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. హాంకాంగ్‌కు సెలవుకాగా.. జపాన్, కొరియా 0.5 శాతం చొప్పున ఎగశాయి. సింగపూర్ నామమాత్ర లాభంతో కదులుతోంది. అయితే తైవాన్, చైనా, థాయ్‌లాండ్, ఇండొనేసియా 0.5 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. -
వహ్వా.. దివీస్ ల్యాబ్- అబాట్ ఇండియా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో దేశీ ఫార్మా రంగ దిగ్గజం దివీస్ ల్యాబొరేటరీస్, గ్లోబల్ కంపెనీ అబాట్ ఇండియా ఆకర్షణీయ ఫలితాలు సాధించాయి. వారాంతాన ఈ రెండు కంపెనీలూ ఫలితాలు విడుదల చేయడంతో నేటి ట్రేడింగ్‌లో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. దివీస్ ల్యాబ్ 15 శాతం అప్పర్ సర్క్యూట్‌ను సైతం తాకడం విశేషం! ఇతర వివరాలు చూద్దాం.. దివీస్ ల్యాబొరేటరీస్ ఎన్ఎస్ఈలో తొలుత దివీస్ ల్యాబ్ షేరు 15 శాతం దూసుకెళ్లింది. రూ. 3,293ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ప్రస్తుతం 14 శాతం జంప్‌చేసి రూ. 3,170 వద్ద ట్రేడవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో దివీస్ ల్యాబ్ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. నికర లాభం దాదాపు 81 శాతం దూసుకెళ్లి రూ. 492 కోట్లను తాకింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 272 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 1193 కోట్ల నుంచి రూ. 1748 కోట్లకు ఎగసింది. ఇది 46 శాతం వృద్ధికాగా.. కోవిడ్-19 కాలంలోనూ దాదాపు సాధారణ స్థాయిలో కార్యకలాపాలను నిర్వహించగలిగినట్లు ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ తెలియజేసింది. అబాట్ ఇండియా ఎన్ఎస్ఈలో తొలుత అబాట్ ఇండియా షేరు 7 శాతం దూసుకెళ్లింది. రూ. 17,350 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 4.4 శాతం జంప్‌చేసి రూ. 16,901 వద్ద ట్రేడవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో అబాట్ ఇండియా ఆసక్తికర ఫలితాలు సాధించింది. నికర లాభం 54 శాతం జంప్‌చేసి రూ. 180 కోట్లను అధిగమించింది. గతేడాది(2019-20) క్యూ1లో ఆర్జన రూ. 117 కోట్లు మాత్రమే. ఇదే కాలంలో మొత్తం ఆదాయం సైతం రూ. 999 కోట్ల నుంచి రూ. 1064 కోట్లకు పెరిగింది. -
అదిరే.. అదిరే.. పసిడే.. అధరే- వెండి రికార్డ్
విదేశీ మార్కెట్లో ప్రతి రోజూ సరికొత్త రికార్డులను సాధిస్తున్న ధరలకు అనుగుణంగా దేశీయంగానూ బంగారం, వెండి ధరలకు రెక్కలొస్తున్నాయి. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి(అక్టోబర్ ఫ్యూచర్స్) రూ. 202 పుంజుకుని రూ. 55,300 వద్ద ట్రేడవుతోంది. ఎంసీఎక్స్‌లో సెప్టెంబర్ ఫ్యూచర్స్ వెండి కేజీ ధర సైతం రూ. 691 బలపడి రూ. 72,584 వద్ద కదులుతోంది. కాగా.. మంగళవారమే వెండి రూ. 4,000 జంప్‌చేయడం ద్వారా రూ. 76,000 మార్క్‌ను అధిగమించి దేశీయంగా సరికొత్త గరిష్టాన్ని సాధించింది. ఇంతక్రితం 2011 ఏప్రిల్ 25న రూ. 75,000 వద్ద వెండి చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ఆరో రోజూ రికార్డ్స్ కోవిడ్-19 సృష్టిస్తున్న సంక్షోభం కారణంగా బంగారం, వెండి ధరలలో ఆరో రోజూ ర్యాలీ కొనసాగుతోంది. బులియన్ చరిత్రలో గురువారం మరోసారి అటు ఫ్యూచర్స్,.. ఇటు స్పాట్ మార్కెట్లలో బంగారం ధరలు సరికొత్త రికార్డులకు చేరాయి. వెండి ధర 7ఏళ్ల గరిష్టాలకు చేరింది. ఈ బాటలో నేటి ట్రేడింగ్‌లో సైతం లాభాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) బంగారం 0.6 శాతం బలపడి 2,081 డాలర్లకు ఎగువకు చేరింది. స్పాట్ మార్కెట్లోనూ 0.25 శాతం లాభంతో 2,068 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. తద్వారా మరోసారి ఆల్‌టైమ్ హై రికార్డులను సృష్టించాయి. ఈ వారంలోనే పసిడి 4.7 శాతం జంప్‌చేయడం విశేషం! ఇక వెండి సైతం ఔన్స్ 2.5 శాతం ఎగసి 29.12 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. తద్వారా 2013 తదుపరి గరిష్ట స్థాయికి చేరింది! గురువారం సైతం.. దేశీయంగా ఎంసీఎక్స్‌లో గురువారం 10 గ్రాముల పసిడి రూ. 747 లాభపడి రూ. 55,845 వద్ద నిలిచింది. తొలుత రూ. 56,079 వద్ద గరిష్టాన్ని తాకింది. వెండి కేజీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ ధర రూ. 4,159 దూసుకెళ్లి రూ. 76,052 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 76,360 వరకూ ఎగసింది. తద్వారా 2011 ఏప్రిల్ 25న సాధించిన రికార్డ్ గరిష్టం రూ. 75,000ను సులభంగా దాటేసింది! కారణాలేవిటంటే? చైనాలో పుట్టి ప్రపంచ దేశాలన్నిటా పాకిన కోవిడ్-19 కారణంగా ఆర్థిక వ్యవస్థలు మందగిస్తున్నాయి. పలు దేశాలు లాక్‌డవున్‌లతో కరోనా వైరస్ కట్టడికి చర్యలు చేపట్టడంతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోతున్నాయి. ఫలితంగా కేంద్ర బ్యాంకులు బిలియన్లకొద్దీ నిధులను నామమాత్ర వడ్డీలతో రుణాలుగా అందిస్తున్నాయి. దీనికితోడు ప్రభుత్వాలు సైతం ప్రత్యక్ష నగదు బదిలీ వంటి పథకాలు అమలు చేస్తున్నాయి. అయితే ఈ నిధులు సంక్షోభ కాలంలో రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడివైపు అధికంగా మళ్లుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇదే విధంగా ఈక్విటీలకూ ప్రవహిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు దూకుడు చూపుతున్నట్లు తెలియజేశారు. బంగారాన్ని అధిక పరిమాణంలో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు కొనుగోలు చేసే విషయం విదితమే. మరోవైపు గోల్డ్ ఈటీఎఫ్‌లు భారీగా పసిడిలో ఇన్వెస్ట్ చేస్తుండటం గమనార్హం. డాలర్ ఎఫెక్ట్ ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ కొద్ది రోజులుగా రెండేళ్ల కనిష్టం వద్దే కదులుతోంది. దీంతో వరుసగా ఏడో వారంలోనూ నష్టాలతో ముగిసే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు యూఎస్ ట్రెజరీల ఈల్డ్స్ బలహీనపడుతున్నాయి. తాజాగా ఐదు నెలల కనిష్టాలకు చేరాయి. ఇవన్నీ పసిడి ధరలకు బలాన్నిస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. -
పసిడి.. వెండి- ఆకాశమే హద్దు
ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులతోపాటు.. ఈటీఎఫ్‌ల వంటి ఇన్వెస్ట్మెంట్ సంస్థలనూ భారీగా ఆకట్టుకుంటున్న బంగారం, వెండి ధరల ర్యాలీ కొనసాగుతూనే ఉంది. బులియన్ చరిత్రలో బుధవారం మరోసారి అటు ఫ్యూచర్స్,.. ఇటు స్పాట్ మార్కెట్లలో బంగారం ధరలు సరికొత్త రికార్డులకు చేరాయి. ఈ బాటలో వెండి ధర 7ఏళ్ల గరిష్టాలకు చేరింది. నేటి ట్రేడింగ్‌లో సైతం లాభాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) బంగారం 0.2 శాతం బలపడి 2056 డాలర్లకు ఎగువన కదులుతోంది. స్పాట్ మార్కెట్లోనూ స్వల్ప లాభంతో 2043 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. 2020లో ఇప్పటివరకూ పసిడి 500 డాలర్లు ఎగసింది. ఇది 34 శాతం వృద్ధికాగా.. గత రెండు వారాల్లోనే 200 డాలర్లు పెరగడం విశేషం! ఇక వెండి సైతం 0.6 శాతం బలపడి 27 డాలర్లకు ఎగువన ట్రేడవుతోంది. తద్వారా 2020లో ఏకంగా 48 శాతం ర్యాలీ చేసింది. వెరసి 2013 తదుపరి గరిష్ట స్థాయికి చేరింది! ర్యాలీ బాటలోనే ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి(అక్టోబర్ ఫ్యూచర్స్) రూ. 202 పుంజుకుని రూ. 55,300 వద్ద ట్రేడవుతోంది. సెప్టెంబర్ ఫ్యూచర్స్ వెండి కేజీ ధర సైతం రూ. 691 బలపడి రూ. 72,584 వద్ద కదులుతోంది. దేశీయంగానూ దేశీయంగా ఎంసీఎక్స్‌లో బుధవారం 10 గ్రాముల పసిడి రూ. 547(1 శాతం) లాభపడి రూ. 55,098 వద్ద నిలిచింది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధరకాగా.. తొలుత గరిష్టంగా రూ. 55,597ను తాకింది. సెప్టెంబర్ ఫ్యూచర్స్ వెండి కేజీ ధర రూ. 2096(3 శాతం) దూసుకెళ్లి రూ. 71,893 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 72,980 వరకూ ఎగసింది. తద్వారా 2011 ఏప్రిల్ 25న సాధించిన రికార్డ్ గరిష్టం రూ. 75,000 మార్క్‌కు చేరువైంది! ఈటీఎఫ్‌ల జోరు ఈ జనవరి-జూన్ కాలంలో పసిడి ఈటీఎఫ్‌లలో ఇన్వెస్టర్లు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. గత ఆరు నెలల కాలంలో 734 టన్నుల పసిడిని ఇన్వెస్టర్లు కొనుగోలు చేసినట్లు తెలియజేసింది. దీంతో జూన్‌చివరికల్లా గోల్డ్ ఈటీఎఫ్‌ల మొత్తం విలువ 3,621 టన్నులకు చేరినట్లు వెల్లడించింది. ఇది సరికొత్త రికార్డ్ కావడం గమనార్హం! అంటే ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఇన్వెస్టర్లు 47 బిలియన్ డాలర్లను గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేశారు. పసిడి ఈటీఎఫ్‌ల విలువ చరిత్రలో తొలిసారి 206 బిలియన్ డాలర్లను తాకింది. కాగా.. ప్రస్తుత ధరల ప్రకారం జులై చివరికల్లా 922 టన్నుల పసిడి జమకాగా.. 60 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసినట్లు డబ్ల్యూజీసీ తాజాగా తెలియజేసింది. -
బంగారం- వెండి.. రికార్డులే రికార్డులు
ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులతోపాటు.. సాధారణ ప్రజలకూ అత్యంత ప్రీతిపాత్రమైన బంగారం, వెండి ధరలు మరింత ప్రియమయ్యాయి. బులియన్ చరిత్రలో తొలిసారి అటు ఫ్యూచర్స్,.. ఇటు స్పాట్ మార్కెట్లలో బంగారం ధరలు మంగళవారం 2,000 డాలర్లకు ఎగువన ముగిశాయి. ఫ్యూచర్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) దాదాపు 35 డాలర్లు జంప్‌చేసి 2021 డాలర్ల వద్ద ముగసింది. ఇక స్పాట్ మార్కెట్లోనూ పసిడి 2019 డాలర్ల వద్ద నిలిచింది. తద్వారా సరికొత్త రికార్డులను లిఖించాయి. ఇక వెండి సైతం ఔన్స్ 26 డాలర్లను దాటేసింది. వెరసి 2013 తదుపరి గరిష్ట స్థాయికి వెండి చేరింది! దేశీయంగానూ ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) బంగారం 0.6 శాతం బలపడి 2032 డాలర్లకు ఎగువన కదులుతోంది. స్పాట్ మార్కెట్లో మాత్రం 0.2 శాతం నీరసించి 2014 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి సైతం 0.3 శాతం నీరసించి 26 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది. కాగా.. దేశీయంగా ఎంసీఎక్స్‌లో మంగళవారం 10 గ్రాముల పసిడి రూ. 834 లాభపడి రూ. 54,551 వద్ద నిలిచింది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధరకాగా.. సెప్టెంబర్ ఫ్యూచర్స్ వెండి కేజీ ధర రూ. 4049 దూసుకెళ్లి రూ. 69,797 వద్ద ముగిసింది. వెరసి నేటి ట్రేడింగ్‌లోనూ పసిడి ధరలు హైజంప్ చేయనున్నట్లు కమోడిటీ నిపుణులు చెబుతున్నారు. ర్యాలీ బాటలోనే ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి(అక్టోబర్ ఫ్యూచర్స్) రూ. 219 పుంజుకుని రూ. 54,770 వద్ద ట్రేడవుతోంది. సెప్టెంబర్ ఫ్యూచర్స్ వెండి కేజీ ధర సైతం రూ. 64 బలపడి రూ. 69,861 వద్ద కదులుతోంది. 2500 డాలర్లకు సమీప భవిష్యత్‌లో ఔన్స్ పసిడి 2500 డాలర్లను తాకే వీలున్నట్లు యూఎస్‌కు చెందిన బులియన్ సాంకేతిక విశ్లేషకులు విడ్మర్, ఫ్రాన్సిస్కో బ్లాంచ్ అభిప్రాయపడ్డారు. బంగారానికి అత్యంత కీలకమైన 2000 డాలర్ల రెసిస్టెన్స్‌ను భారీ ట్రేడింగ్ పరిమాణంతో అధిగమించడంతో ఇకపై మరింత జోరందుకునే వీలున్నట్లు పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా.. రానున్న 18 నెలల కాలంలో బంగారం ఔన్స్ ధర 3,000 డాలర్లకు చేరవచ్చని బీవోఎఫ్‌ఏ గ్లోబల్ రీసెర్చ్ అంచనా వేసింది. కోవిడ్-19 ప్రపంచ దేశాలన్నిటా వేగంగా విస్తరిస్తుండటం, కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు భారీ సహాయక ప్యాకేజీలను అమలు చేయడం వంటి అంశాలు బంగారానికి డిమాండ్ పెంచుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. -
Q1 ఎఫెక్ట్- ఎస్బీఐ కార్డ్స్ జూమ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తొలుత ఎన్ఎస్ఈలో ఈ షేరు 6 శాతం దూసుకెళ్లి రూ. 797కు చేరింది. వెరసి ఈ ఏడాది మార్చి 16న లిస్టయ్యాక రికార్డ్ గరిష్టాన్ని అందుకుంది. ప్రస్తుతం 5.2 శాతం లాభపడి రూ. 790 వద్ద ట్రేడవుతోంది. రూ. 393 కోట్లు ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఎస్బీఐ కార్డ్స్ నికర లాభం 14 శాతం వృద్ధితో రూ. 393 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం మరింత అధికంగా 52 శాతం ఎగసి రూ. 1138 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.68 శాతం నుంచి 1.35 శాతానికి భారీగా తగ్గాయి. త్రైమాసిక ప్రాతిపదికన సైతం 2 శాతం నుంచి దిగివచ్చాయి. కాగా.. నికర ఎన్పీఏలు 1.3 శాతం వెనకడుగుతో 1.35 శాతంగా నమోదయ్యాయి. ఇందుకు మారటోరియం కారణమైనట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. పూర్తిఏడాదికి(2021) నికర ఎన్పీఏలు 4.5 శాతంగా నమోదుకావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. క్రెడిట్ వ్యయాలు 6.3 శాతానికి చేరవచ్చని భావిస్తున్నారు. -
ఐవోఎల్- టాటా కన్జూమర్.. రికార్డ్స్
ఆటుపోట్ల మార్కెట్లోనూ హెల్త్‌కేర్ రంగ కంపెనీ ఐవోఎల్ కెమికల్స్, ఎఫ్ఎంసీజీ కంపెనీ టాటా కన్జూమర్, సాఫ్ట్వేర్ సేవల సంస్థ ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీగా లాభపడటం ద్వారా చరిత్రాత్మక గరిష్టాలను తాకాయి. వివరాలు చూద్దాం.. ఐవోఎల్ కెమికల్స్ కంపెనీ బ్యాంక్ సౌకర్యాల(రుణ చెల్లింపుల)ను కేర్ రేటింగ్స్ తాజాగా A-నుంచి Aకు అప్‌గ్రేడ్ చేసిన వార్తలతో ఐవోఎల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 7 శాతంపైగా దూసుకెళ్లి రూ. 592ను అధిగమించింది. ఇది సరికొత్త గరిష్టంకాగా ప్రస్తుతం 5.3 శాతం ఎగసి రూ. 582 వద్ద ట్రేడవుతోంది. మార్చి 25 నుంచీ ఈ షేరు 302 శాతం ర్యాలీ చేయడం విశేషం! టాటా కన్జూమర్ విదేశీ రీసెర్చ్ సంస్థ క్రెడిట్ స్వీస్ తాజాగా ఔట్పెర్ఫార్మ్ రేటింగ్‌ను ప్రకటించిన నేపథ్యంలో టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. తొలుత ఎన్ఎస్ఈలో ఈ షేరు 6 శాతంపైగా జంప్‌చేసి రూ. 436ను అధిగమించింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 4.4 శాతం లాభంతో రూ. 431 వద్ద ట్రేడవుతోంది. పటిష్ట ఎఫ్ఎంసీజీ బ్రాండ్లకుతోడు బలమైన సీఈవోను కొత్తగా ఎంపిక చేసుకున్న నేపథ్యంలో అత్యుత్తమ రేటింగ్‌ను ప్రకటించనట్లు క్రెడిట్ స్వీస్ పేర్కొంది. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ కౌంటర్‌కు మరోసారి డిమాండ్ నెలకొంది. దీంతో తొలుత ఎన్ఎస్ఈలో ఈ షేరు 3 శాతానికిపైగా ఎగసి రూ. 2070ను తాకింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ప్రస్తుతం 2 శాతం లాభంతో రూ. 2048 వద్ద కదులుతోంది. గత ఐదు రోజుల్లో ఈ కౌంటర్ 7 శాతం పుంజుకుంది. -
ముత్తూట్ రికార్డ్- ఎంజీఎల్ జోరు
ప్రపంచ మార్కెట్లు వెనకడుగు వేయడంతో దేశీయంగానూ సెంటిమెంటు బలహీనపడింది. 2020లో యూఎస్ జీడీపీ 6.5 శాతం క్షీణించనున్నట్లు తాజాగా ఫెడరల్ రిజర్వ్ వేసిన అంచనాలతో అమెరికా, ఆసియా మార్కెట్లు క్షీణించాయి. ఈ బాటలో దేశీ స్టాక్ మార్కెట్లు సైతం నష్టాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల ప్రభావంతో ఎన్బీఎఫ్సీ ముత్తూట్ ఫైనాన్స్, మహానగర్ గ్యాస్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. నష్టాల మార్కెట్లనూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ముత్తూట్ ఫైనాన్స్ కోవిడ్-19 కట్టడికి లాక్‌డవున్ అమలు నేపథ్యంలో పసిడి రుణాలకు డిమాండ్ పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడం కూడా దీనికి జత కలసినట్లు చెబుతున్నారు. దీంతో బంగారు ఆభరణాలపై రుణాలిచ్చే ముత్తూట్ ఫైనాన్స్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతున్నట్లు తెలియజేశారు. మరోవైపు పసిడి ధరలు బలపడుతుండటం కూడా కంపెనీని సానుకూల అంశంగా తెలియజేశారు. ఈ నేపథ్యంలో వరుసగా మూడో రోజు ముత్తూట్ ఫైనాన్స్ కౌంటర్‌కు డిమాండ్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 2 శాతం బలపడి రూ. 990 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 998వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ఇంతక్రితం ఈ ఫిబ్రవరి 25న రూ. 954 వద్ద రికార్డ్ గరిష్టానికి చేరింది. ఇక మార్చి కనిష్టం రూ. 477 నుంచి చూస్తే 105 శాతంపైగా ఎగసింది. మహానగర్ గ్యాస్ గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో యుటిలిటీ కంపెనీ మహానగర్ గ్యాస్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి-మార్చి)లో నికర లాభం 25 శాతం పెరిగి రూ. 167 కోట్లకు చేరగా.. నికర అమ్మకాలు 5 శాతం నీరసించి రూ. 687 కోట్లకు పరిమితమయ్యాయి. నిర్వహణ లాభం మాత్రం 10 శాతం పుంజుకుని రూ. 225 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మహానగర్ గ్యాస్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 1042 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1044 వరకూ ఎగసింది. -
రియల్టీ బూస్ట్ : సూచీల జోరు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. వరుసగా మూడో రోజు లాభాలతో ప్రారంభమైన ఆ తరువాత మరింత స్టాక్‌మార్కెట్లు జోరందుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా ఎగిసి సరికొత్త గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ కూడా 12000 పాయింట్లను అధిగమించింది.ప్రస్తుతం 141 పాయింట్లు ఎగసి 40,610వద్ద నిఫ్టీ 31 పాయింట్లు పుంజుకుని 11997వద్ద ట్రేడవుతోంది. ప్రధానంగా రియల్టీ 2 శాతం, బ్యాంక్ నిఫ్టీ లాభపడుతుండగా, మెటల్, ఆటో రంగాలు బలహీనంగా ఉన్నాయి. ఇన్ఫ్రాటెల్, ఇండస్ఇండ్, అల్ట్రాటెక్, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, జీ, సన్ ఫార్మా, టీసీఎస్, గ్రాసిమ్, ఎస్బీఐ లాభాల్లో కనొసాగుతున్నాయి. అయితే టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, వేదాంతా, యస్ బ్యాంక్, బీపీసీఎల్, హీరో మోటో, ఐషర్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ నష్టపోతున్నాయి. మరోవైపు రియల్టీ రంగంకోం కేంద్రం రూ. 25వేలకోట్ల ఫండ్ ప్రకటించడంతో రియల్టీ హౌసింగ్‌షేర్లలో కొనుగోళ్లు పుంజుకున్నాయి. రియల్టీ కౌంటర్లలో ఇండియాబుల్స్, శోభా, ప్రెస్టేజ్, ఒబెరాయ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, డీఎల్ఎఫ్, బ్రిగేడ్ భారీగా లాభపడుతున్నాయి. -
బుల్ రన్, ఆల్ టైం గరిష్టానికి సెన్సెక్స్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. మిశ్రమ ప్రపంచ సంకేతాల నడుమ దేశీ స్టాక్ మార్కెట్లు నీరసంగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 101 పాయింట్లు బలహీనపబడగా, నిఫ్టీ 11900 స్థాయిని కోల్పోయింది. అయితే మిడ్ సెషన్ తరువాత ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో కీలక సూచీలు రెండూ గరిష్ట స్థాయిలను నమోదు చేసాయి. సెన్సెక్స్ 346 పాయింట్లకు పైగా ఎగిసి 40606 స్థాయిని నమదు చేయగా, నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 12000 స్థాయిని టచ్ చేసింది. ఈ ఏడాది జూలై 12103 స్తాయి వద్ద ఆల్ టై గరిష్టానికి చేరింది. ఆ తరువాత ఆ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. ప్రధానంగా రియల్టీ, ప్రయివేట్ బ్యాంక్స్ మీడియా, ఫార్మా, మెటల్ రంగాలు లాభపడుతున్నాయి. టైటన్, భారతి ఎయిర్టెల్, ఐవోసీ, మారుతి సుజుకి, టాటా స్టీల్ ఎస్బీఐ, రిలయన్స్ గెయిల్స్ నష్టపోతుండగా, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంకు, ఇండస్ ఇండ్, హెడ్ఎఫ్సీ, కోటక్ మహీంద్ర, కోల్ ఇండియా లాభపడుతున్నాయి. -
రూ 40,000కు చేరిన పసిడి
ముంబై : బంగారం ధరలు సరికొత్త శిఖరాలకు చేరాయి. అమెరికా-చైనా ట్రేడ్‌వార్, ఆర్థిక మందగమనం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పరుగులు పెడుతోంది. ముంబైలో సోమవారం పదిగ్రాముల బంగారం రూ 40,000 దాటింది. వాణిజ్య యుద్ధాలు, ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితి కొనసాగితే బంగారం ధరలు కొద్ది నెలల్లోనే రూ 41,000 దాటుతాయని జెమ్స్ అండ్ జ్యూవెలరీ ఫెడరేషన్ మాజీ చైర్మన్ బచ్‌రాజ్ బమాల్వా చెప్పారు. పసిడి ధరలు పైపైకి ఎగబాకినా పండుగ సీజన్‌తో పాటు రాబోయే పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో డిమాండ్‌పై పెద్దగా ప్రభావం ఉండదని అంచనా వేశారు. మరోవైపు బంగారం ధరలు భారీగా పెరగడంతో అమ్మకాలు పడిపోయాయని, పాత బంగారం రీసైక్లింగ్ పెరిగిందని ముంబై జ్యూవెలర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ రాకేష్ శెట్టి చెప్పారు. ఇక దీపావళి నాటికి పదిగ్రాముల పసిడి రూ 41,000కు చేరుతుందని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఆగని పెట్రో పరుగు : హైదరాబాద్‌లో ఎంత?
సాక్షి, న్యూఢిల్లీ: ఇంధన ధరలపై దేశవ్యాప్తంగా ఆందోళన పెరుగుతున్నప్పటికి పెట్రో ధరల పరుగుకు అడ్డకట్ట పడటంలేదు. ఇటీవల భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం కూడా ఇంకా రికార్డు హైలో కొనసాగుతున్నాయి. సోమవారంతో పోలిస్తే ఢిల్లీలో పెట్రోల్ ధర 14 పైసలు పెరిగి లీటరు రూ.80.87 పైసలకు చేరింది. డీజిల్ ధర లీటరుకు రూ. 72.97గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోలు ధర 14 పైసలు పెరిగి 88.26 రూపాయలకు చేరుకుంది. డీజిల్ ధర 15 పైసలు పెరిగి 77.47 గా ఉంది.చెన్నైలో పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా 14, 15 పైసలు పెరిగాయి. పెట్రోలు ధర లీటరుకు రూ. 84.05, ధర రూ. 77.13గా ఉంది. కోలకతాలో పెట్రోలు, డీజిల్ ధరలు 14 పైసలు పెరిగి 83.75, 75.82 రూపాయలకు చేరింది. హైదరాబాద్ లో మంగళవారం లీటర్ పెట్రోలు ధర రూ.85.60 కాగా లీటర్ డీజిల్ ధర రూ.79.22గా ఉంది. పెట్రోల్ ధర 25 పైసలు, డీజిల్ ధర 24 పైసలు పెరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.2 తగ్గించింది. దీంతో సోమవారం నాటి ధరలతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. అలాగే రాజస్థాన్ సర్కార్ కూడా 4 శాతం వ్యాట్‌ను తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. పెట్రోల్, డీజిల్ లీటరు ధరలపై రూ.2 .50 తగ్గిస్తూ వసుంధరా రాజే సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
నిఫ్టీ @10,400
సాక్షి,ముంబై: స్టాక్‌మార్కెట్ కీలక సూచీలు మరో గరిష్ట స్థాయిని నమోదు చేశాయి.. వరుసగా7వ సెషన్లో కూడా లాభపడిన మార్కెట్లలో నిఫ్టీ 10,400 మార్క్‌ను టచ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీకూడా ఇదే జోరును కనబరుస్తోంది. ఆరంభంనుంచి పాజిటివ్‌గానే సూచీల్లో లాభాల పరంపర కొనసాగింది. ముఖ్యంగా మిడ్ సెషన్లో ఊపందుకున్న కొనుగోళ్లతో మార్కెట్లు మరోసారి సాంకేతికంగా కీలక స్థాయిలను అధిగమించాయి. సెన్సెక్స్ 33,700ను దాటగా.. నిఫ్టీ 10,400ను అందుకుంది. ఒక్క మెటల్ మినహా దాదాపు అన్ని రంగాల్లోనూ లాభాలే. సెన్సెక్స్ 125పాయింట్లు ఎగిసి 33,713వద్ద, నిప్టీ 50 పాయింట్లు పుంజుకుని10,399 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. ఐటీ, ఫార్మా లాభాలు మార్కెట్లను లీడ్ చేస్తున్నాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ కూడా పాజటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతి ఇన్ఫ్రాటెల్ టాప్ గెయినర్‌గా ఉండగా.. ఇండస్ఇండ్, ఇన్ఫోసిస్, హెచ్‌పీసీఎల్, బజాజ్ ఫైనాన్స్, అరబిందో, గెయిల్, అల్ట్రాటెక్, పవర్‌గ్రిడ్, బజాజ్ ఆటో లాభాల పంట పండిస్తున్నాయి. ఇక మెటల్ సెక్టార్లో హిందాల్కో, టాటా స్టీల్, వేదాంతా అదానీ పోర్ట్స్ లతోపాటు బ్లాక్ డీల్ వార్తలతో ఐడియా, హెచ్‌యూఎల్ బాంబే డైయింగ్ తదితర షేర్లు నష్టపోతున్నాయి. మరోవైపు డాలర్ బలహీనత నేపథ్యంలో దేశీయ కరెన్సీ లాభాల్లో కొనసాగుతోంది. డాలర్ మారకంలో రూపాయి 0.09పైసల లాభంతో రూ. 64.66 వద్ద ఉంది. అలాగే ఎంసీఎక్స్‌మార్కెట్ లో పుత్తడి పది గ్రా. 35 ఎగిసి రూ. 29, 474 వద్ద కొనసాగుతోంది. -
నిఫ్టీ.. న్యూ హై
10,153 పాయింట్ల వద్ద నిఫ్టీ ముగింపు ► సెన్సెక్స్ 151 పాయింట్లు అప్ ► అంతర్జాతీయ సానుకూల ట్రెండ్ ప్రభావం ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ట్రెండ్ ప్రభావంతో సోమవారం ఎన్ఎస్ఈ నిఫ్టీ సరికొత్త రికార్డుస్థాయికి చేరింది. ఆగస్టు 2నాటి రికార్డుస్థాయి అయిన 10,138 పాయింట్లస్థాయిని దాటిన నిఫ్టీ ఇంట్రాడేలో 10,172 పాయింట్ల వరకూ ర్యాలీ జరిపింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 68 పాయింట్ల లాభంతో 10,153 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అయితే బీఎస్ఈ సెన్సెక్స్ మాత్రం ఆగస్టు 2నాటి 32,686 పాయింట్ల రికార్డుస్థాయిని ఇంకా అందుకోవాల్సివుంది. ఈ సూచీ 32,502 పాయింట్ల వరకూ పెరిగిన తర్వాత..చివరకు 151 పాయింట్ల లాభంతో 32,424 పాయింట్ల వద్ద ముగిసింది. గత శుక్రవారం అమెరికా మార్కెట్ కొత్త గరిష్టస్థాయిని చేరిన ప్రభావంతో ఆసియా సూచీలు సోమవారం జోరుగా ర్యాలీ జరిపాయి. హాంకాంగ్, కొరియా, సింగపూర్, తైవాన్ తైపీ సూచీలు 0.5–1.5 శాతం మధ్య పెరిగాయి. యూరప్ సూచీలు స్వల్పలాభాలతో ముగియగా, అమెరికా ఎస్అండ్పీ–500 సూచీ 2,500 పాయింట్ల స్థాయిని అధిగమించి కొత్త రికార్డును నెలకొల్పింది. తాజా పెరుగుదలతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 136.76 లక్షల కోట్లకు చేరింది. ఫెడ్‌పై కన్ను..: ఉత్తర కొరియా ఉద్రిక్తతలు చల్లారడం, బుధవారంనాటి ఫెడరల్ రిజర్వ్ సమీక్షలో వడ్డీ రేట్లు పెరగకపోవొచ్చన్న అంచనాలు ర్యాలీకి కారణమని విశ్లేషకులు చెప్పారు. అంతర్జాతీయ సంకేతాల పటిష్టత కారణంగా నిఫ్టీ కొత్త హైకి చేరిందని, క్రమేపీ విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు తగ్గడం, స్వల్పంగా కొనుగోళ్లకు శ్రీకారం చుట్టడం కూడా సెంటిమెంట్‌ను బలపర్చిందని జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. మరోవైపు మంగళ, బుధవారాల్లో జరగనున్న ఫెడ్ సమావేశంపై ఇన్వెస్టర్లు దృష్టి నిలిపారని, వడ్డీ రేట్లను య«థాతథంగా అట్టిపెడతారన్న అంచనావేస్తున్నట్లు ఆయన వివరించారు. బ్యాంక్ నిఫ్టీ స్పీడు... కొన్ని హెవీవెయిట్ బ్యాంకింగ్ షేర్లు ర్యాలీ జరపడంతో ఎన్ఎస్ఈ బ్యాంక్ నిఫ్టీ 0.8 శాతంపైగా ర్యాలీ జరిపి 25,000 పాయింట్ల స్థాయిని అధిగమించి.. 25,046 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ గత నెలలో 25,198 పాయింట్ల వద్ద నెలకొల్పిన కొత్త రికార్డును అందుకోవాల్సివుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 1% పెరిగి చరిత్రాత్మక గరిష్టస్థాయి రూ.1,861 వద్ద క్లోజయ్యింది. ఇండస్ఇండ్ బ్యాంక్ 3%, కొటక్ బ్యాంక్ 1.5% చొప్పున ఎగిసాయి. క్యాపిటల్ గూడ్స్, ఆటో, టెక్నాలజీ, విద్యుత్ షేర్లు ర్యాలీలో పాలుపంచుకున్నాయి. సెన్సెక్స్–30 షేర్లలో అన్నింటికంటే అధికంగా బజాజ్ ఆటో 3.57 శాతం పెరిగి కొత్త రికార్డుస్థాయి రూ. 3,129 వద్ద ముగిసింది. -
సెన్సెక్స్ మరో రికార్డు
ముంబై: దలాల్ స్ట్రీట్ లో రికార్డుల వర్షం కొనసాగుతోంది. ముఖ్యంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడం,గ్లోబల్ మార్కెట్లు సానుకూల ధోరణి నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కొత్త గరిష్టాలను అందుకున్నాయి. దేశీయంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యమివ్వడంతో అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. సెన్సెక్స్ 32,132 వద్ద, నిఫ్టీ 9,920 వద్ద ఆల్‌టైమ్ 'హై' లను నమోదు చేశాయి. దీంతోపాటు డాలర్ మారకంలో రూపాయి, బంగారం ధరలు కూడా పాజిటివ్ నోట్‌తో లాభాలతో ట్రేడ్ అవుతూ వుండటం విశేషం. అటు బ్యాంక్ నిఫ్టీ సైతం 71 పాయింట్లు ఎగసి 24,009ని అధిగమించింది. అంతేకాదు మార్కెట్ లీడర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా మార్కెట్ క్యాప్ లో రూ. 5లక్షల కోట్లను క్రాస్ చేసింది. ఐటీ 1.4 శాతం, మెటల్ 0.9 శాతం, ఆటో 0.5 శాతం చొప్పున లాభపడ్డాయి. మరోవైపు టుబాకో పై జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ బలహీనంగా ఉంది. ముఖ్యంగా ఐటీసీ 3శాతం నష్టపోయింది. దీంతో మార్కెట్లు కొద్దిగా వెనుకంజలో ఉన్నాయి. విప్రో, వేదాంతా, అదానీ పోర్ట్స్, ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ, టెక్‌మహీంద్రా, ఇన్ఫోసిస్, ఆర్ఐఎల్, హిందాల్కో, హెచ్‌సీఎల్ టెక్ లాభపడుతుండగా, ఐటీసీ, గెయిల్, ఐవోసీ, యాక్సిస్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, హెచ్‌యూఎల్, అరబిందో నష్టాల్లో ఉన్నాయి. రూపాయి 0.09 పైసల లాభంతో రూ. 64.36వద్ద, పసిడి రూ.41 పుంజుకుని పది గ్రా. రూ.28,037 వద్ద కొనసాగుతోంది. -
స్టాక్‌మార్కెట్ల దూకుడు: సరికొత్త రికార్డులు
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో భారీలాభాలతో మొదలైన సెన్సెక్స్ 31,333 నిఫ్టీ 9673 వద్ద కొత్త రికార్డ్ స్థాయిలను నమోదు చేశాయి. ఒకదశలో డబుల్ సెంచరీ కొట్టిన మార్కెట్లలో సెన్సెక్స్ 133 పాయింట్లు ఎగిసి 31,271 వద్ద, నిఫ్టీ 45 పాయింట్లు లాభపడి 9660 వద్ద పటిష్టంగా కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని సెక్టార్లు లాభాల్లో ఉండగా మెటల్ స్వల్పంగా నష్టపోతోంది. ఫార్మా, ఆటో, ఐటీ జోరు కొనసాగుతోంది. ముఖ్యంగా టీవీఎస్ మోటార్, అదానీ పోర్ట్, ఐషర్ మోటార్స్, హీరో మోటో కార్ప్ లాభాలు మార్కెట్లను లీడ్ చేస్తుండగా రేమాండ్, డీసీబీ లుపిన్, ఎంఎం భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. కాగా హిందుస్తాన్ యూనీలీవర్, ఆర్‌కాం, బజాజ్ ఆటో నష్టపోతున్నాయి. -
సరికొత్త రికార్డుల్లో స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు మరోసారి సరికొత్త రికార్డు స్థాయిలను తాకుతున్నాయి. మంగళవారం ప్రారంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 197 పాయింట్లకు పైగా పైకి జంప్ చేసి సెన్సెక్స్, ప్రస్తుతం 122 పాయింట్ల లాభంలో 30,444 వద్ద లాభాల్లో నడుస్తోంది. అదేవిధంగా నిఫ్టీ సైతం 25.60 పాయింట్ల లాభంలో 9,471 వద్ద ట్రేడవుతోంది. ఒకానొక దశలో నిఫ్టీ కొత్త రికార్డు 9493 వద్ద పీక్ స్థాయికి వెళ్లింది. నిఫ్టీ 9500 ను బీట్ చేసే అవకాశాలున్నాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్లు సరికొత్త రికార్డులో సంచలనాలు సృష్టిస్తుడటంతో దలాల్ స్ట్రీట్ లో పండుగ వాతావరణం నెలకొంది. ఫారిన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు తిరిగి భారత మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభించడంతో దలాల్ స్ట్రీట్ లో సెంటిమెంట్ బలపడిందని విశ్లేషకులు చెప్పారు. టెక్నాలజీ, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లాభాలు కురిపిస్తుండగా.. బ్యాంకు, ఇన్ ఫ్రా స్టాక్స్ నష్టాలు పాలవుతున్నాయి. అమెరికా ఆర్థిక డేటా బలహీనంగా రావడంతో డాలర్ నష్టాలు పాలవుతోంది. డాలర్ నష్టాలు, గోల్డ్ ధరకు బాగా సహకరిస్తోంది. వరుసగా నాలుగో రోజులు గోల్డ్ ధరలు పైకి ఎగుస్తూ 28,080 రూపాయల పైన ట్రేడవుతున్నాయి. అమెరికా బిజినెస్ ల్లో రికవరీ ఆశలు పొందుతుండటంతో దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 2 శాతం పైగా ర్యాలీ జరుపుతోంది. మార్నింగ్ ట్రేడింగ్ లో లార్జ్ క్యాప్ లో భారతీ ఎయిర్ టెల్ అతిపెద్ద గెయినర్ గా 3 శాతానికి పైగా లాభాలు పండించింది. ఎయిర్ టెల్ తర్వాత టాటా స్టీల్, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐఓసీ, ఏసీసీ, ఐసీఐసీఐ బ్యాంకు లాభాల్లో నడిచాయి. ఏసియన్ పేయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, బీహెచ్ఈఎల్, హెచ్డీఎఫ్సీ, అదానీ పోర్ట్స్, కొటక్ మహింద్రా బ్యాంకు, సిప్లా, బ్యాంకు ఆఫ్ బరోడాలు ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాలు గడించాయి. -
కొనసాగుతున్న సెన్సెక్స్ దూకుడు!
హైదరాబాద్: ఆరంభంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో స్వల్ప నష్టాలకు లోనైన భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు చివర్లో రికార్డు గరిష్టస్థాయి వద్ద ముగిసాయి. వారాంతంలో నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 138 పాయింట్ల లాభంతో 25962 వద్ద, నిఫ్టీ 36 పాయింట్ల వృద్ధితో 7751 వద్ద క్లోజయ్యాయి. శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 25,844 పాయింట్ల వద్ద ఆరంభమై...25,981 గరిష్ట స్థాయిని, 25,659 కనిష్ట స్థాయిని, నిఫ్టీ 7,718 ప్రారంభమై 7,758 గరిష్ట స్థాయిని, 7,661 కనిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో పవర్ గ్రిడ్, రిలయన్స్, హెచ్ డీఎఫ్ సీ, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, గెయిల్ లాభాల్ని నమోదు చేసుకోగా, ఏసీసీ, సెసా స్టెర్ లైట్, విప్రో, జిందాల్ స్టీల్, యునైటెడ్ స్పిరిట్స్ నష్టాలతో ముగిసాయి.