
న్యూఢిల్లీ: దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) అమ్మకాలు కొనసాగుతున్నాయి. గతేడాది(2024) అక్టోబర్‌లో మొదలైన అమ్మకాలు ఇటీవల కొద్ది నెలలుగా జోరందుకున్నాయి. వెరసి ఈ నెలలో ఇప్పటివరకూ(3–13 మధ్య) నికరంగా రూ. 30,015 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య సుంకాల ఆందోళనలు పెరగడంతో ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్లు, జనవరిలో రూ. 78,027 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. వెరసి 2025లో ఇప్పటివరకూ రూ. 1.42 లక్షల కోట్ల(16.5 బిలియన్ డాలర్లు) విలువైన స్టాక్స్ విక్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment