లాభాలతో షురూ- కొత్త గరిష్టాలకు మార్కెట్లు | Market hits new highs in opening trade | Sakshi
Sakshi News home page

లాభాలతో షురూ- కొత్త గరిష్టాలకు మార్కెట్లు

Published Tue, Dec 8 2020 9:54 AM | Last Updated on Tue, Dec 8 2020 10:23 AM

Market hits new highs in opening trade - Sakshi

ముంబై, సాక్షి: దేశీ స్టాక్ మార్కెట్ల స్పీడ్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 238 పాయింట్లు జంప్‌చేసి 45,665కు చేరింది. నిఫ్టీ సైతం 62 పాయింట్లు పెరిగి 13,418 వద్ద ట్రేడవుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 45,675 వద్ద, నిఫ్టీ 13,426 వద్ద సరికొత్త గరిష్టాలను తాకాయి!  ఆర్థిక రికవరీపై అంచనాలు, కోవిడ్‌-19 వ్యాక్సిన్లపై ఆశలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు ఈ సందర్భంగా మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు.   

మెటల్‌ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌(0.3 శాతం) మినహా అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌‌, రియల్టీ, ఆటో 1.3 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో మారుతీ, యూపీఎల్‌, అల్ట్రాటెక్, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ, గెయిల్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఆర్‌ఐఎల్‌ 2.6-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే సన్‌ ఫార్మా, టెక్‌ మహీంద్రా, కోల్‌ ఇండియా, అదానీ పోర్ట్స్‌, ఇండస్‌ఇండ్‌, గ్రాసిమ్‌, ఐవోసీ, ఐసీఐసీఐ 1.3-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి.

ఫైనాన్స్‌ జోష్‌
డెరివేటివ్స్‌లో కెనరా బ్యాంక్‌, పీఎన్‌బీ, బీవోబీ, ఎక్సైడ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, యూబీఎల్‌, ఐడియా 7.4-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు లుపిన్‌, జిందాల్‌ స్టీల్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌  1-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,566 లాభపడగా.. 621 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి.

ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్‌మెంట్స్
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,792 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2,767 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 2,970 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా..  డీఐఐలు రూ. 1,972 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదితమే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement