స్టాక్ మార్కెట్.. కోరికలకు రెక్కలు తొడిగే లెక్కల ప్రపంచం. చేతులు కాల్చుకోవాలన్నా.. రాతలు మార్చుకోవాలన్న అన్నీ అక్కడే సాధ్యం. కోట్లమంది తలరాతలు మార్చే ఇన్వెస్టర్ల ప్రపంచం. సరైన అవగాహన ఉంటే అలాంటి కేపిటల్ మార్కెట్‌లో మెగస్టార్లు అవ్వొచ్చు. ముఖ్యంగా తక్కువ ధరకే షేర్లను కొనుగోలు చేసి.. కొద్ది కాలం ఎదురు చూస్తే చాలు మిడిల్ క‍్లాస్ ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్ ఓ స్వర్గంలా కనిపిస్తుంది.
అలాంటి స‍్టాక్ మార్కెట్‌లో మదుపర్లు ఐదేళ్ల క్రితం'క్వాలిటీ ఫార్మా'షేర్లలో రూ.లక్ష పెట‍్టుబడి పెట్టారు.ఆ లక్షే ఇవాళ రూ.40 లక్షల లాభం తెచ్చిపెట్టింది. ఇటీవల మల్టీబ్యాగర్ స్టాక్‌గా పాపులరైన ఎనేషనల్ స్టాండర్డ్ ఇండియా (ఎన్‌ఎస్‌ఐ) తక్కువ సమయంలో 100 శాతం లేదా అంతకంటే ఎక్కువ రాబడులు ఇచ్చిన మల‍్టీ బ్యాగర్ స్టాక్ క్వాలిటీ ఫార్మా గురించి ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది.
షేర్ వ్యాల్యూ ఎంత పెరిగింది..
బీఎస్‌ఈలో ఐదేళ్ల క్రితం అంటే 2016, సెప్టెంబర్ 28న ఈ కంపెనీ షేర్ వ్యాల్యూ రూ.21.75గా ఉంది. ఆదే షేర్ వ్యాల్యూ ఐదేళ్ల తరువాత 40 రేట్లు పెరిగి 2021, అక్టోబర్ 1కి రూ.878కి చేరింది.
►వాస్తవానికి ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఈ షేర్ ధర 110శాతంతో రూ.419.90 నుంచి రూ.878కి పెరిగింది.
► ఆరునెలల క్రితం రూ.54ఉన్న షేర్ ధర 1530శాతం పెరిగి రూ.878.90 కి చేరింది.
► ఒక ఏడాదిలో రూ.61 ఉన్న షేర్ ధర రూ.878.90కి చేరింది.
►మొత్తంగా ఐదేళ్ల కాలంలో 3,940 శాతం పెరుగుదలతో రూ.21 నుంచి రూ.878 స్థాయికి చేరుకుంది.
నెలక్రితం ఇన్వెస్ట్ చేసినా..
► నెల రోజుల క్రితం ఇదే క్వాలిటీ ఫార్మా షేర్‌లో రూ.1లక్ష పెట్టుబడి పెడితే.. రూ.2.10లక్షల లాభం వచ్చేది.
► 6 నెలల క్రితం రూ.లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు రూ.16.30లక్షల లాభం వచ్చేది.
► ఏడాది క్రితం రూ.లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు రూ.14.40లక్షల లాభం వచ్చేది.
► అదే స్టాక్‌లో 5 ఏళ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని ధర రూ.40.40 లక్షల లాభం వచ్చేది.
చదవండి:కోటీశ్వరులయ్యే మంత్రం చెప్పిన బాబా రామ్‌దేవ్.. సెబీ సీరియస్
Comments
Please login to add a commentAdd a comment