
సాక్షి,ముంబై: స్టాక్‌మార్కెట్ కీలక సూచీలు మరో గరిష్ట స్థాయిని నమోదు చేశాయి.. వరుసగా7వ సెషన్‌లో కూడా లాభపడిన మార్కెట్లలో నిఫ్టీ 10,400 మార్క్‌ను టచ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీకూడా ఇదే జోరును కనబరుస్తోంది. ఆరంభంనుంచి పాజిటివ్‌గానే సూచీల్లో లాభాల పరంపర కొనసాగింది. ముఖ్యంగా మిడ్ సెషన్‌లో ఊపందుకున్న కొనుగోళ్లతో మార్కెట్లు మరోసారి సాంకేతికంగా కీలక స్థాయిలను అధిగమించాయి. సెన్సెక్స్ 33,700ను దాటగా.. నిఫ్టీ 10,400ను అందుకుంది. ఒక్క మెటల్ మినహా దాదాపు అన్ని రంగాల్లోనూ లాభాలే.
సెన్సెక్స్ 125పాయింట్లు ఎగిసి 33,713వద్ద, నిప్టీ 50 పాయింట్లు పుంజుకుని10,399 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. ఐటీ, ఫార్మా లాభాలు మార్కెట్లను లీడ్ చేస్తున్నాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ కూడా పాజటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతి ఇన్‌ఫ్రాటెల్ టాప్ గెయినర్‌గా ఉండగా.. ఇండస్‌ఇండ్, ఇన్ఫోసిస్, హెచ్‌పీసీఎల్, బజాజ్ ఫైనాన్స్, అరబిందో, గెయిల్, అల్ట్రాటెక్, పవర్‌గ్రిడ్, బజాజ్ ఆటో లాభాల పంట పండిస్తున్నాయి. ఇక మెటల్ సెక్టార్‌లో హిందాల్కో, టాటా స్టీల్, వేదాంతా అదానీ పోర్ట్స్ లతోపాటు బ్లాక్ డీల్ వార్తలతో ఐడియా, హెచ్‌యూఎల్ బాంబే డైయింగ్ తదితర షేర్లు నష్టపోతున్నాయి.
మరోవైపు డాలర్ బలహీనత నేపథ్యంలో దేశీయ కరెన్సీ లాభాల్లో కొనసాగుతోంది. డాలర్ మారకంలో రూపాయి 0.09పైసల లాభంతో రూ. 64.66 వద్ద ఉంది. అలాగే ఎంసీఎక్స్‌మార్కెట్ లో పుత్తడి పది గ్రా. 35 ఎగిసి రూ. 29, 474 వద్ద కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment