BSE seneks
-
లక్ష పెట్టుబడి..ఐదేళ్లలో రూ.40 లక్షల లాభం!
స్టాక్ మార్కెట్.. కోరికలకు రెక్కలు తొడిగే లెక్కల ప్రపంచం. చేతులు కాల్చుకోవాలన్నా.. రాతలు మార్చుకోవాలన్న అన్నీ అక్కడే సాధ్యం. కోట్లమంది తలరాతలు మార్చే ఇన్వెస్టర్ల ప్రపంచం. సరైన అవగాహన ఉంటే అలాంటి కేపిటల్ మార్కెట్లో మెగస్టార్లు అవ్వొచ్చు. ముఖ్యంగా తక్కువ ధరకే షేర్లను కొనుగోలు చేసి.. కొద్ది కాలం ఎదురు చూస్తే చాలు మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్ ఓ స్వర్గంలా కనిపిస్తుంది. అలాంటి స్టాక్ మార్కెట్లో మదుపర్లు ఐదేళ్ల క్రితం'క్వాలిటీ ఫార్మా'షేర్లలో రూ.లక్ష పెట్టుబడి పెట్టారు.ఆ లక్షే ఇవాళ రూ.40 లక్షల లాభం తెచ్చిపెట్టింది. ఇటీవల మల్టీబ్యాగర్ స్టాక్‌గా పాపులరైన ఎనేషనల్ స్టాండర్డ్ ఇండియా (ఎన్ఎస్ఐ) తక్కువ సమయంలో 100 శాతం లేదా అంతకంటే ఎక్కువ రాబడులు ఇచ్చిన మల్టీ బ్యాగర్ స్టాక్ క్వాలిటీ ఫార్మా గురించి ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. షేర్ వ్యాల్యూ ఎంత పెరిగింది.. బీఎస్ఈలో ఐదేళ్ల క్రితం అంటే 2016, సెప్టెంబర్ 28న ఈ కంపెనీ షేర్ వ్యాల్యూ రూ.21.75గా ఉంది. ఆదే షేర్ వ్యాల్యూ ఐదేళ్ల తరువాత 40 రేట్లు పెరిగి 2021, అక్టోబర్ 1కి రూ.878కి చేరింది. ►వాస్తవానికి ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఈ షేర్ ధర 110శాతంతో రూ.419.90 నుంచి రూ.878కి పెరిగింది. ► ఆరునెలల క్రితం రూ.54ఉన్న షేర్ ధర 1530శాతం పెరిగి రూ.878.90 కి చేరింది. ► ఒక ఏడాదిలో రూ.61 ఉన్న షేర్ ధర రూ.878.90కి చేరింది. ►మొత్తంగా ఐదేళ్ల కాలంలో 3,940 శాతం పెరుగుదలతో రూ.21 నుంచి రూ.878 స్థాయికి చేరుకుంది. నెలక్రితం ఇన్వెస్ట్ చేసినా.. ► నెల రోజుల క్రితం ఇదే క్వాలిటీ ఫార్మా షేర్లో రూ.1లక్ష పెట్టుబడి పెడితే.. రూ.2.10లక్షల లాభం వచ్చేది. ► 6 నెలల క్రితం రూ.లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు రూ.16.30లక్షల లాభం వచ్చేది. ► ఏడాది క్రితం రూ.లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు రూ.14.40లక్షల లాభం వచ్చేది. ► అదే స్టాక్‌లో 5 ఏళ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని ధర రూ.40.40 లక్షల లాభం వచ్చేది. చదవండి:కోటీశ్వరులయ్యే మంత్రం చెప్పిన బాబా రామ్‌దేవ్.. సెబీ సీరియస్ -
లాభాలతో షురూ- కొత్త గరిష్టాలకు మార్కెట్లు
ముంబై, సాక్షి: దేశీ స్టాక్ మార్కెట్ల స్పీడ్ కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 238 పాయింట్లు జంప్‌చేసి 45,665కు చేరింది. నిఫ్టీ సైతం 62 పాయింట్లు పెరిగి 13,418 వద్ద ట్రేడవుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 45,675 వద్ద, నిఫ్టీ 13,426 వద్ద సరికొత్త గరిష్టాలను తాకాయి! ఆర్థిక రికవరీపై అంచనాలు, కోవిడ్-19 వ్యాక్సిన్లపై ఆశలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు ఈ సందర్భంగా మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. మెటల్ వీక్ ఎన్ఎస్ఈలో మెటల్(0.3 శాతం) మినహా అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్, రియల్టీ, ఆటో 1.3 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో మారుతీ, యూపీఎల్, అల్ట్రాటెక్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ, గెయిల్, ఎంఅండ్ఎం, హెచ్‌సీఎల్ టెక్, ఆర్ఐఎల్ 2.6-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్, గ్రాసిమ్, ఐవోసీ, ఐసీఐసీఐ 1.3-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఫైనాన్స్ జోష్ డెరివేటివ్స్‌లో కెనరా బ్యాంక్, పీఎన్బీ, బీవోబీ, ఎక్సైడ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, యూబీఎల్, ఐడియా 7.4-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు లుపిన్, జిందాల్ స్టీల్, మ్యాక్స్ ఫైనాన్స్, శ్రీరామ్ ట్రాన్స్, ఆర్బీఎల్ బ్యాంక్ 1-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,566 లాభపడగా.. 621 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,792 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,767 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 2,970 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1,972 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదితమే. -
ఐదో రోజూ నిఫ్టీకి లాభాలు
బ్యాంక్, వాహన, లోహ షేర్ల దన్నుతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఆసియా మార్కెట్ల లాభాల జోరు సానుకూల ప్రభావం చూపించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 125 పాయింట్లు పెరిగి 37,271 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 33 పాయింట్లు లాభపడి 11,036 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ వరుసగా మూడో రోజుల పాటు లాభపడగా, నిఫ్టీ వరుసగా ఐదో రోజూ లాభపడింది. ముడి చమురు ధరలు 0.8% పెరగడం,రూపాయి మారకం విలువ 2 పైసలే పుంజుకోవడం, ట్రేడింగ్ చివర్లో కొన్ని షేర్లలో లాభాల స్వీకరణ జరగడం వల్ల లాభాలు పరిమితమయ్యాయి. అన్ని రంగాల బీఎస్ఈ సూచీలు లాభాల్లోనే ముగిశాయి. రోజంతా లాభాలే..: మొహర్రం సందర్భంగా మంగళవారం సెలవు కావడంతో ఒక రోజు విరామం తర్వాత స్టాక్ మార్కెట్ లాభాల్లో ఆరంభమయ్యాయి. ఆరి్థక మందగమనాన్ని తట్టుకోవడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోనున్నదనే అంచనాలతో రోజంతా లాభాలు కొనసాగాయి. మరోవైపు వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం అమెరికా–చైనాల మధ్య ఒప్పందం కుదరగలదన్న ఆశలతో ప్రపంచ మార్కెట్లు లాభపడటం కలసివచి్చంది. ఆంక్షల విధింపు నుంచి 16 కేటగిరీల వస్తువులను చైనా మినహాయించడం.. ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచి్చంది. వాహన షేర్ల జోరు: వాహనాలపై జీఎస్టీని కేంద్రం తగ్గించగలదన్న అంచనాలతో వాహన షేర్లు లాభపడ్డాయి. వాహన కంపెనీలు వాహనాల తయారీకి స్టీల్, అల్యూమినియమ్ లోహాలను ఉపయోగిస్తాయి కాబట్టి, లోహ షేర్లు కూడా మెరిశాయి. ఐషర్ మోటార్స్ 5%, మారుతీ సుజుకీ 4%, మదర్సన్ సుమి 4%, టీవీస్మోటార్ 3.6% మేర పెరిగాయి. యస్ బ్యాంక్: పేటీఎంకు ప్రమోటర్ రాణాకపూర్ వాటా విక్రయం వార్తలతో షేర్ ఇంట్రాడేలో 16 శాతం పెరిగింది. చివరకు 13 శాతం లాభంతో రూ.71.60 వద్ద ముగిసింది. ఈ నెలలో ఎఫ్‌పీఐల తొలి కొనుగోళ్లు సూపర్ రిచ్ సర్‌చార్జీ తొలగించినప్పటికీ,మార్కెట్లో అమ్మకాలు ఆపని విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెలలో తొలిసారి నికర కొనుగోలుదారులుగా నిలిచారు. బుధవారం రూ.267 కోట్ల నికర కొనుగోలు జరిపారు. ఈ నెలారంభంలో రూ.2,016 కోట్లుగా ఉన్న వీరి నికర అమ్మకాలు 9వ తేదీ నాటికి రూ.188 కోట్లకు తగ్గాయి. -
హెచ్చుతగ్గుల మార్కెట్
- ఆర్బీఐ పాలసీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల ముందు జాగ్రత్త - 40 పాయింట్ల లాభంతో 25,864కు సెన్సెక్స్ - 23 పాయింట్ల లాభంతో 7,869కు నిఫ్టీ ముంబై: వచ్చే వారం ఆర్బీఐ పాలసీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరించారు. దీంతో ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో గురువారం స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో గట్టెక్కింది. బీఎస్ఈ సెనెక్స్ 40 పాయింట్ల లాభంతో 25,864 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో 7,869 పాయింట్ల వద్ద ముగిశాయి. సెప్టెంబర్ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టు ముగింపు ప్రభావం పెద్దగా కనిపించలేదు. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడంతో ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి ఐటీ, టెక్నాలజీ, ఫార్మా షేర్లు లాభపడ్డాయి, ఆయిల్, క్యాపిటల్ గూడ్స్, కొన్ని లోహ షేర్లు పతనమయ్యాయి. రోల్ ఓవర్స్ సానుకూల ప్రభావం... సెన్సెక్స్ 279 పాయింట్ల రేంజ్లో కదలాడింది. సెప్టెంబర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల రోల్ ఓవర్లు అక్టోబర్‌కు స్వల్పంగా పెరగడంతో సెంటిమెంట్ మెరుగుపడిందని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. కాగా ఈ వారంలో సెన్సెక్స్ 355 పాయింట్లు(1.35 శాతం), నిఫ్టీ 113 పాయింట్లు(1.42%) చొప్పున నష్టపోయాయి. గత మూడు వారాల్లో ఈ రెండు సూచీలు నష్టపోవడం ఇదే మొదటిసారి. లాభ నష్టాలు... నొముర, క్రెడిట్ సూచీ బ్రోకరజ్ సంస్థలు లుపిన్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడంతో లుపిన్ షేర్ 3.5 శాతం ఎగిసి రూ. 1,990 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అత్యధికంగా లాభపడ్డ షేర్ ఇదే, 30 సెన్సెక్స్ షేర్లలో 16 షేర్లు లాభాల్లో ముగిశాయి. 1,442 షేర్లు లాభాల్లో, 1,245 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,567 కోట్లుగా, ఎన్ఎస్ఈ ఈక్విటీ విభాగంలో రూ.19,830 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.5,58,242 కోట్లుగా నమోదైంది. నేడు మార్కెట్లకు సెలవు బక్రీద్ పర్వదినం సందర్భంగా స్టాక్‌మార్కెట్‌కు నేడు(శుక్రవారం) సెలవు. బీఎస్ఈ, ఎన్‌ఎస్‌ఈలతో పాటు ఫారెక్స్, మనీ, ప్రధాన కమోడిటీ మార్కట్లు పనిచేయవు.