వెబ్‌డెస్క్ : టాటా గ్రూప్... దేశ పారిశ్రామిక రంగంలో పరిచయం అక్కర్లేని సంస్థ. దేశంలోని తొలి ఇండస్ట్రియల్ సంస్థల్లో ఒకటైన టాటా ఇప్పుడు ఈ కామర్స్‌పై దృష్టి పెట్టింది. ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న స్టార్ట్‌అప్ కంపెనీల్లో భారీ ఎత్తున పెట్టబడులు పెడుతోంది. తాజాగా ఈ ఫార్మసీ, ఈ హెల్త్ సెక్టార్లలో దూసుకుపోతున్న 1 ఎంజీ సంస్థలో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది.
రూ. 5,473 కోట్లు
దేశంలో ఆన్‌లైన్ హెల్త్, ఫార్మసీ రంగాల్లో దూసుపోతున్న 1 ఎంజీ సంస్థలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టబోతున్నట్టు టాటా డిజిటల్ ప్రకటించింది. ఎంజీలోకి టాటా రావడం వల్ల వినియోగదారులకు అత్యుత్తమ స్థాయిలో నాణ్యతతో కూడిన సేవలు అందుతాయని టాటా డిజిటల్ సీఈవో ప్రతిక్‌పాల్ తెలిపారు. ఈ ఫార్మసీ సేవలు అందిస్తోన్న 1 ఎంజీ సంస్థను 2015 నెలకొల్పారు. ప్రస్తుతం దేశంలో 20 వేలకు పైగా పిన్‌కోడ్‌లకు 1 ఎంజీ సంస్థ మెడిసిన్స్ డెలివరీ చేయగలుగుతోంది. టాటా డిజిటల్ చేరికతో ఈ గ్రూపు సేవలు మరింతగా విస్తరించనున్నాయి.
బిగ్ బాస్కెట్‌లోనూ ?
1 ఎంజీలో పెట్టుబడులు పెట్టేందుకు రెండు వారాల ముందే మరో ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫారమ్ బిగ్ బాస్కెట్‌పై దృష్టి పెట్టింది టాటా డిజిటల్. బిగ్‌బాస్కెట్‌లో ఏకంగా 64 శాతం వాటాను రూ.9500 కోట్లు వెచ్చించి టాటా డిజిటల్ సొంతం చేసుకున్నట్టు సమాచారం. బిగ్‌బాస్కెట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలకు పోటీగా తాను కూడా ఈ గ్రోసరీ మార్కె్‌టోలకి అడుగుపెట్టబోతున్నట్టు టాటా డిజిటల్ సంకేతాలు ఇచ్చింది. అయితే బిగ్‌బాస్కెట్ గ్రూపులో పెట్టుబడులపై టాటా డిజిటల్ సంస్థ మౌనం పాటిస్తోంది. అధికారికంగా ఇంకా స్పందించలేదు.
ఈ కామర్స్‌పై దృష్టి
ఇండస్ట్రియల్ సెక్టా్‌ర్ పేరు చెబితే మొదటగా వినిపించే పేర్లలలో టాటా గ్రూపు ఒకటి. అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న టాటా గ్రూపు ఈ కామర్స్‌పై ఇంత కాలం పెద్దగా దృష్టి పెట్టలేదు. రోజురోజుకి ఈ కామర్స్ రంగంలో వృద్ధి రేటును గమనించిన టాటా తాజాగా ఈ రంగంపై దృష్టి సారించింది. దీంతో టాటా డిజిటల్‌ను ముందుంచి వరుసగా ఈ కామర్స్ సంస్థల్లో పెట్టుబడులు పెడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment