investment in pharma
-
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల వరద.. రూ.2వేల కోట్లతో గ్రాన్యూల్స్ ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ గ్రాన్యూల్స్.. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద భారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. వచ్చే అయిదేళ్లలో ఈ కేంద్రానికి కంపెనీ రూ.2,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 100 ఎకరాల విస్తీర్ణంలో దశలవారీగా ఈ ఫెసిలిటీ కార్యరూపం దాల్చనుంది. ఔషధాల ఉత్పత్తికి కావాల్సిన కీ స్టార్టింగ్ మెటీరియల్స్, ఇంటర్మీడియేట్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్, ఫెర్మెంటేషన్ ఆధారిత ఉత్పత్తులను ఇక్కడ తయారు చేస్తారు. కాగా, గ్రాన్యూల్స్ తాజాగా గ్రీన్కో జీరోసీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఉద్గార రహిత విద్యుత్‌ను గ్రీన్కో ఈ ప్లాంటుకు సరఫరా చేస్తుంది. అలాగే డీసీడీఏ, పీఏపీ, పారాసీటమాల్, మెట్ఫార్మిన్, ఏపీఐలు, ఇంటర్మీడియేట్స్ తయారీలో వాడే రసాయనాలను సైతం అందిస్తుంది. గ్రాన్యూల్స్ ఇండియా సీఎండీ కృష్ణ ప్రసాద్ చిగురుపాటి, గ్రీన్కో గ్రూప్ ఫౌండర్ మహేశ్ కొల్లి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. -
లక్ష పెట్టుబడి..ఐదేళ్లలో రూ.40 లక్షల లాభం!
స్టాక్ మార్కెట్.. కోరికలకు రెక్కలు తొడిగే లెక్కల ప్రపంచం. చేతులు కాల్చుకోవాలన్నా.. రాతలు మార్చుకోవాలన్న అన్నీ అక్కడే సాధ్యం. కోట్లమంది తలరాతలు మార్చే ఇన్వెస్టర్ల ప్రపంచం. సరైన అవగాహన ఉంటే అలాంటి కేపిటల్ మార్కెట్లో మెగస్టార్లు అవ్వొచ్చు. ముఖ్యంగా తక్కువ ధరకే షేర్లను కొనుగోలు చేసి.. కొద్ది కాలం ఎదురు చూస్తే చాలు మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్ ఓ స్వర్గంలా కనిపిస్తుంది. అలాంటి స్టాక్ మార్కెట్లో మదుపర్లు ఐదేళ్ల క్రితం'క్వాలిటీ ఫార్మా'షేర్లలో రూ.లక్ష పెట్టుబడి పెట్టారు.ఆ లక్షే ఇవాళ రూ.40 లక్షల లాభం తెచ్చిపెట్టింది. ఇటీవల మల్టీబ్యాగర్ స్టాక్‌గా పాపులరైన ఎనేషనల్ స్టాండర్డ్ ఇండియా (ఎన్ఎస్ఐ) తక్కువ సమయంలో 100 శాతం లేదా అంతకంటే ఎక్కువ రాబడులు ఇచ్చిన మల్టీ బ్యాగర్ స్టాక్ క్వాలిటీ ఫార్మా గురించి ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. షేర్ వ్యాల్యూ ఎంత పెరిగింది.. బీఎస్ఈలో ఐదేళ్ల క్రితం అంటే 2016, సెప్టెంబర్ 28న ఈ కంపెనీ షేర్ వ్యాల్యూ రూ.21.75గా ఉంది. ఆదే షేర్ వ్యాల్యూ ఐదేళ్ల తరువాత 40 రేట్లు పెరిగి 2021, అక్టోబర్ 1కి రూ.878కి చేరింది. ►వాస్తవానికి ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఈ షేర్ ధర 110శాతంతో రూ.419.90 నుంచి రూ.878కి పెరిగింది. ► ఆరునెలల క్రితం రూ.54ఉన్న షేర్ ధర 1530శాతం పెరిగి రూ.878.90 కి చేరింది. ► ఒక ఏడాదిలో రూ.61 ఉన్న షేర్ ధర రూ.878.90కి చేరింది. ►మొత్తంగా ఐదేళ్ల కాలంలో 3,940 శాతం పెరుగుదలతో రూ.21 నుంచి రూ.878 స్థాయికి చేరుకుంది. నెలక్రితం ఇన్వెస్ట్ చేసినా.. ► నెల రోజుల క్రితం ఇదే క్వాలిటీ ఫార్మా షేర్లో రూ.1లక్ష పెట్టుబడి పెడితే.. రూ.2.10లక్షల లాభం వచ్చేది. ► 6 నెలల క్రితం రూ.లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు రూ.16.30లక్షల లాభం వచ్చేది. ► ఏడాది క్రితం రూ.లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు రూ.14.40లక్షల లాభం వచ్చేది. ► అదే స్టాక్‌లో 5 ఏళ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని ధర రూ.40.40 లక్షల లాభం వచ్చేది. చదవండి:కోటీశ్వరులయ్యే మంత్రం చెప్పిన బాబా రామ్‌దేవ్.. సెబీ సీరియస్ -
E-Commerce : టాటా డిజిటల్ దూకుడు
వెబ్‌డెస్క్ : టాటా గ్రూప్... దేశ పారిశ్రామిక రంగంలో పరిచయం అక్కర్లేని సంస్థ. దేశంలోని తొలి ఇండస్ట్రియల్ సంస్థల్లో ఒకటైన టాటా ఇప్పుడు ఈ కామర్స్‌పై దృష్టి పెట్టింది. ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న స్టార్ట్అప్ కంపెనీల్లో భారీ ఎత్తున పెట్టబడులు పెడుతోంది. తాజాగా ఈ ఫార్మసీ, ఈ హెల్త్ సెక్టార్లలో దూసుకుపోతున్న 1 ఎంజీ సంస్థలో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. రూ. 5,473 కోట్లు దేశంలో ఆన్లైన్ హెల్త్, ఫార్మసీ రంగాల్లో దూసుపోతున్న 1 ఎంజీ సంస్థలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టబోతున్నట్టు టాటా డిజిటల్ ప్రకటించింది. ఎంజీలోకి టాటా రావడం వల్ల వినియోగదారులకు అత్యుత్తమ స్థాయిలో నాణ్యతతో కూడిన సేవలు అందుతాయని టాటా డిజిటల్ సీఈవో ప్రతిక్పాల్ తెలిపారు. ఈ ఫార్మసీ సేవలు అందిస్తోన్న 1 ఎంజీ సంస్థను 2015 నెలకొల్పారు. ప్రస్తుతం దేశంలో 20 వేలకు పైగా పిన్కోడ్లకు 1 ఎంజీ సంస్థ మెడిసిన్స్ డెలివరీ చేయగలుగుతోంది. టాటా డిజిటల్ చేరికతో ఈ గ్రూపు సేవలు మరింతగా విస్తరించనున్నాయి. బిగ్ బాస్కెట్లోనూ ? 1 ఎంజీలో పెట్టుబడులు పెట్టేందుకు రెండు వారాల ముందే మరో ఆన్లైన్ ఫ్లాట్‌ఫారమ్ బిగ్ బాస్కెట్‌పై దృష్టి పెట్టింది టాటా డిజిటల్. బిగ్‌బాస్కెట్‌లో ఏకంగా 64 శాతం వాటాను రూ.9500 కోట్లు వెచ్చించి టాటా డిజిటల్ సొంతం చేసుకున్నట్టు సమాచారం. బిగ్‌బాస్కెట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలకు పోటీగా తాను కూడా ఈ గ్రోసరీ మార్కె్టోలకి అడుగుపెట్టబోతున్నట్టు టాటా డిజిటల్ సంకేతాలు ఇచ్చింది. అయితే బిగ్‌బాస్కెట్ గ్రూపులో పెట్టుబడులపై టాటా డిజిటల్ సంస్థ మౌనం పాటిస్తోంది. అధికారికంగా ఇంకా స్పందించలేదు. ఈ కామర్స్‌పై దృష్టి ఇండస్ట్రియల్ సెక్టా్ర్ పేరు చెబితే మొదటగా వినిపించే పేర్లలలో టాటా గ్రూపు ఒకటి. అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న టాటా గ్రూపు ఈ కామర్స్‌పై ఇంత కాలం పెద్దగా దృష్టి పెట్టలేదు. రోజురోజుకి ఈ కామర్స్ రంగంలో వృద్ధి రేటును గమనించిన టాటా తాజాగా ఈ రంగంపై దృష్టి సారించింది. దీంతో టాటా డిజిటల్‌ను ముందుంచి వరుసగా ఈ కామర్స్ సంస్థల్లో పెట్టుబడులు పెడుతోంది. -
బల్క్ డ్రగ్ పాలసీపై కసరత్తు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధాల తయారీ, నాణ్యత, ధరలు, పెట్టుబడులు వంటి కీలకాంశాలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం బల్క్ డ్రగ్ పాలసీపై కసరత్తు చేస్తోంది. ఈ పాలసీతో ఫార్మా రంగంలో పెట్టుబడులకు ఆస్కారం ఉంటుందని కేంద్ర ఫార్మాసూటికల్స్ విభాగం డెరైక్టర్ బీకే సింగ్ చెప్పారు. విద్యుత్, ఫార్మా, రసాయనాలు, ఎరువులు వంటి మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ఈ పాలసీ కిందికి తీసుకొచ్చి ఫార్మా రంగంలో నూతన ఆవిష్కరణలు చేస్తామన్నారు. శుక్రవారమిక్కడ ‘ఫార్మాసూటికల్స్ విభాగం, కేంద్ర ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ’తో చర్చాకార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీకే సింగ్ మాట్లాడుతూ.. ఐటీ, పరిశ్రమ రంగాలకు మాదిరిగా ‘ఫార్మా క్లస్టర్ డెవలప్మెంట్ స్కీం’ను తీసుకొచ్చి ఈ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీడీఎంఏఐ) ఎం జయంత్ ఠాగూర్, ఫార్మాసూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) రీజనల్ డెరైక్టర్ కే సుబ్బిరెడ్డి, సీఐఐ ఏపీ ప్రెసిడెంట్ బీ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.